హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా రాంచీ రేస్, దబాంగ్ ముంబై జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది.
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా రాంచీ రేస్, దబాంగ్ ముంబై జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. రాంచీ తరఫున డానియల్ బీల్, కెప్టెన్ యాష్లే జాక్సన్ ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టు నుంచి గ్లెన్ టర్నర్, సంతా సింగ్ ఒక్కో గోల్ సాధించారు. రెండు జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. ప్రస్తుతం తొమ్మిది పాయింట్లతో రాంచీ జట్టు రెండో స్థానంలో, ఐదు పాయింట్లతో ముంబై జట్టు నాలుగో స్థానంలో ఉన్నాయి.