ameenpur village
-
ప్రకృతిని కాపాడితే అదే మనల్ని ఆదుకుంటుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఇది రైతు విజ్ఞత. గత కొన్ని నెలలుగా మన నీటి వనరులు, మన పర్యావరణ సంపదను మన భవిష్యత్తు కోసం మన వారసత్వం కోసం రక్షిస్తున్నాం. ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుంది. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులో కనిపించిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ చూస్తే మనం చేసేది సరైనదే అని తెలుస్తుంది.. ఇది దేవుడి ఆశీస్సులాంటిది’ అంటూ కామెంట్స్ చేశారు. I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024 -
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..
-
అమీన్పూర్లో హైడ్రా.. పలు భవనాలు కూల్చివేత
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్పూర్పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది. -
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు
-
హైడ్రా దూకుడు.. అమీన్‌పూర్‌కు రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా స్పీడ్ పెంచింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇక, నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. దీంతో, అక్కడ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. గగన్‌పహాడ్ అక్రమ కట్టడాలను కూల్చివేయడం హైడ్రా ప్రారంభించింది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. కూల్చివేతల ప్రాంతం వద్దకు అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. -
Ameenpur: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.అమీన్పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
మెడికో రచనా కేసులో ఏం జరిగింది?
సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్‌కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు. అమీన్ పూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్ఎస్ఎల్(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని" తెలిపారు. జరిగింది ఇది.. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్‌కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగికి కుచ్చుటోపి.. ఏకంగా 46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
సాక్షి, సంగారెడ్డి: కమీషన్ పేరిట ఆశ చూపి సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీంతో భారీ నగదు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీపూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి జూన్ 28న పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పందించాడు. అందులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో సైట్ నిర్వాహకుడు అతడికి ఒక వాలెట్ ఐడీ ఇచ్చారు. అందులో ఉద్యోగి ముందుగా రూ.2 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేస్తున్నాడు. కాగా తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు తనకిచ్చిన వాలెటఖలె చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పు చేసి, జాబ్లోను ద్వారా మొత్తంగా 35 దఫాలుగా రూ.46 లక్షలు చెల్లించాడు. సైబర్ నేరగాళ్లు ఉద్యోగితో నగదు పెట్టిస్తూ తనకు ఇచ్చిన వాలెట్లో నగదుతోపాటు కమీషన్ నగదు చూపించారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమిషన్ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్ -
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్‌ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్‌గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
వివాహేతర సంబంధం.. ఇద్దరిని ఓకే ఇంట్లో చూడటంతో..
సాక్షి, పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది. ఈ ఘటనలో భార్య పద్మతో పాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలసి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భీంరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చక్రపురి కాలనీలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో తీవ్రగాయాలతో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో అమీన్పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య భర్త కనిపించడం లేదని చందానగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడాన్ని అమీన్పూర్ పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా భాసీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్ప(39) కూలి పని చేసుకుంటూ చందానగర్‌లో భార్య పద్మతో నివాసం ఉంటున్నాడు. బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద అడ్డపై కూలి పనికి వెంకటప్ప వెళ్తుండగా, భార్య ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే సెంట్రింగ్ పని చేసుకునే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడు వెంకటప్పను రహమాన్ తనతో పనికి తీసుకెళ్లేవాడు. చదవండి: ప్రేమ పేరుతో కూతురు పరువు తీస్తోందని... ప్రియుడితో కలిసి తల్లి.. పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఒక రోజు ఇంట్లో పద్మ, రహమాన్ ఇద్దరిని చూసిన వెంకటప్ప భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో పద్మ భర్త అడ్డు తొలగించాలని రెహమాన్‌కు తెలపింది. దీంతో రెహమాన్ అతడితో పనిచేసే సుభాష్‌తో కలసి వెంకటప్ప అడ్డు తొలగించుకునేందుకు ప్లాస్ వేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 8వ తేదీన వెంకటప్పను కొల్లూరు దగ్గర పని ఉందని చెప్పి రెహమాన్, సుభాష్‌లు వెంకటప్పను స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లాక పని ఈ రోజు లేదని చెప్పి మద్యం సేవించడానికి ఆలూర్ వెళ్లి బాగా తాగారు. తిరిగి అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి అక్కడ వెంకటప్పకు మరో సారి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటప్పను అమీన్పూర్ పరిధిలోని చక్రపూరి కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్దబండ రాయితో వెంకటప్ప తల, మొఖంపై కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు మృతుడి భార్య పద్మ, అబ్దుల్ రెహమాన్, సుభాష్‌లను రిమాండ్‌కు తరలించారు. వారు వాడిన స్కూటీని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐ సోమేశ్వరి, అమీన్పూర్ కానిస్టేబుళ్లు రాములు, మహేందర్‌ను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్ -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
సాక్షి, పటాన్చెరు టౌన్: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం అమీన్పూర్ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్మెంట్లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్ సింగ్, మోహన్‌ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్‌గూడ భెల్మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్‌ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు -
బట్టలు ఉతకడానికి వెళ్లి.. ఇద్దరు యువతుల మృతి
సాక్షి, సంగారెడ్డి : బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు మృతి చెందారు. ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలపూర్ చిన్న తండాలో కూలీలుగా నివాసముంటున్న నలుగురు యువతులు బట్టలుతకడానికి వెళ్లారు. ఉతకడం పూర్తి అయ్యాక చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని రక్షించాలని ప్రయత్నించి చెరువులో పడిపోయిన మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. మృతులు మహబూబ్ నగర్‌కు చెందిన వలస కూలీలు చిట్టి(20) అలియాస్ అశ్విని, వరలక్ష్మి (19)గా గుర్తించారు. వీరితో వెళ్లిన మరో ఇద్దరు శిల్ప, జ్యోతిల అరుపులు విని చెరువు పక్కన ఉన్న పరిశ్రమల్లో పనిచేసి కార్మికులు వచ్చి రక్షించారు. విషయం తెలుసుకున్న అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరువు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
అమీన్పూర్ ఘటన: రహస్య విచారణ
సాక్షి, హైదరాబాద్ : అమీన్పూర్ ఆశ్రమ ఘటనకు సంబంధించి పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను ఆశ్రమానికి తరలించి పఠాన్ చెరువు డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీస్ కస్టడీ విచారణ విషయాలు బయటకు తెలియకుండా అత్యంత గోప్యంగా విచారణ జరుగుతోంది. నిందితులను ఆశ్రమంలోనే ఉంచి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఆశ్రమ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమానికి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే బాధిత కుటుంబం హైపర్ కమిటీ ముందు హాజరై తమ వాగ్మూలం ఇచ్చింది. ఫోక్సో కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చెయ్యాల్సింది పోయి అధికారులు ఆలస్యం చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. (అమీన్పూర్ కేసు స్వాతి లక్రాకు అప్పగింత) కాగా, అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారు ప్రాంతంలోని మారుతి అనాథాశ్రమం బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. -
అమీన్పూర్ ఘటన.. గుర్తింపు తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: అనాథ శరణాలయాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తోంది. నగర శివార్లలోని అమీన్‌పూర్‌లోని అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురై మృతి చెందిన 14 ఏళ్ల బాలిక ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఆశ్రమం రిజిస్ట్రేషన్ రద్దు చేయడతో పాటు అక్కడి పిల్లలను సైతం ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉపక్రమించినట్లు సమాచారం. ప్రధానంగా నగరంలోని అనాథాశ్రమాల వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వ అధీనంలో నిడిచే ఆశ్రమాలతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, ప్రైవేట్ అధీనంలో కొనసాగుతున్న ఆశ్రమాల పరిస్థితిపై ఆరా తీసోంది. వాస్తవంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆశ్రమాలేన్ని? గుర్తింపులేనివి ఎన్ని? ఎంతమంది పిల్లలు ఉన్నారు? నిబంధనల పాటింపు, వసతులు, నిర్వహణ కోసం ఆర్థిక వనరులు, నిర్వాహకుల తీరు, వారి గతం, పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. పుట్టగొడుగుల్లా.. మహా నగరంలో ఆశ్రమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాటు కాగా, వ్యాపార దృక్పథంతో మరికొన్ని ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో సగానికిపైగా అనుమతి లేకపోగా, మిగతా వాటిలో నిబంధనలు మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. వాస్తవంగా హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆశ్రమాలు 10 శాతం మాత్రమే. వాస్తవంగా ప్రతి ఆశ్రమ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆశ్రమాలను తనిఖీ చేసేందుకు రెవెన్యూ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలున్నా.. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఆశ్రమాలపైనే కనీస పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఇక గుర్తింపు లేని వాటిపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకుండాపోయాయి. మారని తీరు.. నగరంలోని పలు ఆశ్రమాల్లో అనేక ఘటనలు వెలుగుచూస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి సృష్టించి ఆ తర్వాత గాలికి వదిలేయడం షరామామూలుగా మారింది. తాజాగా అమీన్పూర్ ఘటన దృష్ట్యా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణకు దిగినట్లు తెలుస్తోంది. ప్రతి ఆశ్రమంపై పర్యవేక్షణ కమిటీల తనిఖీలతో పాటు అంగన్వాడీలో కూడా పరిశీలనకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆశ్రమాలపై పూర్తిస్థాయి వివరాల సేకరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనధికార హోమ్‌లతో పాటు నిబంధనలు పాటించని ఆశ్రమాలను సీజ్ చేసి కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. -
అమీన్పూర్ కేసు స్వాతి లక్రాకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ కేసును ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ స్వాతి లక్రాకు అప్పగించారు. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కేసు,నమోదు, అరెస్ట్ వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు.డీజీపీ ఆదేశాల మేరకు ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించారు. నిందితుల అరెస్ట్, ట్రయల్స్, కేసు విచారణపై స్వాతి లక్రా దృష్టి పెట్టనున్నారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’) -
ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్లో జరిగిన ఘటన కలిచివేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టయ్యారని, అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ హోంకి తరలించామని వెల్లడించారు. నేటి నుంచి హైపవర్ కమిటీతో విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ మహేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అనాథాశ్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. పాప పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 429 ప్రైవేట్ హోమ్స్ లో విచారణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. చివరిగా చిన్నారి స్టేట్మెంట్ ఇచ్చిందని, అందులో చిన్నారి బంధువు కూడా వైర్‌తో దాడి చేసినట్లు తెలిపిందన్నారు. ఆశ్రమంలో అమ్మాయిపైనా అఘాయిత్యం జరిగినట్లు చిన్నారి తెలిపిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందని దివ్యదేవరాజన్ తెలిపారు. -
చిన్నారులను అందంగా అలంకరించి..
పటాన్చెరు: అమీన్‌ఫూర్ అనాథశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. అనాథశ్రమం ముసుగులో అనేక చీకటి వ్యవహారాలు సాగేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు కూడ ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని, చిన్నారులను అందంగా అలంకరించి బయటకు పంపే వారని చెబుతున్నారు. వాస్తవానికి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి లేనిది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పంపకూడదు. రంగారెడ్డి జిల్లాలో అనాథాశ్రమం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శివారు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. (మరో బాలికపైనా అఘాయిత్యం!) అనాథశ్రమ భవనంపైఉన్న అడ్రస్ మాత్రం మియాపూర్ అనే రాసి ఉంది. అయినా రంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించలేదు. రేయింబవళ్లు అధికారుల స్టిక్కర్లగల వాహనాల రాకపోకలు సాగేవని, చిన్నారులను చాలా వేధించేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. అశ్రమ చిన్నారులే కాకుండా బయట నుంచి కూడా మహిళలు, యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు ఉన్నాయి. అనాథశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సిఫారసు చేసిన వారే ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారం ఆశ్రమంలో 49 మంది విద్యార్థులు ఉండాలి కానీ, 60 మంది వరకు బాలికలు ఉండేవారని చెబుతున్నారు. జిల్లా అధికారులకు తెలియకుండా అనాథ పిల్లలు చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. తరచూ చిరునామాలు మారుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన అనాథాశ్రమం అమీన్పూర్లో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆశ్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అధికార యంత్రంగానికి తెలియకుండా నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో మియాపూర్ దీప్తి శ్రీనగర్‌లో ఆశ్రమం నిర్వహించేవారని తెలిసింది. విజయవాడకు చెందిన నిర్వాకురాలు ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలు నుంచి విరాళాలు సేకరించేవారని, చాలా స్వల్పవ్యవధిలో రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించాలరని తెలిసింది. ఆశ్రమం ముసుగులో కొందరు బడా బాబులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనాథాశ్రమానికి నిధులు ఇచ్చే వారికి పూర్తి సొమ్ము ఇచ్చేసి అందులో కొంత సొమ్మును కమిషన్ రూపంలో తీసుకునే ఆశ్రమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఉలిక్కి పడిన అమీన్పూర్ పటాన్చెరు: అమీన్పూర్లో మరో ‘ముజఫర్‌పూర్’ ఘటన స్థానికులను కదిలించింది. అనాథ బాలికను చిదిమేసిన అంశంపై మానవతవాదులు కదిలిపోయారు. అన్ని టీవీ చానళ్లలోనూ ఈ వార్తపై కథనాలివ్వడంతో అమీన్పూర్ వాసులు ఒక్కసారిగా ఆందోళనకులోనయ్యారు. అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంలోని మిగిలిన చిన్నారుల విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాలిక మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ రాజేశ్వర్ సాక్షితో మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో కేసు నమోదయ్యిందని, అత్యాచార నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పట్టణ నాయకుడు కె.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాయని లలిత ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సాఆర్సీపీ ఎస్పీ విభాగం జిల్లా అధ్యక్షుడు డప్పు రాజు మాట్లాడుతూ బాలిక మృతికి కారకులైన వారందరినీ గుర్తించాలని, ఆశ్రమ అనుమతులన్ని రద్దు చేయాలన్నారు. -
అమీన్పూర్ మారుతీ అనాథాశ్రమం లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అనాథ శరణాలయంలో బాలికపై అత్యాచారం ఘటనపై తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సభ్యులుతో ఓ కమిటీ వేసి,ఆగస్ట్ 20లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే అమీన్‌పూర్‌లోని మారుతి అనాథాశ్రమం లైసెన్స్‌ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ రద్దు చేసింది. అందులో ఉన్న పిల్లలను అక్కడ నుంచి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. (ప్రియుడి మోసం.. రోడ్డెక్కి యువతి) కాగా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ అనాథాశ్రమంలోనూ బిహార్ తరహా దారుణం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనాథ శరణాలయానికి నిధులిచ్చే నెపంతో ఓ వ్యక్తి.. అక్కడ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశారు. వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి(54)కి శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్ సహకరించారు. బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో మూత్రాశయంలో ఇన్ఫెక్షన్తో నీలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’) పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు మరణించారు. దీంతో బాలికకు వరసకు మేనమామ అయిన శామ్యూల్ ఆమెను అమీన్పూర్ పరిధిలోని మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు. బాలిక అక్కడే అయిదో తరగతి వరకూ చదువుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజుల పాటు దూరపు బంధువుల ఇంట్లో ఉండేది. కాగా బాలిక బాత్రూమ్లో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకు వెళ్లాలంటూ ఆశ్రమం నిర్వాహకులు బాలిక బంధువు అయిన అనిల్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. (ఇక.. చూస్తుండగానే బూడిద!) అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. తిరిగి జూలై 29న ఆమెను అనాథ శరణాలయానికి తీసుకువెళ్లగా, ఆమెను చేర్పించుకునేందుకు ఆశ్రమం నిర్వాహకురాలు విజయ నిరాకరించారు. దీంతో బాలిక మరో బంధువైన ప్రీతి ఇంటికి తీసుకు వెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి గట్టిగా ప్రశ్నించడంతో తనపై జరిగిన అకృత్యాలను ఆ చిన్నారి బయటపెట్టింది. దీంతో బంధువులు గత నెల 31న బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద విజయ, జయదీప్, వేణుగోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. -
అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’
-
అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’
సాక్షి, హైదరాబాద్ : నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా.. దిశ తరహా ఘటనలతో పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో అమాయకులైన అమ్మాయిలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫ్ఫర్‌పూర్ షెల్టర్‌హోం కేసును తలపించే తరహా ఘటన మన రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో ఉంటున్న ఓ 14 ఏళ్ల దళిత క్రైస్తవ బాలిక కామాంధుడి చేతిలో ఏడాదిపాటు చిత్రహింసలు అనుభవించి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన ఆ బాలిక.. అనంతరం దూరపు బంధువుల చేతిలో దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. చివరకు సరైన వైద్యానికి నోచుకోక బుధవారం ప్రాణాలు విడిచింది. బాత్రూంలో జారిపడిందని... హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక 2015లో తల్లిని, రెండేళ్లకు తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో వరుసకు మేనమామ అయిన సామ్యూల్ అనే వ్యక్తి ఆమెను 2015లో నగర శివార్లలోని అమీన్పూర్ పరిధిలో ఉన్న మారుతి అనాథశ్రమంలో చేర్పించాడు. అక్కడే ఐదో తరగతి వరకు చదుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజులపాటు దూరపు బంధువులైన బావ అనిల్, పిన్ని ప్రీతి ఇళ్లలో ఉంటుండేది. ఈ నేపథ్యంలో ఆ బాలిక బాత్రూంలో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకెళ్లాలని అనాథాశ్రమం నిర్వాహకులు నుంచి అనిల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక.. నియంత్రణ లేకపోవడంతో బట్టల్లోనే మలవిసర్జన చేసేది. అన్నం తినేటప్పుడు వాంతులు చేసుకునేది. దీంతో వారు జూలై 29న తిరిగి ఆమెను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అయితే, అనాథశ్రమం నిర్వాహకురాలు విజయ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ప్రీతి ఇంటికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి ఆమె గట్టిగా ప్రశ్నించడంతో అనాథశ్రమంలో తనపై జరిగిన అకృత్యాలను బయటపెట్టింది. అనంతరం జూలై 31న బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జ్యూస్ తాగించి ఘాతుకం... అనాథశ్రయం నిర్వాహకురాలు, ప్రిన్స్‌పల్ విజయ ఆ బాలికను భవనంలోని ఐదో అంతస్తులోకి పంపించేది. అక్కడికి వేణుగోపాల్ అనే వ్యక్తి వచ్చి బాలికతో బలవంతంగా జ్యూస్ తాగించేవాడు. అది తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయేది. మెలకువ వచ్చేసరికి ఒంటిపై దుస్తులు లేకుండా తీవ్ర గాయాలతో ఉండేది. వివస్త్రగా స్పృహ లేకుండా పడి ఉన్న ఆ బాలికను తోటి బాలికలు లేపి దుస్తులు తొడిగేవారు. ఇలా ఏడాది పాటు విజయ సహకారంతో వేణుగోపాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. వేణుగోపాల్ తనతో చెడుగా ప్రవర్తిస్తున్నాడని విజయ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తనను బెదిరించినట్టు తెలిపింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిందని, దీంతో ఏ దిక్కూమొక్కూ లేని తనకు ఉన్న ఆశ్రయం కూడా పోతుందనే భయంతో ఏడాదిపాటు మౌనంగా భరించానని వెల్లడించింది. వేణుగోపాల్ నుంచి విజయ డబ్బులు తీసుకునేదని.. ఇతర దాతల నుంచి విరాళాలు కూడా తెచ్చి ఆమెకు ఇచ్చేవాడని తెలిపింది. వైద్యం అందక నరకయాతన.. బాత్రూంలో జారిపడి గాయపడిన బాలికకు అనాథశ్రమం నిర్వహకురాలు విజయ వైద్యం అందించలేదు. అనంతరం మార్చి 21న అనాథశ్రమం నుంచి ఆ బాలికను అనిల్ ఇంటికి తీసుకెళ్లగా.. అప్పటి నుంచి దాదాపు మూడు నెలలపాటు ఎలాంటి వైద్యం లేకుండానే తీవ్ర అనారోగ్యంతో గడిపింది. పలుమార్లు అత్యాచారానికి గురికావడంతో ఆమె మర్మాంగాల్లో ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో వ్యాపించింది. మలద్వారం వద్ద మలాన్ని నియంత్రించి ఉంచే కండరం పనిచేయడం మానేయడంతో ఆమె బట్టల్లోనే మలవిసర్జన చేసుకునేది. మూత్రాశ్రయంలో ఇన్ఫెక్షన్తో అప్పటికే బాలిక నడవలేని స్థితికి చేరుకుందని దూరపు బంధువులు పేర్కొంటున్నారు. జూలై 31న భరోసా కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్థారించారు. అయితే, బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉన్నా భరోసా కేంద్రం నిర్వాహకులు ఆమెను ప్రీతితోపాటు ఇంటికి పంపించారు. ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియడంతో వారు బాలికను పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం నింబోలి అడ్డాలోని మరో బాలికల సంరక్షణ గృహానికి తరలించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఈ నెల 4న ఆమెను నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తలకు తగిలిన గాయం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో బాలిక బ్రెయిన్‌డెడ్ అయిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు దుస్తుల్లో మలవిసర్జన చేస్తుండటంతో అనిల్, అతడి భార్య కీర్తన ఆ బాలిక తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌తోపాటు అతడికి సహకరించిన విజయ, ఆమె సోదరుడు జయపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అనాథాశ్రమంలో ఉన్న 60 మందికి పైగా బాలికలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నగరంలోని ఇతర సంరక్షణ గృహాలకు తరలించింది. విచారణకు కమిటీ... అనాథాశ్రమంలో అత్యాచారానికి గురై బాలిక మృతిచెందడంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేల్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపడానికి బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బి.అపర్ణ, బాలల సంక్షేమ సంఘం కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ దేవి, వుమెన్స్ సేప్టీ వింగ్ డి.ప్రతాప్, మహిళా కమిషన్ కార్యదర్శి జీకే సునందలతో కమిటీని ఏర్పాటు చేస్తూ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ కమిషనర్ డి.దివ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఈ నెల 20లోగా నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒక చోట చేర్చి ఏఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించాలని, నిందితులకు శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. -
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
చిన్నారిపై కుక్క దాడి
సాక్షి, పటాన్చెరు : అమీన్‌పూర్‌లోని నవ్యనగర్‌లో బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి గాయపర్చింది. అమీన్పూర్ పట్టణం, మండల పరిధిలో ప్రతి రోజూ ఏదో ఒక చోట కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కిష్టారెడ్డిపేట, బీఎస్ఆర్ కాలనీలో, అమీన్ఫNర్ పట్టణంలోని బీరంగూడ ఇతర ప్రాంతాల్లో జరిగిన కుక్క కాట్ల సంఘటనలు మరువక ముందే అమీన్పూర్ నవ్యనగర్‌లో బుధవారం చక్రధర్ కూతురు అద్వైత అనే చిన్నారిపై దాడి చేసింది. తల్లితో కలిసి గేటు వద్ద స్కూల్ బస్సు కోసం ఎదరు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన కుక్క ఆ చిన్నారికాలిపై గాయం చేసింది. అంతలోనే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ కుక్కను తరిమేశారు. మొరపెట్టుకున్నా.. కాలనీలో కుక్కల దాడులు పెరిగాయని స్థానికులు అమీన్పూర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని నవ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. ఈ విషయమై స్థానిక కమిషనర్ సుజాత వివరణ కోరగా కుక్కలను పట్టుకునే వ్యక్తులకు ఆ పని అప్పగించామని, గురువారం సాయంత్రానికి కుక్కలను అక్కడ నుంచి తరలిస్తామన్నారు. అయితే అమీన్పూర్లో కుక్కల దాడుల సంఘటనలు పెరుగుతున్నాయని వాట్సప్ గ్రూపుల్లో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. శునకాల దాడుల సంఘటనలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. -
బాలికపై అత్యాచారయత్నం సినిమా కథే
పటాన్చెరు టౌన్: బాలికను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అత్యచారయత్నం చేశారన్న ఘటనలో వాస్తవం లేదని తేలింది. గురువారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించగా ఆ బాలిక చెప్పింది అంతా కట్టుకథ అని తెలిసింది. శుక్రవారం అమీన్పూర్ పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గోపాలపురం గ్రామం నుంచి వచ్చిన ఓ వ్యక్తి అమీన్పూర్ పరిధిలోని వాణినగర్ కాలనీలో నివాసం ఉంటూ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం ఊరి నుంచి అతని కూతురు (16) అమీన్‌పూర్‌కు వచ్చింది. ఆ బాలిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లింది. అక్కడ బాలికకు సందీప్ అనే వ్యక్తితో పరిచయమైంది. వీరిద్దరూ కలసి గురువారం ఉదయం కలసి మియాపూర్‌లో సినిమాకు వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం బైక్‌పై తిరిగి వస్తుండగా.. బాలికకు తల్లి ఫోన్ చేసి, ఎక్కడున్నావ్.. అని అడగడంతో తాను సినిమాకు వెళ్లిన విషయందాచి, తనను ఎవరో నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి, అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ చెప్పింది. అయితే సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అసలు విషయం బయటపడింది. ఆ బాలిక ఫొటోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ చేసినందుకు ఇంటి యజమాని, బాలికను తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకు తీసుకెళ్లిన సందీప్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
అమీన్పూర్ ఘటనలో ట్విస్ట్
సాక్షి, సంగారెడ్డి : అమీన్పూర్ బాలిక అత్యాచారం, హత్య ప్రయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలికపై అసలు అత్యాచారం జరగలేదని, బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తనను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని అమీన్‌పూర్‌లోని ఓ బాలిక గురువారం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అసలు బాలికపై అత్యాచారమే జరగలేదని స్పష్టం చేశారు. బాలిక తన ఇష్టంతోనే సందీప్ అనే యువకిడితో సినిమాకు వెళ్లిందని పేర్కొన్నారు. సినిమాలకు వెళితే అమ్మ తిడుతుందని భయంతో బాలిక నాటకాలు ఆడిందని తెలిపారు. (‘అమీన్పూర్లో బాలిక గ్యాంగ్‌రేప్? ) తనను సినిమాకు తీసుకెళ్లి అనంతరం నిర్శానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సందీప్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సందీప్‌పై ఫోక్సో చట్టం 12, ఐపీసీ 509 సెక్షన్ల కింద అరెస్టు చేశామని తెలిపారు. ఇంటి యజమాని రవిగౌడ్, బాలిక తల్లిదండ్రులు తప్పుడు వీడియో చిత్రీకరించి, అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. మైనర్ బాలికపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసినందుకు ఇంటి యజమానిపై కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేసి ప్రజలను గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించారు. నిందితులకు కఠినంగా శిక్షలు అమలు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.