laxmi narayana
-
కామారెడ్డి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
-
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచించారు. చదవండి: ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు! -
సీఐడీ సోదాలు.. టీడీపీ నేతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాజధానిలో చోటు చేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం కంచికచర్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే సీఐడీ వస్తుందన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన ఇంటి గుమ్మానికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. (ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద') కాగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజిన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్ పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇక ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. -
అవినీతి రిజిస్ట్రేషన్
నగదు.. బంగారం.. ఇళ్లు.. స్థలాలు.. తోటలు.. వాహనాలు.. కళ్లు చెదిరే అవినీతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం సబ్ రిజిస్ట్రార్–1 లక్ష్మీనారాయణ ఇళ్లపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అనంతపురం, ధర్మవరంలోని ఐదు చోట్ల చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, ఆస్తులను గుర్తించారు. అనంతపురం సెంట్రల్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టిన అనంతపురం అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ –1 లక్ష్మీనారాయణ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. అనంతపురం, ధర్మవరంలో ఐదు చోట్ల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఏసీబీ అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తొలి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణపై అక్రమాస్తులు కూడబెట్టినట్లు అభి యోగాలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ జయరామరాజు, సిబ్బంది సహకారంతో జిల్లాలో ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బినామీ పేర్లతో ఆస్తులు కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ 1994లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2001లో సీనియర్ అసిస్టెంట్‌గా, 2005లో సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్–2గా పదోన్నతి పొందారు. 2005 నుంచి 2007 వరకు మళ్లీ సీనియర్ అసిస్టెంట్‌గా డిమోషన్ పొందారు. 2007 అక్టోబర్‌లో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1గా పదోన్నతి పొందారు. గుత్తి, ధర్మవరం, ఆడిట్ శాఖలో పనిచేశారు. ప్రస్తుతం ఈయన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్–1గా మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తొలినుంచి ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో అక్రమంగా డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేటలో గల ఆయన ఇంటిపై తొలుత దాడి చేశారు. అనంతరం బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో ఆయన బినామీ ఆస్తులపై, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీ నిర్వహించారు. వీటిలో దాదాపు రూ.12 లక్షల నగదు, రూ.5 లక్షలు విలువజేసే 17.4 తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అక్రమ ఆస్తుల వివరాలు లభ్యం సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. అనంతపురం రూరల్ ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేటలో మాత్రమే జీ ప్లస్ 1 ఇళ్లు మూడు ఉన్నాయి. 2010, 2012, 2016లో వీటిని నిర్మించుకున్నారు. విద్యారణ్యనగర్‌లో మరో ఇంటిని 2018లో నిర్మించారు. వీటితో పాటు పాపంపేట గ్రామ పరిధిలో నాలుగు ఇంటి స్థలాలు ఉన్నాయి. ఆత్మకూరు మండలం తలుపూరులో రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్ మండలం కామారుపల్లిలో ఓ వ్యవసాయ తోట ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఒక మహింద్రా బొలెరో వాహనం, హీరో హోండా స్లె్పండర్, హోండా స్కూటీ ద్విచక్రవాహనాలు ఉన్నాయి. నిందితున్ని విచారించిన అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి, మోహన్‌రెడ్డి, ఖాదర్, బాషా, తేజేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో కేసు
ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్ట్‌లో కేసు దాఖలు చేసినట్లు విశ్రాంత నీటిపారుదల శాఖ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును ఈ నెల 9న సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించనుంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్ధ్యం అవసరానికి మించి ఉందని, రీడిజైన్ పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ 19 రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి అవసరాలకు మించి అదనపు సామర్ధ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పిటిషన్లో వెల్లడించారు. నిల్వ సామర్థ్యం 144 టీఎంసీలు అంటూ.. మొదటి పంటకు 170 టీఎంసీల నీరు ఇస్తామంటూ ప్రభుత్వం పొంతన లేని లెక్కలు చెబుతోందని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం అంటే అధిక వ్యయంతో కూడుకున్నదని, అనాలోచితంగా ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టుల కోసం రీడిజైన్ చేశారని ఆరోపించారు. 50 వేల కోట్ల రూపాయల నిర్మాణం వ్యయం అయ్యే దానికి రీడిజైన్ పేరుతో 90 వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారని తెలిపారు. అనవసరంగా ప్రజలను నిర్వాసితులుగా చేస్తున్నట్లు పిటిషన్లో వివరించారు. -
రైలు కింద పడి చిరు వ్యాపారి ఆత్మహత్య
ధర్మవరం టౌన్ : కడుపు నొప్పి తాళలేక ధర్మవరంలో ఓ చిరువ్యాపారి గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కేతిరెడ్డి కాలనీకి చెందిన ఈడిగ లక్ష్మీనారాయణ (55) పట్టణంలో టీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం నొప్పి అధికమైంది. దీంతో బహిర్భూమికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ కాలనీవాసులు గుర్తించి లక్ష్మీనారాయణ బంధువులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటసుబ్బమ్మ, కుమారులు శ్రీనివాసులు, లక్ష్మయ్య, పవన్‌కుమార్ ఉన్నారు. -
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
-
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణకు చెందిన నల్లపాటి నారాయణ కాంప్లెక్సు(అపార్టుమెంట్)ను మున్సిపల్ సిబ్బంది కూల్చడానికి యత్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చేందుకు పోలీసులతో తరలివచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నేత రాములు అధికారులను అడ్డుకున్నారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించారు. దీంతో కోడెల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ భవనాన్ని కూల్చేందుకు పూనుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. -
మిర్యాలగూడలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక యువకుడు ఆదివారం మధ్యాహ్నం బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. దామచర్ల మండలం తిమ్మాపురం గ్రామం తూర్పు తాండాకు చెందిన రాము మిర్యాలగూడలోని ఎన్ఎస్సి క్యాంప్‌లో ఉన్న మణికంఠ హోటల్లో పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం హోటల్ యజమానితో పొసగక మానేశాడు. తనకు చెందిన స్టవ్‌ను తీసుకెళ్లాడు. దాంతో ఆగ్రహించిన హోటల్ యజమాని లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదుచేసి స్టవ్ చోరీ చేశాడని కేసు పెట్టాడు. దాంతో పోలీసులు రామును పోలీస్‌సేస్టేషన్ తీసుకెళ్లి వాళ్ల రీతిలో ట్రీటేమెంట్ ఇచ్చారు. దాంతో ఆవేదనకు గురైన రాము హోటల్ యజమాని కేసు పెట్టడంవల్లే ఇదంతా అయిందని ఆదివారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ద్గమని నచ్చచెబుతున్నారు. అయినా తను ససేమిరా అంటున్నాడు. -
'వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి'
బి.కొత్తకోట (చిత్తూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వాల్మీకి సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన వాల్మీకుల సదస్సులో పాల్గొన్న ఆయన ముందుగా.. ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని.. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని.. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
పేషీ అధికారుల కోసం చంద్రబాబు కసరత్తు
* సలహాదారులుగా మాజీ సీఎస్‌లు ఎస్వీ ప్రసాద్, మోహన్‌కందా, సీనియర్ ఐఏఎస్ రణదీప్ సుడాన్, రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం * ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులుగా సతీష్ చంద్ర, గిరిధర్, దగ్గుబాటి సాంబశివరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, జి. సాయిప్రసాద్, ఐఎఫ్ఎస్ అధికారి రామలక్ష్మి పేర్ల పరిశీలన * డీజీపీగా ప్రసాదరావును కొంత కాలం కొనసాగించాలని నిర్ణయం * ఇంటెలిజెన్స్ ఐజీగా బాలసుబ్రహ్మణ్యం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే నెల తొలి వారంలో బాధ్యతలు చేపట్టనున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పేషీ అధికారుల నియామకం కోసం కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయమై గతంలో తన పేషీలో పనిచేసిన అధికారుల సహాయ, సహకారాలు, సూచనలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేషీలో ఓఎస్డీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ఎంతో కాలంనుంచి ఆయన వద్దే పనిచేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కీలక బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ప్రస్తుతం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. వీరితోపాటు గతంలో తన వద్ద పనిచేసిన మాజీ ఐఏఎస్‌లు ఎస్వీ ప్రసాద్, ఎం. సాంబశివరావులతో పాటు పార్టీ నేతల సలహాలను కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు. తన పేషీలో ముఖ్య కార్యదర్శితోపాటు కార్యదర్శులు, ఓఎస్డీలుగా నియమించుకునేందుకు ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ అధికారి ఎ. గిరిధర్, గతంలో తన పేషీలో పనిచేసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచే స్తున్న సతీష్ చంద్రల పేర్లను పరిశీలిస్తున్నారు. వారిద్దరితో చంద్రబాబు ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. సతీష్ చంద్ర డెప్యూటేషన్ ఈ ఏడాది జూలై 23కు ముగుస్తుంది. వీరే కాకుండా ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆర్థికశాఖలో ఉన్న దగ్గుబాటి సాంబశివరావు పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్‌ను తన పేషీలోకి తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఐఎఫ్ఎస్ అధికారి సీఎస్ రామలక్ష్మిని కూడా తన పేషీలో నియమించుకోవాలని ఆయన యోచిస్తున్నారు. వీరే కాకుండా ఇద్దరు ఐఏఎస్ అధికారులను చంద్రబాబు తన నివాసానికి పిలిపించుకుని పేషీలో నియమించుకునే విషయమై మాట్లాడారు. వారు ఆలోచించుకుని చెప్తామని అన్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, ఐవీ సుబ్బారావుల్లో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. ఐవైఆర్ వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్నే సీఎస్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రిటైర్మెంట్ ఇప్పట్లో లేని అధికారిని నియమించుకోవాలనుకున్న పక్షంలో ఐవీ సుబ్బారావుకు ఛాన్స్ రావచ్చు. సలహాదారులుగా వీరే.... ప్రభుత్వంలో అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు అనువుగా పలువురు సలహాదారులను నియమించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు మోహన్‌కందా, ఎస్వీ ప్రసాద్‌లతోపాటు గతంలో తన పేషీలో పనిచేసి ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఐఏఎస్ రణదీప్ సుడాన్, రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యంలకు సలహాదారులుగా అవకాశాలున్నాయి. చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పీఏగా రాజగోపాల్ నియమితులవుతారు. డీజీపీగా కొనసాగనున్న ప్రసాదరావు ప్రస్తుతం ఉమ్మడి రాష్ర్ట డీజీపీగా ఉన్న బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తొలి డీజీపీగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారని సన్నిహితవర్గాల సమాచారం. ఇదిలా ఉండే ప్రభుత్వంలో కీలకమైన పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నియమించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న, గతంలో రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేసిన ఐజీ ర్యాంక్ అధికారి వీవీ లక్ష్మీనారాయణను తిరిగి రాష్ట్రానికి రప్పించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఆయన్ను రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై రప్పించి శాంతి, భద్రతల విభాగంలో ఐజీగా నియమిస్తారని ఎన్టీఆర్ భవన్ వర్గాల సమాచారం. సీపీఆర్వోగా ఏఏ రావు లేదా విజయకుమార్ చంద్రబాబు పేషీలో కీలకమైన ముఖ్య సమాచార పౌరసంబంధాల అధికారి (సీపీఆర్వో)గా దూరదర్శన్ కేంద్ర న్యూస్ డైరె క్టర్‌గా ఢిల్లీలో పనిచేస్తున్న ఐఐఎస్ అధికారి ఏ. అయ్యేశ్వరరావు (ఏఏ రావు) లేదా గతంలో సీపీఆర్వోగా పనిచేసిన డాక్టర్ ఎస్. విజయకుమార్లలో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. ఏఏ రావు 2009 సాధారణ ఎన్నికల సమయంలోనే ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి చంద్రబాబు దగ్గర పనిచేశారు. టీడీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసి తన మనస్సులోని మాటను వెల్లడించారు. అయితే విజయకుమార్‌ను సీపీఆర్వోగా నియమించుకుంటే మంచిదని గతంలో పేషీలో పనిచేసిన పలువురు అధికారులు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. సీఎస్‌వోలుగా కొనసాగనున్న ముద్రగడ, నగేష్‌బాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ముఖ్య భద్రతాధికారు(సీఎస్‌వో)లుగా ప్రస్తుతం అదే హోదాలో పనిచేస్తున్న అదనపు సూపరింటెండెంట్ ముద్రగడ నాగేంద్రరావు, డీఎస్పీ నగేష్ బాబు కొనసాగనున్నారు. వీరిద్దరూ సుమారు 15 సంవత్సరాలుగా చంద్రబాబు వద్ద భద్రతా విధులు నిర్వరిస్తున్నారు. -
దాడి కేసులో టీడీపీ నాయకుల అరెస్టు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: మదనపల్లె మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడిన సంఘటనలో నలుగురు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ విషయాన్ని రెండో పట్టణ సీఐ గంగయ్య తెలిపారు. సీఐ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి టీడీపీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి బండి నాగరాజు వర్గం స్థానిక మాయాబజార్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్టు లక్ష్మీనారాయణకు సమాచారం అందింది. దీంతో ఆయన తన ముఖ్య అనుచరుడు సుబ్రమణ్యంను వెంటబెట్టుకుని కారులో మాయాబజార్‌కు వెళ్లారు. ఇది గమనించిన టీడీపీ నాయకుడు మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీరామ్‌చినబాబు, యోగేశ్వర్బాబు అలియాస్ పెదబాబు, పెన్నార్ వెంకటేష్, శంకర్ మరికొంత మంది కారును అడ్డుకుని 34వ వార్డులో తిరిగావంటే అంతు చూస్తామని బెదిరించారు. ఎదురు తిరిగిన లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యంపై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో నిందితులు శ్రీరామ్‌చినబాబు, పెదబాబు, వెంకటేశ్, శంకర్ మరికొంతమందిపై సెక్షన్ 323, 324, 506, 188, 341 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. శనివారం సాయంత్రం నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : జాతరలో ఎంతో ఆనందంగా గడిచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు లారీ రూపంలో కబలించింది. గుత్తి మండలం బాట సుంకులమ్మ వద్ద మంగళవారం ఆటోను లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని సత్యనారాయణపేటకు చెందిన నెట్టికంటయ్య ఆహ్వానం మేరకు సుంకులమ్మ ఆలయంలో జాతరకు స్నేహితులు గుంతక ల్లు సోఫియా స్ట్రీట్‌కు చెందిన ఆటో డ్రైవర్లు విజయకుమార్ (35), ధర్మవరం గేట్‌కు చెందిన వెంకట్రాముడు(45), తిలక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు(40) వెళ్లారు. వారితో పాటు వెంకట్రాముడు సోదరుడు లక్ష్మినారాయణ కూడా ఉన్నాడు. వారంతా జాతరలో సంతోషంగా గడిపారు. అనంతరం అందరూ ఆటోలో( ఏపీ21ఎక్స్ 9562) గుంతకల్లుకు బయల్దేరారు. ఆలయం వద్ద నుంచి కొద్ది దూరం వెళ్లగానే మహబూబ్‌నగర్ ట్రాన్సకో విభాగానికి చెందిన ఏబీఎం 3859 నంబరు లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయకుమార్, వెంకట్రాముడు, శ్రీనివాసులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదరుగా పడ్డాయి. లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలాన్ని గుత్తి సీఐ మోహన్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డిలు పరిశీలించారు. లక్ష్మినారాయణను హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుత్తి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో డోన్ వద్ద మృతి చెందాడు. మృతుల్లో విజయకుమార్‌కు భార్య పద్మావతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రాముడుకు భార్య ధనలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, శ్రీనివాసులుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నాయకులు హుస్సేన్‌పీరా, సుభాష్‌రెడ్డి పరామర్శించారు. ఆటో డ్రైవర్ విజయకుమార్ భార్య పద్మావతి రోదించిన తీరు కలచివేసింది. దర్గాకు వెళ్లి వస్తూ.. కానరాని లోకాలకు.. గుత్తి/పెద్దవడుగూరు:పెద్దవడుగూరు మండ లం అప్పేచెర్ల వద్ద 63వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గుత్తిలో నివసిస్తున్న పీ.మహ్మద్ రఫీ(39) అసువులు బాసాడు. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ, మాబున్నీ దంపతులు పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో నివాసముంటున్నారు. ఆయన మైన్స్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తలు ద్విచక్ర వాహనంలో తాడిపత్రి వద్ద ఉన్న దర్గాకు నమాజు కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా అప్పేచెర్ల వద్ద గుత్తి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మహ్మద్ రఫీ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మాబున్నీకి తీవ్ర గాయాలతో పాటు రెండు కాళ్లు విరిగాయి. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాబున్నీని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మహ్మద్ రఫీ టీడీపీలో క్రీయాశీలక నాయకునిగా వ్యవహరిస్తున్నాడు. నియోజకవర్గ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. -
ఫ్యూజు వేయబోయి...
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ మాజీ సర్పంచ్, రైతు వొల్లాల లక్ష్మీనారాయణ(50) కరెంటుకాటుకు బలయ్యాడు. ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్‌వైర్ వేస్తుండగా, షాక్ తగిలి అక్కడే మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... లక్ష్మీనారాయణకు పదెకరాల పొలం ఉంది. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేయబోగా, కాలేదు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా, ఫ్యూజ్ పోయి కనిపించింది. దీంతో లక్ష్మీనారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫ్యూజ్‌వైరు వేస్తుండగా, షాక్ కొట్టి దానిపైనే ప్రాణాలు విడిచాడు. - న్యూస్‌లై న్, ఇల్లంతకుంట -
విభజన బిల్లుకు పూర్తి మద్దతు: బీజేపీ
గడువులోపు తిప్పిపంపాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోపు దాన్ని కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణకు బీజేపీ 2006లోనే తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అప్పట్లో సరైన మెజారిటీ లేకపోవడం, చంద్రబాబు ఒత్తిడి కారణంగా 3 రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఇవ్వలేకపోయామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు ముద్దుకృష్ణమ జోక్యం చేసుకున్నారు. రాజధానిగా ఉన్న ప్రాం తాన్ని ప్రత్యేక రాష్ర్టం చేయబోమని హోం మం త్రి హోదాలో బీజేపీ నేత అద్వానీ పార్లమెంట్లో అన్నారని గుర్తు చేశారు. అది అద్వానీ అభిప్రాయమని, బీజేపీ అభిప్రాయం తెలంగాణకు అనుకూలమని యెండల బదులిచ్చారు. అద్వానీ హోం మంత్రి హోదాలో దేశ ప్రతినిధిగా ఆ మాట చెప్పారు తప్ప ఎంపీగా చెప్పలేదని సీఎం కిరణ్ అన్నారు.