demolish
-
మీ కాళ్ళు మొక్కుతాం.. మా కడుపులు కొట్టొద్దు
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు
-
రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు
-
HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. ఆదివారం నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ఇక, అంతకుముందు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్ మాదాపూర్(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు భవనాన్ని కూల్చివేశారు. -
మంచి కాదు ముంచే ప్రభుత్వం.. గుర్తు పెట్టుకోండి మేము ఓట్లు వేస్తే గెలిచారు
-
నోటీసులు ఇవ్వం..కూల్చివేతలు ఆపం
-
కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ -
మహబూబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
TG: ఇక జిల్లాల వంతు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా అటు జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు రెవెన్యూ అధికారులు. క్రిష్టియన్పల్లిలో సర్వే నెంబర్ 523లోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసులు కలిసి కూల్చివేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఘటనా స్థలంలోనే అధికారులు ఉండి.. కూల్చివేతలు కొనసాగించారు.ఇక, హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలువురి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చెరువును ఆక్రమించి కాలేజీల నిర్మాణాలు జరిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ అంశం ఆసక్తికరంగా మారింది. -
హైడ్రా @ 30 రోజులు
-
హైడ్రా @ 30 రోజులు
-
హైడ్రా పేరుతో హైడ్రామా.. కూల్చివేతలపై కిషన్ రెడ్డి మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని మండిపడ్డారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు.ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అన్యాయంగా కూల్చేశారు..నాగార్జున ఎమోషనల్
-
పూర్తిగా నేలమట్టమైన నాగార్జున N కన్వెన్షన్
-
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
-
రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
-
HYDRA పరిధిలో కొనసాగుతున్న హైడ్రా యాక్షన్
-
బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్‌ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
కూటమి అరాచకాలు.. దన్నానపేటలో ఆర్మీ జవాన్ ఇంటి కూల్చివేత
-
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం
-
శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమవారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిరి్మంచిన పీఏసీఎస్ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిసభ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా చైర్మన్‌గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఎంఈవో సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు గంటా రజనీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మండపేట–ద్వారపూడి రహదారి పనులకు సంబంధించి స్థానిక తాపేశ్వరం రోడ్డులోని లాకులకు వెళ్లే దారిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోను పూర్తిగా తొలగించారు. ఘటనాస్థలాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పరిశీలించారు. శిలాఫలకాల ధ్వంసం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వెంటనే స్పందించి, ఇటువంటి ఘటనలను నిలువరించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ⇒ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లేదారిలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు తెలిపే శిలాఫలకాన్ని తొలగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం గ్రామంలో బత్తుల రాంబాబు ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాంబాబు ద్విచక్రవాహనాన్ని ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు మంటల్ని ఆరి్పవేశారు. అప్పటికే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. రాంబాబు భార్య స్వాతి గ్రామంలో వలంటీరుగా పనిచేసింది. టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్విచక్రవాహనం దహనమైంది. ఘటనాస్థలాన్ని ఎస్.ఐ. పి.హజరత్తయ్య పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ⇒ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కండువా వేశారు. టీడీపీ నాయకుల ఆగడాలు తారస్థాయికి చేరాయని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి అవమానించారని వైఎస్సార్సీపీ మర్లపాడు గ్రామ అధ్యక్షుడు సింగమనేని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
మరో వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో
సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్‌నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది.దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. “విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరొక వైయస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత కుట్రపై బయటపడ్డ సంచలన ఆడియో”తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పడు ఈ పార్టీ ఆఫీసునీ కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు. ఈ మేరకు కార్పొరేషన్… pic.twitter.com/HOj5nlm3Fx— YSR Congress Party (@YSRCParty) June 23, 2024 -
ఏపీలో మొదలైన విద్వాంస పాలన
-
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!
ఒకప్పటి అమెరికా టెలివిజన్ టాక్ షో సృష్టికర్త, నిర్మాత ఫిల్ డోనాహ్యూ బంగ్లా నేలమట్టమవుతోంది. ఇంద్ర భవనం లాంటి ఆ బంగ్లా ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆయన హయాంలో అది దాదాపు 200 కోట్లకు విక్రయించిన విలావంతమైన భవనాన్ని నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్ వద్ద ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేసే ఆ కట్టడం కనుమరుగువుతుందంటే చుట్టు పక్కల నివాసితులు సైతం కలత చెందారు. అంతలా అందర్నీ కట్టిపడేసిన భవనం ఎందుకు కూల్చేయాలనకుంటున్నారు? ప్రధాన కారణం ఏమిటో వింటే అవాక్కవుతారు. వివరాల్లోకెళ్తే..రాజభవనంలా ఉండే గోల్డ్ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనర్ ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్ ఆఫ్ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. 80వ దశకంలో టాక్ షో సృష్టికర్త డోనాహ్య, అతని భార్య, నటి మార్లో థామస్ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఈ బంగ్లాలో ఇతర వెస్ట్పోర్ట్ నివాసితులు, మరికొందరూ నటీనటులు ఎందరో ఇక్కడ గడిపి వెళ్లేవారు. 2006లో డొనహ్యు ఆ బంగ్లా దగర్లోనే మరో మల్టి మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‌ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్లకు అల్లిసన్‌కు అనే ఫైనాన్షియర్‌కి విక్రయించి వార్తల్లో నిలిచాడు. అల్లిసన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వద్ద అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పనిచేసేవాడు. నాటి ఒబామా సైతం బీచ్ వద్ద ఉండే ఈ అందమైన భవనం కోసం డబ్బును వెచ్చించేందుకు యత్నించినట్లు సమాచారం. 2013లో అల్లిసన్ మరణం తర్వాత ఆ భవనాన్ని పర్యవేక్షించేవాళ్లు లేరు. 2020లో రైనర్ దంపతులు కేవలం రూ. 136 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఆ భవనం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అది రాత్రి పూట సంచరించే ఎలుకలకు నిలయంగా మారింది. దీంతో ఆ దంపతులు ఈ బంగ్లాను కూల్చివేసేలా అనుమతించాలని హిస్టారిక్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. హిస్టారిక్ డిస్డ్రిక్ కమిషన్ మాత్రం ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజుల నిరీక్షించాలని ఆ దంపతులకు స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్ వెల్లడించింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం తోపాగు అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ యత్నిస్తోంది. (చదవండి: కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..) -
Odisha Tragedy: ఆ స్కూలును కూల్చేస్తున్నారు
బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన బాహాగానా హైస్కూలును కూల్చివేసినట్లు తెలిపారు ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర. శవాలను ఉంచిన చోటకు తిరిగి రావడానికి విద్యార్థులు జంకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. పిల్లలు భయపడుతున్నారు.. బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వారి బంధువులు వచ్చి తీసుకుని వెళ్లేంత వరకు బాహాగానా హైస్కూల్లోనే ఉంచారు. ఇక్కడి నుండి మృతదేహాలను తరలించిన తర్వాత స్కూలు గదులన్నిటినీ శుభ్రం చేసి శానిటైజ్ చేశాము. అయినా కూడా పిల్లల తలిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడానికి ఇష్టపడటం లేదు. దీంతో స్కూలుని కూల్చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించి పవిత్రం చేసిన తర్వాత స్కూలును పునః ప్రారంభిస్తామని అన్నారు రాజారామ్ మోహాపాత్ర. కలెక్టర్ ఆదేశాలు.. అంతకు ముందు బాలాసోర్ జిల్లా కలెక్టర్ భావుసాహెబ్ షిండే పాఠశాలను సందర్శించి స్కూలు మేనేజింగ్ కమిటీ నిర్ణయిస్తే స్కూలును కూల్చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే పాఠశాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుని స్కూలు కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సహాయాక చర్యల్లో భాగంగా మృతదేహాలను వెలికితీసిన వెంటనే వాటిని దగ్గర్లో ఉన్న బాహాగానా హైస్కూలుకు తరలించారు. మృతుల బంధువులు వచ్చి మృతదేహాలను గుర్తించేంత వరకు రోజులపాటు మృతదేహాలను అక్కడే ఉంచడంతో నేలంతా రక్తపు మరకలు అంటుకుని ఉంది. ఎంత కడిగినా కూడా పిల్లల మనస్సులో నుంచి భయాన్ని తొలగించలేమన్నది తల్లిదండ్రుల వాదన. Odisha Train Tragedy: Authorities Begin Demolition Of #Bahanaga Bazar High School.#Odisha #BalasoreTrainAccident #odishatraintragedy #balasore #BahanagaHighSchooldemolitionpic.twitter.com/gaOjgpeEnq — Priyathosh Agnihamsa (@priyathosh6447) June 9, 2023 ఇది కూడా చదవండి: శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా? -
ఎట్టకేలకు డక్కన్మాల్ నేలమట్టం
సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్మాల్ను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ భవనం ఆదివారం పూర్తిగా నేలమట్టం అయ్యింది. గత తొమ్మిది రోజులుగా కూల్చివేత పనులు జరుగుతుండగా.. ఎట్టకేలకు ఆదివారానికి దక్కన్ మాల్ కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం నేలమట్టం కావడంతో శిథిలాలను తొలగించే పనులను వేగవంతం చేశారు. ఈ భవనం కూల్చివేతలో ఎలాంటి ఆస్టి, ప్రాణ నష్టం జరగకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం మాల్ని కూల్చివేస్తుండగా ఒక్కసారిగా సగం భవనం కూలిన సంగతి తెలిసిందే. ఆ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు లోనయ్యారు. సరిగ్గా ఆ సమయానికి ఆ ప్రదేశంలో చుట్టుపక్కల వారు ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అదీగాక ఈ భవనం కూల్చివేత పనులు కారణంగా అధికారులు చుట్టపక్కల ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయిందచారు. దీంతో చాలా వరకు ప్రాణపాయం తప్పిందనే చెప్పాలి. అంతేగాక ఆ మాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ కూల్చివేత పనులన కాంట్రాక్టర్‌ను తొలుత ఎస్కే మల్లు కంపెనీ దక్కించుకున్న మధ్యలో జీహెచ్ఎంసీ ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మాలిక్ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. పనులు వేగవంతంగా చేసిన ఆ సంస్థ..ఎట్టకేలకు దక్కన్ మాల్ భవనాన్ని ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలమట్టం చేసింది. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..) -
‘డెక్కన్ మాల్ కూల్చివేత’ టెండర్ మార్పు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత టెండర్లో మార్పు చోటు చేసుకుంది. ఆ టెండర్‌ను ఎస్కే మల్లు కంపెనీ నుంచి కృష్ణ ప్రసాద్ ఏజెన్సీ దక్కించుకుంది. ఎస్కే మల్లు కంపెనీ వద్ద సరైన యంత్రాలు లేకపోవడంతో దాన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో కృష్ణ ప్రసాద్ ఏజెన్సీకి కూల్చివేత టెండర్ దక్కింది. సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే జీహెచ్ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది. అయితే భారీ భవనాన్ని కూల్చివేసే క్రమంలో పూర్తిస్థాయి యంత్రాలు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో ఎస్కే మల్లు కంపెనీ ఫెయిల్ కావడంతో టెండర్లో మార్పు చోటు చేసుకుంది. ఎస్కే మల్లు కంపెనీ టెండర్‌ను రద్దు చేసి కృష్ణ ప్రసాద్ ఏజెన్సీకి ఆ టెండర్‌ను అప్పగించారు. -
డెక్కన్‌మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం..హైదరాబాద్ కంపెనీకే టెండర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత పనులకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐతే ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది. కాగా, ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆ బాధితుల గురించి స్పష్టత వచ్చాక కూల్చాలని భావించినా..ఈ లోపే కూలిపోతే నష్టం వాటిల్లుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయా బాధిత కుటుంబీకులను ఒప్పించి గురువారమే కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది. (చదవండి: ఇక నేలమట్టమే.. అంచనా వ్యయం రూ. 41 లక్షలు) -
Deccan Mall Accident: కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పివేసినప్పటికీ బిల్డింగ్ లోపలకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ బిల్డింగ్ కూల్చివేయాలా? వద్దా అన్న అంశంపై డైలామాలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు చివరికీ కూల్చవేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కూల్చివేతకు ముందస్తుగా జీహెచ్ఎంసీ ప్రముఖ నిట్ నిపుణులతో చర్చలు జరిపి ప్రమాదం ఉండదని తేలిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఈ భవనం కూల్చివేతకు టెండర్లను కూడా ఆహ్వానించింది జీహెచ్ఎంసీ. అలాగే స్థానిక నివాసాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూల్చివేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, భవనం కూలి ఇన్ని రోజులైన ఇంకా ఇద్దరి మృతదేహాల ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఆ రెండు మృతదేహాలు లభించిన తర్వాత కూల్చివేయాలని అధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. (చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం) -
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం
-
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ ధ్వంసం..ఏకంగా 60 డైనమైట్లతో ..
సాక్షి, ఇండోర్: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్ నగర్లో ఉన్న బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్‌యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలస్‌ని సుమారు 60 డైనమైట్లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాగర్‌జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్ ఆర్య ప్రకటించారు. హత్యకు గురైన జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. కిరణ్ యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం. #WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar "There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8 — ANI (@ANI) January 4, 2023 (చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్ కేసులో జైలు శిక్ష.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా) -
ఉగ్రవాది ఇంటిగోడ బుల్డోజర్తో కూల్చివేత.. వీడియో వైరల్..
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు. అందుకే చర్యలు చేపట్టి గోడను కూల్చివేసినట్లు వివరించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. Jammu and Kashmir Administration demolishes property of Hizbul Mujahideen terrorist commander Gulam nabi Khan @ Amir Khan, in Anantnag's Pahalgam. 🧐🧐👇 pic.twitter.com/TofBRReHlZ — Naren Mukherjee (@NMukherjee6) December 31, 2022 చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
ప్రియురాలిని చావబాదిన ఘటన: నిందితుడి అరెస్టు, ఇల్లు ధ్వసం
భోపాల్: ఒక యువకుడు యువతిని దారుణం కొడుతున్న వీడియో నెట్టింట హల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడమే గాక అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఒక యువతని దారుణంగా కొడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారభించారు. దారుణానికి పాల్పడిన వ్యక్తిన పంకజ్ త్రిపాఠిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఆ యువతిపై దాడి చేసినట్లు వివరించాడు. పోలీసులు నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. అతడి జీవనాధారం డ్రైవింగ్. అందువల్ల అధికారులు అతడి డ్రైవింగ్ లైసెన్సు కూడా క్యాన్సిల్ చేశారు. సకాలంలో అతడిపై చర్యలు తీసుకోని స్థానిక పోలీసులను సైతం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి ఇంటిన కూల్చిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Bulldozer action by MP govt, Arrested Boy from Rewa who brutally beaten and filmed his girlfriend asking for marry her. pic.twitter.com/lmeazFV14S — Political Kida (@PoliticalKida) December 25, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: నువ్వేం మనిషివిరా అయ్యా..! ప్రియురాలిని ఘోరంగా చావబాదాడు, కారణం ఏంటంటే..) -
నోయిడా ట్విన్ టవర్స్ ఎఫెక్ట్.. ఐటీ విప్రో, ఎకోస్పేస్ భవనాలు కూల్చివేత!
బనశంకరి: బెంగళూరులో వరద బాధిత ప్రాంతాల్లో బీబీఎంపీ, రెవెన్యూ శాఖలు చేపట్టిన కబ్జా కట్టడాల తొలగింపు మంగళవారం రెండవరోజుకు చేరుకుంది. రాజకాలువలు ఆక్రమించుకుని నిర్మించిన భవనాలు, ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో రియల్ వ్యాపారులు, కట్టడ యజమానుల్లో కలవరం మొదలైంది. జాబితాలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులు - మహదేవపుర వలయంలో వివిధ బిల్డర్లు, ఐటీ పార్కులవారు ఆక్రమణలకు పాల్పడిన స్థలాల జాబితాను బీబీఎంపీ విడుదల చేసింది. - బాగమనె టెక్ పార్కు, రెయిన్బో డ్రైవ్ లేఔట్, విప్రో, ఎకో స్పేస్, బెళ్లందూరు, హుడి, సొణ్ణెహళ్లి గోపాలన్, దియా పాఠశాల, కొలంబియా ఏషియా ఆసుపత్రి, న్యూ హొరైజన్ కాలేజీ, ఆదర్శ రిట్రీట్, ఏషియన్ దివ్యశ్రీ, ప్రెస్టేజ్, సాలార్పురియా, నలపాడ్ డెవలపర్స్‌తో పాటు మహమ్మద్ నలపాడ్ కు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అడ్డుగా 700 కట్టడాలు సుమారు 700 కు పైగా అక్రమ కట్టడాలు నగరవ్యాప్తంగా వర్షం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని , కంపెనీలు కబ్జాకు పాల్పడిన స్థలాలను తొలగిస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. 2.5 నుంచి 5 మీటర్ల ప్రభుత్వ స్థలం రాజకాలువకు వదిలిపెట్టాలి. ఇందులో ప్రముఖులు ఆక్రమణకు పాల్పడిన స్థలాలు ఉన్నాయని, వీటిని తొలగించి రక్షణ గోడను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మహదేవపుర వలయంలో శాంతినికేతన్ లేఔట్, స్పైసి గార్డెన్, పాపయ్యరెడ్డి లేఔట్, చల్లఘట్ట రాజకాలువ ఆక్రమణల ఏరివేత చేపట్టారు. 30 జేసీబీలతో కూల్చివేతలు రెండోరోజు 30కి పైగా జేసీబీలతో మహదేవపుర, యలహంక వలయాల పరిధిలో కట్టడాలను కూల్చారు. శాంతినికేతన్ లేఔట్లో భారీ భవంతులను బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. మున్నకోళాల సరిహద్దుల్లో 7 ఆక్రమణలను తొలగించారు. తొలగించాలని అనేక ఇళ్లు, దుకాణాలు ముందు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేశారు. భారీ పోలీస్ భద్రత మధ్య రెండు కిలోమీటర్ల పొడవు గల రాజకాలువపై నెలకొన్న ఆక్రమణలను పడగొట్టారు. యలహంక వలయంలో జక్కూరు, అల్లాలసంద్ర, కోగిలు, అట్టూరు, సింగాపుర, దొడ్డబొమ్మసంద్ర, హెబ్బాళ, నవనగర, రాచేనహళ్లితో పాటు సుమారు 30 చెరువులు కబ్జాకు గురయ్యాయి. రియల్టర్లు, నేతలు కుమ్మక్కై చెరువులు మింగేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆక్రమణదారులు పలుకుబడి కలిగినవారు కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నలపాడ్ అకాడమి తొలగింపు నిలిపివేత మరోవైపు ఆక్రమణల తొలగింపు వద్ద ఎమ్మెల్యే హ్యారిస్ తనయుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ పడవ వేసుకుని ధర్నా చేసి హల్చల్ చేశారు. ఆక్రమణల జాబితాలో నలపాడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. మహమ్మద్ నలపాడ్ అకాడమి తొలగింపును అధికారులు నిలిపివేశారు. పనులు చేస్తున్న సిబ్బందిని హ్యారిస్ పీఏ నిలిపివేయాలని ఒత్తిడి చేశాడు. గేటు వద్ద అడ్డుకున్నాడు. దీంతో కూల్చివేతను నిలిపివేశారు. శివాజీనగర: బెంగళూరులో అక్రమ భవనాల తొలగింపు పై మంగళవారం విధాన సౌధలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ... వీటి వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించుకొని అనేక అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి భవనాలను ఎలా తొలగిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఎంతటివారైనా సరే తొలగిస్తామని, నోయిడా తరహాలో అక్రమ భవనాలకు పేలుడుతో సమాధానం చెబుతామన్నారు. ఆక్రమణదారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. గత ప్రభుత్వాలవి నాటకాలు ఆక్రమణల విషయంలో గత ప్రభుత్వాలు నాటకీయంగా వ్యవహరించాయని, అయితే తమ అధికారంలో అలా జరగదని, ఐటీకి చెందిన 30 కంపెనీలు ఆక్రమణలకు పాల్పడ్డాయని, తమ శాఖ జాబితా సిద్ధం చేసి బీబీఎంపీకి ఇచ్చామన్నారు. మినహాయింపు లేదు ఐటీ–బీటీ కంపెనీలకు ఎలాంటి మినహాయింపు లేదని, పెద్దవారు, చిన్నవారు అనేది లేదని, రెవెన్యూ శాఖ, బీబీఎంపీ, బీడీఏ సంయుక్త కార్యచరణ చేపడుతాయి. వరదలు తమకు గుణపాఠం చెప్పింది. బాగమనె పార్కుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పెద్దవారు చిన్నవారు అంటూ చూడమని మంత్రి తెలిపారు. విల్లాలు, విద్యాసంస్థలనూ వదలం రాజకాలువ ఆక్రమించుకొన్న భవనాలపై బీబీఎంపీ జాబితా సిద్ధం చేయగా, 600 అక్రమ భవనాల తొలగింపునకు ఆదేశించాం, రాజకాలువ తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని, మహదేవపుర భాగంలో బీబీఎంపీ రాజకాలువ అక్రమణలు తొలగిస్తోందని, విల్లాలు, విద్యా సంస్థ, ఇళ్లు నేలమట్టమవుతాయి. రైన్బో డ్రైవ్ లేఔట్లో జిల్లా యంత్రాంగం సర్వే జరుపగా, కాలువను ఆక్రమించుకొని విల్లాలను నిర్మించినట్లు తెలిసింది. ప్రస్తుతం విల్లాలను తొలగించాలని యజమానులకు నోటీస్ ఇచ్చామన్నారు. JCB’s in action today in Mahadevapura demolishing alleged encroachments on rajakaluves. #BBMP pic.twitter.com/lvEjU9yHyM — Anil Budur Lulla (@anil_lulla) September 12, 2022 -
నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి
నోయిడా: ఉత్కంఠ రేపిన సూపర్‌టెక్ జంట టవర్ల కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కారణంగా టవర్ల పరిసరాల్లోని రహదారులు, భవనాలు, చెట్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగింపు సాయంత్రం నుంచే మొదలైంది. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీల నుంచి ఖాళీ చేయించిన కుటుంబాల్లో సగానికి పైగా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నాయి. అధికారులు వారికి విద్యుత్, నీరు, వంటగ్యాస్ సరఫరాలను పునరుద్ధరించారు. తమ నివాసాలు సురక్షితంగా ఉన్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ పేలుళ్లతో ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ లోపల వెలుపల, ఇతర నివాస ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని చెట్లపై దుమ్ముధూళి దట్టంగా పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పనివారిని రంగంలోకి దించారు. 500 మంది సిబ్బందితోపాటు, 100 నీటి ట్యాంకర్లు, 22 యాంటీ స్మోగ్ గన్స్‌లో ఊడ్చటం, తుడవటం వంటి పనులను చేపట్టినట్లు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి తెలిపారు. టవర్ల కూల్చివేతతో ఏర్పడిన 80 వేల టన్నుల శిథిలాలను తొలగించేందుకు 3 నెలలు పడుతుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. దీనిని వృథాగా పడేయకుండా రీసైకిల్ చేసి, తిరిగి వినియోగిస్తామని పేర్కొంది. సెల్ఫీలతో జనం సందడి టవర్లు కూలిన తర్వాత సోమవారం కూడా జనం అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలకు సమీపంలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నివాస సముదాయాలను నిర్మించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అధికార బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద అబద్ధాల కోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
కుప్పకూలిన అక్రమం
సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. భవనాల ఎత్తులోనే కాదు.. భయం, బాధ్యత లేని అవి నీతిలోనూ దేశంలోకెల్లా అతి ఎల్తైన జంట ఆకాశహర్మ్యాలు ఎట్టకేలకు కూల్చివేతకు గురయ్యాయి. ఢిల్లీ శివారులో యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో 100 అడుగుల ఎత్తు వివాదాస్పద జంట భవంతులను సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేసిన ఘటన అనేక విధాల చరిత్రాత్మకం. ఇంతటి భారీ స్థాయి కూల్చివేత జరగడం దేశంలో ఇదే తొలిసారి. ‘వాటర్ ఇంప్లోజన్’ పద్ధతిలో 12 సెకన్లలో చాకచక్యంగా ఆకాశహర్మ్యాల కూల్చివేత పూర్తి చేయడం, చుట్టు పక్కలి ఆవాసాలకు నష్టం వాటిల్లకుండా అతి పెద్ద ప్రక్రియను విజయవంతం చేయడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణ నిబంధనల అతిక్రమణ నుంచి ఇప్పటికైనా పాల కులు నిద్ర నటించడం మానాల్సిన అవసరం దాకా అనేక అంశాల్ని ఈ కూల్చివేత తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ నిబంధనల యథేచ్ఛ ఉల్లంఘనకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ అతి పెద్ద ఉదాహరణ. భవన నిర్మాణ సంస్థ సూపర్‌టెక్ డెవలపర్స్‌తో చేతులు కలిపి నోయిడా అధికార యంత్రాంగం సాగించిన అవినీతికి కళ్ళెదుటి సాక్ష్యం. ఈ జంట ఆకాశహర్మ్యాలలో అనుమతించిన వాటికి మించి కట్టిన అంతస్థులు ఎక్కువ. ఒక్కముక్కలో వీటి ఎత్తు ఢిల్లీలోని చరిత్రాత్మక కుతుబ్ మినార్ను మించిపోయింది. పైపెచ్చు ఈ బహుళ అంతస్థుల భవంతులు రెంటికీ మధ్య అంతరం కేవలం 9 మీటర్లే. ఫలితంగా, అనేక నివాసాలకు తగినంత గాలి, వెలుతురు రాని పరిస్థితి. భవన నిర్మాతలపై ఆ ప్రాంగణంలోని నివాసుల సంక్షేమ సంఘం 2012లోనే అలహాబాద్ హైకోర్ట్‌కు వెళ్ళింది. అవినీతి, అక్రమాలను గుర్తించిన కోర్ట్ 2014లోనే టవర్స్‌ను కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. సుప్రీమ్ కోర్ట్ సైతం దాన్ని సమర్థిస్తూ, బయ్యర్ల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయమంటూ గత ఏడాదే ఆదేశించింది. ఆ కూల్చివేత భారీ పరిమాణం రీత్యా ఇప్పటికి జరిగింది. భవన నిర్మాణ నిబంధనల్ని ఉల్లంఘించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లా విచ్చలవిడిగా సాగుతున్న ఆందోళనకర పరిణామం. నోయిడా ట్విన్ టవర్స్ అందుకు చిరు ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ నిబంధనలు ఏవైనప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ, ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలు, బడాబాబుల విల్లాలు, భారీ అపార్ట్మెంట్లు కట్టడం ఇప్పుడు రివాజైంది. స్థానిక అధికార యంత్రాంగం చేతులు తడిపి, నోరు విప్పకుండా సాగుతున్న ఈ ధంధా ఆ పైన ప్రభుత్వాలు తరచూ ప్రకటించే భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాజముద్ర వేయించేసుకుంటోంది. తప్పులు చేయడమే కాక, వేలెత్తి చూపినవారిని నిందిస్తూ, రకరకాలుగా సమర్థించుకొనే ప్రయత్నాలకూ మన దగ్గర కొదవ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదీ గర్భంలో కట్టిన ఇంట్లో మాజీ సీఎం చంద్రబాబు కథ ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్ళ క్రితం చూశాం. అక్రమ కట్టడాల్ని కూల్చివేయడానికి సమకట్టిన ప్రభుత్వంపై అన్యాయం, అధర్మం, దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోయడం గమనించాం. చేసిన తప్పును కప్పిపుచ్చుకొంటూ, కక్షసాధింపు ముద్ర వేయాలనుకోవడం అవివేకం. అలాంటి వారందరికీ తాజా నోయిడా ఉదంతం ఒక చెంపపెట్టు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే – ఈ ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇప్పటి దాకా ప్రభుత్వ అధికారులు, అగ్నిప్రమాద నివారక విభాగం వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం! మన దేశంలోని రాజకీయ, పాలనా యంత్రాంగాల్లోని అవినీతిని ఇది బట్టబయలు చేస్తోంది. ఇప్పటికీ అనేక నగరాల్లో సరైన అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలు సగానికి పైనే ఉంటాయని ఓ అంచనా. నిర్మాణాలపై సరైన నిఘా కానీ, నియంత్రణ కానీ, నిర్ణయాత్మకమైన చర్యలు కానీ లేకపోవడం ఇలాంటి అక్రమార్కులు బరి తెగించడానికి కారణమవుతోంది. ఈ ఉల్లంఘనల్లో భవన నిర్మాతలతో పాటు పాలకుల తప్పు కూడా కొంత లేకపోలేదు. కారణాలు ఏమైనా, స్థానిక ప్రభుత్వాలు తరచూ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) ప్రకటిస్తూ, జరిమానా విధింపుతో నిర్మాణాల్లోని తప్పుల్ని ఒప్పుల్ని చేస్తున్నాయి. బీఆర్ఎస్ను సర్కారీ ఆదాయ అవసరాలను తీర్చే కల్పవృక్షం, కామధేనువుగా చూస్తున్నాయి. భవన నిర్మాతలు సైతం తర్వాత డబ్బు కట్టి, రాజముద్ర వేయించుకోవచ్చనే ధీమాతో ఆది నుంచే అన్ని రూల్సునూ అడ్డంగా అతిక్రమిస్తూ, నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆ పద్ధతి మార్చుకొని, తాజా ఘటనతో భవన నిర్మాణ రంగంలో కొరవడ్డ నమ్మకాన్ని పునరుద్ధరించాలి. పారదర్శకంగా, నియమాలు పాటించాలి. పాలకులు సైతం బీఆర్ఎస్ మంత్రజపం మానుకోవాలి. దోషులని తేలిన అధికారులు, భవన నిర్మాతలపై కఠిన చర్యలు చేపట్టాలి. ట్విన్ టవర్స్ నిర్మించిన సంస్థ మిగిలిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడమో, ప్రత్యామ్నాయ ఫ్లాట్లు అందించడమో చేసినా, ఇప్పటికీ మరో 59 మంది బయ్యర్లకు న్యాయం జరగలేదు. ఈ అవినీతి హర్మ్యాలపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న బీజేపీ, ఎస్పీలు ఆ పని మాని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. అన్నిచోట్లా బయ్యర్లు ట్విన్ టవర్స్ ప్రాంగణవాసుల లాగా సుదీర్ఘ పోరాటం చేయలేరు గనక నిర్మాణం కన్నా ముందే ప్రభుత్వాలే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనల్ని ససేమిరా అనుమతించబోమనే సంకే తాలివ్వాలి. అందుకు తాజా కూల్చివేత తొలి అడుగు కావాలి. అవసరమైతే ఇలాంటి కూల్చివేతలు మరిన్ని జరగాలి. అప్పుడే అందరిలో చైతన్యం పెరుగుతుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
టిక్ టిక్ టిక్.. నోయిడా జంట భవనాల కూల్చివేత
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని హామీ ఇచ్చారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ టెక్నిక్ ఈ తరహా భవనాలు కూల్చివేయడానికి మూడు మార్గాలున్నాయి. డైమండ్ కటర్, రోబోటిక్ టెక్నిక్, పేలుడు పదార్థాలు.. ఇలా మూడు రకాలుగా భవనాల్ని కూల్చేయవచ్చు. అయితే కూల్చడానికయ్యే ఖర్చు, సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. 2020లో కేరళలోని కొచికి సమీపంలో మారాడు పట్టణంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలను అతిక్రమించి నిర్మించిన నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కూడా పేలుడు పదార్థాలను వినియోగించి కూల్చివేశారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు జంట భవనాల కూల్చివేత సమయంలో తమ ఇళ్లకి ఏం జరుగుతుందోనని, దుమ్ము ధూళి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల కూల్చివేత సమయంలో వచ్చే ధూళి కొన్ని వారాల పాటు గాల్లోనే ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో నోయిడా ముందు వరసలోనే ఉంది. ఇప్పుడు వాయుకాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ భవనాల పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్‌లో ఉంటున్న 5 వేల మందికిపైగా ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లనున్నారు. ‘‘మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. భవనాల కూల్చివేత సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మా ఇళ్లు ఏమయిపోతాయోనన్న భయాన్ని మాటల్లో చెప్పలేను’’ అని సీనియర్ రెసిడెంట్ ఆర్కె రస్తోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎస్ విలేజ్‌లో నివాసం ఉండే మౌసమి భవనాల కూల్చివేసిన తర్వాత ఏర్పడే దుమ్ము, ధూళికి ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012 రెండు జంట భవనాలు : అపెక్స్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు) భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600 నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా టవర్స్ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంత ఖర్చా?.. ఎంత నష్టమంటే..
ఏళ్ల తరబడి ఆలోచన.. ఇంజనీర్ల ప్లాన్లు.. వందల నుంచి వేల మంది కూలీల కష్టం. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి నిర్మించిన బిల్డింగులు. అలాంటి ఆకాశ హర్మ్యాలను కేవలం.. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం నేల మట్టం చేయబోతున్నారు. అయితే తమకిది సింపుల్ వ్యవహారం అంటున్నారు సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం బటన్ నొక్కనున్న చేతన్ దత్తా. ఆగస్టు 28, నొయిడా(New Okhla Industrial Development Authority) 93A సెక్టార్‌లోని జంట టవర్లు పేకమేడల్లా కూలిపోనున్నాయి. సూపర్‌టెక్ ట్విన్ టవర్లను కూల్చివేయడానికి బటన్‌ను నొక్కడం.. ఒక సాధారణ ప్రక్రియ అని అంటున్నారు బ్లాస్టింగ్ వ్యవహారాలను చూసుకునే చేతన్ దత్తా . ► ఇది చాలా తేలికైన వ్యవహారం. డైనమో నుంచి విద్యుత్‌ను పుట్టిస్తాం. ఆ తర్వాత బటన్‌ను ప్రెస్ చేస్తాం. ఇది 9 సెకన్లలో అన్ని షాక్ ట్యూబ్‌లలోని డిటోనేటర్లను మండిస్తుంది. మేం 50-70 మీటర్ల దూరంలో ఉంటాం. కానీ, మాకేం ప్రమాదం ఉండదు. కూల్చివేత సజావుగా సాగాలని మేం అనుకుంటున్నాం. బ్లాస్టింగ్ ఏరియా మొత్తం నాలుగు లేయర్ల ఇనుప జాలీలతో కవర్ అయ్యి ఉంటుంది. అలాగే రెండు లేయర్ల బ్లాంకెట్లను కప్పుతున్నాం. కాబట్టి, శిథిలాలు ఏవీ కూడా వాటిని దాటి బయటకు రాలేవు. కాకపోతే దుమ్ము మాత్రం రావొచ్చు అని చేతన్ దత్తా వెల్లడించారు. ► కేవలం తొమ్మిది సెకన్లలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. పేలుడు ధాటి, కూల్చివేత ప్రభావాల నేపథ్యంలో వైబ్రేషన్‌ను తగ్గించేందుకు కుషన్లను ఏర్పాటు చేశారు. ► చుట్టుపక్కల ఎమెరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీలు ఉన్నాయి. సుమారు ఐదు వేల మంది జీవిస్తున్నారు అక్కడ. అందుకే.. ఉదయం నుంచే వాళ్లను ఖాళీ చేయించి, తిరిగి పేలుడు అయ్యాక సాయంత్రం పూట వాళ్లను సేఫ్టీ క్లియరెన్స్ అనంతరం ఇళ్లలోకి అనుమతిస్తారు. ► మాస్క్‌లు, ఐ గ్లాస్లు ధరించాలని ఇప్పటికే సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అలాగే ఫ్లెక్స్ ఆస్పత్రిలో 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ మళ్లింపు సైతం ఉండనుంది. ► కూల్చివేతకు హర్యానా నుంచి తెప్పించిన 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► కూల్చివేత తర్వాత 32 అంతస్థులు, 29 అంతస్థుల బిల్డింగులు.. 35వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలను మిగల్చొచ్చనే అంచనాలో ఉన్నారు. 55 వేల టన్నుల శిథిలాలను ఎత్తి పారబోయడానికి కనీసం మూడు నెలలైనా పట్టొచ్చు. ఆగస్టు 21నే ఈ కూల్చి వేత జరగాల్సి ఉన్నప్పటికీ.. నొయిడా అథారిటీ విజ్ఞప్తి మేరకు మరో వారం ముందుకు జరిగింది. ► సుప్రీం కోర్టు ఆదేశాల అనుసారం.. సూపర్‌టెక్ సంస్థ ఈ కూల్చివేత ఖర్చులను భరించనుంది. అలాగే.. నొయిడా అథారిటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ కూల్చివేతను పర్యవేక్షించనున్నాయి. ► ఆగస్టు 28న గనుక ఏ పరిస్థితులతో అయినా కూల్చివేతను వాయిదా వేయాల్సి వస్తే.. వారం రోజుల్లో ఎప్పుడైనా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చని సుప్రీం కోర్టు సూచించింది. కానీ, ఆ గడువును మాత్రం దాటొద్దని హెచ్చరించింది. ► నొయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ► ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల(అపెక్స్, సెయానే టవర్లు) నిర్మాణ వ్యయం చదరపు అడుగులకు (చదరపు అడుగు) రూ. 933 వెచ్చించి మొత్తం 7.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగి ఉంది. ఈ లెక్క అప్పటి అంచనా ప్రకారం మొత్తం రూ.70 కోట్లు. అయితే, ► దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం. ► సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో ఒక 3BHK అపార్ట్మెంట్ ధర దాదాపు రూ. 1.13 కోట్లు. ఈ రెండు భవనాల్లో దాదాపు 915 ఫ్లాట్లు ఉన్నాయని, వాటి ద్వారా కంపెనీకి దాదాపు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది. ► మొత్తం 915 ఫ్లాట్లలో దాదాపు 633 ఫ్లాట్లు బుక్ చేయబడ్డాయి మరియు కంపెనీ గృహ కొనుగోలుదారుల నుండి దాదాపు 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు, సూపర్టెక్ని 12 శాతం వడ్డీతో గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని కోరింది. ► ఇది కాకుండా.. పేలుడు సమయంలో చుట్టుపక్కల ఏమైనా డ్యామేజ్లు జరిగితే!. ఇందుకోసం బిల్డింగ్ కూల్చివేత బాధ్యతలను తీసుకున్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.100 కోట్ల ఇన్సూరెన్స్‌కు వెళ్లింది. ► కూల్చివేతకు అయ్యే మొత్తం కాస్ట్.. అక్షరాల రూ.20 కోట్ల రూపాయలు. ఇందులో సూపర్‌టెక్ కంపెనీ ఐదు కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వనుంది. మిగతా పదిహేను కోట్ల రూపాయలు.. శిథిలాలు అమ్మకం(అందులో నాలుగు వేల టన్నుల స్టీల్ కూడా ఉంటుంది) ద్వారా సేకరించనుంది. ► నొయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. ► పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. ► నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. ఆ దూరం ఉండి ఉంటే.. ఇప్పుడు ఇంత భారీ విధ్వంసానికి తెర లేచేదే కాదు. ► నిబంధనల ఉల్లంఘనపై.. ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా రెండు భవనాలను కూల్చివేసి, అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 11, 2014 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ.. గృహ కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ.. ► దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు 2022 ఆగష్టు నెలను తుది గడువు ప్రకటించింది. ► ఇది నోయిడా అథారిటీ మరియు సూపర్టెక్ల మధ్య "అనుకూలమైన సంక్లిష్టత" ఫలితమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ► కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల కూల్చివేతను.. దేశంలోనే ఇప్పటిదాకా ఎత్తైన భవనాల కూల్చివేతగా చెప్తున్నారు. అందుకే ఈ కూల్చివేత ఒక చారిత్రక ఘట్టంగా దేశ చరిత్రలో నిలిచిపోనుంది. -
అర్థరాత్రి హైడ్రామా.. రాత్రి రాత్రే కొత్తపేట పండ్ల మార్కెట్ నేలమట్టం
సాక్షి, సిటీబ్యూరో/చైతన్యపురి: కొత్తపేట పండ్ల మార్కెట్ కాలగర్భంలో కలిసిపోయింది. 36 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ రాత్రికి రాత్రే భూస్థాపితమైంది. పండ్ల మార్కెట్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. 21 ఎకరాల ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు బదలాయించింది. దీంతో ఈ మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని నిర్ణయించిన సర్కారు ఆగమేఘాల మీద జేసీబీలతో మంగళవారం తెల్లవారేసరికి మార్కెట్‌ను కూల్చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కమీషన్ ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సమర్పించడం.. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ అధికారుల తీరును తప్పుపట్టడం చకచకా జరిగిపోయాయి. ఏర్పాట్లు చేసేంతవరకు.. ► కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్ నిర్మించేంతవరకు తాత్కాలికంగా బాటసింగారానికి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ సౌకర్యాల కల్పన సరిగా లేకపోవడంతో ఈ వ్యవహారంపై కమీషన్ ఏజెంట్లు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారించిన న్యాయస్థానం అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసేంతవరకు మార్కెట్‌ను కొత్తపేటలోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ► ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొత్తపేటలో పండ్ల మార్కెట్‌ను పునఃప్రారంభించారు. మార్కెట్ తరలింపు వ్యవహారం సర్కారుకు చికాకుగా మారింది. తడవకోసారి బాటసింగారం, అక్కడి నుంచి కొత్తపేటకు తరలించడం ద్వారా క్రయవిక్రయాలపై ప్రభావం పడుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించినందున ఖాళీ చేయాలని నిర్ణయించింది. ► ఈ క్రమంలోనే స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ షెడ్లను కూల్చివేసింది. మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేతకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ మార్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ను కూల్చివేస్తున్నారనే సమాచారంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వీరిని చెదరగొట్టారు. తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్‌ను నేలమట్టం చేశారు. ► కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మార్కెట్‌ను కూల్చివేశారని కమీషన్ ఏజెంట్లు ఆరోపిస్తు న్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం బాటసింగారంలోనే మార్కెట్ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, అక్కడే పండ్ల మార్కెట్ కొనసాగుతుందని, మంగళవారం బాటసింగారంలోనే క్రయవిక్రయాలు జరిగా యని అధికారులు చెబుతుండటం గమనార్హం. ► మార్కెట్లో కూల్చివేతల విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి మార్కెట్ వ్యాపారులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కూల్చివేతలు ఆపండి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపు ప్రక్రియకు నెల రోజుల గడువు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా మార్కెట్లో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాపారులను మార్కెట్ ఆవరణలోకి అనుమతించాలని, తమ వస్తువులను బాటసింగారం మార్కెట్‌కు తరలించేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులను హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ధర్మాసనం ఆదేశాలకు విరుద్దంగా మార్కెట్‌ను కూల్చివేస్తున్నారంటూ కమీషన్ ఏజెంట్లు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నెల రోజుల్లో ఖాళీ చేయాలని గత నెల 8న ధర్మాసనం ఆదేశించిందని, ఈ నెల 8 వరకు గడువు ఉన్నా...వ్యాపారులను ఈ నెల 4న మాత్రమే అనుమతించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. మార్కెట్లోకి ప్రవేశించిన వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారని, దాదాపు 500 మంది పోలీసుల పహారా మధ్య సోమవారం అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తున్నారని తెలిపారు. 106 కమిషన్ ఏజెంట్లలో 78 మంది ఇప్పటికే బాటసింగారం మార్కెట్‌కు తరలి వెళ్లిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితి కల్పించడం తీవ్ర దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. -
బల్దియా లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
వివాదంలో బిగ్‌బీ బంగ్లా, కూల్చివేయాలని బీఎంసీ ఆదేశం
ముంబైలోని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ దంపతుల బంగ్లా ప్రతీక్ష చూడటానికి ఇంద్రభవంలా ఉంటుంది. అటూగా వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రతీక్ష నుంచి చూపు తిప్పుకోలేరు. చెప్పాలంటే వారి బంగ్లా టూరిస్టు ప్లేస్‌ను తలిపించేలా ఉంటుంది. ప్రతి రోజు వందల మంది అభిమానులు ప్రతీక్ష దగ్గర క్యూ కడుతుంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్‌బీ బంగ్లా ప్రతీక్ష వివాదంలో చిక్కుకుంది. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా డిమాండ్ చేశారు. అంతేగాక 2017లో రోడ్డు విస్తిర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసిందని, ఇప్పుడు ఆ నోటీసులపై వెంటనే చర్యలు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత మిరండా బీఎంసీని కోరారు. కాగా ముంబై అమితాబ్ మొదటగా నిర్మించుకున్న బంగ్లా పేరు ప్రతీక్ష. దీని తర్వాత ఆయన జాల్సా అనే మరోక బంగ్లాను కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రతీక్ష రోడ్డు విస్తిరణలో భాగమై ఉందని వెంటనే దానిని బీఎంసీ స్వాధీనం చేసుకుని కుల్చివేయాలంటూ మిరండా వ్యాఖ్యానించారు. తులిప్ బ్రియాన్ మిరండా శనివారం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన.. ‘అమితాబ్ బచ్చన్‌కు 2017లోనే ప్రతీక్ష అక్రమ నిర్మాణంలో ఉందంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చింది. వీటిని రోడ్డు విస్తిర్ణంలో భాగంగా జారీ చేసింది. అయితే బీఎంసీ ఇప్పటి వరకు ఉదాసీనంగానే వ్యవహరించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. అదే ఓ సామాన్యుడికి చెందిన భూమి అయి ఉంటే బీఎంసీ ఇప్పటికే దానిని స్వాధీనం చేసుకుని ఉండేది. మున్సిపల్ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు’ అని ఆయన ప్రశ్నించారు. అయితే అమితాబ్ మరికొందరూ తమ బంగ్లాలకు సంబంధించిన మెయిన్ మ్యాప్‌లలో మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కాగా కాంగ్రెస్ నేత మిరండా ఆరోపణల మేరకు బీఎంసీ కౌన్సిలర్ స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఆయన బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
వనపర్తి :మిద్దె కూలిపోవడంతో ఇద్దరు మృతి
-
కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్‌తో దాడి
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్ మంగమ్మ, కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్ సిబ్బంది, జవహర్‌నగర్ ‘సాక్షి’ విలేకరి సురేందర్‌కు గాయాలయ్యాయి. చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది.. ఘటన నేపథ్యమిదీ.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. తీవ్ర ఉద్రిక్తత.. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. ‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. కుట్ర కోణంలో విచారణ: రాచకొండ సీపీ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్‌చంద్‌లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయి. – రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ -
సచివాలయ భవనాల్ని కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు లిఖితపూర్వక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మౌఖికంగా ఈ ఆదేశాలు ఉండగా.. ఇప్పుడు రాతపూర్వకంగా వాటిని వెలువరించింది. సచివాలయ భవనాలను కూల్చొద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ప్రొఫెసర్ కేఎల్ విశ్వేశ్వర్రావు తదితరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కొత్తగా నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం ఇంకా ప్లాన్లు రూపొందించలేదని, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కొత్తగా రూపొందించే ప్లాన్లను మంత్రివర్గ సమావేశం ఆమోదించే వరకూ ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చవద్దని, తామిచ్చే తుది ఉత్తర్వుల వరకూ వాటిని అలాగే ఉంచాలని పేర్కొంది. కొత్తగా సచివాలయ భవనాల్ని నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్లాన్లు, డిజైన్లను తయారుచేసి వాటిని ఖరారు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. వాటిని సిద్దం చేయకుండా కొత్తగా నిర్మాణాలు ఎలా చేయగలరని అడిగింది. ప్లాన్లు, డిజైన్లు చేసేందుకు ఇంజనీర్లు కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు అంతా కంప్యూటరీకరణ కదా, ఇంకా వాటి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీసింది. నిర్మాణాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకముందే, అపరిపక్వత దశలోనే పిల్స్ దాఖలు చేశారని అదనపు ఏజీ బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కదా, పిల్స్ అపరిపక్వత ఎలా అవుతాయని ప్రశ్నించింది. అనంతరం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సచివాలయ భవనాలు కూల్చొద్దని ఆదేశాలు జారీచేసింది. పిల్స్ కొట్టేయాలి.. ‘కొత్తగా నిర్మించబోయే సచివాలయ భవనాల డిజైన్ రూపొందించే బాధ్యత వివిధ ఆర్కిటెక్టŠస్ సంస్థలకు ఇచ్చాం. అవి నమూనా ప్లాన్లే ఇచ్చాయి. కొత్త నిర్మాణం 8 నుంచి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేసే నిర్మాణంలో అదే స్థాయి నిపుణులను భాగస్వామ్యం చేస్తాం. దీనికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఖర్చవుతుంది. ఇప్పుడు 32 శాఖలకు 4.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే భవనాలు ఉన్నాయి. పాలనాపరంగానే కాకుండా రక్షణపరంగా కూడా అవి యోగ్యంగా లేవు. అగ్ని ప్రమాదం జరిగితే నివారణ చర్యలు తీసుకునే విధంగా కూడా లేవు. వేర్వేరు చోట్ల విడివిడిగా భవనాలు ఉన్నాయి. కొత్త భవనాలు నిర్మించిన తర్వాతే అవే 32 శాఖలకు ఎంత విస్తీర్ణం కేటాయించాలో నిర్ణయిస్తాం. గ్రీన్ జోన్, పార్కింగ్‌లపై ఆర్కిటెక్టŠస్ ఇచ్చిన తర్వాతే కేబినెట్ ఆమోదిస్తుంది. అంచనా ప్రతిపాదన విషయంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు భిన్నంగా ఉన్నతమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తుది ప్రణాళికను హైకోర్టుకు నివేదించలేకపోతున్నాం. పిల్స్‌ను కొట్టేయాలి’అని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అదనపు కౌంటర్ పిటిషన్లో హైకోర్టును కోరారు. -
తాడేపల్లిగూడెంలో దారుణం
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడలు కూల్చివేసిన దుండగులు.. బంగారం, నగదు, విలువైన పత్రాలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం పాత ప్రభుత్వ ఆస్పత్రి సందులోని ఓ ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఆ ఇంటిపై దుండగులు జేసీబీతో దాడి చేశారు. బిల్డింగ్ ప్రహరీ, ఇంటి లోపలి గోడలు కూల్చివేసిన దుండగలు.. విజయలక్ష్మిని చీరతో కట్టి నిర్బంధించారు. ఇంట్లోని మోటార్, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని బంగారం, నగదుతోపాటు విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై విజయలక్ష్మి తన కూతురు సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేము 25 ఏళ్లకు పైగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ప్రకాశ్, అవినాశ్‌ల అనుచరులు గురువారం తమ ఇంటిని కూల్చేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ప్రకాశ్, అవినాశ్‌లు మళ్లీ వారి అనుచరులను మా ఇంటిపై దాడికి పంపారు. సుమారు నలభై మంది జేసీబీ, కత్తులు, గునపాలు, రాడ్లతో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డార’ని తెలిపారు. అలాగే తాము నివాసం ఉంటున్న ఇంటిని బలవంతంగా అక్రమించుకునే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
అక్రమ అంతస్థులకు.. అంతిమ గీతం
సాక్షి, విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అక్రమ భవనాల నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లూ పట్టణ ప్రణాళికా అధికారుల్ని ప్రసన్నం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేసేవారు. కానీ ప్రభుత్వం ఈ తరహా నిర్మాణాల సంగతి తేలుస్తామని హెచ్చరించడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల నోట్ల పచ్చి వెలక్కాయ పడ్డటైంది. గత ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్‌లో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ఈ మధ్యనే వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న తీరు చూస్తుంటే నిబంధనలను ఏమేర తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలు క్రమబద్ధంగా నిర్మితమైన ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానిది. రహదారులు, కాలువలు తదతర నిర్మాణాలను పర్యవేక్షించాలి. క్షేత్రాస్థాయికి వస్తే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని సిబ్బంది యథేచ్ఛగా ముడుపులు దండుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు విడిచిపెట్టేశారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రహదారులు, కాలువలు ఆక్రమించుకుని భవనాలు నిర్మించారు. మహా విశాఖ నగర పాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఎవరినడిగినా చెబుతారు. వీటిని నియంత్రించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది అందుకు విరుద్ధంగా అక్రమ కట్టడాల యజమానులతో అంతర్గతంగా కుమ్మకై భారీ ఎత్తున తాయిలాలు అందుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని నిర్మాణాలు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అనధికార లే అవుట్లు గతంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ముందుగా లేఅవుట్లు క్రమబద్ధీకరించిన తరువాత ప్లాన్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద మొత్తం అవుతుండడంతో ఎటువంటి ప్లాన్లు మున్సిపాలిటీకి సమర్పించకుండానే అన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సూచనలు, సలహాలు సైతం టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే అక్రమ నిర్మాణదారులకు అందుతుండడంతో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, పంట కాలువలు, రిజర్వ్ స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకుని ప్రభుత్వ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత ఈ విభాగానికి ఉన్నప్పటికీ మనదేమిపోయిందన్న రీతిలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా.... ప్రతి వీధిలోనూ ఒకట్రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే చైన్మేన్లు ప్రతి వార్డును నిత్యం పర్యవేక్షించి ఎక్కడ అనుమతిలేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు, ఎక్కడ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఎక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారు.. ఇలాంటివన్నీ పరిశీలించి సంబంధిత జోన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయాలి. వారు ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ తమకేమీ పట్టనట్లుగా, తామేమీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. పలు సందర్భాల్లో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుంటూ జీవీఎంసీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, చైన్మెన్లు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమబద్ధీకరణకు వేలాది దరఖాస్తులు... ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒక సీసీపీ, ఇద్దరు సీపీలు, ఒక డీసీపీ, 8 మంది వర్కింగ్ సూపర్ వైజర్లు, 10 మంది టెంపరరీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, 32 మంది చైన్మేన్లు ఉన్న జీవీఎంసీలో వేలాది బీపీఎస్ దరఖాస్తులు వస్తున్నాయంటే.. వాటిని గుర్తించడంలో లోపమెవరిదన్న విషయం ప్రశ్నార్థకమే. 2007లో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్)కు 23,101 దరఖాస్తులు వచ్చా యి. 2015లో 13,979 అక్రమ అదనపు అంతస్తు నిర్మాణదారుల నుంచి దరఖాస్తులొచ్చాయి. తాజాగా విడుదల చేసిన 2019 బీపీఎస్‌కు జూన్ 30 వరకూ గడువు ఉండగా...ఇప్పటివరకూ 4,233 దరఖాస్తులు వచ్చాయంటే అక్రమ నిర్మాణాలు ఏమేర జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తూర్పులో ‘పెట్రేగిన వెలగపూడి’ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కనుసన్నల్లో గత పదేళ్లలో భూదందాలు పెట్రేగిపోయాయి. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా... అన్నీ అనుకూలిస్తే అక్రమ నిర్మాణం. ఈ తరహాల్లో గత పదేళ్లలో అక్రమ కట్టడాలకు, భూ కబ్జాలకు తూర్పును కేంద్రంగా వెలగపూడి భూ దందా సాగించారు. అక్కడితో ఆగకుండా ఆయా దందాల అవినీతి మరకలను జీవీఎంసీ, వుడా అధికారులకూ ఆయన అంటించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎక్సైజ్ విభాగాల్లోని కొందరి అధికారులను ఆయన దందాలకు కాపలాదారులుగా మార్చేశారు. ఇలా వెలగపూడికి దాసోహమై వ్యవస్థను భ్రష్టుపట్టించిన విభాగాల్లో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఒకటి. జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారులైతో రెండు అడుగులు ముందుకేసి ఏకంగా వెలగపూడి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను భుజన వేసుకోవడం కొసమెరుపు. దీంతో నగరంలోని జరిగిన అక్రమ నిర్మాణాల్లో తూర్పు అగ్రభాగాన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్మాణ తొలగింపు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం వెలగపూడి త్రయంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వందల సంఖ్యలో బినామీ భవనాలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బినామీల పేరిట వందకు పైగా భవనాలు నిర్మాణం జరిగినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. వీటిలో అధికశాతం తూర్పు నియోజకవర్గంలో ఉండగా 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్యలో నిర్మాణ పనులు జరిగినవే అధికంగా ఉన్నట్లు అంచనా. ఆరిలోవ, ఎంవీపీ కాలనీ సెక్టార్–2, సెక్టార్–9, సెక్టార్–10, వాల్తేర్, లాసెన్స్ బే, అప్పుఘర్, వెంకోజిపాలెం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వెలగపూడి తన బినామీలు, అనుచరులతో భవన నిర్మాణాలు చేయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ వార్డు అధ్యక్షులు ప్రాంతాల వారిగా పంచుకొని మరీ అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. ఆరిలోవ, ఎంవీపీకాలనీ టీడీపీ నాయకులు పట్టాభిరామ్, సత్తిబాబు, కాళ్ల శంకర్ కనుసన్నల్లో సెక్టార్–2, సెక్టార–6, (ఆదర్శనగర్) సెక్టార్–10 లలో పెద్ద ఎత్తున వెలగపూడి బినామీలు, అనుచరులు అడ్డగోలు నిర్మాణాలు చే«శారు. (అప్పుఘర్) సెక్టార్–9లో 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు, పేర్ల మషేన్ కనుసన్నల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు నిర్మాణాలు జరిగాయి. దీంతో పాటు 17వ వార్డు పరిధిలోని పెదవాల్తేర్, చినవాల్తేర్ టీడీపీ నాయకుడు పొతన్న రెడ్డి, మూర్తి, అమరేంద్రల పర్యవేక్షణలో అడ్డగోలు నిర్మాణ దందాలు జరిగినట్లు సమాచారం. విశాలాక్షినగర్, లాసెన్స్‌బే ప్రాంతాల్లో సైతం వెలగపూడి బీనామీలు పెద్ద ఎత్తున అడ్డగోలు నిర్మాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అనుచరుల ద్వారా ల్యాండ్ కబ్జాలు, అక్రమ కట్టడాలు చేసినట్లు సమాచారం. సీఆర్‌జడ్ నిబంధనలు పట్టవిక్కడ...! చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భీమిలిలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించుకున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో టీడీపీ నాయకుల అండదండలంతో నిర్మించుకున్నవే ఎక్కువ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి 159 ఏళ్ల చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అనుమతుల గురించి టౌన్ ప్లానింగ్, జీవీఎంసీ అధికారులను అడిగితే నవ్వేసి ఊరుకుంటారు. వీటితో పాటు బీచ్‌రోడ్‌లోని నిడిగట్టు, చేపలుప్పాడ, కె.నగరపాలెం పంచాయతీలలో అయితే తీరాన్ని ఆనుకుని లెక్కలేనన్ని హేచరీలు, హోటళ్లు సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. భీమిలి జోన్ 1 పరిధిలోకి వస్తుంది.. చారిత్రాత్మక కట్టడాలు, నదీ ముఖద్వారాలు ఉన్న ప్రాంతాలను సీఆర్‌జడ్ నిబంధనల ప్రకారం జోన్ 1గా పరిగణిస్తారు. ఈ కోవలోనే భీమిలి ప్రాంతాన్ని కూడా జోన్ 1లోకే వస్తుంది. ఇలాంటి ప్రాంతాలలో తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ విభాగం నిర్థారించింది. ఒకవేళ ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా షోర్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(సాడా)తో పాటు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. మున్సిపాల్టీ, జీవీఎంసీలకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. దీని ఆధారంగా భీమిలి పట్టణంలో గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం నుంచి నిడిగట్టు పంచాయతీలో నేరెళ్లవలస, కె.నగరపాలెంలో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాలలో లెక్కలేనన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇందులో పలువురు పోలీసు,రెవెన్యూ అధికారులు ఉన్నారు. మరీ ఇంత దారుణమా? జీవీఎంసీ జోన్ 2 పరిధిలో 12వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వరాలయం వెనుక ఉన్న ఐదు అడుగుల రోడ్డులో అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనం కూడా వెళ్లే వీలులేని ఐదు అడుగుల రహదారిలో జీప్లస్3, జీప్లస్4 తరహాలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఐదు అడుగుల రోడ్డులో గ్రౌండ్, మొదటి అంతస్తుకు మాత్రమే అనుమతులు లభిస్తాయి. ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు, నాలుగు అంతస్తులు నిర్మించారు. ఇదే రోడ్డులో మరో వ్యక్తి జీప్లస్4 తరహాలో అనుమతి లేకుండా బహుళ అంతస్తు నిర్మించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ కానీ, అంబులెన్స్ గానీ వెళ్లే మార్గమే లేదు. ఇటువంటి ఇరుకు సందుల్లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. లలితానగర్‌లో అక్రమ నిర్మాణం రామకృష్ణానగర్ సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న లలితానగర్ రోడ్డులో మారుతి క్లినిక్ పక్కన ఓ వ్యక్తి పాత బిల్డింగ్‌పై అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తు ఉన్న పాత బిల్డింగ్‌పై రెండో అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని..అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు స్థానికులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. గాజువాకలో అడ్డూ అదుపూ లేకుండా... గాజువాక ప్రాంతంలో అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా నిర్మాణదారులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని సిఫార్సులు చేసుకోవడంద్వారా తమ జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. కింది అంతస్తులకు అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులను నిర్మిస్తున్న పరిస్థితులు అధికంగా చోటుచేసుకొంటున్నాయి. గాజువాక పట్ణణ ప్రాంతంలో ఏకంగా కమర్షియల్ భవనాలను సైతం నిర్మిస్తుండటం గమనార్హం. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో ఇలాంటి నిర్మాణాలకు అడ్డూ, అయిపూ లేకుండా పోయింది. ► పెదగంట్యాడలోని శీరవానిపాలెం మసీదు పక్కన గెడ్డను ఆనుకొని ఉన్న వెయ్యి గజాల స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీనిపై స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులనుంచి ఒత్తిడి లేకపోవడం, అక్కడ ఓ మాజీ కార్పొరేటర్ సిఫార్సులు చేస్తుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ► గాజువాక సర్వే నంబర్ 87లోని కొత్తగాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆక్రమించింది. 20 ఏళ్ల క్రితంనుంచి వివాదం కొనసాగుతున్న ఈ స్థలాన్ని పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే ఆక్రమించి తాత్కాలిక దుకాణాలను నిర్మించింది. వివాదం తలెత్తినప్పట్నుంచీ ఈ స్థలాన్ని కాపాడుతూ వచ్చిన రెవెన్యూ అధికారులు పల్లా ఒత్తిడితో పట్టించుకోవడం మానేశారు. రూ.20 కోట్ల విలువైన ఈ స్థలానికి అధికారులు పట్టాలను కూడా జారీ చేసేశారు. ► గాజువాక కణితి రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కింది అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసిన సదరు వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా నాలుగో అంతస్తు నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. దీనిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అధికారులు అటువైపు చూడటం మానేశారు. పంతులుగారి మేడవద్ద విద్యుత్ తీగల కింద ఒక వ్యక్తి భారీ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లవల్ల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా అనధికార అంతస్తులను తొలగిస్తున్నప్పటికీ తరువాత కాలంలో పూర్తయిపోతున్నాయి. ► ప్రభుత్వ నిర్మాణం ముసుగులో టీడీపీ కార్యకర్త ప్రాథమిక పాఠశాల స్థలాన్ని కబ్జా చేశాడు. అంగన్వాడీ భవనం పేరుతో ఏకంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. శంకుస్థాపన చేసిన స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి భవనాన్ని నిర్మిస్తున్నట్టు అందరిన్నీ నమ్మించి స్థలం కబ్జాకు ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఆగింది. మిగిలిన నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాలని వారు కోరుతున్నారు. సర్కారు నిర్ణయంతో ఉలికిపాటు గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయ్యాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముడుపులకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న బిల్డర్లు, యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే చాలామంది తమ తమ నిర్మాణాల్ని అర్థాతరంగా నిలిపేశారు. మరోవైపు బీపీఎస్‌కు ఈనెల 30 వరకూ గడువు ఉండడంతో చకచకా నిర్మాణాలు సాగించి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నిబంధనలు మీరితే సహించం అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే సహించే ప్రసక్తే లేదు. ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా వెంటనే నివేదిక ఇవ్వాలని జోనల్ సిబ్బందిని ఆదేశించాం. ప్రతి వార్డులోనూ నిశిత పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – ఆర్జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
నీరవ్, చోక్సీలకు భారీ షాక్
సాక్షి,ముంబై: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలకు భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.13 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో దాక్కున్ననీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అక్రమ బంగళాలను కూల్చివేయాలని మహారాష్ట ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. రాయ్‌గడ్ జిల్లా కిహిమ్ గ్రామంలో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను, ఆవాస్ గ్రామంలోని చోక్సీ అక్రమ భవనాలను కూల్చివేయనున్నామని మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాందాస్ కదం తెలిపారు. అక్రమ బిల్డింగ్‌ల వ్యవహారంలో ప్రభుత్వ తాత్సారంపై ముంబై హైకోర్టు అంసతృప్తిని, అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మోదీ, చోక్సీలకు చెందిన ఈ బంగ్లాలను ఇప్పటికే ఈడీఎటాచ్ చేసింది. కాబట్టి ఈ బంగ్లాల కూల్చివేత ప్రక్రియలో ఈడీ అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ ప్రకటించారు. ఆలీబాగ్, మురాద్ తీర ప్రాంతంలో మోదీ, చోక్సీలతో పాటు, ఇతర సెలబ్రిటీలు తీరప్రాంత రెగ్యులేషన్ జోన్ (సిఆర్జెడ్) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన బంగళాలు 111 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే కొన్ని బంగళాల యజమానులు వాటిపై చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం నుంచి నిలుపుదల ఉత్తర్వులను పొందడంతో ఈ కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశామన్నారు. మరో రెండు మూడునెలల్లో వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. -
కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
-
తాజ్‌మహల్‌ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్‌మహల్‌ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్‌మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్‌ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్‌మహల్‌ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్‌పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
హిందూ సంస్థల శౌర్య దివస్.. ముస్లింల విషాద దినం
అయోధ్య / లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ‘శౌర్య దివస్’ పేరిట సంబరాలు నిర్వహించగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వంటి ముస్లిం సంస్థలు ‘విషాద దినం’గా పాటించాయి. అయోధ్యతో పాటు ఫైజాబాద్‌లో భారీసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సంబరాలు నిర్వహించింది. మందిరం నిర్మాణానికి ప్రస్తుతం దేశంలో పరిస్థితి అనుకూలంగా ఉందని శ్రీరామ్ జన్మభూమి న్యాస్ చైర్మన్ మహంత్ గోపాల్‌దాస్ చెప్పారు. బాబ్రీ కూల్చివేత ఘటనలో లిబర్హాన్ కమిషన్ దోషులుగా తేల్చిన వారందరికీ కఠిన శిక్ష విధించాలని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు రషీద్ డిమాండ్ చేశారు. -
నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు
తాడేపలి్లగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్ర కాలువ ముంపు రైతులకు శుభతరుణం మొదలైంది. ఏళ్ల కాలంగా ఈ రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు పనులు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం, వీరంపాలెం తదితర గ్రామాల్లో 326 హెక్టార్లలోని బాడవా రైతాంగానికి ముంపు సమస్య తీరనున్నది. కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులు చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు రైతులే రంగంలోకి దిగి ఉద్యమ బాట పట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఫలించిన రైతుల ఆందోళన సార్వాలో కురిసిన వర్షాలకు జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం వీరంపాలెం గ్రామాల ఆయకట్టులోని పంట భూములు నీటమునిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన ఆయకట్టు బాడవ రైతులు నందమూరు అక్విడెక్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే తామే పాత అక్విడెక్ట్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. ఎట ్టకేలకు దిగివచ్చిన అధికార యంత్రాంగం అప్పట్లో పాత అక్విడెక్ట్ వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఈ నేపథ్యం లోనే పాత అక్విడెక్ట్‌ను తొలగిస్తామని ఇరిగేషన్ అధికారులు వాగ్దానం చేశారు. పాత అక్విడెక్ట్ పనులను శుక్రవారం చేపట్టారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
-
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణకు చెందిన నల్లపాటి నారాయణ కాంప్లెక్సు(అపార్టుమెంట్)ను మున్సిపల్ సిబ్బంది కూల్చడానికి యత్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చేందుకు పోలీసులతో తరలివచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నేత రాములు అధికారులను అడ్డుకున్నారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించారు. దీంతో కోడెల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ భవనాన్ని కూల్చేందుకు పూనుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. -
నెహ్రూ అనుచరుల జులం!
– అంతర్గత విభేదాలతో కల్వర్టు తొలగించే యత్నం – అడ్డుకున్న అపార్టుమెంట్ వాసులకు బెదిరింపులు – బాధితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే వంశీ మోహన్ రామవరప్పాడు : ఒక అపార్టుమెంట్‌కు చెందిన కల్వర్టును మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. ఎనికేపాడు బీవీరావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు రాకపోకలు సాగిచేందుకు కాలువపై నిర్మించుకున్న కల్వర్టును నెహ్రూ అనుచరులు పది మంది పొక్లెయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన అపార్టుమెంట్వాసులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. పొక్లెన్తో కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను ధ్వంసం చేశారు. కల్వర్టరు తొలగిస్తే అపార్టుమెంట్లో ఉంటున్న 57 కుటుంబాలు రాకపోకలు సాగించడం కష్టమని అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు నెహ్రూ అనుచరులు వెనుక్కు తగ్గారు. అంతర్గత విభేదాలే కారణమా? నెహ్రూ టీడీపీలో చేరకముందు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. నెహ్రూ టీడీపీలో చేరాక ఆ ఇంటర్వ్యూ వీడియో ఫేస్బుక్, వాట్సప్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను వపన్ క్లాసిక్ అపార్టుమెంట్ బిల్డరు ఫేస్బుక్లో షేర్ చేసి కామెంట్ పెట్టడంతో కల్వర్టు ధ్వంసానికి నెహ్రూ అనుచరులు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. తమ నేత టీడీపీలో చేరిన తరువాత అపార్టుమెంట్ ఎదురుగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నెహ్రూ అనుచరులు బిల్డర్‌కు హుకుం జారీచేసినా అతను నిర్లక్ష చేశారన్న ప్రచారం జరుగుతోంది. అపార్టుమెంట్ నిర్మించేటప్పుడు బిల్డర్‌ను నెహ్రూ డబ్బు డిమాండ్ చేశారని, అయితే డబ్బు ఇవ్వనందున ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదుచేస్తా : ఎమ్మెల్యే వంశీ తన నియోజకవర్గంలో నెహ్రూ వర్గం చేసిన అరాచకాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ శనివారం ఎనికేపాడు వచ్చి అపార్టుమెంట్వాసులతో మాట్లాడారు. అంతర్గత విభేదాల కారణంగానే నెహ్రూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. లారీ డ్రైవర్లే కూల్చారు : అన్నే చిట్టిబాబు ఈ ప్రాంతంలో నెహ్రూకు సొంత గోదాములు ఉన్నాయని నెహ్రూ అనుచరుడు, కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) పేర్కొన్నారు. వాటి వద్దకు లారీలు వెళ్లకుండా అపార్టుమెంట్ వాసులు, బిల్డరు తమ కార్లు అడ్డంగా నిలిపి దారి ఇవ్వడం లేదన్నారు. ఈ రోడ్డును నెహ్రూ రూ.1.50 కోట్లతో అభివృద్ధిచేశారని పేర్కొన్నారు. దారికి కార్లు అడ్డుపెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా విననందునే నివిసిగిపోయిన లారీ డ్రైవర్లు కల్వర్టును ధ్వంసం చేశారని చెప్పారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
బరంపార్కును తవ్వేశారు
భవానీపురం : పర్యాటక శాఖకు చెందిన హరిత బరంపార్క్‌లో ఇక హరితం కనుమరుగు కానుందా? అవుననే చెప్పాలి. లక్షల రూపాయల ఖర్చుతో వేసిన గ్రీనరీ లాన్‌ను తొలగించి అక్కడ టైల్స్ వేయనున్నారు. బరంపార్క్కు వచ్చిన కలెక్టర్ బాబు.ఎ అక్కడి అధికారులకు, కాంట్రాక్టర్‌ను ఈ మేరకు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు పచ్చదనంతో అలరారుతున్న లాన్ ఇకపై వెలవెలబోతూ టైల్స్ దర్శనమివ్వనున్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఈ లాన్లో కూర్చుని కృష్ణానది నుంచి వచ్చే చల్లనిగాలిని ఆస్వాదించేవారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ లాన్‌లోనే పెళ్లిళ్లు పేరంటాలు వంటి ఫంక్షన్లు నిర్వహించేవారు. వివాహ వేడుకలకు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చేవారు. పుష్కరాల పుణ్యమా అని ఇకపై ఇవన్నీ బంద్ అవుతాయి. పనుల్లో భాగంగా చిన్నారులు ఆడుకునే ఆట పరికరాలను కూడా తొలగించారు. ఆలస్యంగా అభివృద్ధి పనులు ‘అతనికంటె ఘనుడు...’ అన్నట్లుగా పుష్కర పనులే ప్రభుత్వం ఆలస్యంగా మొదలు పెట్టిందనుకుంటుంటే ఇప్పుడు పర్యాటక శాఖకూడా హరిత బరంపార్క్‌లో చాలా లేటుగా పనులకు దిగింది. అదేమని అడిగితే ఉన్నతాధికారులనుంచి అనుమతి రాకపోవడమేనని చెబుతున్నారు. బరంపార్క్ ప్రవేశ ద్వారం నుంచి రిసెప్షన్ వరకు సిమెంట్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు పల్లంగా ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని మెరక చేయిస్తున్నారు. కిచెన్ గదులను ఫుడ్ కోర్ట్లుగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరాల పేరుతో ఇక్కడ నిర్మిస్తున్న పున్నమి ఘాట్ కారణంగా బరంపార్క్ ఆవరణ మొత్తం పాడైపోయి ఆహ్లాదం, పచ్చదనం హరించుకుపోయాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
కనగానపల్లి(అనంతపురం): కనగానపల్లి మండలం ఎలకుంట్లలోని వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలపై వరస దాడులు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని వైఎస్సార్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత సహకారంతోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. -
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా...
రాప్తాడు(అనంతపురం): రోజు రోజుకు అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారం అండ చూసుకొని తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బధ్రాపూరం గ్రామంలో గురువారం అర్ధరాత్రి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇది గుర్తించిన స్థానికులు ఐదుగురు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో.. పోలీసులు వారిని నామమాత్రంగా విచారణ చేపట్టి వదిలేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తుల, గ్రామస్థులు పోలీసులు వైఖరిని తప్పుపడుతున్నారు. -
ఆ ఇళ్ల జోలికెళ్లొద్దు
తాడేపల్లి (తాడేపల్లిరూరల్): ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి పేదలకు అండగా ఉండాలని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. స్థానిక కేఎల్‌రావుకాలనీ, అమరారెడ్డినగర్ ప్రాంతాల్లో ఇళ్ల తొలగింపుపై ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. గతంలో తాడేపల్లి మునిసిపాలిటీలో 500 ఇళ్లు తొలగించకుండా కోర్టు స్టేటస్కో విధించింది. తాజాగా మరో 370 ఇళ్ల జోలికి వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన స్టేటస్–కో విషయమై ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ప్రాంతంలో కారు దిగినందుకే పేదల ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, రాజధాని మొత్తం తిరిగితే గ్రామాలన్నీ తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల విజయోత్సవం.. ఇళ్లు తొలగించొద్దంటూ కోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై కేఎల్‌రావు కాలనీ, అమరారెడ్డినగర్‌వాసులు గురువారం తమ కాలనీల్లో వైఎస్సార్ సీపీ నాయకులు కేళి వెంకటేశ్వరరావు, ముదిగొండ ప్రకాష్, మేకా వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. స్థానిక నాయకులను కృతజ్ఞతలు చెప్పుకున్నారు. -
ఆలయ కూల్చివేతలో ఉద్రిక్తత
♦ శివాలయం సగభాగం తొలగించేందుకు సన్నద్ధమైన అధికారులు ♦ ఆందోళనకు దిగిన స్థానికులు ♦ పోలీసుల జోక్యంతో బలవంతంగా ధ్వజస్తంభం తొలగింపు గుంటూరు(నెహ్రూనగర్): కృష్ణా పుష్కర అభివృద్ధి పనుల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఆలయ కూల్చివేతకు సిద్ధం కావటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని నల్లచెరువు మూడు బొమ్మల సెంటర్ సమీపంలో ఉన్న శివాలయాన్ని తొలగించడానికి పట్టణ ప్రణాళిక అధికారులు శుక్రవారం జేసీబీతో వచ్చారు. గుడి సగభాగం(ధ్వజ స్తంభం, నవ గ్రహాలు ఉన్న చోటు వరకు) తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆలయ నిర్వాహకులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆలయం జోలికి వస్తే సహించబోమని నినాదాలు చేశారు. దీంతో అధికారులు, స్థానికులు మధ్య జరిగిన వివాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేసీబీ సహాయంతో గుడి తొలగించేందుకు సిద్ధపడటంతో స్థానికులు, పెద్దలు గుడి పగులగొట్టాలంటే ముందు మమ్మల్ని తొలగించి అప్పుడు పడగొట్టండి అంటూ జేసీబీకి అడ్డు నిలిచారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు ససేమిరా అనటంతో అధికారులు మౌనం దాల్చారు. దేవాలయం ధ్వజ స్తంభం తొలగించకుండా గుడిని ముందు ఉన్న గోడ వరకు మాత్రమే తొలగిస్తామని అధికారులు కోరినప్పటీకి ఫలితం కనపడలేదు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిని కలిసి ఆలయాన్ని తొలగించకుండా అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించినా భక్తులు మాత్రం వెనుతిరిగేది లేదన్నారు. అయితే తొలగింపు తప్పదు అని అధికారులు తేల్చి చెప్పడంతో గుడిలోని ధ్వజ స్తంభం, నవగ్రహాలకు మినహాయింపునివ్వాలని గుడి పెద్దలు, స్థానికులు అధికారులను కోరారు. కాని అధికారులు ఒప్పుకోకపోవడంతో గుడి ముందు ఉన్న ప్రహరీ గోడను, విగ్రహాలను తామే శాస్త్రోక్తంగా పగులగొడతామని వారు తెలియజేశారు. సాయంత్రం వరకు వివాదం కొనసాగుతూనే ఉంది. చివరకు పోలీసుల జోక్యంతో బలవంతంగా ప్రజలను పక్కకు నెట్టివేసి ధ్వజ స్తంభాన్ని తీసివేశారు. -
గుడిసెలను కూల్చేసిన అధికారులు
మంగపేట: అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను అటవీ అధికారులు తొలగించారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు వాగు ప్రాజెక్టు సమీపంలో జాజిగిరిగుట్ట వద్ద సుమారు 10 గొత్తికోయ కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వీరు గతంలో నర్సాయిగూడెం సమీపంలో ఉండేవారు. అయితే, తమ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడి నుంచి ఖాళీ చేయాలని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో వారు గతిలేని పరిస్థితుల్లో జాజిగిరిగుట్ట వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చేస్తామని అటవీ అధికారులు ముందుగానే హెచ్చరించినా వినిపించుకోలేదు. అడవికి ముప్పుగా భావించిన అధికారులు బుధవారం సాయంత్రం వాటిని కూల్చివేసి కలపను వాహనాల్లో తరలించారు. -
అధికారులకు షాకిచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ బస్తీ అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులకు చుక్కెదురైంది. ఢిల్లీ సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక అధికారులకు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తీవ్ర గాయాల వల్లే చిన్నారి మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక తేల్చి చెప్పింది. దీంతో కూల్చివేతలకు, చిన్నారి మరణానికి సంబంధం లేదని ప్రకటించిన మంత్రివర్యులు, రైల్వేశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు. షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి మృతదేహానికి మంగళవారం పోస్ట్‌మార్టం పూర్తయింది. సంజయ్ గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం తన నివేదికను సమర్పించింది. చిన్నారి తలకు బలమైన గాయమైందని అలాగే రెండు నుండి నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపింది. తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తమ పరీక్షలో తేలిందని, పాప చనిపోయి సుమారు 30 గంటలు అవుతుందని తన నివేదికలో పేర్కొంది. ఛాతీ, తలపైన తీవ్ర గాయాలు, రక్తస్రావం, షాక్ వల్ల పాప చనిపోయివుండవచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. గడ్డకట్టుకు కుపోయే చలిలో పేదల ఆవాసాలను కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అధికారులందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. జాతీయ మావనహక్కులు సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, రైల్వే బోర్టుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో గత శనివారం అర్థరాత్రి అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం, చిన్నారి మరణం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించిన విషయం తెలిసిందే. -
ఆ చిన్నారి ముందే చనిపోయింది..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో చాలారోజులుగా ఉన్న అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించింది. రైల్వే అధికారులు పోలీసుల సాయంతో షాకూర్ బస్తీలోని గుడిసెలను తొలగించడం, ఆ ప్రాంతంలో ఒక చిన్నారి మరణించడం లాంటి ఘటనలతో ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. పశ్చిమ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో గుడిసెల కూల్చివేతకు రెండు గంటల ముందే చిన్నారి చనిపోయిందని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటులో ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ కూల్చివేతలో రైల్వే అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఆరు నెలల చిన్నారి మరణించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సహా విపక్షాలు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై స్పందిచిన మంత్రి ప్రభు.. ఆ చిన్నారి అనారోగ్యంతో చనిపోయిందని, బాధితులను, షాకూర్ బస్తీ వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళనకు దిగింది. రాత్రంతా తీవ్రమైన చలిలోనే గడిపామని నిరాశ్రయులైన వందలాది మంది షాకుర్ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులు తన చిన్నారిని పొట్టన బెట్టుకున్నారని చిన్నారి తండ్రి వాపోయాడు. ఈ ఆరోపణలను రైల్వే అధికారులు ఖండిస్తున్నారు. చిన్నారి మరణానికి, కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు బస్తీ వాసులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులిచ్చామని, అయినా ఫలితం లేకపోవడంతో.. కూల్చివేత తప్పలేదని అంటున్నారు. పోలీసులు ఖాళీ చేయించిన షాకూర్ బస్తీ స్థలంలోనే కొత్త ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం కానుంది. ఈ నేపథ్యంలో కూల్చివేతలు, చిన్నారి మరణం ఉద్రిక్తతను రాజేసింది. -
500 గుడిసెలు కూల్చేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్రమణకు గురైన తమ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రైల్వే అధికారులు దృష్టిని సారించారు. ఆదివారం ఉదయం పశ్చిమ ఢిల్లీలో రైల్వే పట్టాలకు సమీపంలో ఆక్రమణకు గురైన తమ స్థలాన్ని రైల్వే పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకునే కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 500 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఈ గుడిసెలు తొలగించే క్రమంలో ఓ చిన్నారి కూడా మృతిచెందినట్లు తెలిసింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు గుడిసెల్లో నివసించే బడుగుల మధ్య వాగ్వాదం నెలకొని గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే, చట్ట ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, నిబంధనలు పాటిస్తూనే తమ స్తలాలు స్వాధీనం చేసుకుంటున్నామని అధికారుల చెప్పారు. -
దీపావళి తర్వాత కూల్చేస్తాం
ముంబయి: దీపావళి పండుగ తర్వాత తమ రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన ఆలయాలను పడగొడతామని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. తొమ్మిది నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వివరణ ఇచ్చింది. 2009 సెప్టెంబర్ 29 తర్వాత రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను (ఆలయాలు, మసీదులు, చర్చిలు మరింకేమైనా) తొలగించాలని హైకోర్టు గతవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొమ్మిది నెలల్లో ఈ వ్యవహారం పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తరుపు అడ్వకేట్ జనరల్ శుక్రవారం కోర్టుకు హాజరై దీపావళి తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఏడాది గడువు కోరినా ఇప్పటికే ఆలస్యం అయిందని కోర్టు అనుమతించలేదు. మహారాష్ట్రలో అక్రమంగా ఇప్పటి వరకు 6336 అక్రమంగా ఆలయాలు నిర్మించారని సమాచారం ఉంది. వీటిలో 207 రెగ్యులరైజ్ కాగా, 179 కట్టడాలను ఇటీవల నేలమట్టం చేశారు. -
అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపునకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మరోసారి సిద్ధమైంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిపెట్టారు. అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్ననేపథ్యంలో ఇంద్రానగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల కూల్చివేతకు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.