AMADALAVALASA
-
ఆముదాలవలసలో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి
-
శ్రీకాకుళం జిల్లా: టీడీపీ ఇష్టారాజ్యం.. పెన్షన్ల నిలిపివేత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రాజకీయ కక్షతో పలు చోట్ల పెన్షన్ నిలిపివేయించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో 19 మందికి పెన్షన్ ఆపేశారు. టీడీపీ నేతల ఆదేశాలతోనే తమకు పెన్షన్ నిలిపివేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిన్నటి నుంచి పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో పెన్షన్ కోసం లబ్ధిదారులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.కాగా, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది.మరోవైపు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. -
ఆమదాలవలసలో ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన
-
‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం నడుస్తోందని ఆయన అన్నారు. ‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు. నిపుణులు ఎంత చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేద’ని తమ్మినేని మండిపడ్డారు. జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందన్నారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
విశాఖ రాజధాని కోసం నినదించిన విద్యార్థి లోకం
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. -
శ్రీకాకుళం: స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
-
స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Extramarital Affair: ఫోన్‌పేలో డబ్బులు పంపిన మహేశ్.. రుజువు చూపించమని అడగడంతో..
ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా): ఆమదాలవలస పట్టణంలోని ఎల్.అప్పారావు వీధిలో ఇటీవల జరిగిన పాతిన అనూరాధ హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ పైడయ్య సోమవారం తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. పొందూరు మండలం గోకర్నపల్లి గ్రామానికి చెందిన సీపాన మహేష్ అనే వ్యక్తి ఈ హత్య చేసి నట్లు సీఐ వెల్లడించారు. హత్య జరిగిన రోజు మహేష్ రాత్రి 10 గంటల నుంచి 10.45 వరకు అనూరాధ ఇంటిలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. నిందితుడి చేతికైన గాయమే అతడిని పట్టించింది. చదవండి: భర్తకు దూరం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరికి.. సీఐ తెలిపిన వివరాల మేరకు.. గోకర్నపల్లికి చెందిన మహేష్ హత్య జరిగిన రోజు రాత్రి అనూరాధను కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వా దన జరిగింది. ఫోన్ పేలో బదిలీ చేశానని మహేష్ చెప్పగా.. ఆమె రుజువు చూపించమని అడిగే సరికి పాత లావాదేవీల రశీదును ఫోన్లో చూపించాడు. దీన్ని పసిగట్టిన అనూరాధ అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ ఘర్షణలో తొలుత మహేష్ కత్తెరతో అనూరాధ మెడపై దాడి చేశాడు. ఆమె అరవడంతో ఇరుగు పొరుగు వారు తలుపులు కొట్టారు. దీంతో మహేష్ ఆమె నోటిని గట్టిగా నొక్కి పట్టాడు. కాసేపటి తర్వాత విడిచి పెట్టేసరికి ఆమె కొన ఊపిరితో కనిపించింది. ఆమె బతికితే తనకు ఇబ్బంది తప్పదని కత్తెరతో 24 పోట్లు పొడిచి చంపేశాడు. హత్య చేశాక తన దుస్తులకు రక్తం అంటుకోవడంతో ఆ ఇంటిలోనే స్నానం చేసి మృతురాలి మొబైల్‌ను లెట్రిన్‌లో పడేశాడు. మరో కీ ప్యాడ్ ఫోన్లో బ్యాటరీ తీసి విసిరేసినట్టు పోలీసులు తెలిపారు. గాయం కోసం చికిత్సకు వెళ్తే.. హత్య చేసే క్రమంలో మహేష్ చేతికి కూడా గాయమైంది. దీంతో అతను సొంతూరికి వెళ్లకుండా సంతకవిటిలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న వీఆర్ఓ మహేష్‌ను గమనించగా.. అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వీఆర్ఓ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుని, ఎలా జరిగిందో వివరించాడు. అంతకుముందు పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేశారు. హత్య జరిగిన సమయంలో ఆమె ఫోన్‌కు పలువురి నుంచి కాల్స్ వచ్చినట్లు గమనించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా నిందితుడు గాయంతో పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ కృష్ణారావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
నాన్నా.. అని పిలిచినా రాలేడు కన్నా!
నెల కిందటే బిడ్డను ఎత్తుకుని ఆ తండ్రి మురిసిపోయాడు. గుండెలపై ఎక్కించుకుని ఆడించాడు. సెలవులు ముగిసిపోవడంతో దేశ రక్షణ విధుల్లో పాల్గొనడానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రీ కొడుకుల మధ్య దూరం శాశ్వతమైపోయింది. నాన్నా.. అని పిలిచినా రాలేని లోకాలకు తండ్రి తరలివెళ్లాడు. అసోంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న వాసుదేవరావు చనిపోయాడని వార్త తెలియడంతో గొల్లపేట ఘొల్లుమంది. ఆమదాలవలస రూరల్: మండలంలోని గొల్లపేటకు చెందిన ఆర్మీ జవాన్ కొల్లి వాసుదేవరావు (31) అసోంలో శనివారం మృతి చెందారు. జవా న్ మృతి వార్త కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాసుదేవరావు 2010లో ఆర్మీలో జవాన్ గా ఉద్యోగం సంపాదించాడు. అందరితో కలిసి మెలసి ఉండే వాసుదేవరావు గత ఏడాదే వివాహం చేసుకున్నాడు. వీరికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. వాసుదేవరావు భార్య వసంత ప్రస్తుతం ఎల్‌ఎన్‌పేట మండలం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, బాబు పుట్టినప్పుడు వాసుదేవరావు ఇంటికి వచ్చి వారసుడిని చూసుకున్నాడు. ఎలక్షన్ల సమయంలో కూడా ఇంటి వద్దనే ఉన్నాడు. మళ్లీ సెలవులపై వచ్చి కొడుకును చూసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. శనివారం రాత్రి ఈ సమాచారం అందడంతో ఆ కుటుంబం తేరుకోలేకపోతోంది. మృతికి గల కారణాలను మాత్రం వివరించలేదు. జవాన్ తల్లిదండ్రులు అప్పన్న, లక్ష్మీ కన్నీరుమున్నీరవుతుండగా వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆర్మీ జవాన్ పార్థివ దేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చునని సమాచారం. చదవండి: తల్లీకొడుకుల కన్నీటి చితి -
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్..
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు. చదవండి: ‘రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ నేను ఆరోగ్యంగా ఉన్నా: విజయసాయిరెడ్డి -
‘నకిలీ మకిలి’ అధికారులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి: ఏసీబీ ముసుగులో వచ్చిన నకిలీ వ్యక్తులు బెదిరించడంతో భయపడి కొందరు అధికారులు వారికి డబ్బులు ముట్టజెప్పారు. నకిలీ అధికారులు వస్తేనే బెదిరిపోయి డబ్బులు ఇచ్చారంటే.. వాళ్లెంత అవినీతికి పాల్పడ్డారోననే సందేహం అసలు ఏసీబీ అధికారులకు కలిగింది. దాంతో నకిలీలకు సొమ్ములిచ్చిన రాష్ట్రంలోని పలువురు అధికారులపై మంగళవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఆర్ అండ్ బీ డీఈ జాన్ విక్లిఫ్ వద్ద రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో డబ్బు జమ చేసినవారు వీరే.. శ్రీకాకుళం పంచాయతీరాజ్ ఇంజనీర్ జీఆర్ గుప్తా రూ.50 వేలు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి రూ.5 లక్షలు, ద్వారకా తిరుమల ఆలయ ఈవో రావిపాటి ప్రభాకరరావు రూ.1.97 లక్షలు, గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వరరావు రూ.3.50 లక్షలు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన కె.రామచంద్రరావు రూ.4.94 లక్షలు, నెల్లూరు జిల్లా ఆర్డీవో పి.ఉమాదేవి రూ.25 వేలు, జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. వెంకట దుర్గాప్రసాద్, గూడూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ టి.రాఘవరావు, చిత్తూరు ఆర్ అండ్ బీ ఈఈ గుడారం చంద్రశేఖర్ రూ.2 లక్షల చొప్పున, చిత్తూరు నీటిపారుదల శాఖ ఎస్ఈ బి.కృష్ణమూర్తి (ప్రస్తుతం డిప్యూటీ ఎస్ఈ, నీటిపారుదల శాఖ, కడప) రూ.1.50 లక్షలు నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. చైన్ స్నాచింగ్ బ్యాచ్ ముఠాగా ఏర్పడి.. రాయలసీమ ప్రాంతానికి చెందిన నూతేటి జయకృష్ణ, రాఘవేంద్ర, రామచంద్ర, శ్రీనాథ్‌రెడ్డి ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్‌లు చేసేవారు. వారిని అనంతపురం పోలీసులు 2019లో అరెస్ట్ చేశారు. అప్పటికే జయకృష్ణ, శ్రీనాథ్‌రెడ్డి తాము ఏసీబీ అధికారులమంటూ 16 మంది అధికారులను బెదిరించి రూ.28.51 లక్షలు వసూలు చేశారు. జైలులో మరికొందరితో కలసి గ్యాంగ్‌గా ఏర్పడిన జయకృష్ణ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా కొందరితో కలసి అదే తరహాలో నేరాలకు పాల్పడ్డాడు. కర్నూలులో ఏసీబీ పేరు చెప్పి ఇద్దరు అధికారుల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. వారిని కర్నూలు పోలీసులు ఈనెల 1న అరెస్ట్ చేసి డబ్బులు సమర్పించుకున్న అధికారుల వివరాలు సేకరించారు. -
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ప్రభుత్వ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి కేసుల పాలయ్యారు.. ముఖం చూపించే ధైర్యం లేక దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపారు.. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ సంపాదించి మాజీ విప్ కూన రవికుమార్ స్వస్థలానికి వచ్చారు.. ఏదో ఘన కార్యం సాధించినట్టు అతని అనుయాయులు స్వాగత సన్నాహాలు చేశారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళ్యాణమండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కూన సమక్షంలోనే ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. కూన రవికుమార్ తొలుత ర్యాలీగా పట్టణంలోకి రావాలని భావించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనాలతో స్థానిక ఎస్ఎస్ఎన్ కళ్యాణమండపానికి చేరుకున్నారు. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతూ కొంతమంది మాట్లాడారు. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నూక సూరప్పల నాయుడు అలియాస్ రాజు స్పీకర్ తమ్మినేని సీతారాంను, ఆయన హోదాను కించపరిచే విధంగా కార్యకర్తల ముందు మైక్‌లో రెచ్చిపోయారు. స్పీకర్ తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సర్టిఫికేట్లు కొనుగోలు చేసి చదువుకున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించి, పత్రికలో రాయలేని విధంగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడి మాటలు రికార్డ్ అయి ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతన్నకు తీపి కబురు
సాక్షి, శ్రీకాకుళం: రోజుకు 1,250 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో దాదాపు పదివేల మంది రైతులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మరో రెండు మూడు వేల మంది కార్మికులు, ఉద్యోగుల జీవితానికి ఒకప్పుడు భరోసాగా ఉన్న ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి చెల్లుచీటి రాసేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే! నాడు జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని సహకార రంగ చట్టాన్ని మార్చేసి మరీ వేలంవేసి అమ్మేశారు! ఇది వాస్తవానికి జిల్లాలోని 9,374 మంది వాటాదారులతో సహకార రంగంలో ఆమదాలవలస పట్టణానికి ఆనుకొని 1962లో ప్రారంభమైంది. 1990వ దశకం వరకూ బాగానే నడిచింది. తర్వాత నష్టాలు మొదలయ్యాయి. వాటిని సాకుగా చూపించి 2001లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ జపం మొదలెట్టింది. వాటాదారులు, కార్మికులు, చివరకు కర్మాగార నిర్వహణ మండలి (బోర్డు) తీవ్రంగా వ్యతిరేకించినా పునరాలోచించలేదు. 2018 జూన్ 28 ఆమదాలవలస మండలంలోనే జరిగిన ఏరువాక ప్రారంభ కార్యక్రమానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఏరువాకలో తమకేదో వరాల జల్లు కురిపిస్తారనుకుంటే నోట చేదు గుళికలు వేశారు. ‘ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిచే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ భూమిలో ఐటీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తాం’ అని కుండబద్దలు కొట్టారు. 2001లోనే ఈ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన ఆయనే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. 2019 జూన్ 10 నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఆయన తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో మూతపడిన సహకార రంగ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కూడా ఒకటి. గత ఏడాది నవంబరు నెలలో ఆమదాలవలస మీదుగా సాగిన ప్రజాసంకల్పయాత్రలో రైతులకు మాట ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ తొలి సమావేశంలోనే సానుకూల సంకేతాలు ఇచ్చారు. భారం తడిసిమోపెడు... 2001లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాడు చక్కెర కర్మాగారం డైరెక్టరుగా ఉన్న లక్ష్మీనాయుడు హైకోర్టును ఆశ్రయించారు. సహకార చట్టం ప్రకారం కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ చట్టంలోనే మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు! వేలంలో జీఎమ్మార్ అనుబంధ సంస్థ అంబికా లామినేషన్స్ రూ.6.20 కోట్లకు దక్కించుకుంది. అది కూడా కర్మాగారాన్ని నడపలేదు సరికదా పూర్తిగా మూతవేసింది. ఈ బదలాయింపును సవాలు చేస్తూ కో–ఆపరేటివ్ సభ్యులు, రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించి 2016 మార్చిలో సానుకూలంగా తీర్పు సాధించారు. కొనుగోలు సంస్థతో ఆర్థిక లావాదేవీలను పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారి కె.సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ ప్రకారం చక్రవడ్డీతో కలిపి మొత్తం రూ.22 కోట్లను అంబికా లామినేషన్స్‌కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీకి చెందిన దాదాపు 74 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలోకి రావడంతో అక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తానని గత ఏడాది జూన్‌లో జరిగిన ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించి రైతులను నిరాశకు గురిచేశారు. డామిట్ కథ అడ్డం తిరిగింది... విశాఖ–హౌరా రైల్వే మార్గంలో, అలాగే జాతీయ రహదారికి సమీపంలోనున్న ఆమదాలవలస పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పట్టణానికి ఆనుకొనే ఉన్న ఫ్యాక్టరీకి చెందిన 74 ఎకరాలపైనా టీడీపీ నాయకులు కన్నేశారు. మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ.600 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదిపారు. అదే సమయంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆమదాలవలస వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రైతులు కలిశారు. చక్కెర కర్మాగారాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తే ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో రైతులకు మేలు జరుగుతుందని విన్నవించారు. వంశధార ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు కూడా పుష్కలంగా లభిస్తుందని, చెరకు సాగుకు కలిసివస్తుందని వారి ఆశ. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల పథకం పారలేదు. సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయించడం రైతులకు తీపికబురే! రైతుల కల నెరవేరనుంది మూతబడిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించుకోవాలనే రైతుల కల యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సాధ్యమవుతోంది. ఆయన ఆదేశాలు శుభ పరిణామం. ఆమదాలవలసకు పూర్వవైభవం రానుంది. వరి సాగుతో నష్టపోతున్న రైతులు చెరుకు ప్రత్యామ్నాయంగా సాగుచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. – చల్లా సింహాచలం, రైతు, రామచంద్రాపురం, ఆమదాలవలస మండలం రాజన్న రాజ్యం చూడబోతున్నాం.... మంత్రివర్గ తొలి సమావేశంలోనే రైతన్నలకు జగన్ తీపి కబురు వినిపించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గతంలో చాలా మంది నేతలు గెలిచినా తర్వాత చక్కెర ఫ్యాక్టరీ కోసం పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగనన్న సానుకూలంగా స్పందించారు. మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నాం. – అన్నెపు నీలాద్రిరావు, రైతు, తొగరాం, ఆమదాలవలస మండలం -
రవిపై.. సీతారామ బాణం
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్‌గాలి స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ లేకుండా పోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వైఎస్సార్సీసీ విజయం ఏకపక్షంగా సాగింది. తొలి రౌండ్ నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధిపత్యం కొనసాగించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించగా 1, 8 రౌండ్లలో తప్ప మిగిలిన అన్ని రౌండ్లతో తమ్మినేని సీతారాం స్పష్టమైన మెజార్టీ సాధించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయినప్పటికి తమ్మినేని 77,233 ఓట్లు సాధించగా, కూన రవికుమార్ 63,377 ఓట్లతో సరిపెట్టుకున్నారు. జనసేనకు 3186 ఓట్లురాగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు నాలుగంకెల స్థానాన్ని చేరుకోలేకపోయాయి. నోటాకు 2637 ఓట్లు రావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ప్రజాతీర్పులో సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్లు మెజార్టీతో విజయం సాగించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం, నవరత్నాలు సీతారాంను విజయ తీరాలకు చేర్చాయి. ఐదేళ్లుగా తమ్మినేని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి తరఫున పోరాటం చేశారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ప్రజల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. దీనికి తోడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. కాగా గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. నియోజకవర్గంలో కూన ఇసుక దందాలు, భూదందా, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పారు. -
అందరివాడు ఒకరైతే అందనివాడు మరొకరు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ఎన్నికలు వస్తే పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరు..? వారి గుణగణాలు, కుటుంబ నేపథ్యం, సమాజసేవ వంటి విషయాలను ప్రజలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటారు. ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని గెలిపిస్తే వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా..లేక ప్రజాధనాన్ని దోచుకుంటారా అనేది బేరీజు వేసుకుంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు వారు చేసిన అభివృద్ధి ఎలా ఉంది. అవినీతిలో అతని స్థానం ఏంటనేది నియోజకవర్గాల్లో లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మనేని, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వివరాల్లోకి వెళ్తే... తమ్మినేని సీతారాం ♦ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ♦ గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ♦ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై పట్టు ఉన్న వ్యక్తి ♦ సమస్య ఉందని ఆశ్రయిస్తే సత్వరమే స్పందించే గుణం కలవారు ♦ ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ♦ రైతులకు సాగు నీరు అందించడానికి గతంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి కూన రవికుమార్ ♦ గత ఎన్నికల తరువాత ప్రజలకు దూరంగా ఉన్నారు ♦ స్థానికంగా కాకుండా శ్రీకాకుళంలో నివాసం ఉంటారు ♦ నియోజకవర్గం అభివృద్ధి కంటే తన అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ♦ నదీ గర్భాలను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తారనే అభియోగం ఉంది ♦ ఉద్యోగ అవకాశాలు కోసం వెళ్లిన యువతతో దురుసుగా మాట్లాడే స్వభావం ♦ బెదిరింపులు, రౌడీ రాజకీయం చేస్తారనే ఆరోపణ ♦ భూములను దోచుకునేందుకు కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి -
అంతఃకరణ శుద్ధితో అభివృద్ధి చేస్తా
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం గతంలో మంత్రిగా పనిచేశారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా మాత్రమే కాకుండా 15 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని మనసులో మాటను సాక్షి ఇంటర్వ్యూ లో తెలియజేశారు. ప్రశ్న: ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీ వ్యూహం ఏంటి? జవాబు: ప్రత్యేకించి వ్యూహాలు ఏమీ లేవు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడి, లిక్కర్ మాఫియా, భూ దందాలతో పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వారికి ఆసరాగా నిలుస్తామనే భరోసా కల్పిస్తున్నాము. ఐదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధిని కూన రవికుమార్ మరిచిపోయారు. కేవలం తన అభివృద్ధి, టీడీపీ నాయకుల అభివృద్ధికే పెద్దపీట వేశారు. అందుకే అటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నాము. దీనికి తోడు జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలోని అంశాలు అన్ని వర్గాల వారికి లబ్ధిచేకూర్చే విధంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రజలు గమనించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశ్న: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? జవాబు: గత 40 ఏళ్లుగా నా రాజకీయ జీవితం నియోజకవర్గ ప్రజల ముందు తెరిచిన పుస్తకమే. ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలతోనూ నాకు స్నేహ బంధాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రజలందిరికీ నేనేంటో తెలుసు. అందరికీ దగ్గరగా ఉంటూ ప్రజలకు చేసిన సేవలతోనే నన్ను గుర్తిస్తున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏంటి? జవాబు: నియోజకవర్గంలో ప్రజలకు గత ఐదేళ్లుగా రాక్షస, రాబందుల పాలనలో సరైన సంక్షేమం అందలేదు. గ్రామాల్లో తాగునీరు అందలేదు, రహదారులు నిర్మాణాలకు నోచుకోలేదు. దీంతోపాటు సాగు నీరుకు పలు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా స్థానికంగా మూతపడిన సుగర్ ఫ్యాక్టరీ నియోజకవర్గం అభివృద్ధిని కుంటి పరిచింది. కర్మాగారాలు మూతపడ్డాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అందుకే వీటిని తెరిపించేందుకు పాదయాత్ర సమయంలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా సుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాము. ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? జవాబు: నాకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలపైనా అవగాహన ఉంది. సుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు ఆసరా కల్పిస్తాము. వంశధార ప్రధాన కాలువకు అనుసంధానంగా కొన్నిచోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తాను. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. ప్రశ్న: టీడీపీ పాలనలో ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందలేదు. అన్ని పనుల్లోనూ అవినీతికి పాల్పడి అర్హులకు పథకాలు అందకుండా చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి నేరుగా ప్రజలకే సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పేదరికమే అర్హతగా పథకాలు అందజేస్తాము. -
ఆమదాలవలస.. మారుతోంది దిశ!
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): జిల్లాకు అతి కీలక నేతలను అందించిన ప్రాంతం. బొడ్డేపల్లి రాజగోపాలరావు, తమ్మినేని పాపారావు కాలం నుంచి తమ్మినేని సీతారాం, బొడ్డేపల్లి సత్యవతి కాలం వరకు ఎందరో రాజకీయ ఉద్ధండులను అందించిన గడ్డ. ఇక్కడ ప్రతి ఎన్నికా ప్రత్యేకమే. ప్రస్తుతం టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ బాగా తగ్గింది. వరుసగా బయటపడుతున్న దోపిడీ ఆనవాళ్లు, మచ్చుకైనా కనిపించని ప్రగతి గుర్తులు కూనకు ప్రతికూలంగా మారుతున్నాయి. అదే సమయంలో నిత్యం ప్రజాపోరాటాలు చేసిన తమ్మినేని సీతారాం మళ్లీ చక్రం తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికులు అంటున్నారు. 1952 నుంచి నేటి వరకు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952లో నగరికటకంగా ఈ నియోజకవర్గం ఉండేది. సరుబుజ్జలి, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస మండలాలు అప్పట్లో కలిసి ఉండేవి. మొదటి ఎన్నికల్లో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు, కొత్తకోట గ్రామానికి చెందిన డోల జగన్నాథం, ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని పాపారావు మధ్య త్రిముఖ పోటీ జరిగింది. అప్పలనాయుడు విజయం సాధించి మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని పాపారావు విజయకేతనం ఎగురవేశారు. 67లో నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసి తమ్మినేని పాపారావు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో స్థిరస్థానం సంపాదించారు. 1972లో ఆమదాలవలస నియోజకవర్గంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ కాస్త ఇక్కడ ప్రభావం చూపగలిగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయం కాస్త మారింది. తమ్మినేని సీ తారాం బలమైన నేతగా ఎదగడం అంతా చూశారు. 32 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావుపై 1991లో సీతారాం గెలిచి నవశకానికి నాంది పలికి, తన రాజకీయ చతురత నిరూపించుకున్నారు. తర్వా త అనేక క్యాబినెట్లలో అగ్రస్థాయి నేతగా సీతారాం పనిచేశారు. గత ఎన్నికల్లో కూన రవికుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి తమ్మినేనిపై గెలుపొందారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ్మినేని అడుగులు మరింత వేగంగా అధికారం వైపు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమ రవాణాకు చిరునామాగా నిలుస్తున్నారు. వంశధార, నాగావళి ప్రాంతాల్లోగల గ్రామాలు దూసి, సింగూరు, పురుషోత్తపురం, మూల సవలాపురం, ముద్దాడపేట, బొడ్డేపల్లి తదితర గ్రామాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు కూడా ఇసుక ర్యాంపులు కేటాయించి ఇసుక మాఫియాకు ఆజ్యం పోశారు. ఇక భూకబ్జాల్లో రారాజుగా పేరొందారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో లీజు పేరుతో 99ఎకరాలు ప్రభుత్వ స్థలం కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఆ భూముల్లో కూన వారి పూలతోట వేసేందుకు దరఖాస్తులు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడంతో అది నిలిచిపోయింది. పంచాయతీ రాజ్ కార్యాలయం ఆవరణలోగల కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 30 సెంట్లు ప్రభుత్వ భూమిపై కూన కన్ను పడింది. దీంతో దాన్ని టీడీపీ కార్యాలయం నిర్మాణం పేరుతో కబ్జా చేయాలని చూసిన విప్‌కు పరివర్తన్ ట్రస్ట్ సబ్యుడు చింతాడ రవికుమార్ అడ్డు తగిలడంతో చుక్కెదురైంది. ఇక నీరు చెట్టుతో దోచుకున్న నిధులకే లెక్కే లేదు. కార్యకర్తలకు బెదిరింపులు చేయడంలో విప్ రౌడీ షీటర్ పాత్ర కూడా పోషించారు. ఇటీవల పొందూరు మండలానికి చెందిన గంగిరెడ్ల శివను వైఎస్సార్ సీపీ లోకి వెళ్తే చంపేస్తానని బెదిరించి రౌడీ రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్ సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. గత మూడు విడతలుగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ పథకాలను విరి విగా జనంలోకి తీసుకెళ్లడమే కాకుండా, తన రాజకీయ అనుభవంతో ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెడుతున్నారు. సమస్యలు.. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని అందరూ చెబుతున్నారు. గానీ తెరవడం లేదు. వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో జనాల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ఇక విప్ చెరబట్టిన తీరాలే ఇక్కడి ప్రధాన సమస్య. నిరంతర ఇసుక రవాణా వల్ల ఆయా గ్రామాలు అభివృద్ధి కావడం లేదు. రైల్వే స్టేషన్ ఉన్నా ఆమదాలవలస పారిశ్రామికంగా అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదు. మున్సిపాలిటీలోనూ ప్రగతి అనుకున్నంత మేర కానరావడం లేదు. ఎమ్మెల్యేలు వీరే.. ఆమదాలవలస నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సంవత్సరం ఎమ్మెల్యే 1952 మొదట ఎమ్మెల్యే పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు 1957 తమ్మినేని పాపారావు 1962 తమ్మినేని పాపారావు 1967 తమ్మినేని పాపారావు 1972 పైడి శ్రీరామమూర్తి 1977 పైడి శ్రీరామమూర్తి 1983 తమ్మినేని సీతారాం 1985 తమ్మినేని సీతారాం 1989 పైడి శ్రీరామమూర్తి 1991 తమ్మినేని సీతారాం 1994 తమ్మినేని సీతారాం 1999 తమ్మినేని సీతారాం 2004 బొడ్డేపల్లి సత్యవతి 2009 బొడ్డేపల్లి సత్యవతి 2014 కూన రవికుమార్ -
వనరుల విధ్వంసం.. అసురుల అరాచకత్వం
సాక్షి, ఆమదాలవలస రూరల్ (శ్రీకాకుళం): ఆమదాలవలస మండలం ఇసుక మాఫియాకు కేరాఫ్‌గా నిలుస్తుంది. టీడీపీ పాలనలో సామాన్య ప్రజలకు తగు న్యాయం జరగకపోయినా, టీడీపీ కార్యకర్తలకు మాత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి సహజ వనరులను దోచుకుని అక్రమార్జనకు తెరలేపిన ఘనత టీడీపీ నాయకులకి దక్కుతుంది. మండలానికి రెండు వైపులా ఉన్న జీవనదులు వంశధార, నాగావళి నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా చేస్తే కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొట్టారు. నిరుపేదలు వేలాది రూపాయలు వెచ్చించి ఇసుకను కొనుక్కుంటే గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు వాటిని అక్రమంగా విశాఖపట్నానికి లారీల ద్వారా ఎగుమతులు చేసుకుని కోట్లు సంపాదించారు. మండలంలో దూసి, కొత్తవలస, నిమ్మతొర్లాడ, కొరపాం, జీకేవలస, ముద్దాడపేట, తొగరాం, తోటాడ, చెవ్వాకులపేట తదితర ప్రాంతాల నుంచి నాలున్నరేళ్ల పాటు నిత్యం ఇసుక రవాణా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ప్రస్తుతం రాత్రి వేళ నదీతీర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దూసి గ్రామంలో ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో డ్వాక్రా పేరుతో ఒకసారి ర్యాంపు, విశాఖ అవసరాల పేరుతో రెండు సార్లు ర్యాంపులు నిర్వహించి లారీల ద్వారా ఇతర జిల్లాలకు ఎగుమతి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే కేటాయిస్తే ప్రభుత్వ విప్ రవికుమార్ అనుచరులు ఏకంగా లక్షల్లో క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచుకున్నారు. ఇదే తరహాలో నాగావళి నదీతీర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఇసుక దోపిడీ కోట్ల రూపాయల్లో జరిగింది. అక్రమ రవాణాతో రోడ్లు నాశనం టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ వల్ల విలువైన రోడ్లు నాశనమైపోయాయి. అనధికార ర్యాంపులు నిర్వహించి ప్రకృతి సంపదను దోచుకున్నారు. ఇసుక దోపిడీపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వాల్టా చట్టానికి విరుద్ధంగా తవ్వకాలు చేసి నదీ గర్భాన్ని కొల్లగొట్టారు. – చిగురుపల్లి దశరథ, దూసిపేట, ఆమదాలవలస మండలం సామాన్యులకు దక్కని ఉచితం పాలకొండ: ప్రభుత్వ ప్రకటించిన ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలను అవస్థ పెడుతోంది. ఇసుక ర్యాంపులు ఉన్న సమయంలో రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.రెండు వేల నుంచి మూడు వేలు పలుకుతుంది. పూర్తిగా నదీ తీర ప్రాంతాలను తమ ఆధీనంలోనికి తీసుకున్న నాయకులు తమ ఇష్టాను రీతిలో ఇసుక ధరను నిర్ణయించి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం మండలాల పరిధిలో నాగావళి నది, భామిని మండలంలోని వంశధార నది నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతుంది. మండలంలోని అంపిలి, గోపాలపురం, మంగళాపురం, యరకరాయపురం గ్రామాలు, వీరఘట్టం మండలంలోన తలవరం, నందివాడ, చిదిమి, కడకెల్ల. బామిని మండలంలోని సింగిడి, బత్తిలి ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక రవాణా జరుతుంది. ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో అధికారపార్టీ నాయకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నదిలో అక్రమంగా ఇసుక ర్యాంపులు వేసి ఇసుకను అమ్ముకుంటున్నారు. వాస్తవంగా అధికారికంగా ర్యాంపులు ఉంటే ఇసుక ట్రాక్టర్‌కు ర్యాంపులో రూ.400 చెల్లించి ట్రాక్టర్ యజమానులు స్థానికంగా రూ. వెయ్యికి అమ్మేవారు. ప్రస్తుతం ర్యాంపుల వద్ద ఇసుక ట్రాక్టర్ నుంచి రూ.వెయ్యి వసూళ్లు చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్ ఇసుక రూ.రెండు వేలు నుంచి మూడు వేలు వరకూ చెల్లించాల్సి వస్తోందని గృహనిర్మాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇసుక తవ్వకాలు ఉండే చోట్ల ఇతర పనులకు కూలీలు దొరకడం లేదు. నియోజకవర్గం నుంచి ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లు, 20 నుంచి 30 లారీలు రోజూ ఇసుక తీసుకెళ్తుంటాయి. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అండతో ఇక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ ఐదేళ్ల కాలంలో రూ.50 కోట్ల మేర విలువ చేసే ఇసుకను ఇక్కడ నుంచి తరలించి జేబులు నింపుకున్నారు. సిమెంట్ ధరతో సమానం ఇసుక ఉచితం అన్నారు. ఇక్కడ మాత్రం ఇసుక దొరకడమే కష్టంగా మారింది. సిమెంట్ ధరతో ఇసుక ధర పోటీ పడుతోంది. ట్రాక్టర్ ఇసుక మూడువేలు అవుతోంది. ఇంకా నిర్మాణాలు ఎలా సాధ్యమవుతాయి. సొంతంగా నది నుంచి నాటుబండితో ఇసుక తెచ్చుకోవాలన్నా డబ్బులు కట్టాల్సి వస్తుంది. కె.ప్రసాదరావు, గృహ నిర్మాణ దారు, రుద్రిపేట రేగిడి కేరాఫ్ ఇసుక దందా రాజాం : రేగిడి అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్‌గా మారింది. గతంలో రీచ్‌లు మంజూరైనా ఇసుకాసురులు సొంత రీచ్‌లు కనుక్కుని వాటిలో తవ్వకాలు సాగిస్తూ ప్రజాధనం దోచుకుంటున్నారు. రాజాం పట్టణం కేంద్రంగా రేగిడి, వంగర మండలాల నుంచి నాగావళి నదీ తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో ఇలా అక్రమ రవాణా జరగడంతో పలువురు అధికార పార్టీనేతలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా రేగిడి మండలంలో రేగిడి, తునివాడ, బొడ్డవలస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక పోగులు వేశారు. వీటిని లారీలతో రాత్రి సమయాల్లో తరలించి కోట్లు దండుకున్నారు. ఒక్కో లారీ ఇసుక ధర రూ. 25 వేలు దాటి పలుకుతోంది. వీటితో పాటు ఇసుక ట్రాక్టర్లతో రాజాం మీదుగా ఇతర ప్రాంతాలకు పట్టపగలే తరలిస్తుంటారు. ఇటీవల ఈ ఇసుక అక్రమ రవాణాతో పాటు నిల్వలపై మైన్స్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేసినా ఇప్పటికీ ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడం శోచనీయం. వంగర మండలంలో సువర్ణముఖి, వేగావతి నదులతో పాటు నాగావళి నదీ తీర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలు ఇసుక అక్రమ రవాణాకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంతకవిటి మండలంలో మేడమర్తి, తమరాం, పోడలి సమీప ప్రాంతాల వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మార్గంలో.. నాగావళి తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికంగా రేగిడి మండలం నుంచి ఇక్కడకు వస్తుంది. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 2 వేలు పలుకుతుంది. గతంలో మా మండలంలో ఇసుకరీచ్ ఉండేది. ట్రాక్టర్ ఇసుకలోడ్ రూ. 600లకు వచ్చేది. ఇప్పుడు అమాంతంగా ధర పెరిగింది. ఇంటి నిర్మాణాలు చేయలేని పరిస్థి«తి ఉంది. – బురావెల్లి కృష్ణ, చింతలపేట, సంతకవిటి మండలం కాసుల వేట ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం మండలాలు ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎల్ఎన్ పేట మండలంలోని దబ్బపాడు, బసవరాజుపేట, స్కాట్‌పేట రేవుల్లో ఇసుక వ్యాపారం ఐదేళ్లు యథేచ్ఛగా సాగింది. కొత్తూరు మండలంలోని కుంటిభద్ర, మాతలతో పాటు పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఇసుక మేట్లు వేశాయి. అయితే పంట పొలాల్లో ఇసుక మేట్లు తొలగించేందుకు టీడీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకు వచ్చారు. అయితే పంట పొలాల్లో ఇసుక నాణ్యత లేకపోవడంతో పంట పొలాలకు ఆనుకొని ఉన్న మరో చోట నుంచి ఇసుక తవ్వకాలు చేస్తూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే స్వగ్రామం మాతలకు చెందిన రైతులు పంట పొలాల్లో ఇసుక మేట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకువచ్చి నదిలో తీసుక తీసి రూ.కోట్లు దండుకున్నారు. పొన్నుటూరు, మదనాపురం, సోమరాజపురం, అంగూరు, ఆకులతంపర, బంకి లతో పాటు పలు గ్రామాల్లో ఆలయాలు నిర్మాణం ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఉచితం ముసుగులో.. ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఇక్కడ ఒక్క రీచ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, పాతపొన్నాడ వంటి రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ బృందాల నిఘా ఉంది. అయినా ఇసుక రవాణా ఆగడం లేదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి ఆనుకొని చిలకపాలేం, అల్లినగరం, ఎస్ఎస్ఆర్ పురం, వంటి ప్రాంతాల్లో పోగులు వేస్తున్నారు. వాటిని రాత్రిపూట విశాఖ తరలిస్తున్నారు. లావేరు మండలం బుడుమూరు ఊట గడ్డ నుంచి సైతం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. రణస్థలం మండలంలోని కొచ్చర్ల, దోణుపేట, కొవ్వాడ, ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగుట్లపాలేం వంటి ప్రాంతాల్లో సముద్రపు ఇసుకతో ఇసుక కలిపి కల్తీ చేసి మరీ ఇసుక విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండ లేకపోతే మరీ ఇంతగా బరితెగించడం సాధ్యం కాదని, వారి కనుసన్నల్లోనే ఈ తంతు జరుగుతోందని స్థానికులంటున్నారు. ఉచితం ముసుగులో దోపిడీ ఉచితం ముసుగులో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక కోసం పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. – కింతలి ఈశ్వరరావు, ఎస్ఎం పురం కోట్లలో దోపిడీ నరసన్నపేట: మండల పరిధిలోని వంశధార నది టీడీపీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అనుమతులు దాటి, నిబంధనలు ధిక్కరించి, ఉచిత ఇసుక విధానాన్ని వెక్కిరిస్తూ వీరి దోపిడీ సాగుతోంది. ఇక్కడ ఇసుక పేరుకే ఉచితం.. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ట్రాక్టర్ ఇసుక రూ. 1500 పైమాటే. ఉచిత విధానాన్ని అడ్డు పెట్టుకొని వంశధార నది నుంచి లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకను దోచుకువెళ్లారు. విశాఖ, గుం టూరు, రాజమండ్రి ఇలా ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులతో స్థానిక నేతలు చేతులు కలిపి నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఇసుక దందా నిర్వహించారు. దీంతో వంశధార తీరం బోసిపోతోంది. మండల పరిదిలో గోపాలపెంట, బుచ్చిపేట, చేనులవలస, పోతయ్యవలస, లుకలాం, వెంకటాపురాల్లో ఇసుక దందా అధికంగా జరిగింది. ప్రధానంగా లుకలాం, మడపాం, గోపాలపెంట, బుచ్చిపేటలకు చెందిన టీడీపీ నాయకులు బాగా లాభపడ్డారు. అధికా రుల బలం చూసుకొని ఈ గ్రామాల్లో టీడీపీ నాయకులు పెద్ద లాబీయింగ్ చేసి ఇసుక పేరున బాగా వెనకేసుకున్నారు. వీరికి నియోజకవర్గ టీడీపీ పెద్దలు కూడా వత్తాసు పలకడంతో వీరి ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. జిల్లా కేంద్రానికి సమీపంలో.. శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలో నూ ఈ దందా జోరుగా సాగుతోంది. ఆటు ఆమదాలవలస, ఇటు నరసన్నపేట నియోజకవర్గా ల సరిహద్దుల్లో ఇసుకను ఇష్టానుసారంగా రవాణా చేస్తున్నా రు. ఇక జన్మభూమి కమిటీ సభ్యులు ఉచిత ఇసుక పేరిట ఇష్టానుసారంగా ఒక్కో లారీ నుంచి రూ.15 నుంచి 20 వేలు లోపు వసూళ్లకు పాల్పడుతున్నారు. మండలంలోని ఎక్కడా ఉచిత ఇసుక ఇచ్చే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. తట్టెడు ఇసుక తీయలేదు వంశధార వరదల కారణంగా పదేళ్ల కిందట కుంటిభద్రకు చెందిన పొలాల్లో ఇసుక మేట్లు వేశాయి. ఈ మేట్లను తొలగించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే గ్రామానికి చెందిన ఓ నేత ఈ మేట్లను రికార్డుల్లో చూపిస్తూ నదిలో నుంచి అక్రమంగా తీసుక తీసుకెళ్తున్నారు. నాకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఇసుక మేట్లు వేశాయి. ఈ పొలాల్లో నుంచి ఒక తట్టెడు ఇసుక తీయలేదు. – - అగతమూడి నాగేశ్వరరావు, రైతు, కుంటిభద్ర -
‘నా కొడుకు అప్పుడే భయపడలేదు’
-
‘నా కొడుకు అప్పుడే భయపడలేదు’
సాక్షి, శ్రీకాకుళం : చంద్రబాబు పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ఏ పంటకూ గిట్టుబాటుధర లేదని, రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతిమయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభల్లో విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే చంద్రబాబు పసుపు-కుంకుమ అని అంటున్నారని, గ్రామాల్లో తాగునీరు కంటే మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు.. ఐదేళ్ల బాబు పాలనలో 2.30లక్షల ఉద్యోగాల్లో ఒక్కటీ కూడా భర్తీ చేయలేదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యపథకాలను నిర్వీర్యం చేశారని, మంత్రి యనమలకు పంటి నొప్పి వస్తే.. సింగపూర్ పంపించారని గుర్తు చేశారు. పేదవారు వైద్యం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లాలా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో లక్షల మందికి 108 పునర్జన్మ ఇచ్చిందని, చంద్రబాబు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారా అని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ ప్రారంభించారని, వైఎస్ హయాంలోనే వెలిగొండ, వంశధార, నాగావళి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని గుర్తుచేశారు. 70శాతం వైఎస్ పూర్తి చేస్తే.. మిగిలిన పనులను కూడా బాబు చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. వంశధార ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఆమదాలవలసకు రావాలంటే.. రైల్వే ట్రాక్ అడ్డుందన్నారు.. మూడు కిలోమీటర్లు వయటెక్ ద్వారా నీళ్లు రప్పించిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. పొందూరులో పెన్షన్ కోసం 840 మందికోర్టుకు వెళ్లారన్నారు. జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన వాళ్లకే పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక, మట్టి, చివరకు గుడి భూములు కూడా దోచుకుంటున్నారని విమర్శించారు. హెరిటేజ్ కోసం చాలా డెయిరీలను మూసివేయించారని అన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదని ఆరోపించారు. రైతుల దగ్గర భూములు తీసుకుని తన బినామీలకు కేటాయించారని విమర్శించారు. అప్పుడే నా కొడుకు భయపడలేదు.. తొమ్మిదేళ్ల నుంచి వైఎస్ జగన్‌కు మీరంతా అండగా ఉన్నారని.. వైఎస్ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటుందని అన్నారు. వైఎస్ మరణం తరువాత జగన్.. ఓదార్పు చేస్తానని మాటిచ్చారని.. ఇచ్చిన మాటకోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే.. కక్షగట్టి కేసులు పెట్టారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నా కొడుకు అప్పుడే భయపడలేదు.. ఇప్పుడేం భయపడతాడని అన్నారు. వైఎస్ జగన్‌ది ఎవరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారన్నారు. కేసీఆర్‌కు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కడుపు మాడ్చుకుని జగన్ ఎన్నో దీక్షలు చేశారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారన్నారు. జగన్ పోరాటాలతో ప్రత్యేక అంశం సజీవంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై 14సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలుచేశారని, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున 25మందిని గెలిపించమని కోరారు. -
గోకులం.. అంతా కలకలం
సాక్షి, ఆమదాలవలస రూరల్: వ్యవసాయరంగానికి పెద్దపీట అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. పథకాలు, రాయితీలు, సబ్సీడీలు ఇవిగో అంటూ ఒక చేత్తో చూపించి మరో చేత్తో లాగేసుకుంటూ పథకం ప్రకారం పక్కాగా మోసం చేస్తున్నారు. ఇటీవల పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అమలు చేసిన గోకులం పథకమే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 90 శాతం రాయితీతో మొదట ఊరించిన టీడీపీ సర్కారు ఉన్న ఫలంగా రాయితీపై కొర్రీలు వేయడంతో చివరికి పథకాన్ని అటకెక్కించారు. ఈ పథకం గురించి పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా గోకులం గురించి రైతులు తగిన ప్రచారం చేయకపోవడంతో షెడ్లు నిర్మించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన టెక్నికల్ మోనటరింగ్, ఎంపీడీఏలు కేవలం కార్యాలయానికే పరిమితం కావడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బిల్లులు మంజూరుకాకపోయినా సరే నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో నిర్మించిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఊరించిన సర్కార్ .. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో సామాజిక గోకులాలు, మినీ గోకులాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్ రైతులను ఊరించింది. నాలున్నరేళ్లగా రైతులకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మభ్యపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు గోకులం అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో రైతులు ఎగబడ్డారు. ఉపా«ధి హామీ పథకానికి అనుసంధానంతో గోకులం(పశు వసతి గృహం) నిర్మించనున్న లబ్ధిదారులు తమ వాటా కింద 10 శాతం భరిస్తే మిగతా 90 శాతం రాయితీ రూపంలో ఇస్తామని నమ్మబలికారు. పథకం బాగానే ఉందంటూ చాలా మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గోకులాల కేటాయింపులు ఇలా గోకులాల పథకం ప్రవేశపెట్టినప్పుడు మూడు పథకాలు అమల్లో ఉండేది. రెండు పశువులకు గాను షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.10 వేలు, ప్రభుత్వం నుంచి రూ. 90 వేలు కేటాయించారు. నాలుగు పశువులకు షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.15 వేలు, ప్రభుత్వం వాటా రూ.1.35 లక్షలు, ఆరు పశువులకు షెడ్డు నిర్మిస్తే రైతు వాటా రూ.18 వేలు, ప్రభుత్వం వాటా రూ. 1.68 లక్షలు అంటూ చెప్పడంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. నిర్మించినవి ఇవే.. ఆమదాలవలస మండలంలో 426 మంది రైతులు గోకులానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ప్రస్తుతానికి 40 షెడ్లు పూర్తిగా నిర్మాణాలు జరిపారు. గొర్రెల కాపరులు కూడా 30 షెడ్లు నిర్మించారు. ఇందులో 180 షెడ్లు నిర్మాణ దశలో ఉండగా 176 షెడ్లు పునాదుల దశలో ఉన్నాయి. బూర్జ మండలంలో కేవలం 69 షెడ్లు మాత్రమే పనులు జరుగుతున్నవి. అయితే గోకుల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు కాలేదు. బిల్లు రాలేదు గోకులం పథకం పేరుతో గొర్రెల నివాసానికి షెడ్డు నిర్మిస్తున్నాను. గోతులు తీసి పునాదులు కూడా వేశాను. ఇప్పటి వరకు పైసా బిల్లులు కూడా మంజూరు కాలేదు. పునాదుల కోసం అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టాను. బిల్లులు మంజూరు కాకపోతే తీవ్రంగా నష్టపోతాను. –తాన్ని ఎర్రయ్య, లబ్ధిదారుడు, బొబ్బిలిపేట, ఆమదాలవలస మండలం పథకం మంజూరు కాలేదు గోకులం పథకం ద్వారా పశువుల షెడ్డు నిర్మించడానికి డీడీ తీశాను. పథకానికి అర్హత ఉన్నా ఇంతవరకు మంజూరు చేయలేదు. డీడీ తీసుకుని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే తప్ప నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. డీడీ తీసుకుని నష్టపోవడం తప్ప ఉపయోగం లేదు. – గేదెల లక్ష్మణరావు, దూసి, ఆమదాలవలస మండలం బడ్జెట్ విడుదల కాలేదు గోకులం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు కావడం లేదన్న మాట వాస్తవమే. బిల్లులు నివేదికను జిల్లా అధికారులకు అందజేశాం. బడ్జెట్ విడుదల కానందున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు రాకున్నా పనులు నిలుపుదల చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకే పనులు వేగవంతం చేస్తున్నాం. –ఆర్.ఆనందరావు, పశుసంవర్థకశాఖ ఏడీ, ఆమదాలవలస -
ఆముదాల వలస బహిరంగ సభలో వైఎస్ జగన్
-
చివరి మజిలీకీ తిప్పలే!
ఆమదాలవలస రూరల్ : రాష్ట్రంలో అడుగడుగునా సిమెంటు రోడ్లంటూ ప్రభుత్వ ప్రచారాలు ఓ వైపు.. శ్మశానానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు లేక పొలాల మధ్యనే శవాన్ని తరలించాల్సిన ‘నడక’యాతన మరోవైపు. మనిషి చివరి మజిలీ అంతిమయాత్రకు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటలో దాపురించింది. గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన కలివరపు సరోజనమ్మ (60) అనారోగ్యంతో చనిపోయింది. ఈమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు చేరుకునేందుకు రహదారి సదుపాయం లేకపోవడంతో సుమారు కిలో మీటర్ దూరం పంటపొలాల్లో నుంచి శవాన్ని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. శ్మశానవాటికకు రహదారి ఏర్పాటు చేయాలని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎక్కడివక్కడ గప్‌చుప్!
ఇసుక ర్యాంపులను పరిశీలించిన కలెక్టర్ ‘సాక్షి’ కథనాలకు స్పందన అధికారుల రాకతో అప్రమత్తమైన ఇసుక ముఠా తోటల్లోనూ, చెట్ల మాటున పొక్లెయినర్లు, ట్రాక్టర్ల దాచివేత ఆమదాలవలస రూరల్: మండలంలోని దూసి గ్రామ సమీప నాగావళి నదిలో పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపు పేరుతో నడుస్తున్న ర్యాంపును కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రభుత్వ నిర్మాణాల ముసుగులో అక్రమంగా నడుస్తున్న ఇసుక ర్యాంపుపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాలకు వెళ్లి.. ర్యాంపులో ఇసుక నిల్వలు, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. అప్పటి వరకు లోడింగ్ చేసే యంత్రాలు, ట్రాక్టర్లు కలెక్టర్ పరిశీలనకు వచ్చిన సమయంలో మాయమైపోయాయి. ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన ఇసుక నిల్వలు అక్రమ మార్గంలో తరలిపోతుందన్న విషయం పరిశీలనలో తేటతెల్లమైంది. ప్రభుత్వం ఇసుక విధానంపై కొత్త జీవో తీసుకురావడంతో పాటు ధరల ఖరారుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఇసుక ర్యాంపులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానంలో దూసి ఇసుక ర్యాంపు నిర్వహణ గురించి చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటారని మైన్స్ అధికారులు వెల్లడించారు. జిల్లా కమిటీల ఆదేశాల మేరకు దూసి ఇసుక ర్యాంపు మూసివేసి, కొత్తగా ర్యాంపులను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు. మండలస్థాయిలో ధరల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ర్యాంపు పరిశీలనలో మైన్స్ ఏడీ తమ్మినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. తోటల్లో నక్కిన ఇసుక ముఠా.. ప్రతిరోజూ వందలాది లారీలకు ఇసుక తరలించే ముఠా.. అధికారుల రాకను గమనించి సమీప తోటల్లో దాక్కొంది. ఇసుకకు అనుమతులు ఉన్నాయని, వీటికోసం యంత్రాలు, ట్రాక్టర్లను ఉపయోగించుకోవచ్చునని బహిరంగంగానే చెప్పుకొనే ముఠా.. జిల్లా కలెక్టర్ పరిశీలనకు వస్తే యంత్రాలను దూసి గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో మామిడి తోటల్లో ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, మైన్స్ అధికారులు ర్యాంపు పరిశీలనకు వస్తున్నారని మండల రెవెన్యూ అధికారులకే సమాచారం లేదు. ఇసుక ముఠాకు మాత్రం రెండు గంటల ముందే సమాచారం అందింది. దీంతో ఉదయం నుంచి ఇసుక లోడింగ్ చేసే మూడు పొక్లెయిన్లు, 20 ఇసుక ట్రాక్టర్లను సమీప తోటల్లో దాచిపెట్టారు. కలెక్టర్ రాకతోనైనా ఈ ఇసుక దోపిడీకి తెర పడుతుందని గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇసుకాసురుల భరతం పడతాం సరుబుజ్జిలి: ఇసుకను అక్రమంగా తరలించినవారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి హెచ్చరించారు. ఆదివారం మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో గతంలో ర్యాంపు నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గృహనిర్మాణాలు, ప్రభుత్వ పనులకు మినహా ఇసుకను అడ్డదారుల్లో తరలిస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులపై గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. యరగాం ఇసుక ర్యాంపు లక్ష్యం పూర్తయినందున, పురుషోత్తపురంలో అధికారిక ర్యాంపు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆయనతోపాటు తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్, సర్వేయర్ సూర్యనారాయణ, ఆర్ఐలు గాయత్రి, కృష్ణకుమారి, వీఆర్వో జోగినాయుడు తదితరులున్నారు. -
కాన్‌కాస్ట్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఆమదాలవలస రూరల్ : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కాన్‌కాస్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.కృష్ణారావు, బి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని దూసి గ్రామంలో గల కాన్‌కాస్ట్ పరిశ్రమ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ 29 రోజులుగా కార్మికులు ధర్నాలు చేపడుతున్నా యాజమాన్యం పట్టించుకోపోవడం దారుణమన్నారు. యాజమాన్యం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, నిలుపుదల చేసిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరారు. నూతన వేతన ఒప్పందం తక్షణమే అమలు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్.రాజు, కె.కమల్, టి.సత్యనారాయణ, సి.హెచ్.రమణబాబు, సి.హెచ్.కోటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నూతన వేతన ఒప్పందం కార్మిక విజయం
ఆమదాలవలస రూరల్ (ఆమదాలవలస) : నూతన వేతన ఒప్పందం సాధించడం కార్మికుల విజయంగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. దూసి గ్రామంలో ఉన్న కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 124 రోజులుగా చేస్తున్న కార్మికుల పోరాటానికి యాజమాన్యం దిగివచ్చిందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కోసం యాజమాన్యం స్పందించడంతో బుధవారం రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు ఆయన నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయడం వల్లే నూతన వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై రూ.4,650 పెరిగిందని, డీఏ పాయింట్‌కు రూ.4.50 ఇవ్వడానికి, ఎలక్ట్రికల్, మెకానికల్‌లో పని చేస్తున్న 42 మంది కార్మికులను రెగ్యులర్ చేయడానికి కాన్‌కాస్ట్ యాజమాన్యం అంగీకరించినట్లు పేర్కొన్నారు. కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయడానికి కూడా ఒప్పందం కుదిరిందన్నారు. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్మికుల పోరాటానికి మద్దతు ఇచ్చిన యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు బమ్మిడి రమణ, రామచంద్రరాజు, టి.రాజు, సత్యన్నారాయణ, పి.రాజశేఖర్, పి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీను, బి.అప్పారావు, తారకేశ్వరరావు, రాఘవేంద్రరావు, పి.నాగరాజు, కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి
సైలాడ (ఆమదాలవలస రూరల్) : సాంకేతిక పరిజ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని సైలాడ సర్పంచ్ జోగి చంద్రశేఖర్ అన్నారు. దీన్ని యువత గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. సైలాడ, కుమ్మరిపేట, దివంజిపేట గ్రామాల్లో పర్లాకిఖముండిలోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు డిజిటల్ లిటరసి పోగ్రాంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు, చదువుకున్న యువతకు, రైతులు, మహిళలకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యూనివర్సిటీ అవగాహన కల్పిస్తుందని వీటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరుగుతుందని వాటిపై అవగాహన ఉంటే ఇంట్లోనే అన్ని విధాలుగా పథకాల వివరాలు తెలుసుకునేందుకు వీలు పడుతుందని తెలిపారు. -
అశ్లీల చిత్రాల్లో నటించిన యువకుడి అరెస్ట్
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన ఆమదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ ముఠా ప్రధాన సూత్రధారి చింతాడ మహేష్ పోలీసులకు చిక్కాడు. అతడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఇక నుంచి సెల్ఫోన్లు తనిఖీలుచేస్తామని, అశ్లీల చిత్రాలు ఉంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని జిల్లా ఎస్పీ బ్రహ్మరెడ్డి తెలిపారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ నవీన్‌కుమార్ శనివారం వెల్లడించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తు చేశామని అందులో కొత్తకోటవారివీధికి చెందిన చింతాడ మహేష్ అనే యువకుడు తానే స్వయంగా అశ్లీల చిత్రంలో ఉంటూ చిత్రీకరించిన వీడియో ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో మహేష్ స్నేహితులైన ఆమదాలవలస పట్టణానికి చెందిన సీపాన రమేష్, నానుపాత్రుని సంతోష్, పేడాడ వెంకటరావులను మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా ఒక హార్డు డిస్క్, మూడు సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నామని అందులో అశ్లీల చిత్రాలు చిత్రీకరించినది, వేరొక ప్రాంతాలకు చెందినవి లభ్యమయ్యాయని తెలిపారు. ప్రధాన సూత్రధారి మహేష్‌తో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఆ చిత్రాలను చేజిక్కించుకున్న రమేష్, సంతోష్ అక్కడితో ఆగకుండా అవి పట్టణంలో చాలా మంది వ్యక్తుల మెుబైల్స్‌కు, కంప్యూటర్లకు పంపిస్తూ ప్రచారం చేసినట్టు వారే స్వయంగా ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. వీరితో పాటు కొర్లకోట గ్రామానికి చెందిన క్రిష్ణారావు ఈ చిత్రాలను ప్రసారం చేశాడనే ఆరోపణలతో అరెస్టు చేసి వీరిపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మహేష్ ఉచ్చులో ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, అతడి వద్ద ఉన్న వీడియోలు బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులేదనని తెలిపారు. సెల్‌ఫోన్ దుకాణాల్లో, కంప్యూటర్ సెంటర్లలో, యువకుల సెల్ఫోన్లలో అటువంటి నీలిచిత్రాలు బయటపడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బస్సుపై భారీ చెట్టు... అంతా సేఫ్
ఆమదాలవలస రూరల్: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామం వద్ద ఏబీ రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సుపై ఓ భారీ చెట్టు కూలింది. రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల చెట్టును ఆమదాలవలస వైపు నుంచి బత్తిలి వెళ్తున్న లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే సమయంలో రోడ్డుకు ఇంకోవైపు ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సుపై చెట్టు కుప్ప కూలింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందరూ సీట్లలో కూర్చుని ఉండడంతో ఎవరూ గాయపడలేదు. చెట్టుపడిన బస్సు పైభాగం మాత్రం పూర్తిగా నుజ్జయింది. -
ఆరని కన్నీటి చారిక
ఏడాదైపోయింది... అయినా ఆ పుణ్య గోదారి గట్టుపై కన్నీరు ప్రవహించిన క్షణాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు. వేలాది మంది మధ్య ఆ అభాగ్యులు చేసిన ఆర్తనాదాలు ఎవరి చెవినీ విడిచి పోలేదు. పుణ్యం కోసమని వెళ్లి కన్ను మూసిన ఆవేదనాభరిత సంఘటనలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. గత ఏడాది ఇదే రోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. అందులో జిల్లా వాసులు తొమ్మిది మంది చనిపోయారు. ఆ కుటుంబాలు ఏడాది దాటినా ఇంకా తేరుకోలేదు. వారి రోదనలు ఇంకా ఆగలేదు. ఆర్థిక సాయాలు, పరామర్శలు, సానుభూతులు వారి బాధను దూరం చేయలేకపోతున్నాయి. కొడుకును కోల్పోయి ఒకరు, తల్లిని కోల్పోయి మరొకరు, కుటుంబాన్నంతా కోల్పోయి మరొకరు పడుతున్న వేదన ఏ కొలమానానికీ అందనిది. వీరి కన్నుల్లో గోదావరి ఇంకా ప్రవహిస్తోంది. ఆ కన్నీటి ప్రవాహానికి ఈ కథనాలే సాక్షి. ఆమదాలవలస: ఏడాది అయ్యింది. ఉత్సాహంగా గోదావరి పుష్కరాలకు వెళ్లిన వారు ఊపిరి అక్కడే వదిలేసి వచ్చి. ఘటన జరిగి ఏడాదైనా మృతుల కుటుంబాల్లో కన్నీరు ఇంకా ఆగలేదు. తమ కుటుంబ సభ్యులకు ఇప్పటి కీ మరువలేకపోతున్నామని ఆమదాలవలస పట్టణానికి చెందిన వారంటున్నారు. పట్ణణంలో కొత్తవీధిలోగల పొట్నూరు అమరావతి, ఆమె చెల్లెలు పొట్నూరు లక్ష్మి, తల్లి కొత్తకోట కళావతి (సంతకవిటి మండలం, బొద్దూరు గ్రామం), కళావతి మనుమడు బరాటం ప్రశాంత్(శ్రీకాకుళం బలగ)మరో పదిమంది కుటుంబ సభ్యులు గత ఏడాది జూలై 13న ఆమదాలవలసలో రెలైక్కి గోదావరి పుష్కరాలకు వెళ్లారు. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న అమరావతి కుమారుడు నవీన్(బ్యాంకు టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటున్నాడు) గదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని ఉదయాన్నే నాలుగు గంటలకు బయల్దేరి పుష్కర ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పైన తెలిపిన నలుగురూ మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆమదాలవలస ఉలిక్కిపడింది. అన్నింటా అమ్మే... ‘నాకు ఊహ తెలిసిన నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా నన్ను, తమ్మడిని అమ్మే పెంచింది. గోదావరి పుష్కరాలకు నాన్న పొట్నూరి వీరబ్రహ్మం, అమ్మ అనంతలక్ష్మి, తమ్ముడు సాయిభరత్కుమార్ కలిసి వెళ్లాం. అక్కడ పుష్కరాల్లో మొదటిరోజు జరిగిన తొక్కిసలాటలో అమ్మ చనిపోయింది. అమ్మ లేకపోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అమ్మ జ్ఞాపకాలే ముందుకు నడిపిస్తున్నాయి.’ అని శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి హరిణి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతలక్ష్మి భర్త వీరబ్రహ్మం మాట్లాడుతూ లక్ష్మి జ్ఞాపకాలతోనే బతుకుతున్నట్లు చెప్పారు. బతుకు తెరువుకోసం ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వచ్చామని, తనకు మొదటి నుంచి అన్నింటా చేదోడువాదోడుగా ఉన్న భార్య చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ప్రశాంత్ జ్ఞాపకాలతోనే... మా కుమారుడు బరా టం ప్రశాంత్‌కుమార్ జ్ఞాపకాలతోనే ఇంకా మేం ఉన్నాం. మేము కూరగాయల షాపు పెట్టుకొని శ్రీకాకుళం నగరంలో జీవనం సాగిస్తున్నాం. మా కుమార్తె సుప్రియ శ్రీచైతన్య కళాశాలలో ఇంట ర్మీడియెట్ చదువుతోం ది. కుమారుడు ప్రశాంత్ 7వ తరగతి చదవుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది. తాను పెద్దయ్యాక పోలీస్ అవుతానని ఇంట్లో అందరితో ప్రశాంత్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇంట్లో ఏ పనిచేసినా, చేసు ్తన్నా ప్రశాంత్ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఈనెల 14కు ఏడాది అవుతుండడంతో నగరంలోని అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచే శాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన రూ.12 లక్షలను పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ చేశాం. - బరాటం కామేశ్వరరావు, ఇందిర అమ్మ లేని జీవితం అంధకారం వంగర: అమ్మ లేని జీవితం అంతా అంధకారం ఉందని మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభుక్త రాము, లచ్చుభుక్త వెంకటరావులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో తల్లి లచ్చుభుక్త పారమ్మ(65) మృతి చెందిన ఘటన ఇంకా మరువలేకపోతున్నామని వారు విలపిస్తున్నారు. ‘ఇంటి కష్టసుఖాలన్నీ మా అమ్మగారే చూసుకునేవారు, ఆమె మృతితో మేం ఇంటి పెద్దను కోల్పోయాం. ఆర్థిక సాయం అందింది. కానీ అమ్మ లేని లోటు ఎలా తీరుతుంది’ అని గద్గద స్వరంతో గతాన్ని వారు గుర్తు చేసుకున్నారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం !
ఆమదాలవలస: పింఛన్ల సొమ్ము పక్కదారి పట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ భరోసా కింద వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తమ అవసరాలు తీరిన తరువాత తీరిగ్గా ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకుగాను జిల్లా డీఆర్డీఏ కార్యాలయం నుంచి ఆమదాలవలస మండలానికి కొంత సొమ్మును బ్యాంకు ద్వారా అందజేస్తున్నారు. ఈ సొమ్మును ఎంపీడీవో కార్యాలయం తరఫున బ్యాంకు నుంచి డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేస్తారు. ఈ సొమ్మును కార్యదర్శులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మండలంలో జూన్ నెలకు 28 పంచాయతీల్లో 5,762 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.62,65,500 ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 5,269 మందికి రూ.56,76,500 సొమ్ము పంపిణీ చేశారు. మండలంలో 493 మంది మృతులు, వలస వెళ్లిన వారు ఉండటంతో రూ.5.89 లక్షలు మిగిలిపోయింది. దీనిని కార్యదర్శులు బ్యాంకుల్లో రిటన్‌గా చూపించి, ఆ రశీదులను ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి అందజేశారు. మిగులు సొమ్మును ప్రతి నెలా 15వ తేదీకి డీఆర్డీఏ కార్యాలయానికి జమ చేయాలి. కానీ ఈ నెల 27వ తేదీ గడిచినా.. ఇంతవరకు మిగులు సొమ్ము జమ చేయలేదు. ఈ విషయమై డీఆర్డీఏ కార్యాలయం నుంచి మండల పరిషత్‌కు పలుమార్లు ఆదేశాలు వచ్చాయి. ఎంపీడీవో రోజారాణి కార్యాలయ సిబ్బందిని విచారించగా, మిగులు సొమ్ము తమ సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు బయటపడింది. ప్రతి నెలా ఈ తంతు సాగుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ సొమ్ము ఇలా వినియోగించుకోవడం నేరమని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీఓ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సొమ్ము రివకవరీ చేసేందుకు ఎంపీడీఓ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ అవినీతి బాగోతం బయటకు పొక్కితే విచారణలో చాలా మంది పేర్లు బయటకు వస్తాయని కార్యాలయ సిబ్బంది గుసగుస లాడుతున్నారు. విచారణ చేస్తున్నాం పింఛన్లు పంపిణీ చేయగా, మిగిలిన సొమ్ము డీఆర్డీఏ కార్యాలయానికి జమ చేయకపోవడంతో, అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయి. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ సొమ్ము ఎవరు వాడుకున్నారో విచారిస్తున్నాం. - ఎం.రోజారాణి, ఎంపీడీఓ, ఆమదాలవలస -
మాటతప్పిన బాబును గద్దెదించుతాం
ఆమదాలవలస: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాదిగల చైతన్య రథా యాత్ర ఆమదాలవలస పట్టణానికి చేరుకుంది. ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు లోపింటి నారాయణరావు, అధ్యక్షుడు యందవ నారాయణరావు ఆధ్వర్యంలో మాదిగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 420 అని విమర్శించారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పించి, పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని ధ్వజమెత్తారు. మాటతప్పిన చంద్రబాబును గద్దె దించడానికి జాతి నాయకులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 12న ఢిల్లీలో జరగనున్న మహా ధర్నాకు మాదిగ నాయకులంతా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వైఎస్ రాజు మాదిగ, జిల్లా నాయకులు సవలాపురపు భాస్కరరావు, నవిరి గణేష్, లోపింటి తేజేశ్వరరావు, సిరిపురపు తవుడు, పెంకి రవి, సిరిపురపు రాంబాబు, నవిరి చిన్న, నవిరి గురుమూర్తి, కురమాన రాజు, కంటిపాక పార్వతి ఉంగటి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆమదాలవలసలో హైటెక్ వ్యభిచారం
* పోలీసుల దాడులు * పట్టుపడ్డ నిర్వాహకురాలు ఆమదాలవలస : పట్టణ శివార్లలో కృష్ణాపురం జంక్షన్ వద్ద ఒక గృహంలో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారానికి ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్ఐ ఎం.లక్ష్మయ్య, సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించి చెక్ పెట్టారు. నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలిని, విటుడును అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి ఎస్.ఐ. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణాపురం గ్రామంలో వ్యభిచార గృహం నడిపిస్తున్నారన్న సమాచారంతో వారం రోజులుగా నిఘా పెట్టామని ఎస్ఐ తెలిపారు. ఈ గృహానికి విజయవాడ, హైదరాబాద్, ముంబయ్, అనకాపల్లి, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రవాణా చేస్తున్నారని వెల్లడైనట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు ఫోన్లపైనే తన పని అంతా నడుపుతున్నారని, పోలీసు సిబ్బంది ఉన్న సమయంలోనే వచ్చిన ఫోన్ కాల్స్ చెబుతున్నాయని చెప్పారు. ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని తెలిపారు. వ్యభిచారానికి వచ్చిన వారిని కూడా ఒక్కొక్కరినే తన ఇంట్లోకి రప్పిస్తూ మిగతా వారిని మార్గ మధ్యలో ఉంచుతున్నారని తెలిపారు. ఇది చాలాకాలంగా జరుగుతుందని చెప్పారు. నిర్వాహ కురాలు, విటుడుపై ఐ.టి.పి. 3, 4, 6, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఇటీవల శ్రీకాకుళంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలను తన భర్త విడిచి పెట్టాడని, జీవనోపాధి లేక తన కుమార్తెను పెంచడానికి ఏ దిక్కు తోచక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డానని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, ఐ.సీ.డీ.ఎస్. పీవో ఎన్.నళినీదేవి, ఆమదాలవలస సీఐ నవీన్‌కుమార్, ఏఎస్ఐ మెట్ట సుధాకర్, మానవ అక్రమ రవాణ నిరోధక విభాగం ఏఎస్ఐ పి.వి.రమణ, హెచ్.సి. బి.జగదీశ్వరరావు, సిబ్బంది ఆర్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ.. పెళ్లి.. అరెస్టు!
మైనర్ బాలికతో యువకుడి ప్రేమవివాహం కేసు నమోదు.. యువకుడి అరెస్టు ఆమదాలవలస : మైనర్బాలికను పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ డి.నవీన్‌కుమార్ శనివారం స్థానిక విలేకరులకు తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణంలో 23వ వార్డు వెంకయ్యపేటకు చెందిన కింజరాపు వెంకటేష్, అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి తమ భీమిలిలో గల అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని అక్కడి మహిళా మండలిని ఆశ్రయించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు అయితే మైనార్టీ తీరని తమ కుమార్తెను తమ గ్రామానికి చెందిన వ్యక్తి వెంకటేష్ అపహరించి పెళ్లి చేసుకున్నాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈనెల 6న స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మండలి సంరక్షణలో ప్రేమికులకు రక్షణ కల్పించిన మహిళా చేతన ఉత్తరాంధ్ర కార్యదర్శి కత్తి పద్మకు పోలీసులు ఫోన్ చేసి ప్రేమికులను తీసుకురావాలని సూచించారు. దీంతో కొత్తజంటను శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌కు పద్మ తీసుకువచ్చారు. పోలీసులు వెంటనే వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలికను శ్రీకాకుళం చైల్డ్ హామ్‌కు తరలించినట్లు సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపారు. రాజకీయ కుట్ర! ప్రేమించి పెళ్లిచేసుకున్న తమను విడదీసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని బాలిక బోరుమంతి. వెంకటేష్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానే తప్ప తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పింది. గుడిలో పెళ్లి చేసుకున్న ఫొటోలను మీడియాకు చూపించింది. మరోవైపు మహిళా చేతన మండలి కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ బాలిక రమ్యకు మరో రెండు నెలల్లో 18 ఏళ్లు నిండుతాయని, అప్పటివరకు చైల్డ్ హోమ్‌లోనే బాలికకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. అక్కడ ఆ బాలికకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసులదే బాధ్యతని ఆమె హెచ్చరించారు. బాలిక మేజర్ అయిన వెంటనే, ఆమె ఇష్టప్రకారం జంటను ఒకటి చేస్తామని పేర్కొన్నారు. -
ఇసుక లారీలను ఏం చేయాలి?
ఆమదాలవలస రూరల్: ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా.. విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలను విడిచి పెట్టాలా? ఫైన్ వేయాలా? అన్న మీమాంసలో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలంలోని ముద్దాడపేట నాగావళి నదీతీరం అనధికార ఇసుక ర్యాంపుపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి ఏడు లారీలు, ఒక పొక్లెయిన్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటిని సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయానికి అప్పగించడంతో వారు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రవాణాపై విధివిధానాలపై ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకపోవడంతో అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ర్యాంపుల వద్దనే ఉచిత ఇసుక తీసుకుపోవాలని, యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ చేయరాదని ఈ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. కానీ వాహనాలను సీజ్ చేస్తే వాటికి ఎవరూ అపరాధ రుసుం విధించాలో ఆదేశాల్లో పేర్కొనకపోవడంతో రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలా.. లేక ఫైన్ వేయాలా అన్న సందేహంతో జిల్లా అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తున్నారు. మరోవైపు లారీలను విడుదల చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఒత్తిళ్లు కూడా త్రీవతరమవుతున్నాయి. లారీలకు ఫైన్ వేస్తే ఏ శాఖ తరఫున చలానా తీయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం సామాన్యులకు కొంత ఊరట కల్పించినా ప్రస్తుతానికి అధికారులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. -
పొదుపు డిపాజిట్ స్వాహా?
ఆమదాలవలస/రూరల్:పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట డ్వాక్రా సం ఘాల సభ్యులు ఆందోళన చేశారు. డ్వాక్రా సంఘాల పొ దుపు డిపాజిట్ డబ్బులను వెలుగు సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్) ఉమాదేవి స్వాహా చేసినట్టు ఆరోపించా రు. ఏపీఎంను, బ్యాంకు అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరుబుజ్జిలి మండలం డకరవలస పంచాయతీ పరిధి డకరవలస, సుభద్రాపురం, సూర్యనారాయణపురం గ్రామాల్లో 18 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ఆమదాలవలస పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా బ్యాంకులో పొదుపు డిపాజిట్, వెలుగు రుణాలు వంటివి లావాదేవీలు జరుగుతుండేవి. డకరవలస పంచాయతీ ఆంధ్రా బ్యాంకుకు దత్తత గ్రామం కావడంతో మండలం వేరొకటి అయినా బ్యాంకు రుణాలు మాత్రం ఈ బ్యాంకులోనే పొందాలి. ఈ లావాదేవీలు జరుగుతున్న క్రమంలో 18 డ్వాక్రా సంఘాలకు చెందిన పొదుపు డిపాజిట్ సొమ్ము స్వాహా చేశారు. ఒక్కొక్క సంఘం నుంచి రూ. 7,200 చొప్పున మొత్తం రూ. 1,29,600 స్వాహా జరిగినట్టు డ్వాక్రా సంఘాల అధ్యక్షులు సైలాడ శారదమ్మ, చింతాడ రూపావతి, కొల్ల రమణమ్మ, కొల్ల సుగుణమ్మ, బెవర జ్యోతి, కొల్ల కరుణమ్మతో పాటు మరికొంత మంది సభ్యులు ఆరోపించారు. ఎటువంటి తీర్మానాలు లేకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి మా డిపాజిట్ సొమ్మును స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాల తీర్మానాలు చేయకుండానే సొమ్ములు ఎలా మాయం చేశారని బ్యాం కు అధికారులను నిలదీయడంతో బ్యాంకు మేనేజర్ వి.సురేష్‌రాజు స్పందిస్తూ పొదుపు డిపాజిట్ ఎవరూ స్వాహా చేయలేదన్నారు. ఆ సొమ్మును మీ సంతకాలతో ఉన్న విత్‌డ్రా ఫారమ్‌లు సీఎఫ్ మాకు అందించడంతో స్త్రీనిధి ద్వారా సమృద్ధి పథకానికి చెల్లించినట్టు తెలిపారు. ఎవరి అనుమతులు, సంతకాలు చేయకుండానే సంఘాల సొమ్మును వేరొక పథకానికి ఎలా జమ చేస్తారని సభ్యులు బ్యాంకులో గట్టిగా కేకలు వేయడంతో బ్యాంకు మేనేజర్ సరుబుజ్జిలి ఏపీఎం ఎం.కూర్మారావుకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. బ్యాంకుకు చేరుకున్న ఏపీఎంను సంఘాల సభ్యులు నిలదీశారు. సీఎఫ్ సొమ్మును స్వాహా చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి బ్యాంకుకు చేరుకుని సంఘాల సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పొదుపు డిపాజిట్ సొమ్ము సంఘాల సభ్యులకు తెలియకుండా విత్‌డ్రా చేసిన విధానంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు సొమ్ములను తిరిగి సంఘాల సభ్యులకు చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయండి
డీఆర్ఎంను కోరిన ఎంపీ, విప్ ఆమదాలవలస రూరల్: జిల్లాలో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే డీఆర్ఎం చంద్రలేఖముఖర్జీని కోరారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన కుర్చీలను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ను మోడల్‌ై రెల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దేందు కేంద్ర రైల్వేశాఖ కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ఎంపీ నిధులు రూ. 13 లక్షలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం కేటాయించగా ఇక్కడ కుర్చీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైళ్లు నిలుపుదల చేయాలి అనంతరం డీఆర్ఎం, ఎంపీ, విప్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి నోచుకోక ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డీఆర్ఎంను ఎంపీ కోరారు. జిల్లా మీదుగా ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా 20 రైళ్లు ఆమదాలవలస స్టేషన్లో ఆగడం లేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 10 రైళ్లు నిలుపుదల చేయడానికైనా రైల్వే బోర్డుకు తెలియజేయాలని కోరారు. తిరుమల, గరీబ్థ్ ్రరైళ్లు విశాఖపట్నం నుంచి కాకుండా ఆమదాలవలస రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దూసి రైల్వేస్టేషన్లో గుణుపూర్ పాసింజర్, పొందూరు స్టేషన్లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని విప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, తహశీల్దార్ కె.శ్రీరాములు, మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి భాస్కరారావు, వైస్‌చైర్మన్ అన్నెపు భాస్కరరావు, కౌన్సిలర్స్, సర్పంచ్‌లు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ముంచెత్తనున్న రోగాలు
శ్రీకాకుళంసిటీ/ఆమదాలవలస/రాజాం/ఇచ్ఛాపురం: జిల్లాలోని మునిసిపాలిటీలు చెత్తమయం అవుతున్నాయి. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు గడచిన 13రోజులుగా చేపడుతున్న సమ్మె విరమణపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది. గడచిన రెండు, మూడు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు అదికాస్తా వీధుల్లోకి చెల్లాచెదురుగా విస్తరించి దుర్వాసన వెదజల్లుతోంది. కాలువల్లోకి చెత్త చేరుతుండటంతో మురుగు ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. ఫలితంగా కాలువల్లో నీరు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీల్లో ప్రజలు ఇప్పుడు రోగాలభయంతో ఆందోళన చెందుతున్నారు. చిక్కోలు చెత్తమయం శ్రీకాకుళం పట్టణం 36వార్డులుగా విస్తరించింది. ఇక్కడ 325 మంది కాంట్రాక్టు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి 109 మంది వరకు పర్మినెంట్ సిబ్బంది కూడా మద్దతు తెలపడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. పలు వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాన కూడళ్లు, పలు వార్డుల్లో చెత్త పేరుకుపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్ని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. స్వచ్చభారత్‌ను దేశ ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే పార్లమెంట్ సభ్యుల్లో చిత్తశుద్ధి కరువవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్వానంగా ఆమదాలవలస ఇక్కడ రెగ్యులర్ ఏడుగురు, చివరిస్థాయి కార్మికులు ఐదుగురు ఉద్యోగులుండగా, కాంట్రాక్టు కార్మికులు 60మంది ఉన్నారు. ఉన్న 12మంది కార్మికులు పట్టణంలోపారిశుద్ధ్యం మెరుగుపర్చలేకపోతున్నారు. సమ్మెప్రభావంతో పట్టణమంతా అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడే చెత్త గుట్టలుగుట్టలుగా పెరుగుతున్నాయి. వర్షాలవల్ల దోమలు కూడా విజృంభిస్తున్నాయి. ప్రధానంగా 16వ వార్డు డాబాలవారి వీధి గబ్బు కంపు కొడుతోంది. ఈ వీధిలో గేదెల పెంపకందారులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి కాలువలన్నీ పేడతో పూడుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. కాస్త లోతట్టుగా ఉన్న ఇళ్లలోకి పేడనీరు పోటెత్తుతుండటంతో ఇళ్లు ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి వెళ్లాల్సివస్తోందని చెబుతున్నారు. పలాసలో అపారిశుద్ధ్యం పలాస మునిసిపాలిటీలో 25వార్డులు విస్తరించగా ఇక్క డ 88మంది కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు, 11మం ది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టు సిబ్బంది చేస్తు న్న సమ్మె పుణ్యమాని పట్టణంలో ఏ మూల చూసినా అపారిశుద్ద్యం తాండవిస్తోంది. ఇక ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 77మంది కాంట్రాక్టు కార్మికులు 14మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులంతా సమ్మె చేపడుతుండటంతో చెత్తకుప్పలు ఎక్కువవుతున్నాయి. ఇంకా రాజాం, పాలకొండ నగరపంచాయతీ ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. రాజాంలో మొత్తం 79మంది సమ్మెలో పాల్గొన డంతో పట్టణంతోపాటు ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల్లోనూ చెత్త పెరిగిపోయింది. ఇప్పటికైనా పాలకులు వీటిపై దృష్టిసారించి సమ్మె విరమింపజేసేందుకు చర్య లు తీసుకోకుంటే రాబోయే కొద్దిరోజుల్లో రోగాలు విస్తరించడం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
స్పెషల్ బ్రాంచ్ ఏంచేస్తున్నట్లు?
సరుబుజ్జిలి : ఆమదాలవసలో సోమవారం నకిలీనోట్ల ముఠా చిక్కడంతో వారిని విచారించి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పాతపట్నం మండలానికి చెందిన ఈ ముఠాతో సరుబుజ్జిలి మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన యువకులు ఈ నకిలీనోట్ల వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం మన మధ్య తిరుగుతున్న వ్యక్తులు ఫేక్ కరెన్సీ ముఠాలతో కుమ్మక్కాయ్యారా అంటూ మండలవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డదారిలో అధిక సొమ్ము గడించాలన్న దురాశతో పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ దొంగనోట్ల చలామణిలో తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెరవెనుక... దొంగనోట్ల వ్యవహారంలో ముఠా సభ్యులు పట్టుబడి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు ఈ కేసు పురోగతిపై వేగం పెంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పాలకపక్షానికి చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపించడంతో పోలీసులు వెనుకంజవేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొద్దునిద్రలో స్పెషల్ బ్రాంచ్! మండలంలో నకిలీ నోట్ల ముఠాలు సంచరిస్తున్నట్లు చాలా కాలం నుంచి విమర్శలున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ముందస్తుగా అంచనాలు వేసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధి. నకిలీ క రెన్సీ ముఠాల విషయంలో పలుమార్లు స్వయంగా, పత్రికలు ద్వారా వారిని అప్రత్తంచేసినా స్పందనలేదు. దీంతో ముందస్తు సమచారంలేక పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలను అరికట్టడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. -
ఆమదాలవలసలో మహిళ హత్య
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని 13వవార్డు కొత్తకోటవారి వీధికి చెందిన అన్నపూర్ణసాహు (55) అనే మహిళ సోమవారం తెల్లవారు హత్యకు గురయ్యారు. బంగారం కోసమే ఆమెను దుండగలు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటలో దుండగలు నెట్టేయడంతో ఆమె చనిపోయి ఉంటారని చెబుతున్నారు. కానీ మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. సాహు ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెను సోమవారం తెల్లవారు కొంతమంది దుండగులు హతమార్చి ఇంట్లోని 5 తులాల బంగారంతో పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇంటి మేడపై అద్దెకు నివాసముంటున్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాహుకు ఒక కుమార్తె. అన్నపూర్ణ భర్త రఘునాథ్ చాన్నాళ్ల క్రితం చనిపోయారు. ఈమే పిల్లలను పెంచి పెద్దచేసింది. కుమారుడు ఓ ఘటనలో 5 ఏళ్లక్రితం మృతి చెందాడు. కుమార్తె మానసకుమారికు వివాహం చేయడంతో ఆమె ఇచ్ఛాపురంలో ఉంటోంది. సాహు హత్యతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. జాడ పట్టలేని డాగ్‌స్కాడ్: శ్రీకాకుళం డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. క్లూస్‌టీం ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది. డాగ్‌స్క్వాడ్ ఆ ఇంటి ఎదురుగా ఉన్న సందులోంచి పరుగులు పెడుతూ కొత్తకోటవారివీధి చివర ప్రధాన రహదారిపైకి వచ్చింది. అక్కడ నుంచి డాగ్ హంతుకు జాడ తెలియకపోవడంతో వెనుదిరిగింది. అప్పటికే రోడ్లపై జనసంచారం ఎక్కువగా ఉండడంతో హంతకులు వెళ్లే జాడ కనిపెట్టలేక పోయిందని డాగ్‌స్క్వాడ్ సిబ్బంది చెప్పారు. హత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకుంటామని సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేశారు. ప్రజల్లో ఆందోళన: పట్టణ నడిబొడ్డున జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఓ మహిళ హత్యకు గురికావడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురౌతున్నారు. రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్రమత్తం అయి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 7వ వార్డు చింతాడకు చెందిన ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు(అలియాస్ రాజశేఖర్)(25) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భాస్కరరావు విధి నిర్వహణలో ఉంటూ రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం మంగళవారం తెల్లవారుజామున చింతాడకు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో నావీకాదళం చీఫ్ మార్షల్ రమేష్‌కుమార్, ఆర్మీ సుబేదారు ఎల్జే చౌదరి, హవల్దార్ ఎం.మురళీధర్, శ్రీకాకుళం తహశీల్దారు ఎస్.దీలిప్ చక్రవర్తి, ఆర్ఐ ఎస్.శంకరరావు పాల్గొన్నారు. విషాదంలో చింతాడ చింతాడ గ్రామంలోకి భాస్కరరావు మృతదేహాన్ని తీసుకురాగానే గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. భాస్కరరావు తల్లిదండ్రులు సుందరరావు, రమణమ్మల రోదనలు పలువురిని కంటతడిపెట్టంచాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తాడనుకున్న చేతికందిన కొడుకు మరణవార్త వారికి అశనిపాతంగా తయారైంది.కొడుకు కష్టార్జితంతో ఇంటి నిర్మా ణం పూర్తి చేసినా గృహప్రవేశానికి కూడా రాలే దని, అక్టోబర్‌లో వస్తానని చెప్పిన కడసారి మాటలను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భాస్కరరావు తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. నేవీ చీఫ్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నావికా దళం బ్యాండ్ పార్టీతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. నావికాదళం గాలిలో కాల్పు జరిపి అంత్యక్రియలు చేపట్టారు. -
ఆమదాలవలసకు కమిషనర్ సెలవ్!
ఆమదాలవలస:జిల్లాలో అధికార యంత్రాంగంపై అధికార పార్టీ ఒత్తిళ్లు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. దీనివల్ల ప్రశాంతంగా విధులు నిర్వహించలేక పలువురు పలాయన మంత్రం పఠిస్తున్నారు. ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ ఉదంతమే దీనికి నిదర్శనం. మున్సిపల్ కమిషనర్ ఎన్.నూకేశ్వరరావు సెలవుపై వెళ్లిపోయారు. ఆయన 15 రోజులు మెడికల్ లీవ్ పెట్టినప్పటికీ.. ఇక తిరిగి రారని తెలుస్తోంది. తాను నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేయడం, ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డును కూడా వాపసు ఇచ్చేయడం తిరిగి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి వ్యక్తిగత వినతిపైనే ఆయన ఆమదాలవలస కమిషనర్‌గా వచ్చారు. గతంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-2 మేనేజర్‌గా పని చేసిన ఆయన అక్కడి నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-1 మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఆమదాలవలస కమిషనర్ పోస్టు ఖాళీ కావడంతో వ్యక్తిగత వినతి పెట్టుకుని గత ఏడాది జూన్‌లో ఇక్కడికి వచ్చారు. ఏడాదిపాటు చక్కగా విధులు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పాలకవర్గం ఏర్పాటు చేయడంతో కష్టాలు మొదలయ్యాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. టీడీపీ పట్టణ, నియోజకవర్గ నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి తాము చెప్పినట్లు చేయాలని పీక మీక కత్తి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్ కూల్చివేత వివాదం ఈ ఒత్తిళ్లకు పరాకాష్టగా మారింది. కౌన్సిల్ తీర్మానం లేకుండా, వర్తకులకు నోటీసులు ఇవ్వకండా, కొందరు హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి కూరగాయల మార్కెట్‌ను కూలగొట్టించే విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. దీనికితోడు మున్సిపాలిటీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో వర్తకుల పక్షాన నిలిచి తీవ్ర ప్రతిఘటించడంతోపాటు కమిషనర్‌ను పలుమార్లు నిలదీసింది. ఈ ఉదంతంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దీంతో ఇరకాటంలో పడిన కమిషనర్ ఈ పరిస్థితుల్లో ఇక్కడ పని చేయలేనని భావించి, సెలవు పేరుతో వెళ్లిపోయారు. ప్రస్తుతం శానిటరీ ఇన్స్పెక్టర్ పోలారావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా కమిషనర్‌గా తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. -
హైకోర్టు స్టే
ఆమదాలవలస:అధికార మదానికి చెంపపెట్టులా.. రాజకీయ కుట్రలను తిప్పికొట్టేలా.. చిరువ్యాపారులు బతుకులు నిలిపేలా ఉన్నత న్యాయస్థానం సకాలంలో స్పందించింది. ఆమదాలవలస కూరగాయల మార్కెట్ జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించింది. సోమవారం రాత్రి అధికారులు పోలీసు బలగాల సాయంతో మార్కెట్లోని షాపులను కూలగొట్టినందుకు నిరసనగా బాధిత వర్తకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం ఉదయమే ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వర్తకులు ఆందోళన చేపట్టగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తదితరులు కార్యాలయంలోకి వెళ్లి కమిషనర్ నూకేశ్వరరావును నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇంతలోనే మార్కెట్ తొలగింపు చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చినట్లు సమాచారం అందడంతో అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. మార్కెట్లో మళ్లీ షాపుల ఏర్పాటుకు పూనుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతి రేకంగా కూరగాయల వర్తక సంఘం తరఫున దుప్పల సింహాచలం, మరికొందరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 25(సోమవారం)న వారు కోర్టులో పిటిషన్ వేయగా అదే రోజు రాత్రి మార్కెట్‌ను బలవంతంగా కూలగొట్టడం విశేషం. దశాబ్దాలుగా మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న తమకు ప్రత్యామ్నాయం కల్పించకుండా అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఏకపక్షంగా మార్కెట్ కూలదోసేందకు చేస్తున్న ప్రయత్నాల ను అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో హైకోర్టు విచారణకు స్వీకరించింది. వివరాలు పరిశీలించి మార్కెట్లో యథాతథ స్థితి కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ.. కూరగాయల మార్కెట్లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. వ్యాపారులు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని పేర్కొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనపర్వంలో ఉన్న వర్తకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సమాచారం తెలుసుకొని ఆనందంతో కేరింతలు కొట్టారు. వైఎస్ఆర్సీపీకి జై.. తమ్మినేనికి జై.. అని నినాదాలు చేస్తూ కార్యాలయం బయటకు వచ్చి తమ్మినేని సీతారాంను పూల మాలతో సత్కరించారు. ఉదయం ఆందోళనకు శ్రీకారం అంతకుముందు వర్తకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం ఉదయం పెద్దసంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బయట వర్తకులు ఆందోళనకు దిగగా.. వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు కమిషనర్ చాంబర్లోకి వెళ్లి ఆయన్ను నిలదీశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా మార్కెట్‌ను ఎలా కూలదోశారని నిలదీశారు. అధికార బలంతో చట్ట వ్యతిరేక చర్యలకు తెగిస్తే.. పేదలకు అన్యాయం చేస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. ఇది మున్సిపాలిటీ సమస్య.. ఇందులోకి ఇతర ప్రాంతాల నాయకులు చొరబడి మున్సిపల్ చైర్‌పర్సన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్టే వస్తుందని తెలిసే హడావుడిగా కూల్చివేత సోమవారమే వర్తకులు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దాన్ని కోర్టు పరిశీలించి స్టే మంజూరు చేసే అవకాశముందని తెలిసే పక్కా ప్రణాళికతో పోలీసు బలగాలను మోహరించి పేద వర్తకుల పొట్ట కొట్టారని ఆరోపించారు. చట్టప్రకారం 30 ఏళ్లుపాటు ఒక ఆస్తిని అనుభవిస్తున్నవారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, అది వారికే చెందుతుందన్న విషయం మీకు తెలియదా అని కమిషనర్‌ను ప్రశ్నించారు. సాధారణ వెండర్లు అయినందునే నోటీసులు ఇవ్వలేదు:కమిషనర్ దీనికి కమిషనర్ స్పందిస్తూ కూరగాయల వర్తకులు సాధారణ వెండర్లేనని, అందువల్ల వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పా రు. దీనిపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోపుడుబళ్ల వ్యాపారులను మాత్రమే వెండర్లు అంటారని, మార్కెట్లో వ్యాపారాలు చేసే వారిని వర్తకులు అంటారని.. పైగా వారంతా ఒకే చోట 80 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నారని స్పష్టం చేయగా.. వారు ప్రభుత్వ స్థలాన్ని అక్రమించారని కమిషనర్ ఆరోపించారు. అలా అనుకున్నా ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలి కదా అని నేతలు నిలదీయడంతో కమిషనర్ సమాధానం దాట వేశారు. భారీ బందోబస్తు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యలయం ఆవరణలో సీఐ విజయానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐలు గోవిందరావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావులతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన సరుబుజ్జలి ఎంపీపీ కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి ఎస్ నాగేశ్వరరావు, ఆమదాలవలస జెడ్పీటీసీ ప్రతినిధి బొడ్డేపల్లి నారాయణరావు, బూర్జ జెడ్పీటీసీ సభ్యుడు ఆన్నెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, పొందూరు ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, ఎంపీటీసీ కోరుకొండ సాయిరాం, పార్టీ నాయకులు కిల్లి లక్ష్మణరావు, జె.జె.మోహన్‌రావు, కుసుమంచి శ్యా మ్‌ప్రసాద్, తమ్మినేని చిరంజీవినాగ్, దన్నాన సత్యానారాయణ, పి.చిన్నారావు, ఎస్.దాసునాయుడు, ఖండాపు గోవిందరావు పాల్గొన్నారు. -
ఆముదాలవలసలో తీవ్ర ఉద్రిక్తత
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆముదాలవలస మార్కెట్లో వ్యాపార సముదాయాలను తొలగించేందుకు అధికారులు వెళ్లారు. జేసీబీలతో తొలగించేందుకు ప్రయత్నించగా కూరగాయల వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారం వ్యాపారస్తులకు మద్దతు తెలియజేశారు. వ్యాపారస్తులు ఆందోళనకు దిగడంతో ఆముదాలవలసలో 144 సెక్షన్ విధించారు. అంతేగాక, విద్యుత్ సరఫరాను ఆపివేశారు. -
హత్యా రాజకీయాలు హతం కావాలి
ఆమదాలవలస:అధికారమదంతో హత్యారాజకీయాలు చేస్తే సహించేది లేదని, ఎదురుదాడి తప్పదని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీమంత్రి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. శనివారం అసెం బ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఆమదాలవలస గేటు వద్ద శనివారం రాత్రి కార్యకర్తలతో కలిసి నోటికి నల్ల రిబ్బన్లు ధరించి, కొవ్వొత్తులతో సుమారు గంటసేపు మౌన నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు గూండాల్లా చెలరేగిపోయి శాసనసభ గౌరవాన్ని మంటగలిపారని విమర్శించారు. దివంగతులైన ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మూడు నెలల్లో 14 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారని అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రస్తావించడాన్ని తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. ఫ్యాక్షనిస్టు అయిన పరిటాల రవీంద్ర దేశ నాయకుడన్నట్లు ఆయన హత్యను పదేపదే అసెంబ్లీలో చర్చించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అలాంటి హంతకుల గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు నేరస్తులు కారా అని ప్రశ్నించారు. పరిటాల రవిది రాజకీయ హత్య కాదని, దాదాగిరీ చేసే వారికి అలాంటి దుస్థితి తప్పదన్నారు. అసెంభ్లీలో నర హంతకులు, ద్రోహులు, దోచుకునేవారు అనే పదాలు వాడిన వారిని బఫూన్ అనడంలో తమ్పేముందని ప్రశ్నిస్తూ అది అన్‌పార్లమెంటరీ పదం అని అనడంలో అర్థం లేదని దుయ్యబట్టారు. ఈ మాత్రం దానికే ప్రధాన ప్రతిపక్ష నేతను బహిష్కరిస్తామనిడంలో ఆంత్యర్యమేమిటని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్టవేణి, ఎస్.మురళీధరరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల చిరంజీవిరావు, దుంపల శ్యామలరావు, పార్టీ నాయకులు జెజె మోహన్‌రావు, జె.వెంకటేశ్వరరావు, బలగ అప్పారావు, బి.విజయలక్ష్మి, జి.శ్రీనివాసరావు, పి.చిన్నారావులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా? శ్రీకాకుళం అర్బన్: పత్రికా స్వేఛ్చను హరించే హక్కు ఎవరికీ లేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు అన్ని పత్రికలనూ ఆహ్వానించి సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టువంటిదన్నారు. మీడియా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. దాన్ని కాలరాయవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసేదిగా ఉందన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని రైతులు ఆశించారని, వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. ప్రత్యేక బడ్జెట్ అని చెప్పి రూ.13వేల కోట్లు కేటాయించారన్నారు. ఇది వ్యవసాయ శాఖ పద్దుల మాదిరిగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌కు రాజ్యాంగబద్ధత లేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎన్నికల హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదన్నారు. రైతాంగానికి, తీరప్రాంత ప్రజలకు సోలార్ విద్యుత్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్న హామీ కూడా కాగితాలకే పరిమితమైందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వ్యవసాయరంగానికి కచ్చితమైన భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు, రైతులు తిర గబడే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు మొదలవలస లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆమదాలవలస బాయ్స్ హాస్టల్ లో బస
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్: వసతి గృహంలో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటూ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆప్యాయంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఆముదాలవలసలోని బాలుర సాంఘీక సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు నిర్వహించి వసతి గృహంలో బస చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి కష్ట సుఖాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా వసతి గృహంలో విద్యార్థులకు పెట్టే మెనూపై ఆరా తీశారు. వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అంటూ.. విద్యార్థులు ఉపయోగించే స్నానపు గదుల, మరుగు దొడ్లను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ఇలా చెప్పారు... నిత్యం వసతి గృహంలో పెట్టే మెనూలో కిచిడీ, టమాటా రైస్, పొంగలి వంటివి మాకు నచ్చడంలేదని వాటిని వృథాగా కొంతమంది బయటపడేస్తున్నారని విద్యార్థులు చెప్పారు. అలాగే వసతి గృహంలో దోమలు బెడద ఎక్కువుగా ఉందని, తాగునీటి బోరు ఉన్నా ఎన్నటికప్పుడే మరమ్మతులకు గురవుతోందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ముందస్తుగా వసతిగృహాధికారి విద్యార్థులు సార్వస్తే అంతా సక్రమంగా ఉందని చెప్పాలని చెప్పడంతో విద్యార్థులు కొంతమంది భయపడి అంతా బాగుందని మొదటగా చెప్పారు. కలెక్టర్ ఈ విషయాన్ని గమనించి వారి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసి అధికారులు ఎవరూ లేరని భయం లేకుండా చెప్పండని విద్యార్థులను ప్రశ్నించడంతో కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వసతిగృహాల అభివృద్ధికే ఈ పరిశీలన.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల అభివృద్ధికే ఈ పరిశీలన నిర్వహిస్తునట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. జిల్లాలో 69వ సాంఘికసంక్షేమ, ట్రైబుల్ వెల్ఫేర్ వసతి గృహాలు ఉన్నాయని అందులో 53 వసతి గృహాల్లో 53 మంది జిల్లా అధికారులు శుక్రవారం రాత్రి ఇలా పరిశీలనలకు వెళ్లి వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు బసచేసి ఉదయాన్నే వారితో కలిసి టిఫిన్ చేసి నివేదిక సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తాను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. వసతి గృహాధికారులు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ వారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారిని ఇంటిని మరిపించే విధంగా చూడాలని వసతి గృహాధికారి కె. ప్రహ్లాదరావవుకు సూచించారు. కార్యక్రమంలో సహాయక సాంఘిక సంక్షేమాధికారి ఎస్. కృష్ణారావు, ఆమదాలవలస తహశీల్దారు కె. శ్రీరాములు, ఆర్ఐ రామశాస్త్రి, వీఆర్వోలు కిరణ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆమదాలవలస పీఠం టీడీపీ కైవసం
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ తమ్మినేని గీత ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో గణేష్‌కుమార్ అధ్యక్షతన ఎన్నిక జరిగింది. ముందుగా ఎక్స్అఫీషియో ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడులకు ఓటుహక్కు పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 23 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా గీతను ఆ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ ఇంజరావు విశ్వనాథం ప్రతిపాదించగా 4వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ రుప్ప రామచంద్రరావు బలపరి చారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతాకుమారి పేరును బొడ్డేపల్లి రమేష్‌కుమార్ ప్రతిపాదించగా, ఎస్.మురళీధరరావు బలపరిచారు. దీంతో ఆర్డీవో ఎన్నిక ప్రక్రియను ఆరంభించారు. వాస్తవంగా మున్సిపాలిలోని 23వార్డులకు 10 వార్డులు వైఎస్సార్ సీపీ, 8వార్డులు టీడీపీ, 3 వార్డులు కాంగ్రెస్, 2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకరు వైఎస్సార్ సీపీలోకి, మరొకరు టీడీపీలో చేరిపోయారు. దీంతో వైఎస్సార్ సీపీకి 11, టీడీపీకి 9 మంది కౌన్సిలర్లు ఉన్నా రు. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులతో కలిసి 15 మంది టీడీపీ అభ్య ర్థి గీతకు మద్దతుగా చేతులెత్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతుగా 11 మం ది చేతులెత్తారు. దీంతో నాలుగు ఓట్ల ఆధిక్యంతో టీడీపీకి చెందిన గీత చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఆర్డీవో ప్రకటించారు. అలాగే, వైస్ చైర్ప ర్సన్‌గా టీడీపీ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కె.వి.రాజ్యలక్ష్మి పేరు ప్రతిపాదించగా, వైఎ స్సార్ సీపీ తరఫున ఇండిపెండెంట్ కౌన్సిలర్ బి.ఏకాశమ్మను ప్రకటించారు. ఈ ఎన్నికలో కె.వి.రాజ్యలక్ష్మి విజేతగా నిలిచింది. -
అడ్డదారిలో అందలమెక్కారు
ఆమదాలవలస: మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ అడ్డదారిలో కైవసం చేసుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. తన స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోను, ఆమదాలవలస నియోజకవర్గంలో నూకలు చెల్లాయన్నారు. ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీని పట్టణ ప్రజలు పట్టం కట్టారని, అటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలలో కాం గ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయని ఆరోపించారు. పట్టణ ప్రజలు అధిక వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించినా ఎక్స్ అఫీషియో ఓటుతో టీడీపీ నాయకులు పట్టణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవిభజనకు ముందు నుంచే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ ముందుగానే చెప్పిందని, ఇప్పుడు అది రుజువైందన్నారు. పట్టణ ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటనే ఉన్నారని, టీడీపీ విజయం వాపు మాత్రమేనని బలుపు కాదని ఆపార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇలాంటి నీచరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యేనని విమర్శించారు. కౌన్సిలర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ మాట్లాడుతూ సుమారు 30 ఏళ్లుగా మున్సిపాలిటీలో బొడ్డేపల్లి కుటుంబీకులు పాలన సాగించేవారని, అంతటి పాలనకు మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లను టీడీపీకి అందించి ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారని, రానున్న రోజుల్లో బొడ్డేపల్లి కుటుంబీకులకు రాజకీయ భవిష్యత్ శూన్యమని అన్నారు. ఇంతటి నీచరాజకీయాలను చూసిన మాజీ ఎమ్మెల్యే మామ, మకుటములేని మహరాజు, నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, బొడ్డేపల్లి రవికుమార్, కౌన్సిలర్ లు దుంపల శ్యామలరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎస్.మురళీధరరావు, పొడుగు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ అఫీషియో గట్టెక్కిన టీడీపీ శ్రీకాకుళం కలెక్టరేట్: ఆమదాలవలస పురపాలక సంఘంలో బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, ఇండిపెండింట్కు ముడుపులు చెల్లించి ఎక్స్ అఫీషియో ఓటుతో అధ్యక్ష పీఠాన్ని సాధించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది కౌన్సిలర్ల బలం ఉన్న టీడీపీకి ఎక్స్ అఫీషియో ఆదుకోవడం వల్లే చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, ఎక్స్ అఫీషియో మూడు ఓట్లలో రెండు ఓట్లు రేపు శ్రీకాకుళం మున్సిపాలిటీకి అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లో శ్రీకాకుళం మురపాలక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం పట్టణంలో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీకి గట్టిగా బుద్ది చెప్పే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో శ్రీకాకుళం పురపాలక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం అయితే రానున్న ఎన్నికల్లో ఆరుమాసాల్లోగా పూర్తయితే వీరి ఓట్లు చెల్లవు. నిన్నటి వరకు ఇదే సందేహంతో ఉన్న టీడీపీ ఎక్స్ అఫీషియో సభ్యులు.. ఎలాగైనా ఆమదాలవలస చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరు సహకరించక పోతే ఆమదాలవలస చైర్మన్ పీఠం వైఎస్ఆర్సీపీకే దక్కేది. -
టీడీపీ... ఎక్స్ అఫీషియో మంత్రాంగం..
ఆమదాలవలస: ఇప్పటివరకూ ఎప్పుడా ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నేటితో పురపాలక చైర్పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. ఆమదాలవలస పురపాలక సంఘంలో చైర్పర్సన్ ఎన్నిక జిల్లా అధికారుల సమక్షంలో కమిషనర్ ఎన్.నూకేశ్వరావు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో వెలువడిన పుర ఫలితాలలో వైఎస్సార్సీపీ-10, టీడీపీ-8, కాంగ్రెస్-3, స్వతంత్రులు 2 స్థానాలు కైవసం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. మున్సిపాలిటి ఏర్పడిన దగ్గర నుంచి బొడ్డేపల్లి కుంటుంబీకులకే పట్టణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు వైసీపీలో ఫలితాలు వెలువడకముందే చేరారు. మరొకరు ఫలితాల అనంతరం టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతా కుమారి, టీడీపీ అభ్యర్థిగా తమ్మినేని గీతను ఎన్నికలముందే ప్రకటించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ప్రకటించడంతో మరలా బొడ్డేపల్లి కుటుంబానిదే చైర్పర్సన్ కుర్చి అని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు ఎలాగైనా గెలిచిన ఇతర పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లపై టీడీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఎవరికీ మద్దతు తెలుపుతారో అనే అంశంపైనే చైర్పర్సన్ ఎన్నిక ముడిపడి ఉందని పలువురు చెబుతున్నారు. మాట వినని కాంగ్రెస్ కౌన్సిలర్లు ... కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులరాలు బొడ్డేపల్లి సత్యవతి మాటలు వినడంలేదని సమాచారం. వీరు ఎవరికి మద్దతు పలుకుతారనేది కీలకం కానుంది. వీరు ఓటింగ్ సమయంలో హాజరుకాకుండా చూసే విధంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారు రాకపోతే టీడీపీదే పైచేయి అవుతుందని వారి నమ్మకం. ఎక్స్అఫిషియో ఓట్లతో గెలవాలనుకుంటున్న టీడీపీ... టీడీపీ నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఎక్స్అఫిసియో ఓట్లు ఆమదాలవలస మున్సిపాలిటీలో వినియోగించుకోనున్నారు. వీరి ముగ్గురు ఓట్లతో టీడీపీకి 12, వైఎస్సార్సీపీకి 11 ఓట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సెలర్ అభ్యర్థులు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తేనే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా చైర్పర్సన్ ఎంపిక గురించే చర్చ సాగుతోంది. మరి కొన్ని గంటల్లోనే ఈ చర్చకు తెరపడనుంది. -
నేను చెప్పిన ట్టు వినండి.. లేదా..!
ఆమదాలవలస: నేను చెప్పే పనులు చేసే అధికారులే ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులుగా ఉండండి లేదంటే స్వచ్చందంగా బదీలీలు చేయించుకుని వెళ్లిపోండి. ఈ రెండూ చేయకపోతే నేనే మిమ్మల్ని పంపించివేసి నాకు నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటా. ఈ మాటలేంటని అనుకుంటున్నారా. ఇది ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులతో మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్న మాటలు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ నూకేశ్వరరావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించడంతోపాటు, మున్సిపల్ పరిధిలో ఉన్న బోగస్ కార్డులు, పింఛన్లు రద్దుచేసేందుకు తగిన కార్యచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయూలని కమిషనర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, ఆదాయ వ్యయూలపై అధికారులను నిలదీస్తూ ఆరాతీశారు. మున్సిపల్ మేనేజర్ కె శ్రీనివాసరావు, తహశీల్దారు శ్రీరాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చోరీలపై ప్రత్యేక దృష్టి
ఆమదాలవలస: జిల్లాలో చోరీలను అరి కట్టే విషయమై ప్రత్యేక దృస్టి సారిస్తున్నామని ఎస్పీ నవీన్ గులాఠీ చెప్పారు. శనివారం ఆయన ఆమదాలవలసలో మరమ్మతులు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లను ప్రైవేటు భవనాలుగా తీర్చిదిద్ది న్యాయం కోసం వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఆదర్శ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి స్టేషన్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందన్నా రు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికి ప్రజ లంతా సహకరించాలని కోరారు. రాత్రి పూట దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇల్లకు తాళం వేసి క్యాంపులకు వెళ్లే వారు ఇళ్లలో ఉన్న బంగారం, డబ్బును లాకర్లలో భద్రపర్చుకుని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు, ఆమదాలవలస సీఐ విజయానంద్, ఆమదాలవలస, సరుబుజ్జలి, బూర్జ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా..!
జి.సిగడాం, న్యూస్‌లైన్ : జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ సర్పంచ్‌లను ఇబ్బంది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పలువురు సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల సందర్బంగా సర్పంచ్‌లకు, మండల స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మాట్లాడుతూ పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికిప్పుడే సమాచారం అందించి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం మంచి పద్దతి కాదన్నారు. పంచాయతీల్లో నిధులు లేక డ్రెయిన్లలో పూడికలు కూడా తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచ్ తమ సొంత సొమ్ములతో వాటిని నిర్వహిస్తే 50 వేల వరకు ఖర్చు అయితే రికార్డుల్లో మాత్రం 5వేలకు మించి అధికారులు నమోదు చేయడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. దవలపేట, దేవరవలస, జగన్నాథవలస, బాతువ, మెట్టవలస, పెంట సర్పంచ్‌లు కంచరాన సూరన్నాయుడు, పంచిరెడ్డి బంగారునాయుడు, తనుబుద్ది దాలినాయుడు, కామోదుల సీతారాం, తిరుమరెడ్డి గౌరీశంకరరావు, మక్క సాయిబాబునాయుడు మాట్లాడుతూ పారిశుధ్య వారోత్సవాల కోసం సర్పంచ్‌లు సమావేశానికి హాజరైనా పూర్తిస్థాయిలో అధికారులు హాజరవ్వకపోవడంపై నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అంటే మీకొక అలుసా, ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి మేము వస్తున్నాం, మీ అధికారులు మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదంటూ ఎంపీడీవో వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులు స్పందించి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పుడే వారోత్సవాలకు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ బి. హనుమంతురావులతో పాటు సర్పంచ్‌లు బత్తుల సన్యాసిరావు, పొగిరి అక్కలనాయుడు, పల్లంటి సురేష్, గోపాలకృష్ణరాజు, వాన ప్రమీల, మర్రిబందల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీ పీఠానికి త్రిముఖ పోటీ!
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్ : మహిళకు కేటాయించిన ఆమదాలవలస మండలాధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారే ఈ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్‌టీవాడ ఎంపీటీసీ సభ్యురాలు కొరుకొండ ఇందుమతి, కొర్లకోట సభ్యురాలు సువ్వారి రూపవతి, చీమలవలస సభ్యురాలు సనపల పద్మావతి ఎంపీపీ పీఠం కోసం పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని అధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. కలివరం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన తమ్మినేని ఇందువతమ్మని తొలుత ఎంపీపీ అభ్యర్థిగా సూచాయగా ప్రకటించారు. అయితే ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం, ఇందువతమ్మ ఓటమి పాలవడంతో మిగిలిన సభ్యుల్లో ఎంపీపీ పదవిపై ఆశలు రేకెత్తాయి. కోరుకొండ ఇందుమతి కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె భర్త జీకేవలస సర్పంచ్ రమణ మాజీమంత్రి తమ్మినేని అనుచరుడు కావడంతో ఎంపీపీ పదవి ఇందుమతికి దక్కే అవకాశం ఉందనే గురగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జెడ్పీటీసీ సభ్యురాలు బంధువుగా, సీతారాంకు కష్టకాలంలో అండగా ఉంటూ.. కొర్లకోట ఎంపీటీసీ స్థానంలో గెలుపొందిన సువ్వారి రూపవతికి కూడా పదవి దక్కే అవకాశం మెండగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరితోపాటు చీమలవలస సర్పంచ్ జి. శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో తమ్మినేని చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటున్నారు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు పద్మవతికి ఎంపీపీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజులు వేచి చూడాలి. -
చైర్మన్‌గిరీ ఎవరికో?
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఆమదాలవలస పురపాలక సంఘ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అధిక స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకున్నా స్పష్టమైన ఆధిక్యత లేకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటుపై అందరి దృష్టి మళ్లింది. మున్సిపాల్టీ పరిధిలోని 23 స్థానాల్లో పది వైఎస్సార్సీపీ, ఎనిమిది టీడీపీ, మూడు కాంగ్రెస్, రెండిట్లో స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఫలితాలు వెలువడక ముందే వైఎస్సార్సీపీలో చేరారు. మరొకరు టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థినిగా బొడ్డేపల్లి అజంతాకుమారి, టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా తమ్మినేని గీతను ఎన్నికల ముందు ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధిక్యతతో బొడ్డేపల్లి కుటుంబీకులకే అధ్యక్ష పీఠం దక్కుతుందని అందరూ భావించారు. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఆమదాలవలస ఎమ్మెల్యేగా కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. వీరిద్దరూ టీడీపీకి చెందినవారు. దీంతో ఎక్స్ అఫీషియో ఓటుతో మున్సిపాల్టీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కోల్పోవాల్సి వస్తుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వైఎస్సార్సీసీకి మద్దతు ప్రకటి స్తుందని కొందరు భావిస్తున్నారు. ఎనిమిది మంది కౌన్సిలర్లు, (టీడీపీలో చేరితే) ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో 11 ఓట్లు టీడీపీకి ఉంటాయి. ఇప్పటికే పది సీట్లతో పాటు ఇండిపెండెంట్ చేరికతో వైఎస్సార్సీపీ బలం 11కు చేరింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కీలకమైంది. ఇప్పటి వరకు బొడ్డేపల్లి వారసులకే దక్కుతున్న మున్సిపల్ చైర్మన్ గిరీ వారికే దక్కుతుందని పలువురు బావిస్తున్నారు. -
దటీజ్ తమ్మినేని
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలను గంపగుత్తగా దక్కించుకోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుత మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో దాన్ని సాధ్యం చేసిన ఏకైక నేతగా తమ్మినేని సీతారాం తన ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లాలోని ఆమదాలవలస మినహా ఏ ఇతర నియోజకవర్గంలోనూ అన్ని మండలాలు టీడీపీకిగాని, వైఎస్ఆర్సీపీగాని లభించలేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాల వలస మున్సిపాలిటీతోపాటు నాలుగు మం డలాల(ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి) ఎంపీపీలు, మూడు జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరాయి. వైఎస్ఆర్సీపీలో ఆలస్యంగా చేరిన తమ్మినేని.. అతితక్కువ కాలంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను పార్టీ వైపు ఆకర్షించారు. నగరభేరి పేరుతో మున్సిపాలిటీలో సమస్యలు గుర్తించి అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. స్థానిక సమస్యలపైనే కాకుండా థర్మల్, అణువిద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జిల్లాలో జరుగుతున్న ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు పరిశ్రమల్లో కార్మిక సమస్యలపైనా కార్మికుల పక్షాన పోరాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామ్ స్థానిక ఎన్నికల ఫలి తాలు ముందస్తు నజరానాగా లభించాయి. కాగా నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అభిమానులు తమ్మినేనిని కలిశారు ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపారు. -
ఆగని టీడీపీ దాష్టీకం
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఆమదాలవలస మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మ తనయుడు బొడ్డేపల్లి అనిల్‌లపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో అనీల్‌కుమార్ తలకు తీవ్ర గాయమైంది. చేయి విరిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని.. నిందితులను అరెస్ట్ చేసేవరకు చికిత్స పొందేది లేదని సంఘటన స్థలిలోనే అనీల్‌కుమార్ బైఠాయించటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆమదాలవలస అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి రాగా.. అనీల్‌కుమార్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఇదీ జరిగింది.. ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన సువ్వారి అనీల్‌కుమార్, కనుగులవలస గ్రామానికి చెందిన బొడ్డేపల్లి అనిల్‌లు గురువారం మధ్యాహ్నం క లివరం పంచాయతీ పరిధి తమ్మయ్యపేటలో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యారు. భోజనం చేసి కారులో తిరిగి వస్తుండగా కనుగులవలస సమీపంలోని రైల్వేగేటు వద్ద టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ అనుచరులైన కొర్లకోటకు చెందిన చిగురుపల్లి శ్యామలరావు, కోటిపాత్రుని నారాయణరావు, మరికొంతమంది బైకులు అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. తొలుత అనీల్‌కుమార్ తలపై ఇనుప రాడ్లతో కొట్టారు. చేయి విరగ్గొట్టారు. తల నుంచి రక్తస్రావం ఎక్కువగా కావటంతో అనీల్‌కుమార్ స్పృహతప్పి పడిపోయారు. దాడిని అడ్డుకోవటానికి యత్నించిన అనీల్‌ను కూడా టీడీపీ వర్గీయులు కొట్టారు. ఆయన పెద్దగా కేకలు వేయటంతో సమీపంలోని గ్రామస్తులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. పారిపోతున్న టీడీపీ వర్గీయులను వెంటాడారు. ఇద్దరిని పట్టుకుని పోలీసులు వచ్చాక వారికి అప్పగించారు. ఈలోగా 108కు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం సంఘటన స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల తీరుపై నిరసన పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే తనపై టీడీపీ గూండాల దాడులు కొనసాగుతున్నాయంటూ అనీల్‌కుమార్ సంఘటన స్థలిలోనే బైఠాయించారు. నిందితులను అరెస్ట్ చేసేవరకు చికిత్స చేయించుకునేది లేదని స్పష్టం చేశారు. 108 వాహనం అక్కడికి వచ్చినా ఆయన ఎక్కలేదు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్తులు వెంటనే రాకపోతే టీడీపీ గూండాలు తనను చంపేసేవారని వాపోయారు. పథకం ప్రకారమే దాడి జరిగిందన్నారు. గతంలో త న ఇంట్లో పార్కింగ్ చేసి ఉంచిన కారును పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై హైకోర్టుకు వెళ్లి అర్డన్ తీసుకొచ్చాక కూడా పోలీసులు స్పందించలేదన్నారు. వరుస ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేశానన్న కక్షతోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్, కొర్లకోటకు చెందిన పీఎసీఎస్ అధ్యక్షుడు సనపల లక్ష్మునాయుడు, ఆయన కుమారులు ఢిల్లేశ్వరరావు, అప్పలనాయుడు, అల్లుడు కోట గోవిందరావులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని.. దీనిపై హామీ ఇచ్చేందుకు ఎస్పీ రావాలని.. అప్పటివరకు చికిత్స పొందబోనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎస్ఐలు సునీల్, గోవిందరావు సీఐ విజయానంద్‌కు చెప్పారు. వెంటనే సీఐ అక్కడకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం సీఐతో మాట్లాడుతూ దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సబబుకాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో అనీల్‌కుమార్‌కు తమ్మినేని నచ్చజెప్పి 108 వాహనం ఎక్కించారు. అప్పటికీ శాంతించని కనుగులవలస గ్రామస్తులు 108 వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తొలగించాక అనీల్‌కుమార్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తమ్మినేని అక్కడికి కూడా వెళ్లి అనీల్‌కుమార్‌ను పరామర్శించారు. దాడి ఘటనతో కనుగులవలస, కొర్లకోట గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు తమ్మయ్యపేటలో పెళ్లికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో కనుగులవలస రైల్వే గేటు సమీపంలో తనపై దాడి జరిగిందని కొర్లకోట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు కోట గోవిందరావు ప్రోద్భలంతో ఆ పార్టీ కార్యకర్తలు సనపల అప్పలనాయుడు, చిగురుపల్లి శ్యామలరావు, చిగురుపల్లి పాపారావు, కోటిపాత్రుని నారాయణరావు, పేడాడ ఈశ్వరరావు, చిగురుపల్లి అన్నాజీ, సువ్వారి జోగినాయుడు, తమ్మినేని వాసుదేవరావులు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనీల్‌కుమార్ నుంచి వివరాలు తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎన్.సునీల్ తెలిపారు. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు కనుగులవలస సమీపంలో 28 మంది తనపై గురువారం దాడి చేశారని కొర్లకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సీహెచ్. శ్యామలరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సునీల్ తెలిపారు. అలాగే కనుగువలస సమీపంలో తమ్మినేని వాణీసీతారాం ప్రోత్సాహంతో తొగరాం గ్రామానికి చెందిన సనపల సురేష్, తమ్మినేని శ్రీరామ్మూర్తిలు దాడిచేసి కొట్టడంతో క ంటిపై గాయమైందని తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని వాసుదేవరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై్స పేర్కొన్నారు. ఓటమి భయంతోనే దాడులు: తమ్మినేని ఆమదాలవలస,న్యూస్‌లైన్: శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకున్న టీడీపీ నాయకులు గూండాల్లా బరితెగించి దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ కనుగులవలస రైల్వేగేటు వద్ద వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన తరువాత ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో చెదురు మదురు సంఘటనలు కార్యకర్తల వల్ల జరుగుతాయని, అనంతరం కక్షలకు దారితీస్తాయన్నారు. జిల్లా ఎస్పీ దీన్ని గమనించి టీడీపీ రౌడీలపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పొందూరులోని పోలింగ్ బూత్ వద్ద టీడీ పీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన రౌడీయిజంపై ఇంతవరకూ దర్యాప్తు చేపట్టకపోవడానికి కారణం ఏమిటని తమ్మినేని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు పోవద్దని, పోలీసులే అన్నీ చూసుకుంటారని కొర్లకోట, కనుగులవలస గ్రామస్తులకు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. కాగా టీడీపీ కార్యకర్తలు దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సువ్వారి అనీల్‌కుమార్‌ను తమ్మినేని సీతారాం, చిరంజీవి నాగు(నాని)లు పరామర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కిల్లి లక్ష్మణరావు, బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో నిలబెడతా...
ఆమదాలవలస, న్యూస్‌లైన్:నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు ఏమి కోరుకుం టున్నారో తెలిసిన వాడినని, వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆ పార్టీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేస్తారు? ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని జగన్మోహన్రెడ్డి హామీ మేరకు తెరచేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. ఈ ప్రాంత ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పాటుపడతా. టీడీపీ హయూంలో పడిన మచ్చను తొలగించుకుంటాను. నాగావళి నదిపై బలసర రేవువద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేస్తా. ఆమదాలవలస-పొందూరుకు అనుసంధానం చేస్తూ నాగావళి నదిపై ఉన్న దూసి బ్రిడ్జిపై వాహనాలు నడిచేందుకు అనుగుణంగా అంతర బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పొందూరు మండలంలో కేసవదాసుపురం, నందివాడ, కొంచాడ, లైదాం, రాపాక లతో పాటు సుమారు 20గ్రామాలకు అటు మడ్డువలస, ఇటు నారాయణపురం ప్రాజక్టులు నుంచి సాగునీరు అందడంలేదు. కాలువలు విస్తరింపజేసి సాగునీ టి కల్పనకు కృషిచేస్తాను. పొందూ రు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాను. మీకు గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి కారణం? గ్రామాల్లోని ప్రతి ఒక్కరు మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందారు. దీంతో వారంతా అండగా నిలిస్తున్నారు. గ్రామీణ ప్రజలనుంచి ఇంత ఆదరణ ఏ పార్టీకీ లేదు. గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ప్రజల అభీష్టం మేరకు అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతాను. అందరివాడిగా మెలగుతాను. -
అముదాలవలసలో బాలకృష్ణకు చుక్కెదురు
-
నకిలీ పాస్ పుస్తకాల సృష్టికర్త అరెస్టు
ఆమదాలవలస, న్యూస్‌లైన్:నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి..బ్యాంకులను మోసం చేసి, లక్షలాది రూపాయల రుణాలు పొందిన సనపల చలపతిరావును ఎస్సై మంగరాజు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు శాఖలో చలపతిరావు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రూ.65,00 రుణం పొందాడని బ్యాంకు మేనేజర్ వి.సురేష్‌రాజు ఈనెల 11న స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అరెస్టు చేశామన్నారు. గతంలో చలపతిరావు నకిలీ పాస్‌పుస్తకాలను సృష్టించి..తహశీల్దార్ వీర్రాజు సంతకాలను ఫోర్జరీ చేసి, పలు బ్యాంకుల్లో రుణాలు పొందాడని అందిన ఫిర్యాదు మేరకు ఓ సారి అరెస్టు చేశామని, అయితే ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవడతో..విడుదల చేశామని చెప్పారు. నిందితుడు పలువురు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేశాడని..వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. -
తెలంగాణ బిల్లును అడ్డుకోవాల్సిందే..
ఆమదాలవలస,న్యూస్‌లైన్: శాసనసభ, శాసన మం డలిలో ప్రవేశ పెట్టనున్న తెలంగాణ బిల్లును సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యులు సభలలో అడ్డుకోవాలని, లేకుంటే సీమాంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహన్రావు హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ పట్టణంలోని విద్యార్థులతో కలిసి శనివారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ కూడలి వద్ద మాన వహారం నిర్వహించి సోనియూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. తెలుగుజాతికి, తెలుగు తల్లికి మోసం చేయూలనుకునే వారికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధిచెప్పక తప్పదన్నారు. ప్రజా సమస్యలపైన, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డేనని పేర్కొన్నారు. విభజన బిల్లును వెనుకకు తీసుకునేవరకు పోరా టాన్ని ఆపేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల యూత్ కన్వీనర్లు ధవళ అప్పలనాయుడు, సింగూరు రాజు, కిల్లి తాతన్నాయుడు, పైడి లోకేష్, పైడి వరహాల నాయుడు, స్వామి నాయుడు, మురళీ పాల్గొన్నారు. విభజన బిల్లును ఓడించాల్సిందే శ్రీకాకుళం అర్బన్: తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తే సీమాంధ్ర ప్రాం తానికి చెందిన శాసన సభ్యులంతా కలిసి బిల్లును ఓడించాలని సమై క్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతి నిధులు డిమాండ్ చేశారు. శ్రీకా కుళం లోని వైఎస్సార్ కూడలి వద్ద చేపట్టిన సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జామి బీమశంకర్ మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చీము, నెత్తురు లేవన్నారు. కనీసం తెలంగాణ ప్రజాప్రతినిధులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సమైక్యాంధ్ర జెడ్పీ జేఏసీ కన్వీనర్ కిలారి నారాయణరావు మాట్లాడుతూ మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసేందుకు పాల్పడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూడా వీరికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సమైక్యాంధ్ర పరి రక్షణ వేదిక కో-కన్వీనర్ కొంక్యాణ వేణుగో పాలరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు పి.జయరాం, గొలివి నర్సునా యుడు, రత్నకిషోర్, విద్యార్థులు ఎ.రాజబాబు, ఎస్.ప్రశాంత్, ఎస్.మోహ నరావు, ఎల్.నరేంద్రకు మార్, జి.ప్రశాంత్‌కుమార్, పి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన రైల్వే ఆదాయం
ఆమదాలవలస, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రైల్వే ప్రస్తుతం కోలుకుంది. ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ కూడా రెట్టింపైంది. తుపానుల ప్రభావంతో కురిసిన వర్షాలకు ట్రాక్ దెబ్బతినడంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారిమళ్లించి నడిపారు. దీంతో రైల్వే ఆదాయానికి భారీగానే గండి పడింది. ప్రస్తుతం ట్రాక్ పనులు పూర్తైరైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తుండడంతో మళ్లీ ప్రయాణికుల రద్దీ పెరిగింది. శుక్రవారం రైళ్లన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి. సాధారణ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ 3.76 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
తోటాడ ఇసుక ర్యాంపులపై దాడులు
ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్: మండల పరిధి తోటాడ, గోపీనగర్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపులపై మంగళవారం రెవె న్యూ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో గణేష్‌కుమార్, ఆమదాలవలస, ఎచ్చెర్ల తహశీల్దార్లు జి.వీర్రాజు, బి.వెంకటరావు దాడులు చేసి పది ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని నాగావళి నదిలో ఉన్న ర్యాంపును అధికారులు పరిశీలించారు. అధికారులను చూసిన ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను జీడితోటల్లోకి తీసుకువెళ్లి విడిచిపెట్టి పారిపోయారు. జాతీయ రహదారి వంతెన కిందనే ఇసుక తవ్వకాలు జరగుతుండడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తవ్వకాలు సాగితే భవిష్యత్‌లో వంతెనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పట్టుపడ్డ ట్రాక్టర్ల వివరాలు తీసుకొని వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ట్రాక్టర్లను ఆమదాలవలస ఎస్ఐ బి.మంగరాజుకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఈ దాడులు నిర్వహించామని, ఇసుక మాఫియా అక్రమాలను అడ్డకట్టువేసేందుకు అధికారులంతా కార్యచరణ చేస్తున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్లు బి.గోవిందరావు, రామగణపతి, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వో కిరణ్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. పట్టుకున్నారు, వదిలేస్తారుకదా? ఇసుక మాఫియాను అరికట్టాలన్న ఉద్దేశంతో అధికారులు దాడులు చేసినప్పటి కీ అక్రమార్కులకు చీమకుట్టినట్లయినా లేదు. దాడులు జరిగినప్పుడు ఇసుకాసురులు, ట్రాక్టర్ల యజమానులు సమీపంలోని రోడ్లపైనే తిరుగుతుండడం విశేషం. అధికారులు పట్టుకున్న బళ్లను ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అన్న ధీమా వారిలో కనిపిస్తోంది. ఇలా ఎన్నిసార్లు పట్టుకోలేదు, ఎన్నిసార్లు మేం తెచ్చుకోలేదని వారు వ్యాఖ్యానించడం ఆశ్యర్యం కలిగిస్తోంది. -
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు
ఆమదాలవలస, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పలు చోట్ల రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి. దీంతో పలాస-విశాఖపట్నం పాసింజర్లు మినహా అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఒడిశాలోని చిలకా నది సమీపంలోను, ఇచ్ఛాపురం, జాడుపూడి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైన్లు కోతకు గురయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు ప్రకటించారు. హౌరా-యశ్వంత్‌పూర్(12863/64), భువనేశ్వర్-బెంగుళూర్ (18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై (12839/40) మెయిల్, పాట్నా-ఎర్నాకుళం (16310) గౌహతి-ఎర్నాకుళం (12508), హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమాతో పాటు భువనేశ్వర్-విశాఖపట్నం(18411/12) ఎక్స్‌ప్రెస్‌ను ఇరువైపులా రద్దు చేశారు. భువనేశ్వర్ -ముంబాయి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించినట్లు తెలిపారు. పలాస-విశాఖపట్నం మధ్య పాసింజర్ సర్వీసులను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ప్రయాణికుల ఇక్కట్లు రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్ల రద్దుకు సంబంధించిన సమాచారం కోసం బుకింగ్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. సమాచారం చెప్పడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్ల రద్దుతో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు సొమ్ము తిరిగి చెల్లించారు. -
కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు: తమ్మినేని
రాష్ట్రం రావణకాష్టంలా మారడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీ బాగోతాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు పుట్టగతులండవని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరిన తమ్మినేని తొలిసారిగా గురువారం ఆమదాలవలస వచ్చిన సందర్భంగా అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు పన్నిన ఆంధ్రప్రదేశ్ విభజన కుట్రను రాష్ట్ర ప్రజలు సహించరన్నారు. 1983లో ఎన్నో ఆశయాలతో ఆవిర్భవించిన టీడీపీని ప్రస్తుతం చంద్రబాబు పదవీ కాంక్షతో, పిచ్చివాడిలా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి పార్టీలో ఇమడలేక బయటికి వచ్చానని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ పథకంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ప్రస్తుతం అదే పథకాన్ని తాను అమలు చేస్తాననడం సిగ్గుచేటన్నారు. పేదల కోసం పాటుపడిన మహోన్నతులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చరిత్రకెక్కారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. అంతకు ముందు తమ్మినేనికి స్వాగతం పలికేందుకు జిల్లావ్యాప్తంగా తరలి వచ్చిన వారితో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ కిక్కిరిసి పోయింది.