
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణకు చెందిన నల్లపాటి నారాయణ కాంప్లెక్సు(అపార్టుమెంట్)ను మున్సిపల్ సిబ్బంది కూల్చడానికి యత్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చేందుకు పోలీసులతో తరలివచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ, వైఎస్సార్‌సీపీ నేత రాములు అధికారులను అడ్డుకున్నారు.
గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించారు. దీంతో కోడెల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ భవనాన్ని కూల్చేందుకు పూనుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.