
ప్రకాశం పంతులకు నివాళి
కడప సెవెన్‌రోడ్స్ :
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్బంగా మంగళవారం ఏడురోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి పలువురు జిల్లా అధికారులు, అనధికారులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉదయమే కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు హరిప్రసాద్, సుభాన్‌బాష, గోవర్దన్‌రెడ్డి తదితరులు ప్రకాశం పంతుల త్యాగనిరతి, రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు.