సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్‌పూర్‌పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.
వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్‌పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.
ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment