మండపేటలో ఉద్యోగుల స్పోర్ట్స్‌ మీట్‌ | Intel Departmental Games Sports mate | Sakshi
Sakshi News home page

మండపేటలో ఉద్యోగుల స్పోర్ట్స్‌ మీట్‌

Dec 17 2017 9:41 AM | Updated on Dec 17 2017 9:41 AM

మండపేట: నిత్యం పని ఒత్తిళ్లలో ఉండే అధికారులు, ఉద్యోగులకు ఆటవిడుపుగా ఇంటల్‌ డిపార్ట్‌మెంటల్‌ గేమ్స్, స్పోర్ట్స్‌మీట్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమని జేసీ మల్లికార్జున అన్నారు. మండపేట నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్‌ చౌదరి ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ స్పోర్ట్స్‌మీట్‌ను శనివారం జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్పోర్ట్స్‌మీట్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు వి.సాయికుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ,  ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ స్పోర్ట్స్‌మీట్‌ నిర్వహణ అభినందనీయమన్నారు. తొలుత ఉద్యోగుల నుంచి జేసీ, ఎమ్మెల్యే క్రీడావందనం స్వీకరించారు.

 జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, సంయుక్త కార్యదర్శి స్పర్జన్‌రాజు, జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు రెడ్డి రాధాకృష్ణ, అంతర్జాతీయ పోల్‌వాల్ట్‌ క్రీడాకారుడు రామభద్రరాజువర్మలను నిర్వాహకులు సత్కరించారు.  ఎమ్మెల్యే టీం, జేసీ టీం పేరిట నిర్వహించిన ఎగ్జిబిషన్‌ పోటీల్లో జేసీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, పరుగు, షాట్‌పుట్‌ వంటి పోటీలతో పాటు ఉద్యోగినులకు టెన్నికాయిట్, చెస్, స్పీడ్‌ వాక్, షాట్‌పుట్‌ తదితర పోటీలు జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆర్‌.గోవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement