హైడ్రా దూకుడు.. అమీన్‌పూర్‌కు రంగనాథ్‌ | HYDRA Chairman AV Ranganath Visits Ameenpur Lake, More Details Inside | Sakshi
Sakshi News home page

హైడ్రా దూకుడు.. అమీన్‌పూర్‌కు రంగనాథ్‌

Aug 31 2024 10:14 AM | Updated on Aug 31 2024 11:30 AM

HYDRA Chairman Ranganath Visits Ameenpur Lake

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో​ హైడ్రా స్పీడ్‌ పెంచింది. హైదరాబాద్‌ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇక, నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. దీంతో, అక్కడ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 

మరోవైపు.. గగన్‌పహాడ్‌ అక్రమ కట్టడాలను కూల్చివేయడం హైడ్రా ప్రారంభించింది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. కూల్చివేతల ప్రాంతం వద్దకు అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement