రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల్లోని పలు విశేష అధికారాలు దాని పరిధిలోకి
20న సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీలో తుది నిర్ణయం
ఆ వెంటనే ఆర్డినెన్స్ జారీకి ఏర్పాట్లు.. శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)’కు చట్టబద్ధత కలి్పంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న కొన్ని విశేష అధికారాలను హైడ్రాకు కల్పించబోతోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
ఆ వెంటనే ఆర్డినెన్స్ రూపంలో అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి హైడ్రాకు చట్టబద్ధతను, విశేష అధికారాలను కలి్పంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో చెరువులు, నాలాల పరిరక్షణ కోసం రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల చట్టాల్లోని కీలకమైన అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడం, కూలి్చవేతలు నిర్వహించడం కోసం అవసరమైన అధికారాలు దానికి సమకూరనున్నాయి. శాసనసభ శీతాకాల సమావేశాల్లో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
వరద నష్టంపై కేబినెట్‌లో చర్చ..
ఇటీవలి భారీ వర్షాలు, వరదల నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లింపు, రోడ్లు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం నుంచి అత్యవసరంగా విపత్తుల సహాయ నిధిని పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనుంది.
కొత్తగా రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీపైనా దృష్టి
అభయహస్తం కార్యక్రమం కింద రేషన్‌కార్డుల కోసం వచి్చన దరఖాస్తులను పరిష్కరించి కొత్తకార్డుల జారీపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమరి్పంచాల్సి ఉంది.
గ్రేహౌండ్స్, టాస్‌్కఫోర్స్ తరహాలో హైడ్రా: రంగనాథ్
గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలోనే ‘హైడ్రా’పనిచేస్తుందని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం హైడ్రా బిల్లు తీసుకురానుందని ‘హైడ్రా’కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టబద్ధతకు విధివిధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైందని తెలిపారు. జూలై 19న ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్‌తో జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ వంటివెన్నో ఇలాగే ఏర్పాటయ్యాయన్నారు. త్వరలో రాబోయే ఆర్డినెన్స్‌తో వాల్టా, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలు హైడ్రాకు వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment