సాక్షి, కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.
కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి.
కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం
నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్‌పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్‌పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.
ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు.
ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
Comments
Please login to add a commentAdd a comment