
ప్రియుని నిర్వాకం తెలిసి ఒకరి ఆత్మహత్య
బెళగావిలో ఎంబీఏ విద్యారి్థని మృతి కేసులో మలుపు
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతదేహం వేలాడుతున్నా చూడకుండా..
ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్‌కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది.
దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్‌ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.