నాడు ఆమె ఓ ప్రైవేట్‌ టీచర్‌ నేడు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ స్థాయికి.. | Private School Teacher Became UP Civic Body Head | Sakshi
Sakshi News home page

ఓ సామాన్య ప్రైవేట్‌ టీచర్‌ కొద్ది వారాల్లోనే జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ స్థాయికి..

May 16 2023 8:10 PM | Updated on May 16 2023 8:37 PM

Private School Teacher Became UP Civic Body Head  - Sakshi

ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ కేవలం కొద్ది వారాల్లోనే జిల్లా పరిషిత్‌ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. ఆమె చేసుకున్న వివాహమే ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న మమూన్‌ షా ఇటీవలే ఆమ్‌ ఆద్మీపార్టీలో చేరారు. గత 20 ఏళ్లుగా ఆయన సామాజిక సేవలో ఉన్నారు. తన నియోజక వర్గంలో పోలియో నిర్మూనల కోసం విశేషంగా కృషి చేశారు.

ఆయనకు రాంపూర్‌ నగర్‌ పాలికా పరిషిత్‌ చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేయాలనకున్నారు. అయితే అది మహిళలకు రిజర్వ్‌ చేయబడి ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ క్రమంలోనే సనా ఖానం అనే ప్రైవేట్‌ టీచర్‌ని ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం వెంటనే జిల్లా పరిషిత్‌ చైర్‌పర్సన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసి పోటీకి దిగింది సనా. ఆ తర్వాత ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొందింది. దీంతో మొన్నటి వరకు అక్కడ ఓ ప్రైవేటు టీచర్‌గా ఉ‍న్న ఆమె సడెన్‌గా చైర్‌పర్స్‌న్‌ స్థాయికి చేరుకుంది.

ఈ మేరకు సనా ఖానం మాట్లాడుతూ..తాను ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశానని, సాధ్యమైనంత త్వరితగతిన ఉత్తమంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తన భర్త , ప్రజల మద్దతు ఉండటం వల్లే ఈ ఎన్నకల్లో గెలవగలిగానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, సనా ఖానం భర్త మమూన్‌ షా మాట్లాడుతూ..సంక్షోభ సమయంలో ప్రజలకు తోడుగా ఉన్నందు వల్లే తమకు ఇన్ని ఓట్లు పడ్డాయన్నారు. గత 40 ఏళ్లుగా ఆజం ఖాన్‌కు మాత్రమే ఓటు వేసిన ప్రజలు ఈ సారి తమకు ఓటేశారని ఆనందంగా చెప్పారు. వారికి సాయం చేసింది తానేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాగా, ఆజం ఖాన్‌కి కంచుకోటగా భావించే జిల్లాలో ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన సనా ఖానం 43,121 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి మసరత్ ముజీబ్ 32,173 ఓట్లతో రన్నరప్‌గా నిలిచారు.

(చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement