సాక్షి, కర్నూలు: రాష్ట్రంలోని వాల్మీకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వాల్మీకుల అభివృద్ధి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలు అందిచారని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి జయంతి పండగ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. చదవండి: అందరికీ సంక్షమం దిశగా ఏపీ ప్రభుత్వం'
వాల్మీకికి చెందిన ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తింపు ఇచ్చి మంత్రి పదవిని కల్పించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వాల్మికులపై వివక్షత కొనసాగించారని విమర్శించారు. ‘వాల్మీకుల అభివృద్ధికి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలను కల్పించారు. బీసీ అభివృద్ధికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి. వాల్మీకి జయంతిని సెలవు దినంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అడుగాను. అది కూడా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకులను, బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు’. అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment