ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: లెహర్ సూపర్ సైక్లోన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని , జిల్లా, మండల అధికారులు కార్యస్థానాల్లో అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వర్షాలపై ముందస్తూ తీసుకోవాల్సిన అంశాలపై ఎస్పీ రంగనాధ్‌తో కలిసి మాట్లాడారు. వర్షాల వల్ల నష్టాలను కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు గ్రామ, మండల ,డివిజన్, జిల్లాస్థాయి అధికారులు ఆయా కార్యస్థానాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహలు సూచనలు చేయాలన్నారు.
తాగునీటి, ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ముందస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎలాంటి నష్టకలగకుండా ఉండేందుకు వరిని కోసేందుకు హార్వెస్టర్లను రప్పించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌తో పాటు మిగతా డివిజన్ కార్యాలయాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ ఈ నెల 28న లెహర్ సూపర్ సైక్లోను ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తొలుత లెహర్ సూపర్‌సైక్లోన్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వీడియోకాన్పిరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘లెహర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
Published Tue, Nov 26 2013 6:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement