ముంబై: స్టార్ డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో... ముంబై మెజీషియన్స్‌తో బుధవారం జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ 5-3 గోల్స్ తేడాతో గెలిచింది. కెప్టెన్ రఘునాథ్ ఆట 28వ, 41వ, 56వ నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచి హ్యాట్రిక్ సాధించాడు.
ఆట 12వ నిమిషంలో గుర్జిందర్ సింగ్... 18వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఒక్కో గోల్ చేయడంతో ఒకదశలో ముంబై 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రఘునాథ్ విజృంభణతో విజార్డ్స్ తేరుకొని స్కోరును సమం చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ శంకర్, ఉతప్ప ఒక్కో గోల్ చేయడంతో విజార్డ్స్ 5-2తో ముందంజ వేసింది. 57వ నిమిషంలో సర్వన్‌జిత్ సింగ్ గోల్‌తో ముంబై ఖాతాలో మూడో గోల్ చేరింది. ఆ తర్వాత విజార్డ్స్ జట్టు ప్రత్యర్థిని మరో గోల్ చేయనివ్వలేదు. వరుసగా రెండో విజయంతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
రఘునాథ్ హ్యాట్రిక్
Published Thu, Jan 30 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement