Chairperson
-
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
-
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం.. ఎన్హెచ్ఆర్సీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతిని వైఎస్సార్సీపీ మహిళా నేతల బృందం మంగళవారం కలిసింది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మహిళా నేతల బృందంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టరు తనుజారాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవి ఉన్నారు.కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక దందాల్లో సీఎం హోంమంత్రి బీజీగా ఉన్నారని.. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్‌ను నిరుపయోగం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.దిశా యాప్ నిర్వీర్యం చేయడంతో మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ నేతలు విన్నవించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. -
చంద్రబాబు సర్కార్‌పై న్యాయ పోరాటం చేస్తా: గజ్జల లక్ష్మి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మీని తొలగిస్తూ సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీకాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీకాలం ఉన్నా ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మోమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని గజ్జల లక్ష్మీ తెలిపారు.మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది -
సెబీ చీఫ్ రాజీనామా చేయాల్సిందే.. ఉద్యోగుల నిరసన
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.నిరసన ఎందుకంటే..సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. -
డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మరోసారి సోనియా గాంధీని ఎన్నుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తీర్మానం జరిగింది. అయితే ఆ తీర్మానానికి రాహుల్ అంగీకరించనట్లు సమాచారం. కాసేపట్లో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
రసవత్తరంగా తాండూరు మున్సిపల్ రాజకీయం
తాండూరు: మున్సిపల్ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్పర్సన్ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన సంతకాలు గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్పర్సన్ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మద్దతులో ఎలాగైనా చైర్పర్సన్ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల పంచాయితీ సాయిపూర్ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్లోని 9వ వార్డు కౌన్సిలర్ అయిన వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు చైర్పర్సన్ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్ చైరపర్సన్కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు విషమ పరీక్ష మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి సునీత రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పదవికి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్ఎస్ పార్టీ బీఫారం కూడా అందు కున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆమె రాజీనా మాను ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్స న్గా సునీతా లక్ష్మారెడ్డి 27 డిసెంబర్ 2020న నియమితులయ్యారు. ఆమె పదవీ కాలానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆమె రాజీనామా చేయడం అనివార్యమైంది. -
Zahara Begum: చూపున్న మనసు
మనసుకు చూపు ఉంటే ఎదుటి వారి కష్టం కనపడుతుంది. మనసుకు స్పందన ఉంటే ఎదుటివారి సాయం కోసం మార్గం వేస్తుంది. జహారా బేగంకు అలాంటి మనసు ఉంది. అందుకే ఆమె అంధుల కోసం పని చేస్తూ ఉంది. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. వారి మేచ్‌లు నిర్వహిస్తోంది. ఆ సేవకు ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’కు చైర్ పర్సన్‌గా నియమితురాలైంది. జహారా పరిచయం. ‘మనలో ఎవరైనా ఎప్పుడైనా అంధులు కావచ్చు. దృష్టి పోతే జీవితం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే దృష్టి లేని వారి గురించి ఎవరికి తోచినంత వారు పని చేయాలి’ అంటుంది జహారా బేగం. తెనాలికి చెందిన జహారా తన తల్లి తాహెరా పేరున ‘తాహెరా ఫౌండేషన్’ స్థాపించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ‘నేను నాలుగో క్లాస్‌లో ఉండగా నా క్లాస్మేట్ ఒకమ్మాయి మధ్యాహ్నం పూట ప్రసాదం తెచ్చుకుని తినేది. అన్నం ఉండేది కాదు. ఆ అమ్మాయి కోసం నేను మా అమ్మతో చెప్పి బాక్స్ తీసుకెళ్లేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎదుటివారికి సాయం చేయాలనే గుణం నాలో ఉంది. ఆ గుణాన్ని వయసు పెరిగే కొద్దీ కాపాడుకున్నాను’ అంటుంది జహారా. ఆటలంటే ఇష్టం ‘మాది గుంటూరు. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ జాతీయస్థాయి ప్లేయర్‌గా ఆడాను. గుంటూరు మహిళా బాస్కెట్‌బాల్ జట్టు మాతోనే మొదలైంది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండి బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పీహెచ్డీ కోసం జర్మనీలో కొంత రీసెర్చి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక నా మాతృమూర్తి పేరుతో తాహెరా ట్రస్ట్ ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవల్లో మమేకమయ్యాను. ఆ సమయంలోనే బెంగళూరులోని ‘సమర్థనం ట్రస్ట్ ఫర్ బ్లైండ్’ చేస్తున్న పని నాకు నచ్చింది. వారితో కలిసి అంధుల కోసం పని చేయసాగాను. బెంగళూరులో విమెన్ బ్లైండ్ క్రికెట్ వర్క్‌షాపును నిర్వహించాను’ అని తెలిపిందామె. అంధుల కోసం ‘అంధుల క్రీడలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేవారూ తక్కువే. వారికోసం నేనెందుకు ఏదైనా చేయకూడదు అనుకున్నాను. అప్పటినుంచి నా చేయూత నిరవధికంగా సాగింది. అంతేకాదు, ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా’ (సీఏబీఐ)లోనూ, ‘టి20 వరల్డ్ కఫ్ క్రికెట్ ఫర్ బ్లైండ్–2017’ పోటీల సమయంలోనూ చురుగ్గా పని చేసే అవకాశం కలిగింది. దాంతో ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీబీబీఏపీ) ఛైర్‌పర్సన్‌గా నియమితురాలినయ్యాను. ఇది నాకు సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల టి20 ‘2017లో దేశంలోని మెట్రో నగరాల్లో 2వ అంధుల టి20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను సీఏబీఐ నిర్వహించింది. పది దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కమిటీ ఇన్చార్జ్గా నేను రెండు మ్యాచ్‌లను ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించేందుకు చొరవ చూపాను. అలాగే ‘తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్ – 2019’ న్యూఢిల్లీలో జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవటం, క్రీడాకారిణుల లేమి గమనించాను. దాంతో ఆంధ్రప్రదేశ్ అంధ మహిళల క్రికెట్ జట్టు రూపకల్పనకు పూనుకున్నా. అనంతపురంలో రాష్ట్రస్థాయి అంధ మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ జట్టు ఎంపికకు సహకారం అందించాను.. ఇటీవల యూకేలో జరిగిన ఐబీఎస్ఏ టోర్నమెంటులో విజేతగా నిలిచిన ఇండియా జట్టులో మా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల క్రికెట్ గురించి.... ‘అంధుల క్రికెట్ ఢిపరెంట్‌గా ఉంటుంది. బ్యాట్, వికెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. బంతి మాత్రం వైవిధ్యంగా తయారు చేస్తారు. ఇందులో ఉండే బేరింగ్స్ చేసే శబ్దాన్ని ఆధారంగా బాట్స్మెన్ ఆడతారు. బౌలింగ్ సాధారణ క్రికెట్లోలా భుజంపైనుంచి కాకుండా దిగువ నుంచి వేస్తారు. క్రికెట్ జట్టులో బీ1, బీ2, బీ3 అనే మూడు కేటగిరీల వారుంటారు. బౌలరు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా అంధులై ఉంటారు. మిగిలినవారు పాక్షికంగా అంధులు. వీరు ఆడే మైదానం 50 గజాలు మాత్రమే. నిబంధనలన్నీ మామూలే. సీఏబీఐలో 25 వేల మంది సభ్యులున్నారు’ అని తెలిపిందామె. తన సేవా కార్యక్రమాలను అమెరికాకు కూడా విస్తరించిన జహారా అక్కడ చిన జీయర్ నేత్రాలయం కోసం నిధులు సేకరించడంతో తనవంతు సహకారం అందించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి. -
Sudha Murty Photos: అమృతమూర్తి 'సుధామూర్తి' అరుదైన ఫోటోలు
-
‘ఇండియా’ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ!
పట్నా: 26 పార్టీలతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత సోనియా గాందీ, కన్వినర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరుగనుంది. కూటమికి చెందిన 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా గాం«దీని, కన్వినర్‌గా నితీశ్ కుమార్‌ను ఈ సమావేశాల్లో ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!
Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్‌సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్‌పై దృష్టి సారించి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్చే స్థాపించిన్ హెచ్సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్‌సిఎల్ చైర్పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు. కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్‌ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. -
సీసీఐ చైర్పర్సన్ నియామకంలో విశేషం! మొదటిసారిగా..
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా రవనీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని ఓ మహిళ పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే మొదటిసారి. రవనీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సీసీఐ చైర్ పర్సన్‌గా కౌర్‌తో ప్రమాణం చేయించినట్టు ట్విటర్లో సీసీఐ ప్రకటించింది. సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా పదవీ కాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవికి పూర్తి స్థాయి చైర్పర్సన్ లేరు. కౌర్ నియామకంతో ఈలోటు భర్తీ అయింది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుంచి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, యాపిల్‌తో సహా డిజిటల్ స్పేస్‌కు సంబంధించిన వివిధ కేసులను అనుసరిస్తున్న సమయంలో రవనీత్ కౌర్ సీసీఐ పగ్గాలను చేపట్టారు. అలాగే జీఎస్టీ లాభదాయకతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
నాడు ఆమె ఓ ప్రైవేట్ టీచర్ నేడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థాయికి..
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కేవలం కొద్ది వారాల్లోనే జిల్లా పరిషిత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఆమె చేసుకున్న వివాహమే ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మమూన్ షా ఇటీవలే ఆమ్ ఆద్మీపార్టీలో చేరారు. గత 20 ఏళ్లుగా ఆయన సామాజిక సేవలో ఉన్నారు. తన నియోజక వర్గంలో పోలియో నిర్మూనల కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు రాంపూర్ నగర్ పాలికా పరిషిత్ చైర్పర్సన్ పదవికి పోటీ చేయాలనకున్నారు. అయితే అది మహిళలకు రిజర్వ్ చేయబడి ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ క్రమంలోనే సనా ఖానం అనే ప్రైవేట్ టీచర్ని ఏప్రిల్ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం వెంటనే జిల్లా పరిషిత్ చైర్పర్సన్ పదవికి నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగింది సనా. ఆ తర్వాత ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొందింది. దీంతో మొన్నటి వరకు అక్కడ ఓ ప్రైవేటు టీచర్‌గా ఉన్న ఆమె సడెన్‌గా చైర్పర్స్న్ స్థాయికి చేరుకుంది. ఈ మేరకు సనా ఖానం మాట్లాడుతూ..తాను ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశానని, సాధ్యమైనంత త్వరితగతిన ఉత్తమంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తన భర్త , ప్రజల మద్దతు ఉండటం వల్లే ఈ ఎన్నకల్లో గెలవగలిగానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, సనా ఖానం భర్త మమూన్ షా మాట్లాడుతూ..సంక్షోభ సమయంలో ప్రజలకు తోడుగా ఉన్నందు వల్లే తమకు ఇన్ని ఓట్లు పడ్డాయన్నారు. గత 40 ఏళ్లుగా ఆజం ఖాన్‌కు మాత్రమే ఓటు వేసిన ప్రజలు ఈ సారి తమకు ఓటేశారని ఆనందంగా చెప్పారు. వారికి సాయం చేసింది తానేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాగా, ఆజం ఖాన్‌కి కంచుకోటగా భావించే జిల్లాలో ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సనా ఖానం 43,121 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి మసరత్ ముజీబ్ 32,173 ఓట్లతో రన్నరప్‌గా నిలిచారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి) -
త్వరలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్థి లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటైన ‘రెరా’కు త్వరలో పూర్తిస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో న్యాయబద్ధమైన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రెరా)లను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా స్థాయి అధికారి చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇద్దరు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. అయితే ‘రెరా’కు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెరాకు వచ్చే దరఖాస్తుల పరిశీలన, అనుమతులు అన్నీ ఆయన నేతృత్వంలోనే సాగేవి. కాగా రియల్ వెంచర్లు, ఫ్లాట్ల నిర్మాణంలో ‘రెరా’ నిబంధనలకు తిలోదకాలిచ్చి పలు సంస్థలు, రియల్ వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పురపాలక శాఖ ఆసక్తి, అర్హత గల వారి నుంచి చైర్పర్సన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తును ఆహ్వానించింది. ఫిబ్రవరి 17వ తేదీలోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని కోరింది. రెరా వెబ్సైట్, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తుదారులకు అవసరమైన అర్హతలు, వేతనం వివరాలన్నీ ఉన్నాయి. -
సీసీఐకు తాత్కాలిక చైర్పర్సన్ సంగీతా వర్మ నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
సెకండరీ మార్కెట్లోనూ అస్బా
ముంబై: సెకండరీ మార్కెట్ లావాదేవీల్లోనూ ఏఎస్బీఏ(అస్బా) తరహా సౌకర్యాలకు తెరతీసే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ప్రైమరీ మార్కెట్‌కు ఇదెంతో ప్రయోజనకారిగా ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్లోనూ ఎందుకు ప్రవేశపెట్టకూడదంటూ ప్రశ్నించారు. అప్లికేషన్‌కు మద్దతుగా బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్టర్ సొమ్ము తాత్కాలిక నిలుపుదల చేసే అస్బా తరహా సౌకర్యాలను సెకండరీ మార్కెట్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు హాజరైన మాధవీ పురీ వెల్లడించారు. అస్బాలో భాగంగా ఐపీవోకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగాకే సొమ్ము బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో ఇన్వెస్టర్ల సొమ్ము బ్రోకర్లవద్ద ఉంటున్నదని, అస్బా తరహా సౌకర్యముంటే ఇందుకు తెరపడుతుందని తెలియజేశారు. లోపాలకు చెక్ సెకండరీ మార్కెట్లో వ్యవస్థాగత లోపాలను తగ్గించే లక్ష్యంతో అస్బా ఆలోచనకు తెరతీసినట్లు మాధవీ పురీ వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థలను తమ వ్యాపార విధానాల(బిజినెస్ మోడల్)లో ఇలాంటి వాటికి తావీయకుండా చూడాలంటూ ఈ సందర్భంగా సూచించారు. లోపాలకు ఆస్కారమిస్తే నియంత్రణ సంస్థల చర్యలకు లోనుకావలసి వస్తుందని హెచ్చరించారు. ఆడిటెడ్ లేదా వేలిడేటెడ్కాని బ్లాక్ బాక్స్తరహా బిజినెస్ మోడళ్లను అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. -
నాట్య దీపిక.. దీపికారెడ్డి
నవరసాలను పలికించే కళ్లు. చూపు తిప్పుకోనివ్వని ఆహార్యం. అకుంఠిత దీక్ష... నిరంతర సాధన. అంతకు మించిన అంకితభావం. యాభై ఏళ్ల కిందట కట్టిన మువ్వలు నేటికీ లయబద్ధంగా రవళిస్తూనే ఉన్నాయి. కూచిపూడి నాట్యానికి... ఆమె చేయాల్సింది ఏదో మిగిలి ఉన్నట్లుంది. నటరాజు మరింతగా సేవ కోరుకుంటున్నాడు. సంగీత నాటక అకాడమీ బాధ్యతనిచ్చాడు. కూచిపూడి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన దీపికారెడ్డి పౌరాణిక కథాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సామాజికాంశాలకు రూపకల్పన చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్’గా నియమితురాలైన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘నాట్యం అనేది అద్భుతమైన కళ. ఈ భారతీయ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలి. మనం ఎన్ని ప్రదర్శనలిచ్చాం అని లెక్కపెట్టుకోవడం కాదు, మనం ఎంతమంది కళాకారులను తయారు చేశామనేది ముఖ్యం. కళాకారులు నటరాజుకు సమర్పించే నమస్సుమాంజలి కళను విస్తరింపచేయడం ద్వారానే’ అన్నారు. ‘నాట్యం, సంగీతం వంటి కళలన్నీ నగరాల్లో కేంద్రీకృతమైపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పిల్లలకు సరిగ్గా అందడం లేదు. ఈ కొత్త బాధ్యత ద్వారా ఈ కళలను జిల్లాల వారీగా ప్రణాళికలు వేసుకుని గ్రామాలకు చేరుస్తానని’ చెప్పారామె. కళ ఇచ్చిన మధుర జ్ఞాపకాలు! ‘‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశాననే మాట నిజమే. కానీ ఈ కళ నాకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన ఒక క్రిటిక్ మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి ‘మీకు సరస్వతీదేవి పుట్టింది’ అన్నారు. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ ఆయనకు మనసులోనే ప్రణమిల్లుతుంటాను. మరొకటి... ఢిల్లీలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ద్రౌపది పాత్ర అభినయించాను. ఆ మరుసటి రోజు ఆడియెన్స్ గ్యాలరీకి వెళ్తున్నప్పుడు... ముందు రోజు నా ప్రోగ్రామ్ చూసిన వాళ్లు గుర్తు పట్టి ఎక్సైట్మెంట్తో ‘ద్రౌపదిరెడ్డీ... ద్రౌపది రెడ్డీ’ అని గట్టిగా పిలిచారు. వీటన్నింటినీ మించిన జ్ఞాపకం సెర్బియాలో జరిగింది. సెర్బియా– టర్కీ టూర్లో బెల్గ్రేడ్లో ప్రదర్శన, విపరీతమైన చలి. నాట్యం చేసేటప్పుడు పాదరక్షలేవీ ఉండవు కదా. నాట్యం ఎలాగో చేసేశాను. కానీ ఫెలిసిటేషన్ సమయంలో పాదాలు నేల మీద ఆన్చలేకపోయాను. ఒక పాదం నేల మీద ఉంటే మరో పాదం నేలను తాకకుండా పాదాలను మార్చుకుంటూ ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి తన కోటు తీసి నేల మీద పరిచి ఆ కోటు మీద నిలబడమన్నాడు. ఇవన్నీ ఈ నాట్యం ఇచ్చిన మధురానుభూతులే కదా! ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారైతే ‘రుక్మిణి– కృష్ణ’ ప్రదర్శన చూసి ‘దిస్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ డ్రామా ఐ హావ్ సీన్’ అంటూ ‘న్యత్యభారతి’ అని ప్రశంసించారు. అంతకంటే ఇంకేం కావాలి. నేను అందుకున్న అవార్డులు ఇచ్చిన సంతోషానికి మించిన ఆనందక్షణాలివి. ఎస్పీబీగారు మెసేజ్‌లు పెట్టరు. మాట్లాడి వాయిస్ రికార్డు పంపిస్తారు. అలా నాకు పంపిన వాయిస్ రికార్డులన్నీ దాచుకున్నాను. నాట్యమే ఊపిరి నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే. ఆరోగ్యం పెట్టిన పరీక్ష మహిళలకు అందరికీ మల్టీ టాస్కింగ్ వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇల్లు, పిల్లలను ఒకవైపు తన వృత్తి ప్రవృత్తులను మరో వైపు బాలెన్స్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాం. కానీ తల్లిగా నేను బిడ్డ దగ్గర ఉండాల్సిన క్షణాల్లో ఉండలేకపోయానే అనే గిల్ట్ పారిస్ టూర్ సమయంలో ఎదురైంది. నిజానికి ఆ టూర్ రెండు రకాలుగా పరీక్ష పెట్టింది. బయలుదేరే సమయానికి పాపకు జ్వరం. అలాగే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇరవై ప్రదర్శనలిచ్చాం. ఒకరోజు నాకు నాలుగు నూట నాలుగు జ్వరం. మందులు వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేదు. మేకప్ వేసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. ఆర్గనైజర్స్ మొత్తం సిద్ధం చేశాక ‘నాకు జ్వరం, డాన్స్ చేయలేను’ అనడానికి మనసొప్పుకోలేదు. ఆర్కెస్ట్రా వాళ్లతో ‘ఒకవేళ నేను కళ్లు తిరిగిపడిపోతే వెంటనే లైట్లు ఆఫ్ చేయండి’ అని చెప్పి నాట్యం మొదలుపెట్టాను. పళ్లెం మీద నాట్యం అది. ఆ నటరాజే నాతో చేయించాడని నమ్ముతాను ఇప్పటికీ’’ అంటూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు దీపికారెడ్డి. అమ్మమ్మ తాతయ్యల పెంపకం దీపికారెడ్డి తాత నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. తండ్రి వీఆర్ రెడ్డి న్యాయవిద్యలో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు ఆర్థిక బాధలు లేవు. కానీ, పేదరికం తెచ్చే కష్టాలు తెలుసన్నారామె. ‘‘వరంగల్‌లో తాతగారింట్లో పెరగడం వల్ల పేదవాళ్లకు ఆయన చేసిన సహాయాన్ని స్వయంగా చూశాను. నాట్య సాధన కోసం కొంతకాలం మా గురువుగారు వెంపటి చినసత్యం గారింట్లో ఉన్నాను. వాళ్లు నన్ను చాలా బాగా చూసు కున్నారు. అక్కడ నాట్యంతోపాటు చక్కటి డిసిప్లిన్ కూడా అలవడింది. నేలమీద పడుకోవడం, బావిలో నీరు తోడటం అలవాటయ్యాయి. తాత గాంధేయవాది. మమ్మల్ని అధికారిక వాహనాల్లో తిరగనివ్వలేదు. మా ప్రయాణం సైకిల్ రిక్షా, సిటీ బస్సులోనే. అమ్మమ్మ, తాత, గురువుగారు... ఈ ముగ్గురి స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నా శిష్యులకూ అదే నేర్పాను. నాట్యం నేర్చుకోవడానికి ఫీజు కట్టలేని అమ్మాయిలకు ఫ్రీగా నేర్పిస్తున్నాను. దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చాను, అలాగే విదేశాల్లోనూ. నా శిష్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డాన్స్ స్కూళ్లు నడుపుతూ కళాకారులను తీర్చి దిద్దుతున్నాను. కళ ఎంతగొప్పదంటే కళాకారులు గురువును మర్చిపోరు. గురుపూర్ణిమ రోజు వచ్చిన మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడానికి సమయం సరిపోలేదు. ప్రదర్శన ఉన్న రోజుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వేడుకలకు వెళ్లలేకపోయేదాన్ని. నాట్యం కారణంగా దూరమైన సంతోషాలకంటే నాట్యం కారణంగా అందిన సంతోషాలే ఎక్కువ’’ అన్నారామె. నటరాజు కొలువైన ఆలయం జూబ్లీ హిల్స్‌లో ఉన్న ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ లో అడుగుపెట్టగానే దీపికారెడ్డి యాభై ఏళ్ల నాట్యప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారమైనట్లు ఉంటుంది. ఆమె గురువు వెంపటి చినసత్యం ఫొటో, 1976లో రంగప్రవేశం చేసినప్పటి ఫొటోతో మొదలు జ్ఞానపీఠ సినారె, ఇద్దరు రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని, ఐదుగురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్లు, రాష్ట్రమంత్రుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాల చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. నాట్యం చేస్తున్న పరమశివుడి విగ్రహం నిత్యపూజలందుకుంటోంది. ఆమె శిష్యులు నేడు రవీంద్రభారతిలో ఇవ్వా ల్సిన ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. అమ్మానాన్నల సంతోషం! అత్యంత సంతోషకరమైన క్షణాలలో మొదటగా చెప్పాల్సింది సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోవడమే. రాష్ట్రపతి భవన్లో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు మా అమ్మానాన్న కళ్లలో సంతోషం చూశాను. అమ్మానాన్నలు అంతగా సంతోషపడిన ఆ సందర్భమే నాకు మరపురాని క్షణం. ఇక ఎప్పుడూ సంతోషపడే విషయం ఏమిటంటే భర్త, పిల్లలు నాకు ప్రోత్సాహమిస్తూ సపోర్టుగా ఉండడం. తల్లిదండ్రులకు నేను చెప్పేదొక్కటే. పిల్లలకు సంగీతం, నాట్యం... ఏదో ఒక కళను సాధన చేయించండి. అది జ్ఞాపకశక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధనతో ఏకాగ్రత అలవడుతుంది. ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలుగుతారు. నా స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ హోల్డర్సే. అలాగే కళ కోసం చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. – దీపికారెడ్డి, చైర్పర్సన్, సంగీత నాటక అకాడమీ, తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : గడిగె బాలస్వామి -
రిలయన్స్: అంబానీ కుమార్తె ఇషాకు బాస్‌గా ప్రమోషన్?
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కుమార్తె ఇషాకు కూడా ప్రమోషన్ రానుంది. రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా ఇషా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుందని అంచనా . ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింతలో ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ రీటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్ కాగా చిన్న కుమారుడు అనంత్. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకున్న విషయం విదితమే. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి మూడేళ్లు
-
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉమా చిగురుపాటి ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా అనుభవమున్న శుభ్రా .. ప్రస్తుతం బ్లూస్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టరుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మొదలైన వాటితో పాటు 300 పైచిలుకు కార్పొరేట్ సంస్థలకు ఆమె సీఏగా సేవలు అందించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా శుభ్రా మహేశ్వరి తెలిపారు. 2022–23 సంవత్సరానికి గాను ఎఫ్ఎల్వో గౌరవ కార్యదర్శిగా గుంజన్ సింధీ, ట్రెజరర్‌గా నిషిత మన్నె, గౌరవ జాయింట్ సెక్రటరీగా శిల్ప రాజు, జాయింట్ ట్రెజరర్‌గా మాయా పటేల్ నియమితులయ్యారు. -
సెబీ చీఫ్‌గా మాధవీ పురి బాధ్యతలు
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ– సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా మాధవీ పురీ బుచ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఒక మహిళ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే ఈ కీలక బాధ్యతలు చేపట్టిన నాన్–బ్యూరోక్రాట్. ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న అజయ్ త్యాగి స్థానంలో 57 సంవత్సరాల పురీ నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఫిబ్రవరి 28వ తేదీన సెబీ చీఫ్‌గా బాధ్యతలు విరమించారు. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం మాధవీ పురీ సొంతం. ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రయివేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4వరకూ పలు విధులు నిర్వర్తించారు. సర్వీలియెన్స్, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తదితర కీలక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్ధుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. విశేష అనుభవం సెబీ పూర్తికాలపు సభ్యురాలిగా 2021 అక్టోబర్‌లో బాధ్యతలు విరమించిన అనంతరం డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈ పదవీకాలంలో వివిధ పోర్ట్‌ఫోలియోల నిర్వహణ, పలు కమిటీలలో భాగస్వామ్యం వంటి బాధ్యతలు చేపట్టారు. సెక్యూరిటీ మార్కెట్ డేటాను పొందడం, ప్రైవసీ తదితర అంశాలలో విధాన చర్యలపై సలహాలు, సూచనలు అందించే అడ్వయిజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. పురీ విద్యార్హతల విషయానికి వస్తే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా విధులు నిర్వహించారు. బలమైన పునాది వేసిన త్యాగికి కృతజ్ఞతలు: పురి సెబీ పటిష్ట పనితీరుకు సంబంధించి తగిన బలమైన పునాదులు వేసిన సెబీ తాజా మాజీ చీఫ్ అజయ్ త్యాగికి కృతజ్ఞతలని బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాధవీ పురీ పేర్కొన్నారు. ‘మీరు మాకు అందించిన బలమైన పునాదిపై వ్యవస్థను పటిష్టంగా నిర్మించడానికి ఎదురుచూస్తున్నాను’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో త్యాగికి ఘన సన్మానం జరిగింది. ఎన్ఎస్ఈ కేసు సత్వర పరిష్కారానికే ప్రయత్నించాం: త్యాగి చిత్రా రామకృష్ణకు సంబంధించి కో లొకేషన్ స్కామ్ (సర్వర్ల డేటాను ముందుగా వినియోగించుకునే అవకాశం కొందరు బ్రోకర్లకు కల్పించడం) , హిమాలయ యోగి సూచనల మేరకు నడుచుకున్నారన్న ఆరోపణల విషయంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో తీవ్ర అవకతవకల కేసును సత్వరం పరిష్కరించేందుకే ప్రయత్నించినట్లు సెబీ మాజీ చైర్మన్ త్యాగి బుధవారం మీడియాతో అన్నారు. ఎన్ఎస్ఈ కేసులో తన ఉత్తర్వులు ఇవ్వడానికి సెబీ తాత్సారం చేసిందన్న విమర్శల నేపథ్యంలో, అసలు ఈ కేసులో ‘అవసరమైన శిక్షార్హత‘ చర్య తీసుకుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. క్వాజీ–జ్యుడీషియల్ (అడ్మినిస్టేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ అధికారి నిర్వహించే విచారణ పక్రియ) తీర్పుల విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ ఎప్పుడూ ఎటువంటి తాత్సారం చేయలేదని స్పష్టం చేశారు. కో–లొకేషన్ ఆరోపణల విషయంలో సెబీ తన అవగాహన ప్రకారమే వ్యవహరించిందని అన్నారు. 2018లో వచ్చిన ఈ ఆరోపణలపై రూలింగ్‌ను 2022 ఫిబ్రవరిలో ఇవ్వడానికి కోవిడ్ సంబంధ సవాళ్లు కారణం తప్ప, దీనిలో ఉద్దేశపూర్వక ఆలస్యం ఏదీ లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. -
సెబీ కొత్త చైర్మన్ నియామకం
-
ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి చరిత్రలో మొట్ట మొదటిసారిగా మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘సోదరి జకియా ఖానంకు అభినందనలు. అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచి.. మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది’ అని శనివారం ట్వీట్ చేశారు. చదవండి: పెద్ద కష్టమే.. వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన, సాయంపై హామీ -
AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా
సాక్షి, అమరావతి/రాయచోటి: శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ మహిళా పక్షపతి మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు. కాగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖాన్మ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జకియా ఖానమ్ నేపథ్యమిది.. పేరు: మయాన జకియా ఖానమ్ భర్త: దివంగత ఎం.అఫ్జల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంతానం: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు చదువు: ఇంటర్మీడియెట్ పుట్టిన తేది: జనవరి 01, 1971 స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్ జిల్లా రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి) -
ఎన్సీఎల్ఏటీ చైర్మన్‌గా జస్టిస్ చీమా కొనసాగొచ్చు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) చైర్పర్సన్ జస్టిస్ అశోక్ ఇక్బాల్‌సింగ్ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది. ఈయన ఈ నెల 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్ ఎం.వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్ చీమా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారు తరపున అటారీ్న జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ నెల 20 దాకా జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా కొనసాగవచ్చని, తీర్పులు వెలువరించవచ్చని అన్నారు. జస్టిస్ వేణుగోపాల్‌ను అప్పటిదాకా సెలవుపై పంపిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునళ్ల నియామకాల విషయంలో ధర్మాసనం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఇటీవల తీసుకొచి్చన ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021 ప్రకారం. ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌ను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమ సుమోటో అధికారాలను ఉపయోగించి ఈ చట్టంపై స్టే విధిస్తామని ఒక దశలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. -
మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్‌రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా కొంత కాలం పని చేశాను. రాజకీయరంగ ప్రవేశం ఇలా.. మా తండ్రి జితేందర్‌రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్‌గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను. భర్త, మామ ప్రోత్సాహంతో.. పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్తో వివాహం జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్‌దేవ్‌సింగ్ కూడా ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను. మహిళలకు అండగా.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను. -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
సంపన్న మహిళల్లో రోష్ని నాడార్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద రూ. 54,850 కోట్లు. రూ. 36,600 కోట్ల సంపదతో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా రెండో స్థానంలోనూ, రూ. 11,590 కోట్లతో రాధా వెంబు (జోహో) మూడో స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించి 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌కి సంబంధించి ఏకంగా నలుగురు ఉన్నారు. లిస్టులోని మహిళల సంపద సగటు విలువ సుమారు రూ. 2,725 కోట్లు. కనీసం రూ. 100 కోట్ల సంపద గలవారిని జాబితాలో పరిగణనలోకి తీసుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో (వెల్త్ మేనేజ్మెంట్) ఓషర్యా దాస్ తెలిపారు. అత్యధికంగా ముంబైలో 32 మంది, న్యూఢిల్లీలో 20, హైదరాబాద్‌లో 10 మంది సంపన్న మహిళలు ఉన్నారు. -
సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని జనం చర్చించుకోవడం మొదలైంది. విద్యాభివృద్ధే ధ్యేయంగా మాన్సాస్ ఆవిర్భావం 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్ గజపతిరాజు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది. ఎమ్మెల్యే కోలగట్లతో భేటీ సింహాచలం నుంచి సంచయిత గజపతిరాజు నేరుగా విజయనగరం చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన నాయకుడు ఈశ్వర్ కౌశిక్‌తో కలిసి విజయనగరం కోటలోని మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. పి.వి.జి.రాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను చైర్పర్సన్ హోదాలో స్వీకరించారు. త్వరలోనే ట్రస్ట్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, అన్ని విషయాలపై చర్చిస్తామని ఈ సందర్భంగా సంచయిత గజపతిరాజు స్పష్టం చేశారు. పూసపాటి వంశీయురాలిగా... సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండేది. అశోక్ టీడీపీలో ఉంటే ఆనందగజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. ఆయన కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీరు రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన రూ.3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల తీసుకున్న మూడురాజధానుల నిర్ణయాన్ని సంచయిత గజపతి స్వాగతించారు. విజయనగరం గడ్డపై పుట్టిన సంచయిత చెన్నై, కేరళ, ఢిల్లీలో పెరిగి ఇప్పుడు సొంత గడ్డమీద బృహత్తర బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. (చదవండి: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు) -
డాక్టర్ ధీశాలి
స్టెతస్కోప్‌కి జెండర్ ఉండదు. తను పరీక్షిస్తున్నది పురుషుడినా, స్త్రీనా స్టెత్ వివక్ష చూపదు. మరి స్టెత్‌ని పట్టుకున్న లేడీ డాక్టర్‌పై ఎందుకింత వివక్ష?! సమాజం ఆమెలో డాక్టర్నే చూస్తున్నా.. డాక్టర్ల సమాజం ఆమెను ఎందుకు స్త్రీగా మాత్రమే చూస్తుంది. అర్థంలేని అలాంటి వివక్షను ఎదుర్కొని నిలిచిన వైద్యురాలే కృష్ణ ప్రశాంతి. స్టెత్‌తో ఆమె వృత్తి బంధానికి ముప్పై ఏళ్లు నిండాయి. ‘ఆడవాళ్లు గైనకాలజీ తీసుకోకుండా జనరల్ ఫిజీషియన్ అవడం ఏంటి’ అని నవ్వింది పురుష సమాజం. డాక్టర్ అంటే దైవంతో సమానం. అయితే డాక్టర్స్ సొసైటీ కూడా ఆడ – మగ స్పష్టమైన విభజన రేఖ గీసి చూస్తుందని అప్పుడే తెలిసింది డాక్టర్ కృష్ణ ప్రశాంతికి. వివక్షలో అది అఆల దశేనని తెలియని ప్రశాంతికి అసలైన వివక్ష ఎంత కరడు గట్టుకుని ఉంటుందో ఆమె మెడికల్ అసోసియేషన్‌కు పోటీ చేసినప్పుడు అర్థమైంది. ఆమె ఐఎంఏ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసినప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఐఎంఏ ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత కూడా ఆమెకు అప్రతిష్ఠ తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు ప్రత్యర్థులు. ఆమెను భయపెట్టడానికి ఒక రోజు ఆమె క్లినిక్ ముందు దేహం నుంచి నరికేసిన ఒక కాలిని పడేశారు. వైద్యులంటే అంటే ప్రాణం పోసేవాడని మెడిసిన్‌లో తాము నేర్చుకున్నదేమిటి, హోదాల కోసం పోటీలు పడుతున్న కొందరు వైద్యులు చేస్తున్నదేమిటి? ఈ ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి. ఐఎంఏ ఎన్నికల్లో తనతో పోటీ చేసిన వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారని కొన్ని ఆధారాలైతే దొరుకుతున్నాయి. కానీ వాటి ఆధారంగా నిరూపించే ప్రయత్నం చేసుకుంటూ పోతే స్టెత్‌ను పక్కన పెట్టి దర్యాప్తు బాట పట్టాల్సి వస్తుంది. పైగా వాళ్లూ డాక్టర్లే. వైద్యవృత్తి వ్యాపారమయమైందని ఒక వైపు తీవ్రమైన విమర్శలు వస్తున్న ఈ రోజుల్లో డాక్టర్ల మధ్య ఎన్నికలు ఇంత భయానకంగా ఉంటాయని సమాజానికి పని గట్టుకుని చెప్పడం అవసరమా అని ఆలోచించి.. వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని పలుచబరచకూడదని, తన వంతు ప్రయత్నంగా వైద్యవృత్తి మీద సామాన్యుల్లో గౌరవం పెరిగేలా పని చేయాలని ఆమె గట్టిగా అనుకున్నారు. ఆటుపోట్లమయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిజీషియన్స్ అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతికి జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. పుట్టేటప్పటికి మాత్రం ఆమెది రెడ్‌కార్పెట్ జీవితమే. నాన్న ఇంజనీర్, అమ్మ డాక్టర్. ప్రశాంతి తొలి ప్రయత్నంలోనే 121వ ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నప్పటి వరకు ఆమెకు కష్టం అనే పదానికి నిర్వచనం తెలియలేదు. తిరుపతి ఎస్వీయూ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తయింది. పీజీలో చేరినప్పుడు తొలిసారి ‘నువ్వు స్త్రీవి, నీకు ఈ కోర్సులే తగును’ అనే మైండ్ సెట్‌ను చూసింది. ఆమె పీజీలో చేరగానే ‘మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం, మా అబ్బాయి కూడా డాక్టరే’ అంటూ పెళ్లి సంబంధాల తాకిడి మొదలైంది. నాకిప్పుడే పెళ్లి వద్దన్నా సరే, నచ్చచెప్పి పెళ్లి చేసేశారు అమ్మానాన్నలు. ‘ఆడపిల్ల అయినందుకు సర్దుకుపోవాలి’ అనే సమాజం రచించిన రాజ్యాంగం ఒకటి ఆమె మీద అదృశ్యంగా స్వారీ చేసింది. అప్పటి నుంచి అటు కుటుంబ జీవితంలోనూ, ఇటు ప్రొఫెషన్‌లోనూ ఒడిదొడుకులు మొదలయ్యాయి. పుట్టింటి వాళ్లకు – అత్తింటి వాళ్లకు మధ్య విభేదాలొచ్చాయి. ఆ ప్రకంపనలు ప్రశాంతి జీవితంలో ప్రతిధ్వనించాయి. ‘మీ బతుకు మీరే బతకండి’ అన్నారు అత్తింటివాళ్లు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. కలలో కూడా ఊహించని పరిస్థితి అది. అమ్మ ఫియట్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే, తాను పక్కన కూర్చుని ప్రయాణించిన తన జీవితం నుంచి రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన స్థితికి వచ్చింది. అన్ని కష్టాల్లోనూ చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో డయాబెటాలజీలో ఫెలోషిప్ కోర్సు కూడా చేశారు ప్రశాంతి. ఆ తర్వాత తాను చదివిన ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇష్టంగా చదువుకునే వాళ్లకు చదువు చెప్పడం కూడా ఇష్టమైన వ్యాపకంగానే ఉంటుంది. అలా టీచింగ్‌ని ఎంజాయ్ చేస్తూ పాఠాలు చెప్పారు డాక్టర్ ప్రశాంతి. ‘భార్యాభర్తలిద్దరమూ సంపాదనలోకి వచ్చేశాం, కాబట్టి ఆర్థిక కష్టాలను ఇట్టే గట్టెక్కవచ్చు’ అని కూడా స్థిమిత పడ్డారామె. ఇక అప్పుడు ఆటుపోట్లు ఉద్యోగంలో మొదలయ్యాయి. ప్రశాంతి పాఠాలతోపాటు ఆమెను కూడా ఇష్టపడే స్టూడెంట్స్ ఖాళీ టైమ్‌లో ఆమె చుట్టూ చేరేవాళ్లు. దాంతో సీనియర్ల దృష్టి పడింది. ప్రశాంతిని టీచింగ్ నుంచి తప్పించారు. ఆమెకు ప్రొటోకాల్ డ్యూటీలు, తిరుమల క్యాంప్ డ్యూటీలు పడ్డాయి. అప్పటికి ఇద్దరు పిల్లలు. క్యాంప్ డ్యూటీలకు వెళ్తే పిల్లల్ని చూసుకునేదెవరు? భర్తది కూడా సెలవులు లేని వైద్య వృత్తే. నా పిల్లల్ని సాకి పెట్టమని అత్తింటి వారిని, పుట్టింటి వారిని అడగ గలిగేట్లు పరిస్థితులు చక్కబడలేదు. దాంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. స్టెత్ మళ్లీ చేతికొచ్చిన వేళ! పిల్లలు, ఖర్చులు పోటీ పడి పెరిగిపోతుంటే తాను ఇంట్లో కూర్చుంటే గడిచేదెలా? ప్రశాంతికి జీవితం వేసిన మరో ప్రశ్న అది. ఈ ప్రశ్నకు సమాధానంగా ఓ చిన్న క్లినిక్ తెరిచారామె. రెండు నెలల్లోనే డాక్టర్ ప్రశాంతిగా అందరికీ తెలిసారు. ‘‘ఒక మగవాడు తన ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ ఉంటే.. అతడిని తన బతుకేదో తనని బతకనిస్తుంది సమాజం. ఒక స్త్రీ ఇల్లు దాటి బయటకు వస్తే.. సవాలక్ష ప్రశ్నార్థకపు చూపులు ఆమెను వెంటాడుతుంటాయి. బయటకు వచ్చిన మహిళ కూడా గుంపులో గోవిందమ్మలాగ ఉంటే అంత తీక్షణంగా పట్టించుకోరు. కానీ కొందరిలో ఒకరిగా ఎదుగుతుంటే మాత్రం సహించడం కష్టమే. ఎన్ని రకాలుగా బురద జల్లాలో అన్ని రకాలుగానూ బురద చల్లుతారు. అందుకే చాలామంది మహిళలు బయటకు రావడానికి భయపడుతుంటారు. బయటకు వచ్చినా కూడా అప్పటికే ఆ రంగంలో ఉన్న సవాలక్షలో ఒకరిగా ఉండిపోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆమెకు ఇంటినుంచి సపోర్టు ఉండాలి. ఇంట్లో వాళ్ల మద్దతు ఉంటే సమాజం బురద చల్లడానికి సాహసించదు’’ అన్నారు కృష్ణ ప్రశాంతి. ఫ్యామిలీ డాక్టర్ ‘‘నాకు ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్లో స్థిరపడాలనుకున్నాను. కానీ కుదరలేదు. కార్డియాలజీలో డీఎం చేయాలనుకున్నా. అదీ కలగానే మిగిలిపోయింది. ఆసియాలోనే తొలిసారిగా డీఎం న్యూరాలజీ, ఎంసీ హెచ్న్యూరో సర్జన్ చేసిన సూపర్‌స్పెషాలిటీ మహిళ డాక్టర్ ప్రీతికాచారి. నేను ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకున్నాను, కానీ వీలుపడలేదు. ఆ కొరతను చూసి బాధపడడం కంటే నేను సాధించిన లక్ష్యాలను చూసుకుని సంతృప్తి చెందుతున్నాను. నేనిప్పుడు వేలాది కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్ని మాత్రమే కాదు వాళ్ల ఫ్యామిలీ మెంబర్ని కూడా. వాళ్ల అనారోగ్యాలతోపాటు ఇంటి సమస్యలు కూడా చెప్పుకుని సలహా అడుగుతుంటారు. తిరుపతిలో స్టేజీ మీద వీణ వాయించిన తొలి డాక్టర్ని నేనే’’ అని కూడా అన్నారామె సంతోషంగా. నేనైతే వందసార్లు చనిపోయి ఉండాలి విద్యార్థులకు ఆమె చెప్పే సూచన ఒక్కటే.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, జీవితం నుంచి పారిపోకూడదు. ఎదురీదాలి, ఎదురీదడం నేర్చుకోవాలి. కోర్సు నచ్చలేదనో, ర్యాగింగ్ చేశారనో, ఏడిపించారనో, వేధించారనో.. ఇంకో కారణం చేతనో ఆత్మహత్యలకు పాల్పడద్దు.. కష్టాలకు భయపడి వుంటే నేను వంద సార్లు చనిపోయి వుండాలి. ఎన్ని కష్టాలొచ్చినా ప్రాణం వదులు కోవద్దు. చనిపోయాక ఏమీ సాధించలేరు. ఏదైనా బతికే సాధించండి. నా జీవితంలో నేను అనుకున్నవేవీ జరగలేదు. ఇష్టమైన ఎన్నింటినో వదులుకున్నా. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. చేపట్టిన పనిలో నూటికి నూరు శాతం మనవంతు బాధ్యత నిర్వర్తించడం ఒక్కటే మనం చేయాల్సింది. ఏది జరిగినా మన మంచికోసమే అనుకుని ముందుకుపోవాలి అదే జీవితం’’ అని చెప్తుంటారు డాక్టర్ ప్రశాంతి. బాలచంద్ర పున్నాగు, సాక్షి, తిరుపతి ఫొటోలు: మహమ్మద్ రఫీ సంపాదన కోసం రావద్దు మా వారు సిద్ధా హరినాథరెడ్డి జనరల్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్. అమ్మాయి కేదార హర్షిత కోలార్‌లో మెడిసిన్ చేస్తోంది. అబ్బాయి నూతన్ సాయి ప్రణీత్ మద్రాస్ మెడికల్ కళాశాలలో ఫస్టియర్. పిల్లల్ని మెడిసిన్ చదవమని మేము ఒత్తిడి చేయలేదు. వాళ్లే వైద్యవృత్తిని ఎంచుకున్నారు. మొత్తానికి మా కుటుంబమంతా వైద్య వృత్తికే అంకితం. వైద్యవృత్తి మీద పరుచుకుంటున్న నీలి నీడల్ని చెరిపేసి, పూర్వ గౌరవాలు తీసుకురావాలనేదే నా కోరిక. సంపాదన కోసమే అయితే ఎన్నో వ్యాపారాలున్నాయి, డబ్బు కోసం ఈ ప్రొఫెషన్లోకి రావద్దని నా పిల్లలకూ చెప్పాను. డాక్టర్ కృష్ణ ప్రశాంతి, వైస్ చైర్పర్సన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ -
18 ‘ఎంపీపీ’లకు 15న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 18 మండలాల్లోని కోఆప్టెడ్, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికను ఈ నెల 15న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ కోఆప్టెడ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు పూర్తిచేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. జెడ్పీపీ పదవులన్నింటికీ ఏకగ్రీవ ఎన్నికలు పూర్తికాగా, కొన్ని ఎంపీపీల్లో కోరం లేక కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో 18 ఎంపీపీల్లోని పదవులకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్లో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికయ్యే పాలక మండళ్ల పదవీ కాలం ఏ తేదీ నుంచి మొదలయ్యేది ఎస్ఈసీ విడిగా నోటిఫై చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే.. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, సారంగపూర్, భద్రాద్రి జిల్లా లోని అల్లపల్లి, ములకలపల్లి, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని టెక్మల్, సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి, నల్లగొండ జిల్లాలోని చందంపేట, కేతేపల్లి, నేరేడుగొమ్ము, సూర్యా పేట జిల్లాలోని చిల్కూరు, రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్, మాడుగుల, జనగామ జిల్లా తరిగొప్పుల, జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ ఎంపీపీ స్థానాలకు 15న ఎన్నికలు జరగుతాయి. ఎన్నిక నిర్వహిస్తారిలా.. 15న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి సంబంధించి 14వ తేదీలోగా సంబంధిత ఎంపీపీల గెజిటెడ్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ మండలాల్లో ఉదయం 9 నుంచి 10 మధ్య కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని పరిశీలించాక మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్ని క, అది ముగిశాక మధ్యాహ్నం 3కి ఎంపీపీ అధ్యక్షు లు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరగకపోతే అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించరు. ఈ విషయాన్ని అధికారులు ఎస్ఈసీకి తెలపాల్సి ఉంటుంది. కోఆప్టెడ్‌ల ఎన్నిక పూర్తయ్యాక ఏ కారణంతోనైనా ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకపోతే, 16న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నికలు జరగకపోతే ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే దీనికోసం మరో తేదీని నిర్ణయిస్తుంది. -
విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక వాక్యంతో కూడిన లేఖను కలెక్టర్‌కు అందజేసి, రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాష్ట్ర మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. చివరికి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేకంగా కౌన్సిల్‌ను సమావేశపరిచే అర్హత కలెక్టర్‌కు లేదని మంగళవారం చైర్పర్సన్ సునీతారాణి ఏకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే 28 మంది సభ్యులు కలిసి ఒక కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారని కూడా హైకోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు. అయితే కోర్టులో కూడా సునీతారాణికి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో తనకు ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు. ఈ లేఖను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ గురువారం నాటి కౌన్సిల్‌కు అధ్యక్షత వహించే బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు పంపించారు. రాజీనామా చేసినా... కౌన్సిల్లోనే ఆమోదం గురువారం నాటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్‌గా తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని భావించిన సునీతారాణి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు తేదీ ఖరారైన నేపథ్యంలో రాజీనామాను ఆమోదించే అధికారం కలెక్టర్‌కు లేదు. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమయిన వెంటనే మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిల్‌లోని సభ్యులకు చైర్పర్సన్ రాజీనామా విషయాన్ని తెలియజేస్తారు. ఈ రాజీనామాకు సభ్యులంతా సమ్మతం తెలిపితే అవిశ్వాసంపై ఓటింగ్ జరపకుండానే సభను వాయిదా వేస్తారు. కౌన్సిల్ సమావేశమైనప్పుడు ఒకవేళ సాంకేతిక కారణాలతో రాజీనామా లేఖ అంశం సభ దృష్టికి తీసుకురాని పక్షంలో అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసంపై ఓటింగ్ చేపట్టే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి మాత్రమే సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ నేతృత్వం వహిస్తారు. రాజీనామా అంశం సభ దృష్టికి వస్తే ఆయన అవసరం ఉండదు. నెల పదిరోజుల్లో ఎన్ని మలుపులో... రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల చైర్పర్సన్లు, ఎంపీపీలు అవిశ్వాస సమస్యను ఎదుర్కొన్నా... బెల్లంపల్లిలో జరిగినంత రచ్చ ఎక్కడా లేదు. అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి పది రోజుల ముందే జూన్ 23వ తేదీన 29 మంది కౌన్సిలర్లు రహస్య క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ సభ్యులంతా ఈ క్యాంపులో ఉండడం విశేషం. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన ప్రయత్నాలు, తదనంతర పరిణామాలు విమర్శలకు కారణమయ్యాయి. ఎమ్మెల్యే చిన్నయ్య ఓ కౌన్సిలర్ కూతురిని ఫోన్లో బెరించడం, సింగరేణిలో ఉద్యోగం చేసే ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలను మణుగూరుకు బదిలీ చేయిస్తానని చెప్పి మరీ ఉత్తర్వులు ఇప్పించారు. 18వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేశారనే ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌లో ఐదుగురు అసమ్మతి సభ్యులు, ఓ నాయకుడిపై కేసు నమోదు అయ్యింది. వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకువచ్చారు. -
మంత్రి నారాయణ సమక్షంలో...
సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణిని నిలబెట్టే ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గోమతినగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ రాజానాయుడు పాల్గొన్నారు. వీరందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడే ఉన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణికి మాత్రం కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె సమావేశం జరుగుతున్నంత సేపూ నాయకుల వెనుక నిల్చొనే ఉండాల్సి వచ్చింది. మంత్రి నారాయణ తదితర టీడీపీ నేతలు చైర్పర్సన్ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు. -
WFE చైర్‌పర్సన్‌గా చిత్రా రామకృష్ణ
-
మహిళ చేతికి ప్రపంచ ఎక్స్ఛేంజీల సమాఖ్య పగ్గాలు
• ఎన్ఎస్ఈ సీఈఓ • చిత్రా రామకృష్ణకు అరుదైన గౌరవం న్యూఢిల్లీ: వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. దీని పగ్గాలు ఒక మహిళ చేతికి దక్కటం ఇదే తొలిసారి. 2008లో కూడా ఒకసారి ఎన్ఎస్ఈకి ఈ హోదా దక్కినా... అప్పట్లో ఎండీ-సీఈఓగా చిత్రా రామకృష్ణ లేరు. ఇక సిక్స్ గ్రూప్ సీఈవో ఉర్స్ రుగ్సెగర్.. డబ్ల్యూఎఫ్ఈ వైస్ చైర్మన్‌గా, షికాగో బోర్డు ఆప్షన్స ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విలియన్ బ్రాడ్‌స్కై.. డబ్ల్యూఎఫ్ఈ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ‘డబ్ల్యూఎఫ్ఈ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా సహచర ఉద్యోగులతో కలిసి సంస్థను ముందుకు నడిపిస్తాను’ అని చిత్ర తెలిపారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డబ్ల్యూఎఫ్ఈలో 200 మార్కెట్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ప్రొవైడర్లు, దాదాపు 45,000 లిస్టెడ్ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నారుు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్చేంజ్లు, మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ రెగ్యులేటర్స్‌తో, పాలసీ తయారీదారులతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. -
అంతర్జాతీయ సదస్సుకు భూపాలపల్లి చైర్పర్సన్ సంపూర్ణ
భూపాలపల్లి: పౌరుల భద్రత, విపత్తుల నివారణపై నవంబర్ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఆసియా, పసిఫిక్ దేశాల సదస్సుకు హాజరుకావాలని భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణకు సోమవారం ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్, ఏఈ రవీంద్రనా«థ్, టీపీఓ ఖలీలుద్దీన్ , కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది చైర్పర్సన్ సంపూర్ణను అభినందించారు. -
పేట మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సీఎస్ అభినందన
సీఎస్‌కు పూలబొకే అందజేసి స్వాగతం పలికిన చైర్పర్సన్ సూర్యాపేట : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా సూర్యాపేటకు గుర్తింపు లభించేలా కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అభినందించారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించేందుకు శనివారం సూర్యాపేటకు వచ్చారు. ఈ సందర్భంగా రహదారి బంగ్లాలో రాజీవ్‌శర్మకు చైర్పర్సన్ ప్రవళిక, ప్రకాష్ పూలబొకే అందజేశారు. ఈనెల 30న ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకోనునండడంతో ఆయన చైర్‌పర్సన్‌ను అభినందనలు తెలిపారు. -
అభివృద్ధిలో ఇంజనీర్లు కీలకం
జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ ఘనంగా మోక్షగండం విశ్వేశ్వరయ్య జయంతి హన్మకొండ : దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి చైర్పర్సన్ గద్దల పద్మ, ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పద్మ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంజనీర్ అని అని కొనియాడారు. విశ్వేశ్వరయ్య నుంచి నేటి ఇంజనీర్లు స్ఫూర్తిని పొందాలని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతగా ఉండేల చూడాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంయుక్తంగా జెడ్పీ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమని గద్దల పద్మ కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్‌రావు, రాజేంద్రప్రసాద్, డీఈలు సురేష్, కృష్ణారెడ్డి, ఇంజనీర్ అసోషియేషన్ల నాయకులు పులి ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జెడ్పీ ఆవరణలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌కు స్వాగతం
కరీంనగర్‌సిటీ : ఆట ఆహ్వానం మేరకు ఆమెరికాలో పర్యటించి స్వదేశానికి తిరిగి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమరాజేందర్‌రావు దంపతులకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న చైర్‌పర్సన్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, శేఖర్, ఎంపీపీ అయిలయ్య, తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. -
చైర్పర్సన్ X సీఈవో!
జిల్లాపరిషత్ కార్యాలయం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతి చిన్న విషయూన్ని ఉద్యోగులు భూతద్దంలో చూస్తుండడంతో ఇక్కడ వాతావరణం చెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల మధ్య కుర్చీల కుమ్ములాటలు చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సీఈవో బి.నగేష్ మధ్య అంతరానికి కారణమవుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో చైర్పర్సన్ నిర్ణయానికి సీఈవో అడ్డుపడుతుండడంతో సమస్య తలెత్తిందని కార్యాలయ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. పాలనా వ్యవహారాల్లో తరచూ ఇలాంటి సమస్యలే ఎదురవుతుండడంతో ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. * అంతర్గత బదిలీలపై మాటపట్టింపు * సీట్ల కోసం ఉద్యోగుల కుమ్ములాట * ముదురుతున్న వ్యవహారం * కీలక సీట్లపై మల్లగుల్లాలు శ్రీకాకుళం టౌన్: జెడ్పీ కార్యాలయంలో తొమ్మిది విభాగాలున్నాయి. వాటిలో ఆర్థిక, పాలనా వ్యవహారాలు, కార్యాలయ నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలు కలుపుకుని తొమ్మిది సెక్షన్లు పనిచేస్తున్నాయి. అందులో ఏ విభాగంలో అకౌంట్స్, బీ లో పాలనా అంశాలు, సీ లో నియామకాలు, ఉద్యోగుల వ్యవహారాలు, డీ లో లేఖా సంబంధమైన అంశాలు, ఈ లో విద్యాశాఖ వ్యవహరాలు, ఎఫ్, జీ విభాగాల్లో ప్రావిడెంట్ ఫండ్, ఇంజినీరింగ్‌తోపాటు ఫ్లానింగ్ విభాగాలుగా విభజించారు. కార్యాలయ నిర్వహణకు ఇవి ఎంతో కీలకం. ఇందులో ఇంజినీరింగ్, అకౌంట్స్, పీఎఫ్, నియామకాల విభాగాలు నిర్వహించే ఉద్యోగుల సీట్లకు గిరాకీ ఉంటుంది. ఇక్కడ నిత్యం ఆర్థిక లావాదేవీలు ఉండడంతో ఈ విభాగాల్లో పని చేసేందుకు వీలుగా అక్కడ కుర్చీల కోసం పాకులాడుతుంటారు. పాలకవర్గం మారినపుడు వారికి అనుకూలంగా లేని ఉద్యోగులను కీలక విభాగాల్లో నియమించకుండా పాలకవర్గం సైతం జాగ్రత్త పడుతూఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక విభాగాల్లో నియమించడానికి వీలుగా ప్రస్తుత చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి జెడ్పీ కార్యాలయంలో శాఖల మార్పిడి రెండుసార్లు చేపట్టారు. గతంలో కొందర్ని మార్చినప్పటికీ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విషయంలో ముఖ్యప్రణాళికాధికారి (సీఈఓ), చైర్పర్సన్ల మధ్య అంతరం పెరిగింది. అలాగే కార్యాలయ పరిధిలో టైఫిస్టుగా పనిచేస్తున్న సంతోష్‌ను కుటుంబ కలహాల ఫిర్యాదు మేరకు అరెస్టయినపుడు సస్పెండ్ చేయాల్సి ఉండగా..చైర్పర్సన్ అడ్డుపడ్డారు. అయితే నిబంధనల ప్రకారం సీఈవో నగేష్ సస్పెం డ్ చేశారు. దీంతో అప్పట్లో చైర్పర్సన్, సీఈవోల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తాజాగా 15 మంది ఉద్యోగులకు శాఖల మార్పునకు చైర్పర్సన్ ధనలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అకౌంట్స్ విభాగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సెక్షన్ అధికారి సీటు మార్చాలని చైర్పర్సన్ నిర్ణయం తీసుకున్నారు. అతనితోపాటు ఇద్దరు సూపరింటెండెంట్లకు శాఖల మార్పిడి తప్పనిసరి. వీరితో కలసి 15 మందికి స్థానచలనంతోపాటు కొత్తగా వచ్చిన మరో ముగ్గురికి సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన సీఈవో మూడురోజులుగా మార్పునకు అనుమతించలేదు. ఇది జెడ్పీలో చర్చనీయూంశంగా మారింది. ఈ విషయం జెడ్పీ సీఈవో, చైర్పర్సన్ల మధ్య వివాదానికి దారితీసే పరిస్థితి ఉందని కొంతమంది ఉద్యోగులంటున్నారు. పాలనా సౌలభ్యం కోసమే మార్పులు జెడ్పీలో పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేసుకునే వీలుంది. శాఖల మార్పు అనివార్యం.బాధ్యతాయుతం గా పనిచేస్తున్న వారిని మార్చినప్పు డు కొత్తసమస్యలు తలెత్తకుండా చేస్తాం. - బి.నగేష్, జెడ్పీ సీఈవో అభ్యంతరాలు ఉండడం సహజమే జెడ్పీ పరిధిలో పాలనా పరమైన అం శా ల్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతోనే అంతర్గతమార్పులు చేస్తున్నాం. శాఖల మార్పు వల్ల ఉన్నతాధికారులకు అభ్యంతరాలు ఉండడం సహజమే. మార్పులు చేసినపుడు వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. - చౌదరి ధనలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ -
జెడ్పీలోకి జర్నలిస్టులకు ఎంట్రీ
♦ మీడియాపై ఆంక్షలపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆగ్రహం ♦ చైర్పర్సన్ చొరవతో దిగివచ్చిన సీఈఓ ♦ స్థాయీ సంఘాల సమావేశాల కవరేజీకి ఆహ్వానం సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు జెడ్పీ సీఈఓ వర్షిణి వెనక్కి తగ్గారు. జెడ్పీ స్థాయీ సంఘం సమావేశాలకు మీడియా రావొద్దంటూ ఆమె జారీ చేసిన ఆర్డర్‌ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణియాదవ్తోపాటు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సమస్య సమసిపోయేలా చైర్పర్సన్ రాజమణి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉదయం జరిగిన పనులు స్థాయీ సంఘం సమావేశంలో జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్.. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ నల్లకండువా ధరించి సమావేశానికి హాజరయ్యారు. స్థాయీ సంఘం సమావేశాలకు మీడియాను అనుతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా వస్తున్న సంప్రదాయాలను కాదని మీడియాపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు లేకపోతే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రభాకర్ హెచ్చరించారు. ఇదే సమయంలో జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ కలుగజేసుకుని స్థాయీ సంఘం సమావేశాల్లోకి గతంలో మాదిరిగానే మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి స్పందిస్తూ మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించటం సరికాదన్నారు. చైర్పర్సన్ ఆదేశం మేరకు సీఈఓ వర్షిణి స్థాయీ సంఘం సమావేశానికి మీడియా కవరేజికి సమ్మతించారు. జెడ్పీ సూపరింటెండెంట్ జమ్లానాయక్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తరువాత పనులు, ఆర్థిక ప్రణాళిక సమావేశాలు నిర్వహించారు. సావిత్రిభాయి పూలే వర్థంతి సందర్భంగా చైర్పర్సన్ రాజమణి, సీఈఓ వర్షిణి, జెడ్పీటీసీలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిల్లులు ఇవ్వకపోతే సెలవులో వెళ్లండి... వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, బిల్లులు చెల్లించని పక్షంలో సెలవులో వెళ్లాలని జెడ్పీటీసీ ప్రభాకర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్, గడ్డపోతారంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విచ్చలవిడిగా ఆర్ఓ ప్లాంట్లు వెలుస్తున్నాయని, ఎవరూ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదని, తాగునీరు వృథా అవుతోందని తెలిపారు. ఆర్ఓ పాంట్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయాలని కోరారు. నిబంధనలు మారిస్తే ఎలా..?: జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ జెడ్పీలో ఉన్నతాధికారులు మారినప్పుడల్లా కొత్త నిబంధనలు తీసుకువస్తే పనులు ఎలా సాగుతాయని పటాన్చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్సీ నిధులను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చె ప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నందున ఎస్ఎఫ్సీ నిధులు జారీ నిలిపివేశామని సీఈఓ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు తాము పనులు ప్రతిపాదిస్తున్నామన్నారు. నిబంధనల మేరకు ఉన్న పనులను వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేవని, వెంటనే చెల్లించాలని కోరారు. ప్రస్తుతం తమ వద్ద నిధులు లేవని ప్రభుత్వానికి లేఖరాశామని సీఈఓ తెలిపారు. -
మా కమిషనర్ బంగారం
కోదాడటౌన్ కోదాడ మున్సిపల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కమిషనర్, చైర్పర్సన్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ముగ్గురు మంత్రులను కలిసి స్వయంగా ఫిర్యాదు చేసిందా..? బదిలీ చేస్తామని వారు ఆమెకు మాట ఇచ్చారా? కమిషనర్ బదిలీ వద్దని మున్సిపల్ కౌన్సిలర్ల సంతకాలను కమిషనర్ అనుచరులు సేకరిస్తున్నారా? ఈ విషయమై 11 మంది అధికార, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సంతకాలు చేశారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రెండు రోజులుగా కొందరు కమిషనర్ బదిలీ వద్దని, ఆయన ఎన్నో మంచి పనులు చేశారని పేర్కొంటూ గుట్టుగా కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. శనివారం విపక్షాలకు చెందిన కౌన్సిలర్ల వద్దకు సంతకాల కోసం వెల్లడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. నాలుగు నెలల క్రితం బాళోజినాయక్ కోదాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే చొరవతో ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారనే పుకార్లు నాడు వచ్చాయి. ఆయన సదరు నేత మాట వింటూ తనను ఇబ్బంది పెడుతున్నారని చైర్పర్సన్ తన అనుచరులవద్ద వాపోతున్నది. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇది తీవ్రం కావడంతో ప్రతి సమావేశం గందరగోళంగా తయారైంది. ఇక లాభం లేదనుకున్న చైర్పర్సన్ ఇటీవల ముగ్గురు మంత్రులను స్వయంగా కలిశారు. మహిళనైన తనను కమిషనర్ ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఆరోపణల చిట్టాను కూడా మంత్రులకు ఇవ్వడంతో ఆయనను బదిలీ చేస్తామని వారు హమీ ఇచ్చినట్లు తెలసింది. దీంతో పాటు గత కమిషనర్ ఎన్ఓసీ రద్దు చేసిన ఓ భవనానికి తాజాగా ఎన్ఓసీ జారీ కావడంతో కొందరు సీడీఎంఏకు నేరుగా కమిషనర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల నుంచి తాకీదు రావడంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన కమిషనర్‌కు అక్కడి అధికారులు ఈ విషయాల ను చెవిన వేయడంతో బదిలీని ఆపుకునేందుకు కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 15మంది సంతకాలు కోదాడ మున్సిపల్ కమిషనర్ చాలా మంచి వాడని, మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాడని, ఆక్రమణలకు గురైన గాంధీపార్కును ఖాళీ చేయించిన ఘనత ఆయనదేనని, రోడ్డు వెంట ఉన్న దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చేశాడంటూ...ఒక వినతి పత్రాన్ని తయారు చేసి దాని మీద కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 11మంది అధికారపార్టీ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు ధ్రువీకరించారు కూడా. మిగిలిన వారు కొందరు తరువాత చేస్తామంటే.. మరికొందరు తిరష్కరించినట్లు సమచారం. చివరకు ఇది ఎటుదారి తీస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సీబీడీటీ కొత్త చైర్పర్సన్ అనితా కపూర్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ నియమితులయ్యారు. వచ్చే యేడాది నవంబర్ వరకూ ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనితా కపూర్, 1978 ఇన్కమ్ ట్యాక్స్ కేడర్‌కు చెందినవారు. ఇప్పటివరకూ సీబీడీటీలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాల విభాగ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవీ చౌదరి అక్టోబర్ 31న పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కపూర్ నియామకం జరిగింది. ఐదు స్థానాలు ఖాళీ... సీబీడీటీలో చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ, ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాంశాల రూపకల్పన, పాలనా వ్యవహారాల నిర్ణయాల అమల్లో బోర్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. కాగా ఇటీవల ఎటువంటి నియామకాలూ జరక్కపోవడంతో సీబీడీటీలో ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడు- అరుణ్ కుమార్ జైన్ మాత్రమే పనిచేస్తున్నారు. బాధ్యతలన్నీ వీరిరువురే నిర్వర్తించాల్సి ఉంది. సిట్ సలహాదారుగా చౌదరి... కాగా సీబీడీటీ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన చౌదరి నల్లధనంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటయిన ప్రత్యేక విచారణా బృందానికి (సిట్) సలహాదారుగా నియమితులయ్యారు. చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారవడం తెలిసిన విషయమే. -
సీబీడీటీ కొత్త చీఫ్ అనితా కపూర్!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనితా కపూర్, 1978 ఇన్కమ్ ట్యాక్స్ కేడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఆమె సీబీడీటీలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాల విభాగ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తు తం చైర్మన్ కేవీ చౌదరి అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నవంబర్1న చౌదరి స్థానంలో అనితా కపూర్ బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది. -
అడ్డదారితో అసలుకే ఎసరు
ఏలేశ్వరం : ‘ఏరు దాటే వరకూ బోటు మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య’ అన్న రీతిలో వ్యవహరించిన అవకాశవాదానికి భంగపాటు తప్పలేదు. పదవి కోసం పార్టీ ఫిరాయించిన ఆ నాయకురాలు చివరికి ‘రెంటికీ చెడక’ తప్పలేదు. హెచ్చరిఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచి, తర్వాత టీడీపీ ప్రలోభాలకు లొంగి, చైర్పర్సన్ పదవిపై వ్యామోహంతో ఆ పార్టీలోకి ఫిరాయించిన కొప్పాడ పార్వతిపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులను కోల్పోయారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, ఇందిరాసాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారథి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ కేటీ సుధాకర్ గురువారం తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీకి పది, వైఎస్సార్ సీపీకి తొమ్మిది, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. టీడీపీకి ఆధిక్యత ఉన్నా చైర్పర్సన్ పదవిని చేపట్టడానికి ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందలేదు. ఎస్సీ మహిళలకు కేటాయించిన రెండు వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీటితో పాటు మరో రెండు జనరల్ వార్డుల నుంచీ ఆ పార్టీకే చెందిన ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామంతో టీడీపీ అనైతికంగానైనా చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎస్సీ మహిళా కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలు పెట్టింది. చివరికి ఆరో వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన కొప్పాడ పార్వతి పార్టీ ఫిరాయించి, టీడీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీనిపై వైఎస్సార్ సీపీ విప్ సామంతుల శ్రీరామసూర్యకుమార్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఎన్నికల అధికారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్వతిపై అనర్హత వేటు వేశారు. వైఎస్సార్ సీపీలో ఆనందోత్సాహాలు చైర్పర్సన్ పార్వతిపై అనర్హత వేటు పడడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక బాలాజీ చౌక్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. చివరికి న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. పార్టీ నేతలు అలమండ చలమయ్య, సామంతుల సూర్యకుమార్, బదిరెడ్డి గోవిందు, మలకల వేణు, వాగుబలరామ్, దాకమర్రి సూరిబాబు, తొండారపు రాంబాబు, పతివాడ బాబూరావు, గంగిశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు వాడపల్లి శ్రీను, బదిరెడ్డి అశాలత, గొడత చంద్ర, భజంతుల మణి, ఎస్ఎం సుభానీ, వరుపుల నె హ్రూ, కోసూరి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో పవర్ గేమ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. చైర్పర్సన్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. చైర్పర్సన్ హోదాలో జెడ్పీలో పూర్తిగా తమ అజమాయిషీయే ఉండాలని ఆ వర్గం భావిస్తుండగా, సన్నిహిత అధికారులను తీసుకొచ్చి జెడ్పీలో హవా సాగించాలని అదే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తాపత్రయ పడుతున్నారు. జెడ్పీలో వేరొకరు వేలు పెట్టొద్దని చైర్పర్సన్ వర్గం, తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఒప్పుకోమని ఎమ్మెల్యేల వర్గం పంతానికి పోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల మధ్య అంతరం పెరుగుతోంది. జెడ్పీలో సీఈఓగా ఎవరుండాలి? డిప్యూ టీ సీఈఓగా ఎవర్ని ఉంచాలి? అకౌంట్ ఆఫీసర్‌గా ఎవర్ని వేసుకోవాలి? ఇంజినీరింగ్ అధికారులను ఎక్కడెక్కడ నియమించాలి? ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఎక్కడెక్కడ ఇవ్వాలి? సూపరింటెండెంట్, కింది స్థాయి ఉద్యోగులను ఎక్కడెక్కడికి బదిలీ చేయాలి? తదితర విషయాల్లో తమదే పూర్తి అజమాయిషీ ఉండాలని చైర్పర్సన్ వర్గం భావిస్తోంది. ఎవర్ని ఉంచాలో, ఎవర్ని పంపించాలో అన్నదానిపై తమ నిర్ణయమే శిరోధార్యం కావాలని ఈ వర్గం అభిప్రాయ పడుతోంది. ఇందులో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా సంకేతాలిస్తోంది. కానీ, అదే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలమని, తమ సిఫారసులే చెల్లుబాటు కావాలని కొంతమంది పట్టుబడుతున్నారు. జెడ్పీలో తమ హవా సాగాలంటే తాము సూచించిన అధికారులను నియమించాలని సంబంధిత మంత్రిపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ అభిప్రాయ బేధాలే నేతల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రస్తుత జెడ్పీ సీఈఓనే ఇంకొన్నాళ్లు కొనసాగించాలని ఓ వర్గం భావిస్తుంటే, కాదూ కూడదని ఓ ఇద్దరు అధికారులను తెరపైకి తీసుకొచ్చి వారినే నియమించాలని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు వద్ద విశ్వప్రయత్నాలు చేస్తున్నారు మరో వర్గం వారు. గతంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన డి.వి.రమణమూర్తిని లేదంటే జిల్లాలో గతంలో హౌసింగ్ స్పెషలాఫీసర్‌గా పనిచేసిన ఓ.రామ్మూర్తిని నియమించాలని ఆ వర్గం మంత్రిపై ఒత్తిడి తెస్తోంది. ఇందులో ఒక అధికారి మంత్రి సామాజిక వర్గం కావడంతో తమ సిఫారసు ఫలిస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జెడ్పీ అకౌంట్ ఆఫీసర్ పోస్టులో తమ వారిని నియమించాలని కొంతమంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తుండగా, తమకు నచ్చిన వ్యక్తిని నియమించుకునే పనిలో చైర్పర్సన్ వర్గం ఉంది. ఇదే తరహాలో ఎంపీడీఓల నియామకంలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల బదిలీల విషయంలో కూడా తమదే పైచేయి కావాలని ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా అధికారుల జాబితాలను తయారు చేసుకుంటున్నారు. తాము సూచించిన వారికి ప్రాధాన్యం కల్పించాలని ఎవరికివారు పట్టు పడుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ ఇన్చార్జి ఈఈగా పనిచేసిన శ్రీనివాస్‌కుమార్ విషయంలో అటు చైర్పర్సన్, ఇటు ఎమ్మెల్యేల మధ్య వైరం చోటు చేసుకుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికే అధికారులు అనుకూలంగా పనిచేస్తారని, ఆ క్రమంలో శ్రీనివాస్‌ను కూడా మార్చుకోవచ్చని కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గట్టిగా ఒత్తిడి చేశారు. కానీ శ్రీనివాస్ విషయంలో జెడ్పీ పాలకపెద్దలు వెనక్కి తగ్గలేదు. ఈఈ ఇన్చార్జి బాధ్యతలను తొలగిస్తూ డీఈగా వెనక్కి పంపించేశారు. ఈ నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తాము చెప్పినా వినలేదని, ఇలాగైతే కష్టమనే అభిప్రాయానికొచ్చారు. మిగతా ఇంజినీరింగ్ అధికారుల బదిలీల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే తాడోపేడో తేల్చుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికైతే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే విషయాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఏకులా వచ్చి మేకులా కూర్చొన్నారని ఒకరిపైఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి లేకపోతే కష్టమేనని, సమన్వయ లోపంతో సమస్యలు వచ్చి పడతాయని పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరి ఆధిపత్యం కోసం మిగతా వాళ్లు చిన్నపోకూడదని ఒక వర్గం, అధికారం తమదైతే మిగతా వారి పెత్తనమేంటని మరో వర్గం పంతానికి పోతున్నాయి. చినికి చినికి గాలివానగా మారి ఇదెక్కడికి దారితీస్తుందోనన్న వాదన టీడీపీ వర్గాల్లో విన్పిస్తోంది. -
సర్వం సిద్ధం
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకోనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం ముస్తాబైంది. ఇందులో ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారి హోదాలో ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి బుధవారం రాత్రి పరిశీలించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ సమస్యల లేకుండా చూడాలని సీఈవో జయప్రకాశ్ నారాయణ్‌కు సూచించారు. నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో 144 సెక్షన్ జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ను అమలు చేసి, ఖమ్మంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నిక ప్రక్రియను రికార్డు చేసేందుకు జిల్లా పరిషత్ ఆవరణతో పాటు సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు అమర్చారు. అపరిచిత వ్యక్తులను లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జెడ్పీ ప్రధాన ద్వారాల రెండు వైపులా బారీకేట్లను ఏర్పాటు చేశారు. -
చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక
-
జమ్మలమడుగు ‘పురం’.. వైఎస్ఆర్సీపీ పరం
లాటరీలో చైర్‌పర్సన్‌గా తులసి ఎన్నిక జమ్మలమడుగు: గత పదిరోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ వశమైంది. ఆదివారం నిర్వహించిన ఎన్నికలో చైర్‌పర్సన్‌గా తాతిరెడ్డి తులసి ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న తులసి, టీడీపీ అభ్యర్థి లక్ష్మీ మహేశ్వరిలకు సమానంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి లాటరీ నిర్వహించగా అదృష్టం తులసిని వరించింది -
జెడ్పీ.. గులాబీ వశం
చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక టీడీపీతో సహా 21 మంది సభ్యుల మద్దతు వైస్ చైర్మన్‌గా టీడీపీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి ఫలించిన మంత్రి మహేందర్‌రెడ్డి ‘మంత్రాంగం’ తుదకంటూ కొనసాగిన ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై రెండు నెలల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆదివారం జిల్లా పరిషత్‌లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యాలాల జడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె పేరును తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రతిపాదించగా, యాచారం జెడ్పీటీసీ రమేష్ బలపర్చారు. టీఆర్ఎస్ సభ్యులు 12మంది, టీడీపీ సభ్యులు ఏడుగురితోపాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు సునీతారెడ్డికి మద్దతు పలికారు. మొత్తంగా 21 మంది మద్దతు ఆమెకు లభించింది. కుత్భుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు బి.ప్రభాకర్‌రెడ్డి (టీడీపీ) జడ్పీ వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. ఈయన పేరును ఘట్కేసర్ జెడ్పీటీసీ సంజీవరెడ్డి ప్రతిపాదించగా, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య బలపర్చారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం సొంత చేసుకునేంత ఆధిక్యం ఏ పార్టీకి లభించలేదు. 14 స్థానాలు కాంగ్రెస్, 12 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగా టీడీపీ ఏడు స్థానాలను సంపాదించుకుంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. రాజకీయ పరిస్థితులను టీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుని.. ఆదివారం నాటకీయంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. అధ్యక్ష ఎన్నికలో సహకరించిన టీడీపీకి ఉపాధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జంగారెడ్డికి చైర్మన్ పదవికి పోటీపడగా, 12 మంది మద్దతు తెలిపారు. టెన్షన్.. టెన్షన్ జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి జిల్లా పరిషత్‌లో ఉత్కంఠత నెలకొంది. వాస్తవానికి ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉం డగా.. కోరం లేకపోవడంతో వారం పాటు ఎన్నికను వా యిదా వేశారు. ఈ సమయంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. టీడీపీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవిని ఎరవేస్తూ టీఆర్ఎస్ నెరిపిన రాజకీయ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్‌కి సహకరించి పదవీ కాలాన్ని పంచుకోవాలని టీడీపీ ఆధినాయకత్వం నిర్ణయించి చర్చలు జరిపినప్పటికీ.. మధ్యలో నెలకొన్న అవాంతరాలతో స్నేహం చిగురించలేదు. అయితే అంతర్గతంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. బయటకు పొక్కకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో టీఆర్ఎస్కి టీడీపీ పూర్తి సహకారం ఇవ్వడంతో అధ్యక్ష పీఠం కూడా టీఆర్ఎస్కే దక్కనున్నట్లు స్పష్టమైంది. ఏకపక్షంగా ఎన్నిక కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ఖాజామొయినుద్దీన్, నవాజ్ ముంతాజ్, మహ్మద్ రఫీ, మీర్ మహ్మద్ అలీ ఉన్నారు. వీరిలో ఖాజామొయినుద్దీన్, మీర్ మహ్మద్‌అలీ కోఆప్షన్ సభ్యులుగా 21 మంది మద్దతుతో గెలుపొందారు. రెండోసారి.. పట్నం సునీతారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి సతీమణి అయిన ఈమె 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. తొలిసారి జిల్లా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా 2014 ఎన్నికల్లో యాలాల మండలం నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందారు. భర్త మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆమె రెండోసారి చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. ప్రొఫైల్ పేరు: పట్నం సునీతారెడ్డి పుట్టిన తేదీ: 25-11-1975 విద్యార్హత: బీఎస్సీ మ్యాథ్స్ సొంతూరు: మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్ తల్లిదండ్రులు: రాజమణి, గోపాల్‌రెడ్డి భర్త: మహేందర్‌రెడ్డి (రవాణశాఖ మంత్రి) సంతానం: కూతురు మనీషారెడ్డి, కుమారుడు రినీష్‌రెడ్డి చేపట్టిన పదవులు: 2006లో తొలిసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక, తాజాగా మరోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక. -
జెడ్పీ కా ‘రాణి’
- జెడ్పీపై ఎగిరిన గులాబీ జెండా - చైర్‌పర్సన్‌గా వల్లకొండ శోభారాణి - వైస్ చైర్మన్‌గా మూల రాజిరెడ్డి - మూడేళ్ల తర్వాత ఎన్నిక.. సాక్షి,ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిర్మల్ జెడ్పీటీసీ వల్లకొండ శోభారాణి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా చెన్నూరు జెడ్పీటీసీ మూల రాజిరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కోసం శనివారం జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు జెడ్పీటీసీలు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌గా శోభారాణి పేరును గుడిహత్నూర్ జెడ్పీటీసీ కేశవ్‌గిత్తే ప్రతిపాదించగా, ఆదిలాబాద్ జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్ బలపరిచారు. ఈ పదవికి ఎవరూ పోటీలో లేకపోవడంతో శోభారాణి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ జగన్మోహన్ ప్రకటించారు. అలాగే వైస్‌చైర్మన్‌గా మూల రాజిరెడ్డి పేరును మందమర్రి జెడ్పీటీసీ కె.సుదర్శన్ ప్రతిపాదించగా, కౌటాల జెడ్పీటీసీ డుబ్బుల నానయ్య (బీఎస్పీ నుంచి పోటీచేసి గెలిచారు) బలపరిచారు. ఈ పదవికి కూడా ఎవరూ పోటీలో లేకపోవడంతో వైస్‌చైర్మన్‌గా రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 52 స్థానాలకు గాను 38 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ జిల్లా పరిషత్ చరిత్రలోనే మొదటి సారిగా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేశారు. కో ఆప్షన్ సభ్యులూ ఏకగ్రీవమే.. జెడ్పీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది. చెన్నూరుకు చెందిన సయ్యద్ సాదిఖ్ అలీ, ఖానాపూర్‌కు చెందిన యూసుఫ్ అహ్మద్ ఖాన్లు ఎన్నికయ్యారు. ఈ రెండు కోఆప్షన్ పదవులకు ఐదుగురు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరితో పాటు ఇంద్రవెల్లికి చెందిన ఎం.డి.అంజద్, ఖానాపూర్‌కు చెందిన రఫీక్ బేగ్, ఎండీ జహీరుద్దీన్లు నామినేషన్లు వేశారు. ఇందులో అంజద్, రఫీక్ బేగ్‌ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, జహీరుద్దీన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న సాదిఖ్ అలీ, యూసుఫ్ అహ్మద్‌ఖాన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్నిక జరిగింది ఇలా.. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పదవులకు నామినేషన్లు తీసుకున్నారు. ఈ నామినేషన్లను పరిశీలించిన అనంతరం ముగ్గురు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మొదట జెడ్పీటీసీలతో జెడ్పీ సీఈఓ అనితాగ్రేస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి మూడు గంటలకు సమావేశం ప్రారంభం కాగా మొదట చైర్‌పర్సన్‌ను, తర్వాత వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ చైర్మన్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం శోభారాణితో సీఈఓ అనితాగ్రేస్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయించారు. శోభారాణి జెడ్పీటీసీగా ఒకసారి, చైర్‌పర్సన్‌గా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఘనంగా సన్మించారు. సమావేశం ముగిసిన తర్వాత శోభారాణి నేరుగా తన చాంబర్లోకి వెళ్లి పదవీ బాధ్యతలు స్వీకరించారు. చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠ చైర్పర్సన్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. శోభారాణితో పాటు, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశలత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఎట్టకేలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శోభారాణి పేరు ఖరారైంది. కాగా మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు జెడ్పీటీసీలతో కలిసి బాసరలో క్యాంపులో ప్రత్యేక సమావేశమై.. ఎన్నిక విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ తొలి సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతో పాటు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోనేరు కోనప్ప (సిర్పూర్), నల్లాల ఓదేలు (చెన్నూరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్), జి.విఠల్‌రెడ్డి (ముథోల్), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), రాథోడ్ బాపురావు (బోథ్)లు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కరీంనగర్ జెడ్పీ సమావేశానికి వెళ్లడంతో ఇక్కడి సమావేశానికి రాలేకపోయినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమంలా ముగిసిన తొలి సమావేశం.. జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ తొలి సమావేశం చివరకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల అభినందన సభగా ముగిసింది. చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం వీరిని సన్మానించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశం వేదిక ముందున్న ఎంపీ, ఎమ్మెల్యేలను కలెక్టర్ జగన్మోహన్ వేదికపైకి ఆహ్వానించి, సమావేశం నుంచి నిష్ర్కమించారు. ఆ తర్వాత జెడ్పీ ప్రత్యేక సమావేశం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పార్టీ అభినందన సభలా తయారైంది. కేవలం అర్హత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపైన కూర్చునే నిబంధనలు ఉండగా, ఆ పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. జెడ్పీటీసీల కుర్చీల్లో పార్టీ కార్యకర్తలు ఆసీనులయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు సమావేశం హాలులోకి చొచ్చుకు వచ్చారు. తమ నాయకున్ని వేదికపైకి పిలవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైర్పర్సన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశం కాస్త పార్టీ కార్యక్రమంలా ముగియడం అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. -
రేపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక
కరీంనగర్ సిటీ : మూడున్నరేళ్ల ప్రత్యేకపాలనకు తెరపడనుంది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ఇదీ.. శనివారం ఉదయం 10 గంటల్లోపు రెండు కో ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటన 1 గంట వరకు ఉపసంహరణ 1 గంటకు ప్రత్యేక సమావేశం, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం అవసరమైతే కో ఆప్షన్ పదవులకు ఓటింగ్. ఫలితం వెల్లడి మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక అనంతరం ఫలితాల వెల్లడి, జెడ్పీ చె రపర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణస్వీకారం ఎన్నిక నిర్వహణ ఇలా.. జిల్లా పరిషత్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం విధివిధానాలు జారీ చేసింది. ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. జాతీయ పార్టీలకు ముందు వరుసలో అవకాశం కల్పిస్తారు. పార్టీల వారీగా తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. పలానా పార్టీ నుంచి పలానా జెడ్పీటీసీని చైర్‌పర్సన్‌గా, వైస్‌చైర్మన్‌గా నియమించామని పార్టీఇచ్చిన ఆథరైజేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి(పీవో)కి అందచేస్తారు. దీనినే అభ్యర్థుల నామినేషన్‌గా పరిగణిస్తారు. అభ్యర్థికి మరొకరు ప్రతిపాదిస్తారు. ఇంకొకరు బలపరుస్తారు. ఒక్క పార్టీ నుంచి మాత్రమే ఆథరైజేషన్ వస్తే, ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు పీవో ప్రకటిస్తారు. రెండు పార్టీలు పోటీపడితే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి పేరు చెప్పి అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో చేతులెత్తండి అని పీవో అడగగానే,చేతులెత్తిన జెడ్పీటీసీలను సిబ్బంది లెక్కిస్తారు. ఎవరికి ఎక్కువ మంది చేతులెత్తెతే వారే విజేతలు. చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకనే వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
ఆమదాలవలస పీఠం టీడీపీ కైవసం
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ తమ్మినేని గీత ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో గణేష్‌కుమార్ అధ్యక్షతన ఎన్నిక జరిగింది. ముందుగా ఎక్స్అఫీషియో ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడులకు ఓటుహక్కు పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 23 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా గీతను ఆ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ ఇంజరావు విశ్వనాథం ప్రతిపాదించగా 4వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ రుప్ప రామచంద్రరావు బలపరి చారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతాకుమారి పేరును బొడ్డేపల్లి రమేష్‌కుమార్ ప్రతిపాదించగా, ఎస్.మురళీధరరావు బలపరిచారు. దీంతో ఆర్డీవో ఎన్నిక ప్రక్రియను ఆరంభించారు. వాస్తవంగా మున్సిపాలిలోని 23వార్డులకు 10 వార్డులు వైఎస్సార్ సీపీ, 8వార్డులు టీడీపీ, 3 వార్డులు కాంగ్రెస్, 2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకరు వైఎస్సార్ సీపీలోకి, మరొకరు టీడీపీలో చేరిపోయారు. దీంతో వైఎస్సార్ సీపీకి 11, టీడీపీకి 9 మంది కౌన్సిలర్లు ఉన్నా రు. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులతో కలిసి 15 మంది టీడీపీ అభ్య ర్థి గీతకు మద్దతుగా చేతులెత్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతుగా 11 మం ది చేతులెత్తారు. దీంతో నాలుగు ఓట్ల ఆధిక్యంతో టీడీపీకి చెందిన గీత చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఆర్డీవో ప్రకటించారు. అలాగే, వైస్ చైర్ప ర్సన్‌గా టీడీపీ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కె.వి.రాజ్యలక్ష్మి పేరు ప్రతిపాదించగా, వైఎ స్సార్ సీపీ తరఫున ఇండిపెండెంట్ కౌన్సిలర్ బి.ఏకాశమ్మను ప్రకటించారు. ఈ ఎన్నికలో కె.వి.రాజ్యలక్ష్మి విజేతగా నిలిచింది. -
కొలువుదీరిన కొత్త ‘పుర’ పాలకవర్గాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ పరోక్ష పరీక్షలో కారు జోరు కొనసాగింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా, ఐదు మున్సిపాలిటీలపై అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను దక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. మంచిర్యాల, బెల్లంపల్లిల్లో కాంగ్రెస్ అధిక కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నా చైర్మన్ పీఠాలను దక్కించుకోలేకపోయింది. ఒక్క మంచిర్యాలలో వైస్ చైర్మన్ పదవికే పరిమితమైంది. మొత్తానికి బల్దియా పోరులో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది. ఆదిలాబాద్ బల్దియాలో 14 కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్న టీఆర్ఎస్ నలుగురు ఎంఐఎం, మరో నలుగురు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. వైస్‌చైర్మన్ ఎంఐఎంకు దక్కింది. చైర్మన్‌గా రంగినేని మనీష, వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన ఎండీ ఫారుఖ్ అహ్మద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఎక్స్ అఫీషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్‌లో పురపాలక సంఘం చైర్మన్ సాంకేతికంగా బీఎస్పీ వశమైనా.. అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడింది. బీఎస్పీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచిన అప్పాల గణేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో సహా గణేష్ కూడా టీఆర్ఎస్లో చేరారు. వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన అజీం బీన్ యాహియా ఎన్నికయ్యారు. బెల్లంపల్లిలో బల్దియాపైనా టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. చైర్మన్‌గా పి.సునీతారాణి, వైస్‌చైర్మన్‌గా నునేటి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 14 స్థానాలు లభించినా, పది కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను వశం చేసుకోగలిగింది. ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లతోపాటు మరో నలుగురు స్వతంత్రులు కూడా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఆయా పార్టీలు విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్కు చెందిన మామిడిశెట్టి వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కింది. ఆ పార్టీ కౌన్సిలర్ నల్ల శంకర్ కూడా ఏకగ్రీవంగా వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు దక్కినా, ఆ పార్టీ సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశమైంది. చైర్మన్‌గా సి.పి.విద్యావతి, వైస్‌చైర్మన్‌గా సద్దాం హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఈ పదవుల కోసం టీఆర్ఎస్లోనే పోటాపోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనుచరు లు, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు పోటీ పడ్డా రు. ఈ విషయంలో మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న ఇరువర్గాల మధ్య స యోధ్య కుదిర్చారు. ఎట్టకేలకు సమ్మయ్య అనుచరులకే పదవులు దక్కాయి. భైంసాలో అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందిన ఎంఐఎం ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సహాయంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. చైర్మన్‌గా సబియా బేగం, వైస్ చైర్మన్‌గా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. -
నేడే ‘పురాధీశుల’ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల పర్వంలో తుది ఘట్టానికి నేడు తెరపడనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పాలక మండళ్లు గురువారం కొలువు దీరనున్నాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, మంచిర్యాల, బెల్లంపల్లి పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. భైంసా బల్దియాలో ఎంపీ ఓటు హక్కు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మున్సిపాలిటీల వివరాలను జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న భైంసా మున్సిపాలిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ, అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీపైనా దృష్టి పెట్టింది. ఎంఐఎం మినహా అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదిలాబాద్ ఎంపీ ఓటును ఈ మున్సిపాలిటీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఎంఐఎం తో ఉన్న స్నేహ సంబంధాల మేరకు ఈ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎంకు దక్కేలా సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి రామన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ సుమన్ కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు వేయాలని భావిస్తున్నా రు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలో, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కాగజ్‌నగర్ బల్దియాలో, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల మున్సిపాలిటీలో, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వీరంతా విల్లింగ్ లెటర్లను ఎన్నికల అధికారులకు ఇచ్చారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాతే చైర్మన్ ఎన్నికలు.. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుం ది. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే.. మరో సభ్యు డు బలపరచాలి. మొత్తం సభ్యుల్లో 50 శాతం సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. లేనిపక్షంలో గంట వరకు వేచి ఉండి, చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి, మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. -
లోక్‌సభకు 10 మంది చైర్పర్సన్లు
కమిటీని ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ టీడీపీ నుంచి కే నారాయణకు అవకాశం న్యూఢిల్లీ: లోక్‌సభ వ్యవహారాలను సజావుగా నడిపేలా స్పీకర్‌కు సహకారం అందించేందుకు 10 మంది చైర్పర్సన్లను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపిక చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగకపోవచ్చని స్పీకర్ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కొనకళ్ల నారాయణ సహా 10 మంది చైర్పర్సన్లతో ఒక కమిటీని ఆమె సోమవారం ప్రకటించారు. చైర్పర్సన్లుగా ఎంపికైన వారిలో బీజేపీకి చెందిన హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్, ప్రహ్లాద్ జోషీ, హుకుమ్ సింగ్, రామణ్ దేకలతో పాటు అర్జున్ చరణ్ సేథీ(బీజేడీ),తంబిదురై(అన్నాడీఎంకే), కేవీ థామస్(కాంగ్రెస్), ఆనంద్‌రావు అద్సుల్(ఎస్ఎస్), రత్న డే(తృణమూల్) ఉన్నారు. -
సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా
వరుసగా ఐదోసారి ఈ పదవికి ఎన్నిక ఆమె పేరును ప్రతిపాదించిన ఖర్గే బలపరిచిన కిద్వాయ్, ఇతర నేతలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ శనివారం తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సోనియా పేరును పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా మొహిసినా కిద్వాయ్ సహా ఇతర నేతలు ఆ ప్రతిపాదనను బలపరిచారు. తాజా ఎన్నికతో సోనియా సీపీపీ పగ్గాలను వరుసగా ఐదోసారి చేపట్టినట్లయింది. 1998 మార్చి 16న సోనియా తొలిసారి సీపీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యురాలు కాకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో పార్టీని ముందుండి నడిపించిన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సమావేశంలో వెనక బెంచీకే పరిమితమయ్యారు. సీపీపీ చీఫ్‌గా ఎన్నికైన అనంతరం సోనియా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి రాహుల్ బృందం అనుసరించిన వైఖరే కారణమంటూ కొందరు నేతలు బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో సోనియా స్పందించారు. ప్రజా వ్యతిరేకతను అంచనా వేయడంతో విఫలమయ్యామని, ఓటమి నుంచి గుణాపాఠాలు నేర్చుకోవాలని అన్నారు. అధైర్యం వద్దు: పార్టీ ఓటమి అందరినీ కలచివేసినా అధైర్యపడొద్దని నేతలకు సోనియా సూచించారు. ‘‘బీజేపీకి 17.16 కోట్ల ఓట్లు లభిస్తే మనం 10.69 కోట్ల ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచాం. పార్టీకి అనాదిగా ఉన్న విస్తృత జనాదరణ, మద్దతును తిరిగి పొందేందుకు కష్టపడటమే మనం ఇక చేయాల్సింది’’ అని పేర్కొన్నారు. యూపీఏ-2 ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించడంలో ప్రధాన ప్రతిపక్షం (బీజేపీ) సహకరించలేదని సోనియా విమర్శించారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ అవకాశవాదానికి పాల్పడిందని దుయ్యబట్టారు. లోక్‌సభలో తాము కేవలం 44 సీట్లనే గెలుచుకున్నప్పటికీ విపక్షంగా దూకుడుగా వ్యవహరిస్తామని సోనియా పేర్కొన్నారు. గత లోక్‌సభ ముందు ఉంచిన పెండింగ్ బిల్లుల విషయంలో నూతన ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూస్తామన్నారు. లోక్‌సభలో తమ బలం తక్కువగా ఉన్నా రాజ్యసభలో ఇప్పటికీ తమదే అతిపెద్ద పార్టీ అని గుర్తుచేశారు. కాగా, పార్లమెంటులో బలమైన, సంఘటితమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు నిర్మాణాత్మక, లౌకిక శక్తులన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు సీపీపీ తీర్మానం చేసింది. మోడీ నాయకత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి ఈ భేటీలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతపై సోనియాదే నిర్ణయం: లోక్‌సభలో ప్రతిపక్ష నేత నియామకంపై సోనియానే తుది నిర్ణయం తీసుకుంటారని జనార్దన్ ద్వివేదీ తెలిపారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా ఎన్నిక కావడంతో ప్రతిపక్ష నేత, చీఫ్ విప్‌లను నియమించే అధికారం ఆమెకుందన్నారు. కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సోనియా లేక రాహులే ఉండాలంటూ పార్టీలోని ఓ వర్గం నేతలు పట్టుబడుతుండగా సీనియర్ నేత కమల్‌నాథ్ పేరూ వినిపిస్తోంది. రాజ్యసభలో పార్టీ నేతగా ఆంటోనీ, ఆజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. సోనియా, రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉందని ఆంటోనీ, కమల్‌నాథ్ పేర్కొన్నారు. -
రేసు గుర్రాలకు రేటు!
ఆర్మూర్, న్యూస్‌లైన్: నిజామాబాద్ మేయర్, ఆర్మూర్, కా మారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వ హించనున్నారు. అధికారం ఆశిస్తున్నవారికి ఇదే వరంగా మారింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్, పరిషత్, సార్వత్రి క ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడిన నాటినుంచి రా ష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా జిల్లాలోని ఎన్నికల అధికారులు గట్టి చర్యలే చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం నిలువలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. కానీ, పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించిన అనంతరం ప్రజా ప్రతినిధులను శిబిరాలకు తరలించడమే కాకుండా, లక్షలు పోసి కొనుగోలు చేస్తున్న విషయా న్ని మాత్రం ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేద నే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ఓటర్లను రూ. 500తోనో, రూ. వెయ్యితోనో, మద్యంతోనో ప్రలోభాలకు గురి చేస్తేనే తప్పని భావించిన ఎన్నికల కమిషన్ లక్షల రూపాయలు వెచ్చించి క్యాంపులలో ప్రజా ప్రతినిధులకు మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్న విషయాలను మాత్రం విస్మరిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల ఫలితాల అనంతరం మేయ ర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను ఆశిస్తున్నవారు క్యాంపులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 36 మండలాలలో 583 ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీల ఫలితాల అనంతరం విజేతలను ప్రకటించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోసం క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. అందుకు విందులు, వినోదాల రూపంలో లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరి కొందరు ప్రజా ప్రతినిధులను విహార యాత్రలకు పంపిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంది. స్పష్టమైన మెజారిటీ సాధించిన ప్రదేశాలలో మినహాయిస్తే హంగ్ ఏర్పడిన స్థానంలోనే అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నవారికి ఖర్చు ఎక్కువ అవుతోందని ఆయా పార్టీల నాయకులే స్వయంగా చెప్పుకుంటున్నారు. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సైతం లక్షల్లో ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం సుమారు రూ. రెండు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో ఆర్థిక స్థోమత లేని కొందరు నాయకులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, దీనిని నియంత్రించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌గాని, జిల్లా ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
నేడు తొలి విడత పోలింగ్
పోలింగ్ సమయం :ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఆదివారం తొలి విడత పోలింగ్ జరగనుంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ, 705 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలివిడతగా ములుగు, నర్సంపేట రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 మండలాల్లో 423 లొకేషన్లలో 777 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 మండలాలను 80 జోన్లు... 101రూట్లుగా విభజించారు. 856 పోలింగ్ ఆఫీసర్లు, 3419 సహాయ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. 387 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ (నెట్ ద్వారా ప్రసారం) చేస్తుండగా.. ఇంటర్నెట్ అందుబాటులో ఉండే పోలింగ్ లొకేషన్లలో 253 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. మొదటి విడతలో 86 సాధారణ, 148 సున్నిత, 89 అత్యంత సున్నిత, 77 తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే మండలాలు ములుగు డివిజన్లోని భూపాలపల్లి, చిట్యాల, ఏటూరునాగారం, గణపురం (ములుగు), గోవిందరావుపేట, మంగపేట, మొగుళ్లపల్లి, ములుగు, పరకాల, రేగొండ, తాడ్వాయి, శాయంపేట, వెంకటాపురంతోపాటు నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోలింగ్ జరగనుంది. 255 గ్రామ పంచాయతీలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగిం చుకోనున్నారు. ములుగు డివిజన్లోని గోవిందరావుపేట మండలం ఎస్సీ మహిళకు రిజర్వ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్పర్సన్ రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఉదయం 7 నుంచి పోలింగ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు... ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మొత్తం 1,749 బ్యాలట్ బాక్స్‌లను వినియోగించనున్నారు. నిర్ధేశించిన సమయం ముగిసినప్పటి1కీ... పోలింగ్ కేంద్రాల అవరణలో ఉన్న ఓటర్లు ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశముంటుందని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రం ములుగు డివిజన్ పరిధిలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను ములుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... పరకాల, భూపాలపల్లి, శాయంపేట, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం (ములుగు ) మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను పరకాలలోని గణపతి డిగ్రీ కాలేజీలో భద్రపరచనున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ ఆంజనేయులు తెలిపారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రపరుస్తామన్నారు. ఎన్నికల సిబ్బందికి నిధుల కేటాయింపు స్థానిక ఎన్నికల్లో శిక్షణతోపాటు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు అలవెన్స్‌లు చెల్లించేందుకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు నిధులను విడుదల చేసినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు వారు శిక్షణ పొందిన మండలాల్లోని ఎంపీడీఓలు అలవెన్సులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. పీఓలకు ఒక్కొక్కరికి రోజుకు రూ.350 చొప్పున రెండు రోజులకు రూ.700... ఏపీఓలకు రూ.500, ఓపీఓలకు రూ.500 చెల్లించనున్నట్లు వివరించారు. పోలింగ్ రోజున పోలింగ్ అధికారులకు భోజన వసతి కల్పించని పక్షంలో ప్రతి ఉద్యోగికి రూ. వంద చెల్లించాలని ఎంపీడీఓలకు సూచించారు. మైక్రో అబ్జర్వర్లకు రూ.వెయ్యి, జోనల్ అధికారులకు రూ. 1500 చెల్లించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ చేస్తున్న విద్యార్థులు ఒక్కొక్కరికి రెమ్యూనరేషన్ కింద రూ.500తోపాటు భోజనం కింద రూ.150, వీడియో గ్రాఫర్లకు రూ.900లు చెల్లించాలన్నారు. -
స్వతంత్రులే కీలకం
సాక్షి, హన్మకొండ: పురపాలిక పోరు ముగిసినా... జిల్లాలోని ఆయూ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి బరిలో ఉండే చైర్పర్సన్ల అంశంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏ పార్టీ కూడా సదరు అభ్యర్థులను ప్రకటించ లేదు. ఈ క్రమంలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ను పరిశీలిస్తే... ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీకి ఓట్లు పడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలని గంపెడాశతో ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీలకు ఇతరుల మద్దతు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు చైర్పర్సన్ ఎంపికలో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు కీలకం కానున్నారు. మునిసిపాలిటీల్లో... మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీల్లో 28 చొప్పున వార్డులు ఉన్నారుు. కనీసం 15 వార్డులను కైవసం చేసుకుంటేనే... చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. కానీ.. హోరాహోరీ పోరు నేపథ్యంలో అటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడడం లేదు. మహబూబాబాద్ : ఈ మునిసిపాలిటీ చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అరుుంది. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది. ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపగా... కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల సరళి, ఓటరు నాడీని పరిశీలిస్తే... ఏ పార్టీ సొంతంగా 15 వార్డులు గెలిచే పరిస్థితి లేదు. స్వతంత్రులు, సీపీఏం మద్దతు కూడగట్టగలిగే పక్షానికే... చైర్పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంది. జనగామ : ఈ మునిసిపాలిటీ చైర్పర్సన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటారుుంచారు. ఇక్కడ అన్ని రాజకీయ పక్షాల కంటే కాంగ్రె స్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఒక వార్డులో హస్తం అభ్యర్థి ఏకగ్రీవమయ్యూరు. పోలింగ్‌లో సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైం ది. ఈ ప్రతిఘటన కారణంగా ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుం డా కాంగ్రెస్ చైర్పర్సన్ స్థానం దక్కించుకోవడం అనుమానమేనని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. నగర పంచాయతీల్లో... పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగరపంచాయతీల్లో 20 వార్డులు ఉన్నాయి. ఈ మూడు చోట్ల చైర్పర్సన్ స్థానం దక్కాలంటే 11 వార్డుల్లో గెలవాలి. ఏ ఒక్క పార్టీ అన్ని వార్డులు గెలిచే పరిస్థితులు లేవు. భూపాలపల్లి : ఈ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు, చైర్పర్సన్ స్థానం... సీపీఐకి 4 వార్డులు, వైస్ చైర్మన్ స్థానం ఖరారయ్యాయి. ఈ కూటమికి టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్ ఎనిమిది వార్డులు... టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో ఆధిక్యం కనబరిచినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ ఆఫీషియో ఓట్ల సాయంతో చైర్పర్సన్ స్థానం దక్కించుకునేందుకు ఇక్కడి నాయకులు పావులు కదుపుతున్నారు. పరకాల : ఈ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొనడంతో వార్డు అభ్యర్థులు ఎవరి ప్రచార బాధ్యతలను వారే తీసుకున్నారు. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చారు. అంతేకాదు... బీజేపీకి పట్టణంలో స్థిరమైన ఓటుబ్యాంకు ఉండటంతో వారు సైతం ఒకటి రెండు వార్డుల్లో గెలిచే అవకాశముంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆ పార్టీదే పై చేయిగా ఉంది. టీఆర్ఎస్ పది నుంచి 13 వార్డుల్లో విజయం సాధించే అవకాశమున్నట్లు అంచనా. నర్సంపేట : ఈ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా...నేనా అన్నట్లుగా పోరు సాగింది. పోలింగ్ సరళిని బట్టి ఈ రెండు పార్టీలు ఎనిమిది లేదా తొమ్మిది వార్డుల్లో విజయం సాధించే అవకాశముంది. రెండు నుంచి మూడు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు విజయం వరించే అవకాశం ఉంది. వీరి మద్దతు కూడగట్టగలిగే పార్టీదే చైర్పర్సన్ పీఠం. -
వలసపై సలసల...
జెడ్పీ పీఠంపై కన్నేసిన నేతలు భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్కావటంతో కుర్చీపై కన్నేసిన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక మండలాలు మాత్రమే ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రధాన రాజకీయపార్టీలన్నీ ఈ నాలుగు మండలాలపైనే దృష్టి సారించాయి. అయితే జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి పెత్తనం చెలాయిస్తున్న నేతలు తమ అనుచరులకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఆయా మండలాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. సీపీఎం, టీడీపీ మరో అడుగు ముందుకేసి ఎస్సీ జనరల్ కు కేటాయించిన భద్రాచలం, ఏన్కూర్, అశ్వాపురం వంటి చోట్ల కూడా మహిళలతో నామినేషన్ వేయించటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఎస్సీ మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచే మండలాల్లో స్థానిక ఎన్నికలు రసవత్తరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వలస అభ్యర్థులపై స్థానికుల ఆగ్రహం : జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి తమ మండలాల్లో పోటీకి నిలపడమేంటని ఆయా మండలాలకు చెందిన ప్రజానీకం మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నేలకొండపల్లికి చెందిన మహిళచే వాజేడు మండలంలో నామినేషన్ వేయించారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతోనే ఆమె అక్కడ నుంచి వాజేడుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సీపీఎం నాయకులు కూడా మణుగూరు నుంచి ఇదే మండలానికి అభ్యర్థిని తీసుకొచ్చారు. ఇక వెంకటాపురం మండలంలో పరిశీలించినట్లైతే టీడీపీ నుంచి నామినేషన్ వేసిన గడిపల్లి కవిత కొత్తగూడెం వాస్తవ్యురాలు కాగా, ఈమెకు ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అండదండలు ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఇదే మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన న ంబూరి సుజాతది వైరా కాగా, ఈమెను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడకు పంపిస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చె బుతున్నారు. పినపాకలో కాంగ్రెస్ నుంచి పోటీలో నిలుస్తున్న జాడి జమున హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమెను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇక్కడికి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఇదే మండలంలో టీడీపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి మణుగూరుకు చెందిన వారు. అదే విధంగా చర్లలో టీడీపీ నుంచి పోటీలో నిలుస్తున్న తోటమల్ల హరిత ఖమ్మం పట్టణానికి చెందిన వారు కాగా, సీపీఎం నుంచి బరిలో నిలుస్తున్న గెద్దల జ్యోతి అశ్వారావుపేట వాస్తవ్యురాలు. ఇలా దాదాపు నాలుగు మండలాల్లో కూడా ప్రధాన పార్టీలన్నీ వేరే మండలాలకు చెందిన అభ్యర్థులతోనే నామినేషన్లు వేయించాయి. దీనిపై ఆయా మండలాలకు చెందిన పార్టీల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ మండలాల వారికి కాదని వేరే ప్రాంతాల వారికి సీట్లు కట్టబెట్టడమేంటని కాంగ్రెస్, టీడీపీ లకు చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులకు ఓటేసిలేదని తెగేసి చెబుతున్నారు. స్థానికులకు గుర్తింపునిచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీనే ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారితో పలు పార్టీలు నామినేషన్ వేయించగా... ఒక్క వైఎస్ఆర్సీపీనే ఆయా మండలాల్లో గల స్థానిక కార్యకర్తలకు అవకాశం ఇచ్చింది. వెంకటాపురం, చర్ల, పినపాక మండలాల్లో పార్టీ నాయకుల ఆమోదం మేరకు స్థానిక మహిళా అభ్యర్థులనే బరిలో నిలిపారు. చర్ల మండలంలో చింతల శ్రావణి, వెంకటాపురంలో యన్నమల్ల జోత్సారాణి, పినపాక మండలంలో పంతగాని సంధ్యారాణి వైఎస్ఆర్సీపీ నుంచి నామినేషన్లు వేశారు. సొంతమండలాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేయటంపై ఆయా మండలాల్లోని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డారు. దిగుమతి అభ్యర్థుల వల్ల మండల ప్రజానీకం నుంచి వ్యతిరేక వస్తుందేమోనని వీరు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మొత్తంగా... తమ ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్న స్థానిక అభ్యర్థులకే పట్టం కట్టాలనే చర్చకూడా ఆయామండలాల్లో నడుస్తుండడం విశేషం.