Private school teacher
-
హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది?
నల్లకుంట(హైదరాబాద్): ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ఎల్రక్టీషియన్ సయ్యద్అసద్ తన కుటుంబసభ్యులతో కలిసి విద్యానగర్ అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద కుమార్తె వహెద ఉన్నీస(18) అడిక్‌మెట్ అచ్యుతారెడ్డి మార్గ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూలాగే ఈనెల 26న ఉదయం 10 గంటల సమయంలో తండ్రి తన బైక్‌పై కుమార్తెను స్కూల్ వద్ద వదిలి వచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు చూసినా.. స్కూల్‌కు వెళ్లిన కుమార్తె ఇంటికి రాలేదు. దీంతో తండ్రి కుమార్తె పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి విచారించగా.. ఆమె ఉదయం 10.15 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం చెప్పారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం.. -
నాడు ఆమె ఓ ప్రైవేట్ టీచర్ నేడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థాయికి..
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కేవలం కొద్ది వారాల్లోనే జిల్లా పరిషిత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఆమె చేసుకున్న వివాహమే ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మమూన్ షా ఇటీవలే ఆమ్ ఆద్మీపార్టీలో చేరారు. గత 20 ఏళ్లుగా ఆయన సామాజిక సేవలో ఉన్నారు. తన నియోజక వర్గంలో పోలియో నిర్మూనల కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు రాంపూర్ నగర్ పాలికా పరిషిత్ చైర్పర్సన్ పదవికి పోటీ చేయాలనకున్నారు. అయితే అది మహిళలకు రిజర్వ్ చేయబడి ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ క్రమంలోనే సనా ఖానం అనే ప్రైవేట్ టీచర్ని ఏప్రిల్ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం వెంటనే జిల్లా పరిషిత్ చైర్పర్సన్ పదవికి నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగింది సనా. ఆ తర్వాత ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొందింది. దీంతో మొన్నటి వరకు అక్కడ ఓ ప్రైవేటు టీచర్‌గా ఉన్న ఆమె సడెన్‌గా చైర్పర్స్న్ స్థాయికి చేరుకుంది. ఈ మేరకు సనా ఖానం మాట్లాడుతూ..తాను ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశానని, సాధ్యమైనంత త్వరితగతిన ఉత్తమంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తన భర్త , ప్రజల మద్దతు ఉండటం వల్లే ఈ ఎన్నకల్లో గెలవగలిగానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, సనా ఖానం భర్త మమూన్ షా మాట్లాడుతూ..సంక్షోభ సమయంలో ప్రజలకు తోడుగా ఉన్నందు వల్లే తమకు ఇన్ని ఓట్లు పడ్డాయన్నారు. గత 40 ఏళ్లుగా ఆజం ఖాన్‌కు మాత్రమే ఓటు వేసిన ప్రజలు ఈ సారి తమకు ఓటేశారని ఆనందంగా చెప్పారు. వారికి సాయం చేసింది తానేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాగా, ఆజం ఖాన్‌కి కంచుకోటగా భావించే జిల్లాలో ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సనా ఖానం 43,121 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి మసరత్ ముజీబ్ 32,173 ఓట్లతో రన్నరప్‌గా నిలిచారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి) -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు
బన్సీలాల్‌పేట్: కరోనా కాటుకు ఎన్నో జీవితాలు కకావికలం అయ్యాయి. పలువురు ఉపాధి కోల్పోయి వీధి పాలయ్యారు. ఇదే కోవలో ప్రైవేటు టీచర్ల పరిస్ధితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బడి పంతుళ్లు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు చిరు వ్యాపారులుగా మారి పొట్టపోసుకుంటున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోలక్పూర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ స్కూల్ అధినేత శివరామకృష్ణ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బతుకు దెరువు కోసం తప్పనిసరి అయిందని బోలక్పూర్ సెయింట్ సాయి హైస్కూల్ అధినేత శివరామకృష్ణ్ణ సాక్షితో వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు) -
విద్యార్థి తలపై కొట్టిన టీచర్
నాగోలు: ఎల్బీనగర్ బైరామల్‌గూడలోని ఓ స్కూల్లో జరిగిన గొడవపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఎల్బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హస్తినాపురం వెంకటరమణ కాలనీ చెందిన కపిల్‌గౌడ్ కుమారుడు సాయి ఇషాన్(9) బైరామల్‌గూడలోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం క్లాస్ రూమ్‌లోకి వచ్చిన డ్రాయింగ్ టీచర్ శ్రీను నోటుబుక్‌లో పేజీలు ఎందుకు చించావంటూ ఇషాన్ తలపై కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబసభ్యులు అతడిని హస్తినాపురంలో నవీన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థి తండ్రి స్కూల్‌కు వచ్చి టీచర్ వైఖరిపై నిలదీయగా స్కూల్ యాజమాన్యం అతడి పట్ల దురుసుగా ప్రవర్తించింది. . బాలుడిపై దాడి చేసిన డ్రాయింగ్ టీచర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి తాత వెంకటయ్య ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి తండ్రి దాడి చేశాడని ఫిర్యాదు.. కాగా సాయి ఇషాన్ తండ్రి కపిల్‌గౌడ్ తతను దుర్భాషలాడటమేగాకుండా దాడి చేశాడని, ప్రిన్సిపాల్, టీచర్లు అడ్డుకున్నా వినకుండా చంపేస్తానంటూ బెదిరించాడని డ్రాయింగ్ టీచర్ శ్రీను ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిని కొట్టిచంపిన టీచర్
బందా/లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ టీచర్ ఎనిమిదేళ్ల చిన్నారిని గొడ్డును బాదినట్టు బాదడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన బందా జిల్లాలోని సాదిమదన్పూట్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, ఘటనకు కారణమైన టీచర్ జైరాజ్‌ను అరెస్టు చేశామని పోలీస్ అధికారి ఎల్బీ కుమార్ పాల్ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
వివాహేతర సంబంధంతో ఇద్దరి హత్య
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బీసీ సంఘం అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ స్వామితో పాటు ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కల్పనను దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రాజగోపాలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం... హిందూపురం సమీపంలోని బెవనహళ్లి వద్ద నారాయణ స్వామి ఓ హౌసింగ్ వెంచర్ వేశారు. తన ఇన్నోవా వాహనంలో కల్పనతో కలసి నారాయణ స్వామి ఆదివారం వెంచర్ వద్దకు వెళ్లారు. దుండగులు అక్కడే వారిద్దరిని బండరాళ్లతో కొట్టి కత్తులతో నరికి చంపారు. అనంతరం నారాయణస్వామి వాహనంలో పరారయ్యారు. మంగళవారం వెంచర్ వద్ద మృతదేహాలను ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు బాగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి. వాటిని పోస్ట్‌మార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే వీరిద్దరి హత్య జరిగి ఉంటుందని సీఐ తెలిపారు. -
నిద్రమాత్రలు మింగి టీచర్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: ఓ టీచర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మీగా పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండ్లకమ్మలో కొట్టుకొచ్చిన శవం
ప్రకాశం : నిన్న సాయంత్రం ఇంట్లో సూసైడ్ నోట్ పెట్టి బయటకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు శవమై తేలిన సంఘటన ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అద్దంకికి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ గురువారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్తున్న సమయంలో సూసైడ్‌నోట్ రాసి ఇంట్లో పెట్టి వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి 15వ గేటు వద్ద మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. పెళ్లి కావాల్సిన వాడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందటే రక్త పరీక్షలు చేయించుకున్న అతడికి హెచ్ఐవీ ఉందని తెలియడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కుమార్తె సహా వివాహిత అదృశ్యం
బెంగళూరులో ఉన్నట్లు సమాచారం ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు, పోలీసులు భర్త తెలిపిన సమాచారంపై పోలీసుల అనుమానం విజయవాడ సిటీ/పటమట : బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు కుమార్తెను తీసుకొని వెళ్లి అదృశ్యమైన ప్రైవేటు పాఠశాల అధ్యాపకురాలు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గణతంత్ర వేడుకల బందోబస్తు సమయంలో ఆమె అదృశ్యం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిం చింది. ఆమె అదృశ్యం వెనుక కారణాలను అన్వేషిస్తూనే.. మరో వైపు వివిధ ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఆమె ఆఖరిసారిగా ఎప్పుడు? ఎవరితో మాట్లాడిందీ? తెలుసుకునేందుకు పోలీసులు మొబైల్ కాల్ డేటా సేకరణలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగళూరులోని ఓ అరబిక్ మదర్సాలో ఉన్నట్టు సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. న్యూ రాజీవ్‌నగర్‌కి చెందిన షేక్ నజీర్‌బాషా బెంజిసర్కిల్ సమీపంలోని ఓ చెప్పుల కంపెనీ షోరూమ్‌లో పని చేస్తున్నారు. ఇతని భార్య రహమున్నిసా లబ్బీపేటలోని ఓ ప్రైవేటు ఉర్దూ పాఠశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తోంది. వీరికి అప్సా తబిసి, సాదియా తబిసి సంతానం. మచిలీపట్నంలోని బంధువుల ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె రెండో కుమార్తె సాదియాతో కలిసి బెంజిసర్కిల్ సమీపంలో మినీవ్యాన్ ఎక్కింది. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో భర్త ఆమెను ఆటో ఎక్కించాడు. అరగంట గడిచిన తర్వాత ఆటోలోని ప్రయాణికులందరూ దిగిపోయినట్టు భర్తకు ఫోన్లో తెలిపింది. ఆపై స్టేజీలో ఎవరైనా ప్రయాణికులు ఎక్కితే వెళ్లమని, లేకుంటే దిగి మరో ఆటో మారమని భర్త చెప్పారు. కొద్ది సేపటికి ముందు సీట్లో మరో వ్యక్తి ఎక్కినట్టు చెప్పిన కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ అయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భర్త పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం వరకు కూడా విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో ఆమె ఆచూకీ దొరకడం కుటుంబసభ్యులు, ఇటు పోలీసులకు ఊరట కలిగించింది. బెంగళూరుకు పోలీసు బృందం ఆమెను తీసుకొచ్చేందుకు పటమట పోలీసు బృందం అక్కడికి బయలుదేరింది. భర్తను తీసుకొని ఇక్కడి నుంచి బెంగుళూరు పోలీసు బృందం వెళుతున్నట్టు పటమట ఇన్స్పెక్టర్ కె.దామోదర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..అదృశ్యమైన ఆమె సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తాను బెంగళూరులోని ఓ అరబిక్ కాలేజీ మదర్సాలో ఉన్నట్టు భర్త, కుటుంబ సభ్యులకు తెలిపింది. మదర్సా ఇన్చార్జి ఫోన్ ద్వారా ఆమె భర్తతో మాట్లాడింది. అక్కడికి ఎందుకు వెళ్లిందనే విషయమై ఆరా తీసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఆ విషయాలన్నీ తన భర్తకు తెలుసని చెప్పినట్టు తెలిసింది. ఆమె ఆచూకీ విషయం తెలిసిన వెంటనే పటమట పోలీసులకు ఆమె భర్త విషయం చెప్పాడు. పోలీసులు అక్కడి ఇన్చార్జితో మాట్లాడి ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు. ఆటో ఎక్కలేదా? మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంజిసర్కిల్ సమీపంలో మినీ వ్యాన్ ఎక్కించినట్టు భర్త చెప్పి విషయాల్లో వాస్తవం ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పామర్రు వరకు వెళ్లే వరకు తనతో ఆమె ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులకు భర్త తెలిపాడు. అంత దూరం వెళ్లిన ఆమె వెనుదిరిగే అవకాశాలు లేవని చెపుతున్నారు. ఆమె వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.