సాక్షి, విజయవాడ : చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స‍్పష్టం చేశారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. (ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)
మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన‍్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు. (చదవండి: వేలానికి సుజనా చౌదరి ఆస్తులు)
Comments
Please login to add a commentAdd a comment