
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment