బి.కొత్తకోట (చిత్తూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వాల్మీకి సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన వాల్మీకుల సదస్సులో పాల్గొన్న ఆయన ముందుగా.. ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని.. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని.. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.