సాక్షి, కర్నూలు: పేకాట స్థావరాల్లో దొరికిన వారిని కఠినంగా శిక్షస్తామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని, ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులో జరిగిన పేకాట స్థావరాలపై దాడులకు తనకుగాని, తన కుటుంబసభ్యులకుగాని ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించనని ఆయన తెలిపారు. చదవండి: (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి)
పేకాట స్థావరాలలో దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. మద్యం, పేకాట నిర్మూనలకు తమ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఆలూరు నియోజకవర్గ పరిధిలో హత్య రాజకీయాలు జరిగేవని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి ఫ్యాక్షన్ హత్య కేసులు లేవని మంత్రి జయరాం పేర్కొన్నారు. కాగా కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి తమ దూరపు బంధువు అంటూ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment