prakasham
-
నిమజ్జనంలో పచ్చ మంద బరితెగింపు.. రంగులు చల్లుతూ దాడి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చే అనే భావనతో ఎగబడి దాడులకు పాల్పడుతున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతూ పచ్చ బ్యాచ్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలను దారుణానికి ఒడిగట్టారు. యర్రగొండపాలెం పంచాయితీ పందినివానిపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో పచ్చ గూండాలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రంగులు చల్లారు.అంతటితో ఆగకుండా.. బూతులు తిడుతూ నోటికి పనిచేప్పారు. ఇదేంటని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నించగా పోలీసుల ముందే దాడి చేశారు. ఇక, పోలీసులు దాడి చేస్తున్న వారిని ఆపకపోగా.. పచ్చ బ్యాచ్‌కు వత్తాసు పలికారు. టీడీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసులు తీరును ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై రంగులు చల్లి గొడవ పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలుప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంచాయితీ పందివానిపల్లి గ్రామంలో వినాయకుని విగ్రహం ఊరేగింపులో టీడీపీ నేతలు బరితెగింపు ఉద్దేశపూర్వకంగానే రంగులు చల్లి కవ్వింపులు.. ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై… pic.twitter.com/fFyeiC9tGz— YSR Congress Party (@YSRCParty) September 13, 2024ఇది కూడా చదవండి: ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు! -
ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య!
టంగుటూరు: ఓ 2 కిలోమీటర్ల రహదారి 20 గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మర్లపాడు గ్రామంలో బస్టాండ్ నుంచి కొండల మీదుగా ఒంగోలుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ పరిధిలోని మట్టిరోడ్డులో రాళ్లు పైకి లేచి గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి.అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే పూర్తిగా బురద నీళ్లతో నిండి అధ్వారంగా తయారవుతోంది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనచోదకులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుంచే స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ప్రయాణం సాగిస్తుంటాయి. అంతేకాకుండా మర్రిపూడి జువ్విగుంట, కొండపి, తంగెళ్ల, జాళ్లపాలెం దూరప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఒంగోలు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు ఇలా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ 2 కిలోమీటర్ల రోడ్డును తారురోడ్డుగా మారితే ఒంగోలుకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా దూరం తగ్గడంతో పాటు తక్కువ సమయం పడుతుందని ప్రయాణిలకంటున్నారు. అధికారులు రోడ్డుపై దృష్టి సారించి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఇవి చదవండి: ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ -
Watch Live: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర డే 10
-
ఆంధ్రప్రదేశ్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
జిల్లెలపాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో కొత్త కోణం
-
‘సీఎం జగన్‌తోనే నా పయనం’
సాక్షి, దర్శి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే తన రాజకీయ పయనం ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడి వివాహం, సొంత పనుల కారణంగా రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. కాగా, ప్రకాశం జిల్లా దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో తిరిగి వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు. -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
వెలిగొండ పూర్తిచేసేది సీఎం జగనే..
సాక్షి, మార్కాపురం టౌన్(ప్రకాశం జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి ప్రారంభిస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 3, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసిన చంద్రబాబుతో మాట్లాడినప్పుడు నిధులు అడిగితే నీళ్లులేవు, నిధులు లేవు అని చెప్పిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మూడు జిల్లాల ప్రజల సమక్షంలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నేనే ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004లో ఎలక్షన్ జరిగి 2005లో సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు యాత్రలో భాగంగా నేను మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలిగొండను సందర్శించి వెంటనే రూ.3500 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ఆర్కు దక్కిందన్నారు. ఆ సమయంలో నేను వైఎస్ఆర్తో అన్నాను ‘‘ఆ నాడు మేము మొక్కలు వేశాము, ఇపుడు మీరు జీవం పోస్తారా’’ అని అంటే ‘‘మీరే చూస్తారుగా జీవం పోసేది’’ అని చెప్పి నిధులు మంజూరు చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు మంజూరుతో మొదటి టన్నెల్ పూర్తి చేసింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండో టన్నెల్ కూడా త్వరలో పూర్తి చేసి వరదలు వచ్చే సమయానికి నీళ్లు వదులుతారని తెలిపారు. సమావేశంలో ఈయన వెంట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, నాయకులు ఉన్నారు. (చదవండి: ఈ నెల 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు) -
కందుకూరు సభలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేత
-
బిగ్ క్వశ్చన్: ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత అలుసా..?
-
కందుకూరు ఘటనపై కేఏ పాల్ ఫైర్
-
చంద్రబాబు కందుకూరు రోడ్ షో లో అపశృతి
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటికి కూతవేటు దూరంలోనే..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైస్పీడ్‌లో ఉన్న కారు.. లారీని వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను ఒంగోలుకు చెందిన పవన్ కుమార్, శ్రీను, పరమేష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరంతా తమిళనాడులోని చెన్నైకి వెళ్లి తిరిగి వస్తుండగా ఒంగోలు సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరో ఐదు నిమిషాల్లో వారు ఇంటికి చేరుకుంటారు అన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి కూతవేటు దూరంగా ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. తెల్లవారుజాము కావడం, డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
సింగపూర్‌లో ఒంగోలు తెలుగు తేజం భరతనాట్య అరంగేట్రం
సింగపూర్: ప్రకాశం జిల్లా మైనంపాడుకు చెందిన గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి నృత్యాభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఐదేళ్ల ప్రాయం నుంచే నాట్యం అభ్యసించిన సాయి తేజస్వి అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాల్లో అవార్డులను, 2019లో త్యాగయ్య టీవీ కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందారు. సోదరి ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమంలో సాయి గురువు శ్రీలిజీ శ్రీధరన్ రూపకల్పన చేసిన నృత్యాలతో తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను అలరించారు. శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను అందుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు శ్రీమతి పద్మజా రెడ్డి సాయితేజస్వి ని ఆశీర్వదించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి శ్రీ వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిధులుగా విదూషి డా.ఎం.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త శ్రీమతి సునీత రెడ్డి హాజరై సాయి తేజస్వికి దీవనెలు, అభినందనలు అందించారు. ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు. హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం భావితరానికి స్ఫూర్తిదాయకమనీ, భారతీయ కళలకు గర్వకారణమని సభికులు ప్రశంసించారు. -
మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
1905లో నాటారు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా
వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రం వద్ద గల శతాబ్థాల చరిత్ర గల మర్రివృక్షం ఇప్పటికి చెక్కుచెదర కుండా ఉంది. ఈ వృక్షానికి ఇక చరిత్ర ఉంది. 1904 సంవత్సరంలో జెయంజే సంస్థకు చెందిన నలుగురు కన్యాస్త్రీలు వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వైద్యం చేస్తు వాటితో పాటు సామాజిక సేవలు చేసేవారు. అప్పటిలో వారు వైద్యశాలకు వచ్చే రోగులకు నీడ కోసం 1905 సంవత్సరంలో మే 1వ తేదీన వైద్యశాల ముందు మర్రి చెట్టు మొక్కలు రెండు నాటారు. అనంతరం వారు 1911 మే 11వ తేదీన వరకు వైద్యశాల్లో సేవలు అందించారు. అనంతరం సంస్థ కార్యకలాపాలు చీరాల మార్చడం జరిగింది. అప్పడు వారు నాటిన మర్రి మొక్కలే నేడు మహవృక్షాలుగా నేటికీ ఉన్నాయి. శతాబ్థాల చరిత్ర గల ఈ మర్రి వృక్షాలను కాపాడుకోవడం తోపాటు అవి చిరస్మరణీ యంగా నిలువాలని సంస్థ వాటికి రక్షణ కోడలు నిర్మించి రోగులు సేద తీరడానికి వృక్షాల చుట్టూ అరుగులు ఏర్పాటు చేశారు. 2019 సంవత్సరంలో సంస్థ ప్రతినిధులు బెంగుళూరు నుండి వేటపాలెం వచ్చి రూ.10 లక్షల ఖర్చుతో పార్కును ఏర్పాటు చేసి సుందరంగా అలకంరించారు. ఈ వృక్షాలు దశాబ్థాల చరిత్రను తెలియజేస్తున్నాయి. -
నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళా
-
నీరు మిగిల్చిన కన్నీరు
నీరు కన్నీరు మిగిల్చింది. రాఖీ పౌర్ణమి నాడు ఉప్పుటేరు అన్నాచెల్లెళ్ల కుటుంబాల్లో విషాదం నింపింది. తండ్రులతో పాటు విహారానికి వెళ్లిన బిడ్డలు తిరిగి ఇంటికి రాలేకపోయారు. చందమామ వంటి రూపాలు, ముద్దుగారే మాటలతో ఇళ్లంతా సందడిగా తిరిగిన పిల్లలు నిశ్శబ్దమైపోయారు. అమ్మానాన్న ఊరెళితేనే తట్టుకోలేని ప్రాయంలో వారిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. సోంపేట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామానికి సమీపంలో గల ఉప్పుటేరులో పడి కారాగి హర్షిత్ (6), దున్న శ్రీశాంత్ (8) అనే ఇద్దరు బాలలు మృతి చెందారు. రాఖీ పండగ రోజు జరిగిన ఈ విషాదం ఇద్దరు అన్నాచెల్లెల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కారాగి ప్రకాష్, దున్న కాంతారావులు బావబామ్మర్దులు. కారాగి ప్రకాష్ చెల్లి నీలవేణిని కాంతారావుకు ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. ఆదివారం సాయంత్రం బావబామ్మర్దులు పిల్లలు కారాగి హర్షిత్, దున్న శ్రీశాంత్‌లతో పాటు సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలోని ఉప్పుటేరు వద్ద పిల్లలను కూర్చోబెట్టి అక్కడే ఉండమని చెప్పి వారు సముద్రం వైపు వెళ్లారు. తండ్రులు దగ్గర లేకపోవడంతో పిల్లలిద్దరూ ఉప్పుటేరులో స్నానానికి దిగారు. నీటి లోతును అంచనా వేయలేక మునిగిపోయారు. తండ్రులు అక్కడకు వచ్చి చూసే సరికి పిల్లలు లేకపోవడంతో కంగారు పడి అంతా వెతికారు. ఉప్పుటేరు చిన్నారులు కాస్త తేలుతూ కనిపించడంతో వారికి బయటకు తీసి స్థానికుల సాయంతో హరిపురం సామాజిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కారాగి ప్రకాష్, కల్పనలకు హర్షిత్ తో పాటు మూడేళ్ల పాప ఉంది. ఆదివారం ఉదయమే తన అన్నకు ఆ చిన్నారి రాఖీ కట్టింది. సాయంత్రానికి ఆ బాలుడు చనిపోయాడనే వార్త తెలిసి ఆ కుటుంబం కంటికి మింటికి ఏకధారగా రోదించింది. దున్న కాంతారావు, దున్న నీలవేణిలకు శ్రీశాంత్‌తో పాటు మరో ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడిని ఉప్పుటేరు మింగేయడంతో ఆ కుటుంబం బోరున విలపించింది. సోంపేట సీఐ డీవీవీ సతీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బారువ ఎస్ఐ రమేష్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఊరెళ్లిపోదాం అన్న కాసేపటికే.. -
బైకుల దొంగ.. 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ముండ్లమూరు: వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను అపహరించుకెళ్తున్న నర్రా సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం నిందితుడి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉల్లగల్లు ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ నెల 16వ తేదీ రాత్రి బైకు అపహరణకు గురికాగా అదే గ్రామానికి చెందిన బొట్ల నాగేశ్వరరావు స్థానిక పోలీసుస్టేషన్లో 17వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్శి సీఐ భీమానాయక్, ముండ్లమూరు ఎస్ఐ గంగుల వెంకటసైదులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, బి.ప్రేమానిధి, డి.అశోక్‌కుమార్, ఎస్కే ఖాశిం, కావిరాజు, టి. శ్రీనులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ వద్ద సేకరించిన ఆధారాల మేరకు మోటార్ సైకిళ్ల దొంగ కోసం వేట ప్రారంభించారు. చదవండి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు! శనివారం దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న దర్శి మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వర్రా సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.20 లక్షలు. నిందితుడు జిల్లాలోని చీరాల, చినగంజాం, అద్దంకి, చీమకుర్తి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ, నూజెండ్ల మండలాల పరిధిలో పలు మోటార్ సైకిళ్లను అపహరించాడు. స్వాధీనం చేసుకున్న 18 ద్విచక్ర వాహనాల్లో 11 వాహనాలకు సంబంధించి వివిధ పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఏడు బైకులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎంవీఐకి సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక టీమ్‌ను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు. వారికి రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు దర్శి సీఐ భీమానాయక్, ఎస్ఐ గంగుల వెంకటసైదులు, హెడ్‌కానిస్టేబుల్ సూర్యనారాయణ, సిబ్బంది అంజిబాబు, విజయ్‌కుమార్ ఉన్నారు. చదవండి: రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు -
మోస పోయాం.. న్యాయం చేయండయ్యా!
కొమరోలు: మోస పోయిన తమకు న్యాయం చేయాలంటూ పోలీసుస్టేషన్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిచెర్ల గ్రామానికి చెందిన సూరె బాలస్వామి, మరియమ్మ దంపతుల కుమార్తెకు బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కాశయ్యతో వివాహం చేయాలని మూడు నెలల క్రితం పెద్దలు నిశ్చయించారు. బాలస్వామి కుమార్తెను వివాహం చేసుకునేందుకు కాశయ్య నిరాకరించి వేరే వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లి నిశ్చయం కావడంతో బాలస్వామి కుటుంబ సభ్యులు కాశయ్య కుటుంబానికి రూ.5 లక్షలు కట్నకానుకలు అందజేశారు. అవి తిరిగి ఇవ్వక పోవడంతో పోలీసు స్టేషన్లో బాలస్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా స్థానిక ఎస్ఐ సాంబశివయ్య పట్టించుకోవడం లేదంటూ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆ సమయంలో గిద్దలూరు సీఐ ఫిరోజ్ పోలీసుస్టేషన్‌కు చేరుకొని మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. చదవండి: ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని -
భూమి ఆన్‌లైన్‌కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
ఏడుగురి ప్రాణాలు తీసిన సరదా
ప్రత్తిపాడు/పిడుగురాళ్లరూరల్(గురజాల)/చినగంజాం: ఈత సరదా వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ప్రాణం తీయగా.. చేపల వేట సరదా మరో ముగ్గురిని బలిగొంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామం చిన్న మాలపల్లెకు చెందిన బొల్లా వర్థన్‌బాబు (18), నేలపాటి కోటేశ్వరరావు (15), బత్తుల సుధాకర్ (15)తో పాటు మరో ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కుంటలోకి దూకిన ముగ్గురు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో మిగిలిన ముగ్గురు యువకులూ భయాందోళనకు గురై వెంటనే గ్రామస్తులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ కృష్ణారెడ్డి కుంట వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అలాగే పిడుగురాళ్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన మస్తాన్ కుమారుడు యాసిన్ (12) ఈత కొడుతున్న సమయంలో నీటి గుంతలో ఇరుక్కుపోయి మృత్యువాత పడ్డాడు. ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం సాయంత్రం రొంపేరు కాలువలో చేపల వేటకు వెళ్లగా.. వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మూలగాని వారిపాలెం రైల్వే స్టేషన్ సెంటర్‌కు చెందిన కోకి కాశిరెడ్డి (24), కుక్కలవారిపాలేనికి చెందిన కొణసం దుర్గారెడ్డి(27), వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన నంగు రమణారెడ్డి (23) కాలువలో దిగి కూరుకుపోయి మృత్యువాత పడగా.. మూలగాని వారిపాలెం గ్రామానికి చెందిన మూలగాని గోపిరెడ్డి ఒడ్డునే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. (చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ) -
ఆటోను ఢీకొన్న లారీ
-
వనితకు వ్యవసాయమే ప్రాణం..
కుబేరునికైనా.. బికారికైనా కడుపు నింపేది పట్టెడన్నమే.. ఈ బువ్వను సృష్టించేది రైతే.. మట్టితో సహవాసం చేస్తూ చెమటే ఇంధనంగా పోరాడే అన్నదాత లేకుంటే ఈ లోకం ఏమైపోతుందో.. ఈ విలువ చిన్నారి వనితకు 6వ తరగతిలోనే తెలిసింది అప్పటి నుంచి వ్యవసాయమే ప్రాణంగా భావిస్తోంది... బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాప జీవనశైలి మిగతా బుడతలకు ఆదర్శంగా మారాలని ఆశిద్దాం.. సాక్షి, ఒంగోలు: నాగార్జున సాగర్‌కు సమీపంలో ఉంటుంది గేన్యా నాయక్ తండా.. అక్కడే వడిత్య వనిత తల్లిదండ్రులు రెండకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పట్లాగానే వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకొని ముగ్గురు పిల్లలతో ఒంగోలు వలస వచ్చారు. బిడ్డలను బాగా చదివించాలనుకున్నారు. వీరిలో మధ్య సంతానంగా వనిత జన్మించింది. మంగమూరు రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయి హైస్కూలులో వనిత మూడో తరగతిలో చేరింది. అలా ఆరో తరగతికి రాగానే అక్కడ పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టారు ఎన్. మాల్యాద్రి స్ఫూర్తి ఆమెపై పడింది. దీనికి కారణం ఆయన సేంద్రియ వ్యవసాయం చేయడమే. క్షేత్ర పర్యటనల్లో భాగంగా పిల్లలతో పాటు ఆయనకు ఒంగోలు సమీపంలో ఉన్న కొనగానివారిపాలెం వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లేవారు. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనితకు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చాయి. ( చదవండి: ‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు! ) భవితపై ఆలోచన.. ఆ క్షేత్రంలో శ్రీగంధం, టేకు చెట్లు ఉంటాయి. ఇక అంతర సేద్యంగా జామ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లతో పాటు వరి కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాల్యాద్రి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ కేవలం కషాయాలతోనే వైరస్‌లను కట్టడి చేస్తారు. ఇక బలం కోసం దిబ్బ ఎరువు వాడతారు. ఇలాంటి విషయాలే వనితను విస్తృతంగా ప్రభావితం చేశాయి. తల్లిదండ్రులు లెక్కకు మించి.. శక్తికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి చేతులు కాల్చుకున్న వైనాన్ని చూసిన అనితకు సేంద్రియ వ్యవసాయం ఎంతో మంచిదని అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి వ్యవసాయంలో అన్ని పద్ధతులు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. 4 అన్ని పనులు నేర్చుకుంటూ.. ప్రస్తుతం తొమ్మిదో తరగతికి వచ్చిన వనిత వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులనూ తన గురువు సహాయంతో నేర్చుకోగలిగింది. చేలో కట్టలు కట్టడం, పాదులు, కలుపు తీయడం, వివిధ రకాల గారర్డెనింగ్లో మెళకువలు తెలుసుకుంది. లాక్డౌన్ కారణంగా ఈ పాప తల్లిదండ్రులు తమ స్వగ్రామం అయిన గేన్యా నాయక్ తండాకు వెళ్లారు. దీంతో అనిత.. తమ గురువుగారి ఇంట్లోనే కుటుంబ సభ్యురాలిగా ఉంటోంది. ఇలా ఆరు నెలలుగా ఆ పాపను మాస్టారు కుటుంబం ప్రేమతో చేరదీస్తోంది. అక్కడే ఉంటూ వ్యవసాయంలో ఇంకా లోటు పాట్లను తెలుసుకునేందుకు ఈమె ప్రయత్నిస్తోంది. ‘వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి విన్నాను. వారు ఆ బాధలు భరించ లేక ఒంగోలు వచ్చారు. మానాన్న ఆటో తోలుతూ ఉంటాడు. అమ్మ ఓ అపార్టుమెంటులో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తోంది. అన్న మా ఊర్లో హాస్టళ్లో చదువుతుండగా.. తమ్ముడు మా స్కూల్లోనే ఏడో తరగతి చదువుతున్నాడు. సేంద్రియ వ్యవసాయమే చాలా మంచిది. రసాయన ఎరువులు వాడటం వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఉత్పత్తులు వాడకూడు. నేను పెద్దయ్యాక అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని ఉంది. అంతా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. అప్పుడే మంచి దేశం ఉత్పత్తి అవుతుంది. సేంద్రియ ఉత్పత్తులు పండించి దేశానికి అన్నం అందించాలన్నదే నాకల’ అని ఎంతో నమ్మకంతో చెప్పిందీ పాప. అడిగిన వారికి సేంద్రియ ఉత్పత్తులు మాల్యాద్రి మాస్టారికి లాయర్ పేటలో ఫ్రీడమ్ బర్డ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. ఇందులోని సభ్యులకు, తమ స్కూల్‌కి చెందిన తల్లిదండ్రులకు తమ వ్యవసాయ క్షేత్రంలోని ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ముఖ్యంగా జామ, నిమ్మ, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది రెండెకరాల్లో వరి కూడా సాగు చేశారు. ‘వనితకు వ్యవసాయం పట్ల చాలా ఇష్టం ఉంది. నేను చేయగలిగిన అన్ని పనులూ నేర్చుకుంది. పాప తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్టాన్ని గుర్తించారు. చిన్నతనంలోనే రైతులను బతికించాలని.. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలతో అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని కలలు కనడం నిజంగా అభినందనీయం. ఆమె భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు చేరుకోవాని ఆశిస్తున్నా’ అని ఆమె గురువు నాయుడు మాల్యాద్రి చెప్పారు. -
టీడీపీకి షాక్: ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా
సాక్షి, ప్రకాశం : జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ గత కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందన్నారు. చదవండి : ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు -
బాలికను బెదిరించి 6 నెలలుగా..
సాక్షి, ప్రకాశం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బెదిరింపులకు పాల్పడి ఆరు నెలలు అత్యాచారం చేస్తున్నాడో వ్యక్తి. ఈ సంఘటన సింగరాయకొండలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్‌కు చెందిన యుగందర్ అనే వ్యక్తి తన వద్ద పనిచేస్తున్న 15 సంవత్సరాల బాలికపై బెదిరింపులకు పాల్పడి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ( పొద్దుపొద్దున్నే ఛేజింగ్, కాల్పులు ) ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యం పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు యుగందర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు.. మూడో ‘సారీ’
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్సైట్లలో జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను చూడటం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆతరువాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఈ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి బుట్టలో పడేస్తుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్మెంట్ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషమేంటనే కోణంలో కూపీ లాగాడు. (ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో) దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చిత్తూరుకు చెందిన పృద్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్టు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు స్వప్నని నిలదీశాడు. దాంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న చీటింగ్ బయటపడింది. రామాంజనులు డెన్మార్క్ నుంచి రావాల్సి ఉంది. (రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు) -
చీరాల ఘటనపై సీఎం జగన్ ఫైర్
-
కొలువుల ఖిల్లా గోపాలునిపల్లె
గిద్దలూరు: కసి, పట్టుదల.. ఆ ఊరి విద్యార్థులనుఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి. స్కూల్లో ఓ విద్యార్థికి మంచి మార్కులు వస్తే ‘మాకెందుకు రావు’ అనే కసి..ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని తెలియగానే‘మేమెందుకు సాధించలేం’ అనే కసి ఆ ఊరి ముఖచిత్రాన్ని మార్చేశాయి. చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నవారు కొందరైతే.. చదవలేనివారు చిరుద్యోగమైనా చేయాలన్న సంకల్పంతో ముందుడుగు వేస్తున్నారు. ఊరిలో ఏ వీధి చూసినా అందమైన ఇళ్లు కనిపిస్తాయి. కానీ అందులో జనాలుండరు. కారణమేంటంటే ఆ ఇళ్లలో వారంతా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలు, శుభకార్యాలకు మాత్రమే గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. 300 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ఉద్యోగం లేని కుటుంబాలు 30 మాత్రమే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొమరోలు పంచాయతీ పరిధిలో కొలువుల ఖిల్లాగా పేరుగాంచిన గోపాలునిపల్లె గ్రామవిశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉద్యోగాలకు మూలాలివీ.. గోపాలునిపల్లెలో ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేందుకు తగిన విద్యా సౌకర్యాలు ఉండటమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలనలోనే గోపాలునిపల్లెకు అర కిలోమీటరు దూరం ఉన్న కొమరోలు మండల కేంద్రంలో ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న ఉద్దేశంతో ఈ పాఠశాలను 8వ తరగతి(మిడిల్ స్కూల్) వరకు అప్‌గ్రేడ్ చేశారు. 8వ తరగతి వరకు చదువుకున్న వారు కొమరోలుకు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేటలో ఫారినర్స్ నెలకొల్పిన పాఠశాలలో బేసిక్ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇక్కడ రెండేళ్లపాటు ఉచితంగా చదువుకున్న వారికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇచ్చారు. అప్పట్లో 20 మంది వరకు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అప్పట్లో వీరికి ప్రభుత్వం నెలకు 30 రూపాయలు వేతనం ఇచ్చేది. 1955లో వీరి పిల్లలు హైయర్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్న తర్వాత బెంగళూరులో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. వీరికి ఆ వెంటనే ఉద్యోగాలు వచ్చాయి. ఇలా ఒక తరం తర్వాత మరో తరం ఉద్యోగాలు సాధిస్తూ వస్తున్నారు. అభివృద్ధిలోనూ ముందంజ గ్రామంలోని అన్ని వీధుల్లో సిమెంటు రోడ్లే దర్శనమిస్తాయి. ప్రధాన వీధుల్లో మురుగు కాలువలు నిర్మించారు. పాఠశాల, అంగన్వాడీ స్కూల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో పశువుల పాకలు మినహా ఒక్క పూరిల్లు కనిపించదు. రెండతస్తులు, ఒక అంతస్తు భవనాలు ఎక్కువగానే ఉన్నాయి. పురాతన వేణుగోపాలస్వామి ఆలయం, రామాలయంతో పాటు, రెండు చర్చిలు, మసీదు, శివాలయం ఉన్న ఈ గ్రామంలో రోడ్డుకిరువైపులా చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. సంక్రాంతి పండుగ వస్తే గ్రామంలోని ఉద్యోగులందరూ గ్రామానికి చేరుకుంటారు. దీంతో గ్రామం మొత్తం సందడిగా ఉంటుంది. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య మినహా మిగిలిన సమస్యలేవీ ఈ ఊరిలో లేవు 300 కుటుంబాలు 510ఉద్యోగులు గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి. 950 మంది జనాభా కాగా వీరిలో 510 మంది ఉద్యోగులు ఉన్నారు. చదువులో బాగా రాణించిన వారు ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డీఎస్పీలు, సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ చదువుకున్న వారు ఆర్మీ జవాన్లుగా, పోలీసులుగా ఉద్యాగాలు సాధించారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గ్రామంలో 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, భవనాల నిర్మాణ కాంట్రాక్టర్లుగా రాణిస్తున్నారు. మండలస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకులకు గ్రామంలో కొదవలేదు. ఓ కుటుంబంలో ఏకంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. గ్రామానికి చెందిన నక్కా వెంకటరమణ, రాధాకృష్ణ, రాధామోహన్, వేణుగోపాల్ సోదరులు కాగా వీరిలో ముగ్గురి భార్యలు ఉపాధ్యాయులు కావడం విశేషం. వీరి పిల్లలు మరో ఐదుగురు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా గ్రామంలో ఐదారు కుటుంబాల్లో నలుగురు చొప్పున ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. 100 గృహాలకు పైగా ఇద్దరు చొప్పున ఉద్యోగాలు చేస్తున్నారు. 10 మంది యువకులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ గ్రామానికి చెందిన వారు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. గ్రామంలో ఉద్యోగాలు లేని 30 కుటుంబాల వారు వ్యవసాయం, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యావేత్తలు ఎయిడెడ్ విద్యాసంస్థలను నెలకొల్పి మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. మా కుటుంబంలోనే ఎనిమిది మంది ఉపాధ్యాయులం మా గ్రామం మేధావులకు పుట్టినిల్లుగా చెప్పుకుంటుంటారు. గ్రామంలో 70 మందికి పైగా ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, డీఎస్పీలు లాంటి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఐదుమంది అన్నదమ్ములం. అందరం ఉపాధ్యాయులమే. మా సోదరుల భార్యలు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మా పిల్లలు ఐదుగురు ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వసతుల కల్పన, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం వల్ల ఇంత మంది ఉద్యోగం సంపాదించగలిగారు. – నక్కా వెంకటరమణ, రిటైర్డ్ టీచర్, గోపాలునిపల్లె గ్రామం -
వైరస్ వ్యాప్తి : 14 రోజులు లాక్డౌన్
సాక్షి, ఒంగోలు : జిల్లా కేంద్రంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నిర్బంధం ఒక్కటే విరుగుడుగా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఎల్లుండి (ఆదివారం) నుంచి నగరంలో పూర్థిస్థాయి లాక్డౌన్ అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసింది. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు. (కరోనా అలెర్ట్.. 6 లక్షల పరీక్షలు) మొత్తం కేసుల సంఖ్య 268 ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డులు తిరగరాస్తోంది. బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయనుకుంటే తాజాగా గురువారం అందిన రిపోర్టులలో రికార్డు స్థాయిలో 38 కేసులు ఉండటం ఇటు జిల్లావాసులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజా కేసుల్లో ఒక్క చీరాల పట్టణంలోనే అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా జిల్లా కేంద్రంలో ఎనిమిది కేసులు, పామూరులో ఆరు కోవిడ్–19 కేసులు ఉన్నాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది. 30 కేసులు.. 13 కంటైన్మెంట్ జోన్లు.. ఒంగోలు నగరంలో ఈనెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాకు గురైన వారితోపాటు వారి కుటుంబీకుల్లో కూడా లక్షణాలు కనిపిస్తుండటం యంత్రాంగాన్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా కేసు వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ నివేదికలు వచ్చేనాటికి సమయం పడుతుండటంతో యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. ఒంగోలులో కరోనా విజృంభిస్తుండటంతో తొలిసారిగా 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనుంది. నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో భాగంగా 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించి, వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో లెక్క తేల్చారు. అదేవిధంగా మరో 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను బఫర్ జోన్లుగా గుర్తించి వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో కూడా నిర్ధారించారు. (కుటుంబాలలో కరోనా వ్యాప్తి ఎక్కువ) ప్రజల్లో కనిపించని మార్పు.. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఒంగోలు నగరంలోని ప్రజలు మొదట్లో కొంతమేర సహకరించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు ఇచ్చిన ప్రతిసారీ ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుంపులు గుంపులుగా రోడ్లపై ఉండటం, ఫేస్ మాస్క్‌లు కూడా ధరించకుండా ఒకరినొకరు ఆనుకొని కూర్చోవడం, నిలబడటం వంటివి చేశారు. టీ కొట్ల వద్ద గుంపుగా నిల్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి జరిగాయి. ఫేస్ మాస్క్‌లు ధరించనివారికి ఫైన్లు విధించినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. లక్ష రూపాయలకు పైగా ఫైన్లు కట్టారు తప్పితే ఫేస్ మాస్క్‌లు కూడా ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నగర ప్రజలు కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో చివరకు లాక్డౌన్ పరిస్థితులకు దారితీసింది. -
కరోనా రాకూడదని ఉమ్మెత్త తిన్నారు..
సాక్షి, ప్రకాశం : టిక్‌టాక్ వైద్యం ఓ ముగ్గురి ప్రాణం మీదకు తెచ్చింది. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఉమ్మెత్తకాయను తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లిమల్లికి చెందిన ఓ కుటుంబం కొద్దిరోజులు క్రితం టిక్‌టాక్‌లో ఓ వీడియో చూసింది. ఉమ్మెత్తకాయను తింటే కరోనా సోకకుండా ఉంటుందని అందులో చెప్పటంతో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఉమ్మెత్తకాయను తిన్నారు. దీంతో వారు అస్వస్థతకు గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారిని చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిక్‌టాక్ వీడియో చూసి తాము మోసపోయామంటూ బాధితులు వాపోయారు. చదవండి : దిండు లేకపోయుంటే పరిస్థితి ఏంటో! -
‘చంద్రబాబు విమర్శలు అర్థరహితం’
సాక్షి, ప్రకాశం : కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకి అండగా వుంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్యే మధుసూధన్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుదూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన చేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్ నెల వ్యవధిలో మూడుసార్లు రేషన్ సరుకులు, వెయ్యి రూపాయలు సాయం చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూనే డ్వాక్రా మహిళలుకు సున్నా వడ్డీ రుణాలు, జగనన్న విద్యా దీవెన, ఫించన్లు వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. (గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు) అనంతపురం : కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కరోనా పరీక్షల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఉచిత రేషన్, వెయ్యి నగదు అందిస్తున్న సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ ) ఆ హీరో అంటే చాలా ఇష్టం: విజయ్ దేవరకొండ -
ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు. -
షాకింగ్: చనిపోయిందనుకుంటే..తిరిగొచ్చింది
సాక్షి పెద్దదోర్నాల(ప్రకాశం) : రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయి..చనిపోయిందనుకున్న ఓ వృద్ధురాలు గ్రామానికి తిరిగొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురానికి చెందిన తిరుమలరెడ్డి అచ్చమ్మ (60)కు భర్త గండివీరయ్య, ఇద్దరు కుమారులు వీరనారాయణరెడ్డి, శివారెడ్డి ఉన్నారు. భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి రెండేళ్ల క్రితం అచ్చమ్మ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త, కుమారులు ఆమె ఆచూకీ కోసం వెదికినా ఫలితం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చివరకు అందరూ ఆమె ఎక్కడో చనిపోయి ఉంటుందని అనుకుని వెదకడం మానేసి ఎవరి పనిలో వారు పడ్డారు. ఈ క్రమంలో ¿భర్త గండి వీరయ్య గతంలో తాను చేసిన అప్పుల బాధ తాళలేక ఊరిలో ఎక్కడ మాట పడాల్సి వస్తుందోనన్న అవమాన భారంతో ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రోజులు గడిచిన క్రమంలో శనివారం రాత్రి కనిపించకుండా పోయిన అచ్చమ్మ స్వగ్రామానికి తిరిగొచ్చింది. దీంతో ఆమె ఇద్దరు కుమారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. రెండేళ్లుగా కనిపించకుండా పోయి.. చనిపోయిందనుకున్న తమ తల్లి తిరిగి రావడంతో వారు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుసుకున్న అచ్చమ్మ హృదయ విదారకంగా రోదించింది. ఈ సందర్భంగా అచ్చమ్మ మాట్లాడుతూ డబ్బుల విషయంలో తనకు, తన భర్తకు మాటా, మాటా పెరిగిందని దీంతో తాను ఇంట్లో చెప్పకుండా కర్నూలుకు వెళ్లి పోయాయని తెలిపింది. తాను పలానా గ్రామానికి చెందినట్లు ఎవరికీ చెప్పలేదంది. తనకు ఆశ్రయం ఇచ్చిన రఘురామిరెడ్డి అనే విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్ తనను సొంత తల్లిలా చూసుకున్నారని అచ్చమ్మ తెలిపింది. చివరకు తన చిన్న కుమారుడికి తెలిసిన వారి ద్వారా తన సమాచారం పంపటంతో వారు స్వగ్రామానికి చేర్చారని చెప్పింది. కుటుంబ సభ్యులు ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి..ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు. -
‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ సినిమా చేస్తున్నాడు’
సాక్షి, ప్రకాశం : ఇసుక సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్ అని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే అప్పుడు పవన్ కల్యాణ్ చోద్యం చూశాడని విమర్శించారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే పవన్‌కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా అర్థం కావట్లేదన్నారు. విశాఖ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచిగా పరిపాలిస్తే తాను సినిమాలు చేసుకుంటానంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన బాలినేని, జగన్ పాలన బాగుంది కాబట్టే ఆయన ఇప్పుడు సినిమా మొదలు పెడుతున్నాడని వ్యాఖ్యానించారు. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
-
తప్పిన పెను ప్రమాదం; కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారులోని వారిని సురక్షితంగా బయటకు లాగారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన బాలినేని
-
మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!
సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ మండల మెజిస్ట్రేట్‌పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్‌పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది. ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్‌పై బెదిరింపుల పర్వం: రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్ పోల భాస్కర్ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్‌ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
నల్లమలలో అలర్ట్
సాక్షి, మార్కాపురం(ప్రకాశం) :విశాఖ మన్యంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో నల్లమలలో యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల కిందట మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులపై నిఘా పెట్టాలని, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ముందు జాగ్రత్తగా నల్లమల పరిధిలోని పోలీసుస్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేసి మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. గతంలో నల్లమల అటవీ ప్రాంతం, మావోయిస్టులకు నిలయంగా ఉండేది. పలువురు రాష్ట్ర స్థాయి అగ్రనేతలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే నల్లమలలోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించే వారు. పలు సార్లు పోలీసుల ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లలో అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, తదితరులు మృతి చెందారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడం, మరికొందరు లొంగిపోవటంతో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గత నెల నుంచి యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయని, దాన్ని వ్యతిరేకించాలంటూ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమం ద్వార మళ్లీ మావోయిస్టులు ప్రవేశిస్తారా, ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇస్తున్నారా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే అంశాలపై సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో మార్కాపురం డివిజన్లోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టులు కార్యకలాపాలు, ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్లీ నల్లమలలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతున్నారు. మరో వైపు మావోయిస్టులు ఏవోబీలో కార్యకలాపాలు చేస్తూ నల్లమలను షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నారా అనే అంశంపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉద్యమం లేకున్నా పోలీసులు మాత్రం ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ విషయమై మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నల్లమలలో మావోయిస్టుల కదలికలు లేవని, అయినా సిబ్బందిని అలర్ట్ చేశామని స్పష్టం చేశారు. -
చిన్నారి లేఖ.. సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి : తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో బడిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?
వారిద్దరూ ఒకే గ్రామస్తులు. ఒకే వీధిలో నివాసం ఉండేవారు.. బాల్యం నుంచి ఇరుగుపొరుగు ఇళ్లలో కలసి మెలసి పెరిగారు. ఇద్దరూ చదువులో చురుకైన వారు.. విద్యాధికులు.. ఆ పరిణతితోనే ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ పెద్దల అంగీ కారంతోనే పెళ్లి చేసుకున్నారు. నవదంపతులిద్దరూ విదేశాల్లో ఉన్నత ఉద్యాగాల్లో స్థిరపడ్డారు. చీకూచింతా లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న జీవితంలో వారిని మరో శుభవార్త పలకరించింది. భార్య గర్భం దాల్చింది. పురుడు కోసం స్వదేశంలోని పుట్టింటికి వచ్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చూస్తూ చూస్తూనే పది నెలలు గడచి పోయాయి. బోసినవ్వుల పసిపాపను చూసి వెళ్దామని విదేశాల్లో ఉన్న తండ్రి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. భార్యాబిడ్డలతో కొద్దిరోజులు గడిపి మొన్ననే విదేశాలకు తిరుగు పయనమయ్యాడు. ఇంతలో ఏమైందో భర్త వెళ్లిన మర్నాడే భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోకం తెలియని పసిబిడ్డను వదలి పరలోకాలకు పయనమైంది. ఈ వార్త తెలిసిన భర్త గుండెలు బాదుకుంటూ వెంటనే విదేశాల నుంచి తిరుగుపయనమయ్యాడు. వస్తూ వస్తూ ఏమనుకున్నాడో ఇంటికి చేరేలోపే రైలు కిందపడి ప్రాణాలొదిలాడు. రెండు రోజల వ్యవధిలోనే ఏడాది నిండని ఆడపిల్లను అనా«థను చేసి తల్లిదండ్రులిద్దరూ వెళ్లిపోయారు. కన్న తండ్రి మరణం గురించి తెలియకపోయినా స్తన్యమిచ్చే తల్లి కూడా లేక ఆకలితో అలమటిస్తూ ఆ పసికందు వెక్కివెక్కి ఏడుస్తున్న తీరు చూపరులకు కలచివేస్తోంది.. అమాయకంగా చూస్తున్న బిడ్డ కళ్లు అమ్మా.. నాన్నా.. నేను చేసిన నేరమేంటి అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి. ఈ వరుస ఘటనలు మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో పెను విషాదం నింపాయి. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న దంతులు స్వల్ప వివాదాలతో ఆత్మహత్యకు పాల్పడటంతో వారి పది నెలల బిడ్డ అనాధగా మారింది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. బాధిత కుటుంబాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జొన్నతాళి గ్రామానికి చెందిన మెట్టల గంగయ్య(32) అదే గ్రామానికి చెందిన రమాదేవి(27) బాల్యం నుంచి ఒకే వీధిలో నివాసం ఉండేవారు. ఇద్దరూ ఎమ్మెస్సీ పూర్తి చేశారు.. యూనివర్సిటిలో ఎమ్మెస్సీ చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల ఇష్టాలతో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సౌదీలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సంవత్సరం కిందట రమాదేవి గర్భవతి కావటంతో పురుడు కోసం స్వగ్రామం జొన్నతాళి వచ్చింది. ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆపాపకు జానకి అని పేరు నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ పాప వయసు పది నెలలు. ఈ క్రమంలో గంగయ్యకు లండన్‌లో ఉన్నత ఉద్యోగం రావడంతో సౌదీ నుంచి లండన్‌కు మారాడు. లండన్‌లో పీహెచ్డీ పట్టా ఉంటే ఉపాధి అవకాశాలు మేరుగ్గా ఉంటాయని, పీహెచ్డీ చేయాల్సిందిగా గంగయ్య తరచూ ఫోనులో భార్యకు చెబుతూ ఉండేవాడు. వచ్చే సంవత్సరం చేస్తానని ఆమె భర్తతో చెప్పినట్లు బంధువుల సమాచారం. ఈ నెలలో స్వగ్రామం వచ్చిన గంగయ్యకు భార్యతో ఇదే విషయమై స్వల్ప వివాదం జరిగింది. గత బుధవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన గంగయ్య హైదారాబాద్‌లో గురువారం రాత్రి విమానం ఎక్కి లండన్ విమానం ఎక్కాడు. ఇంతలో ఏం జరిగిందో ఆ తర్వాత కొద్దిసేపటికే ఇక్కడ రమాదేవి స్వగృహంలో ఉరివేసుకొని మరణించింది. ఈ విషయాన్ని లండన్ వెళ్తున్న గంగయ్యకు సమాచారం ఇచ్చారు. రమాదేవి తల్లి కోటిరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి శనివారం మధ్యాహ్నం మార్టూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటికే శోకసంద్రంలో ముగినిపోయిన ఆ కుటుంబానికి మరో గుండెలు పగిలే వార్త తెలిసింది. లండన్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో గంగయ్య శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ ఘటనతో గ్రామంలో మరింత విషాదం అలుముకుంది. అన్నెం పుణ్యం ఎరుగని వయసులో తల్లిదండ్రులను దూరం చేసుకున్న జానకిని చూసిన వారికి నోటమాట రావటం లేదు. ఈ బిడ్డ భవిష్యత్ ఏమిటిరా భగవంతుడా అంటూ జానకి అమ్మమ్మ కోటిరత్నం హృదయవిదారకంగా రోదించటం చూపరులను కంటతడి పెట్టిచింది. గంగయ్య మృతదేహం తీసుకురావటం కోసం బంధువులు శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ వెళ్లారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..
సాక్షి, ప్రకాశం : మైన్స్ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏపీఎండీసీ అధికారులు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు చేయూతనిచ్చింది. పరిస్థితులు ఇంత చక్కగా కలిసి వస్తే గ్రానైట్ యజమానులు ఊరుకుంటారా..? అందుకే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. కలిసొచ్చిన కాలాన్ని ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అడ్డగోలుగా తవ్వుకున్నారు. హద్దులు దాటిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు విజిలెన్స్ అధికారుల దాడులలో బహిర్గతమవుతున్నాయి. గడచిన నెల రోజులుగా రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలలో తనిఖీలు చేస్తున విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. క్వారీ యజమానుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీలకతీతంగా గత నెల 16వ తేదీ నుంచి విజిలెన్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తున్నారు. మైన్స్ అధికారులు క్వారీల యజమానులకు ఇచ్చిన అనుమతులకు మించి తవ్వుకోవడం వలన రాళ్ల నిల్వల్లో భారీ తేడాలు బయట పడుతున్నాయి. తవ్వి తీసిన రాళ్లకు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన రాళ్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక క్వారీ యజమాని నెలకు 3 వేల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. దానిలో ప్రభుత్వానికి కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్లుకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. మిగిలిన 2 వేల క్యూబిక్ మీటర్లు రాయిని అడ్డదారిలో రాయల్టీ లేకుండా చెలామణి చేసుకున్నారు. కానీ, విజిలెన్స్ అధికారుల దాడులలో అలా రాయల్టీ చెల్లించని ఆ రెండు వేల క్యూబిక్ మీటర్లు రాయికి ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీ ధరతో పాటు ఆ రాయికి మార్కెట్ విలువ ఎంతయితే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫైన్‌గా వేసే పరిస్థితి ఉంది. అలా అడ్డదారిలో మొత్తం క్వారీలలో తవ్వి తీసుకున్న రాయి మొత్తాన్ని లెక్కలు కడితే దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పొంతన లేని గణాంకాలు.. రామతీర్థం క్వారీలలో జరుగుతున్న విజిలెన్స్ అధికారుల తనిఖీలలో పొంతనలేని గణాంకాలు బయటపడుతున్నాయి. క్వారీలో తవ్వి తీసిన రాళ్ల పరిమాణానికి, రికార్డులలో నమోదు చేసి ఉన్న రాళ్లకు పొంతన కుదరటం లేదనే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్వారీలో రాయిని తీసిన గుంతలో 10–15 శాతం మాత్రమే రికవరీ వస్తుందని, మిగిలిందంతా వేస్ట్, డస్ట్గాను డంపింగ్‌లలో పోస్తామని యజమానులు చెబుతున్నారు. కానీ వేస్ట్, డస్ట్ రూపంలో పోగా రికవరీ వచ్చేటువంటి 15 శాతం రాళ్ల లెక్కలు కూడా సక్రమంగా లేవనేది తనిఖీ చేసే అధికారుల వాదన. రికవరీ వచ్చేటువంటి రాళ్లలో దాదాపు సగానికి పైగా రాళ్లకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అడ్డదారులలో స్థానిక ఫ్యాక్టరీలకు, అలవెన్స్‌ల పేరుతో రాయల్టీకి పంగనామాలు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలలో బట్టబయలైంది. స్టాకులో తేడాలు ఎక్కువుగా ఉండటంతో ఇటీవల రెండు మూడు క్వారీలలో పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాకులను డంపింగ్‌లలో పెట్టి పైన మట్టిపోసి కప్పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కొన్ని క్వారీలలో మైనింగ్ ప్లాన్ ప్రకారం తవ్వకుండా ఎక్కడ రాయి వస్తే అక్కడ తవ్వుకున్నట్లు, కొన్ని చోట్ల సరిహద్దులను కూడా దాటి ఇతర క్వారీలు లేనిచోట వారికి నచ్చినట్లు తవ్వుకున్నట్లు తనిఖీలలో బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే క్వారీలలో పనిచేసే సిబ్బందికి భద్రత, వైద్యం, సంక్షేమ వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు దాడులలో తేటతెల్లమైంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివరాలను లేబర్ డిపార్టుమెంట్ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ అధికారుల దాడులు ఈనెలాఖరకు పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీలన్నీ పూర్తయ్యాక నివేదకను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం వల్ల జలాలు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. మనకు కేవలం నెలరోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుకోగలగాలి. కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయి. గోదావరిలో వరదలు తగ్గుతున్నాయి. ఆ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కంటెంజెన్సీ ప్లాన్ చేయండి అని కలెక్టర్లకు సూచించారు. అదే విధంగా... ‘ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను సేకరించండి. వాటి పంపిణీలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. కరువుకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం తగిన సహాయం చేస్తుంది. అవినీతి ఎక్కడా ఉండకూడదు. ఎమ్మార్వోలు, ఎస్సైలు, దిగువస్థాయి అధికారులకు మరోసారి చెప్పండి. ప్రజలెవరైనా వినతులతో వస్తే వారిని చిరునవ్వుతో స్వాగతించండి. కలెక్టర్లు తప్పనిసరిగా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి’ అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబరు నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. -
మార్టూరు దేనా సెంటర్లో హంగామా సృష్టించిన ఆటో డ్రైవర్
-
యువతిపై అత్యాచారం, హత్య
సాక్షి, పోరుమామిళ్ల(ప్రకాశం) : కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒంటరి యువతి కావ్య(20)ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, చేశారు. పోరుమామిళ్ల పంచాయతీ రామాయపల్లె రోడ్డు పక్కన కాలువ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా... ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకూతుర్లను పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు కలిసి ఉండి అనంతరం వారిని వదిలేయడంతో తల్లీకూతుర్లు మండల కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న కారు షెడ్డులో నివాసం ఉండేవారు. ఈక్రమంలో ఓ రోజు తహసీల్దారు కార్యాలయ భవనంపై తల్లి హత్యకు గురైంది. దీంతో కావ్య ఓంటరిదైంది. ఇదే అదునుగా కొందరు కావ్యతో వివాహేతర సంబంధం కొనసాగించారు. క్రమంగా మద్యం అలవాటు చేసి తమ కోరికలు తీర్చుకునేవారు. కాగా కావ్య మృతదేహం గురువారం రామాయపల్లె వద్ద కాలువలో పడిఉండడం, తలపై గాయాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. తల వెనుకభాగంలో బలంగా కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆటోలో తీసుకొచ్చి కాలువలో పడవేసినట్లు అనుమానిస్తున్నారు. సీఐ మోహన్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కావ్యను హత్యచేశారన్నారు. తలపై బలంగా కొట్టడంతో మృతిచెంది ఉంటుందన్నారు. ప్రస్తుతం హత్యకేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. -
సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’
వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించిన మాదిగ దండోరా ఉద్యమం ఉద్భవించి నేటికి పాతికేళ్లు పూర్తయింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వాన ఇరవైమంది యువకులతో పురుడుపోసుకున్న ఈ ఉద్యమం ఆనాటినుంచీ సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ, సమాజాన్ని సంస్కరించడం కోసం అలుపెరగని కృషి చేస్తోంది. అణగారిన కులాల ఆత్మగౌరవ పతాకగా, ప్రతీకగా పాలకులను ప్రశ్నిస్తూ ప్రజలమధ్యే నిలిచి ఉంది. సామాజిక న్యాయమంటే ‘సమాన పంపిణీ’యేనని నినదించింది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ల కోటాను కోరుతూ అంబేడ్కర్ వారసత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. ఈ ఉద్యమం తరతరాలుగా అవమానాలకూ, అన్యాయాలకూ, అణచివేతలకూ, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న జాతిని ఏకం చేసింది. జాతి మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి దాన్నొక శక్తిగా మలిచింది. నిషిద్ధాక్షరిగా మారిన ‘మాదిగ’ పదాన్ని శక్తిమంతమైన నినాదం చేసి జాతిలోని ప్రతి ఒక్కరూ తమ పేరు చివర చేర్చుకోవడమే నిజమైన, నిండైన ఆత్మగౌరవమని ప్రకటించింది. దౌర్జన్యానికి గురయ్యే జాతికి సమాజంలో గుర్తింపునూ, గౌరవాన్నీ, సామాజిక భద్రతనూ సాధించిపెట్టింది. వివిధ పార్టీల్లో మాదిగల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచింది. మాదిగ దండోరా ఉద్యమం ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, అవమానాలు, అవరోధాలు, నిందలు, నిర్బంధాలు, కష్టాలు, కన్నీళ్లు, కుట్రలు, కుతంత్రాలు అధిగమించింది. ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల సామాజిక వర్గీకరణ సమస్త అణగారిన కులాల్లో సామాజిక స్పృహను రగిల్చింది. తుడుందెబ్బ, నంగారభేరి, మోకు దెబ్బ, పూసలకేక, కుర్రు, చాకిరేవు, మాలమహానాడు, ముదిరాజ్ మహాసభ తదితర కులహక్కుల సంఘాల ఆవిర్భావంలో దండోరా ఉద్యమ ప్రభావ స్ఫూర్తే ఉంది. వివిధ మాదిగ ఉపకులాల సంఘాలను బలోపేతం చేసి వాటిల్లో సైతం నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది. ఉపకులాలవారికి ఆర్డీఓల ద్వారా కాక ఎమ్మార్వో ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా పోరాడి సాధించింది. ఏబీసీడీ వర్గీకరణ ఫలాల్లో ప్రథమ ఫలాన్ని మాదిగలకు కాకుండా వారికన్నా వెనకబడి ఉన్న రెల్లి ఉపకులాలకు అందించి కింది కులాలపట్ల తన బాధ్యతను ఆచరణాత్మకంగా నిర్వర్తించింది. అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టింది. అంతేకాదు...సందర్భం వచ్చినప్పుడల్లా మాలల పక్షపాతిగా మాదిగ దండోరా నిలబడింది. ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు, సుద్దాల దేవయ్యను చంద్రబాబు అకారణంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు వారికి అండగా నిలబడింది. ఢిల్లీలో చందర్రావు అనే మాల అధికారిపై తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్‌రావు దాడిచేసినప్పుడు, గీతారెడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోరాడింది. ఉమ్మడి అభివృద్ధికి, పురోగతికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చాలని చూసినప్పుడు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించి ఆ కుట్రలను వమ్ము చేసింది. తెలుగు నేలపై ఇంతటి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉన్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదనే ఆవేదన మాదిగ జాతిని వెన్నాడుతోంది. పాలకపక్షాలు మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనం వహించడం, ఈ ఉద్యమ ప్రభావంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాదిగ జాతి నేతలు రాజకీయ బానిసత్వం చేస్తూ ద్రోహం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మాదిగల అస్థిత్వ ఉద్యమానికి పునాదులు వేసిన ఈదుమూడి వేదికగానే ఎంఆర్పీఎస్ ‘మాదిగల ఆత్మగౌరవ జాతర’ పేరుతో జరిగే 25 వసంతాల ఉద్యమ ప్రస్థాన వేడుకలో సమరశంఖం పూరించబోతోంది. రాగల్ల ఉపేందర్ మాదిగ ‘ మొబైల్: 95736 35356 -
బ్యాంకులో అగ్నిప్రమాదం
సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : ఉలవపాడులోని భారతీయ స్టేట్ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నమంటలతో ప్రారంభమై క్యాబిన్ మొత్తం కాలి బూడిదయింది. కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు, క్లర్క్‌ల క్యాబిన్లు మంటల ధాటికి బుగ్గయ్యాయి. బంగారం భద్రపరిచే గది వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. లాకర్ రూమ్, మేనేజర్ రూమ్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో పొగతో పాటు చిన్న మంటలు రావడం బ్యాంకు పక్కన ఉన్న ఇంటి వారు గమనించారు. వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయగా వారు వచ్చి తాళాలు తెరిచేలోపు మంటలు మరింత ఎక్కువయ్యాయి. టంగుటూరు నుంచి ఫైర్ ఆఫీసర్ అంకయ్య ఆ«ధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నికీలల ధాటికి శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. క్యాబిన్లో ఉన్న మొత్తం ఫర్నిచర్, విలువైన రికార్డులు కాలి బూడిదయ్యాయని బ్యాంకు మేనేజర్ శంకర్ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు బ్యాంకు దగ్ధమైన ఘటనలో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఫైర్ బెల్, అలారమ్ కొంత కాలంగా పనిచేయడం లేదని బ్యాంకు సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులతో తెలిపారు. కానీ దానిని బాగుచేయలేదు. ప్రమాదం జరిగే సమయంలో కిటికీలు తెరచి ఉన్నాయి. బ్యాంకులో సీసీ కెమేరాల ఫుటేజీ కావాలని పోలీసులు కోరగా తమ టెక్నీషియన్ వచ్చి తీసిస్తాడని బ్యాంకు సిబ్బంది చెప్పడం గమనార్హం. సాధారణంగా పోలీసులు ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ప్రాథమిక సమాచారంతోపాటు విచారణకు ముఖ్యమైన సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారుల సమక్షంలో జరిగిన వెంటనే స్వాధీనం చేసుకోవాలి. కానీ సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేయలేదు. ఈ పరిణామాలు అగ్ని ప్రమాదంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు బ్యాంకుల్లో సేవలు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఒంగోలు ఆర్బీఓ అధికారి జానకిరామ్ తెలిపారు. చాకిచర్ల, సింగరాయకొండ, కరేడు స్టేట్ బ్యాంకుల్లో ఉలవపాడు బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన అన్ని లావాదేవీలు యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉలవపాడు బ్యాంకు సిబ్బంది మూడు బ్యాంకుల పరిధిలో అందుబాటులో ఉంటారని తెలియజేశారు. -
టీడీపీ నేతల ‘దారి’ దోపిడీ!
సాక్షి, ప్రకాశం : కందుకూరులో టీడీపీ నాయకులు ‘దారి’ దోపిడీకి తెగబడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతర్గత రోడ్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణానికి బయట ప్రదేశం నుంచి గ్రావెల్ తోలాల్సి ఉండగా, పక్కనే పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో భారీ గోతులు తవ్వి ఆ మట్టిని తరలించారు.కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద ఎన్టీఆర్ నగర్ పేరుతో నిర్మిస్తున్న జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అక్కడ నివాసం ఉండే పేదలకు మౌలిక వసతులతో పాటు అంతర్గత రోడ్లు నిర్మించాలి. అందుకోసం అప్పటి ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సింగరాయకొండ మండంలోని శానంపూడి గ్రామ వద్ద నుంచి గ్రావెల్ మట్టిని తోలి రోడ్ల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ టీడీపీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా తాము ఏమిచేసినా చెల్లుతుందని ఇష్టానూసారంగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉండగా మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో శానంపూడి నుంచి మట్టిని తొలకుండా జీప్లస్‌త్రీ భవనాల పక్కనే గతంలో మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూముల్లో మట్టి తవ్వి అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పేదలకు చెందిన 6 ఎకరాల భూమిలో 9 అడుగుల తోతున మట్టి తవ్వి.. జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద రోడ్లు వేసి నిధులు బొక్కేందుకు పథకం రచించారు. అయితే టీడీపీ ఘోర ఓటమి చెందడం.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయట పడింది. యథాస్థానానికి మట్టి తోలకం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గతంలో çపురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి స్థలాల పరిశీలన కోసం వెళ్లగా 9 అడుగుల లోతున గోతులు తవ్విన విషయం బయటపడింది. టీడీపీ నాయకులు యథేచ్ఛగా మట్టి తవ్వి జీప్లస్‌త్రీ నివాసాల వద్ద అంతర్గత రోడ్లు నిర్మిస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూశారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అధికారుల ఉదాసీన వైఖరి బయట పడటంతో తప్పును చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కమిషనర్ వి.శ్రీనివాసరావు జీప్లస్‌త్రీ ఇళ్లు నిర్మిస్తున్న కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం రెండు రోజుల నుంచి జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్లకు తోలిన మట్టిని జేసీబీ సహాయంతో మరలా పేదలకు పంపిణీ చేసిన లే అవుట్లలోని గోతులను పూడ్చే పనిని ముమ్మరం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అధికారులను ఆ పార్టీ నాయకులు ప్రలోభపెట్టి బిల్లులు చేసుకుని జేబులు నింపుకొనే వారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జీప్లస్‌త్రీ ఇళ్లకు సంబంధించిన ఓ అధికారిని వివరణ కోరగా గత ప్రభుత్వంలో టెండర్లు పిలవకుండానే టీడీపీ నాయకులు మట్టిని తోలారని, అందువల్ల ప్రభుత్వ ఆదేశాలతో రోడ్లకు సంబంధించిన పనులు రద్దు చేసినట్లు తెలిపారు. -
ప్రజాదర్బార్‌లో మంత్రి బాలినేనికి విన్నపాలు
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నివాసం ప్రజాదర్బార్ నిర్వహించారు. వీఐపీ రోడ్డు కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు సమర్పించారు. వాటిలో చేయదగిన పనులకు సంబంధించి అధికారులలో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. ఆంధ్రాబ్యాంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డీజీఎం పి.రామకృష్ణారావు, బ్యాంకు జోనల్ అధికారులు బాలినేనిని కలిసి అభినందించారు. ఏజీఎంలు పి.కృష్ణయ్య, ఎన్.గణేష్, చంద్రారెడ్డి, మెయిన్ బ్రాంచి ఏజీఎం, జోనల్ కార్యాలయం అధికారులు, మేనేజర్ పీకే రాజేశ్వరరావు తదితరులు బాలినేనిని కలిసిన వారిలో ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి బాలినేని పరామర్శించారు. అంజలి గ్రానైట్స్ అధినేత చల్లా శ్రీనివాసరావు తండ్రి చల్లా వెంకటస్వామి చికిత్స పొందుతుండంతో ఆయన్ను సంఘమిత్రలో పరామర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో 25 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్న పిల్లుట్ల సుబ్రహ్మణ్యం దేవాలయం గాలిగోపురం కోసం కంచికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన సంఘమిత్రలో చికిత్స పొందుతున్నారు. మంత్రి బాలినేని పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాలినేని స్వగ్రామం కొణిజేడులో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలువురు బాలినేనిని కలిసి అభినందించారు. ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాల గురించి సంభందిత అధికారులతో బాలినేని చర్చించారు. -
‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్ మెజార్టీ ఖాయం’
-
‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్ మెజార్టీ ఖాయం’
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదుకాని, తన కుమారుడు నారాలోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని, ఇలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని షర్మిల గుర్తుచేశారు చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరులో బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. తమకు బీజేపీ,టీఆర్ఎస్తో పోత్తు అవసరంలేదని, వైఎస్ జగన్ సింహంలా సింగిల్‌గా వస్తారని తెలిపారు. ఎన్నికల వేళ మోసం చేయడానికి మరోసారి భూటకపు హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. పసుపు కుంకుమ పథకం పెద్ద కుట్రపూరితమైనదని, చేపలకు ఎర వేసినట్లుగా.. ఓటర్లకు ఎర వేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందని.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
మరోసారి చంద్రబాబుని నమ్మెదు.. ఐదేళ్లు దోచుకున్నారు
-
మరోసారి ఓటేస్తే సర్వం దోచేస్తారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: మరోసారి చంద్రబాబు నాయుడికి ఓటువేస్తే సర్వం దోచేస్తారని వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అధివృద్ధి శూన్యమని, ఏం చేశారని మరోసారి ఓటువేయ్యాలని ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవని, పంటలకు గిట్టుబాటు ధర ఉండదని, మహిళలకు డ్వాక్రా రుణాలు ఉండవని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 1994లో మద్యపాన నిషేధం హామీతో ఎన్టీఆర్ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని.. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను ఎత్తివేశారని గుర్తుచేశారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మాట్లాడుతూ... దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాల్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్క్షప్తి చేశారు. తన సుధీర్ఘ పాదయాత్రలో అనేక మంది బాధలను విన్నానని, వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుని నమ్మతే నరరూప రాక్షసున్ని నమ్మినట్టే. అన్ని వర్గాల ప్రజలను ఆయన మోసం చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీలేదు. దివంగత వైఎస్సార్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేదు. మరోసారి టీడీపీకి ఓటువేస్తే.. హత్యలు తప్ప ఏమీ ఉండవు. కేసులు కూడా పెట్టనివ్వరు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వరు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం, అన్యాయం, అవినీతి, అధర్మం తప్ప మరేమీలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ప్రభుత్వం పాఠశాలను కూడా పూర్తిగా మూసి వేసి ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్స్‌ను ప్రారంభిస్తారు. పాదయాత్రలో చాలామంది నన్ను కలిసి వారి బాధలను నాతో పంచుకున్నారు. వారికిచ్చిన హామీ మేరకు అన్ని నెరవేరుస్తా. కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తా. వారికి సరైన జీతాలు కల్పిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. కార్మికులను ఆదుకుంటాం. పాదయాత్రలో జూనియర్ న్యాయవాదులు నన్ను కలిసి వారి బాధలను పంచుకున్నారు. మొదటి మూడేళ్ల వరకు నెలకు ఐదువేలు భృతిగా ఇస్తాం. సంఘమిత్రలకు జీతాలు పెంచుతాం. అంగన్వాడీ, ఆశ, హోంగార్డుల జీతాలను పెంచుతాం. డ్వాక్రా రుణాలను మాఫీ చేసి.. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. రైతులకు గిట్టుబాట ధర కల్పించి ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. ఆ మోసాలకు మీరు మోసపోవద్దు. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తాం. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాం. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కిరికి మేలు జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
విలేకరి శంకర్‌ను హత్య చేయించింది ప్రత్తిపాటే
సాక్షి, చిలకలూరిపేట : విలేకరి శంకర్‌ను హత్యచేయించింది, మరో విలేకరి సురేంద్రనాథ్ ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించింది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దంపతులేనని ఎస్సీ నాయకుడు పంగులూరి వెంగళరాయుడు ఆరోపించారు. ప్రత్తిపాటి దంపతుల అరాచకాలపై వార్తలు రాశాడనే అక్కసుతో శంకర్‌ను హత్య చేయించి, ఆ నేరాన్ని తనపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం నాయకులు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్‌తో కలసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరాయుడు మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజనిపై ఓడిపోతాననే భయంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను ప్రత్తిపాటి పుల్లారావు మాయమాటలు నమ్మి మంచివాడని భావించి 2014 ఎన్నికల్లో ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం నియోజకవర్గం మొత్తానికి తెలుసన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి పదవి చేపట్టాక ఆయన, ఆయన భార్య నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాల గురించి రాశాడనే కారణంతోనే విలేకరి శంకర్‌ను మంత్రి సామాజిక వర్గీయులతో హత్య చేయించి, ఆ నేరాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు శంకర్‌తో ఎలాంటి ఆస్తి తగాదాలు ఇతర వివాదాలు లేవని, అలాంటి తరుణంలో విలేకరిని హత్య చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని వివరించారు. రేషన్ బియ్యం, మట్టి, ఇసుక తదితర కుంభకోణాలకు పాల్పడిన మంత్రి, ఆయన సతీమణికి మాత్రమే విలేకర్లను చంపాల్సిన అవసరం ఉంటుందన్నారు. తన ప్రమేయం లేకపోవటంతోనే కోర్టు ఆ కేసును కొట్టివేసిన విషయం మంత్రికి బాగా తెలుసన్నారు. మరో విలేకరి మానుకొండ సురేంద్రనా«థ్ ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించిన ఘనత కూడా మంత్రి దంపతులదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ హత్య కేసు విషయమై సీబీఐతో విచారణ నిర్వహిస్తే నిజాలు వెలుగుచూస్తాయని, ఈ మేరకు తాను సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రికి దమ్ముంటే సీబీఐతో కేసును పునర్విచారణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీలో జరిగిన అవమానాలు, అపనిందలు భరించలేక తాను ఆ పార్టీని వీడి ఇటీవల వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ నాయకుడు అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గీయులను అణగదొక్కిన మంత్రి ప్రత్తిపాటికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దళితులను, పోలీసులను అరే, ఒరే .. అని సంబోధించిన ఘనత ప్రత్తిపాటి దంపతులకే సొంతమన్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి చిలకలూరిపేటలో ఉంటున్న ప్రత్తిపాటి పుల్లారావు విడదల రజనిది ఈ నియోజకవర్గం కాదని విమర్శించటం ఆయన అవివేకానికి అద్దం పడుతోందన్నారు. ఆడపిల్లకు మెట్టినిల్లే సర్వస్వం అన్న విషయం ఆయనకు తెలియకపోవటం బాధాకరమన్నారు. విలేకరి హత్య కేసుతో పాటు, మంత్రి అవినీతి కుంభకోణాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు కొప్పుల జ్యోతిరత్నబాబు, బొల్లెద్దు చిన్నా, గడ్డం వెంకట్రావు, సాతులూరి రవి, ముత్తయ్య, మూకిరి కోటి పాల్గొన్నారు. -
టీడీపీలో పీటముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల షెడ్యూల్ వెలువడి నామినేషన్ల గడువు సమీపిస్తున్నా అధికార టీడీపీలో సీట్ల కేటాయింపు కొలిక్కి రావడం లేదు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నా అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడం లేదు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వ్యవహారం మరింత చిక్కుముడిగా మారింది. దీనితో లింకుగా మారిన కనిగిరి, దర్శి అభ్యర్థుల ఎంపికకు పీటముడి పడింది. ఒంగోలు పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. దీంతో మంత్రి శిద్దా రాఘవరావును పోటీలో నిలపాలని సీఎం భావిస్తున్నారు. తాను దర్శి అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని, పార్లమెంట్‌కు మరొకరిని నిలపాలని శిద్దా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలో అర్థంకాక సీఎం తలపట్టుకుంటున్నట్లు సమాచారం. కాదూ కూడదని శిద్దా నే పార్లమెంట్ కు పోటీచేయించాలనుకున్నా .. దర్శి అసెంబ్లీతో పాటు కనిగిరి అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక మరింత తలనొప్పిగా మారింది. కనిగిరి సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డిని నిలపాలని ముఖ్యమంత్రి తొలుత నిర్ణయించారు. బాబూరావును దర్శికి పంపి శిద్దాను ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేయించాలనుకున్నారు. అయితే దర్శికి వెళ్లేందుకు బాబూరావు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అయినా ఒత్తిడి తెచ్చి బాబూరావునే దర్శికి పంపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఒక వేళ అందుకు బాబూరావు నిరాకరిస్తే ఏంచేయాలన్న దానిపై ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయం పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రి శిద్దా రాఘవరావు ఓకే అంటే ఆయనను ఒంగోలు పార్లమెంట్‌కు పంపి ఉగ్రనరసింహారెడ్డిని దర్శి అసెంబ్లీకి పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా శిద్దా దర్శి అసెంబ్లీ వైపే మొగ్గే పక్షంలో ఉగ్ర ను ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలపాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మంగళవారం సీట్ల పంచాయితీ కొలిక్కి తేవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి అమరావతికి రావాలని సీఎం మంత్రి శిద్దాతో పాటు ఉగ్రనరసింహారెడ్డి, కదిరి బాబూరావులకు కబురు పంపారు. అందరూ అమరావతికి వెళ్లారు. అయితే సీఎం బీజీగా ఉండడంతో ఉదయం జరగాల్సి సమావేశం సాయంత్రానికి కూడా జరగలేదు. బుధవారం మాట్లాడదామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు ఎంపీపీ వీరయ్యచౌదరి, మాదాల అనిత భర్త మాదాల రమేష్‌లు మంగళవారం అమరావతిలో సీఎంను కలిశారు. అందరూ సర్దుబాటు అయి బీఎన్కే మద్దతు పలకాలని ఈ సందర్భంగా సీఎం అసమ్మతి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన అసమ్మతి నేతలతో మాట్లాడి రెండు రోజుల్లో అందరినీ సర్దుబాబు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీరుపై ఆయన సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ప్రకాశం ఎస్పీకి ఆమంచి ఫిర్యాదు
-
అభాసుపాలవుతున్న బడికొస్తా పథకం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బడికొస్తా పథకం అభాసు పాలవుతోంది. విద్యాసంవత్సరం నెలరోజుల్లో ముగియనుండడంతో ఇప్పుడు సైకిళ్ల కేటాయింపులు చేయడం చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం బడికొస్తా పథకం ప్రవేశపెట్టింది. 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు బడికి చేరుకునేందుకు వీలుగా సైకిళ్ళు పంపిణీ చేస్తారు. అయితే ఈ పథకం ప్రారంభంలో బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8,9 తరగతులు చదివే విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ళు అందించేందుకు నిర్ణయించినా పాలకులు, అధికారులు స్పందించడంలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా.. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ జరగలేదు. అయితే విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం వీటిని ఆర్భాటంగా అందించేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తే విద్యాశాఖ పనితీరు అర్థమవుతుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు సైకిళ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలికలు సైకిళ్లు తొక్కుతూ వెళుతుంటే వాటిపై వేసిన స్టిక్కర్లను చూసి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని అందరికి తెలిసేందుకే చేశారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావడంతో ఎన్నికల మైలేజ్‌గానూ ఈ బడికొస్తా పధకాన్ని వాడుతున్నారనేది మరో విమర్శ వినిపిస్తోంది. నియోజకవర్గానికి 1433 సైకిళ్లు... నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాలున్నాయి. వీటిలో చీరాల మండలంలో 2016–17 విద్యాసంవత్సరానికి గాను 148 మంది విద్యార్థినులకు అందించారు. ఈ తర్వాత 2017–18 విద్యాసంవత్సరానికి ఇవ్వలేదు. అలానే వేటపాలెం మండలంలో 2017–18 గాను 178 సైకిళ్లు అందించారు. 2018–19 విద్యాసంవత్సరానికి సైకిళ్ళును అందించలేదు. హైస్కూళ్ళ వారీగా విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్రధానోపాధ్యాయులు వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. చీరాల మండలానికి 1029, వేటపాలెం మండలానికి 414 మందికి అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే సకాలంలో పంపిణీ చేయకపోవడంతో విద్యార్థినులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠశాలలకు చేరుకుంటున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి విద్యార్థినులు ఆటోలు ద్వారా వస్తున్నారు. సైకిళ్ళు పంపిణీ చేయకపోవడంతో ఆటోలు, ఇతర మార్గాల ద్వారా వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ఇదే తీరుగా ఉంది. కోడిగుడ్లు కూడా సక్రమంగా లేవు. చిన్న సైజు గుడ్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. -
మాటిస్తే కట్టుబడి ఉంటాం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసేది లేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో నూర్‌బాషాల సంఘ రాష్ట్రస్థాయి ఆత్మీయ సదస్సు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్కే నాగూర్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలినేని మాట్లాడుతూ నూర్‌బాషాలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్రెడ్డి బీసీలకు కేటాయించినట్లుగా గుర్తు చేశారు. అవకాశం ఉన్న చోట తప్పని సరిగా నూర్‌బాషాలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండ్ సెంటర్లో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని బాలినేని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతులు లభించే అవకాశం లేనందున, పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటుకు నాడు అధికారులు అంగీకరించకపోతే కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి అనుమతులను ఇప్పించినట్లుగా గుర్తు చేశారు. ఆ విశ్వాసం కూడా ఆయన మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్‌కు లేదన్నారు. పార్టీ «అధికారంలోకి రాగానే విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ సీఎం అయితే సమస్యల పరిష్కారం.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నూర్‌బాషాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. టీడీపీ బీసీలను కరివేపాకులా వాడుకుందని విమర్శించారు. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నూర్‌బాషాలు వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటులు, వైఎస్సార్ సీపీ నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే పాతికేళ్ల పాటు జనం హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. దివంగత వైఎస్సార్ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జగన్ ప్రతి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయన అండగా ఉంటారని వివరించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. నూర్‌బాషా సంఘం ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఓ.రసూల్ సాహెబ్, సంఘ నాయకులు పలు అంశాలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఆయన ఈ సమస్యలన్నీ విని అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంఘ నేతలు మస్తాన్(గుంటూరు), ఎస్ఎస్ బాబ్జి (ఉంగుటూరు), నిజాం (అనంతపురం), కరిముల్లా (చిత్తూరు), ఖాజా(కర్నూలు), మున్నీ(విశాఖ), రహీం(విజయవాడ)లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి ఖాశింపీరా, పార్టీ నూర్‌భాషాల సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి ఇమాంబాషా, చిన్నబాషా, హుస్సేన్ సైదులు, షేక్ శ్రీనుబాషా, మస్తాన్, లాల్, టైలర్ ఖాశిం తదితరులు పాల్గొన్నారు. నూర్‌బాషాల డిమాండ్లు ఇవీ.. నూర్‌బాషాలకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అబ్దుల్ కలాం విగ్రహాల ఏర్పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులతో పాటు వక్ఫ్‌బోర్డ్‌లో ప్రాధాన్యం రాజధానిలో 5 ఎకరాల స్థలం కేటాయించి అందులో సామాజిక భవన నిర్మాణం రూ.2 లక్షల సబ్సిడీతో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు 4 చక్రాల వాహనాలకు రుణ సదుపాయం 45 ఏళ్లు దాటిన దూదేకుల వృత్తి వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు. -
ప్రేమ పెళ్లి.. యువతి కిడ్నాప్
కంభం : ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన కంభంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం రమణీయపేటకు చెందిన డి.విజయ్ రంజన్, వలవల క్రాంతి తేజ కాకినాడలో బీ ఫార్మసీ చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలుసుకుని సుమారు పది రోజుల క్రితం కాకినాడ నుంచి ఓ కారులో కంభం వచ్చారు. గత నెల 22వ తేదీన రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో వివాహం చేసుకున్న అనంతరం గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అనంతరం కంభంలోని విజయరంజన్ బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. నూతన దంపతులు కంభంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న క్రాంతితేజ కుటుంబ సభ్యులు మరో 20 మందితో కలిసి గురువారం కంభం వచ్చారు. నూతన దంపతుల కోసం గాలిస్తుండగా తమ ప్రాంతానికి చెందిన నంబర్ ప్లేటుతో ఉన్న కారు వారి కంటపడింది అందులో ఉన్న విజయ్ రంజన్‌ను పట్టుకొని మందలించగా వారిని క్రాంతి తేజ వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం క్రాంతితేజ, వారి వద్ద ఉన్న ల్యాప్ టాప్, ఇతర వస్తువులు తీసుకెళ్లిపోయారు. భర్త విజయరంజన్ తన భార్యను ఆమె పెదనాన్న వలవల వెంకటేశ్వర్లు, బాబాయి బాబ్జి, మరో 20 మందికిపైగా రౌడీలు వచ్చి తనపై దాడి చేసి దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న బంగారు గొలుసు, కెమెరా కూడా తీసుకెళ్లిపోయినట్లు ఫిర్యాదులో బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ వై.శ్రీహరి తెలిపారు. సుమారు పది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్లో క్రాంతితేజ కనబడటం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు అక్కడ మిస్సింగ్ కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. భర్త ఇక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
ఉరిమే ఉత్సాహం
జిల్లాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో ఆరంభమైన వైఎస్సార్ సీపీలో చేరికల పర్వం ఆ తర్వాత మరింత ఊపందుకుంది. పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ ఇలా ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్‌ల చేరికలతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ సీపీలో చేరారు. ఈనెల 13న హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఆమంచి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం అమరావతిలో వైఎస్ జగన్ ఆమంచికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితో పాటు ఆయన సోదరుడు స్వాములు, నియోజకవర్గానికి చెందిన అనుచర గణం పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన సీనియర్ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లు కూడా బుధవారం అమరావతిలో జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారితో పాటు పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి అనుచర గణం మొత్తం పార్టీలో చేరింది. అటు ఆమంచి, ఇటు దగ్గుబాటిలు బుధవారం ఉదయమే నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో వైఎస్ జగన్ గృహ ప్రవేశం, పార్టీ కార్యాలయ ప్రారంభానికి తరలివెళ్లారు. అక్కడే జగన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వీరి చేరికతో అటు చీరాల, ఇటు పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. వీరందరి రాక జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేలా చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో క్లీన్ స్వీప్ అంటున్న కేడర్.. ఇప్పటికే కందుకూరుకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆతర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌లో చేరారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా దగ్గుబాటితో పాటు ఎమ్మెల్యే ఆమంచి సైతం వైఎస్ఆర్సీపీలో చేరడంతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు జిల్లాకు చెందిన మరి కొందరు ముఖ్యనేతలు త్వరలోనే అధికార పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో వైఎస్సార్ సీపీకి తిరుగుండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డీలా పడిన టీడీపీ.. వైఎస్సార్ సీపీ జోష్‌తో అధికార టీడీపీ జిల్లాలో డీలా పడింది. వరుసపెట్టి ముఖ్య నేతలందరూ ఆ పార్టీని వీడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న ఒకరిద్దరు ముఖ్యనేతలు ఆపార్టీని వీడితే వారు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థి«గా పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలిపితే ఎన్నికలకయ్యే ఖర్చు తామే భరిస్తామని ముఖ్యమంత్రి ఆఫర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పోటీ చేసేందుకు అభ్యర్థే దొరకని పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని ఎలా ఢీ కొట్టగలమని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తంగా అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు పార్టీ కండువా కప్పుతున్న జగన్(ఫైల్) పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్లను ౖÐð ఎస్సార్ సీపీలోకి ఆహ్వానిస్తున్న ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఫైల్) -
‘క్రీడా’క్రమణ
ఒంగోలు టౌన్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎంచక్కా అనుసరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు అధికారం ఉండగానే దానిని సొంతం చేసుకోవాలకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దానికొక క్రీడా శిక్షణ పేరు పెట్టారు. క్రీడల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలంటూ నగర పాలక సంస్థకు ‘అధికార’పార్టీ హోదాలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏకంగా ‘క్రీడా’క్రమణకు పాల్పడ్డాడు. నగరంలో విలువైన స్థలాన్ని క్రీడా శిక్షణ పేరుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మునిసిపల్ స్థలం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మట్టిని తరలించి చదును చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. నగరపాలక సంస్థ నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అధికార పార్టీ అండతో ఆ స్థలంలో తాను అనుకున్న క్రీడా శిక్షణకు తుదిరూపు ఇచ్చాడు. ఇక్కడ శిక్షణ ఇస్తామంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. దానిని నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ‘జీ హుజూర్’ అన్నట్టు వ్యవహరిçస్తుండటంతో ఆ క్రీడా శిక్షకుడు హద్దులు గీసుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఆచ్చి బూచ్చి ఒంగోలు నగరంలోని ఒక వ్యక్తికి ఆచ్చి అనేది నిక్ నేమ్. తన పేరుకు ముందు ఆ పేరుతో పిలిపించుకుంటాడు. షటిల్ ఆటలో తన ప్రావీణ్యాన్ని శిక్షణ రూపంలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ క్రీడా శిక్షకుడు ఎంచుకున్న స్థలాలే వివాదాస్పదం అవుతున్నాయి. కలెక్టరేట్లో టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నిస్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని ఆచ్చి పరం చేసేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్ ఆవరణలోని స్థలాన్నే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. దీనిని మరువకముందే మరో మునిసిపల్ స్థలంపై ఆ శిక్షకుడి కన్ను పడింది. ఒంగోలు నగర నడిబొడ్డున ఊరచెరువులో ఖాళీగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు క్రీడా శిక్షణను తెరపైకి తీసుకువచ్చాడు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఊర చెరువులోని షాదీఖానాకు వెనుకవైపు ఉన్న నగర పాలక సంస్థ అధీనంలోని స్థలానికి సరిహద్దులు వేసుకొన్నాడు. స్కేటింగ్ రింక్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అనధికారికంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. పేదలకో న్యాయం పెద్దలకు మరో న్యాయం.. ఒంగోలు నగరంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక ఎక్కడైనా నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే నగర పాలక యంత్రాంగం పోలీసు బలగంతో అక్కడకు చేరుకొని దానిని తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేదుకాదు. కోట్ల విలువైన స్థలాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని మాత్రం పల్లెత్తు మాట అనే సాహసం నగర పాలక సంస్థ అధికారులు చేయడం లేదు. అందుకు కారణం సదరు వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆశీస్సులు ఉండటమే. పరిశీలనలో ఉంది: కార్పొరేషన్ కమిషనర్ ఒంగోలు నగరంలోని ఊరచెరువు స్థలంలో క్రీడాశిక్షణకు సంబంధించి అసోసియేషన్ తరపున స్థలం కేటాయించమని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెంకటకృష్ణ చెప్పారు. ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, పరిశీలనలోనే ఉందన్నారు. ఈ విషయమై విచారించిన తరువాత అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు నోట్ ఫైల్ పెడతామని తెలిపారు. -
టార్గెట్ చీరాల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నిబంధనలకు పాతరేస్తోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన చోట తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులను నియమించుకుంటోంది. రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు జారీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ విధానాలపై విరక్తి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే రోజు అధికార పార్టీ చీరాల పరిధిలో పని చేస్తున్న పోలీస్ అధికారుల బదిలీలకు తెరలేపింది. చీరాల డీఎస్పీ అల్లూరి శ్రీనివాసరావుతో పాటు పట్టణ సీఐ నాగరాజు, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిలను బుధవారం బదిలీ చేశారు. కొత్త డీఎస్పీగా నాగరాజును నియమించారు. పట్టణ సీఐగా రాజామోహన్రావును నియమించగా రూరల్ సీఐగా బేతపూడి ప్రసాద్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీకి మద్దతుదారుగా పేరు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ నాగరాజు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో పనిచేశారు. ఒంగోలు టౌన్ ఎస్సైగా, సీఐగా, ఎస్బీ డీఎస్పీగా పనిచేశారు. చీరాల సీఐగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలోని సింగరాయకొండలో ఆయనకు బంధువులు ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రకు సన్నిహితుడిగా నాగరాజుకు పేరుంది. చీరాలకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి పాలేటి రామారావుతో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాంతోనూ నాగరాజుకు సత్సంబంధాలు ఉన్నాయి. పై పెచ్చు టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా ఆయనకు పేరుంది. ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులకు గురుచేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ నాగరాజుకు చీరాల డీఎస్పీగా నియమించినట్లు సమాచారం. అది కూడా ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసిన రోజే పాత డీఎస్పీ శ్రీనివాసరావును బదిలీ చేసి నాగరాజును చీరాలకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ సీఐగా సీతారామయ్యను సైతం బుధవారమే బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే చీరాల సీఐగా ఈయన బాధ్యతలు చేపట్టారు. ఆమంచికి ముఖ్యుడుగా ఉన్నారన్న అక్కసుతోనే ఆయనను బదిలీ చేసి ఆయన స్థానంలో రాజమోహన్‌రావును కొత్త సీఐగా నియమించారు. రాజమోహన్‌రావు జిల్లాలోని దోర్నాల, మార్కాపురం, నాగులుప్పలపాడు తోపాటు ఒంగోలు సీసీఎస్, డీసీఆర్బీలలో పనిచేశారు. 2017లో సీఐగా పదోన్నతి రాగా రైల్వేకు విభాగానికి వెళ్లారు. ఆయనను ప్రస్తుతం చీరాల పట్టణ సీఐగా నియమించారు. ఇక రూరల్ సీఐగా ఉన్న భక్తవత్సలరెడ్డిని తప్పించి బేతపూడి ప్రసాద్‌ను నియమించారు. బేతపూడి ప్రసాద్ ఎమ్మెల్సీ కరణం బలరాంకు వీర విధేయుడు. 2015 నుంచి మూడేళ్ల పాటు అద్దంకి సీఐగా పనిచేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి పెట్టి బేతపూడి ప్రసాద్‌ను అక్కడి నుంచి బదిలీ చేయించారు. ప్రసాద్ కోసం కరణం పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు చీరాల రూరల్ సీఐగా బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేశారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీనీ విడి వైఎస్ జగన్‌ను కలిసిన అదే రోజు డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలను ఉన్నతాధికారులు బదిలీ చేయడంపై విమర్శలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. కీలక అధికారుల బదిలీకి కసరత్తు.. ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులు పెట్టేందుకే ప్రభుత్వం అక్కడ ఉన్న పోలీసు అధికారులను తప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. చీరాల నియోజకవర్గ పరిధిలో ఎస్సైల బదిలీలు సైతం జరగనున్నట్లు సమాచారం. పోలీసు విభాగమే కాకుండా చీరాల పరిధిలో రెవెన్యూతో పాటు కీలక అధికారుల బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతగా దిగజారి కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజాబలంతో అన్నింటిని ఎదుర్కొంటామని ఆమంచితో పాటు ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఈ నగరానికి ఏమైంది?
జిల్లా కేంద్రంలోని ఒంగోలు నగరం నడిబొడ్డునున్న కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రాంతమది. అక్కడ నివసించే మూడు కాలనీల ప్రజలకు నిత్యం మురుగుతో యుద్ధం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఇళ్లల్లో కూడా ఉండలేని దుస్థితి. కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేకపోగా, ఇతర కాలనీల్లోని మురుగంతా అక్కడకొచ్చి చేరుకుంటుంది. దీనికి తోడు ఇక్కడికి సమీపంలో ఉన్న చేపల మార్కెట్లో వ్యర్ధాలన్నీ ఈ కాలనీల్లోని కాలువల్లో వచ్చి చేరుతున్నాయి. నీరు, ఇతర వ్యర్ధాలు బయటకు పోయే మార్గం లేక ఐదడుగుల వెడల్పు కాల్వలు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. వినియోగంలో లేని కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు నగర నడిబొడ్డున ఈ కాలనీల దుస్థితి చూసి సిగ్గు పడాలి. ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా పోతురాజు కాలువలోకి మురుగు నీరు వెళ్లేందుకు ఇటీవల కాలువ నిర్మించారు. నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన నగర పాలక సంస్థ అధికారులకు రాలేదు. కాలువలు నిర్మించామా లేదా.. అవి ప్రజలకు కనబడుతున్నాయా లేదా. అంతేచాలు అన్నట్లుగా ఉంది నగర పాలక సంస్థ అధికారుల తీరు. కాలువలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా నిర్మించిన కాలువకు కనెక్షన్ ఇస్తే ఇక్కడి మంగళపాలెం, చాకలివారివీధి, వడ్డిపాలెం కాలనీవాసులకు కష్టాలు తొలగుతాయి. మెయిన్ లైన్ కాలువకు కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఆ మూడు కాలనీలపై దాడి చేస్తూనే ఉన్నాయి. నిత్యం.. ప్రాణ సంకటం.. ఆ మూడు కాలనీల్లో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. శనివారం మాత్రం చేపల మార్కెట్లోని వ్యర్థాలన్నీ ఆ కాలువ గుండా ఇళ్ల మధ్యకు చేరుకున్నాయి. అసలే దుర్గంధం వెదజల్లుతూ, దోమల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఆ కాలనీవాసుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. చేపల వ్యర్ధాలతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి ప్రాణసంకటంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఆ కాలువలో పడిపోయిన ఓ చిన్నారిని అదృష్టవశాత్తు గమనించి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అభివృద్ధి అంటే ఇదేనా..? ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశానంటూ పదేపదే చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు ఒంగోలు నగరంలోని ఈ మూడు కాలనీల్లో పర్యటిస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కాలనీల ప్రజలతో కలిసి శనివారం ఆయన కాలువ గట్టుపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టర్ల కోసం కాలువలు కట్టడం తప్పితే ప్రజల కోసం కాదని విమర్శించారు. చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఈ మూడు కాలనీల్లోకి వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఊరచెరువులో ఏడు ఎకరాల స్థలం ఉందని, దానిలో నుంచి అద్దంకి బస్టాండు మీదుగా మురుగు నీరు చెరువులోకి వెళ్లే మార్గం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాలువలు తవ్వి వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. -
గాడిన పడిన గ్రానైట్
చీమకుర్తి: జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు కూడా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు రూ.67 నుంచి రూ.68 ఉండే డాలర్ రేటు ఏడాదిగా రూ.71 నుంచి రూ.72 మధ్య ఉంటుంది. దాని వలన క్యూబిక్ మీటర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ రాయి 1000 డాలర్ల వరకు పలుకుతోంది. ఇది ఇండియన్ కరెన్సీలో సరాసరి రూ.72 వేల ధర పలుకుతోంది. లోకల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఇటీవల అధికం కావడం, లోకల్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. అదను కుదరటంతో ప్రభుత్వం కూడా గ్రానైట్ నుంచి రావలసిన రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం సమకూరుతోంది. ఏటా పెరుగుతున్న రాయల్టీ ఆదాయం.. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ నుంచి మూడేళ్లుగా తీసిన రాళ్ల పరిమాణం కూడా పెరుగుతున్నట్టు మైన్స్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. వాటి మీద వచ్చే రాయల్టీ ఆదాయం ఏటికేడు పెరుగుతున్నట్లు గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. 2016–17లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని క్వారీ నుంచి తీయగా, 2017–18లో 4.5 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2018–19లో జనవరి నాటికే 3.9 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి తీశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 80 వేల క్యూబిక్ మీటర్లు తీసే అవకాశం ఉంది. దానితో ఈ సంవత్సరం 4.71 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి వస్తుంది. తీసిన రాయిపై ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీ ప్రకారం 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2018–19లో ఇప్పటికే గడిచిన జనవరి నాటికి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది. నెలకు సరాసరిన రూ.14 కోట్లు ఆదాయం వస్తున్నందున మిగిలిన రెండు నెలలకు కలిపితే మొత్తం రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లతో పోల్చుకుంటే ఒక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారానే రూ.131 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇక బ్లాక్ గ్రానైట్ ద్వారా రూ.17 కోట్లు, కలర్ గ్రానైట్ ద్వారా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. మూడు రకాల గ్రానైట్ల నుంచి రూ.192 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇక ఖాళీగా ఉన్న గ్రానైట్ భూములను లీజులకు ఇచ్చిన వాటి నుంచి డెడ్‌రెంట్ వసూలు చేస్తారు. క్వారీలకు ఇచ్చిన భూములు, రోడ్డు మెటల్, గ్రావెల్ నుంచి డెడ్‌రెంట్ ద్వారా కనీసం రూ.10 కోట్లు ఆదాయం వస్తున్నట్లు మైన్స్ అధికారుల ద్వారా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. అన్ని కలిపితే జిల్లాలోని గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం కేవలం రాయల్టీ ద్వారా వస్తున్నట్టు స్పష్టమవుతోంది. బ్లాకుల వారీగా రాయల్టీ రేట్లు.. గ్రానైట్ రాళ్లకు వాటి పరిమాణాన్ని బట్టి రాయల్టీని వసూలు చేస్తారు. సూపర్ గ్యాంగ్సా, మినీ గ్యాంగ్సా, కట్టర్‌సైజ్, ఖండాస్ అనే నాలుగు రకాలుగా విభజిస్తారు. బ్లాక్ గెలాక్సీ, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లకు వేర్వేరుగా రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. ఇప్పుడు వసూలు చేసే రాయల్టీ ధరలను 2015 నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. వాస్తవానికి రాయల్టీ ధరలను ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. అమలు చేస్తున్న ధరలు మూడేళ్లయిలైనా వాటిని అలాగే అమలు చేస్తున్నారు. -
పింఛన్ల పండుగ.. ప్రాణం మీదకొచ్చింది
ఒంగోలు టౌన్/కంభం: పండుగ పింఛన్‌దారుల ప్రాణం మీదకు వచ్చింది. ఇప్పటివరకు అందుకుంటున్న పింఛన్ల మొత్తాన్ని పెంచిన ప్రభుత్వం వారి ఇళ్ల వద్ద ఇవ్వకుండా అందరినీ ఒకచోటకు రప్పించి పండుగ పేరుతో ఇవ్వాలన్న ప్రయత్నం లబ్ధిదారుల ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఇళ్ల వద్ద ప్రశాంతంగా అందుకుంటున్న పింఛన్లను గుంపులు గుంపులుగా ఒక్కచోట చేర్చారు. ఒంగోలు మినీ స్టేడియం వద్దకు పిలిపించిన యంత్రాంగం అక్కడ ప్రసంగాలు జరిగేలోపు పండుటాకులు నీరసపడిపోయారు. కొందరు పింఛన్ల పెంపు మొత్తాన్ని అందుకోకుండానే స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఒక వృద్ధురాలు తలకు గాయం కూడా అయింది. ఇవేమీ పట్టించుకోని యంత్రాంగం వరుసపెట్టి ప్రసంగాలు చేసుకుంటూ వెళుతూ పింఛన్‌దారులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను వారిపాటికి వారిని వదిలేశారు. దీంతో అనేకమంది పింఛన్‌దారుల్లో తాము రెట్టింపు పింఛన్ పొందామన్న ఆనందం కంటే ప్రాణాలమీదకు తెచ్చుకున్నామన్న ఆవేదనే కనిపించింది. జన జాతర.. సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. వృద్దాప్య, వితంతు, దివ్యాంగులతోపాటు ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, హిజ్రాలందరినీ ఒకేచోటకు తీసుకువచ్చి వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పొదుపు గ్రూపు మహిళలకు పసుపు, కుంకుమ కింద ప్రతి గ్రూపు సభ్యురాలుకు పదివేల రూపాయల చొప్పున దశలవారీగా ఇస్తామని ప్రకటించి వారిని కూడా ఒకేచోటకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పింఛన్‌దారులను, మెప్మా పొదుపు గ్రూపు సభ్యులను తరలించే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. శనివారం నుండి సోమవారం వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలకు నగదును అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలిరోజైన శనివారం 1æ నుంచి 16 డివిజన్ల వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలను మినీ స్టేడియంకు తరలించారు. ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పింఛన్‌దారులు, పొదుపు గ్రూపు మహిళల తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మినీ స్టేడియంకు వచ్చారు. ముఖ్యమంత్రి సభను తలపించే విధంగా మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అంతా గందరగోళం.. పింఛన్ల కోసం వేలాదిగా మినీ స్టేడియానికి చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు సంబంధించిన వ్యక్తిగత ప్రచార ఫెక్సీలే అధికంగా ఉన్నాయి. ప్రాంగణమంతా మహిళలతో నిండి ఉండటంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారిని సరిగా గైడ్ చేసేవారు లేకపోవడంతో బారికేడ్లకు అటూ ఇటూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరకు తమకు కేటాయించిన కౌంటర్ల వద్దకు వెళ్లేసరికి అక్కడ గుంపులు గుంపులుగా ఉండటంతో ఆ రద్దీని తట్టుకోవడం అనేక మందికి ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా పింఛన్ల కోసం వచ్చిన వారిలో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్పృహ తప్పి తలకు గాయమై.. ముక్తినూతలపాడుకు చెందిన మాణిక్యమ్మ వృద్ధాప్య పింఛన్ తీసుకునేందుకు వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒంగోలు మినీ స్టేడియానికి చేరుకొంది. పింఛన్ తీసుకునేందుకు అటూ ఇటూ తిరగడంతో స్పృహ తప్పి పడిపోయింది. చివరకు తలకు గాయమైంది. 108వాహనంలో రిమ్స్‌కు పింఛన్లు పొందేందుకు వచ్చిన వారిలో కొంతమంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వైద్య బృందానికి ఈ సమాచారం చేరవేయడంతో హుటాహుటిన 108ను రప్పించి రిమ్స్‌కు తరలించారు. కాపు కళ్యాణ మండపం వద్ద నివసిస్తున్న దానమ్మ, ముక్తినూతలపాడుకు చెందిన వరికూటి వెంకాయమ్మ, గోపాలనగర్‌కు చెందిన సుబ్బరావమ్మలు స్పృహ తప్పి కింద పడటంతో వారిని రిమ్స్‌కు తరలించారు. ‘భోజన’ పాట్లు పింఛన్లు పొందేందుకు, పసుపు కుంకుమ కింద నగదు తీసుకునేందుకు వేలాది మంది మహిళలు మినీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ ప్రకటించారు. మినీ స్టేడియం పక్కనే ఉన్న స్థలంలో షామియానాలు ఏర్పాటుచేసి భోజనాలు పెట్టారు. వందలాది మంది రావడంతో భోజనాలకు ఇబ్బంది పడ్డారు. చివరకు భోజనం ప్లేట్ల కోసం ఎగబడాల్సిన దుస్థితి నెలకొంది. చివర్లో వచ్చిన వారికి పెరుగుతో సరిపుచ్చారు. ఎన్సీసీ క్యాడెట్లు, నర్సింగ్ స్టూడెంట్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకున్నారు. అయితే ఎన్సీసీ క్యాడెట్ల చేత దామచర్ల జనార్ధన్‌రావు పేరుతో తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన క్యాలెండర్లను మహిళలకు పంపిణీ చేయించడంపట్ల విమర్శలు వినిపించాయి. కార్యక్రమానికి హాజరైన మహిళల నుదుటున కుంకుమతోపాటు గంధం పూశారు. పని పోగొట్టుకొని వచ్చా: లాజర్ చిన్న తనం నుంచే తన కుమారుడు నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. మంచానికే పరిమితమైన తన కుమారుడికి పింఛన్ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడకు వచ్చి పింఛన్ తీసుకోకుంటే ఇవ్వమని చెప్పారు. దాంతో తాను పని పోగొట్టుకొని తన కుమారుడిని తీసుకువచ్చాను. ఇక్కడ గంటల తరబడి ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. పెరిగిన పింఛన్ కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినప్పటికీ పట్టించుకోలేదు. పెంచిన పింఛన్ ఇళ్ల వద్ద ఇస్తే బాగుంటుంది. ఇలా ఇక్కడకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నాడు కేశవరాజుగుంటకు చెందిన గద్దల లాజర్. -
కట్టుకున్నోడిని కాటికి పంపింది
-
ప్రకాశం జిల్లా రిమ్స్ అస్పత్రిపై కిమ్స్ మాస్టర్ ప్లాన్
-
ఫ్రంట్ పేరు చెబితే ఉలుకెందుకు?
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ నేతలు జరిపిన చర్చలను వక్రీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ రాద్దాంతానికి తెర లేపారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించిందని అన్నారు. శనివారం ఒంగోలు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ జగన్మోహన్రెడ్డిని కలిసినప్పటి నుంచి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో లేని టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ పొత్తులు పెట్టుకుందని ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా టీఆర్ఎస్ కలిసి వస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసి ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి జరిగిన చర్చలను చంద్రబాబు వక్రీకరించి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాపీల బాబును ప్రజలు నమ్మరు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుకనే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచారన్నారు. నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే నాలుగేళ్ల నుంచి పింఛన్ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కాపీల బాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే పింఛన్ రూ.2 వేలకు పెంచారన్నారు. ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయంతో హడావుడిగా పెంచిన పింఛన్ అమలుకు పూనుకున్నారన్నారు. ఆటో, ట్రాక్టర్లకు పన్నుల రద్దు జగన్ ప్రకటించిన నవరత్నాల్లోనివేనని ప్రస్తావించారు. చంద్రబాబు ఇంకా రైతుబంధు పథకం కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారన్నారు. కనీసం ఎన్నికల సమీపంలోనైనా ప్రజలకు కొంత మేలు జరుగుతుందంటే అది ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చలవేనన్నారు. చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లల్లో తెలుగుదేశం చేసిన అభివృద్ధి లేకపోగా ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని లూఠీ చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో చంద్రబాబు ఉలికిపాటుకు గురవుతున్నారని, జగన్‌కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఉద్వేగానికి లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: రామకృష్ణ
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి పది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రచారంలో తప్ప... రాష్ట్రంలో అభివృద్ధి ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల స్టెంట్లో భాగంగానే చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పని చేస్తున్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
రూ.14.23 కోట్లు వృథా
సాక్షి, సింగరాయకొండ: నిధులు మంజూరయ్యాయి.. ఇక తమ కష్టాలు తీరతాయి.. పుష్కలంగా పంటలు పండుతాయనుకున్న రైతన్న ఆశలు నెరవేరలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి అన్నదాతలకు నిరాశే మిగిల్చింది. సింగరాయకొండ ప్రాంత రైతాంగానికి ప్రధాన నీటి వనరు అయిన పీబీ (పాలేరు–బిట్రగుంట) సప్లయ్ చానల్‌కు కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. కానీ,ఆ ప్రభుత్వ హయాంలో 50 శాతం కూడా పని జరగలేదని, తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా పని చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు కూడా జరగ లేదని రైతులంటుండగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మాత్రం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుండటం విశేషం. పీబీ సప్లయ్ చానల్ ఆయకట్టు.. ఈ చానల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని తొమ్మిది మీడియం ఇరిగేషన్ చెరువులకు పాలేరు పై జిల్లెళ్లమూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్ నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్ ద్వారా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట చెరువుకు, సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ పంచాయితీలో చవిటిచెరువు, మూలగుంటపాడు పంచాయతీలో జువ్వలగుంట చెరువు, పాకల పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు, పాంచ్ చెరువు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రాజు చెరువు, మర్రిచెరువు, కొండ్రాజుగుంట చెరువు, బింగినపల్లి పంచాయతీలోని బింగినపల్లి చెరువుకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల పరిధిలో సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 10 వేల ఎకరాలలో అనధికారికంగా సాగవుతోంది. ఈ చానల్ పరిధిలోని చెరువుల కింద ప్రధానంగా రబీలో వరి సాగు చేస్తారు. చెరువులు ఏటా రెండు సార్లు నిండితేనే ఆయకట్టులో పంట పూర్తిగా పండుతుంది. పూడికతో ఉన్న చానల్,రిజర్వాయర్.. రిజర్వాయర్ వద్ద ఇసుక మేట కారణంగా వర్షపునీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో పూడిక తీయాలని ఆయకట్టు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. రిజర్వాయర్ కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పాటు రిజర్వాయర్ చుట్లూ చుట్టు పక్కల గ్రామాల రక్షిత మంచినీటి పధకం బోర్లు ఉండటంతో తమ మంచినీటి స్కీములు దెబ్బతినే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అడ్డుపడటంతో రాజకీయ ప్రాబల్యం కారణంగా పూడికతీయక పోవటంతో చానల్ సక్రమంగా పారక ఆయకట్టు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. నాడు రెండు పంటలు.. పీబీ చానల్లో పూడిక పేరుకు పోయి ఉండటంతో సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆయకట్టు రైతులు నడుంబిగించి సొంతంగా చానల్లో పూడిక తొలగించుకుని రెండు పంటలు పండించారు. తరువాత చానల్లో పూడికపేరుకు పోవడం, వర్షాభావ పరిస్థితులు తోడవటంతో ఒక్క పంటే పండిస్తున్నారు. జపాన్ నిధులు మాయం.. చానల్ అభివృద్ధికి 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్ పనులు నాసిరకంగా చేయడంతో పాటు 50 శాతం పనులు కూడా చేయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి నిధుల వినియోగానికి కాలపరిమితి ముగిసే లోపు 90 శాతం పనులు చేసినట్లు అధికా>రులు ప్రకటించడంతో రైతాంగం విస్తుపోయింది. ప్రశ్నార్థకంగా వరిసాగు.. పీబీ చానల్ పరిధిలోని ఆయకట్టు రైతాంగం గత మూడేళ్లగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆయకట్టు రైతులు వరిసాగు కన్నా జామాయిల్ సాగుపై ఆశక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా నిరుడు కేవలం 600 ఎకరాలలో వరిసాగు చేయగా, ఈ సంవత్సరం కేవలం 100 ఎకరాలలో వరి కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఏటా చానల్లో సుమారు 10 నుంచి 15 రోజుల పాటు పారగా నిరుడు 5 రోజులు మాత్రమే నీరు పారింది. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా పారలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ విజయలక్ష్మి మాట్లాడుతూ రిజర్వాయర్ వద్ద ఆనకట్ట అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇతర పనులకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. -
ఓట్ల కోసం వంచన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు పెన్నా–గోదావరి అను సంధానంతో 2019 నాటికి జిల్లాలోని ఆయకట్టుకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా వాసులను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా నాగార్జున సాగర్‌కు నీరు చేరినా జిల్లాలోని సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు చంద్రబాబు సర్కారు నీరిచ్చిన పాపాన పోలేదు. గత ఏడాది సాగర్‌లో 580 అడుగుల మేర నీరు చేరింది. ఈ ఏడాది సైతం 582 అడుగుల నీరు వచ్చింది. కాని సర్కారు జిల్లా పరిధిలోని 4.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చిన పాపాన పోలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో సాగర్‌లో 545 అడుగులమేర నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు పూర్తి ఆయకట్టుకు నీరిచ్చారు. ఈ ఏడాది 582 అడుగుల మేర సాగర్‌కు నీరు చేరినా ప్రభుత్వం 1.85 లక్షల మాగాణిలో సగం పొలానికి కూడా నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఆరుతడి పంటలకు సైతం సక్రమంగా నీరు అందే పరిస్థితి లేదు. ఎన్నికల వేళ కొత్త పల్లవి.. నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావంతో జిల్లా రైతాంగం అతలాకుతలమైనా బాబు సర్కారుకు పట్టలేదు. తీరా ఎన్నికల కోసం పెన్నా–గోదావరి అనుసంధానమంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. గోదావరి నది నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువలోకి నీటిని తరలిస్తారట. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని చేర్చి బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మొత్తంగా 5 దశల్లో నీటిని ఎత్తి పోసి నకరికల్ వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని మల్లిస్తారట. ఈ రకంగా సాగర్ కుడికాలువ పరిధిలోని 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తారట. మొత్తం పనులు పూర్తి చేసి 2019 నాటికి సాగర్ కుడికాలువ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నాలుగున్నరేళ్ల పాటు ఇవేమి పట్టించుకోని చంద్రబాబుకు తీరా ఎన్నికల వేళ పెన్నా–గోదావరి అను సంధానం గుర్తొచ్చింది. ఓట్ల కోసమే చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వని చంద్రబాబు ఇప్పుడు గోదావరి–పెన్నా ద్వారా నీరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మొదలేపెట్టని ప్రాజెక్టును పూర్తి చేసి 2019 నాటికే నీరిస్తామని బాబు చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు వ్యవసాయమన్నా..రైతులన్నా ప్రేమలేదు. ఏ మాత్రం ప్రేమ ఉన్నా జిల్లాలో అరకొర పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరిచ్చేవారు కానీ ఆయన పట్టించుకోలేదు. నాలుగున్నరేళ్లలో వాటి జోలికి వెళ్లలేదు. ప్రాజెక్టుల జోలికి వెళ్లని బాబు.. ప్రకాశం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో 4.43,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 885 గ్రామాలకు తాగునీటిని అందించే వెలిగొండ ప్రాజెక్టుకు పేరుకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రూ.3వేల కోట్ల నిధులిచ్చి 75 శాతం పనులను పూర్తి చేసిన ఘనత దివంగతనేత వైఎస్‌ది. మిగిలిన 25 శాతం పనులు రూ.1640 కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉన్నా నాలుగున్నరేళ్లలో చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. పై పెచ్చు రూ.990.49 కోట్లు ఖర్చు చేసినట్లు బాబు సర్కారు చూపిస్తున్నా 5 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. వెలిగొండ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రాజెక్టు అంచనాలను రూ.2634 కోట్లకు పెంచుకున్నారు తప్పించి పనులు వేగవంతం చేయలేదు. 60 సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్లను మార్చి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా ఇప్పటికి పనులు మొదలు కాలేదు. అంచనా వ్యయం పెంచిన సర్కారు 2018 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని చెప్పినా నెరవేరలేదు. 2019లో కూడా పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే వెలిగొండ పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంచనాలు పెంచుకున్నారు... గుండ్లకమ్మ ప్రాజెక్టుది ఇదే పరిస్థితి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుండ్ల ప్రాజెక్టుకు ’592.18 కోట్లు నిధులుఇచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. 2008 నవంబర్ 24న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్. అదే ఏడాది 45 వేల ఎకరాలకు నీరిచ్చారు. తరువాత కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు కింద 60 వేల ఎకరాలకు నీరిచ్చారు. కేవలం 23 ఎకరాల భూమిని సేకరించి మిగిలిన పోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే 80వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించడంతో పాటు లక్షలాది మంది దాహార్తి తీర్చవచ్చు. రూ.13 కోట్లతో పూర్తి అయ్యే పనుల అంచనాలను రూ.161.65 కోట్లకు పెంచుకున్నారు. అయినా నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయలేదు. చంద్రబాబుకు ప్రాజెక్టులన్నా, రైతాంగమన్నా ప్రేమ లేదనడానికి ఇదో ఉదాహరణ. ఇక నాగార్జున సాగర్ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌లో నీరు ఉన్నప్పుడు కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా బాబు సర్కారుకు తట్టడం లేదు. దీంతో నాలుగేళ్లుగా కరువులతో జిల్లా రైతాంగం కుదేలైంది. తిండి గింజలు, పశువులకు గ్రాసం దొరకక రైతాంగం అల్లాడి పోతోంది. అయినా చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం కనికరం లేదు. కళ్లముందున్న నీటిని కూడా ఆయకట్టుకు ఇవ్వని సర్కారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోదావరి–పెన్నా అను సంధానం చేసి నీరిస్తామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్కార్పియోను ఢీకొన్న లారీ: 10 మంది మృతి
వెలిగండ్ల: ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం స్కార్పియో, లారీ ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందినవారిలో 9 మంది ప్రకాశం జిల్లాకు చెందినవారు. వారు డోంగర్‌గఢ్ సమీపంలోని మా బమలేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భిలాయ్‌లోని క్యాంప్–1లో నివాసముంటున్న 13 మంది శనివారం డోంగర్‌గఢ్‌లోని మా బమలేశ్వరీ దేవి ఆలయానికి స్కార్పియో వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఉదయం 7 గంటల సమయంలో సోమ్ని గ్రామం సమీపంలో రాజనందగావ్– దుర్గ్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), శెట్టి వెంకటలక్ష్మీ (27), హనుమంతునిపాడు మండలం మంగంపల్లికి చెందిన పాపాబత్తుని పెద్ద మంగయ్య (30), ఆయన భార్య పాపాబత్తుని వెంకటలక్ష్మి(25), పాపాబత్తుని మనీషా(15), సీఎస్‌పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి ఆదినారాయణ(32), ఆయన భార్య సావిత్రి (28), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన అండ్ర విజయ్‌కుమార్(32), ఆయన భార్య నాగమణి (25) అక్కడికక్కడే మృతి చెందారు. శెట్టి వెంకటలక్ష్మి భర్త శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి బాబు, మంగంపల్లికి చెందిన పాపాబత్తుని మహేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. కుడారి ఆదినారాయణ, భార్య సావిత్రిల ఏకైక కుమారుడు నితీష్(5) ప్రాణాలతో బయటపడ్డాడు. -
అన్న,వదినలపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
-
రాజన్న పాలనలోనే రైతులు ఆనందంగా ఉన్నారు
సంతమాగులూరు (ప్రకాశం): దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు పంటలు పండి ఆనందంగా ఉన్నారని నియోజకవర్గ ఇన్చార్జి బీసీహెచ్ గరటయ్య అన్నారు. గురువారం స్థానిక కేఎంసీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఏమి చేసింది లేదని అభివృద్ధిలో చంద్రబాబుకు సున్నా మార్కులు వచ్చాయన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మంచి ప్రజాదరణ వస్తుందన్నారు. సంతమాగులూరు మండల అధ్యక్షుడుగా ఎంపికైన అట్లా పెద వెంకటరెడ్డిని అభినందించారు. అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంతమాగులూరు మండలమే కీలకమన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఆనంతరం జిల్లా కార్యదర్శి అట్లా చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ 2019 అద్దంకి నియోజకవర్గానికి గరటయ్య పోటిచేస్తారని ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అట్లా వారి కుటుంబంతో పాటు ప్రజలతో సహకరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోరిశపాడు కన్వీనర్ మద్ది గోపి, నాయకులు రఫీ, ముసలారెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ తిరుపతి స్వామి, మీరా, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, గుంటూరు శ్రీను, ప్రసాదరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అద్దంకిరూరల్: జమిలీ ఎన్నికలు వస్తాయి అని కేంద్రం సూచనలు ఇస్తున్న సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నియోకవర్గ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీసీహెచ్ గరటయ్య అన్నారు. గురువారం అద్దంకి పట్టణంలోని 2వ వార్డులోని గరటయ్య కాలనీ, 1వ వార్డు, 8వ వార్డులోని ఎస్టీ కాలనీ, 19వ వార్డులో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను బూత్ కమిటీ కన్వీనర్లు ప్రజలకు వివరించాలన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లే పార్టీకి మూలస్తంభాలు వంటివారన్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదిగా కన్వీనర్లు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, గరటయ్య కాలనీ ఆచారి, నాగార్జునాచారి, నరేంద్ర, పరిమి ప్రసాద్ బూత్ కన్వీర్లు, సభ్యులు, పాల్గొన్నారు. నేటి నుంచి మండల స్థాయి సమావేశాలు అద్దంకి రూరల్: నేటి నుంచి మండలాల వారీగా కమిటీ కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి బీసీహెచ్ గరటయ్య తెలిపారు. శుక్రవారం అద్దంకిలోని శ్రీనివాస కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే ఉదయం 9 గంటలకు పంగులూరులో, 21వ తేది శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు హాజరు కావాలని తెలిపారు. -
పసిపిల్లపై అత్యాచారయత్నం
అర్ధవీడు (ప్రకాశం): అభంశుభం తెలియని పసిపిల్లను అత్యాచారం చేయబోయిన ఓ కామాంధుడికి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మండల కేంద్రమైన అర్ధవీడులో బుధవారం రాత్రి చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు స్థానిక అహ్మద్‌నగర్‌కు చెందిన షేక్ గులాంరసూల్ పూటుగా మద్యం సేవించి తన ఇంటి పక్కన ఉన్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని వాము దొడ్డిదగ్గరకు తీసుకుపోయి అత్యాచారయత్నం చేయడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఏమైంది ప్రశ్నించగా.. ఏడుస్తూ విషయం తెలిపింది. స్థానికులు గులాంరసూల్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులను, పసిపాపను విచారించి నిం దితుడిపై ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసినట్లు ఎస్సై రామానాయక్ తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కంభం ప్రభుత్వ పౌరసరఫరాల గోడౌన్లో కూలీగా పనిచేస్తున్నట్లు బాధితులు తెలిపారు. అత్యాచారయత్నానికి గురైన బాలికను వైద్యపరీక్షల నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
నాగులుప్పలపాడు (ప్రకాశం): అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నిడమానూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సురేష్ సమాచారం మేరకు కొరిశపాడు మండలం గ్రామానికి చెందిన స్వర్ణ అనూష (22)కు నిడమానూరు గ్రామానికి చెందిన స్వర్ణ నాగార్జునతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. ఇటీవల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు రేగాయి. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు నాగార్జున బంధువులు తెలిపారు. కానీ అనూష కుటుంబ సభ్యులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ మురళీకృష్ణ పరిశీలించారు. నిర్జీవంగా పడి.. అద్దంకి రూరల్: వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని వెంపరాల గ్రామానికి చెందిన కంచర్ల మాధవి (24) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెంది పడి ఉంది. ఆమె మామయ్య చూసి ఇరుగుపొగురువారిని పిలిచి చూపించాడు. స్థానికులు ఎస్సై సుబ్బరాజుకి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. -
ప్రేమ పెళ్లి.. భార్య చెల్లిపై పశువాంఛ
సాక్షి, ఒంగోలు: పన్నెండేళ్ల బాలికపై అక్క భర్త అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. బాలిక మూడో నెల గర్భిణి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కొల్లిబోయిన భానుచందర్ ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అతను ఒంగోలులోని ఓ యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అయినా అత్తమామలే ఆదరించి తమతో ఉండేందుకు అవకాశం కల్పించారు. భానుచందర్ భార్య చెల్లెలు ఏడో తరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్న సమయంలో బాలికను మాయమాటలు చెప్పి భానుచందర్ లొంగదీసుకున్నాడు. ఎవరికైనా చెబితే తిడతారని బాలిక మౌనంగా ఉంది. శారీరక సమస్యలు తలెత్తడం, వాంతులు చేసుకుంటుండటంతో బాలికను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా.. గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భిణి అని తేల్చారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరం అని.. అబార్షన్‌కు యత్నించినా బాలిక ప్రాణానికి ప్రమాదం అని వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను విచారించి భానుచందరే నిందితుడని తెల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఒంటరితనం భరించలేక.. అమెరికాలో తెలుగు యువకుడు!
సాక్షి, పామూరు : ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్, అమెరికాలో రైలు కిందపడి ఆత్మహత్య పాల్పడ్డాడు. దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల కుమారుడు దీపక్. ఎంఎస్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురయ్యేవాడని తెలుస్తుంది. టెక్సాస్ బిమౌంటులో రైలు కిందపడి దీపక్ సూసైడ్ చేసుకున్నట్లు అమెరికా నుంచి బంధువులకు సమాచారం అందింది. దీంతో పామూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేసిన యువకుడు