నమ్మించి డిపాజిట్‌దారులకు కుచ్చుటోపీ పెట్టిన బొమ్మరిల్లు సంస్థ కార్యాలయూలపై పోలీస్, రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయూల్లోని రికార్డులను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు అన్నికోణాల్లోను దర్యాప్తు ముమ్మరం చేశారు.
నందిగాం, న్యూస్‌లైన్: మండలంలోని బొమ్మరిల్లు సంస్థ ఆస్తులు, రికార్డులను విజలెన్స్ ఎండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీపీ ఇసాక్‌మహమ్మద్ నేతృత్వంలోని బృందం స్వాధీనం చేసుకుంది. కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకొని సుమారు 19 ఎకరాల్లో బొమ్మరిల్లు సంస్థ వేసిన వెంచర్లను తనిఖీ చేసింది. తహశీల్దార్ పిడుగు వెంకటేశ్వర రావుతో చర్చించి పలు రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఇసాక్‌మహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌బీఐ నిబంధనల మేరకు సంస్థ నడిపి సుమారు రూ.100 కోట్లను ప్రజల నుంచి సేకరించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. జిల్లాలో కంచిలి మండలం డోలగోవిం దపు రం, సీతంపేట మండలం పులిపుట్టి గ్రామాల సమీపంలో కూడా సంస్థ ఆస్తులున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ ఆదే శాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఆయన వెంట సీఐలు ఇమాన్యువల్‌రాజ్, కొండా ఉన్నారు.
ఆందోళనలో స్థల కొనుగోలుదారులు
కవిటిఅగ్రహారం సమీపంలోని బెండికొండకు ఆనుకుని సర్వే నెంబరు 174లో సుమారు 19.86 ఎకరాల్లో అన్నిహం గులతో వెంచర్లు వేశారు. సుమారు 400 ఇళ్ల స్థలాలుగా విభజించి ఒక్కోదానిని రూ. 1.20 లక్షల చొప్పున అమ్మకం చేశారు. పంట పొలాలను వాణిజ్య భూములుగా మార్చేందుకు వీరు రెవెన్యూ శాఖకు రూ. 4.90 లక్షలు చలానా రూపంలో చెల్లించినట్లు తెలిసింది. స్థలాలను కవిటిఅగ్రహారం గ్రామస్తులతో పాటు వజ్రపుకొత్తూరు మం డలం మంచినీళ్లపేట, కంబాలరాయడుపేట, అమలపాడు, పూండి, బెండి తదితర ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేశారు. వీరంతా లబోదిబోమంటున్నారు.
కార్యాలయం సీజ్
టెక్కలి: టెక్కలి బొమ్మరిల్లు కార్యాలయంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సీఐ ఎమ్.రాంబాబు, ఎస్‌ఐ జి.శంక రరావుల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు సిబ్బంది సమక్షంలో కార్యాలయం తాళాలను పగులగొట్టారు. బొమ్మరిల్లు టెక్కలి బ్రాంచ్‌లో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ పి.కృష్ణారావు, డేటా ఆపరేటర్లు త్రివేణి, రాము తదితరుల నుంచి కార్యాల యంలో కీలకమైన రికార్డులను సేకరించారు. సుమారు 35 రికార్డులు, 6 కంప్యూటర్ సీపీయూలు, 5 మోనిటర్‌లను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేశారు. అధికారుల సోదాల్లో కేవలం 527 రూపాయల మిగులు నగదు దొరికింది. బ్రాంచి పరిధిలో సుమారు 13,316 మంది ఖాతాదారులు సుమారు రూ.5 కోట్లను పొదుపు చేసినట్టు ప్రాథమిక సమాచారం. సంస్థ నుంచి సుమారు 21 లక్షలు నష్టపోరుునట్టు ఇప్పటివరకు 25 ఫిర్యాదులు అందాయని ఎస్‌ఐ శంకరరావు తెలిపారు.
కేంద్రమంత్రిని కలసిన బాధితులు
బొమ్మరిల్లు సంస్థ నుంచి మోసపోయిన ఖాతాదారులు, ఏజంట్లు టెక్కలిలో గల కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని తన నివాసంలో కలసి గోడు వినిపించారు. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
లబోదిబోమంటున్న బాధితులు
నరసన్నపేట: బొమ్మరిల్లు సంస్థ బోర్డు తిరగేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నరసన్నపేట పరిధిలో సుమారు *3 కోట్లకు పైగా ప్రజలు డిపాజిట్ చేశారు. వీరంతా స్థానిక కార్యాలయం వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవచూపి బాధితులకు నరర్యాయం చేయూలని కోరారు.
వెలుగు చూస్తున్న అక్రమాలు
జలుమూరు: మండలంలోని జోనంకి, సుబ్రమణ్యపురం, హుస్సేన్ పురం, తమ్మయ్యపేట, తమ్మయ్యపేట కాలనీ, జలుమూరు, కొమనాపల్లి, శ్రీముఖలింగం, అల్లాడతో పాటు మరో ఐదు గ్రామాలకు చెందిన ఖాతాదారులు రూ.1.50 కోట్లకు పైగా బొమ్మరిల్లు సంస్థలో డిపాజిట్ చేశారు. ఆయా గ్రామాల్లో సుమారు 50 మంది ఏజెంట్ల ద్వారా సొమ్ము పొదుపు చేశామని బాధితులు కె.మోహన రావు, బి.విశ్వనాథం, బి.అప్పన్న, టి.వెంకటరత్నం, బి.కనకమ్మలు తెలిపారు. అందర మూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
రూ.12 లక్షలు డిపాజిట్ చేయి ంచా
బొమ్మరిల్లు కార్యాలయం ఏర్పాటు చేసిన తరువాత ఏజెంట్‌గా చేరి ప్రజల నుంచి రూ.12 లక్షలు డిపాజిట్ చేరుుంచాను. డిపాజిట్ దారులందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. సంస్థ ఆస్తులు సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయూలి.
-మెండ చిన్నికృష్ణ, ఏజెంట్, శివనగర్‌కాలనీ
రోజుకు రూ.50 చొప్పున చెల్లించా
పొదుపు చేయడం ద్వారా కాస్తంత డబ్బు లు కనిపిస్తాయన్న ఆశతో కూలిచేసిన డబ్బులు రోజుకు *50 చొప్పున చెల్లించా. గత 8 నెలలుగా చెల్లిస్తున్నాను. డబ్బులు వస్తాయన్న సమయంలో సంస్థ ఎత్తేశారు. డబ్బులు ఎవరిని అడగాలో తెలియడంలేదు.
-రేగిపాడు విజయ, బాధితురాలు, నరసన్నపేట
16న తెరుస్తామన్నారు..
పండుగ ముందు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసర్‌రావును కలిశాం. పండుగ సెలవులు అనంతరం 16న కార్యాలయం తెరుస్తామని మరి కనిపించలేదు. ఫోన్‌లు చేస్తున్నా పనిచేయడం లేదు.
-అల్లు సింహాచలం, బాధితుడు, నక్కవీధి
బొమ్మరిల్లు కార్యాలయాలపై దాడులు
Published Sat, Jan 25 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement