ప్రకాశం : నిన్న సాయంత్రం ఇంట్లో సూసైడ్ నోట్ పెట్టి బయటకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు శవమై తేలిన సంఘటన ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అద్దంకికి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ గురువారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్తున్న సమయంలో సూసైడ్‌నోట్ రాసి ఇంట్లో పెట్టి వెళ్లాడు.
శుక్రవారం మధ్యాహ్నం గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి 15వ గేటు వద్ద మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. పెళ్లి కావాల్సిన వాడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందటే రక్త పరీక్షలు చేయించుకున్న అతడికి హెచ్‌ఐవీ ఉందని తెలియడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గుండ్లకమ్మలో కొట్టుకొచ్చిన శవం
Published Fri, May 29 2015 4:06 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement