SP Brahma Reddy
-
పొడగరి గురించి పోలీసుల ఆరా
తన వద్దకు పిలిపించుకుని వివరాలు కనుక్కున్న ఎస్పీ రాజాం: శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లానికి చెందిన పొడగరి ఇజ్జాడ షణ్ముఖరావు(24)గురించి పోలీసులు ఆరా తీశారు. 8 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న ఈ యువకుడి పరిస్థితిపై సోమవారం సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ‘అబ్బో..ఎంతెత్తున్నాడో..!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి స్పందించి ఆరా తీశారు. షణ్ముఖరావును తన వద్దకు తీసుకురావాలని సంతకవిటి ఎస్ఐ ఎస్.చిరంజీవిని ఆదేశించడంతో రేగిడి మండలం సంకిలి పారిస్ చక్కెర కర్మాగారం వద్దకు వచ్చిన ఎస్పీ ఎదుటకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే! తన పెరుగుదలతో పాటు ఆరోగ్యం, చదువు గురించి ఎస్పీ వాకబు చేశారని, ఎత్తు, బరువు వివరాలు సేకరించినట్టు షణ్ముఖరావు ‘సాక్షి’కి తెలిపారు. మరోసారి పిలుస్తామని, రావాలని ఎస్పీ చెప్పారన్నారు. ఈ పొడగరి గురించి ‘సాక్షి’లో కథనం రావడంతో వివిధ చానళ్ల ప్రతినిధులు బిళ్లానికి క్యూకట్టారు. వైద్య శాఖకు చెందిన అధికారులు కూడా ఇతని పెరుగుదలపై ఆరా తీశారు. -
ఆమదాలవలసలో హైటెక్ వ్యభిచారం
* పోలీసుల దాడులు * పట్టుపడ్డ నిర్వాహకురాలు ఆమదాలవలస : పట్టణ శివార్లలో కృష్ణాపురం జంక్షన్ వద్ద ఒక గృహంలో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారానికి ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్ఐ ఎం.లక్ష్మయ్య, సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించి చెక్ పెట్టారు. నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలిని, విటుడును అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి ఎస్.ఐ. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణాపురం గ్రామంలో వ్యభిచార గృహం నడిపిస్తున్నారన్న సమాచారంతో వారం రోజులుగా నిఘా పెట్టామని ఎస్ఐ తెలిపారు. ఈ గృహానికి విజయవాడ, హైదరాబాద్, ముంబయ్, అనకాపల్లి, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రవాణా చేస్తున్నారని వెల్లడైనట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు ఫోన్లపైనే తన పని అంతా నడుపుతున్నారని, పోలీసు సిబ్బంది ఉన్న సమయంలోనే వచ్చిన ఫోన్ కాల్స్ చెబుతున్నాయని చెప్పారు. ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని తెలిపారు. వ్యభిచారానికి వచ్చిన వారిని కూడా ఒక్కొక్కరినే తన ఇంట్లోకి రప్పిస్తూ మిగతా వారిని మార్గ మధ్యలో ఉంచుతున్నారని తెలిపారు. ఇది చాలాకాలంగా జరుగుతుందని చెప్పారు. నిర్వాహ కురాలు, విటుడుపై ఐ.టి.పి. 3, 4, 6, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఇటీవల శ్రీకాకుళంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలను తన భర్త విడిచి పెట్టాడని, జీవనోపాధి లేక తన కుమార్తెను పెంచడానికి ఏ దిక్కు తోచక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డానని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, ఐ.సీ.డీ.ఎస్. పీవో ఎన్.నళినీదేవి, ఆమదాలవలస సీఐ నవీన్‌కుమార్, ఏఎస్ఐ మెట్ట సుధాకర్, మానవ అక్రమ రవాణ నిరోధక విభాగం ఏఎస్ఐ పి.వి.రమణ, హెచ్.సి. బి.జగదీశ్వరరావు, సిబ్బంది ఆర్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: జిల్లా ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఏఎస్ ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఏఎస్ ఖాన్‌కు విశాఖపట్నం నగర జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి వచ్చిన సంగతి తెలిసిందే. 2005లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన బ్రహ్మారెడ్డి గతంలో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ఉత్తరాంధ్రజిల్లాల్లో విశాఖపట్నం డీసీపీగా, విజయనగరం పీటీసీ(పోలీస్‌ట్రైనింగ్ స్కూల్)ఎస్పీగా పనిచేసిన ఆయన గోదావరి జిల్లాలకు అదనపు ఎస్పీగా అనంతరపురం, కర్నూలు జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీ విభాగంలో ఎకనామిక్ ఆపరేషన్స్ వింగ్ (ఈవోడబ్లూ) ఎస్పీగా పనిచేస్తుస్తూ బదిలీపై శ్రీకాకుళం రానున్నారు.