Valmikis
-
వాల్మీకి జయంతి: హామీ ఇచ్చిన సీఎం జగన్!
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలోని వాల్మీకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వాల్మీకుల అభివృద్ధి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలు అందిచారని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి జయంతి పండగ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. చదవండి: అందరికీ సంక్షమం దిశగా ఏపీ ప్రభుత్వం' వాల్మీకికి చెందిన ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తింపు ఇచ్చి మంత్రి పదవిని కల్పించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వాల్మికులపై వివక్షత కొనసాగించారని విమర్శించారు. ‘వాల్మీకుల అభివృద్ధికి కోసం ఆడపడుచులకు చేయూత, ఆసరా పథకాలను కల్పించారు. బీసీ అభివృద్ధికి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి. వాల్మీకి జయంతిని సెలవు దినంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అడుగాను. అది కూడా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకులను, బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు’. అని ప్రశంసించారు. -
పుట్టుక లేని పకీరు
ఎవరిదైనా ఓ జీవిత చరిత్రని రాయాలంటే స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే దాన్ని లోకానికి ప్రచారం చేయడం సరైన పని. అలా కాక ఆధారాల్లేకపోయినా ఏదో ఊహలతోనో, ఎవరెవరో చెప్పిన కట్టుకథలతోనో జీవిత చరిత్రలని గనుక రాస్తే నిజమైనదేదో, నమ్మాల్సిందేదోనన్న విషయం ఓ జీవితకాలంలో తెలియదు ఎవరికీ కూడా. రామకథకి వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణమే ప్రమాణం అవుతుంటే, పూర్తిగా శ్రీమద్రామాయణాన్ని చదవని ఎందరో కొంత శ్రీమద్రామాయణంలోనిదీ, కొంత మరో రామాయణంలోనిదీ, మరికొంత అక్కడక్కడ హరికథల్లో విన్నదీ కలిపి చెప్పేస్తున్న కారణంగానే నేటికీ శ్రీమద్రామాయణం అసలు కథ ఏదో అది నూటికి తొంభైమందికి తెలియకుండా పోయింది, కేవలం ఇలాంటివారి వల్ల. అలాగే, వ్యాసుడు రాసిన భారత భాగవత కథలు కూడా పూర్తిగా చదవనివారి కారణంగానే కల్పిత కథలతో ప్రచారమవుతూ నిజమైన కథ ఏదో తెలియకుండా పోయింది. కేవలం ఇలాంటివారి వల్లే.. ‘ధర్మసందేహాలు’ వస్తూనే ఉంటాయి ఓ జన్మకాలమంతా. దానిక్కారణం దేన్నీ సరిగా లోకానికి రానీయక పోయినందువల్ల. ఇలా చెప్తున్నారేమిటి? అని ప్రశ్నించేవారూ, అలా చెప్పడం సరికాదని ఎదురు తిరిగే వారూ లేకపోయినందువల్లనే.హేమాడ్ పంత్ ఒక బాధ్యతాయుతమైన మేజిస్ట్రేట్ పదవిని నిర్వహించినవాడైన కారణంగా తగిన సాక్ష్యాధారాలు, వీటితో పాటు ఎవరినుండైనా విన్న కొన్ని సమాచారాలుంటే వాటిలో నిజానిజాలెంతో పరిశీలించగల శక్తి ఉన్న తన బుద్ధితో విచారించి ఆ ప్రమాణబద్ధమైన అంశాలు కలిపి సాయి పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే విశేషాలని తేల్చగలిగాడు. సాయి మొదటి దశ అది 1854వ సంవత్సరం. షిర్డీ గ్రామానికి వెలుపల, అంటే పొలిమేర అనుకోవచ్చు. అక్కడో పెద్ద వేపచెట్టుండేది. దాని కిందే సాయి ఉండేవాడు. అప్పటికి ఆయన 16 సంవత్సరాల వయసువానిగా కన్పించాడు అందరికీ. అంటే ఆయన పుట్టినది 1838వ సంవత్సరం అయ్యుండచ్చు.ఎప్పుడూ ఆ చెట్టు కిందే బస. ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఎండ అనీ లేదు, ఓ వాన అనీ లేదు, ఓ చలి అనీ లేదు. అక్కడే అక్కడే అక్కడే. షిర్డీ గ్రామానికి వస్తూండేవారూ పోతుండేవారూ ఏవేవో వృత్తులు చేసుకుంటూండేవారూ గానీ, ఎందుకు ఈ బాలుడు ఇలా కూర్చున్నాడో ఎవరికీ కనీసం తెలుసుకుందామని కూడా అనిపించలేదు. అడిగిన వారు కూడా లేరు.కొన్నాళ్లిలా గడిచాక, ముస్లిం పద్ధతిలో కనిపిస్తున్న ఆ బాలుణ్ని గమనించాక, ఎప్పుడూ అల్లానామాన్నే జపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యాక, ఎవరో ఒకామె తన పుత్రికని తీసుకొచ్చి, తన పాప కండ్ల కలకతో బాధపడుతోందని నమస్కరించి చూపించింది. సాయి టక్కున లేచి కొంతదూరంలో ఉన్న చెట్టువద్దకెళ్లి పసరు తీసి ఆమె కళ్లలో వేసాడు. మరురోజుకి తగ్గింది.అంతే! ఆ మరునాడు మరో ఇద్దరొచ్చారు. ఈ వ్యాధీ ఆ వ్యాధీ అంటూ ఎవ్వరొచ్చినా మాట్లాడే ధోరణే లేదు. వినడం, ఏ చెట్టు ఏ తీగ అనే దాన్ని చూసుకోవడం, టక్కున లేచి కొంత దూరం వెళ్లి తేవడం, ఆ పసరుని నోటిలోనో, గాయంపైనో వేసి ఆ వ్యాధి తగ్గేట్టుగా వైద్యం చేయడం, పంపించివేయడం ఇలా జరిగేది. దీంతో ఐదుగురు పది మందిగా, పదిమంది వందగా అయిపోయారు. ఇలా జనం పెరుగుతున్నా ఆయనకి విసుగు, విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉండేవారు. అప్పుడైనా ఏ ఒక్కరికీ ఇంతటి వైద్యం చేసిన ఆయన్ని ఏ ఇంటిలోకో, వసారాలోకో ఉండవలసిందిగా పిలుద్దామని, నిత్యం భోజనాన్ని సమకూరుద్దామని వాళ్లకీ అనిపించలేదు. ఈయనకు కూడా అడుగుదామనే ఆలోచన ఏమాత్రమూ లేదు. ఆయన వివరాలని ఎవరూ అడిగిందీ లేదు. ఈయన చెప్పిందీ లేదు. ఈయనది ఏ మతం? జనసంఖ్య పెరగడంతో మెల్లగా ఈయన గురించిన వివరాల్లోకి ఆలోచనలు సాగాయి.ఫకీరు రూపంలో ఉన్నాడు కాబట్టి, మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు కాబట్టి, మధ్యమధ్యలో పైకి ‘అల్లాహ్మాలిక్’ (అల్లాయే నా జీవిత యజమానీ దైవం కూడా) అంటూ ఉన్నాడు కాబట్టి... ఈయన ముస్లిం మాత్రమే అని కొందరు ఓ నిర్ణయానికొచ్చేశారు. పైగా మహమ్మదీయులకి ఇలాంటి పసరు వైద్యాలు, తాయెత్తులు, దిష్టి తొలగించే వైద్యాలు వంశ పరంపరగా వస్తూంటాయి కాబట్టి కూడా ఈయన ముస్లిమే అనే నిశ్చయం చేసుకున్నారు.అయితే మరికొందరు మాత్రం సాయి చెవులు రెంటికీ ఉన్న చిల్లుల్ని చూసి ఇవి హిందూధర్మం ప్రకారం ఉపనయనం (ఒడుగు) కార్యక్రమంలో చేయబడే సంస్కారాలు చెవులు కుట్టడం (కర్ణవేధ) అలాగే పుట్టువెండ్రుకల్ని తీసివేయడం (చౌలం) అనేవి స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా హిందువేననే నిర్ణయానికొచ్చేశారు.కొద్దిగా పరిచయమయ్యాక మాటలు దొర్లుతాయిగా! బాబూ! నీ బస ఎక్కడ? ఇక్కడే కనిపిస్తూ ఉంటావని అడిగితే ఆ మసీదు చూపిస్తూ ‘అదుగో! ద్వారక నా నివాసమన్నట్లు చూపించాడు. చనువుతో మసీదులోపల తిరిగి చూస్తే మహమ్మదీయ విధానానికి విరుద్ధంగానూ, హైందవ ధర్మానికి అనుగుణంగానూ ‘తులసిమొక్క’ కనిపిస్తోంది. అదేదో తనంత తాను పెరిగింది కాదు. పెంచబడుతూన్న ధోరణి కనిపిస్తోంది. మరి కొద్దికాలమయ్యాక ‘నువ్వెవరివి?’ అని అడిగితే కొందరితో రాముడిననీ, మరికొందరితో కబీరుననీ, ఝాన్సీ లక్ష్మీబాయ్ కొలువులో సిపాయిననీ, బట్టలని నేస్తూ ఉండేవాడిననీ... ఇంకా విచిత్రంగా మహాలక్ష్మిననీ... ఇలా చెప్తుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. అయినా మన రోగాలన్నీ నయమవుతూంటేనూ, ఈ కుర్రవాడు ఏ సొమ్మునీ తీసుకోకుండా చిటికెలో వైద్యం చేస్తుంటేనూ, వయసులో స్త్రీలందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో సభ్యదృష్టితోనే చూస్తున్న కారణంగానూ మనకి ఇతర వివరాలెందుకనుకుంటూ వాళ్లంతా ఏనాడూ ఈయన గురించిన లో వివరాలకి పోలేదు. ఒకవేళ వివరాలని ఆయన చెప్పినా అవి అర్థమయ్యేవి కాదు. ఇలా అన్నింటినీ జోడించుకు చూసుకుంటే లౌకికంగా ఆయన ఓ పిచ్చివానిలా అనిపించేవాడు కూడా. అలా ఆయన్ని పిచ్చివాడుగా అనుకోవడానికి ఇష్టముండేది కాదు. మనసు అంగీకరించేది కాదు. ఇతరులకి ఈయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలిసేదీ కాదు.ఇదిలా ఉండగా ఓసారి సాయిని ధులియా అనే ఊళ్లో మేజిస్ట్రేటు కోర్టులో ఎవరి వ్యాజ్యంలోనో సాక్షిగా విచారించవలసి వచ్చింది. అప్పుడు సాయిని గురించి ప్రశ్నా సమాధానాలు ఇలా ఉన్నాయి. ‘‘నీపేరు?’’‘‘బాబా.’’‘‘నీ తండ్రి పేరు?’’‘‘బాబా.’’తండ్రీకొడుకుల పేర్లు ఒకలానే ఎందుకుంటాయి? అని ఒక్కక్షణం మేజిస్ట్రేటు ఆశ్చర్యపడినా తన బాధ్యత చెప్పింది రాసుకోవడం మాత్రమే కాబట్టి, ఇంకా ఏదైనా అడిగితే అది న్యాయస్థాన నియమాలకి వ్యతిరేకం కాబట్టి అలాగే నమోదు చేశాడు.‘‘సరే! నీ మతం ఏమిటి?’’‘‘కబీరు మతం.’’‘‘ఏ కులం నీది?’’‘‘దేవుడి కులం’’‘‘ఇంకా ఏమైనా నీ వివరాలని చెప్తావా?’’‘‘నేను అనసూయాదేవిని, మహాలక్ష్మిని.’’మేజిస్ట్రేటు మారు మాట్లాడక ‘వెళ్లవచ్చు’నన్నట్టు చూశాడు. చిత్రమేమంటే మేజిస్ట్రేటు ఎక్కడా కూడా ‘నీ ఊరేది?’ అని అడగలేదు. సాయి చెప్పలేదు కూడా.షిర్డీకి వంద మైళ్ల దూరంలో పత్రి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోనే సాయి పుట్టాడనే ఓ వదంతి ఉంది. ఆ దిశగా పరిశీలించారు కొందరు మేధావులు.జన్మస్థలం ‘పత్రి’కాదుసహజంగా ఎవరైనా ఎక్కడైనా పుడితే ఆ విషయం తెలియకుండా ఉండదు. పుట్టాడు అనగానే తల్లి, తండ్రి, మేనత్త, మేనమామ, ఇతర బంధువులు, ఆప్తులూ తిరిగిన ప్రదేశం చదువుకున్న బడీ, లేదా పనిచేసిన పొలం... ఇలా ఏవో కొన్ని వివరాలు తప్పక ఉంటాయి. ఒకరికి కాకపోతే మరొకరికైనా తెలిసి తీరుతాయి కదా! నిజంగా సాయే గనుక పత్రి గ్రామంలోనే పుట్టి ఉండి ఉంటే, ఆ గ్రామం షిర్డీకి కేవలం వంద మైళ్ల దూరంలోనే ఉంది కాబట్టి, ఆ ఊరి ప్రజలు ఇక్కడికీ, ఇక్కడివారు అక్కడికీ ఏవో వృత్తి వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ నిజం తప్పక బయటపడి ఉండేదే తగిన సాక్ష్యాధారాలతో. ఒక వ్యక్తి జన్మించాడంటే పైన అనుకున్న తీరుగా ఏ కొందరో బంధువులు తప్పనిసరి కాబట్టి, నేరుగా షిర్డీలో మసీదు గోడనానుకుని కూర్చుని ఉన్న సాయి దగ్గరకే వచ్చి, ఈ పత్రి గ్రామం, జన్మస్థలం... వ్యవహారాన్ని చెప్పి ఉండకపోవచ్చును గానీ, ఏ ఒక్కరో అయినా ఆ నోట ఈ నోట ఫలానివారికి కలిగిన కుర్రవాడు, వాని లక్షణాలు ఇవీ, వృత్తి ఇదీ, ఇల్లు ఇదీ.. అంటూ చెప్పకుండా ఉండగలరా? పోనీ! ఎవరికైనా జన్మస్థలం జన్మనిచ్చిన తల్లి అతిముఖ్యులు కాబట్టి, తన తల్లిపేరునీ ఊరిపేరునీ సాయి ఎక్కడైనా చెప్పాడా? చెప్పుకున్నాడా? పదిమందిలో చూచాయిగానైనా అన్నాడా?.. అని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే రాలేదు ఆయననుండి. పోనీ! ఏ ఊరు పేరూ గుర్తింపూలేని వ్యక్తుల విషయంలోనైతే సమాచారం తెలియకపోవచ్చుననుకోవచ్చు గానీ, ఇందరు రోగులకి రోగ బాధని నయం చేస్తూనూ, ఒంటరిగా ఉంటూ ఎవరి జోలికీ పోకుండా ఇంత చిన్నవయసులో ఇంత సభ్యతతో ఉంటూ కనిపిస్తూంటేనూ, ఏమీ ఆశించకుండానూ ఏం తింటున్నాడో ఎలా జీవనాన్ని గడుపుతున్నాడో ఎవరికీ తెలియని రీతిలో ఉంటూంటేనూ ఆయన గురించి సమాచారం వంద మైళ్ల దూరంలో ఉన్న ‘పత్రి’ గ్రామవాసులకి తెలిసి ఉండదా?ఇదంతా ఒకెత్తూ... సాయికి బాగా దగ్గరగా ఉండే వారైన నానాదీక్షిత్, అలాగే బూటీ... మరికొందరికీ సాయి చెప్పి ఉండడా? లేక వీరు అడిగి ఉండరా? తెలిసి ఉండదా? వాళ్లెవరూ సాయిది ‘పత్రి’ గ్రామమనకపోవడంతో పాటు అసలు ఆయన జన్మస్థలం గురించిన ప్రస్తావననే తేకపోవడం మరొకెత్తూను.సాయి ఇంకా ఈ లోకంలో ఉండగానే ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా ఉంటున్న ‘మహల్సాపతి’ అనే ఆయన సాయిమీది విశేష భక్తితో అనేక పర్యాయాలు సాయికీర్తనలని రాగయుక్తంగా పాడాడు కదా! ఆయన కూడా ఎక్కడా ఏనాడూ ఏ చోటా సాయి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని గానీ, విశేషించి ‘పత్రి గ్రామం’ పేరుగాని ఎత్తనే లేదు.మరి ఈ జన్మస్థలం గురించిన ఈ చర్చ అపోహలకి కారణం ఒక్కటే. ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా పనిచేస్తూండే ‘మహల్సాపతి’ అనే ఆయన ఒక పెన్సిలుతో ఒక కాగితం మీద ‘సాయి షిర్డీ సమీపంలోని పత్రి గ్రామంలో పుట్టాడు’ అని రాసి ఉండడమే. ఈ రాతకి ఏ మాత్రం ఆధారం లేనే లేదు. ఏతావతా తేలిందేమంటే మనం చెప్పుకోబోయిన కథ చెప్పుకున్న మన సాయి కథా ‘కంచికి వెళ్లకుండా మళ్లీ అనగనగా... అంటూ కథ ప్రారంభానికే వచ్చేసిం’దని. దీన్ని బట్టి సప్రమాణంగా తెలిసేదేమంటే... సాయి జన్మస్థలం, తల్లిదండ్రులు, సాయి పేరు, సాయి మతం, సాయి బాల్య విశేషాలు, సాయి చేసే వృత్తి.. ఇలా ఏమీ కూడా ఇప్పటివరకూ తెలియనే తెలియవనీ, తెలియడం కోసం ప్రయత్నించిన అందరికీ కూడా అంతుబట్టనే లేదనీను.ఇదంతా ఇలా ఉంచి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడోనని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ఆయన్ని గురించిన వివరాలని ధైర్యం చేసి ఆ సాయినే అడిగితే ఆయన, చిరునవ్వుని మౌనంగా నవ్వి మరో పక్కకి తొలిగిపోయేవాడు కూడా.ఊరు, పేరూ వివరాలూ లేకుండా ఉండడం సాధ్యమా?పైన చదివిందాని ప్రకారం సాయి ఊరూ పేరూ వివరాలూ.. ఇలా ఏమీ తెలియవీల్లేదని అనుకున్నా, అలా ఉండడం సాధ్యమా? అనే సందేహం మనకి వస్తుంది. అలా రావడం తప్పుకాదు కూడా.ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకుందాం!సాయి మనలా ఒక కులానికీ, మతానికీ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. అందుకే కులాన్ని గురించి అడిగితే దేవుడికులమని, మతాన్ని అడిగితే కబీరు మతమనీ అన్నాడు. సంప్రదాయం గురించిఎవరూ అడగకున్నా.. వేషం ప్రకారం మహ్మదీయం, తులసి మొక్క నాటడం, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసే సంప్రదాయం(ధుని) అలాగే మసీదుని ద్వారక అనడం ప్రకారం హైందవమనీ తెలియజేసుకున్నాడాయన.తాను పుట్టిన 16 సంవత్సరాల వరకూ ఏ ఉనికీ లేకుండా అకస్మాత్తుగా వెలుగులోకి రావడం ప్రకారం ఆయన ఏదో ఓ ఘనకార్యాన్ని లోకానికి చేయదలిచి వచ్చినవారే అని అర్థమవుతుంది. దీనికి బలమైన ఆధారం కూడా ఒకటుంది! లోకంలో అందరికీ ఈ అకస్మాత్తుగా ఊడిపడ్డ సాయిని గురించిన అనుమానం కలిగి షిర్డీగ్రామంలో ఉన్న గ్రామదేవతకి జరిగే ఉత్సవాల్లో ఓ రోజున ఈయనని గురించి తెలుసుకోవాలనుకున్నాడు.ఆ రోజుల్లో యథార్థమైన ‘పూనకాలు’ ఉంటూండేవి. ‘పూనకం’ అంటే ఒక దైవశక్తి. నిత్యం ఆ దేవిని ఉపాసిస్తూండే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడమని అర్థం. అలా దైవశక్తి ఈలోనికి ఆవహించిన వేళ, అలా ఆవహింపబడిన వ్యక్తికి బాహ్యస్పృహా స్మృతీ ఉండవు. అంటే తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో, తన వివరాలేమిటో తనకి తెలియవు. కేవలం ఆ దేవీ స్మృతీ స్పృహలోనే ఉంటారు.అలాంటి పూనకం వచ్చిన వ్యక్తిని అక్కడి ప్రజలంతా ఈ 16 సంవత్సరాల బాలుని గురించి చెప్పవలసిందిగా కోరారట. అంతే! ఒక గునపం తెమ్మని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించి తవ్వవలసిందన్నాడు ఆ పూనకం వచ్చిన వ్యక్తి. కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. ఆ రాతిని తొలగించి చూస్తే నాలుగు దీపాల ప్రమిదలూ కన్పించాయి. అంతేకాదు, అప్పుడే పూజ చేసి ఎక్కడికో వెళ్లిన తీరులో పూజాద్రవ్యాలూ పూజ చేసిన విధానాలు కనిపించాయి అందరికీ. ‘‘ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ నేలమాళిగలో తపస్సు చేశాడు. ప్రతి నిత్యం ఇలా చేస్తూ పైకి వస్తూంటే అక్కడి జనమంతా అనవసర ప్రశ్నలతో బాధిస్తుంటే, ఆ ప్రదేశాన్ని విడువబోతూ ఈ బండని కప్పి.. దయచేసి ఈ ప్రదేశాన్ని పాడుచేయకండి అని ప్రార్థించి వెళ్లిపోయాడు’’ అని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.అంటే దాదాపు 1838లో జన్మించిన సాయి 1842 లో (నాల్గవ సంవత్సరంలో) తపస్సు ప్రారంభించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి 1854లో షిర్డీ పొలిమేర జనులందరికీ కనిపించాడన్నమాట. అక్కడి నుంచిమరో నాలుగు సంవత్సరాల పాటు సాయి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. పోనీ! ఇంత గొప్పవాడు సాయి అనే అభిప్రాయంతో ఆ గ్రామదేవత అయిన ఖండోబా ఆలయంలో ఎక్కడో ఒక చిన్న గదినైనా సాయికి ఇయ్యగలిగారా ఎవరైనా? అంటే ఈయన హైందవధర్మానికి చెందినవాడు కాదు గదా! అని ఆ ఆలయ అర్చకుడు ‘మహల్సాపతి’తో పాటు అందరూ నిరాకరించారు ఇవ్వడానికి, లేదా మౌనంగా ఉండిపోయారు. చిత్రమేమంటే ఆయన 1858లో తిరిగి షిర్డీకి రాగానే ఆయన ప్రతిభ ప్రారంభమయింది. ఆయనకి పేరు పెట్టడంతో సహా లీలలన్నీ జనులకి ఒకటొకటిగా తెలియసాగాయి. తన పాదాలనుండి ‘దాసగణు’ అనేమహాభక్తునికి గంగా యమునా నదీ ధారలని చూపించాడు సాయి. ఎలాగో చూద్దాం. ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
‘కల్పవృక్షం’ లాంటి కథాసంపుటి
వాల్మీకి రామాయణాన్ని ఎన్నో భాషలలో అనువదించారు. కథల రూపంలో చెప్పారు. గేయరూపంలో గానం చేశారు. ప్రశ్నోత్తరాలుగా పొందుపరిచారు. ఎవరు, ఎన్నివిధాలుగా చెప్పినా, అందులో ప్రతిసారీ కొత్తదనం కనిపిస్తుంది. కారణం రామాయణానికున్న రమ్యత. అలాంటి రామాయణ గాథను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’గా కొన్ని తరాలవారు చదువుకుని ఆనందించేంతటి అద్భుతమైన రచన చేశారు. ఆ ‘జ్ఞానపీఠం’ బాటలోనే నడుస్తున్నారు ఆయన సోదరుని కుమారుడు విశ్వనాథ శోభనాద్రి. దాదాపు రెండు దశాబ్దాలుగా ‘నమామి వేదమాతరం’ అనే మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తూ, ఆ అనుభవంతో రామాయణ గాథలను, అందలి రమణీయమైన ఘట్టాలను సులభ శైలిలో సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా చక్కటి కథలుగా మలిచి ‘కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు’ అనే పుస్తకరూపంలో అందించారు విశ్వనాథ. అందమైన హార్డ్‌బౌండ్ ముద్రణలో, ఆకట్టుకునే చిత్రాలతో 180 కథలున్న ఈ ఉద్గ్రంథం ఎంతో బాగుందని ముందుమాటలో ఎందరో పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు పేర్కొన్నారు. చెరుకు తీపి గురించి వినడం కన్నా, రుచి చూస్తే కానీ తెలియనట్టే, ఈ గ్రంథాన్ని స్వయంగా చదువుకుంటే కానీ, ఆస్వాదించలేం. పెద్దలు పిల్లలకు కథలుగా చెప్పుకోవడానికి, బహుమతిగా ఇచ్చుకోవడానికి ఉపకరించే ఈ పుస్తకం పారాయణకూ పనికొస్తుంది. కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు రచన: విశ్వనాథ శోభనాద్రి; పుటలు: 330; వెల రూ. 600 ప్రతులకు: విశ్వనాథ శోభనాద్రి చారిటబుల్ ట్రస్ట్ 16–2–836/బి/3, ఎల్.ఐ.సి కాలనీ, సైదాబాద్, హైదరాబాద్–59, ఫోన్:9440666669 – డి.వి.ఆర్ -
చంద్రబాబుకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది!
కర్నూలు జిల్లా: గత ఎన్నికల్లో ఎస్టీ జాబితాలోకి చేరుస్తానని మాట ఇచ్చి మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వాల్మీకీలు బుద్ది చెప్పే సమయం వచ్చిందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆలూరులో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాల చరిత్ర మార్చేది బీసీలేనని, అలాంటి తమని చంద్రబాబు విస్మరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రానున్న ఎన్నికలలో తమని గుర్తుంచకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఒక ప్రాంతంలోని 5 జిల్లాలో వాల్మీకులను ఎస్టీలుగాపెట్టి మిగతా 8 జిల్లాలో బీసీల జాబితాలో ఉంచడం చాలా దారుణమన్నారు. -
వాల్మీకీల అభ్యున్నతికి కృషి: కడియం
హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాల్మీకీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో వెనుక బడిన తరగతుల సంక్షేమశాఖ, మహర్షి శ్రీవాల్మీకి జయంతి ఉత్సవ కమిటీ నిర్వహిం చిన వాల్మీకి జయంతి వేడుకల్లో కడియం మాట్లాడారు. ప్రత్యేక వృత్తి లేని వాల్మీకీలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీని చ్చారు. వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీలో కలపాలనే డిమాండ్ ఉందని, ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ వేసిందని చెప్పారు. కమిటీ సిఫా రసుల మేరకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్, కమిష నర్ టి.విజయ్‌కుమార్, ఎంబీసీ అభివృద్ధి సంస్థ సీఈవో కె. అలోక్ కుమార్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, వాల్మీకి జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్లు వెంకటరమణ, గట్టు భీముడు, ఎం.వేణుగోపాల్, తిమ్మప్ప, కె.అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎసీ్టల్లో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు
ప్యాపిలి: వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ప్యాపిలిలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని క్యాబినేట్ ద్వారా కేంద్రానికి సిఫారస్ చేస్తామన్నారు. వాల్మీకులు తమ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామనే హామీపై కాలయాపన చేయడం తగదన్నారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరపాలని కేవలం ఒక రోజు ముందు జీవో విడుదల చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. అంతకు ముందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో రిటైర్డు మైనింగ్ ఎండీ రాజగోపాల్, కర్నూలు సీఐడీ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు, మంత్రాలయం జెడ్పీటీసీ సభ్యులు రాంభీం నాయుడు, లక్ష్మయ్య, ప్యాపిలి ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు పత్తికొండ ఎంపీపీ గోవిందు, పామిడి మార్కెట్‌యార్డు చైర్మన్ సుంకిరెడ్డి, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, డోన్ మాజీ జెడ్పీటీసీ వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దశబ్దాలుగా వాల్మీకులకు అన్యాయం
కర్నూలు(అర్బన్): దశబ్దాలుగా వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్‌లోని బీసీ భవన్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వాల్మీకి కులానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్యపాల్ కమిటీని నియమించిందన్నారు. వాల్మీకులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య మాట్లాడుతు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పోరాట కమిటీ అధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు సుబ్రమణ్యం, పాలెగార్ సత్యనారాయణ రాజు, రామకృష్ణ, యాపలయ్య, కృష్ణ, అనుమంతు, బీసీవీఎస్ జిల్లా అధ్యక్షుడు రంగమునినాయుడు, ఏవీ నాయుడు, రమణ, చిత్రసేనుడు తదితరులు పాల్గొన్నారు. -
'వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి'
బి.కొత్తకోట (చిత్తూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వాల్మీకి సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన వాల్మీకుల సదస్సులో పాల్గొన్న ఆయన ముందుగా.. ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని.. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని.. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
-
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
• మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం • ఏపీలో ఐదోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్ అనంతపురం: ‘‘కర్ణాటకలో వాల్మీకులు(బోయ)లు ఎస్టీలు. ఇక్కడ బీసీలుగా చూస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు, ఉద్యోగాలు రావాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు అడుగుతున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసాయాత్రలో ఐదోరోజు శనివారం జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. మడకశిరలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. హంద్రీ-నీవా ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్ చలువే! చంద్రబాబు మాత్రం ‘అనంత’కు వచ్చినప్పుడల్లా తానే నీళ్లు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఆయన సీఎం అయి ఏడాది దాటింది. కేవలం రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి కరెంటు బకాయిలకు కూడా సరిపోవు. వైఎస్ చిత్తశుద్ధితో ప్రాజెక్టును నిర్మించారు కాబట్టే 85% పూర్తయింది. ఈరోజు చంద్రబాబు కుళాయి తిప్పి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు తక్కిన పనులు బాబు పూర్తి చేయలేరు. అధికారంలోకి రాగానే దాన్ని కూడా పూర్తి చేసి ‘అనంత’లోని ప్రతీ ఎకరాకు సాగునీరు ఇస్తాం. బాబుది మోసపూరిత పాలన: బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పొచ్చు... రుణమాఫీ చేస్తానని రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను... ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల భృతి ఇస్తామని నిరుద్యోగులనూ మోసం చేశారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లను నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేశారు. రేషన్‌కార్డులు ఇచ్చేవారు లేరు. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు. ఈ మోసాన్ని వదిలేది లేదు. అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై పోరాడాలి. రాహుల్ గురించి మాట్లాడాల్సిన పని లేదు రాహుల్ ఎప్పుడు ఇండియాలో ఉంటారో, ఎప్పుడు విదేశాల్లో ఉం టారో తెలీదు. ఏపీలో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినా తక్షణం స్పందించేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే! ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రాహుల్‌గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు? రొద్దం మండలం పి.కొత్తపల్లికి చెందిన లక్ష్మన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కుటుంబ స్థితిగతులు తెలుసుకోలేదు. దమ్మిడీ సాయం చేయలేదు. లక్ష్మన్నకు బ్యాంకులో రూ.1,90 లక్షలు అప్పుంది. తీసుకున్న అప్పుకు రూ.20 వేలు వడ్డీ అయింది. రూ.19 వేలు మాఫీ అయింది. వడ్డీకి కూడా సరిపోని విధంగా బాబు రుణమాఫీ అమలు చేశారు. వడ్డీలేని రుణాలు తీసుకునే రైతులు 14 శాతం అపరాధవడ్డీ చెల్లిస్తున్నారు. తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉసురు తీసుకున్న లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరు? పబ్లిసిటీ వచ్చే చోట మాత్రమే పరిహారం ఇస్తారా? ‘అనంత’ రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారు. -
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి
కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే లక్షలాదిమందితో ప్రభుత్వంపై దండయాత్ర చేపడతామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఏపీ రాష్ట్ర కమిటి హెచ్చరించింది. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కుప్పం నుంచి హైదరాబాదుకు చేపట్టిన 11 వందల కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ మాట్లాడుతూ.. ఏపీలోని 5 జిల్లాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తిస్తున్నా.. మిగతా 8 జిల్లాల్లో బీసీలుగానే గుర్తిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించిన సీఎం కేసిఆర్ చెల్లప్ప కమిటీని నియమించారని, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏడాది గడిచినా అమలు చేయక పోవడం శోచనీయమన్నారు. ఆలూరు ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజకీయ లక్ష్యం కోసం కాకుండా అణిచివేతకు గురవుతున్న వాల్మీకులకు రిజర్వేషన్లు సాధించేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు. వీఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు డాక్టరు పార్థసారథి, ప్రధానకార్యదర్శి ఎల్ భాస్కర్, ఉపాధ్యక్షులు అద్దాల నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు కూలుస్తున్నారని మతమార్పిడి
రాంపూర్: తమ ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో వాటిని, తమ హక్కులను కాపాడుకునేందుకు 800 మంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడి చేసుకున్నారు. తమ నివాసాలు కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నందున వాటిని రక్షించుకునేందుకు వేరే దారిలేక తాము ముస్లిం మతంలోకి మారుతున్నామని, అందుకు అంబేద్కర్ జయంతి రోజును ఎంచుకున్నామని తెలిపారు. కొందరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం ఆ వాల్మీకీలు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని ఆ ఇళ్లకు గత వారమే రెడ్ మార్క్ కూడా వేశారు. అయితే, వాస్తవానికి ఈ స్థలంపై యూపీ మంత్రి అజాంఖాన్ కన్నుపడిందని, ఆయన అక్కడ షాపింగ్ మాల్స్, వర్తక సముదాయాలు నిర్మించేందుకు వాల్మీకీలను ఖాళీ చేయాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నించిన వారంతా పలు రకాలుగా నిరసనలు తెలిపి చివరికి ముస్లిం మతంలోకి మారారు. అయితే, దీనిపై అజాంఖాన్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ ముస్లిం మతంలోకి మారేముందు వారంతా ఒకసారి ఆలోచించుకోవాలని, అలా చేసినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు మారవని చెప్పారు. ప్రభుత్వం స్థలం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బీటీనాయుడు పత్తికొండ టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌వారి హయాంలో రెండువందల ఏళ్లు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్సీలుగా, కర్ణాటకలో ఎస్టీలుగా గుర్తించారన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాల్మీకులు విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోస్తాలోని ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా, తెలంగాణ ప్రాంతంలో బీసీలుగా, రాయలసీమ ప్రాంతంలో డీనోటిఫైడ్ ట్రైబ్‌లుగా గుర్తించారన్నారు. ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాలతో పూర్తిగా నష్టపోయారన్నారు. వాల్మీకులకు కులవృత్తి లేకపోవడంతో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకుని నేరాలకు పాల్పడి, కేసులలో ఇరుక్కుని కుటుంబాలు నాశనం చేసుకున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల వేళ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చి, తర్వాత విస్మరిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపించాడన్నారు. అలాగే రిటైర్డు ఐఏఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిటీని నియమించారన్నారు. ఈ విషయమై వాల్మీకి సంఘాల నాయకులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ సమస్య విన్నవించామన్నారు. సీఎం చంద్రబాబు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై సానుకూలంగా స్పందించాడన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ మైరాముడు, బీసీసంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, వాల్మీకిసంఘం నాయకులు ఆస్పరి రవిచంద్ర, బీటీ గోవిందు, హోసూరు రామాంజినేయులు, దస్తగిరి నాయుడు, మునిస్వామి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. మంగళవారం ఆమె ఢిల్లీలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోలారాంను కలిసి వాల్మీకుల స్థితిగతులపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ పరిధిలో దాదాపు 4.50 లక్షల మంది వాల్మీకులు ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణిస్తున్నా.. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా గుర్తిస్తున్నారన్నారు. ఈ వ్యత్యాసం వల్ల అత్యంత వెనుకబడిన వాల్మీకులు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏపీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వాల్మీకుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వాల్మీకి భవన్ నిర్మించాలన్నారు. ప్రతి వాల్మీకి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ వాల్మీకిగానే చూపాలన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆమె కేంద్ర మంత్రికి వివరించారు. ఇదిలాఉంటే వాల్మీకుల్లోని ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఎంపీ బుట్టా రేణుక చేసిన కృషి పట్ల వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ హర్షం వ్యక్తం చేశారు. -
విశ్వసనీయతకు మారుపేరు వాల్మీకులు
కర్నూలు(అర్బన్): విశ్వసనీయత, ధైర్య సాహసాలకు వాల్మీకులు మారుపేరని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మహర్శి వాల్మీకి జయంతి సభను అధికారికంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.రవిచంద్ర అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్, డిప్యూటీ కలెక్టర్ జయకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ నిబద్ధతకు నిలువుటద్దమైన వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా కొందరు స్వార్థపరులు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్మీకి జీవిత చరిత్రను భావి తరాల వారికి అందించి.. అన్ని రంగాల్లో రాణించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. వాల్మీకి జీవిత చరిత్రను యువత తెలుసుకొని ఆయన చూపిన మార్గంలో పయనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి పిల్లలను బాగా చదివించాలన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాల్మీకుల్లో చైతన్యం వచ్చిందని, మరింత మెరుగవ్వాలన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చక్కటి ప్రణాళిక రూపొందించారని, అయితే ఊహించని విధంగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇతర జిల్లాలకు ఆదర్శంగా వాల్మీకి మహర్శి జయంతి వేడుకలను నిర్వహిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతు వాల్మీకి చెడుమార్గాన్ని వదలి సన్మార్గాన్ని ఎంచుకున్నారని.. సంస్కృతంలో రామాయణాన్ని రచించి ఆదికవిగా గుర్తింపు పొందారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ నరసింహులు, నంద్యాల జెడ్పీటీసీ లక్ష్మయ్య, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ గిడ్డయ్య, బాలసంజన్న, వలసల రామక్రిష్ణ, బుర్రా ఈశ్వరయ్య, సత్రం రామక్రిష్ణుడు, డాక్టర్ జీఆర్ మోహన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, పద్మజానాయుడు, ఎం.రాంబాబు, జ్ఞానేశ్వరమ్మ, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.