Married suicide
-
భర్త వేధింపులు తట్టుకోలేక..
మియాపూర్: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్‌లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్‌ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్ అకౌంట్‌కు తన ఫోన్ నంబర్‌ను యాడ్ చేయించాలని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ పాస్వర్డ్లు చెప్పాలని తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్లైన్లో గడ్డిమందు ఆర్డర్ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
పెళ్లి జరిగి ఏడేళ్లైనా పిల్లలు కలగక పోవడంతో...
అనంతపురం: సంతానం కలగకపోవడంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని వాల్మీకి నగర్‌కు చెందిన రాజుకు ఏడేళ్ల క్రితం ఆదిలక్ష్మి (24)తో వివాహమైంది. మొబైల్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి జరిగి ఏడేళ్లైనా పిల్లలు కలగక పోవడంతో ఆదిలక్ష్మి మనోవేదనకు లోనైంది. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు, బంధువులు అనుకునే మాటలు విని మనస్తాపం చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న రాజు... ఉరికి వేలాడుతున్న తన భార్యను గమనించి చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే కిందకు దించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కసాపురం ఎస్ఐ దుగ్గిరాజు మాట్లాడుతూ... ఆదిలక్ష్మి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామన్నారు. -
ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య
వర్ధన్నపేట: లైంగిక వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006 సంవత్సరంలో మంజుల (34)తో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలో మండలంలోని ఎలికెట్ట గ్రామం టిక్షతండాకు చెందిన జాటోత్ జితేందర్‌కు తమ ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జితేందర్ తరుచూ మంజులను లొంగదీసుకోవాలని యత్నించాడు. దీనిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జితేందర్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ వేధింపులు తాళ లేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లింది. అక్కడ మంజులకు మాయమాటలు చెప్పిన జితేందర్.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించడంతో మంజుల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా?
విజయనగరం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, వన్‌టౌన్ పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మయూరి జంక్షన్‌కు చెందిన నిర్మలకు (27) 2020లో స్థానిక బాలాజీ రోడ్డు నటరాజ్ కాలనీకి చెందిన భార్గవ్‌తో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయినప్పటికీ... కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లయినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం నిర్మలను వేధించేవారు. దీంతో ఆమె పలుమార్లు కన్నవారింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద గోడు వెల్లబోసుకుంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో నిర్మలను ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పి అత్తవారింటికి పంపించేవారు. కొద్ది రోజులుగా గొడవలు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల శనివారం ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
కట్నం కాలనాగు మళ్లీ బుస కొడుతోంది..నేడు కేరళ... రేపు?
‘అమ్మా... కట్నానికి వ్యతిరేకంగా మీరెవరైనా ఉద్యమం లేవదీస్తే నేను వాలెంటీర్‌గా పని చేస్తా’ అన్నారు కేరళ గవర్నర్ ఆవేదనగా. కేరళలో రెండు రోజుల తేడాలో ముగ్గురు వివాహితలు వరకట్న చావులకు లోనయ్యారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వినవచ్చిన వరకట్న చావులు మళ్లీ కేరళ ఘటనలతో చర్చలోకి వచ్చాయి. కట్నం అనే మాట అంతరించిపోలేదు. అది పెట్టే బాధలు గతించి పోలేదు. కాకపోతే ఆ బాంబు కేరళలో ముందు పేలింది. మన చుట్టుపక్కల ఈ వేధింపులను గమనిస్తున్నామా? మొన్నటి జూన్ 21–22 తేదీలలో కేరళలో జరిగిన మూడు వరకట్న చావులు ఇలా ఉన్నాయి. ‘కట్నం’ మాట ఇప్పుడు వాడటం లేదు. ‘ఏమైనా ఫార్మాలిటీలు ఉంటే మాట్లాడుకుందాం’ అంటున్నారు. గత సంవత్సరం పెళ్లయిన విస్మయ అనే ఆయుర్వేద ఫైనల్ ఇయర్ స్టూడెంట్ (కొళ్లం–కేరళ)కు ఆమె తండ్రి ఈ ‘ఫార్మాలిటీస్’లో భాగంగా అల్లుడికి ఒక కారు, 100 సవరల బంగారం, 10 లక్షల డబ్బు. 1.25 ఎకరాల స్థలం ఇచ్చాడు. అల్లుడు కిరణ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అయితే ఆ సదరు అల్లుడికి కేవలం 11 లక్షల కారు ఇవ్వడం నచ్చలేదు. లగ్జరీ కారు అడిగాడు. కొట్టాడు. ఎలా భరించడం అనుకుందో వాళ్లే చంపేశారో మొన్న జూన్ 21న ఆమె అత్తవారింట్లో మరణించింది. ఆ వెంటనే 24 గంటల వ్యవధిలో తిరువనంతపురం శివారు విజింజంలో 24 ఏళ్ల అర్చన ఒళ్లు కాలి మరణించి కనిపించింది. ఆమె భర్త సురేశ్ ప్లంబర్. 3 లక్షల కట్నం డిమాండ్. మామగారు ఇవ్వలేకపోయారు. అత్తగారింట్లో ఉన్న అర్చనను సురేశ్ ఆ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయం లో అతని దగ్గర డీజెల్ బాటిల్ ఉంది. ఆ డీజెల్ పోసుకునే ఆమె ఆత్మహత్య చేసుకుంది (హత్య జరిగింది). ఆ డీజెల్‌ను తాను చీమల్ని చంపడానికి తెచ్చాను అని సురేశ్ చెబుతున్నాడు. మరో కొద్దిగంటల వ్యవధిలో 3 నెలల క్రితం వివాహం అయిన 19 సంవత్సరాల సుచిత్ర (అలెప్పి) అనుమానాస్పదంగా మరణించింది అత్తవారింట్లో. ఆమె భర్త మిలట్రీలో పని చేస్తాడు. ‘మా స్తోమతకు టూ వీలర్ ఇద్దామనుకున్నాం. కారు అడిగారు ఇచ్చాం. 51 సవరల బంగారం పెట్టాం. కాని వాళ్లు ఇంకో పది లక్షలు అడగడం మొదలెట్టారు’ అని సుచిత్ర తండ్రి చెప్పాడు. ఈ మూడు ఘటనలు ఒకే విషయం చెబుతున్నాయి. అమ్మాయిలు ఏమి చదువుకున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉన్నా కట్నం ఇవ్వాలి. మగవాళ్లు ఏ పని చేస్తున్నా ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా కట్నం డిమాండ్ చేయాలి. కేరళలో అక్షరాస్యత ఎక్కువని అందరికీ తెలుసు. మహిళా అక్షరాస్యత కూడా ఎక్కువ. కాని ఎంత చదువుకున్నా ఈ సాంఘిక దురాచారానికి తల వొంచాలి. పురుషుడు ఈ దురాచారంతో పెత్తనం చేయాలి. భార్యను పాముతో చంపాడు కేరళలో వరకట్న ఘటనలు గత సంవత్సరం మొదలయ్యాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే వివాహిత పాము కాటుతో మరణించింది. ఆమె వికలాంగురాలు. ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ పకడ్బందీగా ప్లాన్ చేసి ఆమె నిద్రలో ఉండగా పాము కాటు వేయించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా నిపుణుల అది పామును పురిగొల్పి వేయించిన కాటుగా నిర్థారించారు. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది. ఏమిటి ఈ అడిగేది... ఇచ్చేది... స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది? ‘పెళ్లి లేకపోతే స్త్రీ బతకలేదు అనే భావజాలం కూరి కూరి ఆమెను నిస్సహాయురాలు చేశారు. ఇల్లు ముఖ్యం అనే భావన కూడా అంతే. ఆర్థిక స్వతంత్రం దీనికి జవాబు అని అంటారు గాని అన్ని ఉద్యోగాలలో స్త్రీలకు ప్రవేశం లేదు. కొన్ని ఉద్యోగాలు చేసే స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. టెన్ టు ఫైవ్ జాబ్ చేస్తూ ఉన్నవాళ్లే పురుషులకు కావాలి. మార్కెటింగ్, ప్రయాణాలు ఉన్నవారిని వద్దంటారు. భర్త, ఇల్లు కోసం ఉద్యోగాలలో ప్రమోషన్లను వద్దనుకునే వేలాది స్త్రీలు ఉన్నారు. సమాజ భావజాలంలో పెద్ద ఎత్తున మార్పు వస్తే గాని ఇది మారదు’ అని ఆ ప్రాంత సామాజిక కార్యకర్తలు అంటున్నారు. స్త్రీల బాధలో స్త్రీల బాధ్యత ఎంత అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అత్త, ఆడపడుచు, తోడి కోడలు వంటి సాటి స్త్రీలు కొత్త కోడలికి మద్దతుగా ఉంటున్నారా... లేదా పీడనకు లోనవుతుంటే ఆ పీడనకు సమర్థింపుగా ఉంటున్నారా గమనించుకోవాలి అని మహిళావాదులు అంటున్నారు. వరకట్న నిరోధక చట్టం ఉన్నా, గృహ హింస నిరోధ చట్టం ఉన్నా స్త్రీలు నిశ్శబ్దంగా ఈ హింసను అనుభవిస్తూ ఉండటం వల్ల వరకట్న సమస్య లేనట్టే అన్నట్టుగా తెలుగు సమాజం కూడా ఉంది. భరించలేని స్థితికి చేరుకున్న ‘ఫార్మాలిటీస్’ ఎవరికి వారు పరిశీలించుకుంటే ‘నో టు డౌరీ’ అని గట్టిగా ఎలుగెత్తే అవసరం తెలుస్తుంది. కేరళ ఆ మేరకు హెచ్చరిక చేస్తోంది. స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది? – సాక్షి ఫ్యామిలీ -
కారంపొడి చల్లి.. కర్రలతో దాడి
ఇందల్వాయి/ధర్పల్లి: (నిజామాబాద్ రూరల్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కలసి నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై కారం పొడి చల్లి.. కర్రలతో దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి యత్నించడంతో లాఠీచార్జి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మంజుల (22)కు గుట్టకింది తండాకు చెందిన లావుడ్య గణేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. మంజుల ప్రవర్తన బాగోలేదని ఐదు రోజుల క్రితం గణేష్ ఆమెను మందలించాడు. కలత చెందిన మంజుల ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్లింది. తమ కూతురు కనిపించడం లేదని మంజుల తల్లిదండ్రులు ఈ నెల 7న ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. మంజుల తిరుపతి నుంచి తన భర్త మిత్రుడైన గోపాల్‌తో మాట్లాడింది. ఫోన్ నంబరు ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లారు. ఇంతలోనే మంజుల స్వయంగా సోమవారం సాయంత్రం డీబీ తండాకు చేరుకుంది. ఇంటికి వెళ్లని ఆమెను మంగళవారం వేకువజామున పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు. మరోవైపు డీబీ తండా నుంచి 200 మంది మహిళలు మంగళవారం మధ్యాహ్నం డీసీఎం వ్యానులో గుట్టకింది తండాకు బయలు దేరారు. ముందస్తు సమాచారంతో పోలీసులు వారి వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు. అయితే మహిళలు కారం పొడి, కర్రలు పట్టుకుని కాలినడకన గుట్టకింది తండాకు చేరుకున్నారు. పోలీసులను తోసేసి గణేష్, గోపాల్ ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్, తలుపులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసులపై దాడి జరగడంతో లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇన్చార్జి ఏసీపీ ప్రభాకర్, అడిషనల్ డీజీపీలు ఉషా విశ్వనాథ్, రఘవీర్‌లు గుట్టకింది తండాకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మంజుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. గోపాల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. గుట్టకింది తండాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
నాగులుప్పలపాడు (ప్రకాశం): అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నిడమానూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సురేష్ సమాచారం మేరకు కొరిశపాడు మండలం గ్రామానికి చెందిన స్వర్ణ అనూష (22)కు నిడమానూరు గ్రామానికి చెందిన స్వర్ణ నాగార్జునతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. ఇటీవల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు రేగాయి. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు నాగార్జున బంధువులు తెలిపారు. కానీ అనూష కుటుంబ సభ్యులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ మురళీకృష్ణ పరిశీలించారు. నిర్జీవంగా పడి.. అద్దంకి రూరల్: వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని వెంపరాల గ్రామానికి చెందిన కంచర్ల మాధవి (24) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెంది పడి ఉంది. ఆమె మామయ్య చూసి ఇరుగుపొగురువారిని పిలిచి చూపించాడు. స్థానికులు ఎస్సై సుబ్బరాజుకి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. -
వరకట్న కాటుకు వివాహిత ఆత్మహత్య
-
బిడ్డకు ఉరేసి తల్లి ఆత్మహత్య
కాగజ్‌నగర్ రూరల్ (సిర్పూర్): భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఓ వివాహిత తన 16 నెలల కూతురికి ఉరివేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. నజ్రూల్‌నగర్ విలేజ్ నంబర్ 1కు చెందిన ప్రదీప్ బిశ్వాస్, సీతానగర్ గ్రామానికి చెందిన జయబిశ్వాస్ (29)లు భార్యాభర్తలు. వీరికి కుషి బిశ్వాస్ (16నెలలు) పాప ఉంది. ఆరు నెలలుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి పోయిన జయ బిశ్వాస్ పుట్టింటికి వెళ్లిపోయింది. మృతురాలి తండ్రి నరేశ్రాయ్ కూడా పలుసార్లు అల్లుడిని బతిమిలాడినా మారలేదు. దీంతో విసిగిపోయిన జయబిశ్వాస్ బుధవారం సీతానగర్లోని తల్లిగారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముందుగా బిడ్డకు ఉరివేసింది. ఆ తర్వాత తాను దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య
-
పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య
హైదారాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిరోజే కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేటలో జరిగింది. ఆరేళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ప్రేమజంట కాపురం ఆర్నెళ్లు కూడా సజావుగా సాగలేదు. తప్పు ఎవరిదైనా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. ఇది కాస్త మహిళా పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసులు కౌన్సెలింగ్ పేరుతో కాలయాపన చేశారు. పెళ్లి జరిగి శనివారానికి ఏడాదైంది. అప్పుడే తామిద్దరి మధ్య అంతులేని దూరం రావడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని సూసైడ్ నోట్ రాసింది. పోలీసులను కూడా అత్తింటి వారు కొనేసారని నోట్లో పేర్కొంది. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ ఆరేళ్లు ప్రేమించుకున్న అనంతరం గతేడాది మార్చి 25న పెళ్లి చేసుకున్నారు. ఏఎండీ క్వార్టర్స్‌లో కాపురం పెట్టారు. ఆరు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తన అత్తింటి వారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. శనివారం ఆ దంపతుల మొదటి మ్యారేజ్ డే. మానసికంగా కుంగిపోయిన భాగ్యలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. అత్తింటి వేధింపులతోనే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచావుకు కారణం భర్త శశి, మంజుల, భాస్కర్, రమణి మానసికంగా హింసించారు. భర్త నామాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నాశవాన్ని నావస్తువులను శశి ఫ్యామిలీని ముట్టుకోనీయొద్దు. బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు. వాళ్లని నమ్మొద్దు... ప్లీజ్ అమ్మాయిలు జాగ్రత్త మోసపోకండి. సారీ మమ్మి, డాడి, శివ అని రాసి పెట్టింది. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
ప్రాణాలు కాపాడిన పోలీసులు త్రిపురారం : కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్దదేవులపల్లి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను సోమవారం త్రిపురారం పోలీసులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని పెద్దదేవులపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ శ్రీలత, దుర్గాసింగ్ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీలత తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. భర్త దుర్గాసింగ్ ఏ పనీ చేయకపోవడంతో పాటు శ్రీలతతో తరుచూ ఘర్షణ పడేవాడు. ఒక పక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క భర్త వ్యవహారంతో మనస్తాపానికి గురై శ్రీలత ఆత్మహత్య చేసుకోవడానికి పెద్దదేవులపల్లి చెరువు వద్దకు వెళ్లింది. అది గమనించిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వర్క్ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ కోడిరెక్క జోజీ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన శ్రీలత ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను శ్రీలతను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. చెరువు వద్దనే ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఠాకూర్ శ్రీలత, దుర్గాసింగ్ దంపతులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కోడిరెక్క జోజీ, పెద్దదేవులపల్లి ఉప సర్పంచ్ ఠాకూర్ రాజారాంసింగ్, సిబ్బంది శేఖర్, నాగరాజు ఉన్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నకిరేకల్ : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నకిరేకల్‌లో సోమవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్‌హాల్ పక్క వీధిలో మీలా సంధ్య (43) తన భర్త దేవేంద్ర ప్రసాద్‌తో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. మూడు రోజుల క్రితం తిరుపతి పుణ్య క్షేత్రానికి వెళ్లి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో భర్త, చిన్న కుమార్తె ఉన్న సమయంలో సంధ్య గదిలోకి వెళ్లి లోపల గడియ వేసుకుని ఉరివేసుకుంది. కాసేపటికి భర్త తలుపును తెరిచేసరికి అప్పటికే మృతిచెందింది. దీంతో భర్త దేవేంద్ర ప్రసాద్‌తో పా టు కుమార్తె కూడా దుఖః సాగరంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నర్సింహారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వివాహిత బలవన్మరణం
పావగడ: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజవంతి గ్రామానికి చెందిన అనిత(19) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... రాజవంతికి చెందిన అనితకు ఆరు నెలల క్రితం శివకుమార్‌తో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఊరిలోని ఓ బావిలో దూకింది. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె ఆత్మమత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ మంజునాథ్ కేసు నమోదు చేసుకున్నారు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
చెళ్లకెరె రూరల్ :వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని బెళగెరె నారాయణపుర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంజుల(26) ఆత్మహత్య చేసుకున్న వివాహిత . మంజుల అన్న హరీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా ఎంబి హళ్లి గ్రామానికి చెందిన తాను తన చెల్లెలిని యేడాది క్రితం చెళ్లకెరె తాలూకా బెళగెరె నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే పుట్టినింటి నుంచి లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని భర్త ఇంటి వారు వేధించడం మొదలు పెట్టారు. ఓమారు రూ.50 వేలు ఇచ్చి పంపినా మళ్లీ లక్ష రూపాయలు కావాలని తగాదా మొదలు పెట్టారు. దీంతో విసిగి పోయిన మంజుల బుదవారం విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న హరీష్ తన చెల్లెలు మరణానికి అత్తమామలు, భర్త సతీష్, బావ నాగరాజ్, వదిన గీతలే కారణమని చెళ్లకెరె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరిని అరెస్టు చేసే వరకు తన చెల్లెలు మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకు వెళ్లేది లేదని పట్టుబట్టాడు. అయితే సతీష్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని, మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి తహశీల్దార్ శ్రీధరమూర్తి, డీఎస్పీ ఎం.శ్రీనివాస్‌లు చేరుకుని పరిశీలన జరిపారు. -
వదినపై మరిది లైంగిక వేధింపులు
వివాహిత ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు వినుకొండ టౌన్ వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ జి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న రాత్రి 7.30 గంటల సమయంలో మసీదు మాన్యం 2వ లైనులో పఠాన్ సాజిదా ఆత్మహత్య చేసుకున్న సంఘటన విదితమే. సాజిదా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి సాజిదాపై మరిది పఠాన్ ఫైరోజ్‌ఖాన్ లైంగింక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. మరిది వేధింపులను భరించలేని సాజిదా భర్త రహమాన్, అత్త రిజ్వానా, తోడికోడలు నజీనాలకు మొరపెట్టుకుంది. సాజిదాకు అండగా నిలవాల్సిన వారు ముగ్గురు ఆమెను మరింత అవమానించి, అనుమానించి వేధింపులకు దిగడంతో తట్టుకోలేకపోయింది. దీంతో రెచ్చిపోయిన మరిది లైగింక వేధింపులను ఉధృతం చేశాడు. ఒకవైపు మరిది తీరు, మరొకవైపు ఉమ్మడికుటుంబంలోని కుటుంబ సభ్యుల తీరు బాధితురాలిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. దీంతో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసును శోధించి సాజిదా మరిది ఫైరోజ్‌ఖాన్, భర్త రహమాన్, అత్త రిజ్వానా, తోడికోడలు నజీనాలను వారి ఇంటి వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఎస్సైలు ఎల్.ఎన్.రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మను కాలేనని..
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య ఐదేళ్లుగా మొక్కని దేవుడు.. చేయని పూజలు లేవు.. బిడ్డల కోసం పరితపించింది. ఏడాది క్రితం గర్భం నిలిస్తే.. పొంగిపోయింది. కానీ ఐదునెలలకే అబార్షన్ కావడంతో కుంగిపోయింది. అప్పటి నుంచి తాను తల్లిని కాలేనని, గొడ్రాలుగానే ఉండిపోవాల్సి వస్తుందని తరచూ బాధపడేది. ఈ క్రమంలో.. జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చౌడేపల్లె: పిల్లలు పుట్టలేదని కలత చెంది వివాహిత బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చౌడేపల్లె మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో సోమవారం వెలుగులోకివచ్చింది. మృతురా లి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు గంగవరం మండలం పాతూరు గ్రామానికి చెందిన బి.సుబ్రమణ్యం కుమార్తె ఎం. సుమతి(30)ని చౌడేపల్లె మండలం మిట్టూరుకు చెందిన పాపన్న కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమై ఐదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో సుమతి తీవ్రమనోవేదనకు గురైంది. ఈక్రమంలో ఏడాది క్రితం ఐదు నెల లు గర్భం నిలిచి ఆ తర్వాత అబార్షన్ అయ్యింది. గర్భసంచి చిన్నది కావడం వల్ల పిల్లలు పుట్టడం కష్టమని.. మందులు వాడమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే తనకు ఇకపై తనకు గర్భంరాదనే మనో వేదనతో తరచూ చనిపోతానని చెబుతుండేదని తండ్రి సుబ్రమణ్యం తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద సుమతి కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. సోమవా రం గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో సుమతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకొన్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ వివాహిత మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. పెదవేగి మండలం ముండూరులోని ఒక కోళ్లఫారంలో గెడ్డం ప్రభావతి భర్త శామ్యూల్‌తో కలిసి పనిచేస్తోంది. ఆమె దీర్ఘకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దానికి మందులు కూడా వాడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విపరీతమైన కడుపునొప్పి రావడంతో తాళలేక భర్తలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకుంది. భర్త వచ్చి ఆమె అచేతనంగా పడి ఉండడం గమనించి వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. -
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మండపేట : పట్టణంలోని సంగంపుంతకాలనీకి చె ందిన పెంటపాటి లక్ష్మీరాధ(28) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు, కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... రావులపాలేనికి చెందిన లక్ష్మీరాధకు మండపేటకు చెందిన వెల్డర్ శ్రీనువాస్‌కు 2004లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అప్పుల పాలైన భర్త తరచూ పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని లక్ష్మీరాధను వేధిస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇటీవల రూ.20వేలు కావాలని శ్రీనువాస్ అడగడంతో పుట్టింటికి వెళ్లింది. అక్కడ పుట్టింటి వారు ఆమెను ఇదే ఆఖరని, మరలా ఎప్పుడూ అడగవద్దని ఆమెకు సూచించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె బుధవారం ఇంటిలోని మేడగదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విజయరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన మూడు నెలలకే..
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య రామాయంపేటలో ఘటన రామాయంపేట : వరకట్న వేధింపులు తాళలేక మండలంలోని నస్కల్ పంచాయతీ రాంపూర్ గ్రామంలో ఓ వివాహిత పెళ్లి అయిన మూడునెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ ప్రవీణ్‌బాబు కథనం మేరకు.. దుబ్బాక మండలం నగరం గ్రామానికి చెందిన అంజాగౌడ్ కుమార్తె భవాని (18)ని రామాయంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రుద్రారం దుర్గారాజ్‌గౌడ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్తలో పాటు అత్త, మామ, బావ, తోడికోడలు వేధింపులకు గురి చేశారు. దీంత ఈ బాధలు భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అంజాగౌడ్ ఫిర్యాదు మేరకు భవానీ భర్త దుర్గారాజ్‌గౌడ్‌తో పాటు మామ భూమాగౌడ్, అత్త, బావ నాగరాజ్‌గౌడ్, తోడికోడలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కాగా వివాహం అయిన కొద్ది రోజుల త రువాత దుర్గారాజ్ దంపతులు గ్రామంలోనే వేరు కాపురం పెట్టారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, అయితే ఏం జరిగిందో తెలియదు గాని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు వివరించారు. -
వివాహిత ఆత్మహత్య
కొంతేరు (యలమంచిలి), న్యూస్‌లైన్ : అత్త ఆరళ్లు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతేరు గ్రామానికి చెందిన త్సవటపల్లి బాలకృష్ణకు భీమవరం మండలం గునుపూడికి చెందిన గీత(27)తో మూడే ళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసు కుమార్తె ఉంది. వివాహమైన నాటి నుంచి గీతను ఆమె అత్త పద్మావతి అదనపు కట్నం కోసం వేధించేది. అమ్మ మాటలు విని భర్త కూడా ఆమెను వేధించేవాడు. శనివారం వారి కుమార్తె సునంద పుట్టినరోజు కావడంతో బాలకృష్ణ కేక్, బిస్కట్స్, చాక్లెట్స్ తీసుకువచ్చాడు. అయితే ఇల్లు కడిగే విషయంలో అత్తాకోడళ్లకు శుక్రవారం రాత్రి తగాదా జరిగింది. దీంతో గీత తన భర్త మోటార్‌సైకిల్‌లో వేసుకునేందుకు బాటిల్‌తో తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన పెట్రోల్‌ను శనివారం వేకువ జామున వంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మేజిస్ట్రేట్‌కు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతుండగా మార్టేరు వద్ద ఆమె మరణించింది. తహసిల్దార్ చాగలకొండు గురుప్రసాదరావు, డీఎస్పీ రఘువీర్‌రెడ్డి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు