
మృతదేహాహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సురేష్
నాగులుప్పలపాడు (ప్రకాశం): అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నిడమానూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్సై సురేష్ సమాచారం మేరకు కొరిశపాడు మండలం గ్రామానికి చెందిన స్వర్ణ అనూష (22)కు నిడమానూరు గ్రామానికి చెందిన స్వర్ణ నాగార్జునతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. ఇటీవల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు రేగాయి. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు నాగార్జున బంధువులు తెలిపారు. కానీ అనూష కుటుంబ సభ్యులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ మురళీకృష్ణ పరిశీలించారు.
నిర్జీవంగా పడి..
అద్దంకి రూరల్: వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని వెంపరాల గ్రామానికి చెందిన కంచర్ల మాధవి (24) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెంది పడి ఉంది. ఆమె మామయ్య చూసి ఇరుగుపొగురువారిని పిలిచి చూపించాడు. స్థానికులు ఎస్సై సుబ్బరాజుకి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.

సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సుబ్బరాజు
Comments
Please login to add a commentAdd a comment