gummanuru Jayaram
-
చంద్రబాబూ..ఇంత మోసమా!: అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు.గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. -
మీడియాపై చిందులేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
-
మీడియాపై నోరుపారేసుకున్న జయరాం
అనంతపురం, సాక్షి: జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు(Guntakal) టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. ‘‘జర్నలిస్టులను(Journalists) రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చౌదరి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా వార్తలు రాస్తే ఖబడ్దార్.. తాట తీస్తా. నేను అన్నీ చేసి వచ్చినోడ్ని.. ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ ఓ కార్యక్రమంలో జర్నలిస్టులపై గుమ్మనూరు హెచ్చరికలు జారీ చేశారు.జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయ్!జర్నలిస్టులపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా?. ఆయన ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు అని అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
గుమ్మనూరు జయరాం చెంప చెళ్లుమనిపించిన YSRCP నేతలు
-
గుమ్మనూరు జయరాంకు ఎమ్మెల్యే విరుపాక్షి కౌంటర్
-
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్‌తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్‌లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
ఎల్లో బ్యాచ్ వారి వాషింగ్ మెషిన్
మీకు గుర్తుందా! కొద్ది నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్ కాని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ను రౌడీ మంత్రి, బెంజ్ కారు మంత్రి అని, జూదం ఆడించే వాడని, అవినీతి పరుడని, భూ కబ్జాదారు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్ అయితే తన ఎర్రబుక్ లో గుమ్మునూరు జయరాం పేరు ఎక్కించారు. జయరాంకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడానికి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కొన్నాళ్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు,లోకేష్ లతో ఏమి బేరమాడుకున్నారో కాని , ఆయన సడన్‌గా టీడీపీలో చేరిపోయారు. అంతే వెంటనే ఆయన పునీతుడు అయిపోయాడు. పరిశుద్దాత్మ అయిపోయాడు. చంద్రబాబే కాదు..ఈనాడు , ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు గుమ్మునూరు జయరాం మంత్రిగా ఉన్నంతకాలం ఎన్ని వ్యతిరేక వార్తలు రాశాయో లెక్కలేదు. జయరాం అంటే ఒక సంఘ వ్యతిరేక శక్తి అన్నంతగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఆయన టీడీపీ అభ్యర్ది అయ్యారు.రామోజీరావు, రాదాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా సైలెంట్ అయిపోయారు. జయరాం ఒక ఆదర్శవాదిని చూస్తున్నారు. ఒక పెద్ద నేతను కనుగొన్నారు. దాంతో గుంతకల్ శాసనసభ నియోజకవర్గానికి జయరామ్‌ను టీడీపీ అభ్యర్దిగా ప్రకటించారు. జయరాం బాగా సంపాదించారని వీరు ఇంతకుముందు ప్రచారం చేశారు కదా!బహుశా అందులో ఏమైనా వాటా చంద్రబాబుతో పాటు,రామోజీ,రాదాకృష్ణ తదితరులకు ఏమైనా పంచారేమో తెలియలేదు. జయరాం వంటి రౌడీకి టిక్కెట్ ఎందుకు ఇస్తున్నారని వీరు రాయలేదు! జయరాం చేరికపై గుంతకల్‌లో ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన జితేందర్ గౌడ్ వర్గం ఆఫీస్ వద్ద రచ్చ చేసి చంద్రబాబు ఫోటోతో సహా ఆఫీస్ లో కరపత్రాలు మొదలైనవాటిని రోడ్డుపై పోసి తగులపెట్టారు అది వేరే విషయం. మరో అభ్యర్ధిని చూద్దాం. డిల్లీలో ఆప్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ లో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయి ,తదుపరి అప్రూవర్ గా మారి జైలు నుంచి బయటకు వచ్చారు. శ్రీనివాసులురెడ్డి కూడా ఈ కేసులో పలుమార్లు విచారణకు హాజరయ్యారు.ఆ రోజుల్లో టీడీపీ ఈయనపై విమర్శలు చేసేది. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంతా రాఘవ అరెస్టుపైన,మాగుంట ఈడి కార్యాలయానికి వెళ్లడంపైన మినిట్ టు మినిట్ ప్రాతిపదికన వ్యతిరేక కధనాలు ఇచ్చాయి. ఈ స్కామ్ నేపధ్యంలో మాగుంట కు టిక్కెట్ ఇవ్వరాదని జగన్ భావించారు. ఒకవేళ వైఎస్సార్సీపీ ఇచ్చి ఉంటే ఈపాటికి చంద్రబాబు కొండెక్కి కూసేవారు. ఎల్లో మీడియాకు అయితే కోతికి కొబ్బరి కాయ దొరికినట్లయ్యేది. కాని మాగుంట,ఆయన కుమారుడు ఇద్దరూ తెలుగుదేశంలో చేరారు. అంతే!వారు పవిత్రులయ్యారు. ఎల్లో మీడియా నోరు మూసేసింది.ఇప్పుడు అదే మాగుంట శ్రీనివాసులురెడ్డికి టీడీపీ ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చేసింది. ఒకవైపు బీజేపీ ఈ స్కామ్ పై పలు ఆరోపణలు చేస్తోంది. అయినా వీరికి టీడీపీ వచ్చిందంటే ఏమి అనుకోవాలి? నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్దిది మరీ చిత్రమైన స్టోరీ.వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైఎస్సార్సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.ఈ ఎన్నికలలో ఆయనను నెల్లూరు నుంచి పోటీచేయాలని జగన్ కోరారు. ఆయన కూడా సిద్దం అయ్యారు. కొన్ని విషయాలలో అబిప్రాయ బేధాలు వచ్చాయి. ఆయన తన భార్యకు కూడా టిక్కెట్ అడిగితే జగన్ ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగారు. వెంటనే టీడీపీ టచ్ లోకి వెళ్లారు. ఆయనను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడ ఆయనకు టిక్కెట్ ఇవ్వడంలో ప్రాతిపదిక ఏమిటంటే ఆర్దికంగా స్థితిమంతుడు కావడమే. ట్విస్ట్ ఏమిటంటే వేమిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఆయనపై ఆంధ్రజ్యోతి ఎంత దారుణమైన కధనాలు ఇచ్చిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంద్రజ్యోతి రాయడం అంటే టీడీపీ రాయించినట్లే కదా!అదేమిటో తెలుసా! వేమిరెడ్డి ఆ మద్య ఎప్పుడో మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో సుప్రింకోర్టు జడ్జి ఇంటిలో జరిగిన పెళ్లికి వెళ్లారట.అక్కడకు ఉత్త చేతులతో కాకుండా, రెండు కోట్ల విలువైన వజ్రాల వాచ్ తీసుకు వెళ్లారని రాసేశారు. దానిని ఆ జడ్జిగారు తీసుకోలేదట.కాని ఇదంతా జగన్ తరపునే వెళ్లారని కూడా ఈ పత్రిక దుర్మార్గంగా ప్రచారం చేసింది. అది నిజం కాదని వేమిరెడ్డి మొత్తుకున్నా ఆ పత్రిక మాత్రం ఒప్పుకోలేదు. దానిని టీడీపీ సోషల్ మీడియా కూడా విస్తారంగా ప్రచారం చేసి ఉంటుంది.సీన్ కట్ చేస్తే వేమిరెడ్డి తదుపరి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వేమిరెడ్డి దంపతులు ఇద్దరికి చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చేశారు. వేమిరెడ్డి నెల్లూరు లోక్ సభకు, ఆయన భార్య ప్రశాంతి కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని వజ్రాల వాచ్ లు చంద్రబాబుకు ఇచ్చి ఉండాలని ఎవరైనా అంటే దానికి సమాధానం ఉంటుందా?లేదా టిడిపికి ఏజెంట్ గా పనిచేసే ఆంధ్రజ్యోతి యజమానికి ఏమి ముట్టి ఉంటుంది? అంటే మనం ఏమి చెబుతాం. ఇప్పుడు వేమిరెడ్డి చాలా నీతిమంతుడు , నిజాయితీపరుడు అయిపోయాడు. వేమిరెడ్డిపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు ఆగిపోయాయి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే చంద్రబాబు ప్రతిదానిలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారు. ఆయనకు ఈనాడు, జ్యోతి భజన చేస్తుంటాయనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరమా?అంతేకాదు.బాపట్ల లోక్ సభ నియోజకవర్గానికి టీడీపీ టిక్కెట్ పొందిన మాజీ ఐపిఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం వ్యక్తే కాదు. పైగా తెలంగాణలో బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.ఆయన ఏమి ఇచ్చారో తెలియదు కాని టీడీపీ అభ్యర్ధి అయిపోయారు.ఇదే పని వైఎస్సార్సీపీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఎన్ని విమర్శలు చేసేవారో ఆలోచించండి. ఏలూరు లోక్ సభ స్థానానికి కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. అభ్యర్ధులను నియోజకవర్గాలు మార్చితే బదిలీలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై ప్రచారం చేసిన చంద్రబాబు ఎక్కడ నుంచి ఎక్కడకు తన అభ్యర్దిని తెచ్చిపెట్టారో గమనించండి.మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఈయన సీనియర్ నేత ,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడవుతారు. యనమల మరో కూతురు దివ్య కు తుని అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. చంద్రబాబు కుటుంబానికే కాకుండా యనమల వంటి కొద్ది మంది ప్యామిలీ ప్యాకేజీ లభించిందన్నమాట. దీనిపైనే బిజెపి నేతలు పరిపూర్ణానంద స్వామి,ఐవైఆర్ కృష్ణారావు వంటివారు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే బిజెపి కుటుంబ రాజకీయం చేసే పార్టీకి మద్దతు ఇస్తోందని వాపోయారు. బీజేపీ సీట్లలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే పోటీచేస్తున్నారని పరిపూర్ణానంద ద్వజమెత్తారు. చంద్రబాబు కుటుంబం నుంచి అరడజను మంది ఎలా పోటీచేస్తారని మండిపడ్డారు. నీతులు చెప్పేటందుకే కాని తమకు వర్తింప చేసుకోవడానికి కాదన్నది చంద్రబాబు ఫిలాసపీ. ఒరిజినల్ టీడీపీ నేతలు ఇప్పుడు నెత్తి,నోరు కొట్టుకున్నా ఉపయోగం ఏమి ఉంటుంది?మరికొన్నిటిని కూడా చూద్దాం. విశాఖ నార్త్ కు ప్రాతినిద్యం వహించిన గంటా శ్రీనివాసరావును మొదట చీపురుపల్లికి చంద్రబాబు బదిలీ చేశారు. ఆయన ససేమిరా అనడంతో చంద్రబాబే దిగివచ్చి ,గంటా ను భీమిలి బదిలీకి ఒప్పుకున్నారు.ఎచ్చెర్ల సీటును బీజేపీకి ఇవ్వడంతో అక్కడ నుంచి కళా వెంకటరావును చీపురుపల్లికి బదిలీ చేశారు. దీనిపై ఆయన తమ్ముడి కుమారుడు ,విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున వర్గం వారు భగ్గుమన్నారు. అనంతపురంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రభాకర చౌదరిని కాదని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే మరో వ్యక్తికి టిక్కెట్ టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో చౌదరి వర్గం అంతా పార్టీ కార్యాలయంలో విద్వంసానికి పాల్పడింది. ఇంకా చాలా గొడవలు టీడీపీలో జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ టిక్కెట్లపై పిచ్చి విమర్శలు చేస్తుంటారు.తాజాగా ఆయన ఒక పేదవాడికి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తే దానిని కూడా తప్పు పట్టారు. టిప్పర్ డ్రైవర్ కు శింగనమల టిక్కెట్ ఇచ్చారంటూ వైఎస్సార్సీపీని ఎద్దేవా చేశారు. దానికి జగన్ ధీటుగా సమాదానం ఇస్తూ, తాము పేదలకు టిక్కెట్లు ఇచ్చామని, చంద్రబాబు పెత్తందార్లకు, డబ్బు ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. మడక శిర లో కూడా జగన్ ఒక సామాన్య కార్యకర్తకు టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఉపాది హామీ కూలిగా కూడా ఉన్నారు.ఈ విషయాలను జగన్ చెప్పడంతో చంద్రబాబు నాలుక కరుచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.1978 లో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఐ లో చంద్రబాబుకు ఆర్ధికంగా సస్థోమత లేకపోయినా టిక్కెట్ లభించింది.తిరువూరు లో లారీ డ్రైవర్ కు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ టిక్కెట్ వచ్చింది. వారికే కాదు పలువురు సామాన్యులు టిక్కెట్లు పొందితే పేదలంతా ఓన్ చేసుకుని గెలిపించుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పుంగనూరు నుంచి ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ కు టిక్కెట్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఒక సామాన్య కార్యకర్త అయిన తన అబిమానికి ఎన్టీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు జగగన్ కూడా కొంతమంది సాధారణ కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి పేదల నాయకుడిగా ప్రజలలో నిలబడ్డారు. కాని చంద్రబాబు మాత్రం తాను ఆరంభం అయింది పేదరికంలోనే అయినా, ఇప్పుడు దానిని మర్చిపోయారు. తాను స్థితి మంతుడు అవడమే కాకుండా పేదలకు టిక్కెట్లు ఇస్తే ఎద్దేవ చేసే దశకు వెళ్లారు. అందుకే ప్రస్తుతం ఏపీలో పేదలకు ,పెత్తందార్లకు మధ్య పోటీ జరుగుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. పేదలు గెలుస్తారా? లేక పెత్తందార్లు నెగ్గుతారా? అన్నది జూన్ నాలుగున తేలిపోతుంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Guntakal: గుమ్మనూరుకి బొమ్మ చూపిస్తాం..!
చుక్కలు చూపుతామని సొంత పార్టీ నేతలే హెచ్చరించారు. రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసినా లొంగనంటున్నారు. తన మనస్తత్వం తెలిసిన ప్రజలు కూడా బహిరంగంగానే బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించిన నియోజకవర్గంలో అడుగు పెట్టకముందే గుమ్మనూరు జయరామ్‌కు అసమ్మతి స్వాగతం పలుకుతోంది. గుంతకల్లు: ఎడతెగని చర్చలు, అనేక సమాలోచనల అనంతరం గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ టికెట్ దక్కించుకున్న గుమ్మనూరు జయరామ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియారిటీ, పార్టీ విధేయతను పక్కన పెట్టి జయరామ్‌కు సీటు కట్టబెట్టడాన్ని తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారు. పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్‌తోపాటు వారి కుటుంబసభ్యులు, వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జయరామ్‌ను ఓడిస్తామని ఇప్పటికే బాహాటంగానే ప్రకటించారు. జయరామ్ విషయంలో తమ అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తపరిచినా చంద్రబాబు ఆయన వైపే మొగ్గు చూపడంపై జితేంద్రగౌడ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అయితే, చంద్రబాబుపై గౌరవంతో ఆయన నిర్ణయానికి తలవంచి సర్దుకుపోతాడా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దారికి రాని కేడర్.. మరోవైపు గుమ్మనూరు జయరామ్ శిబిరంలో ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు, ఆయన కుటుంబసభ్యులు కొన్ని రోజులుగా స్థానిక తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రకరకాల తాయిలాలతో కేడర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్నటిదాకా గుమ్మనూరు అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపిన తాము, ఆయన కోసం ఎలా పని చేస్తామని తెలుగుతమ్ముళ్లు చాలాచోట్ల తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోనూ భయం.. గుమ్మనూరు జయరామ్ అభ్యర్థిత్వం పట్ల స్థానిక ప్రజలు కూడా అసహనంగా ఉన్నారు. రౌడీయిజం, మాఫియాకు మారుపేరుగా చెప్పుకునే గుమ్మనూరు జయరామ్, ఆయన అనుచరులు.. ప్రశాంతమైన గుంతకల్లు నియోజకవర్గంలో ఎక్కడ అలజడులు రేపుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు జయరామ్ చరిత్ర తెలిసిన వారైతే మరింతగా హడలిపోతున్నారు. జయరామ్ పేకాట మాఫియా, భూ కబ్జాలు, ఆయన అనుచరుల ఆగడాలను తలుచుకుంటూ భయకంపితులవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు తమ్ముళ్లతో పాటు ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, కురుబ, యాదవ తదితర అనేక సామాజిక వర్గ నాయకులతో పాటు పట్టణ వ్యాపారులు ఏకంగా విలేకరుల సమావేశాలు పెట్టి జయరామ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకరించారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. గెలుపు ఎట్లా..? గుంతకల్లు నియోజకవర్గంలో అడుగుపెట్టకముందే సొంత కార్యకర్తలు, ప్రజల్లో జయరామ్ పూర్తి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఒకవేళ అడుగుపెట్టినా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం, జితేంద్రగౌడ్ వర్గం సహకారం పొందడం, జనంలోకి వెళ్లడం కత్తిమీద సాములా మారనుంది. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నా జయరామ్‌కే చంద్రబాబు టికెట్ కేటాయించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్లు చేతులు మారడంతోనే బాబు ఆయన వైపు మొగ్గు చూపారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
గుమ్మనూరు జయరాం ఒక నమ్మక ద్రోహి.
-
రాజకీయం.. గుమ్మం దాటింది!
‘ఏయ్ ఈరన్నా.. కూలోళ్లకు బువ్వ తెచ్చినా.. అందర్నీ పిల్సుకరా!! అబ్బా! యాలపొద్దయింది ఇంగా త్యాలేదని సూస్తుండాం ఉరుకుందప్ప మామ, అందరూ శానా ఆకలిమీదుండారు. అంతా రాండి! తిని పన్లోకి ఒంగి ఇంటికి పోదాం! బాగా ఎండకాస్తాంది! ‘ఏం మామా శానా పొద్దెక్కినాక తెచ్చినావ్! తొందరగా తెస్తావనుకుంటే! అన్నాడు ఈరన్న. లేదు ఈరన్నా.. విరూపాచ్చి దేవనకొండ మండలంలో పల్లెలకు పోతున్నాడంట! కార్లు శానా వచ్చినాయి.. మధ్యల ఇరుక్కపోయింటి!’ అన్నాడు ఉరుకుందప్ప! ‘ఎలచ్చన్లు కదా! అంతా తిరుగుతాంటారు! పైగా ఈయప్పకు కొత్తగా మన ఆలూరు సీటు ఇచ్చినారు! బాగా తిరుగుతున్నాడు!’ అవును మామ! ఈసారి మన ఎలచ్చన్లు ఎట్టుంటాయంటావ్! ‘గుమ్మనూరు జయరాం టీడీపీలో సేరినాడు కాదా! విరూపాచ్చికి ఇబ్బందిగా ఉంటాదంటావా?! ఆ జయరాంకే సీటు ఇచ్చింటే పోయుండె కదా!’ ‘అట్లాకాదు, బలేసెప్పినవ్! జయరాంకు ఎంపీ సీటు ఇచ్చినారు! ఆలూరు కాదు.. కర్నూలు జిల్లాకే ఎంపీ! పైగా ఖరాకండీగా గెల్చే సీటు. ఆయప్పే నాకొద్దని పోయి సెంద్రబాబు పార్టీలో సేరినాడు. జగన్ మోహన్‌రెడ్డి పొరపాటు ఏముంది!’ ‘మామా! ఆయప్పకు ఆలూరు ఎమ్మెల్యే సీటే కావాల్నంట? లేదంటే విరుపాచ్చిని మార్సాలని పట్టుబట్టినాడంట! పార్టీ కాదని సెప్పడంతో ఈయప్ప నా తడాఖా సూపిస్తా’ అని టీడీపీలో సేర్నాడంట’ వైఎస్సార్ పార్టీకి ఇబ్బంది ఉండదంటావా?’ ‘ ఒకటి సెప్తా సూడు ఈరన్నా! తడాఖా సూపిచ్చేటోడే అనుకుంటే! యిప్పటిదాకా ఆలూరులో టీడీపీకి లీడరే దొరకల్యా. డీఎస్పీని, వాళ్లను ఈళ్లను అడుక్కుంటున్నారు. గెల్సేటట్ల ఉంటే ఈయప్పా బాయోడే కదా! మరి సెంద్రబాబు ఎందుకు టిక్కెట్ ఇయ్యల్యా!’ ఈయప్ప ఆడ గెల్సడని అర్థమైంది! అందుకే మంత్రిగా పార్టీలో సేరినా, ఆలూరులో బాయోల్లకు యియ్యాలనుకున్యా ఆయప్పను గుంతకల్లుకు పొమ్మన్యాడు!’ ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎట్టా!’ ‘కాదు మామ! బాయోల్లకే ఇయ్యాలనుకున్యాక జయరాంకు ఇస్తే పొతాది కదా! మళ్లా విరూపాచ్చిని తీసురాడం, జయరాం అలిగి సెంద్రబాబు కాడికి పోవడం! ఇదంతా లేనిపోని తలకాయినొప్పి పెట్టుకున్నట్టుంది కదా వైసీపోళ్లు!’ ‘అన్నీ సూసినాకే, వివరం తెల్సుకున్యాకే విరూపాచ్చికి సీటు ఇచ్చింటారు! ఈయప్పకు ఏం అన్నాయం సేయలేదు కదా! ఎంపీ సీటు ఇచ్చినాక ఇంకేం కావాల! మరి కోడుమూరు ఎమ్మెల్యేను కాదని సతీశ్‌కు సీటిస్తే మర్నాడే సతీశ్‌ను గెలిపిస్తామని సుధాకర్ యిలేకర్లతో సెప్పలేదా. నేను పేపర్లో సూసినా! హఫీజ్‌ఖాన్‌ను కాదని ఐఏఎస్ ఆఫీసరుకు సీటిస్తే హఫీజే ఆయన్ను జనంలోకి తీసుకపోతలేడా. అంతెందుకే.. పెద్దాయప్ప ఎర్రకోట సెన్నకేశవరెడ్డిని కాదని తొలుత ఎంకటేశ్కు సీటిస్తే ఆయప్పను జనాల్లో తిప్పలేదా. అయినాంక రేణుకమ్మకు ఇత్తే ఆయమ్మను జనాల్లోకి తీసుకపోతుండ్లేదా! ఈళ్లందరికీ సీట్లే లేవు. అయినా జగన్‌రెడ్డి సెప్పినట్లు ఇంటలేరా!’ మరి ఈయప్పకు ఎంపీ సీటిచ్చినా నాకు పార్టీ అన్నాయం సేసిందని మొన్న సెంద్రబాబు దగ్గర సెప్తాడు!’ పైగా ఆయప్ప కాళ్లమీద పడి! జనాలకు ఈయన్నీ అర్థం కావా సెప్పు! ఆ.. ఇంకోటి నెల్లూరు అనిల్‌ను నర్సరావు పేట ఎంపీగా పంపినారు. జిల్లా దాటిచ్చినా ఆయన ఆటికి పోలేదా! జయరాం సెప్పినంత మాత్రాన, పార్టీ ఆయప్పకు అన్నాయం సేసిందని, అంత ఎర్రిగా నమ్మే వాళ్లు ఎవ్వరున్నార్లే! ఇంకోటి మొదట్నుంచి లీడర్లు జగన్‌రెడ్డికి అన్నాయం సేసినారు కానీ, జగన్‌రెడ్డి ఎవర్నీ అన్నాయం సేయలేదులే!’ ‘నిజమే మామ!’ జగన్‌రెడ్డి జయరాంను శానా బాగా సూసుకున్యాడు. కొడాలి నాని, బాలినేని సీనివాసరెడ్డి లాంటోళ్లను కూడా కాదని ఈయప్పను ఐదేళ్లు మంత్రిగా ఉంచిన్యాడు. ఈళ్ల తమ్మున్ని మాల మల్లేశ్వరస్వామి గుడికి సైర్మన్ గిరి ఇయ్యలేదా. ఈయప్పే తప్పు సేసిన్యాడు.. వైసీపోళ్ల తప్పేం లేదు! పార్టీ ఆయప్పకు అన్ని సేసినప్పుడు, పార్టీ కోసం ఆయప్ప కూడా ఎంపీగా పోటీ సేసుంటే బాగుంటలేకున్యా!’ ‘ఇంకోటి ఈరన్న! ఈ ఐదేండ్లల్ల ఈయప్ప మీద ఎన్ని నిందలొచ్చినాయో తెల్దా మనకి! గుమ్మనూరులో పత్తాలాడిస్తున్నప్పుడు పోలీసోళ్లు పోతే, వాళ్లను కొట్టలేదా! ఆ సిప్పగిరి నారాయణస్వామి ఇష్టానుసారం సేసినా సూసి సూడనట్లు ఉన్నిండ్రి! భూముల్దీ పంచాయితీ పెట్టుకునిండ్రి! కర్ణాటక మందు అమ్ముతున్నట్లు ఎన్ని పేపర్లల్ల సూడల్యా. సెంద్రబాబు మొన్న పత్తికొండ మీటింగ్‌కు వచ్చినాపొద్దు కూడా ఇయన్నీ సెప్పలేదా. ఇట్టాటివన్నీ ఇసారిచ్చుకునే జగన్ రెడ్డి సీటు మార్సింటాడు!’ ‘అవును మామ! మట్టసంగ జగన్‌రెడ్డితోనే ఉంటే ఎంపీ అయ్యేటోడు! ఇప్పుడు సీటు పంతానికి పోయి ఆలూరు సీటు పోగొట్టుకునె! జిల్లాను కాదని పక్క జిల్లాకు పోవాల్సొచ్చ. మొత్తం కర్నూలు జిల్లా రాజకీయాలతో సంబంధాలు లేకుండా పాయ!పైగా ఆ గుంతకల్లులో గెల్సే పరిస్థితే లేదని అంటున్యారు!’ ఇంక ఈయప్ప రాజకీయం అంతే!’ ‘అందుకే ఈరన్న! పెద్దోళ్లు సెప్తారు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు! ఆత్మహత్యలే ఉంటాయని! ఇప్పుడు జయరాం సేసిందీ అదే! జిల్లా ‘గుమ్మ’ం దాటి గుంతకల్లు పోతుండాడు.. ఆడ ఓడిపోతే ఇంటా, బయటా రెండుసోట్ల సెడినట్లే!’ ‘మామ! ఆయప్ప పోతాండేదీ! జిల్లా గుమ్మం దాటి కాదు.. నా కర్థమైంది, రాజకీయమే ఆయన గుమ్మం దాటిపోయింది!’ అనిపిస్తాండాది! ‘సూడు అందరూ అనుకుంటాండేది! జయరాం శానా తప్పు సేసినాడు! గుంతకల్లులో గెల్సలేడు! విరూపాచ్చి గెల్సినాక ఆలూరులో కూడా సోటుండదు!’ ఇంక ఆయప్ప రాజకీయ జీవితం అంతే!! ‘కాదు మీ మామ అల్లుళ్లు రాజకీయాలు మాట్లాడుకోవడమేనా! బువ్వ పెట్టేదేమన్నా ఉందా! బువ్వ పెడితే మిగిలిన మిరపకాయలు కోసి ఇంటికి పోదాం! ఎండ సావదొబ్బుతుంది!’ ‘ఇదో లచ్చిమక్క మోటరు కాడికి పోయి బిందెలో నీళ్లు తీసుకొని రాపో..!!’ సాక్షి ప్రతినిధి, కర్నూలు -
ప్రకటించకముందే ఓవరాక్షన్ ఎందుకు?
గుంతకల్లు: తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ప్రకటించక ముందే ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నారని గుమ్మనూరు నారాయణకు ఆ పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ఆర్.పవన్‌కుమార్ గౌడ్ హితవు చెప్పారు. ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం గుంతకల్లులో టీడీపీ కార్యాలయం ప్రారంభిస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన పవన్‌కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీకి కొన్ని పద్ధతులు ఉన్నాయని, పరిధి దాటి ప్రవర్తించడం మంచిది కాదని హెచ్చరించారు. పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఎవరికని ప్రకటించకముందే సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మీకు అంత ఉత్సాహంగా ఉంటే ఆలూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విరూపాక్షి సవాల్ విసిరారు కదా.. అక్కడ పోటీ చేయాలని హితవు పలికారు. లేదా గుంతకల్లు అభ్యర్థిగా మీ అన్న గుమ్మనూరు జయరాం పేరును ప్రకటించినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. అంతేకానీ సొంత నిర్ణయాలు తీసుకుంటే గుంతకల్లులో నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పార్టీ పెద్దలు కూడా ఇలాంటి చర్యలకు ఫుల్స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ హనుమంతు, నాయకులు కేశవ తదితరులు పాల్గొన్నారు. -
తులసి వనంలో గంజాయి మొక్క లాంటోడివి గుమ్మునూరు జయరాం పై ఫైర్
-
నిన్నటి దొంగ నేడు ముత్యమా?
గుంతకల్లు: ‘నిన్నటి వరకూ గుమ్మనూరు జయరాంను బాబు బండబూతులు తిట్టారు. ఇప్పుడు టీడీపీలో చేరగానే అదే జయరాం ముత్యమైపోతాడా? అప్పుడు జయరాం దొంగ అని అన్నారు. ఇప్పుడు మంచి వాడయ్యాడా?’ అని అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు కర్నూలు వెళ్లినప్పుడల్లా పేకాట మంత్రి అని, బెంజ్ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవారని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారని, పసుపు కండువా కప్పుకోగానే పునీతుడయ్యారా అంటూ ప్రశ్నించారు. అప్పుడాయన అవినీతి చేసి ఉంటే టీడీపీలోకి రాగానే ఆ పాపాలన్నీ ప్రక్షాళన అయినట్టని బాబు భావిస్తున్నారా అని నిలదీశారు. రెడ్‌బుక్‌లో పేరు తొలగిస్తారా? లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆలూరు వెళ్లినప్పుడు ఇక్కడి పేకాట మంత్రి పేరు రెడ్‌బుక్‌లో రాసుకున్నా అని, అధికారంలోకి వచ్చాక ఆయన పని చెబుతా అంటూ గుమ్మనూరును ఉద్దేశించి అన్నారని చెప్పారు. జయరాం ఇప్పుడు టీడీపీలోకి వచ్చినందున, ఆయన పేరు రెడ్ బుక్‌లో నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. ఈనాడులో గుమ్మనూరు పై కథనం రాశారని, ఇప్పుడు బెంజ్ కారులో గుమ్మంలోకి అవినీతిని తెచ్చుకున్నామని రాయగలరా అని నిలదీశారు. పేకాట జయరాం మాకొద్దంటూ టీడీపీ క్యాడర్ నిరసన గుంతకల్లు: పేకాట మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు టికెట్ కేటాయిస్తే డిపాజిట్లు కూడా దక్కనివ్వబోమని టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. అసలు జయరాంకు గుంతకల్లుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులోని టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేశారు. పేకాట మాజీ మంత్రి మనకు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, అరాచకాలు చేసే జయరాంతో అది సాధ్యం కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, జయరాంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆలూరులో చెత్త (గుమ్మనూరు జయరాం) ఇక్కడ బంగారం అవుతుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. నారా లోకేశ్‌ను దూషించిన గుమ్మనూరు సోదరులను పార్టీలోకి చేర్చుకోవడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు సీటును ఈ అరాచక వ్యక్తికి ఇస్తే పేకాట క్లబ్బులు, నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. జితేంద్రగౌడ్‌ను కాదని జయరామ్‌కు టికెట్ ఇస్తే డిపాజిట్టు కూడా రాకుండా ఓడిస్తామని శపథం చేశారు. -
జయరాం రాజీనామాపై విజయ సాయి రెడ్డి కామెంట్స్
-
టీడీపీలో ఎంతమంది చేరిన సింహం సింగల్ గానే వస్తుంది
-
గుమ్మనూరు జయరాం రాజీనామాపై కర్నూలు మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
గుమ్మనూరు జయరాం రాజీనామాపై కొమ్మినేని రియాక్షన్
-
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
దళితులను పట్టించుకోని దుర్మార్గుడు చంద్రబాబు
-
పవన్,చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గుమ్మనూరు జయరామ్
-
బడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచారు..
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అందుకే ఈ వర్గాలకు అన్ని పథకాలు, పదవుల్లో పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ఒక వరమని అన్నారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంతోపాటు ఓ మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారని కొనియాడారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీల సత్తా చాటుదాం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సామాజిక సాధికారతకు కృషి చేసి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్‌కు మద్దతిచ్చి బీసీల సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్ పదవులు కట్టబెట్టి గుర్తింపు తెచ్చారన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలకు సభ్యత్వం కల్పించారన్నారు. జగనన్న చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. చంద్రబాబు అండ్ కో అనేక కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘కులగణన’ సాహసోపేత నిర్ణయం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేత నిర్ణయమన్నారు. కులగణన పూర్తయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రస్తుతం కల్పించిన ప్రాధాన్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. బీసీలకు స్వర్ణయుగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి సీఎం వైఎస్ జగన్ అవిరళ కృషి చేస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు.మంత్రి వర్గం, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రతి ఇంటికీ పెద్ద కుమారుడిలా పింఛన్, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో పాటు ఇంటి స్థలం ఉచితంగా ఇచ్చారని, ఇంటి నిర్మాణానికి కూడా తోడ్పడుతున్నారని వివరించారు. జగన్ పాలన బీసీలకు స్వర్ణ యుగమని అన్నారు. మరోసారి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ ఉందన్నారు. -
మంత్రి గుమ్మనూరు జయరాంకు మాతృవియోగం
సాక్షి, కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆలూరులో ఆయన మాతృమూర్తి శారదమ్మ(79) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గతంలో 'గుమ్మనూరు' గ్రామ సర్పంచ్ గా ఆమె సేవలందించారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం, వారి స్వగ్రామమైన గుమ్మనూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుమ్మనూరు జయరాం కుటుంబం శోక సంద్రంలో మునిగింది. చదవండి: మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని.. -
చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది
-
దివ్యాంగులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని వచ్చేనెల 8న విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సంకల్పించినట్లు రాష్ట్ర బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈ సమ్మేళనానికి సీఎం వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానిస్తామని వారు తెలిపారు. సీఎం జగన్ మూడున్నరేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తుచేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. తమది బీసీల ప్రభుత్వమని, బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి మాటను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని నేతలు తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఆయా కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని వివరించారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం బీసీలకే ఇచ్చారని గుర్తుచేశారు. అందువల్ల బీసీలంతా క్విట్ బాబూ... అంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, పార్థసారథి, హాజరయ్యారు. వారు మీడియాతో మాట్లాడారు. బీసీల కల ఇన్నాళ్లకు సాకారం పాలనలో బడుగులకు భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోంది. కానీ, ఇన్నేళ్లకు సీఎం జగన్ సాకారం చేశారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ సూర్తితో రాష్ట్రంలో పాలన సాగుతోంది. చంద్రబాబు ఆటలు ఇక ఏపీలో సాగవు. – విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా? మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బీసీలకు దాదాపు రూ.86 వేల కోట్లకు పైగా మూడున్నరేళ్లలో సీఎం ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా? జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. – మార్గాని భరత్, ఎంపీ, రాజమహేంద్రవరం బీసీలకు మేలు చేసింది జగనన్నే రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, బీసీలకు మేలు చేసింది జగనన్నే. కాబట్టి బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతుంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే బీసీల రాష్ట్రం. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలన్న దానిపై బీసీల సమ్మేళనంలో మేధోమథనం చేస్తాం. విజయవాడలో 10 వేల మంది ప్రజాప్రతినిధులతో దీనిని నిర్వహించాలని నిర్ణయించాం. – కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం బీసీ కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్లు పూర్తి మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామస్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత.. తదితర అంశాలపై చర్చించాం. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, వందల మంది డైరెక్టర్లను నియమించాం. అన్ని స్థాయిల్లోని బీసీ ప్రజాప్రతినిధులతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తాం. – బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు నీకా దమ్ము, ధైర్యం ఉందా బాబూ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులిస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా బాబు నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? మన సీఎంను చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి. – గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పనివి కూడా చేస్తున్నాం బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు సీఎం జగన్. గత ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి అధికారంలోకి వచ్చాక అందులో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలుచేశారు. డిక్లరేషన్‌లో చెప్పని అంశాలనూ అమలుచేస్తున్నారు. మూడున్నరేళ్ళలో ఈ ప్రభుత్వం రూ.1.76 లక్షల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, అందులో 50 శాతానికి పైగా బీసీలకు అందాయి. – పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, విప్ జంగా కృష్ణమూర్తి -
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కాగా, మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు అని అన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం.. సాక్షి, అనంతపురం: తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలను నిత్యం మోసం చేయడమే చంద్రబాబు నైజం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే దుర్భాషలాడతారా?. వికేంద్రీకరణవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్ చెలగాటం ఆడుతున్నారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సాక్షి, విజయవాడ: అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి నా నినాదం అని చంద్రబాబు రాయలసీమలో చెప్పలేకపోయాడు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఇకనైనా మీ భాషను మార్చుకోకపొతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. -
రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: మంత్రి జయరాం
-
CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్
కర్నూలు: ‘విద్యా కానుక’ కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందు కోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారని, పిల్లలకు అవసరమైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లను చేయాలన్నారు. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) నేడు విద్యాశాఖ కార్యదర్శి రాక కర్నూలు సిటీ: పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదోని రానుండడంతో ఏర్పాట్లపై సమీక్షించేందుకు విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం జిల్లాకు రానున్నారు. ఈయన వెంట పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ కూడా ఉంటారు. మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు, అధికారులు హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానం మొత్తం కలియతిరిగారు. జిల్లా అధికారులకు తలసి రఘురామ్ పలు సూచనలు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ్, డీఈఓ రంగారెడ్డి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాసు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, విద్యుత్‌శాఖ ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ కుమారి పాల్గొన్నారు. -
బాలకృష్ణకు మంత్రి గుమ్మనూరు జయరాం వార్నింగ్
-
ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి జయరామ్
సాక్షి, అమరావతి: పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, ప్రమాద పరిస్థితిపై సమీక్షించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుగురు కార్మికుల మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మనూరు ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 25లక్షలు అందిస్తుంది. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారికి రూ.5లక్షలు, చిన్న గాయాలు అయిన వారికి రూ. 2లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు, వారు కోలుకునే వరకు వారికి ఫ్యాక్టరీ తరుపున జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) తాత్కాలికంగా మూసేస్తున్నాం: జిల్లా కలెక్టర్ హై ప్రెషర్ కెమికల్ రియాక్షన్ వల్లే పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా? అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చదవండి: (అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం) -
కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు
-
గుమ్మనూరు జయరాం అనే నేను..
-
మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ కు రుణపడి ఉంటా
-
AP New Cabinet: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన జట్టులో మరోసారి పాతవారికే అవకాశం కల్పించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డోన్, ఆలూరు ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, గుమ్మనూరు జయరాంకు మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో డోన్, ఆలూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. బైక్ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీలోనే.. వైఎస్సార్సీపీ ఏర్పాటైన రోజు నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో డోన్ నుంచి బుగ్గన, ఆలూరు నుంచి గుమ్మనూరు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో అప్పటి టీడీపీ ప్రభుత్వ అక్రమాలు, అవకతవకల పాలన, విధానపర నిర్ణయాలపై బుగ్గన గట్టిగా తన వాణి వినిపించారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అభ్యర్థులుగా గెలుపొందారు. ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని కాదని టీడీపీలో చేరారు. రాష్ట్రంలో అత్యధికంగా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరింది అయితే కర్నూలు జిల్లా నుంచే! ఆ సందర్భంలో గుమ్మనూరు, బుగ్గన ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీలోనే కొనసాగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డికి అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయితే నాగిరెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో పీఏసీ చైర్మన్‌గా బుగ్గన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. తొలి మంత్రివర్గంలోనే చోటు గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పూర్తిగా ఒక రాజకీయ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం దక్కింది. మంచి వక్త, మృధుస్వభావి అయిన బుగ్గనతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా చరిత్రలో బోయ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటు కల్పించడం అదే తొలిసారి. జిల్లాలో బోయ వర్గానికి చెందిన రెండో ఎమ్మెల్యేగా గుమ్మనూరు గుర్తింపు పొందారు. అంతకు ముందు డోన్‌లో మేకల శేషన్న మాత్రమే బోయ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని బీసీల్లో అధికశాతం బోయ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఆ సామాజిక వర్గం వారు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో బోయ సామాజికవర్గం వైఎస్సార్సీపీ వెంట నడుస్తోంది. మలి విడతలోనూ వారికే అవకాశం 2019 జూన్ 8న మంత్రులుగా బుగ్గన, గుమ్మనూరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థికశాఖ మంత్రిగా బుగ్గన, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. 34 నెలలపాటు మంత్రులుగా కొనసాగిన ఇద్దరూ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నెల 7న వారు రాజీనామాలు చేశారు. అయితే నూతన మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వారిద్దరిపైనే నమ్మకం ఉంచారు. ఆర్థికశాఖ, అసెంబ్లీ కార్యకలపాల నిర్వహణ మంత్రిగా కొనసాగిన బుగ్గనకు కొత్త మంత్రివర్గంలో కూడా చోటు కల్పించారు. అలాగే బీసీలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో మరోసారి జయరాంకు అవకాశం కల్పించారు. మిన్నంటిన సంబరాలు బుగ్గన, గుమ్మనూరుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో డోన్, ఆలూరు నియోజకవర్గాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డోన్‌లో ఎంపీపీ రాజశేఖరరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నివాసం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి సొంత ఊరు బేతంచెర్లలో ఎంపీపీ బుగ్గన నాగభూషణ్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చలం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్యాపిలిలో పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరాములురెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలూరులో మండల కనీ్వనర్ వీరేశ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. -
అది రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్ర: గుమ్మనూరు జయరాం
సాక్షి, కర్నూలు: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. 'రైతు పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత అన్నీ చంద్రబాబే. ఆయన చేయిస్తున్న పాదయాత్ర.. న్యాయస్థానం టూ దేవస్థానం కాదు 'అన్యాయం టూ అన్యాయం మోసం టూ మోసం' అని టైటిల్ పెడితే బాగుంటుంది. పాదయాత్రకు ఆదరణ కరువయ్యింది. అది రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్ర. పాదయాత్ర వల్ల ప్రజలకు ఏమీ ఒరగదు. ప్రజలకు న్యాయం చేయాలంటే సీఎం జగన్‌కే సాధ్యం. రాయలసీమ అంటే చంద్రబాబుకు కక్ష. న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు న్యాయం చేస్తుంటే చంద్రబాబుకు ఓర్చుకోలేకపోతున్నాడని' మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చదవండి: (త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు) -
ఖాళీ ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పా..
సాక్షి, అమరావతి: పోలీసులు రైతులకు చెందిన ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పిన మాట వాస్తవమని, తాను చెప్పిన దాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా, తప్పుగా మాట్లాడింది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలోను, సంక్షేమంలోను దూసుకెళుతుండటంతో ఎల్లో మీడియాకు వార్తలు కరువై తనలాంటి వారిపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డా రు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన లోకేశ్‌కు తన గురించి మాట్లాడే యోగ్యతే లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. లోకేశ్ అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చి పదవులు వెలగబెట్టిన నేత అని దుయ్యబట్టారు. మాటకొస్తే టీడీపీ నేతలు దందాలు దందాలు అంటారని, దందాగిరీ చేసేందుకు తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ని కాదని చెప్పారు. నిజంగా పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడితే అది తప్పవుతుందన్నారు. రైతులపై అభిమానంతో వారి ఖాళీ ట్రాక్టర్లు వదలండి అని మాత్రమే చెప్పానన్నారు. ఖాకీ యూనిఫాం నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనేనని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నించే సీఎం జగన్ ఇలాంటివి ప్రోత్సహించరని చెప్పారు. తనపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానన్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలుసుకున్నానని, నియోజకవర్గ సమస్యలపైన మాత్రమే మాట్లాడానని చెప్పారు. సీఎంతో సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ఆవగింజ అంత సిగ్గు కూడా లోకేశ్‌కు లేదని విమర్శించారు. తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దున ఉంటుందని చెప్పారు. అర కిలోమీటరు దూరంలోనే పక్క రాష్ట్రంలో మద్యం దొరుకుతుంటే కొందరు వెళ్లి తాగి వస్తుంటారని, ఇది తన దురదృష్టమని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా అవాకులు చెవాకులు మాట్లాడుతున్న లోకేశ్.. బహిరంగంగా వస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అక్కడ తాగి ఇక్కడికి వచ్చేవారిని చూసి మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయగలనన్నారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. రాజ్యాంగం చెప్పినదానికి మించి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ’జామాత దశమ గ్రహం’ అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. -
‘లోకేష్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు’
సాక్షి, విజయవాడ: లోకేష్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మనూరు జయరాం నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోరు అదుపులో పెట్టుకోకపోతే లోకేష్‌ను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. ‘‘151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు సీఎం జగన్. మీ నాన్న నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడంటూ’’ మంత్రి ఎద్దేవా చేశారు. మంగళగిరిలో లోకేష్‌ను పిచ్చికుక్కను కొట్టినట్లు తరిమికొట్టారన్నారు. ‘‘టీడీపీ హయాంలో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగింది. టీడీపీ నేతలు మా నేతను హత్య చేశారు.. అప్పుడు లోకేష్ ఏమయ్యాడు’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ఏం చేసినా కర్నూలులో టీడీపీకి భవిష్యత్ ఉండదని మంత్రి జయరాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు. చదవండి: అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి లోకేష్ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలి -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్‌ఎస్‌బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
Kurnool Airport: కందనవోలు 'కళకళ'!
కర్నూలు (సెంట్రల్)/ఓర్వకల్లు: రాయలసీమ వాసుల కల సాకారమైంది. న్యాయ రాజధాని కర్నూలు (కందనవోలు) నుంచి లోహ విహంగాలు గాల్లో తేలిపోయాయి. ఈ చారిత్రక ఘట్టానికి కర్నూలు విమానాశ్రయం ఆదివారం వేదికైంది. విమానాల రాకపోకలతో పండుగ వాతావరణం నెలకొంది. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం (6ఈ 7911) కర్నూలు విమానాశ్రయానికి ఉదయం 10.10 గంటలకు చేరుకోగా ఆధునిక అగ్నిమాపక వాహనాలు వాటర్ క్యానన్ రాయల్ సెల్యూట్‌తో ఘన స్వాగతం పలికాయి. ప్రయాణికులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వాగతం పలికారు. బెంగళూరు నగర బావి నివాసి రాంప్రసాద్ దంపతుల కుమార్తె సాయి ప్రతీక్షకు పుష్పగుచ్ఛాన్ని అందచేశారు. ఇదే ఫ్లైట్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తోపాటు మొత్తం 72 ప్రయాణికులు బెంగళూరు నుంచి వచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె. ఫక్కీరప్ప, జేసీలు ఎస్.రామసుందర్‌రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్వో బి.పుల్లయ్య, డీఆర్డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, ఎయిర్‌పోర్టు ఏపీడీ కైలాస్ మండల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖకు తొలి విమానం.. కర్నూలు నుంచి తొలి విమానం విశాఖకు ఎగిరింది. ఇందులో వెళ్లిన 66 మంది ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం పుల్లారెడ్డి స్వీటు, పోస్టల్ స్టాంపు ప్రత్యేక కవర్లను అందజేసింది. 11.50 గంటలకు విశాఖ వెళ్లే విమానానికి మంత్రులు జాతీయ జెండాను ఊపడంతో టేకాఫ్ అయింది. మధ్యాహ్నం 1 గంటకు విశాఖలో 6ఈ 7913 విమానం బయలుదేరి కర్నూలుకు 2.55 గంటలకు చేరుకుంది. 6ఈ 7914 విమానం కర్నూలు నుంచి 3.15 గంటలకు బయలుదేరి 4.25 గంటలకు బెంగళూరులో ల్యాండింగ్ అయింది. చెన్నైలో 6ఈ7915 విమానం 2.50 గంటలకు బయలు దేరి కర్నూలుకు 4.10 గంటలకు చేరుకుంది. కర్నూలు నుంచి 6ఈ7916 విమానం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకు 5.50 గంటలకు చేరుకుంది. తొలి ఫ్లైట్ పైలట్ కర్నూలు వాసే.. బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చిన తొలి ఫ్లైట్ పైలట్ వీరా కర్నూలు వాసి కావడం గమనార్హం. సొంతూరుకు విమానం నడిపే భాగ్యం ఆయనకు లభించింది. తాను పుట్టి పెరిగింది కర్నూలులోనేనని వీరా తెలిపారు. కర్నూలు నుంచి ఆరు నెలల్లో తిరుపతి, విజయవాడకు విమానాలను నడుపుతామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ భరత్‌రెడ్డి తెలిపారు. 60 ఏళ్ల కల సాకారం.. ‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కర్నూలులో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని భావించినా సాధ్యం కాలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 60 ఏళ్ల కలను సాకారం చేశారు. భవిష్యత్‌లో కర్నూలు విమానాశ్రయాన్ని విస్తరించి అంతర్జాతీయ స్థాయికి పెంచుతాం’ – మంత్రులు బుగ్గన, గుమ్మనూరు సౌకర్యవంతం.. ‘మేం నంద్యాలలో నివాసం ఉంటాం. నా భార్య సంధ్య పుట్టిల్లు విశాఖ వెళ్లేందుకు విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంది. జగనన్నకు కృతజ్ఞతలు’ – రఫీక్‌బాషా, (విశాఖ విమాన ప్రయాణికుడు) ప్రతీ ఆదివారం కర్నూలు వస్తా.. ‘అమ్మానాన్న కర్నూలులో ఉంటారు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బెంగళూరులో పనిచేస్తున్నా. గతంలో ఎవరైనా తోడు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరూ అవసరంలేదు. ప్రతి ఆదివారం కర్నూలు వచ్చి అమ్మానాన్నను చూసి వెళ్తా. కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేయడం చాలా సౌకర్యంగా ఉంది’ – సునీత, సాఫ్ట్వేర్ ఇంజనీరు థ్యాంక్స్ టూ జగనన్న.. ‘గతంలో చంద్రబాబు నాన్చుడు ధోరణితో ఎయిర్‌పోర్టు పూర్తి కాలేదు. థ్యాంక్స్ టూ జగనన్న. నేను గోవా నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి కర్నూలుకు విమానంలో వచ్చా’ – ధర్మా, కర్నూలు -
కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం. అందుకే తొలిరోజు నుండి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని’’ మంత్రి గుమ్మనూరు జయరామ్’’ అన్నారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) ఆ చావులకు కారణం చంద్రబాబే: మోపిదేవి గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడచిన 18 నెలల్లో ఎక్కడ కూడా ఒక ఆలయాన్ని కూల్చిన ఘటన లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘కూల్చే సంస్కృతి టీడీపీది. నిలబెట్టే సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. పుష్కరాలు లాంటి పవిత్రమైన కార్యక్రమాలను కూడా స్వార్థానికి వాడుకుని 29 మందికి చావుకు చంద్రబాబు కారణమయ్యారు. పుష్కరాల పేరుతో 43 పురాతన దేవాలయాలు కూల్చిన సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వానిదని’’ దుయ్యబట్టారు. (చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్) ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడం మానుకోవాలని మోపిదేవి హితవు పలికారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఘటనకు కారణం ఎవరో త్వరలోనే తెలుస్తోందని, తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. టిడ్కో పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ: టీడీపీ నేతలు టిడ్కో పేరుతో 12,000 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం ఆయన సత్యనారాయణ పురం 47వ డివిజన్లలో 50 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. గత టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల పేరుతో ఫొటో స్టాట్ వేల రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు డబ్బులు ఇచ్చామని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని మల్లాది విష్ణు వివరించారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన నేత చంద్రబాబు..
-
‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’
సాక్షి, కృష్ణా జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. శనివారం ఆయన గుడివాడలో తాపీ కార్మిక సంక్షేమ సంఘ నూతన భవనాన్ని కార్మిక శాఖ మంత్రి జయరామ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పోటీ చేసిన 106 స్థానాల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని టీడీపీని జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేశారని, ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు.. ప్రజా నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఢీ కొడతాననడం అవివేకమని దుయ్యబట్టారు. (చదవండి: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్!) ‘‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. చంద్రబాబు కోర్టులకు వెళ్లడం వల్లనే ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచి రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడుతుంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ అడ్డుకుంటుంది. హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పునరావృతమవుతాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు గాలి పార్టీగా తయారు చేసి, ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయాడు. ఆయన నాయకుడిగా ప్రజల తిరస్కారానికి గురయ్యి, ఒక మేనేజర్ మాదిరి మిగిలిపోయారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని’’ విమర్శలు గుప్పించారు. (చదవండి: పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల) పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం: మంత్రి జయరామ్ కార్మిక వర్గాలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి జయరామ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరి దోపిడీకి గురికాకుండా, ఇసుక పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జయరామ్ తెలిపారు. -
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, ఈ స్పెషల్ డ్రైవ్ లో ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. తాను కూడా కంపెనీల్లో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్టరీ, బాయిలర్ల శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. -
బీసీలంతా వైఎస్ జగన్‌కు రుణపడ్డాం: జయరాం
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ బీసీలకు డిప్యూటీ సీఎం అవకాశం కల్పించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా.. కార్పొరేషన్లు, చైర్మన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు కల్పించి మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందించారు. (జగన్ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు) మహిళల అభివృద్ధికి ఆసరా, చేయూత పథకాలను అమలు చేసి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందజేశారు. జిల్లాలో బీసీ వాల్మీకికి మంత్రి పదవి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా సీఎం జగన్ ఏర్పాటు చేశారు. బీసీలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం' అని మంత్రి జయరాం పేర్కొన్నారు. -
వాల్మీకి జయంతి: హామీ ఇచ్చిన సీఎం జగన్!
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలోని వాల్మీకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వాల్మీకుల అభివృద్ధి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలు అందిచారని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి జయంతి పండగ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. చదవండి: అందరికీ సంక్షమం దిశగా ఏపీ ప్రభుత్వం' వాల్మీకికి చెందిన ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తింపు ఇచ్చి మంత్రి పదవిని కల్పించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వాల్మికులపై వివక్షత కొనసాగించారని విమర్శించారు. ‘వాల్మీకుల అభివృద్ధికి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలను కల్పించారు. బీసీ అభివృద్ధికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి. వాల్మీకి జయంతిని సెలవు దినంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అడుగాను. అది కూడా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకులను, బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు’. అని ప్రశంసించారు. -
‘అయ్యన్నపాత్రుడికి మతి భ్రమించింది’
సాక్షి, కర్నూలు: పదవిని కోల్పోయిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.(చదవండి: డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు: జయరాం) ‘‘15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమి కొనుగోలు చేశారు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములిద్దరికి విభేదాలు వచ్చాయి. నేను అన్నీ చెక్ చేయించి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశా. ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. దీంట్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఈ అంశంపై ఆస్పిరి పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు కూడా పెట్టానని’’ ఆయన వివరించారు. ఒక రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా.. మరి 2 ఎకరాల చంద్రబాబు ఇప్పుడు ఇలా ఎలా ఎదిగాడో అయ్యన్నపాత్రుడు అడగాలి. ఒక బీసీ మంత్రిని అణగదొక్కాలని చూస్తున్నారు. ఆ రోజు 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తా అని చంద్రబాబు నాకు ఎర వేసాడు. అచ్చెన్నాయుడిలా అవినీతికి పాల్పడలేదని జయరామ్ అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొన్ని డిస్పెన్సరీలను తనిఖీ చేశానని, వాటిలో మెడిసిన్స్ లేవని తేలింది. బాకీలు మాత్రం కట్టాల్సి వచ్చింది. దీంతో విచారణకు అదేశించా. వాస్తవాలు బయటకు వచ్చాయని ఆయన తెలిపారు. (చదవండి: ఏపీ: చెరకు రైతులతో మంత్రుల కమిటీ భేటీ) -
డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు: జయరాం
సాక్షి, కర్నూలు: తాను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీలోకి వస్తే రూ.50 కోట్లు ఇస్తామని తనకు చంద్రబాబే ఆఫర్ చేశారని తెలిపారు. ఆ పదవి వద్దు, నాకు డబ్బు వద్దని వదిలేశానని ఆయన వివరించారు. అమరావతిలో భూ కబ్జాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్ జనంలోకి రావాలన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు. (చదవండి: ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయ్యన్న పాత్రుడిలా అమ్మాయిలతో స్టేజీలపై డ్యాన్స్‌లు చేసే వ్యక్తిని కాదని, తనపై సీబీఐకి ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను తప్పు చేయనని, విమర్శలకు భయపడనని తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని మంత్రి జయరాం వివరించారు. -
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్‌లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం) చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది. -
మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం
సాక్షి, కర్నూలు: పేకాట స్థావరాల్లో దొరికిన వారిని కఠినంగా శిక్షస్తామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని, ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులో జరిగిన పేకాట స్థావరాలపై దాడులకు తనకుగాని, తన కుటుంబసభ్యులకుగాని ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించనని ఆయన తెలిపారు. చదవండి: (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) పేకాట స్థావరాలలో దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. మద్యం, పేకాట నిర్మూనలకు తమ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఆలూరు నియోజకవర్గ పరిధిలో హత్య రాజకీయాలు జరిగేవని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి ఫ్యాక్షన్ హత్య కేసులు లేవని మంత్రి జయరాం పేర్కొన్నారు. కాగా కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి తమ దూరపు బంధువు అంటూ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. పరవాడ ఫార్మా కంపెనీ లో ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక అనంతరం ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు. ప్రమాద ఘటనపై హోంమంత్రి ఆరా సాక్షి, గుంటూరు: విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) -
‘అవినీతిలో టీడీపీ నేతలు సిద్ధహస్తులు’
సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్ధహస్తులు లేరన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతున్నారు. అచ్చెంన్నాయుడు అవినీతిని ఆధారాలతో సహా సేకరించిన తర్వాతే ఏసీబీ అధికారులు తమ విధులు నిర్వహిస్తూ.. చట్ట ప్రకారం వెళ్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును వాడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. ఇది టీడీపీ నైజమని.. కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది కాబట్టే అరెస్ట్ చేశారని.. దానికి బీసీ కార్డును వాడాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. మధ్యలో కుల ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదన్నారు. ఈ ఒక్క ఘటనతోనే అయిపోలేదని.. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టను బయటకు తీసేందుకు సీబీఐ విచారణ జరిపించాలని నిన్నటి క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు.(అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?) తప్పుచేశారు కాబట్టే అరెస్ట్: అనిల్‌కుమార్ యాదవ్ అచ్చెన్నాయుడు అవినీతికి, బీసీలకు ఏం సంబంధం అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారనే ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన ప్రతి పనిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదన్నారు. తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదు: ఆర్కే రోజా విజయవాడ: అచ్చెన్నాయుడు అవినీతి ఆధారాలతో దొరికాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందని విజిలెన్స్, ఏసీబీ విచారణలో తేలిందన్నారు. త్వరలోనే చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుందన్నారు. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదన్నారు. తన అవినీతి బయటపడుతుందనే కారణంతో చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వలేదన్నారు. అరెస్ట్‌లు చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.. కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని.. అందుకే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు హయాంలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. అవినీతిని బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అచ్చెన్నాయుడు టెలీ సర్వీస్, ఆర్సీ నాన్ ఆర్సీ ద్వారా అవినీతికి పాలడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని జయరాం పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానమే: ఇక్బాల్ అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను సమర్థిస్తున్నానని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని.. కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ ఆధారాలు సేకరించిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టానికి కులాలు, మతాలతో సంబంధంలేదని చెప్పారు. ఏసీబీ విచారణకు టీడీపీ సహకరించాలని ఇక్బాల్ కోరారు. అచ్చెన్న అరెస్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం గుంటూరు: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు చొప్పున కేటాయిస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని, మత్స్యకారులను తాట తీస్తామంటూ బీసీలను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని విడదల రజని అన్నారు. -
గ్యాస్ లీక్ పరిస్థితి అదుపులో ఉంది: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. (గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు) పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎల్జీ పాలిమర్స్‌ను గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందని ఆయన చెప్పారు. నిపుణుల బృందం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బయట నుంచి కొంతమంది వచ్చి కావాలనే ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) -
చంద్రబాబు రాజకీయ సన్యాసం
సాక్షి, కర్నూలు : కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఉంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. ఐదు కోట్ల ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. దీని బట్టి చూస్తే చంద్రబాబు ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా.. టీడీపీ నాయకులు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితమైయ్యారని అన్నారు. కరోనా సోకుంతుందన్న భయంతో చంద్రబాబు, లోకేష్ ఇంటికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోందని, రాబోయే ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమవుతుందని మంత్రి జయరాం జోస్యం చెప్పారు. (కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్ కేసులు) ఆదివారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘కోట్ల సుజాతమ్మకు మా ప్రభుత్వాన్ని, మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. వలస కూలీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక శాఖ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటుంటే విమర్శలు చేయడం సరైనది కాదు. ఫ్యాక్షన్ రాజకీయంతో ఎంతో మంది ఆడపడుచులను వితంతువులగా మార్చిన ఘనత కోట్ల కుటుంబానికే దక్కుతుంది. ఆలూరు ప్రజలు రెండు సార్లు ఓడించిన మీకు బుద్ధి రాలేదు. మరో సారి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు అత్యధికంగా నిలిచిన రాష్ట్రం మనదే అని మంత్రి స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. (కార్మికులను ఆదుకుంటాం : మంత్రి జయరాం) -
కార్మికులను ఆదుకుంటాం : మంత్రి జయరాం
సాక్షి, కర్నూలు : రాష్ర్ట కార్మికులందరికీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 'మే' డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాక్డౌన్ తర్వాత భవన నిర్మాన కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరం 'మే' డే సందర్భంగా కార్మికుల కష్టాన్ని గుర్తించి శ్రమ శక్తి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ అని, ఈసారి కరోనా కారణంగా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, 2019-20 సంవత్సరానికి గానూ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం 494 కోట్లు రూపాయిలు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో కార్మికులకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నామని వివరించారు. -
'వైఎస్సార్ బీమా క్లెయిమ్స్‌ను చెల్లించనున్నాం'
సాక్షి, విజయవాడ : కరోనా కష్టకాలంలో పేదల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న వైఎస్సార్ బీమా కింద ఉన్న క్లెయిమ్‌లను చెల్లించి చెల్లింపులు కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తక్షణమే వైఎస్సార్ బీమా క్లెయిమ్‌లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ. 348కోట్లతో వైఎస్సార్ బీమా చెల్లింపులకు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు పెండింగ్ లో ఉన్నవన్నీ చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సెర్ప్ ద్వారా 7726 క్లెయిమ్ లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. -
కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికీ పొదుపు సంఘాలను ఆదుకున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరులో వైఎస్సార్ సున్నా వడ్డి పథకాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాట నెరవెర్చిన నాయకుడు సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పొదుపు సంఘాల కోసం రూ.1400 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఇక కరోనా మహమ్మారిని బారిన పడకుండా రక్షించుకోవాలంటే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్లూ స్వీయ నిర్భంధంలో ఉండాలిన సూచించారు. కాగా జిల్లాలో కరోనా బాధితులు పెరగడంతో కర్నూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా అధికారులతో సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
బాబు తీరును ఎండగట్టిన మంత్రులు
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు నక్కబుద్ధి, దొంగ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నట్టు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు మంత్రులు మంగళవారం పత్రికా ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఈ అఫిడవిట్ ద్వారా బీసీ వర్గాలకు మేలు జరగకుండా చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని ముఖ్య అంశాలను మంత్రులు ప్రజలకు వివరించారు. మంత్రులు చెప్పిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్‌డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీలు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులోని పాయింట్ నంబర్ 25లో 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 26వ పాయింటులో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8న ఇచ్చిన తీర్పులో ఏం చెప్పిందో కూడా రాశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినందున 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పదలుచుకోలేదని, కాబట్టి పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆ అఫిడవిట్‌లోని 27వ పాయింటులో ఈ అంశాన్ని మరింత వివరంగా చెప్పారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్లు 50శాతం మించడాన్ని అంటే, 60.55శాతం ఉండటాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకూ దీన్ని వర్తింపచేసే అవకాశం లేదని 27వ పాయింటు చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇట్ కెనాట్ బీ ఎక్స్టెండెడ్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కాబట్టే..స్పెషల్‌ఆఫీసర్లను నియమించుకోక తప్పడంలేదంటూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ నెపాన్ని వారిచ్చిన అఫిడవిట్‌కు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వంమీద నెడుతోంది. యాభైశాతం రిజర్వేషన్లు మించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంలేదంటూ సాక్షాత్తూ మరోసారి హైకోర్టుకు తెలిపిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని 59.75శాతం రిజర్వేషన్లు కావాలని దొంగ డిమాండ్లు చేయడం ఎంతవరకూ సహేతుకం. ఈ అఫిడవిట్ చంద్రబాబు దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. -
‘బాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి’
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): చంద్రబాబు హయాంలో ఈఎస్ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెం నాయుడు, పితాని సత్యనారాయణ హయాంలోనే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టీడీపీ దోచుకుందని విమర్శించారు. దీంతో నేడు చంద్రబాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక బాబుతోపాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్ మంచి సేవలు అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా అదే విధంగా సేవలు అందించాలని కోరారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.(ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం) -
‘బాబు, అచ్చెన్నాయుడు విచారణ తప్పించుకోలేరు’
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు దోపిడీ చేసి తప్పించుకునేందుకు బీసీ కార్డు తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా చంద్రబాబు, అచ్చెన్నాయుడు అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో చంద్రబాబునాయుడికి కూడా వాటా ఉందని మంత్రి గుమ్మనూరి జయరాం ఆరోపించారు. కార్మికుల్లో అత్యధికులు బీసీలే ఉంటారని.. అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. దొంగలకు బీసీ, ఓసీ అనే తేడా ఉంటుందా అని అన్నారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులు చేస్తే.. జగన్ పేద బీసీలను మంత్రులను చేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ కేబీనెట్లో అవకాశం కల్పించారని గుమ్మనూరి జయరాం తెలిపారు. (‘దోపిడీ జరిగింది వాస్తవం కాదా?’) చదవండి: (అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు విడ్డూరం: విష్ణుకుమార్) (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) -
ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం..!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఈఎస్ఐ స్కాం కి పాల్పడిన మాజీ మంత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఒత్తిడి తెచ్చినందుకే ఈ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.. వారు అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలకు పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.(ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) నెలకు రూ.75 లక్షలు దోచుకునే ఉద్దేశ్యంతోనే అచ్చెన్నాయుడు టెలి మెడిసిన్ కంపెనీకి సిఫారసు లేఖ ఇచ్చారని జయరాం ఆరోపించారు. ప్రధాని మెరుగైన సేవలందించాలని చెబుతారని.. కానీ స్కాములు చేయమని చెబుతారా అని ప్రశ్నిస్తూ.. టీడీపీ నేతల వాదన వింటుంటే నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మందుల్లేవని కార్మికులు, చెల్లించాల్సిన బకాయిలున్నాయని కంపెనీలు తన దృష్టికి తీసుకువచ్చాయని.. తన పరిశీలనలో వచ్చిన అనుమానాలతోనే విచారణకు ఆదేశించానని మంత్రి జయరాం పేర్కొన్నారు. ‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’ -
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
-
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
సాక్షి, విజయవాడ : చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు. (చదవండి: వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) -
‘సీఎం జగన్‌ది సాహసోపేతమైన నిర్ణయం’
సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ కంటివెలుగు పథకం మూడో దశను కర్నూలులో మంగళవారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆమోదయోగ్యమైన పరిపాలనను సీఎం జగన్ అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రతీ విద్యార్థి ఇంగ్లీష్‌లో చదువుకోవాలనేది సీఎం జగన్ తపన అని అన్నారు. పిల్లలను బడులకు పంపిస్తున్న తల్లులకు అమ్మఒడి ద్వారా భరోసా కల్పించారన్నారు. స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెను రూపొందించనట్లు మంత్రి బుగ్గన వివరించారు. రాజన్న కలలను నెరవేరుస్తున్నారు దివంగత మహానేత రాజన్న కలలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలులో మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి .. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని అభివర్ణించారు. బలహీనవర్గాలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి జయరాం కొనియాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాట వీద నిలబడే నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. ఇచ్చిన ప్రతీ హామీని సీఎం నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..! -
‘చంద్రబాబుది.. నీరు చెట్టు దోపిడీ చరిత్ర’
సాక్షి, కర్నూలు: చంద్రబాబుకు మతిస్థిమితం లేకుండా పోయిందని.. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం, మట్కా దందా నడిపించిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. నీరు చెట్టుతో డబ్బులు దోపిడీ చేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జయరాం ధ్వజమెత్తారు. -
దేవనకొండలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కర్నూలు : జిల్లాలోని దేవనకొండలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఉన్న దాదాపు 300 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరాయి. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. మరోవైపు జీతాలు పెంచడంతో వైఎస్సార్ క్రాంతి ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన మహా నాయకుడు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి మంత్రి అభినందనలు తెలిపారు. -
ప్రతి ఎకరాకూ నీరిస్తాం
సాక్షి, కర్నూలు సిటీ: జిల్లాలో వివిధ కాలువల కింద సాగు చేసిన ప్రతి ఎకరా పంటకూ నీరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బుగ్గన మాట్లాడుతూ దేవుడి దయవల్ల ఈ ఏడాది వర్షాలు బాగా రావడంతో రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు నీరు సమృద్ధిగా చేరిందన్నారు. కర్నూలు జిల్లాలోని కేసీ, ఎల్ఎల్సీ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ కాలువల కింద, ఎత్తిపోతల పథకాల పరిధిలో సాగు చేసిన ఆయకట్టుకంతా పూర్తి స్థాయిలో నీరు ఇచ్చేందుకు అవకాశం కల్గిందన్నారు. నీటి నియంత్రణ వ్యవస్థపై ఇంజినీర్లు రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తూ.. ఏ ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతులు లాభసాటి పంటలను సాగు చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ద్వారా గ్రావిటీపై అవకాశమున్న అన్ని చెరువులను నింపాలన్నారు. హంద్రీనీవా పరిధిలోని ఎన్ని చెరువులకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటే అన్నింటికీ ఇస్తున్నట్లు తెలిపారు. హంద్రీ–నీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్‌పై ఇటీవలే సంతకం చేశానని, త్వరలోనే అనుమతులు వస్తాయని తెలిపారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి అంటూ లేకుండా పనులు చేపట్టి.. ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేకపోయారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైన వాటికి రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు చేపడుతున్నామన్నారు. రాయలసీమ జిల్లాల్లో కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేసి సరికొత్త సరికార్డు సృష్టించామన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంపు! రాయలసీమ జిల్లాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ నీటిని డ్రా చేసుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని సీఈ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నీటిని బానకచర్ల దగ్గర ఏయే కాలువలకు ఎంత మేర ఇచ్చేందుకు అవకాశం ఉంది? ఏ మేరకు విస్తరించాలనే అంశంపై అధ్యయనం చేయనున్నామని తెలిపారు. అలాగే తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇటీవల సీఎం సైతం గుండ్రేవుల తన మదిలో ఉందని చెప్పారని సీఈ గుర్తు చేశారు. 7.38 లక్షల ఎకరాలకు సాగునీరు జిల్లాలోని వివిధ కాలువలు, లిఫ్ట్‌ల పరిధిలో 7,38,036 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. శ్రీశైలం జలాలపై ఆధారపడి ఉన్న తెలుగుగంగ కాలువకు లైనింగ్ చేస్తేనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుందని మండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. దీని కింద 1,03,700 ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని కోరారు. కేసీ కెనాల్ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో 2,65,628 ఎకరాలకు నీరు ఇవ్వాలని, అవసరమైన మేరకు మల్యాల, ముచ్చుమర్రి, బానకచర్ల నుంచి వాడుకోవాలని నిర్ణయించారు. ఎల్ఎల్సీ కింద ఖరీఫ్‌లో 27,044 ఎకరాలకు నీరు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే లిఫ్ట్ స్కీమ్‌ల కింద 17,726 ఎకరాలు, ఎస్ఆర్బీసీ కింద 1,45,627 ఎకరాలు, హంద్రీనీవా కింద 31 వేల ఎకరాలు, ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద 6 వేల ఎకరాలు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 66,815 ఎకరాలకు, శివ భాష్యం సాగర్ కింద 5,350 ఎకరాలు, ఏపీఎస్ఐడీసీల కింద 59,146 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య, ఎస్ఈలు శ్రీరామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి, ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు. గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులు చేపడతాం: గుమ్మనూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆలూరు అని, తమ నియోజకవర్గానికి వేదావతి ప్రాజెక్టు మంజూరయితే 80 వేల ఎకరాలకు నీరు అందుతుందని, దీంతో పాటు గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువలను నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. 2008లో శంకుస్థాపన చేసిన నగరడోణ రిజర్వాయర్ నిర్మాణం, హంద్రీనీవా నుంచి ఏబీసీకి తూము ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. తెలుగుగంగ, కేసీ కెనాల్ లైనింగ్ చేయాలి: గంగుల తెలుగుగంగ, కేసీ కాలువలకు లైనింగ్ చేస్తే నీటి సామర్థ్యం పెరుగుతుందని, వాటిపై దృష్టి సారించాలని శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. లైనింగ్ లేక తెలుగుగంగ కాల్వకు చిల్లులు పడినట్లు ఉండడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. తుండ్లవాగును పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దృష్టి పెట్టకుంటే నీటి చావులే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన పార్లమెంట్‌లోని పల్లెలపై దృష్టి పెట్టకుంటే నీటి కోసం చావులను చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. జలశక్తి అభియాన్ కింద కరువు ప్రాంతం కాకుండా నీరు ఉన్న ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 96 కి.మీ ప్రవహిస్తున్న తుంగభద్ర నది నీటిని నిల్వ చేసుకునేందుకు తగినన్ని రిజర్వాయర్లు లేవు. ఫలితంగా ఈ ఏడాది 178 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. స్టోరేజీకి గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలి. ఎన్నికల సమయంలో ఏ పల్లెకు పోయినా నీటి కష్టాలను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. – డా.సంజీవ్‌కుమార్, కర్నూలు ఎంపీ చెక్‌డ్యాంలు నిర్మించాలి కుందూ నది పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించి వృథా నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలి. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా బానకచర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడం వల్ల రైతుల పంటపొలాలు నీటమునిగి నష్టపోయారు. వారిని ఆదుకుని మున్ముందు పంటలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. – పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎంపీ జిల్లా అవసరాలు తీరిన తరువాతే ఇతరులకు.. జల వనరుల శాఖ పరిధిలోని పనులు పూర్తి కాలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలి. వెలుగోడు రిజర్వాయర్ వద్ద వన్‌ఆర్, వన్ఎల్ల ఎత్తును తగ్గించాలి. లేకపోతే చిన్న లిఫ్ట్ స్కీమ్‌లైనా ఏర్పాటు చేయాలి. ముందుగా జిల్లా రైతులకు నీరిచ్చిన తరువాతే ఇతరులకు ఇవ్వాలి. శివభాష్యంకు నీటి మళ్లింపుపై స్టడీ చేసి నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్న మార్గాలను చూడాలి. – శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే ఎల్ఎల్సీ నీటితో చెరువులను నింపాలి తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని చెరువులన్నింటికీ కూడా నీరు నింపాలి. కాలువకు పూర్తి స్థాయిలో లైనింగ్ చేయకుంటే నీటి ప్రవాహానికి ఇబ్బందులు వస్తాయి. నీరు తక్కువగా వస్తుంది. ఎక్కువ నీటిని తెచ్చుకునేందుకు చర్యలు తీసుకోవాలి. చాలా ఏళ్లుగా పైపులైన్ ప్రతిపాదనలు ఉన్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. – సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే హంద్రీనీవా నీరు అందడం లేదు పత్తికొండ నియోజకవర్గంలోనే హంద్రీనీవా నీరు వెళుతున్నా తమ ప్రాంతానికి మాత్రం సాగు నీరు అందడం లేదు. ఇంతవరకు పందికోన ఎడమ కాలువ, డిస్ట్రిబ్యూటరీలే పూర్తి కాలేదు. కృష్ణగిరి రిజర్వాయర్ కింద కూడా పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. ఎడమ కాలువ పరిధిలో ఇంతవరకు బ్రిడ్జిలు పూర్తి చేయలేదు. హంద్రీనీవా నీరు అన్ని చెరువుల్లో సాధ్యమైన మేరకు నింపాలి. – కంగాటి శ్రీదేవి, పత్తికొండ ఎమ్మెల్యే ఎస్ఆర్బీసీని బలోపేతం చేయాలి ఎస్ఆర్బీసీకి ఎప్పుడు నీరు వచ్చినా కట్ట ఎక్కడ తెగిపోతుందోననే ఆందోళన ఉంది. దీన్ని బలోపేతం చేయాలి. గాలేరు నుంచి తిమ్మనాయిని పేట చెరువుకు లిఫ్ట్ మంజూ రైంది. అయితే అనుమతులు రాలేదు. ఎస్ఆర్బీసీ కాలువకు పెరసోముల వద్ద 20 వేల క్యుసెక్కుల నీరు వస్తేనే చెరువుకు చేరేలా స్లూయిజ్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు 20 వేల క్యుసెక్కుల నీరు రాకపోవడంతో నిర్మించినా వృథాగానే ఉంది. స్లూయిజ్ ఎత్తు తగ్గించాలి. – కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే రాంపురం ఛానల్‌ను అభివృద్ధి చేయాలి మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన రాంపురం ఛానల్‌ను అభివృద్ధి చేయకపోవడంతో 3వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. ఈ ఛానల్‌కు మరమ్మతులు చేయాలి. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మిస్తే 4 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని స్కీంలలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. అధికారులు స్పందించి వేతనాలు ఇప్పించండి. – బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే మంత్రాలయం చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి తెలుగుగంగ కాలువ చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు అందడం లేదు. నాలుగో బ్లాకుకు ఇబ్బందిగా ఉంది. 29వ బ్లాకు పరిధిలోని 10 వేల ఎకరాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి మండలాల పరిధిలో ఇంకా 1500 ఎకరాలు వరద ముంపునకు గురయ్యాయి. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు కర్నూలు నియోజకవర్గంలో ఆయకట్టు లేదనే కారణంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. జొహరాపురం వద్ద బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కాల్వ కు పెన్సింగ్ సక్రమంగా లేకపోవడంతో ఏటా ఈతకు వెళ్లి పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హంద్రీనీవా 110 కి.మీ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి జీడీపీకి 4 టీఎంసీల నీరు ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. – హఫీజ్‌ఖాన్, కర్నూలు ఎమ్మెల్యే ముచ్చుమర్రి లిఫ్ట్‌ను కేసీ పరిధిలోకి తేవాలి నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల, నందికొట్కూరు, జూపాడుబంగ్లా 30 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. సుంకేసుల బ్యారేజీ నుంచి నీటి విడుదల నిలిచి పోతే నీటిని ముచ్చుమర్రి నుంచి వాడుకునేందుకు అవకాశం ఉంది. అయితే హంద్రీనీవా సీఈ అనుమతులు లేనిదే ఇవ్వలేమని ఇంజినీర్లు చెబుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముచ్చుమర్రిని కేసీ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలి. – టి.ఆర్థర్, నందికొట్కూరు, ఎమ్మెల్యే హంద్రీనీవా విషయంలో జిల్లాకు అన్యాయం హంద్రీనీవా నీటి విషయంలో జిల్లాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. కళ్ల ముందే నీరు పోతున్నా కాల్వ పక్కనే ఉన్న చెరువులను కూడా ఇంజినీర్లు నింపడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా స్పందించడం లేదు. వెలగమాను డ్యాంకు 11 ఏళ్లుగా సాగు నీరు ఇవ్వలేకపోతున్నారు. ఎస్ఆర్బీసీ కాలువలకు స్లూయిజ్‌లు ఏర్పాటు చేసి చెరువులన్నింటినీ నింపాలి. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే -
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రూ.90 లక్షల నిధులతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్లు ముఖ్య అతిధిలుగా హజరయ్యారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి..వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.3,900 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వచ్చే నెల 15న వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు రూ. 15 వేలు ప్రభుత్వం చెల్లించనుందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వబోతున్నామని, అలాగే రైతుల పంటలకు ఇన్సూరెన్స్‌కు సంబంధించి రూ.1,100 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుందన్నారు. కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఈ çసంవత్సరం చివరికంతా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. చరిత్రాత్మకం.. ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే 1.20 లక్షలసచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయటం చరిత్రాత్మకమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. వచ్చే నెల 2 నుంచి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజల దగ్గరకే పాలన వస్తోందన్నారు. బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దాహార్తి తీర్చాలి.. ఎమ్మిగనూరు పట్ణణ ప్రజల దాహార్తి తీర్చాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ ద్వారా పైపులైన్ ద్వారా పట్టణ వాసులకు తాగునీటిని తీర్చేందుకు రూ. 100 కోట్లను మంజూరు చేయించాలని మంత్రులకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌లకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్రెడ్డి, బీఆర్ బసిరెడ్డి, వై.రుద్రగౌడ్, బుట్టారంగయ్య, రియాజ్, గోనెగండ్ల మాజీ ఎంపీపీ నసుద్దీన్, మాజీ సర్పంచ్ నాగేష్‌నాయుడు, నందవరం సంపత్‌కుమార్‌గౌడ్, ఆర్డీవో బాలగణేషయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు విషయంలో సీమకు మంచే జరుగుతుంది ఎమ్మిగనూరుటౌన్: పరిపాలన పరంగా వికేంద్రీకరణ జరుగుతోందని, హైకోర్టు విషయంలో సీమ వాసులకు మంచే జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో మంత్రి బుగ్గన మాట్లాడారు.ౖ హెకోర్టు ఏర్పాటు విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. -
2న గ్రామ సచివాలయాలు ప్రారంభం
సాక్షి, కర్నూలు(అర్బన్) : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లాలో మొత్తం 881 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే 2వ తేదీన అన్ని మౌలిక వసతులు, ప్రజలకు అందించాల్సిన విస్తృత సేవలతో ప్రతి మండలంలో మోడల్‌గా ఒక సచివాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోడల్‌గా ప్రారంభం కానున్న సచివాలయంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫర్నిచర్, మీ సేవా తదితర అన్ని వసతులను పూర్తి స్థాయిలో అమరుస్తున్నారు. జిల్లాలోని 53 మండలాల్లో ఒక్కో సచివాలయాన్ని మోడల్‌గా ప్రారంభించేసేందుకు ఇప్పటికే అధికారులు గుర్తించారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్..అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. అన్ని గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు వీలుగా మెజారిటీ సచివాలయాలకు ఇప్పటికే పెయింటింగ్స్‌ను దాదాపు పూర్తి చేశారు. అలాగే ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత పంచాయతీ అధికారులు కృషి చేస్తున్నారు. వేగంగా వార్డు సచివాలయాల ఏర్పాట్లు కర్నూలు (టౌన్): కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాలిటీల్లో 300 వార్డు సచివాలయాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2 నాటికి కర్నూలు కార్పొరేషన్లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఒక్కొక్క సచివాలయం చొప్పున ప్రారంభించేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో పాటు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వార్డు సచివాలయాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న సీఆర్సీ (కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్)లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు 103 ప్రెవేట్ భనవాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఆయా భవనాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు ఏర్పాటు చేస్తున్నారు. బాత్రూమ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నూలులోని ఏర్పాటు చేయనున్న 132 వార్డు సచివాలయాల్లో మరమ్మతులకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. రివర్స్ టెండర్ విధానం అవలంబించడంతో ఆదాయం మిగిలింది. అన్ని వార్డు సచివాలయాల మరమ్మతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రతి పనిని అంచనా విలువ కన్నా 10 శాతం తక్కువకు టెండర్లను ఖరారు చేశారు. దీంతో ప్రభుత్వానికి అదాయం మిగిలింది. -
'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'
సాక్షి,వెలగపూడి : కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని 3వ బ్లాక్‌లో కర్మాగారాల శాఖ సంచాలకులు బాలకిషోర్ ఆధ్వర్యంలో 13 జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగార యజమానులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనధికార కర్మాగారాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులనుద్దేశించి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో విధులను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కర్మాగారాల యజమానులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. -
వంద పడకల ఆస్పత్రిగా ఈఎస్ఐ
సాక్షి, తిరుపతి : తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకల వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగవంతంగా కృషి చేస్తుందని కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన మంత్రి జయరాం మంగళవారం ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక బీమా, వైద్యాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఆధునిక భవనం ఉన్నా మౌలిక వసతులు కల్పించకుండా ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారన్నారు. వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బంది కొరత ఆస్పత్రిని వేధిస్తోందన్నారు. వీటిని అన్నింటినీ అధిగమించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈఎస్ఐకి కొత్త వైభవాన్ని తీసుకొస్తామన్నారు. ఏళ్ల తరబడి ఔట్సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లను తక్షణం నూతన భవనంలో రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మందులు లేవని రోగుల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. అన్నిరకాల వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. మౌలిక వసతులు, సిబ్బంది, వైద్యులు, టెక్నీషియన్ల అవసరం మేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికులు మంత్రిని కలసి పీఎఫ్ అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.రమేష్‌కుమార్, ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ రమణ కిషోర్, కర్నూలు జాయింట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్, సీనియర్ డాక్టర్లు బాలశంకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఆసుపత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు భూపాల్, రామాంజులు, పద్మజ పాల్గొన్నారు. -
స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ నిధులు కేటాయించి.. వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాజా బిల్లు చట్టరూపం దాలిస్తే.. పరిశ్రమల్లోని ఉద్యోగాలు 75శాతం స్థానికులకే లభిస్తాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు. యువతకు వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యువతను ప్రోత్సహించలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షలమంది ఇక్కడ పనిచేస్తున్నారని, స్థానికులకు తగిన నైపుణ్య శిక్షణ ఇస్తే.. వారికే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. యువత కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న అద్భుత నిర్ణయం ఇదని కొనియాడారు. వైఎస్ జగన్ పాలన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనను గుర్తుకుతెస్తోందని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. -
సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించే బిల్లును మంత్రి గుమ్మనూరు జయరాం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సభలో నవ్వుల పువ్వులు పూయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఆయా వర్గాలకు నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ రోజు మంత్రిస్థానంలో తాను ఉన్నానంటే అందుకు కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. తాము మంత్రులు కావాలని బ్రహ్మరాత రాశాడో లేదో తెలియదు కానీ, జగన్ అన్న మాత్రం ఆ రాత తమ నుదుటిమీద రాశారని కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ అంటే తనకు ప్రేమ ఎక్కువని, ఆయనను తాను అన్నా.. అని పిలుస్తానని చెప్పారు. 2017లో పాదయాత్ర చేస్తుండగా జగనన్నను కలిశానని, మీరు మాపాలిట దైవసంకల్పమని ఆయనకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. తాను వాల్మీకి బోయ కులానికి చెందినవాడినని, తమ బోయ కులస్తులకు వైఎస్ జగన్ వాల్మీకి మహర్షి అంతటి వారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఆయనను ఎస్సీలకు అంబేద్కర్గా, ముస్లింలకు అల్లాగా, క్రైస్తవులకు జీసెస్‌గా అభివర్ణించారు. ఆ కోవలోకి చెందిన మహానుభావులు మీరని 2017లోనే వైఎస్ జగన్‌తో చెప్పినట్టు గుర్తుచేశారు. జయరాం వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. సీఎం వైఎస్ జగన్ సహా సభలోని సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత కులం, మతం, పార్టీలు చూడకుండా అందరూ సమానులేనని వైఎస్ జగన్ అన్నారని, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ శిరిడీ సాయిబాబా పేర్కొన్నరీతిలో వైఎస్ జగన్ కూడా సబ్ కా మాలిక్ అని కొనియాడారు. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించుకొని.. ఇంతకీ మన బిల్ సంగతి చూడండంటూ సూచించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. -
అమాత్యులకు అపూర్వ స్వాగతం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి..స్వాగతం పలికారు. సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారి శ్రమ, కృషితోనే అధికారంలోకి వచ్చామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ప్రభుత్వం, పార్టీలో కార్యకర్తలకే మొదటి ప్రాధానత్య అని, వారి సమస్యలు ఏమైనా ఉంటే తమదృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమస్యలపై కూడా అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం చోటు దక్కించుకున్నారు. మంత్రి పదవి హోదాలో వారు తొలిసారిగా బుధవారం హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకోవడంతో నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయాన్నే పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు డోన్, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వేలాదిగా చేరుకుని వారి రాక కోసం ఎదురుచూశారు. మంత్రులు అక్కడికి చేరుకోగానే బొకేలు, పూలదండలు వేసి స్వాగతం పలికారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి భారీ సంఖ్యలో కారులతో ర్యాలీగా చేరుకున్నారు. -
ఆ జూట్ మిల్లును మళ్లీ తెరిచేందుకు కృషిచేస్తాం
సాక్షి, అమరావతి: విశాఖపట్టణం జిల్లాలోని చిట్టివలస జూట్ మిల్లును తెరిపించడానికి కృషి చేస్తామని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్ ప్రకటించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ మిల్లు మూతపడి పదేళ్లు అయిందనీ, 2014 ఎన్నికలముందు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పార్టీ అధికారంలోకి వస్తే మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఉన్న మిల్లును తెరిపించలేక భీమిలి నుంచి పారిపోయాడని, కార్మికులను నమ్మించి మోసం చేశారన్నారు. వాళ్లలాగా అలవికాని హామీలను తామివ్వమనీ, జూట్ మిల్‌ను తెరిపించడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తామని, జూట్‌మిల్‌ను తిరిగి నడిపేందుకు యాజమాన్యం ముందుకువస్తే.. ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని, ఒకవేళ యాజమాన్యం ముందుకురాకపోతే.. కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై జులై 9 తేదీన నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేశారు. -
డబుల్ ధమాకా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్లో చోటు కల్పిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. మరోవైపు సౌమ్యుడిగా, విద్యావంతుడిగా పేరున్న బుగ్గనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. ఇందుకు అనుగుణంగానే ఈయనకు బెర్త్ ఖరారు చేశారు. ఈయన ఇటీవలి వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా పనిచేశారు. ఆ పదవిలో హుందాగా వ్యవహరించడంతో పాటు టీడీపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి కూడా వన్నె తెస్తారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో వాల్మీకులు బలమైన వర్గంగా ఉన్నారు. ఆ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం మొదటి నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు లొంగలేదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జగన్ వెంట నడిచారు. ఇది ఈయనకు కలిసి వచ్చింది. బుగ్గన, గుమ్మనూరు ఇద్దరూ వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం విశేషం. సామాజిక న్యాయం దిశగా... జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గాను అన్నింటినీ ఆ పార్టీ కైవసం చేసుకుంది. గెలిచిన వారిలో అందరూ ఉద్దండులే. ఈ నేపథ్యంలోఎవరికి మంత్రి పదవులు వస్తాయనే ఉత్కంఠ చివరి నిమిషం వరకూ కొనసాగింది. అయితే, సామాజిక సమతుల్యంతో పాటు సామాజిక న్యాయం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటివరకు వాల్మీకులకు మంత్రి పదవి దక్కలేదు. ఈ వర్గానికి తెలుగుదేశం పార్టీ పదవులు ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వచ్చింది. ఒకానొకదశలో ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అయితే.. సామాజిక న్యాయం దిశగా ఈ వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోంది. నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తాం జగన్ మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించిన సమయంలో మంచి పరిపాలన అందించడంతో పాటు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భావించారు. ఆయనతో పాటు దాదాపు పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగనన్న ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక లీడర్‌కు కావాల్సిన లక్షణాలు.. ధైర్యం, పట్టుదల, సాహసమని ఒక బెంచ్ మార్క్‌ను జగనన్న చూపించారు. ఇక వైఎస్ విజయమ్మ ఉన్న ఒక్కగానొక్క కొడుకును ధైర్యంగా ప్రజాసేవకు పంపించారు. ఇందుకు ప్రత్యేకంగా ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నా. పదేళ్లుగా జగనన్న నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా మీద నమ్మకంతో మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పదవికి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషిచేస్తా. నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో కర్తవ్యాలను నిర్వహిస్తా. వెనుకబడిన జిల్లా కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తా. రాయలసీమ వాసినని గర్వంగా చెప్పుకుంటూ అభివృద్ధి చేసేందుకు పాటుపడతా. 50 ఏళ్ల క్రితం మా తాత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన డోన్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రొఫైల్ పేరు : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముద్దుపేరు : (రాజారెడ్డి) పుట్టిన తేదీ : 27–09–1970 (49 సంవత్సరాలు) సెల్ : 9000526788 తల్లిదండ్రులు : రామనాథ రెడ్డి, పార్వతమ్మ భార్య : రూప(గృహిణి) సంతానం : కుమారుడు అర్జున్ (బీటెక్, సెకండియర్–హైదరాబాద్) కుమార్తె ఐశ్వర్య(ఎంఎస్ –హైదరాబాద్) స్వగ్రామం : బేతంచర్ల కులం : కాపు(రెడ్డి) చదువు : 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, (హైదరాబాద్), ఇంటర్మీడియట్ (మద్రాస్ క్రిస్టియన్ కళాశాల, చెన్నై) బీటెక్ (విజయనగర ఇంజినీరింగ్ కళాశాల, బళ్లారి) వృత్తి : వ్యవసాయం, వ్యాపారం రాజకీయ స్ఫూర్తి : బుగ్గన శేషారెడ్డి (జేజినాయన) ఇష్టమైన ఆటలు : క్రికెట్ ఇష్టమైన నాయకులు : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వభావం : శాంత స్వభావి జీవిత లక్ష్యం : ప్రజాసేవ బలం : నియోజకవర్గ ప్రజలు మరచిపోలేని సంఘటన : మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం రాజకీయ నేపథ్యం : 1955లో జేజినాయన బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి రామనాథ రెడ్డి బేతంచర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా( 1985 నుంచి 1995), అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచర్ల గ్రామపంచాయతీకి 1995 నుంచి 2006 వరకు వరుసగా రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా డోన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 20/01/2018 నుంచి ఇటీవలి వరకు పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 35,644 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తాం జగనన్న ఆశీర్వాదంతో నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ రోజు ఆయన వెంట నడిచా. పీఆర్పీ నుంచి నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ‘నన్ను నమ్ముకో జయరాం’ అని ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగనన్న అన్నారు. అప్పటి నుంచి వారి కుటుంబంతోనే ఉన్నా. ఈ రోజు జగనన్న ఆశీర్వాదంతో మంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ప్రధానంగా వలసలను నివారించేందుకు పాటుపడతా. ఆర్డీఎస్, వేదావతి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తా. ఇక తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటా. – గుమ్మనూరు జయరాం గుమ్మనూరు జయరాం ప్రొఫైల్ పేరు : పెంచికలపాడు జయరాం తండ్రి పేరు : పి.బసప్ప తల్లి : పి.శారదమ్మ భార్య : పి.రేణుక కులం : బోయ (వాల్మీకి) విద్యార్హతలు : పదవ తరగతి సంతానం : కుమారుడు పి.ఈశ్వర్,ఇద్దరు కుమార్తెలు(ఇద్దరికీ వివాహమైంది.) పుట్టిన తేదీ : 16/10/1967 సెల్ : 9849939171. ఆస్తులు : 19 ఎకరాల వ్యవసాయ భూమి రాజకీయ నేపథ్యం : 1997లో తల్లి పి.శారదమ్మ గుమ్మనూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో జయరాం ఏరూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి 1998 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. కర్నూలు -
వైఎస్సార్ ఎనలేని కృషి
హొళగుంద (కర్నూలు): దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీ కన్వీనర్ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్‌తో పాటు 200 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ నాయకుల్లో గుబులు పుడుతోందన్నారు. దళితుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ నిత్యం పాటు పడేవారని అవే లక్షణాలు వైఎస్ జగన్‌లో ఉన్నాయని చెప్పారు. టీడీపీ పాలనలో వారి పార్టీ కార్యకర్తలకే పథకాలు వర్తింపజేసుకున్నారని అర్హులకు దక్కలేదని విమర్శించారు. వైఎస్సార్ పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. అనంతరం దళిత నాయకుడు తెలంగాణ ఐజీ ప్రవీణ్‌కుమార్ జన్మదినం సందర్భంగా దళిత నాయకులు ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనువాసులు, హాలహర్వి మండలం కన్వీనర్ భీమప్పచౌదరి, మాజీ సర్పంచ్ అయ్యాళప్ప, ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, గజ్జెళ్లి కెంచప్ప, నాయకులు పాల్తూరు గోవిందు, వందవాగిలి మేలగిరి, హోటల్ తిమ్మయ్య, ఈశా, సౌదిబాషా, రామకృష్ణ, సోమిరెడ్డి, కిష్టప్ప, ఎల్లార్తి చిన్న దరగప్ప, వైకుంఠ, సిద్దేటీ, హెబ్బటం నందీశ, నారాయణ, శీన తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీని ప్రజలు నమ్మరు
హాలహర్వి: గత ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఈసారి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి పుట్టిందన్నారు. మంగళవారం సిద్ధాపురం, గూళ్యం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని పూర్తిగా మరిచారన్నారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేస్తామని 2016లో ప్రకటించిన బాబు ఇంతవరకు పైసా మంజూరు చేయలేదన్నారు. ఇప్పటి వరకు సర్వే పనులు కూడా జరగలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సొంత నిధులతోనే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం పోరాటం చేసి హంద్రీనీవా నుంచి కేసీ కెనాల్‌కు సాగునీరు అందించానన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ కడపలో చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకు లేనిపోని దీక్షలు, హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా కాలువకు తూం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలు ఒట్టి నాటకమేనని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా తూముల ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అనంతరం సిద్ధాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఆలూరుకు తొలి బీసీ ఎమ్మెల్యే
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్: ఆలూరు నియోజకవర్గానికి తొలి సారిగా బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955 ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హొళగుందలతో పాటు ఆస్పరి, ఆదోని మండలాల్లోని కొన్ని గ్రామాలతో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటి సారి హెచ్.రామలింగారెడ్డి (కాంగ్రెస్), 1962లో డి.లక్ష్మీకాంతరెడ్డి(కాంగ్రెస్) రెడ్డి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎస్సీగా రిజర్వుడు కావడంతో 1967లో డి.గోవిందాస్(స్వతంత్య్ర), 1972లో పి.రాజారత్నరావు(కాంగ్రెస్), 1978లో మసాల ఈరన్న (కాంగ్రెస్), 1983లో కె.బసప్ప (టీడీపీ), 1985లో రంగయ్య(కాంగ్రెస్), 1989లో లోకనాథ్ (కాంగ్రెస్), 1994లో మసాల ఈరన్న(టీడీపీ), 1999లో మారెప్ప(కాంగ్రెస్), 2004లో మారెప్ప (కాంగ్రెస్) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, దేవనకొండ మండలాలతో జనరల్ స్థానంగా మారింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాటిల్ నీరజారెడ్డి కాంగ్రెస్ తరుఫున గెలుపొందారు. ప్రస్తుతం 2014 ఎన్నికల్లో బీసీ వాల్మీకి కులానికి చెందిన గుమ్మనూరు జయరాం(వైఎస్సార్సీపీ) సమీప ప్రత్యర్థి వీరభద్రగౌడ్ (టీడీపీ)పై విజయం సాధించారు. నియోజకవర్గానికి మొట్టమొదటి బీసీ ఎమ్మెల్యేగా జయరాం గెలుపొందడంతో బీసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి