సాక్షి, హైదరాబాద్: బడంగ్‌పేట్, అల్మాస్ గూడలో హైడ్రా చర్యలు చేపట్టింది. వెంకటేశ్వర కాలనీలో కబ్జాదారులకు హైడ్రా చెక్ పెట్టింది. పిల్లల ఆట పరికరాలు తొలగించి పార్కు స్థలం కబ్జా చేసిన కొందరు వ్యక్తులు.. కంటెనర్ల కోసం షెడ్లు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు పరిశీలించారు. జేసీబీలతో కంటైనర్ల షెడ్లను హైడ్రా తొలగించి.. పార్కు స్థలాన్ని కాలనీ వాసులకు హైడ్రా అధికారులు అప్పగించారు.
పార్కు ఆక్రమణ కాకుండా కాపాడారంటూ స్థానికులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. బాలాపూర్ పరిధిలోని అల్మాస్ గూడ వెంకటేశ్వరకాలనీ వాసులు..ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేశారు.
"బడంగ్ పెట్ మునిసిపాలిటీలో కబ్జాకు గురైన పార్కును కాపాడినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వెంకటేశ్వర కాలనీలో పాలాభిషేకం చేసిన స్థానికులు" #HYDRAA pic.twitter.com/zFtiLa14IK
— The Politician (@ThePolitician__) December 3, 2024
VIDEO CREDITS: THE POLITICIAN
కాగా, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్న రంగనాథ్.. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment