k.surendra mohan
-
గ్యాస్‌కు ‘ఆధార్’ అనుసంధానించాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలోని గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానించేందుకు గ్యాస్ డీలర్లు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో డీఎస్వో గౌరీశంకర్‌తో కలిసి గ్యాస్ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 5,20,000 ఎల్పీజి కనెక్షన్లు ఉన్నాయన్నారు. వీటిలో 3,29,000 కనెక్షన్లకు (63.3 శాతం) ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. ఇందులో 2,25,000 కనెక్షన్లకు (43.7 శాతం) బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం ఉందన్నారు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేప్పుడు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసేప్పుడు వినియోగదారుల నుంచి ఆధార్ నంబర్ తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ నంబర్‌ను గ్యాస్ వినియోగదారులు సంబంధిత డీలర్లకు ఇవ్వకపోతే సదరు కనెక్షన్‌ను బోగస్‌గా పరిగణించనున్నట్టు చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారుల జాబితాను అక్టోబర్ 1వ తేదీన ఇవ్వాలని గ్యాస్ డీలర్లను ఆదేశించారు. ఆధార్ కార్డు లేని వారు తమ మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాల్లోగల శాశ్వత ఆధార్ సెంటర్లో నమోదు చేయించుకుని, అక్కడ ఇచ్చే ఈఐడీ నంబర్‌ను ఆధార్ సీడింగ్‌లో నమోదు చేయించుకోవాలని చెప్పారు. 5వ తేదీలోగా సర్వే డేటాతో ‘ఆధార్’ను అనుసంధానించాలి సమగ్ర కుటుంబ సర్వే డేటాతో ఆధార్ నంబర్‌ను ఈ నెల 5వ తేదీలోగా అనుసంధానించాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులను జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరుకుల సక్రమ పంపిణీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 24,65,731 రేషన్ కార్డుదారుల కుటుంబాల యూనిట్లు ఉన్నాయన్నారు. వీటిలో 2,57,499 యూనిట్లకు ఇంకా ఆధార్ అనుసంధానించాల్సుందన్నారు. సమగ్ర సర్వే డేటా ఈ నెల 5 తేదీలోగా పూర్తవుతుందన్నారు. ప్రసుత్తం అందుబాటులోగల ఆధార్ నంబర్లను సర్వే డేటాతో అనుసంధానించాలని ఆదేశించారు. రేషన్ కార్డుదారులందరికీ ఆధార్ అనుసంధానించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఇక నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు చేర్చాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన డీటీలు, డీలర్లు, వీఆర్వోలకు నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి చార్జ మెమో ఇస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎం సాంబశివరావు, డీఈవో రవీంధ్రనాథ్‌రెడ్డి, సివిల్ సప్లై డీడీలు పాల్గొన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి సహకారం
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ యంత్రాగం సంపూర్ణ సహకారం అందిస్తుందని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ చెప్పారు. జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక కార్యక్రమం (ఎక్స్పో-2014) శనివారం నగరంలోని స్వర్ణ భారతి కమ్మవారి కళ్యాణ మండపంలో జరిగింది. దీనిని కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికాభివృద్ధి (ఎంఎస్ఎంఈ) సంస్థ; ఖమ్మం వాణిజ్య సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని జేసీ సురేం ద్రమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు బ్యాం కర్లు సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ ఇచ్చేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ప్రయత్నిస్తామన్నారు. సత్తుపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫుడ్ పార్క్ కోసం కేటాయించే ప్రక్రియలోని అడ్డంకులను తొలగించామన్నారు. ప్రస్తుతమున్న నియమాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణ చాలా కష్టమని అన్నారు. మైదాన ప్రాం తాల్లో భూమి సేకరించవచ్చన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య దృష్ట్యా, సోలార్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అన్నారు. బొగ్గు నిక్షేపాలతో, గోదావరి జలాలతో ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. ఎంఎస్ఎంఈ సంస్థ సంచాలకుడు జిఆర్.అక్కాదాస్ మాట్లాడుతూ... జాతీ య నైపుణ్యం అభివృద్ధి కేంద్రాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి.శ్రీనివాసనాయక్ మాట్లాడు తూ.. అవగాహన లోపం, ఆర్థిక స్థితిగతుల కారణంగా జిల్లాలో పరిశ్రమల నెలకొల్పటంలో వెనుకబాటు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, గ్రానైట్ స్లాబ్ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి, జిల్లా చిన్నతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఎస్ఆర్ఎల్.ప్రసాద్, గ్రానైట్ టైల్స్ ఫ్యాక్టరీ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అధ్యక్షుడు ఎపికె.రెడ్డి, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏడీ కోటిరెడ్డి కూడా మాట్లాడారు. అనంతరం, ఎక్స్పోను జేసీ ప్రారంభించి తిలకించారు. -
‘లెహర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: లెహర్ సూపర్ సైక్లోన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని , జిల్లా, మండల అధికారులు కార్యస్థానాల్లో అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వర్షాలపై ముందస్తూ తీసుకోవాల్సిన అంశాలపై ఎస్పీ రంగనాధ్‌తో కలిసి మాట్లాడారు. వర్షాల వల్ల నష్టాలను కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు గ్రామ, మండల ,డివిజన్, జిల్లాస్థాయి అధికారులు ఆయా కార్యస్థానాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహలు సూచనలు చేయాలన్నారు. తాగునీటి, ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ముందస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎలాంటి నష్టకలగకుండా ఉండేందుకు వరిని కోసేందుకు హార్వెస్టర్లను రప్పించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌తో పాటు మిగతా డివిజన్ కార్యాలయాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ ఈ నెల 28న లెహర్ సూపర్ సైక్లోను ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తొలుత లెహర్ సూపర్సైక్లోన్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వీడియోకాన్పిరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.