![Telangana Highcourt Summoned Hydra Commissioner](/styles/webp/s3/article_images/2024/09/27/higcourt-hydra-ranganath.jpg.webp?itok=oQ0CUOtW)
సాక్షి,హైదరాబాద్:కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్‌పూర్ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్27) హైకోర్టు విచారించింది.
తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.
ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment