ఆమదాలవలసలో హైటెక్ వ్యభిచారం | High-tech prostitution in Amadalavalasa | Sakshi
Sakshi News home page

ఆమదాలవలసలో హైటెక్ వ్యభిచారం

Published Sat, May 21 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

High-tech prostitution in Amadalavalasa

* పోలీసుల దాడులు
* పట్టుపడ్డ నిర్వాహకురాలు
ఆమదాలవలస : పట్టణ శివార్లలో కృష్ణాపురం జంక్షన్ వద్ద ఒక గృహంలో  నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారానికి ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య, సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించి చెక్ పెట్టారు.  నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలిని, విటుడును అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి ఎస్.ఐ. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

క్రిష్ణాపురం గ్రామంలో వ్యభిచార గృహం నడిపిస్తున్నారన్న సమాచారంతో  వారం రోజులుగా నిఘా పెట్టామని ఎస్‌ఐ తెలిపారు. ఈ గృహానికి విజయవాడ, హైదరాబాద్, ముంబయ్, అనకాపల్లి, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రవాణా చేస్తున్నారని వెల్లడైనట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు ఫోన్లపైనే తన పని అంతా నడుపుతున్నారని, పోలీసు సిబ్బంది ఉన్న సమయంలోనే వచ్చిన ఫోన్ కాల్స్ చెబుతున్నాయని చెప్పారు.  

ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని తెలిపారు.  వ్యభిచారానికి వచ్చిన వారిని కూడా ఒక్కొక్కరినే తన ఇంట్లోకి రప్పిస్తూ మిగతా వారిని మార్గ మధ్యలో ఉంచుతున్నారని  తెలిపారు.  ఇది చాలాకాలంగా జరుగుతుందని చెప్పారు. నిర్వాహ కురాలు, విటుడుపై ఐ.టి.పి. 3, 4, 6, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఇటీవల శ్రీకాకుళంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలను పట్టుకున్నట్లు వెల్లడించారు.
 
వ్యభిచార గృహం నిర్వాహకురాలను తన భర్త విడిచి పెట్టాడని, జీవనోపాధి లేక తన కుమార్తెను పెంచడానికి ఏ దిక్కు తోచక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డానని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, ఐ.సీ.డీ.ఎస్. పీవో ఎన్.నళినీదేవి, ఆమదాలవలస సీఐ నవీన్‌కుమార్, ఏఎస్‌ఐ మెట్ట సుధాకర్, మానవ అక్రమ రవాణ నిరోధక విభాగం ఏఎస్‌ఐ పి.వి.రమణ, హెచ్.సి. బి.జగదీశ్వరరావు, సిబ్బంది ఆర్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement