సంతమాగులూరులో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌చార్జి గరటయ్య
సంతమాగులూరు (ప్రకాశం): దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు పంటలు పండి ఆనందంగా ఉన్నారని నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీహెచ్ గరటయ్య అన్నారు. గురువారం స్థానిక కేఎంసీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ కన్వీనర్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఏమి చేసింది లేదని అభివృద్ధిలో చంద్రబాబుకు సున్నా మార్కులు వచ్చాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మంచి ప్రజాదరణ వస్తుందన్నారు. సంతమాగులూరు మండల అధ్యక్షుడుగా ఎంపికైన అట్లా పెద వెంకటరెడ్డిని అభినందించారు. అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంతమాగులూరు మండలమే కీలకమన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
ఆనంతరం జిల్లా కార్యదర్శి అట్లా చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ 2019 అద్దంకి నియోజకవర్గానికి గరటయ్య పోటిచేస్తారని ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అట్లా వారి కుటుంబంతో పాటు ప్రజలతో సహకరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోరిశపాడు కన్వీనర్ మద్ది గోపి, నాయకులు రఫీ, ముసలారెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ తిరుపతి స్వామి, మీరా, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, గుంటూరు శ్రీను, ప్రసాదరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
అద్దంకిరూరల్: జమిలీ ఎన్నికలు వస్తాయి అని కేంద్రం సూచనలు ఇస్తున్న సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నియోకవర్గ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీసీహెచ్ గరటయ్య అన్నారు. గురువారం అద్దంకి పట్టణంలోని 2వ వార్డులోని గరటయ్య కాలనీ, 1వ వార్డు, 8వ వార్డులోని ఎస్టీ కాలనీ, 19వ వార్డులో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను బూత్ కమిటీ కన్వీనర్‌లు ప్రజలకు వివరించాలన్నారు. బూత్ కమిటీ కన్వీనర్‌లే పార్టీకి మూలస్తంభాలు వంటివారన్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదిగా కన్వీనర్‌లు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, గరటయ్య కాలనీ ఆచారి, నాగార్జునాచారి, నరేంద్ర, పరిమి ప్రసాద్ బూత్ కన్వీర్‌లు, సభ్యులు, పాల్గొన్నారు.
నేటి నుంచి మండల స్థాయి సమావేశాలు
అద్దంకి రూరల్: నేటి నుంచి మండలాల వారీగా కమిటీ కన్వీనర్‌లతో సమావేశాలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీహెచ్ గరటయ్య తెలిపారు. శుక్రవారం అద్దంకిలోని శ్రీనివాస కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే ఉదయం 9 గంటలకు పంగులూరులో, 21వ తేది శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్‌లు హాజరు కావాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment