Vigilance and Enforcement
-
సుంకిశాలను పరిశీలించిన విజిలెన్స్ బృందం
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తీతండా సమీపంలోని సుంకిశాల గుట్ట వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ (సుంకిశాల పథకం) ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ప్రదేశాన్ని ఆదివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం పరిశీలించింది. నాగార్జునసాగర్ జలాశయంలోకి ఒక్కసారిగా నీరు పోటెత్తడం, పంప్‌హౌజ్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో సొరంగం ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ఈ నెల 2వ తేదీన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీతోపాటు ప్రాజెక్టును నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఈ బృందం అధికారులు తెలుసుకున్నారు. సుమారు గంటన్నరకుపైగా ఇన్‌టేక్ వెల్ చుట్టూ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రిటైనింగ్ వాల్‌కు అమర్చిన గేటు మందం ఎంత ఉందో టేపుతో కొలిచారు. ఈ సందర్భంగా అధికారులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణను చేపట్టామ ని తెలిపారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంలో పూర్తి విచారణ అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీలు డి.ఆనంద్‌కుమార్, జి.మధుసూద న్‌రావు, ఇంజినీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జి.ప్రసాద్, వాటర్బోర్డ్ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, సీజీఎం శ్రీధర్, జీఎం మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధీకృత అధికారుల నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ తరఫున నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ చీమలపాటి రవి విచారణ జరిపారు.న్యాయమూర్తి అసహనంలోకేశ్ తరఫు న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం గతంలో చెప్పిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?, తీసుకోబోతున్నారా?, అసలు ఈ వ్యవహారంలో ఏం చేయబోతున్నారో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏం చెప్పాలో మీరే పేరాల వారీగా కౌంటర్ దాఖలు చేసి ఇవ్వండి. దాన్నే ప్రభుత్వం దాఖలు చేస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏయే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలో కోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేశారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే సంస్థలపైన చర్యలొద్దా?
సాక్షి, అమరావతి: పలు సంస్థలు, కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై చర్యలు ఉంటాయంటే.. లోకేశ్‌కు వచ్చిన నష్టం ఏంటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు.. వేలూరి మహేశ్వరరెడ్డి, చింతల సుమన్ ప్రశ్నించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే గెజిటెడ్ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని విజిలెన్స్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ వల్ల తాను ఏ విధంగా ప్రభావితమవుతున్నారో లోకేశ్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారవేత్తల పేరు చెప్పి లోకేశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలిపారు. రఘురామిరెడ్డి లేఖ వల్ల ప్రభావితమయ్యే వ్యాపారవేత్తలు ఉంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రాజకీయ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. రఘురామిరెడ్డి లేఖ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా తమపై కక్ష సాధించేందుకే కొల్లి రఘురామిరెడ్డి లేఖ రాశారని లోకేశ్ ఆరోపిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకోకుండానే లోకేశ్ వాదనలు వినిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ లేఖ వల్ల లోకేశ్ ఏ విధంగా ప్రభావితమవుతున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థల్లోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
బట్టాపూర్ గుట్ట మింగివేతపై పిల్
బట్టాపూర్ గుట్ట వద్ద 9,280 క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఉండగా ఇప్పటి వరకు ఏకంగా 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అధికార వర్గాల అంచనా. జియోట్యాగింగ్ ద్వారా పరిమితికి మించి గుట్టను తవ్వేసినట్లు అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వుతున్న విషయమై గురువారం రాష్ట్ర హైకోర్టులో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖ లైంది. కేవలం 9,280 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ ఏకంగా ఇప్పటివరకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అ ధికార వర్గాల అంచనా. ఈ విషయమై గత డిసెంబ ర్ 9న ‘సాక్షి’లో ‘గుట్టలు గుల్ల’ అనే కథనం ప్రచురి తమైంది. 195/1 సర్వే నంబర్లో 3.85 హెక్టార్లలో ఉన్న ఈ గుట్ట లీజును 2016లో తీసుకున్నప్పటికీ, రక్షిత అటవీ ప్రాంతం ఆనుకుని ఉంది. అయితే కా లుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా నే ఈ గుట్టను తవ్వడం మొదలుపెట్టారు. జియో ట్యాగింగ్ ద్వారా పరిమితికి మించి పూర్తిగా తవ్వేసి గుట్టను మింగేసినట్లు అధికారులు గుర్తించారు. పరిమిత అనుమతులు మాత్రమే ఉన్న దీనికి అనుబంధంగా నెలకొల్పిన క్రషర్కు అధికారికంగానే ఇప్పటి వరకు ఏకంగా రూ.2.5 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లించారు. ఇలాంటి నేపథ్యంలో అనధికారికంగా ఎంత మాయాజాలం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అ యితే ఈ స్వాహా పర్వం వెనుక జిల్లాకు చెందిన ప్ర ధాన ప్రజాప్రతినిధి ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో ఒకసారి తనిఖీకి వచ్చిన అటవీ క్షేత్రాధికారి ఆనందరెడ్డి 24 గంటల్లో నే బదిలీ అయ్యారు. మరోవైపు గతంలో వరుసగా 8 నెలల పాటు రూ.51 లక్షల విద్యుత్ బిల్లు పెండింగ్‌లో పెట్టినప్పటికీ విద్యుత్ సరఫరా మాత్రం ఆగ లేదు. ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే ఈ బిల్లు ను చెల్లించడం గమనార్హం. ఇదిలా ఉండగా దీనిపై గత సెప్టెంబర్ 24న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ జనరల్‌కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడి నుంచి గత అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. అక్కడి నుంచి గత డిసెంబర్ 3న మైనింగ్ డైరక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తరువా త అక్కడి నుంచి నిజామాబాద్ మైనింగ్ ఏడీకి సర్వే కోసం ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రధాన ప్రజాప్రతినిధి కన్నెర్ర చేయడంతో ఏడీ సర్వే చేయలేదు. ఆధారాలతో కోర్టుకు.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బట్టాపూర్ గుట్ట వ్యవహారంపై అనేక ఆధారాలతో, ‘సాక్షి’ కథనంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి తాజాగా హైకోర్టు సీరియల్ నంబర్ 21393 ఆఫ్ 2023 కేటాయించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ఆర్డీవో, నిజామాబాద్ మైనింగ్ ఏడీ, ఏర్గట్ల తహసీల్దారులకు నోటీసులు పంపింది. హైదరాబాద్ బృందం సర్వే.. ఈ క్రమంలో వారం రోజుల కిందట హైదరాబాద్ నుంచి వచ్చిన మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్’ (ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే) నిర్వహించారు. సదరు నివేదిక ఇప్పటికే మైన్స్ అండ్ జియాలజీ డైరక్టర్‌కు వెళ్లింది. కాగా గుట్టను తొలిచే క్రమంలో వాడుతున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ‘మ్యాగ్జిన్’లో స్టోర్ చేయాలి. లేనిపక్షంలో స్థానిక పోలీసుస్టేషన్లో ఉంచాలి. దేశ, సంఘవిద్రోహ శక్తులకు చేరకుండా ఉండేందు కు ఈ నిబంధన ఉంది. ఈ నిబంధనను సైతం ఇక్కడ తుంగలో తొక్కడం గమనార్హం. ప్రమాదకర పరిస్థితుల్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం విస్మయం కలిగిస్తోంది. -
పన్ను ఎగవేసే కంపెనీల్లో విజిలెన్స్ తనిఖీలు చేయొచ్చు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే, పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థలు, కంపెనీల్లో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఉందని తీర్పునిచ్చింది. జీఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలు, వ్యాపార సంస్థల్లో కూడా తనిఖీలు చేసే అధికారం కూడా ఈ విభాగానికి ఉందని తేల్చి చెప్పింది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. తమ కంపెనీలో తనిఖీలు చేసి, అమ్మకాల టర్నోవర్‌ను తగ్గించి చూపినట్లు పేర్కొంటూ విజిలెన్స్ అధికారులు జీఎస్టీ అధికారులకు అలర్ట్ నోట్ పంపడం జీఎస్టీ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలుకు చెందిన సుధాకర్ ట్రేడర్స్ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా సుధాకర్ ట్రేడర్స్ వివరణ కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది. జీఎస్టీ చట్టం ప్రకారం చీఫ్ కమిషనర్ లేదా అతని నుంచి ఆథరైజేషన్ పొందిన అధికారికి మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తెలిపింది. తిరిగి చీఫ్ కమిషనర్ లేదా అతని ఆథరైజేషన్ పొందిన అధికారులు సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకొని, ఆ తరువాత చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సమాచార మార్పిడిలో తప్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలపై విచారణ, దర్యాప్తు చేయడం, ప్రభుత్వ ఆదాయ వనరులకు గండికొట్టే వారిపై చర్యలు తీసుకోవడం తదితర లక్ష్యాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటైందని తెలిపింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపాలిటీలు, జెడ్పీలు విజిలెన్స్ పరిధిలోకి వస్తాయంది. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు రెండు శాఖల మధ్య సమాచార మార్పిడిలో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసింది. అలెర్ట్ నోట్ ఆధారంగా నోటీసులివ్వడం చట్ట విరుద్ధం ఐరన్, స్టీల్ వ్యాపారం చేసే సుధాకర్ ట్రేడర్స్‌లో విజిలెన్స్ అధికారులు 2022 సంవత్సరంలో తనిఖీలు చేశారు. అమ్మకాల టర్నోవర్‌ను తక్కువ చేసి చూపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపారు. దీని ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు పంపి, వివరణ కోరారు. దీనిపై సంçÜ్థ యజమాని ఎస్.సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంవీకే మూర్తి వాదనలు వినిపిస్తూ.. జీఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన డీలర్‌కు చెందిన సంస్థల్లో తనిఖీలు చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు లేదన్నారు. అందువల్ల విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన నోటీసులు చెల్లవన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారి విషయంలో స్పందించే అధికారం విజిలెన్స్‌కు ఉందన్నారు. సుధాకర్ ట్రేడర్స్‌లో స్టాక్‌లో తేడాలున్నాయని, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు గుర్తించామన్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపి, పన్ను ఎగవేతను అడ్డుకోవాలని కోరామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, రిటరŠన్స్లో లోపాలుంటే వాటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసే అధికారం తమకుందన్నారు. -
అక్రమాల తూనిక... చర్యలు లేవింక
సాక్షి, హైదరాబాద్: తూనికలు కొలతల శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారులకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఉచ్చు బిగుసుకుంది. సాక్షాత్తు మాజీ అధికారుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం.. ఆ అధికారులు అధికార దుర్వినియోగం చేశారని, చేతివాటం ప్రదర్శించారని, అక్రమంగా పదోన్నతులు కల్పించారని, ఫోర్జరీ చేశారని నిగ్గు తేల్చింది. ఆ ఇద్దరు ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్లు (ఆర్డీసీ)లతో పాటు ఓ టెక్నికల్ అసిస్టెంట్లపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సర్కారుకు సిఫార్సు చేసింది. దీనిపై సమగ్ర నివేదక ఇవ్వాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. అధికారం ఉందని.. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన తూనికలు, కొలతల పరికరాలకు సంబంధించిన మూడు సంస్థలు తమ లైసెన్స్‌ల పునరుద్ధ్దరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అప్పట్లో లైసెన్స్ రెన్యువల్ అధికారం రాష్ట్ర కంట్రోలర్‌కే ఉండగా ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ (హెడ్ క్వార్టర్స్) అధికార దుర్వినియోగం చేసినట్టు బహిర్గతమైంది. దీంతో ఐపీసీ సెక్షన్ కింద క్రిమినల్ కేసులు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ బృందం సిఫార్సు చేసింది. లేనిది ఉన్నట్లుగా...: కారుణ్య నియామకాల కింద భర్తీ అయిన చౌకిదార్‌కు లేని ధ్రువీకరణ పత్రం ఉన్నట్లు సృష్టించి మ్యానువల్ టెక్నికల్ అసిస్టెంట్‌గా డబుల్ పదోన్నతి కల్పించడాన్ని విజిలెన్స్ విభాగం తప్పుబట్టింది. 2013లో జడ్చర్లలో పనిచేసే చౌకిదార్‌కు సాంకేతిక (వర్క్ షాప్) అనుభవం లేకున్నా అప్పటి డిప్యూటీ కంట్రోలర్ (ప్రస్తుతం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్, హెడ్ క్వార్టర్స్).. లేని అధికారాన్ని వాడి సర్వీస్ బుక్‌లో ఆ విషయాలు నమోదు చేసినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. అప్పటి నల్లగొండ– మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి (ప్రస్తుతం డిప్యూటీ కంట్రోలర్, హైదరాబాద్ రీజియన్) పైనా ఒత్తిడి చేసినట్లు వెల్లడైంది. సర్వీస్ బుక్‌లో ఏమైనా నమోదు చేసే అధికారం జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్‌కే ఉంటుంది. దీంతో ఆ ఇద్దరు అధికారులతో పాటు అక్రమంగా పదోన్నతి పొందిన టెక్నికల్ అసిస్టెంట్ (ఇటీవల మృతి చెందారు)పై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఇంతవరకూ నివేదిక ఏదీ? తూనికలు, కొలతల శాఖ అధికారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆగస్టు 5న సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి (పౌరసరఫరాల విభాగం) విజిలెన్స్ సిఫార్సులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సెప్టెంబర్ 14న అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోరారు. కానీ ఇంతవరకూ ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి అందనట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి నిరోధక శాఖ నివేదిక ఆలస్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. -
ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆంధ్రా హాస్పిటల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది. రోగుల నుంచి నిర్దేశిత ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈ సందర్భంగా నిర్ధారించింది. హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయించింది. వివరాలు.. ఏలూరు ఆర్ఆర్ పేటలోని ఆంధ్రా హాస్పిటల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై రీజనల్ విజిలెన్స్ అధికారి ఎస్.వరదరాజు వెంటనే స్పందిస్తూ.. తనిఖీలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందంలోని విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ, సీఐ యూజే విల్సన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎస్కే అబిద్ ఆలీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హాస్పిటల్లో తనిఖీలు చేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులైన కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఒక రోగి నుంచి 7 రోజులకు రూ.1.91 లక్షలు, మరొకరి నుంచి ఐదు రోజులకు గానూ రూ.1.28 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు సంబంధించి కేస్షీట్లను పరిశీలించగా డిశ్చార్జ్ తేదీనే లేదు. ఆరోగ్య శ్రీ కార్డులను నిరాకరించి మరీ.. పలువురి నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సంబంధిత రోగులకు సంబంధించి ఏ విధమైన బిల్లులు లేకుండా చేసినట్లు అధికారులు గుర్తించారు. రోగులకు ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయలేదని అధికారులు నిర్ధారించారు. వీటన్నింటిపై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ హెచ్చరించింది. -
విజిలెన్స్ దాడులు.. ఆరు ఆస్పత్రులపై కేసులు
విజయవాడ: ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
దొంతమూరులో అక్రమ మైనింగ్‌పై విచారణ జరపండి
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, జి.దొంతమూరు గ్రామంలో కొందరు వ్యక్తులు లీజు పరిధులు దాటి చేస్తున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ నివేదికను తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జి.దొంతమూరు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో లీజు పొందిన పరిధి 6.14 సెంట్ల భూమిని దాటి ఉయ్యూరి వీర్రాజు, 3.54 ఎకరాల భూమిని దాటి నెల్లిమర్ర శ్రీనివాసరావు చేస్తున్న మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జి.దొంతమూరు గ్రామంలో ఉయ్యూరి వీర్రాజు, నెల్లిమర్ర శ్రీనివాసరావులు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, లీజు పరిధి దాటి మైనింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకరరావు వాదనలు వినిపిస్తూ, కంకర మైనింగ్ లీజు ఇవ్వొద్దని, దీని వల్ల రంగంపేట పరిధిలో పర్యావరణ సమస్యలు వస్తాయని వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతాన్ని దాటి మిగిలిన చోట్ల వీర్రాజు, శ్రీనివాసరావులు కోట్ల రూపాయల విలువైన కంకరను తవ్వేస్తున్నారని, వీటిని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినా లాభం లేకపోయిందని తెలిపారు. కనీసం ఎలాంటి తనిఖీలు కూడా చేయలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కోర్టు ముందున్న ఆధారాలను బట్టి చూస్తే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్లో కొంత బలం ఉందని ఈ న్యాయస్థానం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందన్నారు. అలాగే మైనింగ్ లీజు పరిధి దాటి వీర్రాజు, శ్రీనివాసరావులు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. -
ఆ ‘ఉపాధి’లో అక్రమాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. 4,338 పనుల విషయంలో డబ్బుల రికవరీకి విజిలెన్స్ సిఫారసు చేసిందని తెలిపారు. ఉపాధి పనుల విషయంలో కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, బిల్లుల చెల్లింపులు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువ కలిగిన పనుల బిల్లుల్లో 20 శాతం సొమ్ము మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించే వ్యవహారం ప్రాసెస్‌లో ఉందన్నారు. రూ.5 లక్షలకు పైబడిన మొత్తాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. చెల్లించాల్సిన మొత్తాలన్నీ కాంట్రాక్టర్లకే వెళతాయని, గ్రామ పంచాయతీలకు వెళ్లవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు... రూ.5 లక్షల లోపు చేయాల్సిన చెల్లింపులను ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లింపులు చేయకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా అయితే సంబంధిత శాఖాధికారులను పిలిచి వివరణ కోరాల్సి ఉంటుందని తెలిపింది. కోర్టుకు చెప్పిన విధంగా చెల్లింపులు చేయాల్సిందేనంది. చెల్లింపు వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2018–19 ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పి.వీరారెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ దాదాపు 7 లక్షల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కొత్త బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. -
బోధనాసుపత్రులకు ఏసీబీ సెగ
సాక్షి, అమరావతి: రెండ్రోజులుగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా మందుల కొనుగోళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏసీబీ దాడులతో అవినీతి అధికారులకు చెమటలు పడుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు బోధనాసుపత్రులకు తగులుతోంది. బోధనాసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు భారీగా ఫిర్యాదులందాయి. దీంతో బోధనాసుపత్రుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు, లే సెక్రటరీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో దీనిపై నియంత్రణ లేకపోవడంతో దీనిపై ఇప్పుడు ఏసీబీ అధికారులు కన్నేశారు. అవినీతి వైద్యులు, అధికారుల ఆట కట్టిస్తే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని దర్యాప్తు సంస్థలకు లేఖలు అందాయి. ఇలా ఫిర్యాదులతోనే ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి ఏసీబీ అధికారులు పలు లోపాలను గుర్తించారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రుల్లో నెల్లూరు, విజయవాడ నుంచే ఎక్కువ. బోధనాసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులు ఇవే - పారిశుధ్య కాంట్రాక్టర్లకు పనితీరు ఆధారంగా మార్కులేయాలి. 95 మార్కులేస్తేనే వారికి 95 శాతం పైగా బిల్లులు వస్తాయి. ఈ మార్కులు వేసేందుకు వారి నుంచి నెలకు ఒక్కో సూపరింటెండెంట్ రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నెల్లూరు బోధనాసుపత్రిలో నెలకు రూ.7 లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు అందాయి. - రోగులకు ఆహారం పెట్టే డైట్ కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ కావాలంటే ప్రతి నెలా సూపరింటెండెంట్లకు కమీషన్లు ఇవ్వాల్సిందే. - విజయవాడ మెటర్నిటీ ఆస్పత్రిలో ప్రైవేటు వ్యక్తికి హోటల్‌కు అనుమతి ఇచ్చినందుకు భారీగా ముడుపులు.. నిబంధనలకు విరుద్ధంగా ఆ హోటల్ యజమాని ప్రహరీగోడ పగులగొట్టి లలితా హోటల్ పేరుతో నిర్వహణ. - విజయవాడ బోధనాసుపత్రిలో సార్జెంట్‌గా పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఒకరు సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఎల్ఐసీ పాలసీలు కట్టాలని బెదిరింపు. ఆ సార్జెంట్ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయితే.. అదేపనిగా డిప్యుటేషన్ మీద సూపరింటెండెంట్ ఇక్కడకు తెప్పించుకున్నట్టు ఆరోపణలు. - లోకల్ పర్చేజ్ కింద కొనుగోలు చేసే మందులపై ఆయా సరఫరా దారులతో సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు ప్రతినెలా కమీషన్ల రూపేణా వాటాలు. - ఆస్పత్రిలో పారిశుధ్య పనిచేయాల్సిన కార్మికులతో సూపరింటెండెంట్లు ఇంట్లో పనిచేయించుకున్నారు. -
ఈఎస్ఐ స్కామ్ తవ్వేకొద్ది అక్రమాలు
-
రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!
సాక్షి, అమరావతి: ఆసుపత్రిలో చేరిన కార్మికులకు నాలుగు మందు బిళ్లలివ్వండి మహాప్రభో అని మొత్తుకుంటే.. నిర్దాక్షిణ్యంగా నిధుల్లేవని చెప్పిన గత పాలకులు తైల సంస్కారం పేరుతో కోట్ల రూపాయలు నొక్కేసిన వైనం నివ్వెరపరుస్తోంది. జబ్బు చేస్తే మందులు కొనడానికి డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న కార్మికులను కనీసం పట్టించుకోకుండా వారి జుట్టుకు, ఒంటికి నూనె రాయాలని కోట్లకు కోట్లు వెచ్చించి రకరకాల నూనెలు కాగితాలపై మాత్రమే కొనుగోలు చేసి, సరికొత్త కుంభకోణానికి పాల్పడటం వారికే చెల్లింది. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో స్పెషాలిటీ వైద్యం లేక కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని బిలులు పెడితే ఏళ్లతరబడి చెల్లించకుండా, వచ్చిన నిధులను ఇలా దిగమింగిన ఘటన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో బట్టబయలైంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈఎస్ఐ అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. జుట్టు నూనెలకు రూ. 54 కోట్లు పైనే .. ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’అన్నట్లు ఓవైపు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేకపోయినా మరోవైపు రకరకాల క్రీములు, నూనెల పేరిట నాలుగేళ్లలో రూ.54 కోట్ల విలువైనవి కొన్నారు. హెయిర్ సొల్యూషన్, స్కిన్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, టూత్ పేస్ట్‌లు ఇలా ఒకటేమిటి రకరకాల తైలాలు, క్రీముల పేరిట కోట్లాది రూపాయలు వ్యయం చేశారు. పోనీ ఆ నూనెలు, క్రీములు వాడారా అంటే అదీ లేదు. ఏ ఆస్పత్రి నుంచి కూడా తమకు నూనెలు, క్రీములు కావాలని ఒక్క చిన్న లెటర్ కూడా లేదు. ఈఎస్ఐ కార్యాలయం నుంచే ఇండెంట్లు సృష్టించి తమకు కావాల్సిన కంపెనీకి ఆర్డరు ఇచ్చారు. ఒక్క జుట్టుకు రాసుకునే నూనెకు రూ.42 కోట్లు చెల్లించినట్టు తేలింది. టూత్‌పేస్ట్‌కు రూ.2 కోట్లు, షాంపూలకు రూ.2.5 కోట్లు చెల్లించారు. ఒంటికి రాసుకునే క్రీములకు రూ.8 కోట్లు పైనే వ్యయం చేశారు. ఓవైపు క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు మందులు లేవంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కమీషన్ల కోసం అమాత్యుల నుంచి అధికారుల వరకు అందరూ ఈ అవినీతి సొమ్ముకు ఎగబడినట్టు విజిలెన్స్ నివేదిక బట్టబయలు చేసింది. ఇలా ఇండెంట్లు పెట్టిన అధికారుల్లో డా.చంద్రశేఖర్, డా.జగదీప్గాంధీలు ప్రధానంగా ఉన్నారు. వీరిద్దరూ లెజెండ్, ఓమినిమెడి కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. మందులు మురిగిపోతున్నా .. ఓవైపు మందులు మురిగిపోయాతున్నా, మరోవైపు కమీషన్ల కోసం మందులకు ఆర్డర్లే ఆర్డర్లు. ఒక్క కడప రీజియన్‌లోనే రూ.15 కోట్ల విలువైన మందులు మురిగిపోయాయి. ఆయా ఆస్పత్రుల నుంచి పదే పదే మందులు మాకొద్దు అన్నా కూడా ఈఎస్ఐ కార్యాలయంలో పనిచేస్తున్న సంయుక్త సంచాలకులు కమీషన్ల కోసం ఆర్డర్లు పెట్టారు. 2019 అక్టోబర్ 1న కడప జేడీగా పనిచేస్తున్న డా.రవికుమార్ మందులు మురిగిపోతున్నాయని, వీటిని ఇతర ఆస్పత్రులకైనా తరలించి వాడుకోవాలని లేఖ రాశారు. ఇలా వరుసపెట్టి నాలుగైదు దఫాలుగా లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇలాంటి లేఖలు పలు జిల్లాల నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మందులు సరఫరా చేయడంతో ఇప్పుడా మందులన్నీ మురిగిపోయాయి. ఆ మందుల విలువ కనీసం రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. విజయవాడ గుణదలలోని కార్మిక ప్రభుత్వ భీమా వైద్యశాల ఆ రెండు ఏజెన్సీల హవా అధికారులను, కొంతమంది నేతలను అడ్డుపెట్టుకుని ఇప్పటికీ తిరుమల ఏజెన్సీ, సాయి సుదర్శన ఏజెన్సీ ప్రతినిధులు హవా కొనసాగిస్తున్నట్టు తేలింది. తాజాగా ఓడీసీఎస్ (ఒరిస్సా డ్రగ్స్ అండ్ కెమికల్స్) నుంచి కొనుగోలు చేసిన పారాసెటిమాల్ మాత్రలు నాసిరకం అని తేలినా ఇప్పటికీ చర్యలు లేవు. ఈ రెండు ఏజెన్సీలకు సంబంధించిన ప్రతినిధులకు అటు అధికారుల్లో, ఇటు నేతల్లో బాగా లాబీ ఉండటంతో కింది స్థాయి సిబ్బంది భయపడుతున్నారు. అందుకే నాసిరకం అని తేలినా చర్యలకు వెనుకాడుతున్నట్టు తేలింది. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ షుగర్, థైరాయిడ్ పరీక్షలకు వాడే ల్యాబొరేటరీ కిట్ల పేరిట భారీ దోపిడీకి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి సరఫరా బాధ్యత ఓమినీ మెడీ, ఎవెంటార్, లెజెండ్ కంపెనీలకు ఇచ్చారు. వీటి కోసం ఏకంగా రూ.237 కోట్లు ఈ మూడు కంపెనీలకు చెల్లించారు. హద్దూ పద్దూ లేకుండా వీటిని పదిరెట్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు ఆస్పత్రులకు వెళ్లకుండానే బిల్లులు చెల్లించారు. ఎక్స్‌పెయిరీ తేదీ దగ్గరకు వచ్చిన వాటిని సరఫరా చేసినా కూడా కిమ్మనకుండా నిధులు చెల్లించినట్టు తేలింది. రకరకాల ల్యాబ్ కిట్ల వాస్తవ ధర, ఈఎస్ఐ కొనుగోలు చేసిన ధర ఇలా ఉంది. రికార్డులు తారుమారు చేసే అవకాశం ఈఎస్ఐలో జరిగిన అక్రమాల్లో ఎవరైతే అధికారులు బాధ్యులుగా ఉన్నారో వారిని అలాగే కొనసాగిస్తే రికార్డులు తారుమారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, కొంత మంది రాజకీయ నేతలు ఉండటంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని తక్షణమే సస్పెండ్ చేస్తేనే రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉండదని, లేదంటే ఇప్పటికే దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈఎస్ఐ కార్యాలయంలో కొంత మంది కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే ఇదే పనిలో ఉన్నట్టు సమాచారం. -
ఈఎస్ఐ స్కామ్ : బయటపడుతున్నభారీ అక్రమాలు
సాక్షి, విజయవాడ : వందల కోట్లు నొక్కేసిన ఈఎస్ఐ స్కామ్‌లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలతో కుమ్మక్కైన గత మంత్రులు.. 237 కోట్ల ల్యాబ్ కిట్లు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేసినట్టు బట్టబయలయింది. ఓమ్నీ మెడి, అవెంతార్, లెజెండ్ కంపెనీలకు ల్యాబ్ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి.. 85 కోట్లు దోపిడీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రూ. 90 విలువైన ర్యాపిడ్ టెస్ట్ కిట్‌కు రూ.190 చెల్లించారు. 25 రూపాయల థైరాయిడ్(1ఎంజీ) కిట్‌కి రూ.93 పెట్టి కొనుగోలు చేశారు. రూ.155 ధరగల షుగర్ టెస్ట్ కిట్‌కి రూ.330 చెల్లించారు. (చదవండి : ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) రూ.11 గ్లూకోజ్ ఎనలైజర్ స్ట్రిప్ రూ 62 కి కొనుగోలు చేశారు. సోడియం,పొటాషియం ఎలక్ట్రోల్ ధరలను భారీగా పెంచేసి రూ.44వేలు చొప్పును చెల్లింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మంతా లెజెండ్ ,ఓమ్నీ మెడి, అవెంతార్‌లకే ధారాదత్తం చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. (చదవండి : కేసు నమోదవడం ఖాయం: ఎస్పీ వెంకట్‌రెడ్డి) ఆస్పత్రులకు వెళ్లకుండానే పలు బిల్లులు చెల్లించారు. సర్టిఫికేట్లు లేకుండానే బిల్లులపై డైరెక్టర్లు సంతకం చేశారు. రూ.85 కోట్లను మూడు కంపెనీలు కొల్లగొట్టాయని విజిలెన్స్ అధికారులు తేల్చిచెప్పారు. కరికి హెయిర్ ఆయిల్ పేరుతోనూ కోట్లు మింగేశారు. అవసరంలేని గ్లేన్‌మార్క్ ఆయిల్‌ను అధికారులు కొనుగోళ్లు చేశారు. మూడు నెలల్లో ఎక్స్పైర్ అయ్యే వాటిని తెచ్చి స్టోర్స్‌లో ఉంచారు. ఎక్స్పైర్ అయిపోయే ఆయిల్స్ పేరుతో రూ.40 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీడీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : శంకర్ నారాయణ చంద్రబాబు నాయుడు హయాంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ విషయం బయటపడడంతో చంద్రబాబు అండ్ కో ఉలిక్కిపడుతోందని విమర్శించారు. టీడీపీ నేతల అవినీతి బయటపడడంతో ప్రభుత్వం బీసీలపై కక్షకట్టిందంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అవినీతిపై సిట్ వేయడంతో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. సిట్ విచారణలో టీడీపీ నేతల అవినీతి రుజువై జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. -
ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు
-
కేసు నమోదవడం ఖాయం
-
ఈఎస్ఐ స్కాంలో వారి పాత్ర: ఎస్పీ వెంకట్‌రెడ్డి
సాక్షి, తిరుపతి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈఎస్ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. టెలీసర్వీసెస్‌కు చెందిన కాల్‌లిస్ట్ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్‌లిస్టును పరిశీలించగా బోగస్ అని తేలిందన్నారు. పేషెంట్స్ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని తెలిపారు. ఎస్పీ వెంకట్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. సీవరేజ్ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్ పేరుతోనే బిల్లులు పొందారని తెలిపారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని పేర్కొన్నారు.(ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) ‘నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారు. అనవసర మందులు కొన్నారు. వాటిని వినియోగించలేదు. చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్‌కే పరిమితమయ్యాయి. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు. అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించాం. మూడు నెలల పాటు విచారణ జరిపాం. గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు చేశాం. వారిపై కేసులు నమోదు కావడం ఖాయం’’ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ అయితే మాత్రం.. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు ప్రధాన నిందితుడని సీనియర్ న్యాయవాది పొనక జనార్ధన్‌రెడ్డి అన్నారు. 2016 నవంబరు 25న టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్‌కు వర్క్ ఆర్డర్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అధికారులను నిబంధనలు పాటించాలని చెప్పాల్సిన మంత్రి.. ఏకంగా ఏంఓయూ చేసుకోవాలని అదేశాలు జారీ చేయడం విడ్డూరం అన్నారు. ‘టెలీహెల్త్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని అచ్చెంనాయుడు ఆదేశాలు జారీ చేశారు. కుంభకోణాలు చేసే వారికి కుల, లింగ, ప్రాంత విచక్షణలు ఉండవు. అచ్చెంనాయుడు బీసీ అయితే స్కాంపై విచారణ చేయకూడదా? జూన్ 2, 2014 నుంచి జరిగిన ప్రభుత్వ ఒప్పందాలన్నింటిపై సిట్ విచారణ పరిధిలోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. -
‘అచ్చెన్నాయుడుని వెంటనే అరెస్టు చేయాలి’
సాక్షి, తాడేపల్లి : కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఈఎస్ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి రప్పించాలని పేర్కొన్నారు. (చదవండి : ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) ‘మేము గతంలోనే చెప్పాం ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో అవినీతి జరుగుతోందని, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అదే నిజమైంది. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ మారింది. మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు. తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్టే కదా’అని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. బండారం బయటపడింది.. సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్ఐలో కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై కేసునమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకొని మోసానికి పాల్పడ్డ సొమ్ము రికవరీ చేయాలి. ఎటువంటి నియమాలు పాటించకుండా రెండు వందలు విలువచేసే ఈసీజీ కి రూ.480 చెల్లించారంటేనే అచ్చెన్నాయుడు అవినీతి బండారం బయటపడింది’అని కృపారాణి అన్నారు. -
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
-
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
సాక్షి, విజయవాడ : చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు. (చదవండి: వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) -
ఏపీ ఈఎస్ఐలో కుంభకోణం
-
ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం
సాక్షి, విజయవాడ : తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్లుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధర కంటే 132 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. (ఈఎస్ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు) తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ముఖ్యపాత్ర పోషించిన సరఫరాదారులే ఈ స్కాంలో కూడా ఉన్నట్లు తేలింది. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లోపాటు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. (దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల) ఈఎస్ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. (హెచ్ఐవీ, డయాబెటిస్ కిట్లలో చేతివాటం) -
తిరుపతి ‘బర్డ్’లో విజిలెన్స్ దాడులు
సాక్షి, తిరుపతి: టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. బర్డ్ డైరెక్టర్ జగదీష్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నేపథ్యంలో విజిలెన్స్ డిఎస్పీ మల్లీశ్వర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వైద్య పరికరాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని.. ఓ సంస్థకు మేలు చేకూరేలా కొనుగోళ్లు జరిపారనే ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగార్చేలా ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయని, 2015 నుంచి జరిగిన కొనుగోళ్లపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని మల్లీశ్వర్ రెడ్డి వెల్లడించారు. -
ఉల్లి ఎగుమతులకు బ్రేక్!
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 12,400 కర్నూలు మార్కెట్లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సీజన్లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వినియోగిస్తోంది. కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. -
పనులు చేశారా.. నిధులు దోచేశారా?
సాక్షి, బి.కొత్తకోట: గత టీడీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో జరిగిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువలు, కాంక్రీటు, సొరంగం, అండర్ రైల్వే టన్నెల్ పనులపై బుధవారం విజయవాడ, తిరుపతికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య, విజయవాడ నుంచి ఎస్ఈ శ్రీనివాసమూర్తి, డీఈ నాగసురేష్, ఏఈలు సౌజన్య, ప్రకాష్, రామ్మోహన్ల బృందం విస్తృతంగా విచారణ, పరిశీలనలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో 27వ ప్యాకేజి (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) విలువ రూ.72.73 కోట్ల పనిలో మిగిలిన రూ.1.16కోట్ల పనిని రూ.9 కోట్లకు, 28వ ప్యాకేజీ (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) పని విలువ రూ.83.80కోట్లలో మిగిలిన రూ.78 లక్షల పనిని రూ.3.69కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలుత బి.కొత్తకోట మండలంలో 27, 28 ప్యాకేజీల్లో జరిగిన పుంగనూరు ఉపకాలువ, శీతివారిపల్లె సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ టన్నల్ పనులను క్షణ్ణంగా పరిశీలించారు. బి.కొత్తకోట మండలంలోని జాతీయ రహదారికి సమీపంలో శీతివారిపల్లె వద్ద పాకాల –ధర్మవరం రైల్వే మార్గం వెళ్తోంది. ఈ మార్గం దాటి పుంగనూరు ఉపకాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైల్వే మార్గం కారణంగా రైల్వే లైను కింద సొరంగం పనులు చేసి ఇరువైపులా కాలువను కలిపే పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేసినట్టు రికార్డుల్లో ఉంది. 27 ప్యాకేజీ పనుల్లో మిగిలిన పనిని 60సీ కింద తొలగించి, 28వ ప్యాకేజీ పరిధిలో వచ్చే కాంక్రీటు నిర్మాణాలు, సొరంగం పని కలిపి 60సీ కింద తొలగించి రూ.3.26 కోట్లకు టెండర్ పనిని అప్పగించారు. ఇందులో 1500 క్యూబిక్ మీటర్ల కంట్రోల్ బ్లాస్టింగ్ పనులుచేశారు. ఈ పనులు వాస్తవంగా చేశారా లేక అనవసరంగా చేయించారా.. అన్న కోణంలో పరిశీలించారు. అనంతపురం సరిహద్దులో పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా బి.కొత్తకోట మండలంలో సాగే 27వ ప్యాకేజీ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం కురబలకోటలో జరిగిన పనులు, ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తూ మదనపల్లె సమీపంలోని సొరంగం చేరుకున్నారు. 59వ ప్యాకేజీలోని ఈ సొరంగం పనుల్లో రూ.36.92 కోట్ల పనులు పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం అందులోంచి రూ.34.27 కోట్ల పనులు రద్దు చేసి 2.5కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజి కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి నిర్వహించిన టెండర్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 2.5కిలోమీటర్ల సొరంగానికి లైనింగ్ పనులు చేయలేదు. విజిలెన్స్ బృందం ఈ పనులతోపాటు కాలువలో కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేయించడంపైనా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారుల నుంచి తీసుకున్న రికార్డుల ఆధారంగా ఈ విచారణ సాగుతుండగా, అసలు పనులు చేశారా, అవసరం లేని చోట కంట్రోల్ బ్లాసింగ్ పెట్టి నిధులు దోచుకున్నారా, అసలు పనులే చేయాలేదా అన్న కోణంలో విచారణ చేశారు. -
నొక్కేసింది.. కక్కించాల్సిందే
సాక్షి, అమరావతి: భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, వంశధార ప్రాజెక్టు రెండో దశ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువల్లో నీటి ప్రవాహం మాటేమోగానీ అక్రమాలు పోటెత్తాయని నిపుణుల కమిటీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల వ్యయాన్ని భారీగా పెంచేసి.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులప్పగించి, ప్రజాధనం దోచుకున్నారని స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరగడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరిగిందని.. పనులు మాత్రం పూర్తి కాలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి.. కాంట్రాక్టర్లు దోచేసిన సొమ్మును వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా తన నివేదికను సమర్పించింది. భూసేకరణ లేకుండానే పనులా? అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా తొలి దశలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టులోకి(బీటీపీ) నీటిని ఎత్తిపోసి, ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే పనులకు అక్టోబర్ 24, 2018న రూ.968.99 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హంద్రీ–నీవాలో నీటి లభ్యతపై అధ్యయనం చేయకుండానే.. 3.7 టీఎంసీల సామర్థ్యంతో బీటీపీ ఎత్తిపోతలకు అనుమతిచ్చారని నిపుణుల కమిటీ పేర్కొంది. కాలువ పనులను రూ.358.20 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు.. 14 పంప్‌హౌస్‌ల మెకానికల్ పనులను రూ.175 కోట్లకు మరో కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టారు. తక్కువ సామర్థ్యం కలిగిన పంప్‌లు వాడేందుకు స్కెచ్ వేశారు. కాలువల తవ్వకానికి 1,407 ఎకరాలు అవసరం కాగా, ఒక్క ఎకరా కూడా సేకరించకుండానే రూ.33.02 కోట్ల విలువైన(8.94 శాతం) పనులు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి లభ్యతను పున:సమీక్షించి, ఈ పథకం పనులు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వంశధారకు అవినీతి మకిలి వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ.933 కోట్ల నుంచి రూ.1,616.23 కోట్లకు పెంచేస్తూ ఫిబ్రవరి 26, 2016న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - 87వ ప్యాకేజీ పనులను 2005లో ‘హార్విన్’కు రూ.72.64 కోట్లకు అప్పగించారు. రూ.11.48 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసి, కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. మిగిలిన రూ.61.16 కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58 కోట్లకు పెంచేసి.. 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంచనా వ్యయాన్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయిందని వివరించింది. పనులు పూర్తి చేయని రిత్విక్ సంస్థకు అదనంగా రూ.11.35 కోట్ల విలువైన పని అప్పగించడాన్ని తప్పుబట్టింది. ఇప్పటివరకూ ఆ సంస్థ రూ.98 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని.. చేసిన పనులను సక్రమంగా లెక్కించకుండానే బిల్లులు చెల్లించారని తెలిపింది. - 88వ ప్యాకేజీ పనులను 2005లో రూ.66.68 కోట్లకు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 2016 నాటికి రూ.20.76 కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసింది. మిగిలిన రూ.45.92 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.1,79.51 కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంస్థ అప్పగించింది. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. కానీ, ఇప్పటికి రూ.69.34 కోట్ల విలువైన పనులను మాత్రమే చేసింది. 38.63 శాతం పనులు చేయని ఆ సంస్థకే అదనంగా రూ.18.91 కోట్ల పనులను అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. - చేయని పనులకు 87వ ప్యాకేజీలో రూ.14.68 కోట్లు.. 88వ ప్యాకేజీలో రూ.3.18 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల ఆయకట్టుకు నీళ్లందకపోవంతోపాటు ఖజానాపై భారీ ఎత్తున భారం పడిందని తేల్చింది. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. గాలేరు–నగరిలో.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశ పనులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ, అంచనా వ్యయాన్ని రూ.2,155.45 కోట్ల నుంచి రూ.2,800.82 కోట్లకు పెంచుతూ 2015లో సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అయిన వారికి అప్పగించి భారీ ఎత్తున దోచేశారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. - గాలేరు–నగరిలో 29వ ప్యాకేజీ పనులను రూ.171.63 కోట్లకు 2005లో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 2014 నాటికే రూ.166.69 కోట్ల పనులు పూర్తి చేసింది. కేవలం రూ.4.94 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనుల వ్యయాన్ని రూ.110.91 కోట్లకు పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌కు అప్పగించి.. బిల్లులు చెల్లించేశారని.. ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కాంట్రాక్టర్ దోచేసిన సొమ్మును రికవరీ చేయాలని సర్కార్‌కు నిపుణుల కమిటీ సూచించింది. - గాలేరు–నగరి 30వ ప్యాకజీ పనుల్లో భాగమైన అవుకు సొరంగం పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల సొరంగం బదులుగా లూప్ వేయాల్సి వచ్చింది.. ఈ పనులకు రూ.50.69 కోట్లు చెల్లించారని.. ధరల సర్దుబాటు కింద రూ.14.07 కోట్లను అదనంగా దోచిపెట్టారని పేర్కొంది. -
విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్‌లో సోదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత సోదాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈఎస్ఐలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవకతవకలపై ఈఎస్ఐ డైరెక్టరేట్‌లో ఈఎస్ఐ అధికారులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు వచ్చి.. వివరాలు అడిగి పత్రాలను పరిశీలిస్తున్నారని ఏపీ ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సామ్రాజ్యం ‘సాక్షి’కి తెలిపారు. అవినీతి జరిగిందా లేదా అనేది వారి విచారణలో తేలుతుందన్నారు. గతంలో ఈఎస్ఐలో అవకతవకలు జరిగాయని గుర్తించి జాయింట్ కలెక్టర్ మాధవిలత ఇద్దరిని సస్పెండ్ చేశారని తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉదయలక్ష్మీ డ్రగ్స్, టెలీ హెల్త్, పర్చేజస్ డిపార్ట్మెంట్లను వెరిఫికేషన్ చేశారని చెప్పారు. -
‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో ‘నీరు – చెట్టు’ పథకం పేరుతో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో దర్యాప్తు జరిపించి దోషులపై రెవెన్యూ రికవరీ(ఆర్.ఆర్.) చట్టాన్ని ప్రయోగిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. టీడీపీ పాలనలో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, పనులు చేయకుండానే బిల్లులు కాజేశారని వైఎస్సార్సీపీ సభ్యులు మేరుగ నాగార్జున, కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘ఉపాధి హామీ, నీరు – చెట్టు నిధులను చంద్రబాబు సర్కారు పక్కదోవ పట్టించింది. రూ. 22,472 కోట్లకుపైగా విలువైన పనులను చేసినట్లు చూపించి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారు. డ్వామాను తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చారు. నీరు – చెట్టు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఉపాధి హామీ కింద చేసిన పనులనే నీరు – చెట్టు కింద కూడా చూపించి బిల్లులు పొందారు. వేసిన కట్టకే మట్టి వేసినట్లు, తవ్విని గుంతనే తవ్వినట్లు రెండుసార్లు బిల్లులు కాజేశారు. పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో దర్యాప్తు జరిపిస్తామని, హౌస్ కమిటీ అవసరం లేదని చెప్పారు. తన సొంత జిల్లా చిత్తూరులో నీరు–చెట్టులో అవినీతిని స్వయంగా చూశానని వెల్లడించారు. రూ.10 బుష్ కట్టర్ రూ.100కు కొన్నట్లుంది.. గ్రామ పంచాయతీల్లో పొడి, తడి చెత్తలను సేకరించడానికి వినియోగించే ప్లాస్టిక్ బకెట్ల (బిన్ల) కొనుగోలులో చోటు చేసుకున్న భారీ అవినీతిపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 20 – 30కి లభించే చెత్త డబ్బాలను రూ. 55 – 60 చొప్పున కొనుగోలు చేసి సగం డబ్బులు తినేశారని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం ఇస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటుకు ప్లాస్టిక్ చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. అవి రూ. 25 లోపే దొరుకుతాయని అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన వాటిల్లో కూడా నాణ్యత లేదు. ఇందులో భారీ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. మేమూ వ్యవసాయం చేశాం. ఈ విషయం మాజీ సీఎం చంద్రబాబుకు కూడా తెలుసు. రూ.10కి దొరికే బుష్ కట్టర్ రూ.వందకు కొన్నట్లుగా ఉంది. స్ప్రేయర్లు కూడా భారీ రేటుకు కొనుగోలు చేశారు. మొత్తం రూ. 67 కోట్లకుపైగా ఖర్చు చేశారు (ఈ సందర్భంగా ప్లాస్టిక్ బిన్లను ఎక్కడెక్కడ ఎంత ధరకు కొన్నారో గణాంకాలను పెద్దిరెడ్డి వివరించారు). ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో విచారణ జరిపిస్తాం’ అని మంత్రి తెలిపారు. తమ శాఖలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఇలాంటి అక్రమాలు భారీగా బయటకు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
నాసిరకం కొబ్బరి నూనెకు బ్రాండ్ కలరింగ్
కుత్బుల్లాపూర్: నాసిరకం కొబ్బరి నూనెను బ్రాండెడ్‌గా ఆకర్షిణీయంగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్ల డివిజన్ సుచిత్ర రోడ్డులోని జీన్స్ ఫ్యాక్టరీ గల్లీలో వివేక్ ఇండస్ట్రీస్ భవనం మొదటి అంతస్తులో తతంగం జరుగుతోంది. సుభాష్ అలియాస్ బవర్లాల్ అనే వ్యక్తి ఎనిమిది మంది పనివాళ్లతో నకిలీ కొబ్బరి నూనెను ప్రముఖ బ్రాండ్ ‘పారాష్యూట్’ డబ్బాల్లో ప్యాక్ చేసి మార్కెట్లో వివిధ దుకాణాల్లో విక్రయిస్తు వస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ (రంగారెడ్డి యూనిట్) ఎస్పీ ముత్యంరెడ్డి ఆదేశాలతో శుక్రవారం సీఐ రాజు నేతృత్వంలో సిబ్బంది అడ్డాపై దాడులు నిర్వహించారు. అక్కడే ప్రింటింగ్.. అక్కడే ప్యాకింగ్ పారాష్యూట్ బ్రాండ్‌తో నకిలీ నూనెను ప్యాకింగ్ చేస్తున్న స్థావరంపై విజిలెన్స్ అధికారుల దాడులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులకు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. సదరు ముఠా 15 కేజీల డబ్బాల్లో నాసిరకం కొబ్బరి నూనెను వివిధ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. అక్కడే మరో గదిలో ఏకంగా రెండు ప్రింటింగ్ యూనిట్లపై పారాష్యూట్ బ్రాండ్ లేబుళ్లను ముద్రిస్తున్నారు. పారాష్యూట్ బాటిళ్ల వంటి ప్లాస్టిక్ సీసాల్లో కల్తీ నూనెను నింపి ఆ లేబుళ్లు అతికించి సీల్ చేస్తున్నారు. సేకరించిన కొబ్బరి నూనెను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పోసి హ్యాండ్‌పంప్ ద్వారా ఫిల్టర్ చేసి డబ్బాల్లో నింపుతున్నారు. అక్కడ జరుగుతున్న తతంగంతో అధికారులు కూడా కొద్దిగా తికమక పడ్డారు. దీంతో వారు పారాష్యూట్ ఆయిల్ ఏరియా సేల్స్ మేనేజర్లు రాజేష్, జగన్నాథరెడ్డిని అక్కడికి రప్పించి పరిశీలించాల్సిందిగా కోరారు. సదరు కంపెనీ ప్రతినిధులు ఇది నకిలీ ప్యాకింగ్ అని, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. దాదాపు 100 వరకు 15 కేజీల డబ్బాలు, వేల సంఖ్యలో నకిలీ పారాష్యూట్ డబ్బాలు, అదే సంఖ్యలో లేబుళ్లను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ మొత్తం దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పీసీలు అక్రమ్, జైపాల్‌రెడ్డి, ప్రతాప్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ ఎస్సై పరశురామ్ అధికారుల ఆదేశంతో సరుకును, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెలకు రెండు రోజులు మాత్రమే.. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రధాన నిందితుడు సుభాష్ అలియాస్ బవర్లాల్ వివేక్ ఇండస్ట్రీస్ భవన యజమాని వివేక్ గుప్తా వద్ద నెలకు రూ.25 వేల అద్దెతో సదరు ప్రాంగణాన్ని తీసుకుని ఈ తతంగాన్ని నడుపుతున్నాడు. అయితే, ఈ నకిలీ ఆయిల్ ప్యాకింగ్ తతంగం నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరుగుతుందని భవన యజమాని వివేక్ తెలపడం ఆసక్తికరమైన అంశం. అసలు అద్దె తీసుకునే వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప ఆ భవనంలో ఏం జరుగుతుందో తెలుసుకోక పోవడంతో ఇప్పుడు వివేక్ కూడా చిక్కుల్లో పడ్డాడు. తక్కువ ధరకు బ్రాండెడ్ ఆయిల్ వస్తుందని వినియోగదారులు, ఎక్కువ అద్దె వస్తుందని భవన యజమానులు ఈ రకంగా మోసపోవద్దని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు. -
భద్రత..గోవిందా
తిరుమల: తిరుమలలో భద్రత కరువైందా..?? నిఘా వ్యవస్థ నిదరోతుందా.. అత్యంత నిఘా, భద్రత వ్యవస్థ కలిగివుందని చెప్పుకునే టీటీడీ విజిలెన్స్ విభాగం పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. డేగ కళ్లతో నిఘా ఉండే సప్తగిరులపై భద్రతా వైఫల్యం, విజిలెన్స్ అధికారు ల నిర్లక్ష్యం తాజాగా మరోసారి బట్టబయలైంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు భక్తులు గత శనివారం శ్రీవారి సుప్రభాత సమయంలో ఆలయానికి మూడో మార్గంగా ఉన్న తిరుమల నంబి ఆలయం పక్కన ఉన్న గేట్ తాళాలు పగులగొట్టా రు. టికెట్ లేకుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ముగ్గురిలో ఒకరు ప్యాంట్ ధరించడంతో ఆలయ సిబ్బంది టిక్కెట్లను చూపించాలని అడిగారు. తమ వద్ద ఎలాంటి టిక్కెట్లూ లేవని చెప్పారు. ఇద్దరిని మహాద్వారం వద్ద, మరొకరిని వెండి వాకిలి వద్ద పట్టుకొని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్ అధికారులు విచారించగా పుణే నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చామని, గేట్ తాళాలు పగులగొట్టి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించామని తెలిపారు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నివ్వెరపాటు.. ముగ్గురు మాత్రమే ప్రవేశించేందుకు ప్రయత్నిం చారా లేక ఇంకెవరైనా వెళ్లారా, దర్శనం కోసమే ఆలయంలోకి ప్రవేశించారా లేక ఇతరత్రా కారణాలతో ప్రవేశించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిఘా పర్యవేక్షణలో ఉండే శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో ఇలాంటి ఘటన జరగడంతో అటు టీటీడీతో పాటు ఇటు భద్రతా సిబ్బంది నివ్వెరపోయారు. ప్రత్యేక అధికారి విచారణ జరుపుతున్నారు. భద్రత విషయంలో విజిలెన్స్ అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారనే చెప్పుకోవాలి. భద్రతా వలయాలు దాటుకుని ఆలయంలోకి ప్రవేశించిన వాళ్లు సామాన్య భక్తులు కావడంతో ఎలాంటి సమస్యా ఎదురవలేదు. ఇదే మెతక వైఖరిని కొనసాగిస్తే అసాంఘిక శక్తులు భక్తుల మాటున చొరబడే ప్రమాదముంది. విధ్వంసకర పరిస్థితులను సృష్టించే అవకాశముంది. నిత్యం సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కడుతుంటారు. తిరుమల ఇదివరకు భద్రతకు పెట్టింది పేరుగా ఉండేది. ఇప్పుడు భద్రత కరువైనట్లు కనిపిస్తోంది. తరచూ దొంగతనాలు, చిన్నారుల అపహరణ, చైన్‌స్నాచింగ్‌లకు పాల్ప డే ముఠాలు కూడా కొండపైన కన్నేశాయి. వీఐపీల భద్రత కూడా సవాల్‌గా మారుతోంది. 230కు పైగా సీసీటీవీ కెమెరాలు మాడ వీధుల్లో ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సరైన రీతిలో పర్యవేక్షించకపోవడంతోనే భక్తులు గేట్ తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడ్డారు. ఎలా వచ్చారనే సీసీటీవీ ఫుటేజ్‌లు దొరకకపోవడం.. ఆలయానికి మార్గంగా ఉన్న గట్ల వద్ద సరైన రీతిలో కెమెరాలను అమర్చకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భక్తులను ఒకటికి రెండుమార్లు తనిఖీ నిర్వహించాల్సిన బాధ్యత కూడా టీటీడీ విజిలెన్స్‌పైనే ఉంది. టిక్కెట్లు లేకుండా రావడం, పైగా ప్యాంట్ ధరించి ఉండడంతో టీటీడీ ఆలయ సిబ్బంది గుర్తించారు. విజిలెన్స్ సిబ్బంది మాత్రం వారిని గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
డీజిల్ అక్రమ నిల్వలపై దాడులు
పశ్చిమగోదావరి, గోపాలపురం: గోపాలపురం మండలం కోమటికుంట వద్ద ఉన్న మాతంగమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న నాలుగు కిళ్లీ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2 వేల లీటర్లు డీజిల్ ఆయిల్‌ను సోమవారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ బి.అచ్చుతరావు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై కె. ఏసుబాబు, ఏఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపురం నుంచి కొయ్యలగూడెం వెళ్లే ప్రధాన జాతీయ రహదారి కోమటికుంట మాతంగమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న షేక్ ఇస్మాయిల్ 800 లీటర్లు, జగతా చిట్టిబాబు నుంచి 130 లీటర్లు, మందపాటి సత్యనారాయణ నుంచి 550 లీటర్లు, దండే సురేష్ వద్ద నుంచి 600 లీటర్లు డీజిల్ అక్రమ నిల్వలను పట్టుకున్నట్టు తెలిపారు. లారీల నుంచి కొనుగోలు చేసిన డీజిల్‌ను స్థానికంగా ఉన్న ట్రాక్టర్లకు, కార్లకు, ఆటోలకు డీజిల్ అమ్మకాలు సాగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్ బంకులను తలపిస్తున్న డీజిల్ వ్యాపారం స్థానిక కోమటికుంట వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్న డీజిల్ అమ్మకాలు, వారి వ్యాపారం చూసి విజిలెన్స్ అ«ధికారలు ఖంగుతిన్నారు. ఒక్కొక్కరు సుమారు 700 లీటర్లు నిల్వ ఉంచే డ్రమ్ములను ఏర్పాటు చేయడం, దానికి 1 హెచ్‌పీ మోటార్‌ను అమర్చి ఎటువంటి భయం లేకుండా డీజిల్‌ను విక్రయిస్తున్నారు. డ్రమ్ములు, నిల్వలను చూసి విజిలెన్స్ అధికారులు నివ్వెరపోయారు. ఇక నుంచి అక్రమ డీజిల్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెడతామని, తరచూ దాడులు నిర్వహిస్తామని విజిలెన్స్ ఎస్సై ఏసుబాబు చెప్పారు. డీజిల్ వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న డీజిల్‌ను స్థానిక పెట్రోల్ బంక్‌కు అప్పగించడం జరుగుతుందని, వీరిపై 6ఏ, 7.1 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడుల్లో సీఎస్ డీటీ ఎన్.శ్రీనివాసరావు, వీఆర్వో మాటేటి గోపాలరావు, కానిస్టేబుల్ మహేష్‌బాబు పాల్గొన్నారు. బండారం బయటపడిందిలా.. ఏలూరు నుంచి గోపాలపురం వస్తుండగా కోమటికుంట మాతంగమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న కిళ్లీ షాపుల వద్ద ఆగి ఉన్న లారీ నుంచి డీజిల్ తీస్తుండగా విజిలెన్స్ అ«ధికారులు అటుగా వెళుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని కారు నిలుపుదల చేసి పరిశీలించగా అక్రమ వ్యాపారుల గుట్టు రట్టయ్యింది. దీంతో విచారించగా నాలుగు కిళ్లీ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. లారీ సూర్యాపేట నుంచి అనకాపల్లి సిమెంట్ దిగుమతి చేసి తిరిగి వెళుతుండగా లారీ డ్రైవర్ డీజిల్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. -
నిల్వ ఉంచిన మాంసం స్వాధీనం
కృష్ణాజిల్లా, తిరువూరు: పట్టణంలో పరిశుభ్రత పాటించకుండా, కల్తీ ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్న పలు హోటళ్ళు, రెస్టారెంట్లపై ఆహార, కల్తీ నిరోధక అధికారులు, విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మరిల్లు, హిమశ్రీ, విజయలక్ష్మి, శ్రీనివాసా రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు వాటికి కనీసం లైసెన్సులు కూడా లేనట్లు గుర్తించారు. హోటళ్ళ వంటగదులు అధ్వానంగా ఉండటం, తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం, రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం విక్రయించడంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు, విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరరావు, డివిజనల్ అధికారి రమేష్‌బాబులు వేర్వేరుగా హోటళ్ళను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, హోటళ్ళు సరఫరా చేసే ఆహారపదార్థాలు కల్తీ చేస్తున్నారని గుర్తించి నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లోగా పరిస్థితులు చక్కదిద్దుకోకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. -
మెడికల్ షాపులపై విజిలెన్స్ తనిఖీలు
చీరాల రూరల్: చీరాలలోని పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోలర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, ఆయుష్ డిపార్టుమెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్లోని ఎస్‌ఎల్‌కే, శంకర్, శ్రీనివాస, శ్రీరామ మెడికల్ షాపులను ఆయా డిపార్టుమెంట్లకు చెందిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి దుకాణదారుల వద్ద పూర్తి వివరాలు సేకరించారు. ఆయా దుకాణదారులు చేస్తున్న కొన్ని అవకతవకలపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎల్.అంకయ్య విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని శంకర్ మెడికల్స్‌లో చేసిన తనిఖీల్లోమందులు క్రయ, విక్రయాలకు సంబంధించిన హెచ్–1 రిజిస్టర్‌ను మెయింటెన్స్ చేయడం లేదని గుర్తించామన్నారు. ఫుడ్‌కు సంబంధించిన సెర్లెక్, రొట్టెలు, గ్లూకోన్‌డి, బిస్కెట్ల వంటి ఆహార పదార్థాలను అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు చెప్పారు. సమయం మించిపోయినా కొన్ని మందులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. లేబర్ లైసెన్స్ లేకుండా దుకాణంలో వర్క్ర్లతో పనిచేయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు డీఎస్పీ వివరించారు. శ్రీనివాస మెడికల్ స్టోర్‌లో జనవరి నుంచి హెచ్–1 రిజిస్టర్‌ను మెయింటెన్ చేయడం లేదని వివరించారు. వినియోగదారులు కొనుగోలు చేసిన మందులకు బిల్లులు ఇవ్వడం లేదనే విషయం కూడా తనిఖీల్లో తేలిందని చెప్పారు. ఫుడ్‌కు సంబంధించిన అనుమతి పత్రం లేకుండానే విక్రయిస్తున్నారని తెలిపారు. దుకాణంలో ఒకరికి మాత్రమే లేబర్ అనుమతి తీసుకుని అదనంగా మరో ఇద్దరితో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. ఫార్మసిస్టు లేకుండానే మందులు విక్రయిస్తున్న విషయం తనిఖీలో వెల్లడైందని తెలిపారు. ఎస్ఎల్కె మెడికల్స్‌లో మందులు క్రయ, విక్రయాలకు సంబంధించిన హెచ్–1 రిజిస్టర్ మెయింటెన్ చేయడం లేదని చెప్పారు. దుకాణంలో మందులు కొనుగోలు చేసిన వినియోగదారులకు కొనుగోలు చేసిన మందులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. శ్రీరామ మెడికల్స్‌లో లేబర్ అధికారుల అనుమతి లేకుండానే వర్కర్లతో పనిచేస్తున్నారని గుర్తించామన్నారు. రొట్టెలు, బిస్కెట్లు వంటి ఆహార పదార్థాలు తేదీలు లేకుండా విక్రయిస్తున్నారని తెలిపారు. తమ పరిశీలనలో తేలిన అంశాలపై ఆయా దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకాటించారు. అడిషనల్ ఎస్పీ ఎం.రజనీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తనిఖీల్లో సీఐ బీటీ నాయక్, ఎస్ఐ వెంకట్రావు, డ్రగ్స్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఫర్వీన్ సుల్తానా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారి సింగారావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎంవీ రమణమూర్తి, పోలీసులు ప్రసాద్, వెంకట్ పాల్గొన్నారు. ఒంగోలులో మూడు బృందాల దాడులు ఒంగోలు సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడుల్లో విస్తుపొయే నిజాలు వెలుగు చూశాయి. ఎక్కువ మందుల దుకాణాల్లో గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. చాలా దుకాణాల్లో నిర్ణీత ఉష్ణోగ్రతల్లో మందులు నిల్వ చేయడం లేదు. ఎవరికి పడితే వారికి, కనీసం ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. షెడ్యూల్ హెచ్ మందుల పరిస్థితి కూడా ఇంతే. రిజిస్టర్లో నమోదు చేయడం లేదు. గడువు తీరిన మందులు వాడితే ఎక్కువ భాగం మందులు విషతుల్యం అవుతాయి. అందుకే మందులపై వాటి గడువును కంపెనీలు ముద్రిస్తారు. అయినా లాభాల కోసం మందుల దుకాణదారులు గడువు తీరిన మందులు వినియోగదారులకు అంటగడుతున్నారు. దాడులకు ముందు విజిలెన్సు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్లను మరొక ప్రాంతానికి పంపి దాడులు చేశారు. అయినా విజిలెన్సు దాడుల సమాచారంతో అవకతవకలతో ఉన్న చాలామంది దుకాణదారులు తమ షాపులు మూసి వేసి దాడుల నుంచి తప్పించుకున్నారు. ఒంగోలులో ఏఎస్పీ రజనీ ఆధ్వర్యంలో నాలుగు మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నాంచారమ్మ, పుష్ప, ధనలక్ష్మి, మారుతి మెడికల్స్ దుకాణాలు తనిఖీ చేశారు. పుష్ప మెడికల్స్‌లో ఫార్మసిస్టు విధుల్లో లేరు. నాలుగు దుకాణాలకు సంబంధించి లేబర్ యాక్టును అమలు చేయడం లేదు. షెడ్యూల్ హెచ్ మందులను రిజిస్టర్లో నమోదు చేయడం లేదు. మందులకు సంబంధించి కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రిస్కిప్షన్, గడవు తీరిన మందులను కుడా లక్ష్మీనాంచారమ్మ మందుల దుకాణంలో గుర్తించారు. తూనికలు, కొలతలు శాఖల అధికారులు నాలుగు దుకాణాలపై 9 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్సు సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్, ఎస్ఐ జానీ, ఆడిటర్ శ్యామ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాములు, ఫార్మసిస్టు వై.వేణుకుమార్, అసిస్టెంట్ లేబర్ అధికారి మధుబాబు, ఎంపీడీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కందుకూరులో 3 దుకాణాలపై విజిలెన్సు అధికారులు డీఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇక్కడ విజిలెన్సు సీఐ భూషణం, డీసీటీఓ నవీన్ శేషు, డ్రగ్ ఇన్స్పెక్టర్ చీరాల అధికారి, లేబర్ అధికారి శ్రీనివాసనాయుడు, ఫార్మసిస్టు కేవీ మొహన్‌రావు పాల్గొన్నారు. -
మెడికల్‌షాపులపై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఉదయం నుంచి మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో కడప నగరం, బద్వేలు, మైదుకూరు పట్టణాల్లోని మెడికల్ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఏడురోడ్ల కూడలి, ఎర్రముక్కపల్లె ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో ఏడు మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా డ్రగ్ కంట్రోల్ వారి అనుమతులను తీసుకోవాలన్నారు. ఫార్మసిస్ట్ కచ్చితంగా ఈ షాపుల్లో పనిచేయాలన్నారు. ప్రతి చోటా ఫార్మసిస్ట్ ఒక్కరే పనిచేస్తూ, మిగిలినవారు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారన్నారు. ఎఫ్‌సీసీఐ వారి లోగో ఉన్న ఆహార ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలని సూచించారు. ఇందుకు పుడ్‌లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కొన్ని దుకాణాల్లో బిస్కెట్స్, చాక్లెట్స్‌తో పాటు, ఫుడ్ సప్లిమెంట్స్ విక్రయిన్నారన్నారు. కాలంచెల్లిన మందులను కౌంటర్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసుకుని, విక్రయాలకు దూరంగా పెట్టుకోవాలన్నారు. ఎంఆర్పీ రేట్లకంటే తక్కువ ధరలకు విక్రయించాల్సిన జనరిక్ మందులను కూడా ప్రతి షాపులో అందుబాటులో ఉంచాలన్నారు. హెచ్–1 రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. నిషేధిత మందులను షాపుల్లో పెట్టరాదని, ఫిజిషియన్ శాంపిల్స్‌ను విక్రయించరాదన్నారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ మేరకే మందులు ఇవ్వాలని సూచించారు. బిల్స్, ఇన్వాయిస్లను వినియోగదారులకు కచ్చితంగా ఇవ్వాలన్నారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని డీఎస్పీ తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బద్వేలు అర్బన్/మైదుకూరు : పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపులపై బుధవారం విజిలెన్స్ దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐలు లింగప్ప, నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో కొన్ని షాపుల్లో కాలం చెల్లిన మందులను గుర్తించారు. అలాగే ఆయా దుకా ణాలకు ఫుడ్‌లైసెన్స్ లేనట్లు గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నివేదిక తయారు చేశారు. మైదుకూరులో ఐదు దుకాణా ల్లో దాడులు నిర్వహించారు. ఆయా షాపుల్లో రికా ర్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ ఖాదర్‌బాషా, హెడ్‌కానిస్టేబుళ్లు ప్రసాద్, హరి, సిబ్బంది పాల్గొన్నారు. -
కర్నూలులో ‘శంకర్‌దాదా’
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నకిలీ వైద్యుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో తరహాలో అర్హత లేకున్నా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పట్టుకున్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న వై.వేణుగోపాల్‌శెట్టి ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతను చదివింది పదో తరగతి మాత్రమే. కానీ స్థానిక బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్, మెడికల్ షాపుతో పాటు ప్రకాష్‌నగర్‌లోని తన ఇంట్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు ఇతని వద్దకు గర్భిణులను తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఈవో బాబురావు తన సిబ్బందితో వేణుగోపాల్‌శెట్టి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఆయన మారువేషంలో వెళ్లి.. స్కానింగ్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వెంట డీసీటీవో వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ జయన్న, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు ఉన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ సమక్షంలో స్కానింగ్ మిషన్ సీజ్ చేశారు. వేణుగోపాల్‌శెట్టి వద్ద పాత స్కానింగ్ మిషన్‌తో పాటు గ్లౌజులు, అబార్షన్‌కు అవసరమైన ఆపరేషన్ థియేటర్ పరికరాలు లభించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గౌతమ్ సవాంగ్ బదిలీ
సాక్షి, అమరావతి : విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన సవాంగ్‌కు భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాంగ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. డీజీపీగా ఠాకూర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. శనివారం సాయంత్రం సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బదిలీపై సీపీ సవాంగ్ తీవ్ర అసంతృప్తి
-
మళ్లీ ఐటీ కేసు!
అన్నాడీఎంకే అమ్మ దివంగత జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మీదున్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1991–96 కాలంలో మూటగట్టుకున్న అవినీతి చిట్టా ఆ తదుపరి ఒక్కొక్కటిగా బయట పడుతూ వచ్చింది. చివరకు అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చెన్నై ఎగ్మూర్ కోర్టులో విదేశీ మారక ద్రవ్యం కేసువిచారణ శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడో తుంగలో తొక్కిన కేసు ఫైల్‌కు మళ్లీ అధికారులు బూజు దులిపి విచారణకు తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చిన్నమ్మ ప్రతినిధిదినకరన్ను ఓ వైపు పాత కేసుల రూపంలో ఇరకాటంలో పెట్టే విధంగా పాలకులు పావులు కదుపుతూ వస్తున్నారు. తాజాగా అదే దృష్టి చిన్నమ్మ మీదున్న పాత కేసుల్ని తవ్వే పనిలో పడ్డట్టుగా చర్చ ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా పదేళ్లక్రితం తుంగలో తొక్కిన ఐటీ కేసు మళ్లీ తెర మీదకు రావడంగమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ మెడకు ఐటీ కేసు బిగిసేనా అన్న చర్చ బయలు దేరింది. తుంగలో తొక్కిన ఈకేసు ఫైల్‌కు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ వర్గాలు దుమ్ముదుళిపే పనిలో పడ్డాయి. శశికళ మీద గతంలో దాఖలైన ఐటీ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ బయటకు తీశారు. విచారణ వేగం పెంచే పనిలో కోర్టు నిమగ్నం అయింది. 1991–96కాలంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆగడాలకు హద్దే లేదని చెప్పవచ్చు. ఇందులో భాగంగా 1994–95లో ఐటీ రిటర్న్ దాఖలులోనూ తన పనితనాన్ని ఆమె ప్రయోగించారు. అధికారం దూరం అయ్యాక 1997లో డీఎంకే సర్కారు ఈ గుట్టును రట్టుచేస్తూ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్న కేసులకు తోడు మరో కేసుగా ఐటీ ఉచ్చు చిన్నమ్మ మెడకు బిగించింది. శిక్ష సైతం పడిందనుకున్నప్పుడు అప్పీలు వెళ్లి తప్పించుకోగలిగారు. ఐటీ అధికారుల లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, ఆస్తుల పునః లెక్కింపు జరగాల్సిందేనన్న శశికళ విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. శిక్ష నుంచి గట్టెక్కినా, లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేసి మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే సర్కారు మళ్లీ అధికారంలోకి రావడంతో కేసు కాస్త తుంగలో తొక్కినట్టుగా పరిస్థితి మారింది. ఆ తదుపరి డీఎంకే సర్కారు అధికారంలోకి రాగానే ఐటీ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. చివరకు వాయిదా పడ్డ ఈ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ దుమ్ము దులుపుతూ అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. మద్రాసు హైకోర్టులో గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు పీఎస్ శివజ్ఞానం, శేషసాయి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు రాగా, ఐటీ తరఫు న్యాయవాదులు శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే, శశికళ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుని కేసు పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని, అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు సమయం కేటాయించాలని కోరారు. ఇందుకు ఐటీ తరఫున సైతం అంగీకారం లభించడంతో న్యాయమూర్తులు స్పందించారు. తదుపరి విచారణ జూన్ ఆరో తేదీకి వాయిదా వేశారు. విచారణ వేగం పెంచి, కేసును త్వరితగతిన ముగించే రీతిలో కోర్టు చర్యలు చేపట్టి ఉండడంతో, చిన్నమ్మ మెడకు ఐటీ ఉచ్చు బిగిసేనా అన్న ప్రశ్న బయలుదేరింది. -
పత్తి కొనుగోళ్ల అక్రమాలపై ముగిసిన విచారణ
గుంటూరు: 2014-15 సీజన్లో పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ పూర్తయింది. అక్రమాలకు సంబంధించి మొత్తంగా 26 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొంత మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 89 మార్కెట్ యార్డుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. రైతుల పేర్లతో డబ్బు డ్రా చేసినట్లు సంబంధిత అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
అవును.. అవి అక్రమ రిజిస్ట్రేషన్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రజల సౌలభ్యం కోసం స్టాంపులు-రిజిస్ట్రేషన్లశాఖ అమలు చేస్తున్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియ అక్రమార్కులకు వరంగా మారిందని ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గతేడాది హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సమీపంలో సుమారు రూ. 20 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలైన తీరును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా నిగ్గుతేల్చింది. ఈ విషయమై ‘ఎనీవేర్ దందా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని విజిలెన్స్ అధికారులు సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఎల్బీనగర్ సమీపంలో సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (సిరీస్)కు ప్రభుత్వం కేటాయించిన 36.45 ఎకరాల్లో కొంత భాగాన్ని కంపెనీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించగా దాన్ని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ట్రేషన్ ధర గజం రూ. 35 వేలు ఉండగా దాన్ని రూ. 13 వేలకు తగ్గించి రిజిస్ట్రేషన్ చేశారని, దీనివల్ల సర్కారు ఖజానాకు రూ. 1.42 కోట్ల నష్టం వాటిల్లందని సర్కారు దృష్టికి తెచ్చారు. అలాగే ఒకే డోర్ నంబర్‌తో ఉన్న భూమి మొత్తానికి ఒకే రకమైన రిజిస్ట్రేషన్ విలువను వర్తింపజేయాల్సి ఉన్నా కొంత స్థలాన్ని గజం రూ. 35 వేలు (కమర్షియల్) కేటగిరీగా, మిగిలిన భూమి విలువను గజం రూ. 13 వేలు (రెసిడెన్షియల్)గా విభజించారని వివరించారు. కంపెనీ యాజమాన్య ప్రతినిధులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్, సదాశివన్ అనే సబ్ రిజిస్ట్రార్లను విచారించిన అధికారులు ఈ వ్యవహారంలో సదరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడ్డారని ధ్రువీకరించారు. వారిని తక్షణం సస్పెండ్ చేయాలని సూచిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్‌కు విజిలెన్స్ విభాగం డెరైక్టర్ జనరల్ రాజీవ్‌త్రివేది లేఖ రాశారు. అక్రమాలు జరిగింది ఇలా... ‘సిరీస్’ అనే పరిశోధన సంస్థకు ప్రభుత్వం 1965లో సుమారు 36.45 ఎకరాల భూమిని కేటాయించింది. సర్వే నంబరు 9/1, 49/13లలో ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిని ప్రభుత్వ అన.ుమతి లేకుండా క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు జరపకూడదని ప్రొహిబిటరీ ఆర్డర్ ఉంది. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన ఎల్బీ నగర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తులకు అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూమి సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు... ఎల్బీ నగర్‌లోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. నిషేధిత ఆస్తుల జాబితా (పీవోబీ)లోని భూముల విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశానికి స్వయం గా హాజరైన ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఒకరు తాజాగా విజిలెన్స్ విచారణలో పీవోబీ వివరాలను రెవెన్యూ అధికారులు వెబ్ సైట్లో పొందుపరచలేదని బుకాయించడం గమనార్హం. -
కోట్ల మట్టి కొల్లగొట్టి.. కొల్లగొట్టి
పోలవరం కుడి కాల్వ మట్టి స్వాహా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమ తరలింపు 45 కిలోమీటర్ల పొడవున భారీగా తవ్వకాలు ప్రభుత్వానికి నివేదిక పంపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనే నానుడిని టీడీపీ నేతలు బాగా వంట పట్టించుకున్నారు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు తెగబడుతున్నారు. మళ్లీ అధికారం వచ్చేనా చచ్చేనా అనుకుంటూ అమాత్యుల అండదండలతో కోట్ల రూపాయల మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. నిబంధలన్నింటికీ ట్రాక్టర్ చక్రాల తొక్కిపెట్టి.. ప్రజాధనాన్ని అక్రమంగా వారి జేబుల్లో కుక్కుకుంటున్నారు. అడ్డొస్తారనుకునే అధికారుల నోళ్లకు మామూళ్ల మత్తుతో తాళం వేస్తున్నారు. విజయవాడ : అందినంత వరకు దోచుకోవడమే ఎజెండాతో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. దీంతో అనుచరగణం రెచ్చిపోయి భారీగా మట్టిని కొల్లగొట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని స్వాహా చేశారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీనిపై వరుస కథనాలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో పోలవరం కుడి కాల్వ పనుల్ని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహిస్తోంది. దీనిని ప్యాకేజ్‌ల వారీగా విభజించి కాలువ పూడికతీత పనులు చేస్తున్నారు. గన్నవరం రూరల్ మండలంలోని పల్లెర్లమూడి నుంచి మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో వెలగలేరు వరకు 45 కిలోమీటర్ల పొడవునా కుడి కాలువ పూడికతీత పనులు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కీలక మంత్రి, మరో శాసనసభ్యుడు మండలాల వారీగా మట్టి తవ్వకాలను పంచుకొని అడ్డగోలుగా తవ్వించారు. మొత్తం 45కి.మీ మేర సుమారు 100 కోట్లకుపైగా విలువైన మట్టిని స్వాహా చేశారు. ఒక క్యూబిక్ మీటర్ రూ. 400 వరకు పలుకుతోంది. ఇక్కడ మట్టిని తవ్వేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. పూడికతీత పనుల్లో భాగంగా మట్టిని తవ్వి పక్కన కుప్పలుగా పోయిం చాలి. దానితో నిమిత్తం లేకుండా మట్టిని తవ్వేవారే జలవనరుల శాఖ నిర్దేశించిన కొలతల ప్రకారం వదిలేసి మిగిలిన మట్టిని తరలించుకుపోతున్నారు. రెండు నియోజకవర్గాల్లోనే... ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఛోటా నాయకులు పోటీలు పడి మరీ మట్టిని తవ్వించారు. గతంలో ఒకటి రెండుసార్లు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అడ్డుకోవటానికి యత్నిస్తే తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసి తర్వాత మాముళ్లతో వారిని కట్టి పడేస్తున్నారు. వీటిని అడ్డుకుంటే అమాత్యునికి ఎక్కడ కోపం వస్తుందోనని జలవనరుల శాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయం ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ నిర్వహించారు. అక్కడ 284.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైందని నిర్ధారించారు. దీని ద్వారా ప్రభుత్వం సుమారు 60.77 లక్షల ఆదాయం కోల్పోగా బాధ్యుల నుంచి దానికి ఐదు రెట్లు మొత్తం అపరాధ రుసుంగా వసూలు చేయాలని.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా జలవనరుల శాఖ అధికారులకు ఉత్తర్వులు అందినట్లు సమాచారం. -
విజిలెన్స్ గుప్పిట్లో కాలేజీల గుట్టు!
* ఇంజనీరింగ్, బీఫార్మసి కాలేజీలపై నివేదిక తయారు చేసిన విజిలెన్స్ * వెయ్యి కాలేజీలపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, బీఫార్మసి కాలేజీల దుస్థితిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. నెల రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో వెల్లడైన అంశాలను క్రోడీకరించి ఈ నివేదిక రూపొందించింది. మొదటి విడతగా వెయ్యి కాలేజీలకు సంబంధించిన బాగోతాలు ఈ విచారణలో బయటపడ్డాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత, ఫ్యాకల్టీ అంశాల ఆధారంగా విచారణ జరిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశిస్తే.. అక్రమాలకు పాల్పడ్డ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గుప్పిట్లో వెయ్యి కాలేజీల గుట్టు.. రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 6,800 కాలేజీలు ఉన్నాయి. కాలేజీల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం నెల క్రితం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతీ రోజు దాదాపు 30 నుంచి 40 బృందాలు కాలేజీల స్థితిగతులను పరిశీలిస్తున్నాయి. పీజీ, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ తదితర విభాగాలకు చెందిన కాలేజీలను తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 1,200 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీకి చెందిన కాలేజీలే ఎక్కువ. వీటిలో చాలా కాలేజీలు కనీసం మౌలిక వసతులను కూడా కల్పించలేదని విజిలెన్స్ అధికారులు నివేదికలో ప్రస్తావించారు. ల్యాబ్ నిర్వహణ దారుణ మని, ఇలాగైతే విద్యార్థులకు సరైన శిక్షణ లభించడం కష్టమని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతం, ఫీజు రీయింబర్స్మెంట్ పొందే వారి వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన భోదనా సిబ్బంది లేరని పేర్కొన్నారు. సిబ్బంది వివరాలు, జీతభత్యాలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, బీఫార్మసీ కాలేజీలపై 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది సిద్ధమవుతున్నారు. -
కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: జిల్లా ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఏఎస్ ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఏఎస్ ఖాన్‌కు విశాఖపట్నం నగర జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి వచ్చిన సంగతి తెలిసిందే. 2005లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన బ్రహ్మారెడ్డి గతంలో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ఉత్తరాంధ్రజిల్లాల్లో విశాఖపట్నం డీసీపీగా, విజయనగరం పీటీసీ(పోలీస్‌ట్రైనింగ్ స్కూల్)ఎస్పీగా పనిచేసిన ఆయన గోదావరి జిల్లాలకు అదనపు ఎస్పీగా అనంతరపురం, కర్నూలు జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీ విభాగంలో ఎకనామిక్ ఆపరేషన్స్ వింగ్ (ఈవోడబ్లూ) ఎస్పీగా పనిచేస్తుస్తూ బదిలీపై శ్రీకాకుళం రానున్నారు. -
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం రూరల్ : మండలంలోని తెల్దారుపల్లి గ్రామం నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 105 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఏనుగు వెంకటేష్, సివిల్ సప్లై డీటీ వేణుగోపాల్ మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కథనం ప్రకారం... తెల్దారుపల్లి గ్రామానికి చెందిన శ్రీను, రాజేందర్ ఇద్దరూ కలిసి మండలంలోని పొన్నేకల్, తల్లంపాడు, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి తదితర గ్రామాల్లో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తెల్దారుపల్లి గ్రామంలో ఓ చోట నిల్వ ఉంచారు. అనంతరం కొనుగోలు చేసిన బియ్యాన్ని మహబూబాబాద్‌కు చెందిన మురళీకృష్ణ రైస్‌మిల్లు యజమానులైన సతీష్, రాధాకృష్ణలకు కేజీకి రూ.14చొప్పున 105 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అమ్మారు. రైస్‌మిల్లు యజమానులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పేరుపై తప్పుడు వేబిల్లులు సృస్టించి కాకినాడ పోర్టుకు తరలించడానికి బియ్యాన్ని వాహనాల్లోకి లోడ్ చేస్తున్నారు. సమాచారం అందడంతో విజిలెన్స్, సివిల్సప్లై అధికారులు మాటువేసి పట్టుకున్నారు. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సత్తిబాబు, బోనకల్ మండలం గోవిందాపురానికి చెందిన బొలేరో వాహనం డ్రైవర్ ఎస్కె అబ్దుల్నబీ, రైస్‌మిల్లు యజమానులు సతీష్, రాధాకృష్ణ, బియ్యాన్ని అమ్మిన బాణోత్ శ్రీను, బోడపట్ల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేశామని సీఐ వెంకటేష్ తెలిపారు. దాడుల్లో డీటీ సునీల్‌రెడ్డి, ఏఎస్ఓ బాలరాజు, విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ పి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఇసుక లారీల సీజ్ : రూ. 8లక్షల జరిమానా
పటాన్చెరు రూరల్ : మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 21 లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. వాటికి రూ.8 లక్షల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ నిజామాబాద్ మెదక్ రేంజ్ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అక్ర మంగా ఇసుకను తయారు చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. దీంతో 19 ఇసుక లారీలను సీజ్ చేశామన్నారు. రెండు ధాన్యం లారీలను కూడా సీజ్ చేసి అన్ని లారీలకు రూ.8 లక్షల జరిమానా విధించామని తెలిపారు. అక్రమంగా ఏ వ్యాపారం చేసిన అలాంటి వాటిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక లారీలు తిరిగి అక్రమంగా రవాణా చేస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వాహనాల తనిఖీలో సీఐలు జాన్ విక్టర్, శ్రీనివాస్‌రావు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రఘునాథ్‌బాబు, సంతోష్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారి విద్యాకర్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టార్ రమేష్‌కుమార్, అటవీశాఖ అధికారి రాఘవేందర్ రావు, విజిలెన్స్ ఎస్ఐ సదాత్‌మియ్యా, సిబ్బంది పాల్గొన్నారు. -
రట్టుకానున్న గుత్ప గుట్టు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్వహణను హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ పేరిట టెండర్లు పొందిన ఓ కాంగ్రెస్ నాయకుడు బినామీగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు న్నాయి. సదరు నేతకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. సమాచారం ఇచ్చే విషయంలో అన్ని స్థాయిల్లోనూ అసలు విషయాలను పక్కనబెట్టి.. దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ‘సాక్షి’లో గుత్ప ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది ఇటు అధికారవర్గాలు.. అటు అధికార పార్టీ నేతల్లో కలకలం రేపింది. ఓ వైపు ఇంటెలిజెన్స్, మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నాయి. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ విషయమై రెండు రోజుల క్రితం నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇంజినీరింగ్ అధికారుల్లో కలకలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో చక్రం తిప్పిన ఆర్మూర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నేత నీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రదర్శించిన చేతివాటం కొందరు ఇంజినీరింగ్ అధికారులకు సంకటంగా మారనుంది. 2011 నుంచి ఇప్పటి వరకు రెండు సాగునీటి పథకాల నిర్వహణలో జరిగిన నిధుల వినియోగంపై విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్, విజిలెన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది. సుమారు మూడేళ్లలో గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం విడుదలైన రూ. 55.77 కోట్ల నిధులు, ఖర్చులు తదితర వివరాలపై రెండు నిఘా సంస్థలు దృష్టి సారించడం ఇంజినీరింగ్ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పనుల్లో అనేక లోపాలు, అక్రమాలు చోటు చేసుకున్నా సదరు నాయకుడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ప్రభుత్వం ఏటా విడుదల చేసిన నిధులు.. నిర్వహణ ఖర్చులతో సమానం చేస్తూ బిల్లులు తయారు చేసి పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అక్రమాల విషయంలో కొందరు సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. గుత్ప ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తాజాగా ఈ ఏడాది జూన్ 25న రూ. 55.78 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను 2015 జులై 31 వరకు ఖర్చు చేయాలి. నందిపేట, బాల్కొండ, మాక్లూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన 55 గ్రామాల్లో సుమారు 38,967 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్వహణ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో మూడేళ్లలో ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు రెండేళ్ల కోసం విడుదలైన రూ. 55.78 కోట్ల వినియోగంపైనా నిఘా సంస్థలు దృష్టి సారించాయి. త్వరలోనే.. అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారం త్వరలోనే బయట పడనుందన్న చర్చ సాగుతోంది. భారీగా జరిగిన అవకతవకలపై వెలువడిన కథనంపై ఇంజినీరింగ్ శాఖలోని కొందరు అధికారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ హయాం లో 2011 నుంచి నీటిపారుదలశాఖలో అన్నీ తానై వ్యవహరించిన ఆర్మూర్‌కు చెందిన సదరు నాయకుడి గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం ఏటా పెడుతున్న ఖర్చుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగోలా సమాచారాన్ని సేకరించి వెలువరించిన ‘సాక్షి’ కథనంపై స్పందించిన నిఘా సంస్థలు ‘గుత్ప’ లెక్కలు విప్పేందుకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది. ఎత్తిపోతల పథకం నిర్వహణలో ప్రధాన అంశాలు ఏమిటి? 2011 నుంచి ఈ పథకం నిర్వహణ కోసం ఎంత వరకు ఖర్చు చేశారు? అంశాల వారీగా ఖర్చులకు సంబంధించిన వివరాలు ఏమిటి? కరెంట్ బిల్లులు, పైపులైన్ల ఏర్పాటు పోను.. ఎప్పుడెప్పుడు మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు చేయించారు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కార్మికులకు ఎందరు? క్షేత్రస్థాయిలో వాచ్‌మన్ నుంచి అపరేటర్, సూపర్వైజర్ తదితర కేటగిరిల్లో 80 నుంచి 120 మందిని కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాల్సి ఉండగా.. ఎందరు పనిచేస్తున్నారు? వారికి చెల్లిస్తున్న జీతభత్యాలు ఎంత? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. నిజాలు వెలుగు చూస్తాయా అన్న విషయమై వేచి చూడాలి. -
రేషన్ షాప్‌లపై తూనికల శాఖ దాడులు
విశాఖ : హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ డిపోలపై తూనికలు, కొలతల శాఖ సోమవారం ఉదయం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా విశాఖలో 9, శ్రీకాకుళంలో 4 దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారుల జరిపిన దాడుల్లో సరుకుల నిల్వలో తేడాలున్నట్లు గుర్తించారు. దాంతో కేసులు నమోదు చేసి, సరుకులను సీజ్ చేశారు. మరోవైపు ఎవరైనా నిత్యావసర సరకులను ఎక్కువ ధరకు విక్రయిస్తే 0891-2550706కు ఫోన్ చేయాల్సిందిగా ప్రాంతీయ నిఘా, అమలు అధికారి సూచించారు. కాగా నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు. -
ట్రావెల్స్ సంస్థపై ముప్పేట దాడి
అఫ్జల్‌గంజ్: ఆదాయ పన్ను చెల్లించకుండా అక్రమంగా పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై ఆదాయ పన్ను శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 800 గోనె సంచులలోని పొగాకును స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించారు. నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఒకారా ట్రాన్స్పోర్ట్స్ నుంచి అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పక్కన గల ఒకారా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి రెండు లారీల్లో (హెచ్ఆర్ 55కె7774, ఆర్జె 09జిబి0245) సరుకు దిగుమతయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ డీ సీపీ సునీతారెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారి దామోధర్ రావుల నేతృత్వంలో సిబ్బంది ఒకారా ట్రావెల్స్‌పై బుధవారం రాత్రి దాడి చేశారు. 800 గోనె సంచుల్లో గల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బిల్లులు లేవని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్టు మేనేజర్ తిలక్‌రాజ్‌ను విచారించగా సరుకును ఎక్కడికి పంపుతున్నారన్న విషయం తనకు తెలియదని, ఢిల్లీలోని తమ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిందని అధికారులకు తెలిపారు. మేనేజర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్‌లో స్వాధీనం చేసుకున్న పొగాకు నిషేధిత గుట్కాల తయారీకి వినియోగించేదిగా తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. -
‘వంగా’కు ఇండియన్ పోలీస్ మెడల్
ఒంగోలు క్రైం : ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పని చేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందిన వంగా సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసిన పోలీస్ పతకాల జాబితాలో సుబ్బారెడ్డి పేరూ ఉంది. రెండేళ్ల పాటు ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇటీవల ఏఎస్పీగా పదోన్నతి పొందారు. అందులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్పీలకు పోస్టింగ్‌ల కోసం హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ రావడంపై ఆ విభాగంలోని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వల్లభపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. 1985 ఎస్సై బ్యాచ్‌కు చెందిన సుబ్బారెడ్డి అం చెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారు. చీరాలలో శిక్షణా ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొందారు. 2009లో డీఎస్పీగా పదోన్నతి పొంది మొదట సీఐడీలో పని చేశారు. అనంతరం కడప జిల్లా మైదుకూరు డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్సైగా జిల్లాలోని కంభం, మార్టూరు, అద్దంకి, మేదరమెట్లతో పాటు పలు పోలీస్స్టేషన్లలో పని చేసి జిల్లాతో అనుబంధం పెంచుకున్నారు. ఆ తర్వాత సీఐగా గుంటూరు జిల్లా మా చర్ల, నెల్లూరు జిల్లా కావలి, గుడూరు, సూళ్లూరుపేటలో పని చేశారు. జిల్లాలోని పలు సర్కిళ్లలో సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన పోలీస్ విభాగంలో చేరినప్పటి నుంచి సీఎం శౌర్యపతకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, ఉత్తర సేవా పతకాలు ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యున్నత సేవా పతకం ఇండియన్ పోలీస్ మెడల్‌ను అక్కున చేర్చుకున్నారు. -
397 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కురవి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 397 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కురవి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో 197 క్వింటాళ్లు, మరిపెడలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన కిరాణ షాపు యజమాని చెరివిరాల ప్రవీణ్ రేషన్ బియ్యూన్ని లబ్ధిదారుల నుంచి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. గ్రామంలోనేగాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కిరాణం షాపుల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యూన్ని ఆటోల్లో అయ్యగారిపల్లికి తరలిస్తున్నాడు. అలా కొనుగోలు చేసిన బియ్యూన్ని గ్రామంలోని పలుచోట్ల నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించ గా 394 సంచుల్లో 197 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైంది. పంచనామా అనంతరం స్వాధీనం చేసుకున్న రేషన్ బియూన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి, వాటిని మొగిలిచర్లలోని నవ్య రైస్‌మిల్లుకు తరలిం చారు. వ్యాపారి సీహెచ్.ప్రవీణ్‌పై 6ఏ కింద కేసు నమోదు చేస్తామని, అతడిని జేసీ కోర్టుకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం సీఐ వెంకటేశ్, హెడ్ కానిస్టేబు ల్ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్మాధవరావు పాల్గొన్నారు. మరిపెడ : గూడూరు మండలం మునుగోడు నుంచి లారీలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యూన్ని అక్రమంగా కోదాడకు తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స అండ్ ఎన్ఫోర్సమెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక రాజీవ్‌గాంధీ సెంటర్లో లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించగా మొక్కజొన్నల లోడుగా చెబు తూ ధ్రువపత్రాలు చూపించాడు. అనుమానం వచ్చి అధికారులు బస్తాలు తనిఖీ చేయగా అందులో ప్రజాపంపిణీ బియ్యం రవాణా అవుతున్నట్లు తేలింది. దీంతో మునుగోడు వ్యాపారి నాగేశ్వరరావు, కోదాడకు చెందిన మేడి మల్లయ్యతోపాటు ఆయన గుమస్తా నారాయణ, లారీడ్రైవర్పై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐలు రమణారెడ్డి, వెంకటేష్, ఎంఆర్ఐ జర్పుల సుధాకర్‌నాయక్, డీటీ సురేష్‌బాబు ఉన్నారు. అక్రమార్కులను వదిలేది లేదు రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులను వదిలేది లేదని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్‌లో రెండు ట్యాంకర్లలో సుమారు 25 వేల లీటర్ల కిరోసిన్‌తోపాటు నాలుగు వాహనాల్లో సుమారు వెయ్యి క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు కూడ తమ గ్రామాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు. -
ఆరుగురుఎంఈవోలు సస్పెన్షన్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)లో తవ్విన కొద్దీ అక్ర మాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా ఆ శాఖలోని అధికారుల తీరు మారడం లేదు. పేద పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆరుగురు మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈవో)ను, రాజీవ్ విద్యామిషన్ ప్రత్యాన్మయ(అలెస్కో) పాఠశాల కో-ఆర్టినేటర్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. నిధుల దుర్వినియోగ ఫలితం 2011-12, 2012-13 విద్యాసంవత్సరంలో ఆర్‌ఎస్‌టీసీ(బాల కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల) నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు గతేడాది విచారణ చేపట్టారు. ఇందులో నిధుల దుర్వియోగం అయినట్లు తేలింది. విచారణ రిపోర్టులు ప్రభుత్వానికి అందజేశారు. రిపోర్టును ఆర్వీఎం అధికారులకు ప్రభుత్వం పంపింది. దీంతో ఆర్వీఎం అధికారులు కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. ఎంఈవోలుగా పనిచేసిన వారిపైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్జేడీకి నివేదించారు. ఆర్జేడీ స్పందిస్తూ ఆరుగురు ఎంఈవోలను, ఒక అలస్కోను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆర్‌ఎస్‌టీసీలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అక్రమాలకు పాల్పడటంతో అధికారులపై చర్యలు చేపట్టారు. -
అక్రమార్కులపై చర్యకు విజిలెన్స్ సిఫార్సు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: భవన నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 34 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖరాశారు. పొద్దుటూరు మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండపాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలతోపాటు మొత్తం 48 భవనాల నిర్మాణాలకు సంబంధించి అధికారులు నిబంధనలు పాటించలేదని వారు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి 2011 జూలై 18, 19, 20, 25 తేదీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వయంగా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయా అధికారులతో స్వయంగా అభిప్రాయాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.పెన్నానది ఒడ్డున నిర్మించిన రెడ్ల కళ్యాణ మండపం, కేఎస్ఆర్ అండ్ సీఆర్సీ కళ్యాణ మండపం, కొవ్వూరు కళ్యాణ మండపాలు పూర్తిగా ఏటిపోరంబోకులో నిర్మించినవని తేల్చారు. పస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి బి.శివగురుమూర్తి, పులివెందుల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీజర్ ఎస్.మహబూబ్‌బాషా, కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సీటీ కృష్ణ సింగ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ డి.గోపాలకృష్ణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, రిటైర్డు మున్సిపల్ కమిషనర్ జీ.వెంకట్రావు, ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీ కృష్ణ ప్రసాద్, పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పీ.సాంబశివారెడ్డి, చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి టీ.ఆమోష్, దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్, నంగనూరుపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.రవి, గతంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న డీ.ధనుంజయబాబు, ఎర్రగుంట్ల మండలంలోని చిన్నదండ్లూరు గ్రామ కార్యదర్శి ఎం.విజయలక్ష్మిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల తహశీల్దార్ ఎం.మనోహర్, జమ్మలమడుగు తహశీల్దార్ కే.వీ.శివరామయ్య, చక్రాయపేట తహశీల్దార్ ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎర్రగుంట్ల ఏఆర్ఐ బి.లక్ష్మిదేవి, గతంలో ఎర్రగుంట్ల తహశీల్దార్‌గా పనిచేసిన టీ.అంజనాదేవి, రిటైర్డు తహశీల్దార్లు ఎస్.నాగమల్లన్న, టీవీ సత్యకుమార్, ఎం.వెంకోబరావు, పీ.శ్రీనివాసులు, టీ.జయచంద్ర, ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.ప్రకాష్, రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న జీ.వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.శాంతన్ సుధాకర్, సిద్ధవటం తహశీల్దార్ వైఎస్ సత్యానందం, రాయచోటి తహశీల్దార్ జీ.చిన్నయ్య, జమ్మలమడుగు డిప్యూటీ తహశీల్దార్ పుష్పాంజలి, రిటైర్డు సీనియర్ అసిస్టెంట్ వీ.రవీంద్రబాబు, రిటైర్డు డిప్యూటీ తహశీల్దార్ సీ.కృష్ణమూర్తి, రిటైర్డు వీఆర్ఓ ఏ.మహ్మద్ఖాసీంతోపాటు ఎర్రగుంట్ల వీఆర్ఓ ఓబయ్య, ఎంఆర్ఐ పీఎంవీ మనోజ్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. పెన్నానది ఒడ్డున ఏటి పోరంబోకులో నిర్మించిన కళ్యాణ మండపాలకు సంబంధించి వీరిపై పూర్తిగా నివేదిక పంపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని, బిల్డర్లకు భారీ ఎత్తున జరిమానా విధించాలని సూచించారు. ఈరు గుర్తించిన నిర్మాణాల్లో ఎంవీఎస్ రెసిడెన్సి, జీ రామచంద్రుడు కమర్షియల్ బిల్డింగ్, సత్యనారాయణ ప్యారడైజ్, సరోవర్ రెసిడెన్సి, ఆదిత్య ఎన్క్లేవ్, రాజా రెసిడెన్సి, పద్మలక్ష్మి ఎన్క్లేవ్, వీఎన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు, శివబాలాజీ రె సిడెన్సి, శ్రీకృష్ణ ఆర్కేడ్, శ్రీరామ అపార్ట్మెంట్, రాజా రెసిడెన్సి, రాఘవేంద్ర రెసిడెన్సి, ఎస్ఎస్ రెసిడెన్సి, తల్లం సాయి రెసిడెన్సి, గోకుల్ రెసిడెన్సి, లక్ష్మిటవర్స్, రిషి రిసిడెన్సి, చరణ్‌తేజ్ రెసిడెన్సి, శ్రీబాలాజీ హాస్పిటల్స్, భారత్ ఎన్క్లేవ్, శ్రీనివాస, గౌతమి, సీబీఐటీ విద్యా సంస్థలతోపాటు పెన్నానది వద్ద నిర్మించిన మూడు కళ్యాణమండపాలు ఉన్నాయి. -
బొమ్మరిల్లు కార్యాలయాలపై దాడులు
నమ్మించి డిపాజిట్‌దారులకు కుచ్చుటోపీ పెట్టిన బొమ్మరిల్లు సంస్థ కార్యాలయూలపై పోలీస్, రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయూల్లోని రికార్డులను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు అన్నికోణాల్లోను దర్యాప్తు ముమ్మరం చేశారు. నందిగాం, న్యూస్‌లైన్: మండలంలోని బొమ్మరిల్లు సంస్థ ఆస్తులు, రికార్డులను విజలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ ఇసాక్మహమ్మద్ నేతృత్వంలోని బృందం స్వాధీనం చేసుకుంది. కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకొని సుమారు 19 ఎకరాల్లో బొమ్మరిల్లు సంస్థ వేసిన వెంచర్లను తనిఖీ చేసింది. తహశీల్దార్ పిడుగు వెంకటేశ్వర రావుతో చర్చించి పలు రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఇసాక్మహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల మేరకు సంస్థ నడిపి సుమారు రూ.100 కోట్లను ప్రజల నుంచి సేకరించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. జిల్లాలో కంచిలి మండలం డోలగోవిం దపు రం, సీతంపేట మండలం పులిపుట్టి గ్రామాల సమీపంలో కూడా సంస్థ ఆస్తులున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ ఆదే శాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఆయన వెంట సీఐలు ఇమాన్యువల్రాజ్, కొండా ఉన్నారు. ఆందోళనలో స్థల కొనుగోలుదారులు కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకుని సర్వే నెంబరు 174లో సుమారు 19.86 ఎకరాల్లో అన్నిహం గులతో వెంచర్లు వేశారు. సుమారు 400 ఇళ్ల స్థలాలుగా విభజించి ఒక్కోదానిని రూ. 1.20 లక్షల చొప్పున అమ్మకం చేశారు. పంట పొలాలను వాణిజ్య భూములుగా మార్చేందుకు వీరు రెవెన్యూ శాఖకు రూ. 4.90 లక్షలు చలానా రూపంలో చెల్లించినట్లు తెలిసింది. స్థలాలను కవిటిఅగ్రహారం గ్రామస్తులతో పాటు వజ్రపుకొత్తూరు మం డలం మంచినీళ్లపేట, కంబాలరాయడుపేట, అమలపాడు, పూండి, బెండి తదితర ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేశారు. వీరంతా లబోదిబోమంటున్నారు. కార్యాలయం సీజ్ టెక్కలి: టెక్కలి బొమ్మరిల్లు కార్యాలయంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సీఐ ఎమ్.రాంబాబు, ఎస్ఐ జి.శంక రరావుల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు సిబ్బంది సమక్షంలో కార్యాలయం తాళాలను పగులగొట్టారు. బొమ్మరిల్లు టెక్కలి బ్రాంచ్‌లో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ పి.కృష్ణారావు, డేటా ఆపరేటర్లు త్రివేణి, రాము తదితరుల నుంచి కార్యాల యంలో కీలకమైన రికార్డులను సేకరించారు. సుమారు 35 రికార్డులు, 6 కంప్యూటర్ సీపీయూలు, 5 మోనిటర్లను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేశారు. అధికారుల సోదాల్లో కేవలం 527 రూపాయల మిగులు నగదు దొరికింది. బ్రాంచి పరిధిలో సుమారు 13,316 మంది ఖాతాదారులు సుమారు రూ.5 కోట్లను పొదుపు చేసినట్టు ప్రాథమిక సమాచారం. సంస్థ నుంచి సుమారు 21 లక్షలు నష్టపోరుునట్టు ఇప్పటివరకు 25 ఫిర్యాదులు అందాయని ఎస్ఐ శంకరరావు తెలిపారు. కేంద్రమంత్రిని కలసిన బాధితులు బొమ్మరిల్లు సంస్థ నుంచి మోసపోయిన ఖాతాదారులు, ఏజంట్లు టెక్కలిలో గల కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని తన నివాసంలో కలసి గోడు వినిపించారు. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. లబోదిబోమంటున్న బాధితులు నరసన్నపేట: బొమ్మరిల్లు సంస్థ బోర్డు తిరగేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నరసన్నపేట పరిధిలో సుమారు *3 కోట్లకు పైగా ప్రజలు డిపాజిట్ చేశారు. వీరంతా స్థానిక కార్యాలయం వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవచూపి బాధితులకు నరర్యాయం చేయూలని కోరారు. వెలుగు చూస్తున్న అక్రమాలు జలుమూరు: మండలంలోని జోనంకి, సుబ్రమణ్యపురం, హుస్సేన్ పురం, తమ్మయ్యపేట, తమ్మయ్యపేట కాలనీ, జలుమూరు, కొమనాపల్లి, శ్రీముఖలింగం, అల్లాడతో పాటు మరో ఐదు గ్రామాలకు చెందిన ఖాతాదారులు రూ.1.50 కోట్లకు పైగా బొమ్మరిల్లు సంస్థలో డిపాజిట్ చేశారు. ఆయా గ్రామాల్లో సుమారు 50 మంది ఏజెంట్ల ద్వారా సొమ్ము పొదుపు చేశామని బాధితులు కె.మోహన రావు, బి.విశ్వనాథం, బి.అప్పన్న, టి.వెంకటరత్నం, బి.కనకమ్మలు తెలిపారు. అందర మూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ.12 లక్షలు డిపాజిట్ చేయి ంచా బొమ్మరిల్లు కార్యాలయం ఏర్పాటు చేసిన తరువాత ఏజెంట్‌గా చేరి ప్రజల నుంచి రూ.12 లక్షలు డిపాజిట్ చేరుుంచాను. డిపాజిట్ దారులందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. సంస్థ ఆస్తులు సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయూలి. -మెండ చిన్నికృష్ణ, ఏజెంట్, శివనగర్‌కాలనీ రోజుకు రూ.50 చొప్పున చెల్లించా పొదుపు చేయడం ద్వారా కాస్తంత డబ్బు లు కనిపిస్తాయన్న ఆశతో కూలిచేసిన డబ్బులు రోజుకు *50 చొప్పున చెల్లించా. గత 8 నెలలుగా చెల్లిస్తున్నాను. డబ్బులు వస్తాయన్న సమయంలో సంస్థ ఎత్తేశారు. డబ్బులు ఎవరిని అడగాలో తెలియడంలేదు. -రేగిపాడు విజయ, బాధితురాలు, నరసన్నపేట 16న తెరుస్తామన్నారు.. పండుగ ముందు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసర్రావును కలిశాం. పండుగ సెలవులు అనంతరం 16న కార్యాలయం తెరుస్తామని మరి కనిపించలేదు. ఫోన్లు చేస్తున్నా పనిచేయడం లేదు. -అల్లు సింహాచలం, బాధితుడు, నక్కవీధి -
పేటలో విజిలెన్స్ దాడులు
భానుపురి, న్యూస్‌లైన్ : సూర్యాపేట పట్టణంలో సోమవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణ సమీపంలోని జీవీవీ గార్డెన్స్ ఎదురుగా గల కొల్లూరు వీరస్వామి నివాసంలో కర్నాటి నాగరాజు అనే వ్యాపారి గ్రామాల్లోని ప్రజల వద్ద కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ చేసిన 176 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అదే విధంగా పట్టణంలోని పలు చోట్ల రేషన్‌బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసిన మరో నాలుగు దుకాణాల్లో 179 క్వింటాళ్లు సీజ్ చేశారు. వారిపై 6ఏ కింద కేసులు నమోదు చేసి సీజ్ చేసిన బియ్యాన్ని ట్రేడ్ లెసైన్స్ కలిగిన వ్యాపారులకు అప్పగించారు. అదే విధంగా పట్టణంలోని రైతు బజార్ సమీపంలో గల మానస ఆయిల్ ఏజెన్సీలో అధికారులు తనిఖీ చేశారు. రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లారు. ఏజెన్సీలో 82వేల లీటర్ల వివిధ రకాల ఆయిల్ నిల్వ ఉంది. మూడేళ్లుగా ఏజెన్సీ వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను పరిశీలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణ చేయడానికి కొన్ని రోజులు పడుతుందని, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఏజెన్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు మోహన్‌రావు, స్వామి, డీఈ రవీందర్, డీసీటీవో లెనిన్, ఏవో శ్రీధర్‌రెడ్డి , సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ అధికారులు మహమూద్‌అలీ, ఆర్ఐలు శ్రీకాంత్, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు. -
గుట్కా గుట్టు.. రట్టు
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో జీరో వ్యాపారులు.. టమాటాల మాటున నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న లారీ విజి‘లెన్స్’కు చిక్కింది.అందులో సుమారు 200 బస్తాల గుట్కా పాకెట్లు ఉండడం చూసి అధికారులు విస్మయం చెందారు. పట్టుబడిందెలాగంటే... అనంతపురం నుంచి బెంగళూరుకు టమాటా లోడుతో వెళ్లిన ఏపీ 02- ఎక్స్ 6551 నంబర్ గల లారీ అక్కడ టమాటాల లోడును దింపిన అనంతరం తిరుగు ప్రయాణంలో టమాటాల రవాణాకు ఉపయోగించే ప్లాస్టిక్ పెట్టె(ట్రేస్)ల మాటున గుట్కా ప్యాకెట్ల బస్తాలతో కడపకు ప్రయాణమైంది. ఈ విషయం పసిగట్టిన కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం అప్రమత్తమైంది. లారీ కడప వైపునకు వస్తున్నట్లు అందిన సమాచారంతో కడప మరియాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మాటువేశారు. సరిగ్గా అదే సమయానికి లారీ రాగానే తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రామకృష్ణ తెలి పారు. అందులో 200 బస్తాలు ఉండగా, వాటి విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. అయితే బయటి మార్కెట్లో వాటిని విక్రయిస్తే రూ.70 లక్షలు వస్తుందని వెల్లడించారు. లారీని పాత రిమ్స్‌కు తరలించి, స్వాధీనం చేసుకున్న గుట్కా బస్తాలను భద్రపరచినట్లు చెప్పారు. ధర్మవరానికి చెందిన లారీ డ్రైవర్ చరణ్, క్లీనర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లారీ ధర్మవరం ప్రాంతానిదే.. గుట్కా బస్తాలను రవాణా చేస్తు విజి‘లెన్స్’కు చిక్కిన లారీ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముకుందారెడ్డికి చెందినదిగా డ్రైవర్ విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కాగా అక్రమ రవాణా ఎలా జరుగుతోందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ పుల్లయ్య, ఏఓ శశిధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నూతన పంథాలో బియ్యం మాఫియా
ఏటీఅగ్రహారం (గుంటూరు)/ చేబ్రోలు, న్యూస్‌లైన్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవా ణా మాఫియాకు సింహస్వప్నంగా మారారు. నూతన సంవత్సరంలో నూతన పంథా ఎన్నుకున్న బియ్యం మాఫీకు మళ్లీ చుక్కెదురైంది. రెండు మినీ పాలలారీల్లో మొత్తం రూ.1.60 లక్షలు విలువ చేసే 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ గురువారం పట్టుబడ్డారు. లారీడ్రైవర్లను అరెస్టుచేసి ఆరుగురిపై 6ఏ కేసు నమోదు చేసి లారీలను, బియ్యాన్ని సీజ్‌చేశారు. పట్టుబడిందిలా... ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన షేక్ బాషా, కర్లపాలెంకు చెందిన షేక్ హబీబ్, పొన్నూరుకు చెందిన బర్నబాస్లు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటారు. బుధవారం రాత్రి చీరాల, పొన్నూరు ప్రాంతాల్లో సేకరించిన 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను రెండు మినీ పాలవాహనాల్లో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, చేబ్రోలు రెవెన్యూ అధికారులు కలిసి నాడాకోడూరు వద్ద నిఘా ఉంచారు. అటుగా వస్తున్న రెండు మినీ పాలవాహనాలను తనిఖీచేయగా, రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి వాటిని గుం టూరు విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. మినీ లారీ డ్రైవర్లు పఠాన్నాగూర్ ఖాన్, పఠాన్ కరీముల్లాలను అరెస్టుచేశారు. వీరితోపాటు షేక్ బాషా, షేక్ హబీబ్, బర్నబాస్, లారీ యజమాని షేక్ ఖాదర్‌వలిలపై 6ఏ కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో హాజరు పరిచారు. చాకచక్యంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సీఐ కె.వంశీధర్, హెడ్‌కానిస్టేబుల్ రాంబాబులను విజిలెన్స్ ఎస్పీ అభినందించారు. ఎలా వచ్చినా వదలం.. బియ్యం అక్రమ రవాణా మాఫియా ఏ ముసుగులో వచ్చినా పట్టేస్తామని విజి లెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకరులకు తెలిపారు. గూడ్స్ ఆటోలు, గూడ్స్ మినీ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇకపై నిఘాను ఉధృతం చేస్తామని వివరించారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్నా తెలియజేసి సహకరించాలని కోరారు.