ranganath
-
బతుకమ్మ కుంట.. బతికెనంట!
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా, ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు.. తాజాగా చెరువులో పూడికతీత మొదలెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా.. లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఇది బతుకమ్మ కుంట కాదు ప్రైవేట్ స్థలం అంటూ వాదించిన వాళ్లు ఇప్పుడేమంటారంటూ ప్రశి్నస్తున్నారు. కబ్జాల చెరలో చిక్కిపోయి, ఆనవాళ్లను కోల్పోయిన బతుకమ్మ కుంటకు ప్రాణం పోయాలని కోరుతూ గతంలో అంబర్‌పేటకు చెందిన స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు నిర్ధారించారు. బతుకమ్మకుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయ ని న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లాలని సూ చించింది. దీంతో హైడ్రా తన అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. బతుకమ్మ కుంటలో ఉన్న పైపులైన్ పగిలి నీళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి పైపులైన్లు లేవని జలమండలి అధికారులు స్పష్టం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పదహారు నుంచి ఐదెకరాలకు తగ్గిన కుంట.. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ⇒ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలా ల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.మరో ఐదు చెరువుల్లోనూ.. హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, ఉప్పల్ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్ దౌలా చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి, చెరువుకు పునరుజ్జీవం కలి్పస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్ఏండీఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని వచ్చే జూన్ మాసం కల్లా పూర్తి చేయనున్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్‌హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్‌రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.రంగనాథ్ వార్నింగ్మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శంషాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కొరడా.. కమిషనర్ వార్నింగ్
సాక్షి,శంషాబాద్:శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం
-
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
-
ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.ఐఎస్బీ మేగజైన్లో ‘హైడ్రా’రాజధానిలోని జలవనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సంస్థకు చెందిన ‘ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్’ డిసెంబర్–2024 మేగజైన్లో హైడ్రాపై వ్యాసం ప్రచురితమైంది. పబ్లిక్ పాలసీ విభాగంలో ‘హైదరాబాద్స్ హైడ్రా: ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ అర్బన్ వాటర్ బాడీ రిక్సామ్నేషన్’ శీర్షికన దీన్ని ప్రచురించింది. తన అధికారిక వెబ్సైట్లోనూ ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉంచింది.దాదాపు ఏడు వేల జలవనరులతో సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరున్న హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి, దానికి కారణాలను ఈ వ్యాసం వివరించింది. గతేడాది జూలై 19న హైడ్రా ఏర్పడిన తర్వాతి పరిస్థితులు, చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఈ వ్యాసం, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జలవనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కితాబిచ్చింది. జనావాసాల జోలికి వెళ్లకుండా చెరువుల పరిరక్షణ చేపట్టాలంటూ హైడ్రా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని ఐఎస్బీ వ్యాసం అభినందించింది.ఇదీ చదవండి: హెచ్ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్జల వనరుల ఆక్రమణ, అవి కనుమరుగు కావడం, కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తదితర సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైడ్రా తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్బీ తన వ్యాసంలో సూచించింది. తెలంగాణకు చెందిన పాలకులు, అధికారులు హైడ్రాకు మరింత చేయూత ఇవ్వాలని అభిప్రాయపడింది. -
నోటీసులు ఇవ్వం..కూల్చివేతలు ఆపం
-
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం
-
నోటీసులు ఇవ్వం.. కూల్చివేతలు ఆపం.. హైడ్రా రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్ చెప్పారు.‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్టిఎల్ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్ స్పష్టం చేశారు.‘‘హైడ్రా అనగానే కూల్చడం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. త్వరలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్ఎం ఛానెల్ రాబోతుంది. కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. హైడ్రా ఆధ్వర్యంలో ఎఫ్టిఎల్ లిస్ట్ త్వరలో వెబ్సైట్లో పెడతాం. చెరువుల వద్ద ఉన్న షెడ్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి...హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా?. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్టీఎల్ గుర్తించిన తరువాత అనధికారిక నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 550 చెరువుల ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తోంది. పేదలను ముందు చూపి వెనకాల మాఫియా వేరే ఉంటుంది. మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు, హైడ్రాకు సంబంధం లేదు. మూసీలో కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కబ్జా నిర్మాణాలను హైడ్రా కచ్చితంగా కూల్చుతుంది. ఇప్పటికే పలువురు బిల్డర్స్‌కి వార్నింగ్ ఇచ్చాము. మూసీ కబ్జాలపై చర్యలు ఉంటాయి కానీ మూసి రివర్ ప్రాజెక్ట్‌కు హైడ్రాకు సంబంధం లేదు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది...హైడ్రా ఛైర్మన్‌గా సీఎం ఉంటారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించాం. హైడ్రాపై సోషల్ మీడియాలో మాత్రమే తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఇళ్లు బఫర్ ఎఫ్టిఎల్లో లేదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే చెరువుపైనే వస్తుంది. నా ఇల్లు చెరువుకి కింద కిలో మీటర్ దూరంలో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు చర్యలు ఎదుర్కొంటారు’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు.. -
HYDRA: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
-
కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న ఆయన.. అయితే హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని స్పష్టత ఇచ్చారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు.హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. జులై తర్వాత.. అంటే హైడ్రా ఏర్పాటు తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు కూడా వెళ్లం. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు అని ప్రకటించారాయన. అలాగే..కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. హైడ్రా ఎప్పుడూ పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి పోదు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన నమ్మొద్దు అని ప్రజలకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్ లో 40 ఏళ్ళలో 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి: రంగనాథ్
-
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడంగ్పేట్, అల్మాస్ గూడలో హైడ్రా చర్యలు చేపట్టింది. వెంకటేశ్వర కాలనీలో కబ్జాదారులకు హైడ్రా చెక్ పెట్టింది. పిల్లల ఆట పరికరాలు తొలగించి పార్కు స్థలం కబ్జా చేసిన కొందరు వ్యక్తులు.. కంటెనర్ల కోసం షెడ్లు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు పరిశీలించారు. జేసీబీలతో కంటైనర్ల షెడ్లను హైడ్రా తొలగించి.. పార్కు స్థలాన్ని కాలనీ వాసులకు హైడ్రా అధికారులు అప్పగించారు.పార్కు ఆక్రమణ కాకుండా కాపాడారంటూ స్థానికులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. బాలాపూర్ పరిధిలోని అల్మాస్ గూడ వెంకటేశ్వరకాలనీ వాసులు..ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేశారు."బడంగ్ పెట్ మునిసిపాలిటీలో కబ్జాకు గురైన పార్కును కాపాడినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వెంకటేశ్వర కాలనీలో పాలాభిషేకం చేసిన స్థానికులు" #HYDRAA pic.twitter.com/zFtiLa14IK— The Politician (@ThePolitician__) December 3, 2024VIDEO CREDITS: THE POLITICIANకాగా, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్న రంగనాథ్.. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. బేగంపేటలోని ఓ హోటల్లో జాతీయ సదస్సులో రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్నారు.హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్న రంగనాథ్.. ఎక్కువగా ధనవంతులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు.ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే వారే ఎక్కవగా ఉన్నారంటూ రంగనాథ్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆక్రమణల్లో ఉన్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలు -
మా ఇల్లు బఫర్ జోన్లో లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో లేదు. మధురా నగర్లో మేం ఉంటున్న ఇల్లుని 4 దశాబ్దాల క్రితం మా తండ్రి నిర్మించారు. కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది ఇళ్ళ తర్వాత మా ఇల్లు ఉంది. మా తండ్రి నిర్మించిన ఈ ఇల్లు బఫర్ జోన్లో ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
ఇళ్లు కూల్చం.. చెరువులు పునరుద్ధరిస్తాం
సాక్షి, హైదరాబాద్/ అంబర్‌పేట: ‘పేదల ఇళ్లు కూల్చం.. చెరువులను పునరుద్ధరిస్తాం’’.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా ఎత్తుకున్న నినాదమిది. ఇటీవలి వరకు చెరువుల పరిధిలో కూల్చివేతలతో కలకలం రేపిన హైడ్రా తన పంథా మార్చుకుంది. ఎక్కడైనా నీటి వనరుల పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించే ముందు స్థానికులతో భేటీ కావాలని.. తమ లక్ష్యం, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరించాలని నిర్ణయించింది. దీనికోసం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆ ప్రాంతానికి వచ్చిన రంగనాథ్.. పేదల ఇళ్లు కూల్చబోమని, ఆక్రమణలకు గురై ఖాళీగా ఉన్న స్థలాలను మాత్రమే శుభ్రం చేస్తామని వివరించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ జరిగితే.. ముంపు తప్పడంతోపాటు భూగర్భ జలాల లభ్యత పెరుగుతుందని స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో ఓ ఆహ్లాదకరమైన పార్కును నిర్మిస్తామని తెలిపారు. దీంతో బతుకమ్మకుంటలో ఉన్న ఆక్రమణల తొలగింపునకు స్థానికులు ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. పక్షం రోజుల పాటు కసరత్తు చేసి.. బతుకమ్మకుంటకు పునరుద్ధరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందు హైడ్రా దాదాపు పక్షం రోజుల పాటు కసరత్తు చేసింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతో వివిధ కోణాల్లో చర్చించింది. న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ముందుకు వెళ్లింది. ప్రొక్లెయినర్లతో తొలగింపు ప్రక్రియ చేపట్టడానికి ముందే స్థానికులకు అవగాహన కల్పించింది. ఇది విజయవంతమైందని, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. బతుకమ్మకుంటలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా పేరుతో ఎవరైనా భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఉపేక్షించవద్దని సూచించారు. పదహారు ఎకరాల నుంచి ఐదెకరాలకు.. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను పునరుద్ధ రించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలను అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలని అధికారులు తేల్చా రు. తాజా సర్వే ప్రకారం బతుకమ్మకుంటలో మిగిలినది 5.15 ఎకరాలేనని గుర్తించారు. దీంతో అంత మేరకు కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా.. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో స్థానికులు హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని.. రెవెన్యూ రికార్డులూ అదే చెప్తున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. అయితే ఇటీవలి పలు పరిణామాల నేపథ్యంలో బతుకమ్మకుంట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ స్థలం ప్రైవేటుది అని వాదించిన బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. తార్నాకలోని ఎర్ర కుంటను పరిశీలించి.. బుధవారం తార్నాకలోని ఎర్రకుంటను రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ, ఎర్రకుంటను పునరుద్ధరించాలని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రం సమరి్పంచింది. ఈ మేరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జనావాసాల జోలికి వెళ్లదు. పెద్ద చెరువుగా ఉండాల్సిన బతుకమ్మకుంట క్రమేణా కుంచించుకుపోయింది. దానిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బస్తీ వాసులకు గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్లను హైడ్రా కూలుస్తుందనే దుష్ఫ్రచారం నేపథ్యంలో.. ఇక్కడికి వచ్చి స్థానికులకు వాస్తవాలు వివరించాం. వారి సహకారంతోనే బతుకమ్మకుంట పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ, అన్ని విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుది నిర్ణయం తీసుకున్నాం. కొందరు బతుకమ్మకుంట ప్రైవేటు స్థలమని వాదిస్తున్నప్పటికీ సరైన ఆధారాలు చూపలేదు. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఇళ్లు కూల్చబోమని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ వచ్చి మాతో మాట్లాడారు. మా ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. దోమలు, దుర్వాసన లేకుండా బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేవలం ఖాళీగా ఉన్న జాగానే చెరువుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – అరుణ, వీకర్ సెక్షన్ కాలనీ రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారుబతుకమ్మకుంటలో సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నాం. నగరంలో అక్కడక్కడా ఇళ్లు కూలుస్తుంటే భయం వేసింది. మా వద్దకు కూడా వచ్చి ఇళ్లు కూల్చేస్తారని కొందరు భయపెట్టారు. ఈ రోజు రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇళ్లు కూల్చబోమని, ఖాళీగా ఉన్న స్థలంలోనే కుంటను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. – సుంకమ్మ, వీకర్ సెక్షన్ కాలనీ -
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుకు హైడ్రా.. 1971 నాటి మ్యాప్‌ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏ చోటకు హైడ్రా అధికారులు వస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఇక, పలుచోట్ల అక్రమ నిర్మాణాలను టార్గెట్ చేస్తూ హైడ్రా ముందుకు సాగుతోంది. మరోవైపు.. కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది.గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. హబ్సీగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా అధికారుల బృందంతో వెళ్లారు కమిషనర్ ఏవీ రంగనాథ్. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.1971-72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి. చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ప్రస్తుతం వాటి పరిస్థతి ఏంటి?. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయి అనే అంశాలను మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లతో పాటు.. నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా కమిషనర్‌కు వివరించారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో.. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో చెరువులను ఆక్రమించి కట్టిన మరిన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు -
అక్రమమైనా జనావాసాల జోలికి వెళ్లం: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రత్యేక విభాగం కార్యకలాపాలపై సామాన్యులను అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ నుంచి, ఏ బుల్డోజర్ వస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ‘సందట్లో సడేమియా‘లా నోటీసులు, బెదిరింపులతో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మీతో సాక్షి’ సామాన్యుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. వాట్సాప్ ద్వారా అనేకమంది పంపించిన ప్రశ్నలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వీరిలో అత్యధికులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరడం గమనార్హం. కాగా ఆయా ప్రశ్నలకు రంగనాథ్ చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి..ప్రకృతిని రక్షిస్తేనే.. మన హైదరాబాద్‌కు భవిష్యత్తు. ప్రకృతిని కాపాడే దిశగా ప్రభుత్వం, మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలే గతంలోనూ ఉన్నాయి. చెరువులు, కుంటల్లో పట్టా ల్యాండ్లు ఉంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని చట్టంలో ఉంది. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు అన్ని అనుమతులు ఇచ్చేశారు. దీంతో నాతో పాటు అనేక మంది మధ్య తరగతికి చెందినవారం ఈఎంఐ లోన్లతో ఇళ్లు కట్టుకున్నాం. వాటిని ఇప్పుడు మీరు కూల్చేస్తామంటే ఎలా? తొలుత మాకు అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ శిక్షించి, ఆ తర్వాత మా వద్దకు రావడం న్యాయం కదా! – జయంత్‌నాథ్, ముషీరాబాద్జవాబు: అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా సామాన్యుడికి అండగా నిలవాలనే చెప్తోంది. అవసరమైన, చెల్లుబాటు అయ్యే అన్ని అనుమతులు ఉన్న కమర్షియల్ భవనాలనూ కూల్చం. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటి పైనే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా నిర్మించిన లేదా అనుమతులు రద్దు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తాం. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై మాత్రం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఆ అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేదా సంబంధిత శాఖకు నివేదిస్తాం. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు పూర్తి వివరాలు సరిచూసుకోండి.హైదరాబాద్ నగరాన్ని కాపాడేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు భేష్. కానీ పెద్దలకు, పేదలకు ఒకే న్యాయం అమలు చేయాలి. పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు. పేదలకు మాత్రం నోటీసు లేకుండానే కూల్చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గంచెరువు, రామాంతపూర్ చెరువు విషయంలో అదే జరిగింది. పేదలు లక్షల రూపాయలు వెచ్చించి కోర్టులకు వెళ్లలేరు. పెద్దలు మాత్రం వెళ్లి తమ అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నారు. అందరికీ ఒకే న్యాయం మీరు అమలు చేయగలరా?– జీవానందరెడ్డి, బంజారాహిల్స్ జవాబు: హైడ్రా ఎలాంటి నోటీసులూ ఇవ్వదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మేం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. హైడ్రా పేద ప్రజల వైపే ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎన్–కన్వెన్షన్, జవహర్‌నగర్ చెరువు వద్ద ఇదే సూత్రాన్ని పాటించాం. సరైన అనుమతులు లేకుండా నిర్మించిన ఎన్–కన్వెన్షన్‌ను కూల్చినప్పటికీ.. అదే చెరువు కట్టపై మరోపక్క ఉన్న పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదు. జవహర్‌నగర్ చెరువు దగ్గర ఉన్న నివాసాలను కూడా ముట్టుకోలేదన్నది గమనించాలి.మేడ్చల్‌లోని గాలిల్లాపూర్ గ్రామానికి సంబంధించి ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్లపై అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిపై స్పష్టత ఇవ్వగలరా? – శ్రీనివాస్జవాబు: మీ గ్రామంలో ఉన్న చెరువు, కుంట పేరు చెప్తే అవకాశం ఉంటుంది. లేదంటే స్థానిక ఇరిగేషన్ అధికారులను సంప్రదించినా, లేదా హెచ్ఎండీఏకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించినా మీకు సమాచారం లభిస్తుంది.శంషాబాద్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యా దులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గత నెల్లో హైడ్రాకు ఫిర్యాదు చేశాం. దానిపై త్వరగా చర్యలు తీసుకోండి. – ప్రకాశ్‌కుమార్, శంషాబాద్జవాబు: హైడ్రాకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం అతికొద్ది మందితోనే పని చేస్తున్నాం. ఫిర్యాదులు మాత్రం దాదాపు ఐదు వేలకు పైగా వచ్చాయి. ఈ కారణంగానే విచారణ పూర్తి చేసి, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. జల్పల్లి పెద్ద చెరువులో అక్రమంగా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్‌ట్యాంక్‌ను రోడ్డుకు అడ్డంగా కట్టారు. దీన్ని ఆధారంగా చేసుకునే ఓ కంపెనీ రోడ్డును ఆక్రమిస్తోంది. వీటిపై చర్యలు తీసుకోండి. – పేరు గోప్యంగా ఉంచాలని కోరిన వ్యక్తిజవాబు: హైడ్రా బృందాన్ని త్వరలో ఆ ప్రాంతానికి పంపిస్తాం. పెద్దచెరువుతో పాటు శ్రీరామ కాలనీ చుట్టు పక్కల ప్రాంతాలపై అధ్యయనం చేయిస్తాం. ఎలాంటి ఆక్రమణలు, అతిక్రమణలు ఉన్నా చర్యలు తీసుకుంటాం. కొందరు రాజకీయ నాయకులకు చెందిన విద్యాసంస్థల్ని కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీ దృష్టిలో అవి అక్రమ నిర్మాణాలు కావా? – రాజేంద్రకుమార్, నారాయణగూడ జవాబు: అలాంటి అక్రమ నిర్మాణం ఎవరిదైనా ఉపేక్షించం. అయితే ఇల్లు అనేది ఓ కుటుంబానికి సంబంధించిన అంశం. వాణిజ్య సము దాయం కొందరికే సొంతమైన వ్యవహారం. కానీ విద్యా సంస్థల విషయం అలా కాదు... దాని కూల్చివేత ప్రభావం వందలు, వేల మంది విద్యార్థులు, వారి భవిష్యత్తుపై ఉంటుంది. అందువల్ల వీటిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.బతుకులకుంట చెరువు సమీపంలో ఆరేళ్ల క్రితం ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఆ సమయంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన గుర్తులు లేవు. అది పక్కా పట్టా భూమి అని చెప్పి అమ్మారు. ఇద్దరు ఆడపిల్లలపై చదువులు, పెళ్లిళ్లు దృష్టిలో ఉంచుకుని ఆ ప్లాట్ కొన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? – నాగిరెడ్డి, హయత్‌నగర్ జవాబు: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ పట్టా భూములు ఉంటాయి. అయితే అది ఏ తరహా పట్టా అన్నది తెలుసుకోవాలి. కొన్ని భూముల్ని కేవలం వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించాలి. ఆయా పట్టాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అమీన్పూర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో నాలుగు నెలల క్రితం ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నా. బంధంకొమ్ము చెరువు ప్రాంతంలో ఉన్న ఆ అపార్ట్మెంట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అది అక్రమ కట్టడమా? సక్రమ కట్టడమా? ఎలా తెలుసుకోవాలి? – పేరు వెల్లడించని వ్యక్తిజవాబు: అమీర్పూర్ ప్రాంతంలోనే కాదు.. ఎక్కడ స్థిరాస్తి కొనుగోలు చేస్తు న్నా 3 అంశాలు సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చిన అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? అనేది చూసుకోండి. అమీన్పూర్లో కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయతీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేశారు. వీటిని గతంలోనే రద్దు చేసిన ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లండి.మేము 2010లో ప్లాట్ కొనుక్కుని అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇప్పుడు మీ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందంటూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారు. వాస్తవానికి మా ఇంటి పరిధిలో ఎలాంటి చెరువు, కుంట ఉన్న ఆనవాళ్లు లేవు. ఎప్పుడు వరద, నీళ్లు రాలేదు. కానీ రికార్డుల్లో కుంట ఉందని, ఎఫ్టీఎల్లో మీ ఏరియా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? – ఎం.సంజీవరెడ్డి, బోడుప్పల్ జవాబు: ప్రస్తుతం ఆ ప్రాంతంలో కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. అందుకే రికార్డుల్లో జలవనరు ఉన్నట్లు నమోదైంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, అందులో నివాసం ఉంటున్న ఇల్లు చెరువులో ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. అలాంటి వాటి జోలికి వెళ్లం. వీటిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతాం. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటల్ని పూర్తి స్థాయిలో పరిరక్షణ చేయడానికే కట్టుబడి ఉన్నాం. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు దిగితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకు కూల్చట్లేదు? ఇప్పుడు మూసీ పరీవాహక ప్రాంతంపై ఎందుకు పడ్డారు? – పేరు చెప్పని ‘సాక్షి’ పాఠకుడు జవాబు: మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న సర్వే, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా ఇప్పటివరకు ఎవరికీ, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దుర్గం చెరువు సహా నగరంలోని 11 చెరువులను పునరుద్ధరించి, పరిరక్షించాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కోర్టు అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు ఆయా చెరువుల పరిధిలో నివసిస్తున్న వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ 11 చెరువుల అంశం ప్రస్తుతంకోర్టు పరిధిలో ఉంది. -
హైకోర్టునూ కూల్చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేత ఘటనపై హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హైకోర్టును కూల్చివేయాలని తహసీల్దార్ లేఖ రాస్తే సిబ్బందిని, యంత్రాలను ఏర్పాటు చేస్తారా? మీకు చట్టం తెలియ దా? ఆదివారం, సూర్యాస్తమయం తరువాత కూల్చి వేత చేపట్టవద్దని విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పాటించరా? చట్టం తెలియకపోతే ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోరా? మీడియా తో మాట్లాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారా?’అంటూ మండిపడింది. స్టే ఇచ్చిన ఆస్తిని సెలవు రోజు ఎందుకు కూల్చాల్సి వచ్చిందన్న దాని కి సమాధానం ఉందా అని ప్రశ్నించగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధ సమాధానం చెప్పలేదు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే అయినా పని తీరు మాత్రం అసంతృప్తికరమని వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు చెప్పింది వింటే ఇబ్బందులు పడేది మీరే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ, అలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఆస్తిపై స్టేటస్ కో విధించింది. కమిషనర్, తహసీల్దార్ హాజరు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామపంచాయతీ పరిధి సర్వే నంబర్ 165, 166లోని 270 గజాల స్థలంలో నిర్మాణానికి 2022, నవంబర్ 10న మహ్మద్ రఫీ భవన నిర్మాణ అనుమతి పొందారు. అయితే ఆ స్థలం సర్వే నంబర్ 164లో ఉందని, అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు అనుమతి రద్దు చేశారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసి ఆదివారం ఆ స్థలంలోని నిర్మాణాన్ని కూల్చివేశారు. దీన్ని సవాల్ చేస్తూ రఫీ, గణేశ్ నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సోమవారం తహసీల్దార్ నేరుగా, కమిషనర్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఆదివారం ఇంట్లో ఉండకుండా ఇదేంటీ? ‘వివాదాస్పద ఆస్తి సర్వే నంబర్ 165, 166లో ఉందని పిటిషనర్లు పేర్కొంటున్నారు. బిల్డింగ్ పర్మిషన్ 2022 నవంబర్‌లో తీసుకున్నారు. కానీ వాస్తవంగా అది సర్వే నంబర్ 164లో ఉంది. ఈ విషయం 2024 మార్చిలో తెలిసింది. ఏప్రిల్ 1న సర్వే చేశాం. ఏప్రిల్ 24న కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్ట్స్ కూడా సర్వే చేశారు. ఏప్రిల్ 2న పిటిషనర్లకు నోటీసులిచ్చాం. దానికి వారు ఏప్రిల్ 15, 18 తేదీల్లో వివరణ ఇచ్చారు. అనంత రం సెపె్టంబర్ 20న నోటీసు లు జారీ చేశాం. 22న ఉద యం హైడ్రా సాయంతో కూ ల్చివేత చేపట్టాం..’అని తహసీల్దార్ చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘పిటిషనర్ల వాద నలు విన్నారా? బిల్డింగ్ అనుమతి రద్దు పై, విద్యుత్ తొలగింపుపై స్టే ఉంది తెలుసా? చట్టప్రకారం ముందుకు వెళ్లమని చెప్పాం కదా? శనివారం సాయంత్రం 6.30 గంటలకు నోటీసులు అందితే.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కూల్చివేస్తారా? అసలు ఆదివారం మీకు సెలవు కదా.. ఇంట్లో ఉండకుండా, అత్యవసరంగా విధులకు హాజరై మరీ కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఐదు నెలలుగా ఆగుతూ వచ్చి ఒక్క రోజులో కూల్చివేత ఎందుకు? సెపె్టంబర్ 20న ఇచ్చిన ఆదేశాల్లో ఖాళీ చేయడానికి 48 గంటల సమయం ఇచ్చారు కదా. ఆ గడువు పూర్తయ్యే వరకు ఎందుకు ఆగలేదు? కలెక్టర్ ఆదేశాలిస్తే చెప్పండి ఆయననూ పిలుస్తాం. ప్రజాస్వామ్య దేశంలో సహజ న్యాయ సూత్రాలను పాటించాలని మీకు తెలియదా?..’అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా, తహసీల్దార్ సమాధానం చెప్పలేకపోయారు.అనుమతులిస్తున్న అధికారులపై చర్యలేంటి? సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? పంచా యతీ/ మున్సిపల్ అధికారులు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? విద్యుత్, నల్లా కనెక్షన్లు ఎలా ఇస్తున్నా రు? ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇంతమంది అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా అను మతి ఇస్తూ పోయిన తర్వాత అది చట్టవిరుద్ధమని ప్రజలకు చెప్పేదెవరు? సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడికక్కడ అక్రమ మా ర్గంలో అనుమతులిస్తారు. కొన్నేళ్ల తర్వాత వచ్చి ఇది అక్రమమంటూ చట్టాన్ని పాటించకుండా కూల్చివేస్తారు. చివరకు ప్రజలను బాధితులను చేస్తారా?’అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రజలే అన్నీ తెలుసుకోవాలంటే ఎలా?తహసీల్దార్ లేఖ మేరకు కూల్చివేతకు సిబ్బందిని, యంత్రాలను అందజేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు తెలిపారు. దీంతో.. ‘తహసీల్దార్ హైకోర్టు, చారి్మనార్‌ను కూల్చివేయాలన్నా అలాగే పంపిస్తారా? చట్టాన్ని అమలు చేయరా? మీ స్టేటస్ ఏంటి? ఆదివారం కూల్చివేత చేపట్టవచ్చా? తహసీల్దార్ అడిగితే మీరు చట్టవిరుద్ధంగా సమకూరుస్తారా? సహకరిస్తారా? కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? అక్రమ నిర్మాణాలను మేం సమర్థించడం లేదు. కానీ చట్టాన్ని పాటించాలి కదా? హైడ్రా తీరు సంతృప్తికరంగా లేదు. కమిషనర్‌గా మీకే అవగాహన లేకపోతే ఎలా? జీవో 99 ప్రకారం హైడ్రాకు ఏం పాలసీ ఉంది?’అంటూ జడ్జి ప్రశ్నించారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు లోపలే తమ పరిధి అని, ఇందులో దాదాపు 2,500 చెరువులు ఉన్నట్లు రంగనాథ్ తెలిపారు. కాగా ‘ఒక్క చెరువుకైనా తుది నోటిఫికేషన్ ఇచ్చి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించారా? మూసీపై మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటీ? పిటిషనర్ ఈ నెలలోనే హైడ్రాపై రిట్ పిటిషన్ వేశారు? మేం జోక్యం చేసుకోవడం లేదని మీ (హైడ్రా) కౌన్సిల్ చెప్పారు. అయినా కూల్చివేత చేపట్టారు. ప్రజలే అన్నీ విచారణ చేసుకుని కొనుగోలు చేయాలి.. వారికి చట్టాలపై అవగాహన ఉండాలంటే ఎలా? జైలుకు పంపిస్తేనే దారికొస్తారుహైడ్రా కార్యాలయం ఎక్కడని సంస్థ కౌన్సిల్ కటికం రవీందర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘డిజాస్టర్ అంటే ఒక్క కూల్చివేతలే కాదు కదా.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు హైడ్రా చేపడుతోందా? బతుకమ్మ కుంట, నల్లకుంట పరిస్థితి ఏంటీ? ఒక్క రాత్రిలో ఈ సిటీని మార్చలేం. చెరువులకు సంబంధించిన మెమైరీలను (చిత్రపటాలను) పరిశీలించి ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని చెప్పాం. రెండేళ్లుగా కోరుతున్నా ఒక్క చెరువుకు కూడా ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోవద్దు. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే మాత్రం కోర్టులు చూస్తూ కూర్చోవు. అక్రమాలకు పాల్పడిన, చట్టాన్ని గౌరవించని అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తే అప్పుడు దారికొస్తారు. కూల్చివేతలు చేపట్టేటప్పుడు పాటించాల్సిన విధానం ఏంటీ అనేది ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోవచ్చు కదా.. అది కూడా చేయరు. ఆదివారం కూల్చడం ముగ్గురు జడ్జిల తీర్పుకు విరుద్ధం..’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలంటే తహసీల్దార్‌కు లెక్కలేదని పిటిషనర్ న్యాయవాది నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం.. అదీ ఉదయం 7.30 గంటలకే కావడంతో హౌస్ మోషన్ కూడా దాఖలు చేయలేకపోయామన్నారు. రెవెన్యూ శాఖ తరఫున జీపీ మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. యుద్ధ ప్రాతిపదికన తొలగించడం లేదుప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ముందుకు మూసీలో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిమూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేశామని, బాధితులతో చర్చలు జరుపుతోందని ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న ఇళ్లకు ‘రివర్ బెడ్’అంటూ రెడ్ కలర్‌తో మార్కింగ్ చేశారని, కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా పాలసీ ఉందా? అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ బయట నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా ఇస్తారని, ఎలాంటి చర్యలు చేపట్టినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఏఏజీ వాదనల అనంతరం.. ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేశారు. -
హైకోర్టును కూడా కూల్చేస్తారా..? కోర్టు ప్రశ్నలకు హైడ్రా షాక్..!
-
భవనాలు కూల్చడమే మీ పనా? రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్..
-
కాసేపట్లో హైకోర్టుకు 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
-
భయపెట్టాలనుకుంటున్నారా?: ‘హైడ్రా’పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్:అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్,అమీన్పూర్ ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. అమీన్పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ సోమవారం(సెప్టెంబర్30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు.సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్‌పై సమాధానం ఎందుకు చెప్తున్నారని సున్నితంగా మందలించింది.హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్పూర్ ఎమ్మార్వో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా..హైకోర్టు ఘాటు వ్యాఖ్యలుఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారుచెరువుల్లో వర్షపు నీరు చేరకపోవడంపై ఏం చర్యలు తీసుకున్నారుఅసలు విషయాలు వదిలేసి కూల్చివేతలెందుకుచార్మినార్ కూల్చేయమంటే కూల్చేస్తారాకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో ఎలా కూల్చివేతలు చేపడతారుకూల్చివేతలు ఇలానే చేస్తే ఇంటికెళ్లిపోతారు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండికూల్చివేతలు తప్ప మీకు వేరే పాలసీ ఏం లేనట్లుందిఅమీన్పూర్పై మాత్రమే సమాధానం చెప్పండి కావేరిహిల్స్ గురించి మేం అడగలేదుఅనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టండిప్రభుత్వ భూముల్ని రక్షించండి.. మేం అండగా ఉంటాంప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదుప్రభుత్వ శాఖలకు ఆదాయం కావాలిమీ బాస్‌లను సంతృప్తి పరిచేలా పనులు చేయొద్దుసామాన్యులు, పెద్ద వాళ్ల మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారుఆదివారం కూల్చడం ఏంటి?భయపెట్టాలని చూస్తున్నారా?వీకెండ్లోనే కూల్చివేతలు ఎందుకు కూల్చివేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారాచట్ట వ్యతిరేకంగా పనిచేసే అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తాంఇదీ చదవండి: కూల్చివేతలపై వెనక్కి..! -
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా వల్లే ఓ మహిళ బలవనర్మణానికి పాల్పడిందన్న కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు.. కొన్ని వీడియోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. పేద, మధ్య తరగతులను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారాయన. ‘‘హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇల్లు.. కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మ సూసైడ్‌తో హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నాను. సంబంధిత వార్త: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!.. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసి నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. .. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసింది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాపై సందేహాలా?.. ఇక్కడ క్లిక్ చేయండి -
‘హైడ్రా’పై సందేహాలా?
హైడ్రా.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఈ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటైంది. బుల్డోజర్లతో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న పార్కులు, ఫాంహౌస్‌లు, విల్లాలు, ఇళ్లు, ఇతర నిర్మాణాలను కూల్చేస్తోంది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలను సవాలక్ష సందేహాలు చుట్టుముడుతున్నాయి. అసలు హైడ్రా ఏ నిర్మాణాలు కూల్చేస్తుంది? వేటిని వదిలేస్తుంది? ఏది ఎఫ్టీఎల్? ఏది బఫర్ జోన్? భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ప్లాట్లు, ఇళ్లు ఖరీదు చేసే ముందు ఏఏ అంశాలు సరి చూసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ వేధిస్తున్నాయి. మరోవైపు తమ చుట్టూ కబ్జాలు జరుగుతున్నా ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి మరికొందరిది. ఈ నేపథ్యంలోనే ‘మీతో సాక్షి’మీ ముందుకొస్తోంది. హైడ్రాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా, సమాచారం కావాలన్నా, ఫిర్యాదు చేయాలనుకున్నా 89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. అసలు హైడ్రా ఏం చేయబోతోందో తెలియజేస్తుంది. -
హైడ్రా కమిషనర్ విచారణకు రావాలి: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్:కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్పూర్ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్27) హైకోర్టు విచారించింది.తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
8 ఎకరాల్లోని 44 నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాల నేపథ్యంలో కొంత విరామం తర్వాత హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన పని పునః ప్రారంభించింది. ఆదివారం మూడు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లతో పాటు రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 44 నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా 8 ఎకరాలను కబ్జా చెర నుంచి విడిపించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. అయితే ఈ మూడు ప్రాంతాల్లోనూ కొన్నింటిలో సామాన్యులు నివసిస్తున్నారని, ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నోటీసులు మాత్రమే జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నం.66, 67, 68, 69లలో విస్తరించి ఉన్న నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. మొత్తం 27 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించిన కొందరు.. 16 షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. షెడ్లలో వంట శాలలు ఏర్పాటు చేసి క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. వాటిలో పనిచేసే వారు కూడా ఆ షెడ్లలోనే నివాసం ఉంటున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు ఆదివారం సంబంధిత అధికారులతో కలసి ఆ షెడ్లను కూల్చేశారు. అమీన్పూర్ మండలంలో.. అలాగే అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నం.164లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎకరం కబ్జా చేసిన కొందరు జీ+5 విధానంలో భవనాలు నిర్మించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో విచారణ చేసిన అధికారులు, ఈ తరహాకు చెందిన మూడు నిర్మాణాలను కూల్చేసి స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అమీన్పూర్ మండలంలోని పటేల్‌గూడలో సర్వే నం.12/2, 12/3లలో సర్కారు భూమి కబ్జాకు గురైంది. మూడు ఎకరాల స్థలంలో కొందరు 25 నిర్మాణాలు చేపట్టారు. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో నిర్మించిన విల్లాలతో పాటు బహుళ అంతస్తులతో నిర్మించినవి ఉన్నాయి. ఈ 25 నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు.. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అ«ధికారులతో కలసి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, జలవనరుల పరిరక్షణ కోసం హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని నల్లచెరువులో కూల్చేసిన షెడ్లు అన్నీ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిచిన అక్రమ నిర్మాణాలు అని, వాటిని వాణిజ్య అవసరాల కోసం వాడుతున్నారని ఆయన తెలిపారు. అలాగే అమీన్పూర్ ప్రాంతంలో కూల్చేసిన మూడు బహుళ అంతస్తుల భవనాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయన్నారు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్‌తో అనుమతులు తీసుకున్నట్లు వివరించారు. తాము కూల్చేసిన దాదాపు 27 విల్లాలు బిల్డర్‌తో పాటు ఇద్దరు ఇతరులకు చెందినవని, రెండింటిలో మాత్రమే కుటుంబాలు నివసిస్తున్నాయని, ఆ రెండింటికీ నోటీసులు ఇచ్చి వదిలేశామని వివరించారు. అలాగే కూకట్‌పల్లిలోని నల్లచెరువులోనూ కొన్ని కుటుంబాలు నివసిస్తున్న నిర్మాణాల జోలికి వెళ్లలేదని రంగనాథ్ పేర్కొన్నారు. -
హైడ్రాకు చట్టబద్ధత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)’కు చట్టబద్ధత కలి్పంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న కొన్ని విశేష అధికారాలను హైడ్రాకు కల్పించబోతోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.ఆ వెంటనే ఆర్డినెన్స్ రూపంలో అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి హైడ్రాకు చట్టబద్ధతను, విశేష అధికారాలను కలి్పంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో చెరువులు, నాలాల పరిరక్షణ కోసం రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల చట్టాల్లోని కీలకమైన అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడం, కూలి్చవేతలు నిర్వహించడం కోసం అవసరమైన అధికారాలు దానికి సమకూరనున్నాయి. శాసనసభ శీతాకాల సమావేశాల్లో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. వరద నష్టంపై కేబినెట్లో చర్చ.. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లింపు, రోడ్లు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం నుంచి అత్యవసరంగా విపత్తుల సహాయ నిధిని పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనుంది. కొత్తగా రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీపైనా దృష్టి అభయహస్తం కార్యక్రమం కింద రేషన్‌కార్డుల కోసం వచి్చన దరఖాస్తులను పరిష్కరించి కొత్తకార్డుల జారీపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమరి్పంచాల్సి ఉంది.గ్రేహౌండ్స్, టాస్‌్కఫోర్స్ తరహాలో హైడ్రా: రంగనాథ్గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలోనే ‘హైడ్రా’పనిచేస్తుందని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం హైడ్రా బిల్లు తీసుకురానుందని ‘హైడ్రా’కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టబద్ధతకు విధివిధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైందని తెలిపారు. జూలై 19న ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్‌తో జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ వంటివెన్నో ఇలాగే ఏర్పాటయ్యాయన్నారు. త్వరలో రాబోయే ఆర్డినెన్స్‌తో వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలు హైడ్రాకు వస్తాయని తెలిపారు. -
హైడ్రా పై సీపీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
-
హైడ్రా చట్టబద్దమైనదే.. త్వరలో మరిన్ని అధికారాలు: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: హైడ్రాపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కమిషన్ రంగనాథ్. హైడ్రా చట్టబద్దమైనదే అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, అక్టోబర్‌లోపు హైడ్రాకు సంబంధించి ఆర్డినెన్స్ వస్తుందన్నారు.కాగా, హైడ్రా అంశంపై తాజాగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. త్వరలోనే హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయి. హైడ్రా చట్టబద్దమైనదే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ అక్టోబర్‌లోపు వస్తుంది. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది. నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చట్టబద్దతను సవాల్ చేస్తూ నానక్‌రామ్‌గూడకు చెందిన లక్ష్మీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటషన్‌లో జీహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా చట్టబద్దతను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కే. లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.ఇది కూడా చదవండి: హైదరాబాద్ ప్రజలంటే సీఎం రేవంత్‌కు పగ: కేటీఆర్ -
హైడ్రా పేరుతో దందా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో కొందరు దందాలకు పాల్పడుతున్నారు. జలవనరుల్లోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్న హైడ్రా ప్రభుత్వ స్థలాల్లోని వాటినీ విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేస్తోంది. దీంతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు బ్లాక్‌మెయిలర్లు రంగంలోకి దిగారని తమ దృష్టికి వచి్చనట్లు బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇలాంటి దందాలు చేసిన వారికి కటకటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారన్న రంగనాథ్... మరికొందరి వ్యవహారంపై సమాచారం ఉందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానంగా రెండు రకాల దందాలు జరుగుతున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నారు. వివిధ జలవనరుల ఫుల్ ట్యాంక్ లెవల్స్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్న వారినే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ అంశంపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, మీడియాకు ఉప్పందిస్తామని బిల్డర్లను భయపెడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే భారీ మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఆయా అధికారులతో దిగిన ఫొటోలను చూపిస్తున్న కొందరు మరో దందా మొదలెట్టారు. ఆ ఫొటోల ఆధారంగా సదరు అధికారులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విషయం సెటిల్ చేస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. 👉బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారితో పాటు వ్యక్తిగత గృహాలు కట్టుకుంటున్న వాళ్లూ టార్గెట్‌గా మారుతున్నారు. ఇలా భయపెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్న వారిలో ఇతర విభాగాలకు చెందిన వాళ్లూ ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్ల అధికారులను అప్రమత్తం చేశారు. చర్యలు తప్పవు.. 👉‘హైడ్రాను నీరుగార్చే ప్రయత్నాలు చేసినా, తప్పు దోవ పట్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విభాగం పేరుతో ఎవరైనా బెదిరింపులు, డబ్బు వసూళ్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకుంటాం. ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రాకు చెందిన అధికారులు, సిబ్బంది సైతం బెదిరింపులకు పాల్పడితే తక్షణం స్థానిక పోలీసుస్టేషన్, ఎస్పీ, పోలీసు కమిషనర్, ఏసీబీ లేదా హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేయండి’ అని రంగనాథ్ అన్నారు. 👉సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్‌ను హైడ్రా పేరుతో బెదిరించి, డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఆ బిల్డర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీని కోరారు. బిల్డర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్పీ.. అమీన్పూర్ ఠాణాలో కేసు నమోదు చేయించారు. బుధవారం విప్లవ్‌ను అరెస్టు చేశారు. -
హైడ్రా.. ఫ్లడ్ స్టడీ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించింది. చెరువులు, నాలాల కబ్జా వల్ల కలిగే ఇబ్బందులను ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి వివరించే ప్రయత్నం చేసింది. హైడ్రా ఏర్పడ్డాక తొలి ముసురు... జీహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను వేరు చేయడంతోపాటు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం హైడ్రాకు రూపమిచ్చింది. ఈ మేరకు జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రోజే హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే చెరువుల ఆక్రమణలపై దృష్టిపెట్టి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే గత 40 రోజుల్లో నగరంలో పలుమార్లు వర్షం కురిసినా శని, ఆదివారాల మాదిరిగా ముసురుపట్టి వివిధ ప్రాంతాలు మునకేసే పరిస్థితి కనిపించలేదు. ఈ రెండు రోజుల వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరద ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేటలలో పర్యటిస్తూ. ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. శని, ఆదివారాల్లో అనేక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేట తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నీళ్లు నిండిన రహదారులు, కాలనీల్లో తిరుగుతూ ఓపక్క డీఆర్ఎఫ్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూనే మరోపక్క ఆ ముంపునకు కారణాలను వారికి వివరించారు. చెరువులు, నాలాల కబ్జాల వల్లే ఈ విపత్కర పరిస్థితులు వస్తున్నాయని, దీని ప్రభావం కబ్జా చేసిన వారి కంటే ఎక్కువగా సామాన్యులపై ఉంటోందని చెప్పారు. ఎవరికి వారు బాధ్యతగా మెలిగేలా, కబ్జాలు, ఆక్రమణలపై వారు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహించారు. ఆ వాదనకు తెరదించేలా... నగరంలో గతంలో వర్షాలు కురిసిన సందర్భంలోనూ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అయితే అప్పట్లో జీహెచ్ఎంసీ ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) డైరెక్టర్‌గా వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. అందులో భాగంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను కూడా ప్రయోగించారు. తాజాగా ఆయన హైడ్రా పగ్గాలు చేపట్టగా ఓ వర్గానికి చెందిన వారు ఆ సంస్థ చర్యలపై దుష్ఫ్రచారం ప్రారంభించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నా ఇబ్బందుల్లేవని... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ఆ వర్గాల వాదన నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. -
హైడ్రా దూకుడు.. అమీన్‌పూర్‌కు రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా స్పీడ్ పెంచింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇక, నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. దీంతో, అక్కడ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. గగన్‌పహాడ్ అక్రమ కట్టడాలను కూల్చివేయడం హైడ్రా ప్రారంభించింది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. కూల్చివేతల ప్రాంతం వద్దకు అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. -
HYD: రాంనగర్ కూల్చివేతలు..‘హైడ్రా’ కమిషనర్ స్పందన ఇదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్‌ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. -
N కన్వెన్షన్ కూల్చేసినప్పుడు.. నాగార్జున ఫోన్ చేశాడా?
-
హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే: కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది. ఈ చర్యలను కొన్ని వర్గాలు అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ‘ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా మాకు సంబంధం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాళ్లకు సమయం ఇస్తాం. అన్నీ పార్టీల నేతల అక్రమ నిర్మాణలను కూల్చేస్తున్నాం’ అని అన్నారు.ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశం.ధర్మసత్రమైన ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. -
18 ప్రాంతాలు.. 43.94 ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో మొత్తం 43.94 ఎకరాలు పరిరక్షించింది. వీటిలో ఎన్–కన్వెన్షన్ ఆక్రమించిన తమ్మిడికుంటతో పాటు ఇతర చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు ఉన్నాయి. తొలుత జీహెచ్ఎంసీ అ«దీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) ఈ కూలి్చవేతలు ప్రారంభించింది.ఈ విభాగం డైరెక్టర్‌గా వచి్చన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టింది. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కలి్పంచడం తొలి ఆపరేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆపై జూలై 1, 4, 5, 14 తేదీల్లో మన్సూరాబాద్, ఎమ్మెల్యేస్ కాలనీ, మిథిలానగర్, బీజేఆర్ నగర్లపై పంజా విసిరింది. ఆ నాలుగు చోట్ల ఉన్న ఏడు నిర్మాణాలను కూలి్చ వేసింది. అప్పటివరకు ఆ ఆపరేషన్లు జీహెచ్ఎంసీ వరకే పరిమితం అయ్యాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు పరిధిని విస్తరించడమే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. దూకుడు పెంచారు. మహదేవ్‌పురంలో తొలి ఆపరేషన్ గత నెల 21న మహదేవ్‌పురంలో పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపుతో హైడ్రా ఆపరేషన్లు మొదలయ్యాయి. ఇలా శనివారం వరకు 18 చోట్ల ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం 43.94 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, చెరు వులు పరిరక్షించింది. వీటిలో పలువురు వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవీ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటై నెల రోజులు దాటినా ఇప్పటివరకు దానికి అదనంగా ఒక్క పోస్టును కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. దీంతో ఇప్పటివరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే కార్య కలాపాలు సాగిస్తోంది.దీనికోసం ప్రతిపాదించిన అదనపు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను కేటాయిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా షాక్ తగిలిన వారిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఈయనపై కేసు నమోదైంది), చింతల్‌కు చెందిన బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సంబంధీకులు ఉన్నారు.హైడ్రా కూలి్చవేతల్లో కీలకమైనవి.. ⇒ మహదేవ్పురంపార్క్ స్థలంలోని నిర్మాణం ⇒ భూదేవిహిల్స్‌లో చెరువులను ఆక్రమించి చేపట్టిన ఐదు నిర్మాణాలు ⇒గాజులరామారంలోని చింతల్చెర్వులో ఉన్న 54 నిర్మాణాలు ⇒నందగిరి హిల్స్ పార్కులో 16 నిర్మాణాలు ⇒రాజేంద్రనగర్‌లోని బుమ్రాఖ్ దౌలా లేక్ లోని 45 నిర్మాణాలు ⇒ ఖానాపూర్, చిల్కూరుల్లోని గండిపేట చెరు వులో ఉన్న 24 నిర్మాణాలు ⇒తమ్మిడికుంట చెరువులోని ఎన్–కన్వెన్షన్‌తో పాటు ఇతర నిర్మాణాలు ⇒ ఫుట్‌పాత్‌లు, నాలాలపైన, ప్రభుత్వ స్థలా ల్లోని అక్రమ నిర్మాణాలు -
కబ్జాలపై కొరడా.. ఎవ్వరిని వదిలిపెట్టం
-
ఐపీఎస్ రంగనాథ్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తా: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్:హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవి రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తనపై కేసు పెట్టడంపై దానం మంగళవారం(ఆగస్టు13) మీడియాతో మాట్లాడారు.‘ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది. అందుకే నాపై కేసు పెట్టాడు. సీఎంకు ఫిర్యాదు చేస్తా. అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ నేను లోకల్ నందగిరి హిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే నేను అక్కడకి వెళ్లాను. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్ళాను. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తా. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు’అని దానం ఫైర్ అయ్యారు. -
సాహితీ ఇన్ఫ్రా బురిడీ రూ.1,110 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్) ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని అమీన్పూర్, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొంపల్లి, బంజారాహిల్స్, నిజాంపేట, బాచుపల్లి వంటి ప్రాంతాలలో 9 నివాస, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని కొనుగోలుదారులను మాయమాటలతో నమ్మించినట్టు బయటపడింది. అసలు భూములను కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ముందస్తుగా డిపాజిట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సాహితీ ఇన్ఫ్రాపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలోని పలు ఠాణాలలో మొత్తం 50 కేసులు నమోదు కాగా.. ఇప్పటికే సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ సహా 22 మందిని అరెస్టు చేశారు. ఒక ప్రాజెక్టు సొమ్ముతో అనేకం..: టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. అమీన్పూర్లో కొనుగోలు అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబరు 343లో ఉన్న 23 ఎకరాలలో 18 ఎకరాలు ఫీనిక్స్ కంపెనీలో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద ఉండగా.. మిగిలిన ఐదెకరాలలో రెండు ఎకరాలు ఓమిక్స్ గ్రూప్, మూడు ఎకరాలను సాహితీ సంస్థ నేరుగా భూ యజమానుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులోనే సాహితీ శార్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని, 10 టవర్లు ఒక్కోటి 32 అంతస్తులలో ఉంటుందని కస్టమర్లను నమ్మించారు. 2019–22 మధ్య కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయకుండానే దాదాపు 1,752 మంది కొనుగోలుదారుల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశారు. -
మహిళను వంచించి.. పెళ్లొద్దన్న ఎంపీ కుమారుడు!
సాక్షి,బళ్లారి: బళ్లారి లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప తనయుడు రంగనాథ్‌పై వంచన కేసు నమోదైంది. శుక్రవారం బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్– 420, 417, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. వివరాలు.. మైసూరు మహారాజా కాలేజీలో ఎంపీ తనయుడు రంగనాథ్ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకుని వదిలేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని తెలిపింది. నాకూ ఫోన్ చేసింది: ఎంపీ ఈ ఘటనపై ఎంపీ దేవేంద్రప్ప దావణగెరె జిల్లా అరసికెరెలో స్పందించారు. తన కుమారుడిపై కుట్రతో కేసు నమోదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం ఓ మహిళ తనకు కూడా ఫోన్ చేసి తన కొడుకు గురించి ఫోన్లో చెప్పిందన్నారు. అయితే తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టులు ఉన్నాయని సూచించానన్నారు. ఆమె డబ్బు కోసం బెదిరిస్తోంది: రంగనాథ్ మైసూరు: డబ్బుల కోసం యువతి ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తోందని మైసూరులోని మహారాజ కళాశాల లెక్చరర్ రంగనాథ్ (42) విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. తన స్నేహితుడు అయిన కల్లేష్ అనే వ్యక్తి నుంచి దేవిక (24) అనే యువతి పరిచయమైంది. 2, 3 సార్లు ఆమె కలిసిన తరువాత ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ నేను ప్రేమించడం లేదని చెప్పినట్లు రంగనాథ్ అన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసగించాడు బనశంకరి: బళ్లారి ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ అమ్మనాన్నకు పరిచయం చేస్తానని తెలిపి ప్రైవేటు హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నారని ఓ యువతి ఆరోపించింది. వివాహం చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశాడని శుక్రవారం బెంగళూరు బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. తరువాత ఆమె విలేకరులతో మాట్లాడింది. అతనికి గతంలోనే వివాహమైనట్లు తనకు తెలియదన్నారు. పెళ్లి చేసుకోవాలని నేను ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు, డబ్బు ఇస్తాను, నన్ను వదిలి వెళ్లిపో అని ఒత్తిడి చేశాడని ఆమె పేర్కొంది. -
గణేష్ నిమజ్జనంలో సీపీ రంగనాథ్ డాన్స్
-
వేడుకగా తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవాలు
తిరుమల: ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం గురువారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో ఉన్న శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథ ముఖ్య అతిథిగా హజరై ఉపన్యసించారు. తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇతర కైంకర్యాలు చేసి తిరుమల తొలి పౌరుడిగా శ్రీ తిరుమలనంబి నిలిచారని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అని చెప్పారు. తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా తిరుమలనంబికి సంబంధించిన విశేష అంశాలతో రచించిన తిరుమలనంబి దివ్యచరితామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన పాలకొలను వెంకటరామిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులో రచించారు. దీన్ని గిద్దలూరుకు చెందిన గంటా మోహన్ రెడ్డి ఇంగ్లీషులోకి, బెంగళూరుకు చెందిన రంజని కన్నడ భాషలోకి అనువదించారు. -
సుపారీ ఇచ్చి.. హత్య చేయించి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు. ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు. పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు. ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్ భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు. -
మైనర్‌కు బండి.. ‘మేజర్’ మిస్టేక్
ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు. పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు.. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్ ఏ1గా ఉంటే.. మైనర్ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు. – ఏవీ.రంగనాథ్, సీపీ -
ప్రీతి సూసైడ్‌కు అతడే కారణం: సీపీ రంగనాథ్
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ఈ మేరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్ బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్‌కు బెయిల్‌పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్ కేసులో వరంగల్ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం -
బండి సంజయ్ ఆరోపణలకు సీపీ రంగనాథ్ కౌంటర్
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా
-
వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-
వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ పరువునష్టం దావా
-
టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్‌ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్‌లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. సంజయ్ ఆదేశాలతోనే లీక్ ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. ‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్‌లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్‌తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్‌పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్‌సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్‌ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్‌లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు. చట్టప్రకారమే అరెస్టులు బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్‌లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు. రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ.. హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ.. ♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే అవకాశం ఉంది. ♦ నిందితులు రిమాండ్‌కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్‌గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు. ♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది. ♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్‌కు పంపాలి. -
టెన్త్ పేపర్ లీకేజీ.. కీలక విషయాలు వెల్లడించిన సిపి రంగనాథ్
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝళిపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ కు పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. - ఏవి.రంగనాథ్ - సిపి వరంగల్ -
పేపర్ లీక్ అయ్యిందనడం సరికాదు: వరంగల్ సీపీ
సాక్షి, వరంగల్: తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ.. తాజాగా మొదలైన పదో తరగతి పరీక్షల్లోనూ పేపర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా హిందీ క్వశ్చన్ పేపర్ సైతం వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో.. ఇవాళ్టి హిందీ క్వశ్చన్ పేపర్ పరీక్ష సమయంలోనే బయటకు వచ్చిన విషయాన్ని ధృవీకరించారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్. పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. అంటే.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట!. కాబట్టి దీనిని లీక్ అనడం సరికాదు. పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్ బయటకు వచ్చిందనే మేం భావిస్తున్నాం. ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలింది. అయితే.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాం. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని తేలింది. అయితే.. ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్ హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లోనే పేపర్ పెట్టినట్లు తెలుస్తున్నా.. అధికారికంగా అది ధృవీకరణ కావాల్సి ఉంది. -
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు సెలవు గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది. -
ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు కఠినం చేస్తాం: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
-
గంజాయి సమస్య కొత్తది కాదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో (ఏవోబీ) గంజాయి సమస్య కొత్తది కాదని, పదిహేనేళ్లుగా కొనసాగుతోందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ గంజాయి సాగుచేస్తున్న విషయం అక్కడి సీనియర్ పోలీసు అధికారులకు, ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఏవోబీ నుంచి గంజాయి రవాణా తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, గంజాయి రవాణా, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టాలని ఆదేశించారని వెల్లడించారు. గడిచిన నెలన్నరలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు. ఏవోబీ నుంచి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని తాము పట్టుకున్న వారి కాల్ డాటా ఆధారంగా గుర్తించామన్నారు. తనిఖీల్లో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి తనిఖీలోనూ గంజాయి మూలాలు ఏవోబీవైపే చూపించాయని, గంజాయి విక్రయదారుల పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగానే దసరా రోజు నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలతో ఏపీలో దాడులు నిర్వహించామన్నారు. దీనికి ఏపీ పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డికి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారంతోనో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఎస్పీ రంగనాథ్ ఆ ప్రకటనలో వివరించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి విషయమై చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరికాదన్నారు. ‘మా భుజాల మీద నుంచి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. గంజాయి ఇష్యూను అక్కడి నాయకులు ఎవరికి అనుగుణంగా వారు అన్వయించుకుంటూ రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవడం సరికాదన్నారు. -
గంజాయి స్వాధీనానికి వెళ్లి.. కాల్పులు జరిపి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఏవోబీ(ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు)లో భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై మరికొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. గంజాయి హబ్‌గా.. హైదరాబాద్‌లోని సింగిరేణి కాలనీలో గంజాయికి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలికను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యచరణ కు దిగింది. ఈ క్రమంలో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్లగొండ డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి. ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన బృందాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాలపై దాడులకు దిగాయి. ఆదివారం 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, 20 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించుకునేందుకు ఆ ముఠాలోని మరికొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో రోడ్డుకు టిప్పర్‌ను అడ్డుపెట్టి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు జిల్లా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని, ఇద్దరు స్మగ్లర్లకు కాళ్లకు గాయాలైనట్లు పేర్కొన్నాయి. పక్కా వ్యూహంతో.. వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్ చేయించారు. కొనుగోలుదారుల పేరుతో రంగంలోకి దిగి.. గంజాయి కావాలని బేరం కుదుర్చుకున్నారు. అలా ఆప రేషన్ కొనసాగించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడులను ఏపీ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించామని నల్లగొండ ఎస్పీ చెబుతుండగా, విశాఖ ఎస్పీ మాత్రం నల్లగొండ పోలీసులు వచ్చిన సమాచా రమే తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఆత్మరక్షణ కోసమే కాల్పులు ‘విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి కేంద్రాలపై దాడులకు జిల్లా పోలీసు బృందాలు వెళ్లింది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో గంజాయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. అది కొనసాగుతున్న క్రమంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాయి. ఘటనలో ఏ ఒక్క పోలీస్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు’. – నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ 20 మంది వరకు అరెస్టు... ‘విశాఖ లంబసింగి సమీపంలో ఆదివారం సాయంత్రం గంజాయి స్మగ్లర్ల నుంచి ఆత్మరక్షణ కోసమే నల్లగొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు తీగలాగుతూ గంజాయి స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం ధ్వంసం అయ్యింది. అయితే, అనుకోకుండా ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు గాయాలయ్యాయి. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేశాం’ – విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు వెల్లడి -
నేను రైతులను కించపరచలేదు: మంత్రి రంగనాథరాజు
-
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నాం
-
కాఫీ డే తాత్కాలిక చైర్మన్ నియామకం
సాక్షి, ముంబై : కాఫీ డే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎస్వీ రంగనాథ్ తాత్కాలిక చైర్మన్ నియమితులయ్యారు. వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యం, 36 గంటల తీవ్ర గాలింపు అనంతరం పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా సమావేశమైన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్ నియామకంతోపాటు, నితిన్ బాగమనేను తాత్కాలిక సీఓఓగా, రామ మోహన్‌ను సీఎఫ్‌వోగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మరోవైపు సిద్ధార్థ మృతిపై పలువురు వ్యాపార దిగ్గజాలతోపాటు, రాజకీయ వేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఎంతో కలిచివేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వీజీ సిద్ధార్థ మృతిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన మరణం తనను షాక్‌కు గురిచేసిందని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా తనకు సిద్ధార్థ గురించి, ఆయన ఆర్థిక పరిస్థితిపై పెద్దగా తెలియదని పేర్కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఏదేమైనా వ్యాపార వైఫల్యాల కారణంగా జీవితాలను, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదన్నారు. అది ఒక వ్యవస్థ మరణానికి కారణమవుతుందంటూ ట్వీట్ చేశారు. -
ఇన్ఫోసిస్‌కు మరో కీలక అధికారి గుడ్‌బై
ముంబై : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో కీలక అధికారి గుడ్‌బై చెప్పారు. కంపెనీ సీఎఫ్ఓగా పనిచేస్తున్న రంగనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత తన పదవిలో నవంబర్ 16 వరకే కొనసాగనున్నారు. రంగనాథ్ రాజీనామాను ఇన్ఫోసిస్ బోర్డు కూడా ఆమోదించింది. వెంటనే కొత్త సీఎఫ్ఓను వెతుకులాటను కూడా ఇన్ఫోసిస్ బోర్డు చేపట్టబోతుంది. ‘18 ఏళ్లు సుదీర్ఘకాలం పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేసిన రంగనాథ్, పలు బృందాలకు నాయకత్వం వహించారు. కన్సల్టింగ్, ఫైనాన్స్, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్, ఎం అండ్ ఏ ఏరియాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బోర్డు, దాని కమిటీలతో కలిసి ఎంతో సన్నిహితంగా పనిచేశారు. వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేయడం ఈ పాత్ర చాలా కీలకం’ అని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రంగనాథ్ అమెరికా నుంచి బెంగళూరుకు సిఫ్ట్ అయ్యారు. సీఈవో సలీల్ పరేఖ్‌తో కలిసి పనిచేశారు. రంగనాథ్ కంపెనీకి అందించిన అద్భుతమైన సహకారానికి ఆయనకు కృతజ్ఞతలు ఇన్ఫోసిస్ బోర్డు చెబుతున్నట్టు బోర్డు సీఈవో నందన్ ఎన్ నిలేఖని చెప్పారు. ఆయన మరింత పైస్థాయికి ఎదగగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.గత మూడేళ్లలో సీఎఫ్ఓగా రంగా ఎంతో కీలకమైన సేవలందించినట్టు పేర్కొన్నారు. సమర్థవంతమైన మూలధన కేటాయింపుల పాలసీని ఆయన అవలంభించారని కొనియాడారు. 15 ఏళ్లకు పైగా రంగనాథ్‌తో కలిసి పనిచేశా. దేశంలో అత్యున్నత సీఈవోల్లో రంగనాథ్ ఒకరు. ప్రతికూల పరిస్థితుల్లో కఠినతర నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన దిట్ట. ఆర్థిక నిపుణుడైన రంగనాథ్, కంపెనీకి కీలక ఆస్తి - ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి. -
సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: ఆయేషా మీరా హత్యతో తనకు సంబంధం లేదని నిందితుడు సత్యంబాబు పేర్కొన్నాడు. పోలీసులు బెదిరించడం వల్లే చేయని నేరాన్ని ఒప్పుకున్నానని వెల్లడించాడు. తన తల్లిని, చెల్లిని ఎన్ కౌంటర్ చేస్తామని దర్యాప్తు అధికారులు బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు. సత్యంబాబు ఆరోపణలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారి రంగనాథ్ తోసిపుచ్చారు. ఆయేషా మీరాను సత్యంబాబు హత్య చేసినట్టు స్వయంగా అంగీకరించాడని తెలిపారు. చాలా నేరాల్లో అతడు నిందితుడని, బాధితులను విచారిస్తే నేరాల చిట్ట బయటపడుతుందన్నారు. సత్యంబాబు అమాయకుడు, ఇరికించారనేది అబద్ధమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. సత్యంబాబును అరెస్ట్ చేశాక నందిగామలో ఒక్క నేరం జరగలేదని వెల్లడించారు. -
మాకు ఈ చెడ్డపేరు వస్తుందని అప్పుడే తెలుసు!
అలాంటి న్యూస్ వినాల్సి వస్తే... ఫీలవకు అన్నారు! - నీరజ, రంగనాథ్ పెద్ద కుమార్తె తెలుగు ప్రేక్షకులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ‘రంగనాథ్ గారేంటి? అలా చేయడం ఏంటి?!’ రంగనాథ్ పిల్లలూ ఆ షాక్‌లో నుంచి బయట పడలేదు. ‘నాన్నగారేంటి? ‘అలా’ వెళ్లిపోవడం ఏంటి?!’ రంగనాథ్... విమానం ఎక్కరు. భయం! బస్సూ ఎక్కరు. భయం! అంత భయం ఉన్నవారు.. ఇంత ధైర్యం ఎలా చేశారు? డెస్టినీ..!?! ఏ పరిస్థితులు ఆయన్ని ఈ విపరీతానికి ప్రేరేపించాయి? అందరూ ఉన్నా...తనకు ఎవరూ లేరనుకున్నారా? ఉన్నవారికి తను లేకున్నా ఫరవాలేదనుకున్నారా? ఎన్నో ప్రశ్నలు. మరెన్నో సందేహాలు. సమాధానాల కోసం ‘సాక్షి ఫ్యామిలీ’... రంగనాథ్ పిల్లల్ని కలిసింది. వారి బాధను షేర్ చేసుకుంది. (రంగనాథ్ చివరి సంతకం) ‘‘నాన్న గారు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం నాకు ఇప్పటికీ మింగుడుపడట్లేదు. ఇంకా షాక్‌లోనే ఉన్నా. అందరూ వచ్చి పలకరించడం, నాన్న గారి గురించి మాట్లాడడంతో మళ్ళీ మళ్ళీ ఆయనే గుర్తుకొస్తున్నారు. చెల్లెలు, తమ్ముడి కన్నా నాన్న గారికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన ఉరేసుకుని ఉన్న దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. ఆయనిలా చేసుకోవడానికి కారణం అర్థం కావడం లేదు. కనీసం నోట్ అయినా రాసి ఉంటే తెలిసేదేమో, అదీ లేదు! సాధారణంగా ఆయన ఏ మాత్రం డల్‌గా ఉన్నా నేను కనిపెట్టేస్తా. ఈ దుర్ఘటన జరగడానికి రెండు రోజుల ముందు కూడా కలిశా. కానీ, ఆయన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడే మూడ్‌లో ఉన్నారని గ్రహించలేకపోయా. ఎన్నడూ లేనిది నుదుట బొట్టు పెట్టుకొని, కనిపించారు. ఏదో దేవుడి మీద భక్తి, ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నారనుకున్నా. అదీ మంచిదేలే అనుకున్నాను. కానీ, ఇలా చేస్తారనుకోలేదు. నాన్నగారికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. మేము ఏ రోజూ ఆర్థికంగా ఆయన్ని ఇబ్బందీ పెట్టలేదు. ఆయన కూడా ‘నాకున్నది చాలు’ అనేవారు. ఆయనకు తృప్తి ఉండేది. సినిమాల్లో, టీవీలో పాత్రల కోసం కూడా ఆయన వెంపర్లాడింది లేదు. అవకాశాలు వచ్చినా నాన్న గారికి ఓపిక పోయింది. ‘ఎవరి కోసం చేయా లమ్మా! ఎవరి కోసం సంపాదించాలమ్మా!’ అనేవారు. కానీ, మేమే ‘అలా కాదు నాన్నా! డబ్బు కోసం కాదు. సెట్స్కెళ్ళి నటిస్తుంటే నీకు ఉత్సాహంగా ఉంటుంది. తెలిసినవాళ్ళందరితో కలవచ్చు. మాట్లాడుకోవచ్చు’ అని ఎంకరేజ్ చేసేవాళ్ళం. నటిస్తూ ఉంటే పనిలో పడి, ఒంటరితనం పోతుందని అలా చెప్పేవాళ్ళం. కానీ, ఆయనకు ఎక్కడో ఆసక్తి పోయింది. హైదరాబాద్‌లో మా ఇంటికెదురుగా ఉన్న బ్యాంక్‌లో నాన్న గారికి ఖాతా ఉంది. డబ్బులు కావా లంటే, అక్కడికే వచ్చేవారు. అక్కడికి ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఏది ఉంటే, అది తినడానికి పెట్టేదాన్ని. ఆకలి లేకపోతే, ‘వద్దమ్మా’ అనేవారు. యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళేవారు. పిల్లలందరినీ పద్ధతిగా పెంచారాయన. ఎవరి మీదా ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కూతురి దగ్గర అల్లుడి ఇంట్లో ఉండడం బాగుండదను కొనేవారు. ‘నేను అల్లుళ్ళ దగ్గర ఉండలేనమ్మా’ అని చెప్పారు. తమ్ముడి భవిష్యత్తు దృష్ట్యా బెంగుళూరులో వాడు ఉద్యోగం చేయడానికి సరే అన్నారు. ‘మీకెక్కడ, ఎలా హ్యాపీగా ఉంటుందనిపిస్తే, అలాగే ఉండండి నాన్నా’ అనేవాళ్ళం. ఆయన విడిగా ఉంటానంటే సరేనని ఒప్పుకున్నాం. కానీ, అది చివరకు ఎదురు తంతుందనీ, ఆయనను ఒంటరిగా వదిలేశామన్న నింద మోయాల్సి వస్తుందనీ నేను ఊహించలేదు. మా నాయనమ్మ కర్నూలులో ఉంటుంది. ఆమె ఫోటో ఈ మధ్యే మా బాబాయ్ కూతురు వాట్సప్‌లో పంపింది. బాగా వృద్ధురాలైన ఆమెకు వినికిడి తగ్గింది. మనుషుల్ని కూడా గుర్తుపట్టట్లేదు. ‘రంగనాథ్’ అని మాత్రం కొడుకు గురించి అంటూ ఉంటుంది. నాయ నమ్మ ఫోటో చూశాక, ఆమెకు ఏదో అయినట్లు నాన్న గారికి పీడకల వచ్చిందట. నాయనమ్మను చూసి వస్తానని నెల న్నర క్రితం అప్పటికప్పుడు కర్నూలె ళ్ళారు. ఒకటిన్నర రోజు లక్కడే ఉండొచ్చారు. అప్పుడూ ఏమీ అనలేదు. నాన్న గారికి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండైన నందా అంకుల్ గూడూరులో ఉంటారు. సెప్టెంబర్‌లో ఆయన పుట్టిన రోజు కూడా బాగా చేశారు. కనీసం నందా అంకుల్‌తో కూడా నాన్న గారు తన బాధేమిటో చెప్పలేదు. సహజ మరణ మైతే కొంత కాలానికైనా సర్దు కుంటామేమో కానీ మమ్మల్ని అనాథల్ని చేసి, ఇలా ఆత్మహత్యకి పాల్పడడం జీర్ణించు కోలేకపోతున్నాం. అమ్మ అంటే నాన్న గారికి బాగా ఎటాచ్ మెంట్. ప్రమాదవశాత్తూ మేడ మీద నుంచి కిందపడి, అమ్మ మంచానికే పరిమితమై పోతే ఆమె కన్నుమూసేవరకు పధ్నాలుగేళ్ళపాటు పసిపిల్లలా చూసుకున్నారు. మంచాన పడ్డ మా అమ్మను చూసుకోవడానికి అప్పట్లో పనిమనుషులు కూడా దొరికేవారు కారు. పెళ్ళి అయిపోయాక, నేనూ వచ్చేశా. మా తమ్ముడు చదువుకొంటూ ఉండేవాడు. నాన్న గారు వాళ్ళు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయ్యాక కూడా చాలామంది పనిమనుషుల్ని మార్చాల్సి వచ్చింది. చివరకు ఇప్పుడున్న మీనాక్షి దొరికింది. ఆమె చాలా మంచిది. అప్పట్లో మా అమ్మగారికి ఎంతో చేసింది. అమ్మ పోయాక నాన్నను చూసుకోవడానికి కూడా వేరెవరో ఎందుకని నమ్మకస్థురాలైన మీనాక్షినే పెట్టాం. అమ్మనీ, తననీ బాగా చూసుకున్న మీనాక్షికి ఏమైనా చేయాలనే నాన్న గారు ఆ రెండు ఫిక్స్డ్ డిపాజిట్ల డబ్బులు (రూ. 5 లక్షలు) ఆమెకిమ్మని రాశారు. నాన్న గారికి మొదటి నుంచీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆర్థికంగా ఇంకా బాగుండి ఉంటే, సంఘానికి చాలా చేయాలని ఉండేది. ఇంట్లో ఉంటే ఉదయం ఎప్పుడూ టీవీలో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ పెడతారు. అవే చూస్తుంటారు. సొసైటీలో జరుగుతున్న దారుణాలు చూసి, కథలు, కవితల రూపంలో స్పందిస్తారు. ‘సమాజం ఎటుపోతోంది! బంధాలకూ, బాంధవ్యాలకూ చోటు లేకుండా పోయింది’ అని బాధపడుతుండేవారు. ♦ ఆలుమగల గురించి ఆయన రాసిన కవిత్వం చదివి, అయిదేళ్ళ క్రితం విడిపోయిన జంట మళ్ళీ కలిసిందట. ఆ సంగతి వాళ్ళే నాన్న గారికి ఫోన్ చేసి చెప్పారు. అది తెలిసి ఆయన ఎంత సంతోషించారో చెప్పలేం! ఆ సంగతి మా అందరితో పంచుకున్నారు. (పొంగుకొస్తున్న దుఃఖంతో...) అందరికీ సాయపడా లనే స్వభావం ఉండి, అన్ని కవిత్వాలు రాసి, అంత ఫిలసాఫికల్‌గా ఉండే ఆయన చివరకిలా చేసుకొని తీరని బాధ మిగిల్చారు. హి హ్యాజ్ టేకెన్ ఎ రాంగ్ స్టెప్. ఈ శోకం నుంచి, ఈ షాక్ నుంచి మేము, మరీ ముఖ్యంగా నేను ఎప్పటికీ తేరుకోలేనేమో!’’ ♦ అమ్మ పోయాక అప్పుడప్పుడు ‘ఇంకెందుకు నేను’ అనే వాళ్ళు. అయితే, నేను చాలా సెన్సిటివ్. పైగా హార్ట్ పేషెంట్‌ని. అందుకే నా గురించి ఆలోచించేవారు. ఆరు నెలల ముందో, ఏడాది ముందో ఒకసారి- ‘నేనేదైనా చేసుకున్నట్లు న్యూస్ వస్తే ఫీలవకు! బెంగపెట్టుకోకమ్మా!’ అన్నారు. నేను షాకైతే, ‘ఏదో ఒకరోజు అంతా పోవాలి కదా!’ అని సర్దారు. తర్వాత సర్దుకున్నారు. ‘ఏదో మూడ్‌లో అన్నారులే... చాలా రోజులైందిగా’ అనుకున్నా. కానీ, ఉన్నట్టుండి ఇలా చేసుకుంటారనుకోలేదు. ♦ మీ నాన్న గారి మరణంతో మీ జీవితంలో వచ్చిన మార్పు? రంగనాథ్ ఏకైక కుమారుడు నాగేంద్రకుమార్: షాకిం గ్గా ఉంది. బెంగుళూరులో జీవితం తలకిందులైంది. మారిన పరిస్థితుల్లో కొత్త పాత్రకు సిద్ధం కావాలి. హైదరా బాద్ షిఫ్టై, మొత్తం వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది. ♦ ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. హి ఈజ్ ఏబుల్ టు మెయిన్టైన్ హిమ్సెల్ఫ్. ఆయన ఏ రోజూ మమ్మల్ని పైసా అడగలేదు. ‘నాన్నా! డబ్బులు ఏమైనా కావాలా’ అని అడిగితే కూడా ‘నాకేమీ అక్కర్లేదు. మీరు బాగుంటే అదే చాలు’ అనేవారు. అవసరమైతే మాకే ఆయన డబ్బులు ఇచ్చేవారు. మాకే కాదు... బయటవాళ్ళకి - చదువుకోవడానికి కష్టపడుతున్న వాళ్ళకీ, పిల్ల పెళ్ళి చేయలేక ఇబ్బందిపడుతున్నవాళ్ళకీ ఆయన వేలు, లక్షల్లో సాయం చేసిన సంఘటనలున్నాయి. కాకపోతే, కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియ కూడదనేవాళ్ళు. నైతికంగానూ అండగా నిలబడేవాళ్ళు కానీ, ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. ఒక్కమాటలో హి ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. అహంకారం, పొగరు లేవు. ఎదుటివాళ్ళను ఎప్పుడూ బాధపెట్టేవారు కాదు. ♦ నాన్నగారు చనిపోయారనే వార్త మీకెలా తెలిసింది? మేము వేరేవేరే ఊళ్ళలో ఉంటున్నాం. హైదరాబాద్‌లో నాన్న గారుంటున్న ఇంటికి దగ్గరలో మా పెద్దక్క నీరజ ఉంటోంది. మా పెద్దక్క బెంగుళూరులోని మా చిన్నక్క శైలజకు ఫోన్ చేసి, విషయం చెప్పింది. చిన్నక్క నాకు చెప్పింది. తెలియగానే హడావిడిగా బయలుదేరాం. ♦ మీ నాన్న గారితో ఆఖరుసారిగా ఎప్పుడు మాట్లాడారు? గత నెల (నవంబర్) మాట్లాడా. నాన్నగారు చనిపోవ డానికి రెండు రోజుల ముందు కూడా హైదరాబాద్ వచ్చి, ఆయనని చూడాలనిపించింది. ఆ మాటే మా వాళ్ళతో అంటూ వచ్చా. కానీ, మా ఆవిడ పేషెంట్. ఆవిడను కూడా చూసుకోవాలి. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. ♦ కన్నతండ్రితో నెల రోజుల క్రితం మాట్లాడారా!? మేమెక్కువగా ఆయనను ఫోన్లో విసిగించం. ఎందు కంటే, ఆయనెప్పుడూ ఏదో పనిలో ఉంటారు. ఉదాహర ణకు, ఆ మధ్య పుట్టినరోజుకు ఫోన్ చేస్తే, ఆయన అనాథా శ్రమంలో అన్నదానంలో ఉన్నారు. మరొకసారి ఫోన్ చేస్తే, ఏదో సభలో ఉంటారు. కొన్నిసార్లు కథలు, కవిత్వాలు రాసుకొనే మూడ్‌లో ఉంటారు. మరికొన్నిసార్లు రాత్రివేళ ఆయన తొందరగా నిద్రపోతారు. సాయంత్రం మూడు, నాలుగు గంటలు ఆయన ఫోన్ తీయలేదంటే, సీరియస్‌గా టెన్నీస్ ఆడుతూ ఉండి ఉంటారని అర్థం. అందుకే, ఉయ్ డోన్ట్ నో వెన్ టు కాల్ హిమ్. ఫోన్ చేస్తే మూడు రింగుల య్యాక కూడా ఆయన తీయలేదంటే, బిజీగా ఉన్నారని పెట్టేస్తాం. ఆయనే మళ్ళీ మాకు కాల్‌బ్యాక్ చేస్తారు. ♦ మీరెందుకని మీ నాన్న గారితో ఉండట్లేదు? గతంలో నేను, మా ఆవిడ, మా అబ్బాయి - మేమంతా అమ్మానాన్నలతో కలసి హైదరాబాద్‌లోనే గాంధీనగర్లోనే ఉండేవాళ్ళం. కానీ అమ్మ ఉన్నప్పుడు ఆమెను చూసుకోవడంతో, ఆమె పోయిన తరువాత ఒంటరితనంతో నాన్నగారికి స్ట్రెస్ ఉండేది. హీరోగా వెలిగిన ఆయనను మామూలు మని షిలా అబ్బాయిని చూసుకోమనీ, ఇంటి పని చూడమనీ చెప్పలేం! ‘వయసు మీద పడుతోంది, ఓపిక లేద’ని ఆయనా ఇష్టపడ లేదు. అప్పటి దాకా అమ్మను చూసు కున్న ఆయన్ని మళ్ళీ మా బరువు బాధ్యతలతో ముంచేయడం సరికాదు. ఆయన స్వేచ్ఛగా ఉండడా నికి ఇష్టపడ్డారు. నేనూ ఉద్యోగ రీత్యా బెంగళూరు మారా. దానివల్ల ‘ఆయన్ని వదిలేశారు. చూసుకోవడం లేద’ని మాకు చెడ్డపేరొస్తుందని అప్పుడే తెలుసు. కానీ, ఆయన ఇష్టాన్ని గౌరవించాం. ♦యాక్సిడెంటై మంచానపడ్డ భార్యను ఆయన పధ్నాలుగేళ్ళ పాటు చంటిబిడ్డలా సాకడం సామాన్య విషయం కాదు! సేవ చేయాలనే మనసున్నా, అలా చేయడానికి ధైర్యం కూడా ఉండాలి. అది ఎంత మందికుంటుంది! పనిమనిషి పక్కన లేకపోతే, ఒంటికీ, రెంటికీ వెళితే శుభ్రం చేయడం, భార్యని పసిబిడ్డను చూసుకున్నట్లు చూసుకోవడం కష్టం. అవన్నీ నాన్నగారు చేశారు. పైగా పేషెంట్‌కు మన కష్టం తెలియనివ్వకుండా, విసుక్కోకుండా, నవ్వుతూ చేశారు. ♦రంగనాథ్ గారికి మీరెంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు? మేము ముగ్గురం. మా పెద్దక్క నీరజ హౌస్‌వైఫ్. హైదరాబాద్‌లోనే ఉంటుంది. పెద్ద బావ గారు ఫార్మస్యూ టికల్ కంపెనీలో చేస్తారు. చిన్నక్క శైలజ బెంగుళూరులో కాలేజ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్. చిన్న బావగారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీర్. నేను, మా ఆవిడ, అబ్బాయి (అగస్త్య సాయిరిత్విక్) బెంగుళూరులో ఉంటాం. ♦ఇంతమంది ఉన్నా, తన పక్కన ఎవరూ లేరని ఆయన... (మధ్యలోనే..) ‘ఐ నీడ్ సమ్ స్పేస్’ అని ఆయన న్నారు. ఆయన అలా బలవంతం చేయబట్టే, స్వేచ్ఛగా వదిలేశాం. ‘వియ్ హ్యావ్ టు ఫేస్ దిస్ డే’ అని తెలిసినా సిద్ధపడ్డాం. తొమ్మిదో తరగతి చదువుతున్న మా పెద్ద మేనల్లుడే (పెద్దక్క కొడుకు శశాంక్) నా స్థానంలో ఇక్కడ మా నాన్న గారి దగ్గరకు తరచూ వచ్చి, ‘తాతా! ఎలా ఉన్నా’వని అడుగుతుండేవాడు. పెద్దక్క వచ్చి ఆయన క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని కనుక్కునేది. ♦హీరోగా వెలిగిన నాన్నగారు చిన్న వేషాలూ అరుదైన పరిస్థితిలో బాధ, డిప్రెషన్ ఏమైనా మీతో వ్యక్తంచేసేవారా? డిప్రెషన్ అంటూ చెప్పింది ఏమీ లేదు. ‘హీరోగా వెలిగినా, కాలంతో పాటు మారడానికి తగినంత వర్క్ చేయలేదేమో’ అని అంటూ ఉండేవారు. ‘డ్యాన్స్‌లు, ఫైట్స్ లాంటి వర్క్ చేయలేదు. చేసి ఉంటే, చిరంజీవి తరంలో కూడా నిలబడి ఉండేవాణ్ణి’ అనేవారు. కానీ, ఆయనకు అసంతృప్తి లేదు. ‘నాకు రావాల్సినదాని కన్నా ఎక్కువే వచ్చింది’ అనేవారు. పదేళ్ళకోసారి మార్పు వస్తుంది. కొత్తనీరు వచ్చినప్పుడు హుందాగా వెనక్కి తగ్గడం నేర్చుకోవాలనేవారు. హీరో శోభన్‌బాబు లాంటి వాళ్ళు చెప్పినమాటల్ని గుర్తుచేసేవారు. హీ నోస్ ది ఫేడింగ్ ఎవే ఆఫ్ ది ఫేమ్. హి యాక్సెప్టెడ్ ఇట్ విత్ డిగ్నిటీ. ♦ సినిమా రంగంలో ఆయనకు మంచి స్నేహితులు లేరా? లేకేం! మద్రాసులో ఉన్న రోజుల నుంచి శరత్‌బాబు, చలపతిరావు, శారద లాంటివారందరూ ఫ్యామిలీ మెంబర్సే. అల్లు అరవింద్, చిరంజీవి, కోట శ్రీనివాసరావు గారు లాంటి చాలామంది సన్నిహితులు. గిరిబాబు గారైతే వెరీక్లోజ్. అందరితో ఫోన్లో టచ్‌లో ఉండేవాళ్ళు. ♦కానీ, ఆయన ఊళ్ళకు, విదేశాలకు వెళ్ళడం తక్కువే కదూ! అవును. తెలుగు సంఘాల కార్యక్రమాలకు అమెరికా రమ్మనమని శరత్‌బాబు లాంటివాళ్ళు అడిగేవారు. కానీ, నాన్న గారు ఆసక్తి చూపించేవారు కాదు. పైగా, విమాన ప్రయాణమంటే మహా భయం. చివరికి బస్ జర్నీ కూడా! ఆల్వేస్ ట్రైన్ జర్నీనే! 1970ల చివరలో ‘లవ్ ఇన్ సింగ పూర్’లో చేస్తున్నప్పుడు తప్పనిసరై, విమానంలో వెళ్ళారని నాన్న గారి బెస్ట్ ఫ్రెండ్ నందా అంకుల్ చెబుతుంటారు. ఒకసారి మద్రాసులో ఉండగా నెల్లూరులో సన్మానానికి వెళ్ళాలంటే రైలు మిస్సయిందట. బలవంతాన బస్సులో పంపిస్తే, ‘క్షేమంగా చేరగానే ఫోన్ చేస్తా’ అన్నారట! ♦చనిపోవడానికి ముందు ఇటీవల ఆయన ఎటూ వెళ్ళలేదా? తాత, నాయనమ్మలకు అయిదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. నాన్న గారే అందరిలోకీ పెద్ద. మా నాయనమ్మ జానకీదేవి రిటైర్డ్ స్కూల్టీచరైన బాబాయ్ దగ్గరుంటుంది. చనిపోవడానికి నెలన్నర ముందు నాన్న గారు కర్నూలు వెళ్ళి, కన్నతల్లిని చూసొచ్చారు. ఆమె 88 ఏళ్ళ వృద్ధురాలు. మనం చెప్పేది విని అర్థం చేసుకొనే స్థితిలో లేదు. తట్టుకో లేదని నాన్న పోయినట్లు ఇప్పటికీ చెప్పకుండా దాచాం. ♦ఛాన్సుల్లేక కుంగిపోయినా, అది మీ దగ్గర దాచారేమో? లేదండీ! ఆ మధ్య ‘గోపాల గోపాల’లో నటించారు. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలు’లోనో, మరేదోనో టీవీ సీరి యల్లోనో కూడా నటించారట. అవకాశాలు లేవని ఆయన అనడం, అనుకోవడం మేము వినలేదు. పూజగూడు దగ్గర ‘డెస్టినీ’ అని రాసి ఉరిపోసుకున్నారే... ‘తలరాత’ అనే అర్థంలో ‘డెస్టినీ’ రాశారేమో! ♦ పనిమనిషి మీనాక్షికి డిపాజిట్లు ఇమ్మని రాయడం గురించి? మీనాక్షి నమ్మకంగా, సిన్సియర్‌గా పనిచేసిన ఆవిడ. దగ్గరలోనే ఆసుపత్రిలో ఆయమ్మగా పనిచేసేది. 2006 నుంచి ఇంట్లో అమ్మకు సేవలు చేసింది. అమ్మ పోయాక, నాన్న గారి బాగోగులు చూసింది. భార్యనూ, తననూ తల్లిలా చూసుకున్న ఆమెకు పోయే ముందు ఏదైనా చేయాలని నాన్న గారు అనుకోవడం తప్పా? ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తోందని తెలిసి, ఆమెకు కూడా వీలుంటే ఇవ్వమని మంత్రికి ఫోన్ చేశారు. 70వ ఏట ఉన్న వ్యక్తి చనిపోయే ముందు పెద్ద మనసుతో తోటివారి గురించి ఆలోచిస్తే, దాన్నీ కొందరు అనుమా నించి, తప్పుపడితే ఎలా? మనం ఏ సమాజంలో ఉన్నాం! ♦భార్య పోయాక ఆయన డిప్రెషన్లో జారిపోయారంటారా? కావచ్చు. ఎక్కడో ఆయనకు ఇతరులతో పోలికొచ్చిం దేమో! ఒంటరితనం, డిప్రెషనొచ్చాయేమో! కానీ, తను స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. ఆయన సంతోషమే మా సంతోషం! అందుకే, ఆయన మానాన ఉండనిచ్చాం. (బాధగా...) చివరకు ‘ఆయన్ని అనాథను చేసేశారు’ అన్న చెడ్డపేరే మిగిలింది. పేపర్లలో, టీవీల్లో ఎవరికి తోచినట్లు వాళ్ళు రాశారు, చెప్పారు. చివరకు అందరికీ సంజాయి షీలు చెప్పుకుంటున్నాం. ఆయన జనం మనిషి కాబట్టి, మాకు ఇది తప్పదు. ఉయ్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లనేషన్! - రెంటాల జయదేవ -
మెప్పించే నటుడు
-
నటుడు రంగనాథ్‌కు ప్రముఖులు నివాళి
-
రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు
-
రంగనాథ్ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి
-
'రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు'
హైదరాబాద్: సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించలేదంటూ ఆయన బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రశాంతంగా ఉండాలని రంగనాథ్ ఒంటరిగా ఉండేవారని చెప్పారు. రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన సంగతి తెలిసిందే. రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం భార్య మరణించాక ఒంటరిగా ఉంటున్న రంగనాథ్.. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రంగనాథ్ భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పోస్టుమార్టం పూర్తియినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బన్సీలాల్ పేటలో రంగనాథ్‌కు అంత్యక్రియలు జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
టాటా.. వీడుకోలు..
రంగనాథ్ ఆత్మహత్యతో అభిమానుల ఆవేదన ఆయన సినీ ప్రస్థానానికి రాజమండ్రిలోనే తొలి అడుగు రాజమండ్రి : ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య వార్త తెలిసి రాజమండ్రిలోని ఆయన అభిమానులు తీరని ఆవేదనకు గురయ్యారు. మంచి నటుడిని కోల్పోయామని అన్నారు. ఆయన హఠాన్మరణం వెండితెరకు తీరని లోటని గాయకుడు, రంగస్థల, సినీనటుడు జిత్‌మోహన్ మిత్రా పేర్కొన్నారు. కళలకు కాణాచి అయిన రాజమండ్రియే రంగనాథ్ సినీ ప్రస్థానానికి తొలిమెట్టు అయింది. రాజమండ్రి రైల్వే స్టేషనులో రంగనాథ్ టీటీఈగా పని చేశారు. ‘‘ఆయనను బాపు, రమణలకు మా అన్న శ్రీపాద పట్టాభి పరిచయం చేశారు. బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేనిపై చిత్రీకరించిన ‘టాటా.. వీడుకోలు’ పాటలో కనిపించే ఆర్కెస్ట్రా సభ్యుల్లో రంగనాథ్ ఒకరు. ఆ తరువాత రాజమండ్రి నిర్మాతలు నిర్మించిన ‘చందన’ సినిమాలో ఆయన హీరోగా నటించారు. సినీరంగంలో అడుగు పెట్టాక కూడా ఆయన ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేయలేదు. సినీరంగంలో స్థిరమైన స్థానం లభించాకే ఉద్యోగాన్ని వదులుకున్నారు’’ అని జిత్ గుర్తు చేసుకున్నారు. ‘‘సెక్రటరీ, ఇంటింటి రామాయణం వంటి సినిమాలు రంగనాథ్‌కు మంచిపేరు తీసుకువచ్చాయి. రంగనాథ్ నటుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కొన్ని నాటకాలు కూడా రాశారు. బాపు, రమణల భాగవతంలో ఆయన కంసుడిగా నటించారు. ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉంది. తరచూ మా ఇంటికి వచ్చేవారు. రెండు సంవత్సరాలుగా నటీనటులు ఒక్కొక్కరూ వెళ్లిపోవడం అత్యంత బాధాకరం. రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త మరీ ఆవేదన కలిగిస్తోంది’’ అని జిత్ అన్నారు. -
నటుడు రంగనాథ్ ఆత్మహత్య
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం హైదరాబాద్: కాసేపట్లో ఆత్మీయుల మధ్య సన్మానం.. వేదిక అందంగా ముస్తాబైంది.. అందరూ వచ్చారు.. అంతా ‘ఆయన’ కోసమే ఎదురుచూస్తున్నారు.. ఇంతలో పిడుగులాంటి వార్త! సన్మానానికి రావాల్సిన ఆయన శాశ్వత లోకాలకు వెళ్లిపోయారు! అభిమానులు, ఆత్మీయులను వదిలి ఉరితాడుకు వేలాడారు. ప్రముఖ సినీ నటుడు రంగనాథ్(66) శనివారం హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడు, ‘నేటి నిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు ‘గుడ్ బై సార్..’ అంటూ తన మొబైల్ నుంచి చివరిసారిగా ఎస్సెమ్మెస్ పంపారు. ఉరివేసుకున్న గదిలో గోడలపై... ‘నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్’ అని రాశారు. ఏం జరిగింది? సాయంత్రం 4 గంటల సమయంలో మల్కాజిగిరిలోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రంగనాథ్ వెళ్లాల్సి ఉంది. ఆయనను కారులో తీసుకెళ్లేందుకు సభ నిర్వాహకులు ఇంటికి వచ్చారు. తలుపు తట్టినా ఎంతకీ తెరవకపోవడంతో సమీపంలో నివసించే పెద్ద కుమార్తె నీరజకు కబురు చేశారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దించి వెంటనే నర్మదా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రంగనాథ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలో సబర్మతి నగర్లో ఉన్న రంగనాథ్ ఐదేళ్ల క్రితమే గాంధీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 2009లో భార్య చైతన్య మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నారు. పని మనిషి మీనాక్షి రంగనాథ్‌కు వంట చేసి పెడుతోంది. పెద్ద కూతురు నీరజ సమీపంలోని విజయబ్యాంక్ దగ్గర నివసిస్తున్నారు. రెండో కుమార్తె శైలజ, కుమారుడు నాగు బెంగళూరులో నివసిస్తున్నారు. పోస్టుమార్టం కోసం భౌతికకాయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంతాప సభగా మారిన సన్మాన సభ మల్కాజిగిరి గౌతంనగర్‌లోని గౌతమి మహిళా మండలి ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రంగనాథ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అతిథిని పిలవడానికి నిర్వాహకులు రంగనాథ్ ఇంటికి వెళ్లే సరికి ఘోరం జరిగిపోయింది. చివరికి ఆయనను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సభను సంతాప సభగా మార్చి నివాళులు అర్పించారు. ఆయనది అసమాన ప్రతిభ: చంద్రబాబు రంగనాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కథా నాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో అసమాన నటనా ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. రంగనాథ్ కుటుంబీకులకు సానుభూతిని తెలిపారు. జగన్ సంతాపం రంగనాథ్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భార్యకు గుండెలో గుడి కట్టి.. రంగనాథ్‌కు భార్య చైతన్య అంటే అమితమైన ప్రేమ. దేవతలా పూజించేవారు. ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి ఫోటోల పక్కన భార్య ఫోటోను పెట్టుకున్నారు. ఈ దేవుడి ఫోటోలపై ‘డెస్టినీ’ (విధి) అని రాసి ఉంది. భార్యకు పక్షవాతం వచ్చినప్పుడు ఆమెకు సేవలు చేశారు. రంగనాథ్ నిత్యం.. ‘కాల్ ఫర్ గాడ్..’ అనే వారని తెలిసింది. భార్య మరణం తర్వాత రంగనాథ్ ఒంటరివారయ్యారు. ఎప్పుడూ భార్య గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండేవారని తెలిసింది. దానికి తోడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల వల్లే రంగనాథ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. టీసీ నుంచి సినిమా రంగంలోకి.. 1949లో చెన్నైలో జన్మించిన రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్(టీసీ)గా పనిచేస్తూ సినిమాపై ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం ‘పంతులమ్మ’ చిత్రం. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకుపైగా నటించారు. పలు టీవీ సీరియళ్లల్లోనూ కనిపించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రంగనాథ్ నటించిన కొన్ని చిత్రాలు... ♦ అందమే ఆనందం ♦ ఇంటింటి రామాయణం ♦ మావూరి దేవత ♦ వేట ♦ త్రినేత్రుడు ♦ రుద్రనేత్ర ♦ కొదమసింహం ♦ కొండవీటి దొంగ ♦ తాయారమ్మ బంగారయ్యా ♦ విజేత ♦ రామచిలుక ♦ జమీందారుగారి అమ్మాయి ♦ సెక్రటరీ ♦ గృహప్రవేశం ♦ ఖైదీ ♦ దొంగమొగుడు ♦ చిరంజీవీ ♦ అమెరికా అమ్మాయి ♦ లవ్ ఇన్ సింగపూర్ ♦ ప్రేమంటే ఇదేరా ♦ దేవతలారా దీవించండి ♦ శ్రీరామదాసు ♦ -
ఆ కల నెరవేరలేదు : రంగనాథ్
(2014లో రంగనాథ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుంచి... కొంత భాగం) రంగనాథ్ జననం :1949 మరణం :19-12-2015 సినిమాల్లోకి రాకముందు మీరు రైల్వే ఉద్యోగి. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేసి వచ్చానని ఎప్పుడైనా ఫీలయ్యారా? నేనసలు రిజైన్ చేయలేదు. ‘రిజైన్ చేస్తే మళ్లీ నిన్ను ఉద్యోగంలో తీసుకోరు’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో రిజైన్ చేయకుండానే సినిమాలు చేస్తూ వచ్చా. అయితే ఆఫీస్ నుంచి లెటర్లు వస్తుండేవి. చివరకు ‘నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయకూడదు’ అని ఓ ఉత్తరం వచ్చింది. అప్పుడు ఉద్యోగానికి మంగళం పలికాను. నాకంత ధైర్యం రావడానికి కారణం... అప్పటికే నాకు నాలుగైదు హిట్లు వచ్చేశాయి. మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు? మూడొందలకు పైచిలుకే. అందులో 60 సినిమాల్లో హీరోగా చేశాను. ఒకప్పుడు మీరు రొమాంటిక్ హీరో కదా. అప్పట్లో ఏమైనా ప్రపోజల్స్ వచ్చేవా? ఆ ఛాన్స్ లేదు. నాకు అప్పటికే పెళ్లయిపోయి, పిల్లలు కూడా పుట్టేశారు. అలా కాకపోతే మీరన్నట్లు ప్రపోజల్స్ వచ్చేవేమో! క్యారెక్టర్ ఆర్టిస్టుగా విరివిగా సినిమాలు చేస్తునప్పుడు ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది. షూటింగ్ పని మీద మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓ గుళ్లో షూటింగ్. పేకప్ చెప్పేశారు. గబగబా కారెక్కి వెళ్లబోతున్నాను. అంతలో ‘రంగనాథ్గారూ’ అనే పిలుపు వినబడింది. ఓ మధ్యవయస్కురాలు పరుగు లాంటి నడకతో వచ్చింది. ‘ఎన్నాళ్లకు చూశానండీ’ అని ఉద్వేగానికి లోనైంది. ఆమె కంటి నిండా నీరు. ఆమె పక్కనే చిన్న పాప ఉంది. ‘అమ్మమ్మా! వెళ్దాం పదా’ అంటోంది. అంటే అప్పటికే ఆమె అమ్మమ్మ అయిపోయిందన్నమాట. నేను హీరోగా చేస్తున్న రోజుల్లో ఆమె నా అభిమాని అని అర్థం చేసుకున్నా. ‘ఆటోగ్రాఫ్’ అంది. పెన్ తీసి, ‘కాగితం ఏది’ అన్నాను. ‘నా చేతి మీద పెట్టండి’ అంది. ఇప్పటికీ నన్ను ఇంతలా అభిమానించేవారున్నారా అని నాకు ఆశ్చర్యమేసింది. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది. అసలు మీలో సాహిత్యాభిమానం ఎలా మొదలైంది? ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే రోజుల్లో... మా తెలుగు మాస్టారు శబ్దాలంకారంలో పోతన రాసిన ‘అడిగెదనని కడువడిజను’ పద్యం చెబుతు న్నారు. ఇదేదో బాగుందే అనిపించింది. వెంటనే అదే పంథాలో ‘అత్తగారి పెత్తనంబు... నెత్తిమీద నొత్తుచుండ, తత్తరిల్లి బిత్తరిల్లి, చెంతనున్న కత్తినెత్తి.. నెత్తిమీద మొత్త చూచె.. కొత్తనైన కొడలమ్మి’ అని రాసిచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. నాలో అంతర్లీనంగా తెలీని ప్రతిభ ఏదో దాగుందని అప్పుడే అర్థమైంది. తర్వాత గేయాలు రాశాను, కథలు రాశాను. సినిమా ఇండస్రీ ్టకొచ్చాక ‘రత్తాలు రాంబాబు’ షూటింగ్‌కి బెంగళూరు వెళ్లా. అక్కడ నుంచి నటి జయంతి గారి మేకప్‌మేన్ రాజగోపాల్గారితో పరిచయమేర్పడింది. ఇద్దరం కారులో వెళ్తుంటే శ్మశానంపై రాసిన ఓ హిందీ పాట పెట్టుకొని ఇన్వాల్వ్ అయిపోయి మరీ వింటున్నాడాయన. ‘ఏంటని’ అడిగాను. సాహిత్యంలోని ఆ సొగసు హిందీ పాటల్లోనే ఉంటుందని, మన పాటలు ఎందుకూ పనికిరావని అన్నాడు ఉద్వేగంతో. తెలుగు సాహిత్యంలో సొగసు ఉండదని అనగానే... నాకు కోపం నషాళానికి అంటింది. ఇంటికి వెళ్లగానే అదే శ్మశానంపై ‘పిలుస్తోంది.. పిలుస్తోంది, వల్లకాడు పిలుస్తోంది’ అంటూ ఎనిమిది పేజీల కవిత రాశాను. తీసుకెళ్లి అతనికి వినిపించాను. తెలుగు సాహిత్యాన్ని కించపరచొద్దని గట్టిగా చెప్పాను. తను కూడా తప్పు ఒప్పుకున్నాడు. మళ్లీ ఆయనే ప్రోత్సహించడంతో మరో రెండు పుస్తకాలు రాశాను. నేను రాసిన పుస్తకాలు బయటకు రావడానికి కారణం మాత్రం హీరో చిరంజీవే. పుస్తకాలు తీసుకురమ్మని విపరీతంగా బలవంతం చేశాడు. దాంతో నాలుగు పుస్తకాలు విడుదల చేశాను. నా స్క్రిప్ట్‌తో, శివాజీరాజా హీరోగా డెరైక్ట్ చేసిన ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ చిత్రంలో 2 పాటలు కూడా రాశా. మీ సీనియర్స్‌లో మీకు ఎవరంటే ఇష్టం? నేను అక్కినేని అభిమానిని. ఆయనతో పాటు ఎన్టీయార్ ఎలానూ ఉంటారు. వారిద్దరూ తెలుగు సినిమాకు నరనారాయణులు. చిన్నప్పుడు యాక్షన్ సినిమాలు బాగా చూసేవాణ్ణి. అప్పుడు ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో. కళాశాలకు వెళ్లాక... ప్రేమకథల్ని ఇష్టపడటం మొదలుపెట్టా. అలా.. ఏఎన్నార్ ఫ్యాన్‌గా మారాను. నాటకాలు వేస్తున్న రోజుల్లో... స్టేజ్ మీద అచ్చం అక్కినేనిగారిలా నటించేవాణ్ణి. హీరో అయ్యాక కూడా కొన్నాళ్లు ఆ ప్రభావం పోలేదు. తర్వాత్తర్వాత నాకంటూ ఓ స్టయిల్ అలవరుచుకున్నాను. ఆర్టిస్టుగా డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా? రావణాసురుడి పాత్ర చేయాలని ఎదురు చూశా. కానీ ఆ కల నెరవేరలేదు. ఇప్పుడొచ్చినా చేయలేని పరిస్థితి. ఎందుకంటే దానికి తగ్గ బాడీ లేదు. -
రంగనాథ్ ‘చివరి సందేశం’
ముషీరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందారు. చనిపోయే ముందు స్నేహితుడు ‘నేటినిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు 3.36గంటలకు ‘గుడ్ బై సార్’ అంటూ తన మొబైల్ నుంచి మెస్సేజ్ పెట్టారు. దీంతోపాటు తాను ఉరివేసుకున్న రూమ్ గోడలపై పెన్నుతో ‘నా బీరువాలో పనిమనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు అప్పగించండి. 'డోంట్ ట్రబుల్ హర్' అంటూ రాశారు. శనివారం మధ్యాహ్నాం 4గంటల సమయంలో మల్కాజ్‌గిరిలోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రంగనాధ్‌ను తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు కారు తీసుకుని వచ్చారు. వారు ఆయన కోసం వెతుకుతూ ఇంటికి చేరారు. పక్కన ఉన్న మహిళను ఇది రంగనాధ్ గారి ఇళ్లేనా అంటూ అడిగగా ఇదే అని చెప్పడంతో తలుపుతట్టారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో పక్కంటి మహిళ, సమీపంలో నివసించే పెద్ద కుమార్తె నీరజ ఇంటికి వెళ్లి వారిని తీసుకుని వచ్చింది. అందరూ కలసి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రంగనాధ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే సమీపంలోని నర్మదా ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతిచెందినట్లు వెల్లడించారు. గతంలో సబర్మతి నగర్లో ఉన్న రంగనాధ్ ఐదేళ్ల క్రితం సమీపంలోని 1-1-721 ఇంటిలోకి కిరాయికి దిగారు. 2009లో భార్య చైతన్య మృతిచెందడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. పనిమనిషి మీనాక్షి గత ఐదు సంవత్సరాలుగా రంగనాధ్‌కు సేవలు అందిస్తూ వంట చేసి పెడుతుంది. పెద్ద కూతురు నీరజ సమీపంలోని విజయబ్యాంక్ దగ్గర నివసిస్తుండగా, రెండవ కుమార్తె శైలజ బెంగళూరులో, కుమారుడు నాగు బెంగళూరులో నివసిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయన్ని గాంధీ మార్చురికీ తరలించారు. సంఘటనా స్థలంకు చిక్కడపల్లి ఏసిపి నర్సయ్య, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్‌లు వచ్చి పరిశీలించారు. భార్యకు గుడి కట్టిన రంగనాథ్ : రంగనాథ్‌కు భార్య చైతన్య అంటే అమితమైన ప్రేమ. దేవతలా పూజించే వాడు. అందుకే ఇంట్లో తాను ఏర్పాటు చేసుకున్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలు పక్కన భార్య చైతన్య ఫోటోను పెట్టుకున్నారు. ఈ దేవుడి ఫోటోలపై డెస్టినీ అని రాసి ఉంది. అంటే భార్య దగ్గరకు చేరుకుంటానని అనేవాడు. అలాగే పెరలాసిస్ వచ్చినప్పుడు ఆమెకు స్వయంగా ఎనలేని సేవలు చేశాడు. నిత్యం కాల్ ఫర్ గాడ్ అంటూ రంగనాథ్ అనే వారని తెలిసింది. 2009లో భార్య మరణించిన తర్వాత ఒంటరి తనాన్ని భరించలేకపోయాడు. ఎప్పుడు భార్య గురించి ఆలోచనే ఉంటూ పరాధ్యానంలో ఉండేవాడు. దానికి తోడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే రంగనాథ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సినీ నేపథ్యం ఇలా... 1949లో చెన్నైలో జన్మించిన రంగనాధ్ పూర్తి పేరు ‘తిరుమల సుందర శ్రీరంగనాధ్’. రైల్వేశాఖలో టిక్కెట్ కలెక్టర్(టిసీ)గా పనిచేస్తూ సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. బుద్థిమంతుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ అనే చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం ‘పంతులమ్మ’ చిత్రం. సుమారు 300చిత్రాలకు పైగా నటించారు. పలు టివీ సీరియళ్లల్లోనూ ఆయన నటించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రను, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. రంగానాథ్ నటించిన సినిమాలు.. రంగనాథ్ నటించిన చిత్రాలు ‘అందమే ఆనందం, ఇంటింటి రామాయణం, మా ఊరి దేవత, వేట, త్రినేత్రుడు, రుద్రనేత్ర, కొదమ సింహం, కొండవీటి దొంగ, తాయారమ్మ బంగారయ్య, విజేత, రామచిలక, జమీందారి గారి అమ్మాయి, సెక్రటరీ, గృహ ప్రవేశం, ఖైదీ, దొంగ మొగుడు, చిరంజీవి, అమెరికా అమ్మాయి, లవ్ ఇన్ సింగపూర్, ప్రేమంటే ఇదేరా, దేవతలారా దీవించండి, శ్రీరామదాసు' తదితర సినిమాలు ఉన్నాయి. -
ఆటుపోట్ల సినీ ప్రయాణం
మహిళలు మెచ్చిన అలనాటి కథానాయకుడు ... ఆరడుగుల ఎత్తు, అందమైన ముఖవర్ఛస్సు.. గంభీరమైన గొంతు.. ఒక నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న అరుదైన నటుడు రంగనాథ్. ఒకప్పుడు స్టార్ ఇమేజ్‌కు చేరువైన హీరో అయినా అదే సమయంలో విలన్‌గాను నటించారు. తరువాత వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ప్రస్తుతం అడపదడపా మాత్రమే సినిమాలు, సీరియల్స్ చేస్తున్న ఈ అలనాటి మేటినటుడి ఆకస్మిక మరణం తెలుగు తెరకు తీరని లోటు. సీనియర్ నటులు రంగనాథ్ 1949 జూలైలో మద్రాసులో జన్మించారు. కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్న వారు కాకపోవటంతో రంగనాధ్ బాల్యం అంతా సాదాసీదాగానే గడిచింది. అయితే బాల్యంలో తాతగారి ఇంట్లో పెరగటం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారింట్లో అందరూ గాయకులు కావటంతో రంగనాథ్ కూడా ఏదో ఒక కళ రంగంలో ప్రవేశించాలనుకున్నారు. అదే బాటలో చిన్నతనంలోనే నాటకాల వైపు ఆకర్షితులయ్యారు. అలా మొదలైన ఆయన ప్రయాణం వెండితెర వరకు సాగింది. రంగనాధ్ కోరికకు తల్లి ప్రొత్సాహం తోడవటంతో నటుడు కావాలన్న ఆయన కోరిక మరింత బలపడింది. అయితే అదే సమయంలో కుటుంబ బాధ్యతులు మీద పడటంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బిఎ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే వెంటనే వివాహం. తరువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్నా నటుడవ్వాలన్న కోరిక మాత్రం చచ్చిపోలేదు. తను నాటకాలు వేసే నాటకరంగం వారి ద్వారా 1969లో చిన్న అవకాశం వచ్చింది. అయితే పాత్రకు గుర్తింపు రాలేదు. అదే సమయంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి. దీంతో బాపుగారి సలహాతో చందన సినిమాకే అంగీకరించారు. అలా వెండితెర మీద హీరోగా రంగం ప్రవేశం చేశారు రంగనాధ్. పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటం ఆయనను మహిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పులు కారణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వచ్చాయి. దీంతో మరో మార్గం లేక విలన్‌గా మారారు. 'గువ్వల జంట' సినిమాతో తొలి సారిగా ప్రతినాయక పాత్రలో అలరించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాధ్. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్ తో పాటు, రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్ లోనూ కీలక పాత్రలో నటించారు. అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవటంతో తరువాత దర్శకత్వనికి దూరమయ్యారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించటం తెలుగు సినీ కళామతల్లికి తీరనిలోటు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరించిన రంగనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. -
వృద్ధాశ్రమంలో సినీ నటుడు రంగనాథ్ జన్మదిన వేడుక
రసూల్‌పురా (హైదరాబాద్) : టాలీవుడ్ ప్రముఖ నటుడు రంగనాథ్ తన 70వ జన్మదిన వేడుకలను శుక్రవారం పాతబోయిన్‌పల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కుటుంబసభ్యుల మధ్య కన్నా ఆశ్రమవాసుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చేటువంటి సినిమాలను దర్శక, నిర్మాతలు ప్రోత్సహిస్తున్న కారణంగా నేడు సినిమాలకు మహిళా ప్రేక్షకులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కుర్రకారు కోసమే సినిమాలు తీస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రంగనాధ్ స్నేహితులు శేషు,ఆశ్రమ నిర్వాహకులు కరీమున్నీసా, అయేషా, సాయి పాల్గొన్నారు.