మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హవా చూపించింది.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హవా చూపించింది. కృష్ణా జిల్లాలో మొత్తం 41 ఎంపీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. వీటిలో వైఎస్ఆర్సీపీ 25 స్థానాల్లోను, టీడీపీ 14 స్థానాల్లోను, కాంగ్రెస్, సీపీఐ ఒక్కో స్థానంలోను గెలిచాయి.
ప్రకాశం జిల్లాలో 115 స్థానాలకు కౌంటింగ్ పూర్తి కాగా వాటిలో వైఎస్ఆర్సీపీ 56 స్థానాలను, టీడీపీ 47 స్థానాలను, ఇతర పార్టీలు 12 స్థానాలను గెలుచుకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 49 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, వాటిలో వైఎస్ఆర్సీపీ 27, టీడీపీ 22 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ మూడు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మండలాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది.