న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఐదు అత్యుత్తమ పనితీరు చూపించిన నివాసిత ప్రాపర్టీ మార్కెట్లలో ముంబై, బెంగళూరు చోటు సంపాదించాయి. వార్షికంగా నివాస ధరల వృద్ధి ఈ రెండు పట్టణాల్లోనూ 7 శాతం మేర ఉంది. ‘ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్’ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో వార్షిక ధరల వృద్ధి పరంగా టాప్-5లో బెంగళూరు, ముంబై ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం 23 పట్టణాలకు గాను 14 పట్టణాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి. ఈ జాబితాలో వార్షికంగా 24 శాతం ధరల వృద్ధితో మెట్రో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. 9.3 శాతం ధరల వృద్ధితో సింగపూర్, 9 శాతం వృద్ధితో టోక్యో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 6.8 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్–10లో చోటు సంపాదించుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు మోస్తరుగా ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఇళ్ల ధరలు 3–5 శాతం మధ్య, ముంబై, ఢిల్లీలో 3–4 శాతం మధ్య పెరగొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment