Civic Body Polls
-
నాడు ఆమె ఓ ప్రైవేట్ టీచర్ నేడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థాయికి..
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కేవలం కొద్ది వారాల్లోనే జిల్లా పరిషిత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఆమె చేసుకున్న వివాహమే ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మమూన్ షా ఇటీవలే ఆమ్ ఆద్మీపార్టీలో చేరారు. గత 20 ఏళ్లుగా ఆయన సామాజిక సేవలో ఉన్నారు. తన నియోజక వర్గంలో పోలియో నిర్మూనల కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు రాంపూర్ నగర్ పాలికా పరిషిత్ చైర్పర్సన్ పదవికి పోటీ చేయాలనకున్నారు. అయితే అది మహిళలకు రిజర్వ్ చేయబడి ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ క్రమంలోనే సనా ఖానం అనే ప్రైవేట్ టీచర్ని ఏప్రిల్ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం వెంటనే జిల్లా పరిషిత్ చైర్పర్సన్ పదవికి నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగింది సనా. ఆ తర్వాత ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొందింది. దీంతో మొన్నటి వరకు అక్కడ ఓ ప్రైవేటు టీచర్‌గా ఉన్న ఆమె సడెన్‌గా చైర్పర్స్న్ స్థాయికి చేరుకుంది. ఈ మేరకు సనా ఖానం మాట్లాడుతూ..తాను ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశానని, సాధ్యమైనంత త్వరితగతిన ఉత్తమంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తన భర్త , ప్రజల మద్దతు ఉండటం వల్లే ఈ ఎన్నకల్లో గెలవగలిగానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, సనా ఖానం భర్త మమూన్ షా మాట్లాడుతూ..సంక్షోభ సమయంలో ప్రజలకు తోడుగా ఉన్నందు వల్లే తమకు ఇన్ని ఓట్లు పడ్డాయన్నారు. గత 40 ఏళ్లుగా ఆజం ఖాన్‌కు మాత్రమే ఓటు వేసిన ప్రజలు ఈ సారి తమకు ఓటేశారని ఆనందంగా చెప్పారు. వారికి సాయం చేసింది తానేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాగా, ఆజం ఖాన్‌కి కంచుకోటగా భావించే జిల్లాలో ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సనా ఖానం 43,121 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి మసరత్ ముజీబ్ 32,173 ఓట్లతో రన్నరప్‌గా నిలిచారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి) -
బీజేపీ నేత మెడలో చెప్పుల దండ
-
బీజేపీ నేతకు అవమానం.. మెడలో చెప్పుల దండ
సాక్షి, భోపాల్ : ఓ బీజేపీ నేతకు తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు అనూహ్యంగా బూట్ల దండ వేసి స్వాగతం పలికారు. దీంతో అప్పటి వరకు హుషారుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని అన్నారు. తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో థామ్నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే బీజేపీ నేత ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఓట్లు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అంతే తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో ఇక తప్పదని చెప్పుల దండ వేయించుకున్నాడు. అనంతరం ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను ఇలా చేశానని అన్నారు. ఇక దండ వేయించుకున్న బీజేపీ నేత దినేశ్ మాత్రం ఆ చర్యపట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. అయితే, ఈ సమస్యపై తాము మాట్లాడబోతున్నామని చెప్పారు. -
చరిత్ర సృష్టించిన బీజేపీ
భోపాల్: వ్యాపం కుంభకోణంలో ఉక్కిరిబిక్కిరయిన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట. మధ్యప్రదేశ్ పురపాలక సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఎంపీలో అన్నీ మున్సిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇది ప్రజల విజయమని, ఇతరులను అప్రతిష్టపాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వ్యాపం కుంభకోణంలో నైతిక బాధ్యత వహిస్తూ చౌహాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.