residences
-
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ మంత్రి నివాసాల్లో 23 గంటలపాటు ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీ సామాజిక, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ ఆనంద్ నివాసాలు, కార్యాలయాల్లో 23 గంటలపాటు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం ముగిశాయి. మంత్రిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఆయన అంతర్జాతీయ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు, తప్పుడు పత్రాలతో రూ.7 కోట్లకుపైగా పన్ను ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) చార్జిïÙట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు ఈడీ పరిధిలోకి వచి్చంది. తనను వేధించడమే పనిగా పెట్టుకుందని ఈడీపై మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మండిపడ్డారు. -
ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష..
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు. అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు. ఆరోగ్య పథకంపై చర్చ.. రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.ఈపథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు.అంతేగాక ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు. ఇదీ చదవండి: ‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’ -
ఆ ఇళ్లపై ఇదేం పిచ్చి.. ఎన్ని కోట్లయినా కొనేస్తున్నారు!
విలాసవంతమైన ఇళ్లపై సంపన్నులకు మోజు తగ్గడం లేదు. ధర ఎన్ని కోట్లయినా కొనడానికి వెనకాడటం లేదు. అందుకే అత్యంత విలాసవంతమైన రెసిడెన్సియల్ ప్రాజెక్ట్‌లను కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి ఏర్పాటు చేస్తున్నాయి. ఇవీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి! గత నెలలో డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో 72 గంటల్లో రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంగతి మరవకముందే గోద్రెజ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో రూ.24,575 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే. గోద్రేజ్ సంస్థ ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో కొనుగోలుదారులను ఆహ్వానించి వారికి ప్రాజెక్ట్‌కు సంబంధించిన త్రీడీ మోడల్‌ను, వీడియోలను ప్రదర్శించింది. అందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూపించింది. వీటిలో వేడినీటి కొలను (హాట్ పూల్) వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 160 ఎంపిక చేసిన కస్టమర్లను ఈ ఫ్లాట్లను సందర్శించేందుకు ఆహ్వానించగా ఎనిమిది అంతస్తుల ప్రాజెక్ట్‌లో 46 ఫ్లాట్లలో 17 అమ్ముడుపోయాయి. తాము విలాసవంతమైన నివాసాలను మాత్రమే విక్రయించడం లేదని, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నామని గోద్రెజ్ సేల్స్ మేనేజర్ యువరాజ్ మంచందా పేర్కొన్నారు. తమ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లను మిలియనీర్లు, బిలియనీర్లు కొనుగోలు చేస్తారని చెప్పారు. కాగా గురుగ్రామ్‌లో గతనెల అమ్ముడైన ఫ్లాట్లకు సంబంధించిన పేపర్ వర్క్ ఇటీవలె పూర్తయింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ న్యూస్: ఇక మరింత ఫాస్ట్‌గా ఇంటర్నెట్! -
రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్: టాప్-5లో హైదరాబాద్ ఉందా?
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఐదు అత్యుత్తమ పనితీరు చూపించిన నివాసిత ప్రాపర్టీ మార్కెట్లలో ముంబై, బెంగళూరు చోటు సంపాదించాయి. వార్షికంగా నివాస ధరల వృద్ధి ఈ రెండు పట్టణాల్లోనూ 7 శాతం మేర ఉంది. ‘ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్’ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో వార్షిక ధరల వృద్ధి పరంగా టాప్-5లో బెంగళూరు, ముంబై ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం 23 పట్టణాలకు గాను 14 పట్టణాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి. ఈ జాబితాలో వార్షికంగా 24 శాతం ధరల వృద్ధితో మెట్రో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. 9.3 శాతం ధరల వృద్ధితో సింగపూర్, 9 శాతం వృద్ధితో టోక్యో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 6.8 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్–10లో చోటు సంపాదించుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు మోస్తరుగా ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఇళ్ల ధరలు 3–5 శాతం మధ్య, ముంబై, ఢిల్లీలో 3–4 శాతం మధ్య పెరగొచ్చని పేర్కొంది. (ఇదీ చదవండి: పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?) -
వినూత్న నిరసన: నడి రోడ్డుపై భారీ గుంత.. ఇది పార్టీ టైం..!
-
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
'పీఎం, సీఎం నివాసాలను పేల్చివేస్తాం'
న్యూఢిల్లీ: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కాల్ ఢిల్లీలో కలకలం సృష్టించింది. భద్రత బలగాలను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసాలలో బాంబులు పెట్టామని, పేల్చివేస్తామంటూ శనివారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఎన్ఐఏ అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోదీ అధికార నివాసం 7 బంగ్లాకు, సివిల్ లైన్స్‌లో ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి భద్రత బలగాలు, బాంబు డిస్పోజల్ బృందాలు చేరుకుని అణువణువూ గాలించాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సర్వీస్ ద్వారా బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టు గుర్తించారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ఇలాగే ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించాడు. -
లాలూ ఇంట ఛట్ సందడి