భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య | Married suicide | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Nov 6 2014 12:39 AM | Updated on Sep 2 2017 3:55 PM

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

పట్టణంలోని సంగంపుంతకాలనీకి చె ందిన పెంటపాటి లక్ష్మీరాధ(28) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు, కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం

 మండపేట : పట్టణంలోని సంగంపుంతకాలనీకి చె ందిన పెంటపాటి లక్ష్మీరాధ(28) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు, కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... రావులపాలేనికి చెందిన లక్ష్మీరాధకు మండపేటకు చెందిన వెల్డర్ శ్రీనువాస్‌కు 2004లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అప్పుల పాలైన భర్త తరచూ పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని లక్ష్మీరాధను వేధిస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇటీవల రూ.20వేలు కావాలని శ్రీనువాస్ అడగడంతో పుట్టింటికి వెళ్లింది. అక్కడ పుట్టింటి వారు ఆమెను ఇదే ఆఖరని, మరలా ఎప్పుడూ అడగవద్దని ఆమెకు సూచించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె బుధవారం ఇంటిలోని మేడగదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విజయరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement