
కాలువలో పడి ఉన్న కావ్య మృతదేహం
సాక్షి, పోరుమామిళ్ల(ప్రకాశం) : కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒంటరి యువతి కావ్య(20)ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, చేశారు. పోరుమామిళ్ల పంచాయతీ రామాయపల్లె రోడ్డు పక్కన కాలువ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా... ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకూతుర్లను పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు కలిసి ఉండి అనంతరం వారిని వదిలేయడంతో తల్లీకూతుర్లు మండల కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న కారు షెడ్డులో నివాసం ఉండేవారు. ఈక్రమంలో ఓ రోజు తహసీల్దారు కార్యాలయ భవనంపై తల్లి హత్యకు గురైంది. దీంతో కావ్య ఓంటరిదైంది.
ఇదే అదునుగా కొందరు కావ్యతో వివాహేతర సంబంధం కొనసాగించారు. క్రమంగా మద్యం అలవాటు చేసి తమ కోరికలు తీర్చుకునేవారు. కాగా కావ్య మృతదేహం గురువారం రామాయపల్లె వద్ద కాలువలో పడిఉండడం, తలపై గాయాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. తల వెనుకభాగంలో బలంగా కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆటోలో తీసుకొచ్చి కాలువలో పడవేసినట్లు అనుమానిస్తున్నారు. సీఐ మోహన్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కావ్యను హత్యచేశారన్నారు. తలపై బలంగా కొట్టడంతో మృతిచెంది ఉంటుందన్నారు. ప్రస్తుతం హత్యకేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment