
లక్నో : హత్రాస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. హత్రాస్ గ్రామంలో బాధితురాలి ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సంజయ్ సింగ్ వెలుపలికి రాగానే గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై ఇంకు చల్లాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్టీ నేతలతో కలిసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
సింగ్ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా దుండగుడు ఆయనపై ఇంకు చల్లాడు. కాగా, హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. హత్రాస్‌లో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. చదవండి : లైంగిక దాడులపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment