ఆమదాలవలస పీఠం టీడీపీ కైవసం
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ తమ్మినేని గీత ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో గణేష్‌కుమార్ అధ్యక్షతన ఎన్నిక జరిగింది. ముందుగా ఎక్స్‌అఫీషియో ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడులకు ఓటుహక్కు పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 23 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గీతను ఆ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ ఇంజరావు విశ్వనాథం ప్రతిపాదించగా 4వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ రుప్ప రామచంద్రరావు బలపరి చారు.
వైఎస్సార్ సీపీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతాకుమారి పేరును బొడ్డేపల్లి రమేష్‌కుమార్ ప్రతిపాదించగా, ఎస్.మురళీధరరావు బలపరిచారు. దీంతో ఆర్డీవో ఎన్నిక ప్రక్రియను ఆరంభించారు. వాస్తవంగా మున్సిపాలిలోని 23వార్డులకు 10 వార్డులు వైఎస్సార్ సీపీ, 8వార్డులు టీడీపీ, 3 వార్డులు కాంగ్రెస్, 2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకరు వైఎస్సార్ సీపీలోకి, మరొకరు టీడీపీలో చేరిపోయారు.
దీంతో వైఎస్సార్ సీపీకి 11, టీడీపీకి 9 మంది కౌన్సిలర్లు ఉన్నా రు. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులతో కలిసి 15 మంది టీడీపీ అభ్య ర్థి గీతకు మద్దతుగా చేతులెత్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతుగా 11 మం ది చేతులెత్తారు. దీంతో నాలుగు ఓట్ల ఆధిక్యంతో టీడీపీకి చెందిన గీత చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఆర్డీవో ప్రకటించారు. అలాగే, వైస్ చైర్‌ప ర్సన్‌గా టీడీపీ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కె.వి.రాజ్యలక్ష్మి పేరు ప్రతిపాదించగా, వైఎ స్సార్ సీపీ తరఫున ఇండిపెండెంట్ కౌన్సిలర్ బి.ఏకాశమ్మను ప్రకటించారు. ఈ ఎన్నికలో కె.వి.రాజ్యలక్ష్మి విజేతగా నిలిచింది.