కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ | SP takes charges in srikakulam district | Sakshi
Sakshi News home page

కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ

Published Wed, May 11 2016 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

SP takes charges in srikakulam district

 శ్రీకాకుళం: జిల్లా ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఏఎస్ ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఏఎస్ ఖాన్‌కు విశాఖపట్నం నగర జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి వచ్చిన సంగతి తెలిసిందే.

2005లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన బ్రహ్మారెడ్డి గతంలో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ఉత్తరాంధ్రజిల్లాల్లో విశాఖపట్నం డీసీపీగా, విజయనగరం పీటీసీ(పోలీస్‌ట్రైనింగ్ స్కూల్)ఎస్పీగా పనిచేసిన ఆయన గోదావరి జిల్లాలకు అదనపు ఎస్పీగా అనంతరపురం, కర్నూలు జిల్లాలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీ విభాగంలో ఎకనామిక్ ఆపరేషన్స్ వింగ్ (ఈవోడబ్లూ) ఎస్పీగా పనిచేస్తుస్తూ బదిలీపై శ్రీకాకుళం రానున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement