సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా అటు జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు రెవెన్యూ అధికారులు. క్రిష్టియన్‌పల్లిలో సర్వే నెంబర్ 523లోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసులు కలిసి కూల్చివేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఘటనా స్థలంలోనే అధికారులు ఉండి.. కూల్చివేతలు కొనసాగించారు.
ఇక, హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలువురి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చెరువును ఆక్రమించి కాలేజీల నిర్మాణాలు జరిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment