
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఒంగోలు: పన్నెండేళ్ల బాలికపై అక్క భర్త అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. బాలిక మూడో నెల గర్భిణి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కొల్లిబోయిన భానుచందర్ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. అతను ఒంగోలులోని ఓ యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అయినా అత్తమామలే ఆదరించి తమతో ఉండేందుకు అవకాశం కల్పించారు.
భానుచందర్ భార్య చెల్లెలు ఏడో తరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్న సమయంలో బాలికను మాయమాటలు చెప్పి భానుచందర్ లొంగదీసుకున్నాడు. ఎవరికైనా చెబితే తిడతారని బాలిక మౌనంగా ఉంది. శారీరక సమస్యలు తలెత్తడం, వాంతులు చేసుకుంటుండటంతో బాలికను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా.. గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భిణి అని తేల్చారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరం అని.. అబార్షన్‌కు యత్నించినా బాలిక ప్రాణానికి ప్రమాదం అని వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను విచారించి భానుచందరే నిందితుడని తెల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment