హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన | Ranganath Said That Hydra Police Station Is Coming Soon | Sakshi
Sakshi News home page

త్వరలో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌.. కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన

Published Sat, Nov 30 2024 9:24 PM | Last Updated on Sat, Nov 30 2024 9:25 PM

Ranganath Said That Hydra Police Station Is Coming Soon

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ రాబోతోందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడించారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో జాతీయ సదస్సులో రంగనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్నారు.

హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్న రంగనాథ్‌.. ఎక్కువగా ధనవంతులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు.

ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే వారే ఎక్కవగా ఉన్నారంటూ రంగనాథ్‌ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆక్రమణల్లో ఉన్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్‌ హెచ్చరించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement